లైంగిక ప్రేరణలు-9- జీవితమే సఫలము




  • జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడంలో లైంగిక ఆనందాలు ప్రధానాంశం. అందానికి ముగ్ధులు కావడం, ఇంద్రియ ప్రేరణంలో అనుభూతి, స్పర్షతో ఆనందం ప్రేమలో భాగాలే.
  • జీవితంలో సాధించడానికి కృషి అవసరమైతే, వెనువెంటనే విశ్రాంతి, సుఖానుభూతి, పారవశ్యత కూడా అవసరమే.
  • ఆకర్షణలకు లోనుగాకపోవడం అంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించకపోవడమే. జీవితంలో అత్యంత విలువైనది పోగొట్టుకున్నట్లే. కనుక లైంగిక ప్రేరణ జీవితంలో ప్రధానపాత్ర వహిస్తుంది.
  • ధర్మసంరక్షణలు, పాపాలకు వ్యతిరేకులు బయలుదేరి జీవితంలో లైంగిక ప్రేరణ ప్రధాన సమస్య అనీ, అది ఆపాలనీ ఉద్యమిస్తున్నారు. ఆనందాన్ని నిరోధించే వీరంతా లైంగిక ప్రేరణ, అనుభవాల్ని వ్యతిరేకించే వారంతా మానవజీవన విరోధులే.
  • లైంగికతకు భిన్న కోణాలున్నాయి. ప్రేమ అందులో అతికీలకమైంది. మన్నధ ప్రేరణలో కామంతోబాటు, లైంగిక పరాకాష్ఠ కూడా వుంది. సంభోగంతోబాటు, వివిధ దశలలో ప్రేమ వ్యక్తమౌతుంది. ముద్దు, స్పర్ష, కౌగిలింత యిత్యాదులన్నీ లైంగికతలో భాగాలే.
  • లైంగిక ప్రేరణ అనేక తీరులుగా వ్యక్తం కావచ్చు. సున్నితంగా సూక్ష్మంగా వ్యక్తమయ్యే లైంగిక లక్షణాలున్నాయి. లైంగికతకు ఆకర్షితులు కావడమంటే, రామణీయకతను అనుభవించి, ఆనందించడం కూడా. మనలోనూ యితరులలోనూ లైంగిక ఆనందాన్ని చూడటం ఒక మంచి లక్షణం. వాటన్నిటికీ దూరంగా, కళ్ళు మూసుకోవడం అంటే, సంపూర్ణ జీవనానికి కావాలని ఎడబాటు కల్పించుకోవడమే.

రచన అనువాదం

పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment