జీవితానందాల్ని పంచుకోవడం వెలలేని విలువ-10

జీవితమే సఫలము


  • ఒక వ్యక్తి మరోవ్యక్తితో భిన్నస్థాయిలలో సంబంధాలు పెంపొందించుకోవడానికి చూడొచ్చు. ఇందులో లైంగికత, ప్రేమ, వృత్తిలో కలవడం, పిల్లల్ని పెంచడం, కలసి బ్రతకడం, ఇంట్లో సంసార నివాసం, సహకరించి పనులు చేసుకోవడం వంటివి వున్నాయి.
  • ఏకాంత జీవనం గడుపుతూ, తమంతట తామే పనులు చేసుకునేవారున్నారు. ఇతరులతో సహజీవనం అంటే బందీలు కావడమే అనుకునే వారున్నారు. కలసి ప్రేమగా బ్రతుకుదామనుకునే వారికి అవకాశం యివ్వకపోతే కుంగిపోతారు.
  • జీవితాన్ని మరొకరితో పంచుకోవడం అంటే మానవసాధనలో ఒక మంచిస్థాయిని చేరుకోవడమే.
  • వ్యాపారంలో మునిగి తేలుతున్నప్పుడు అనుసరించే ధోరణి పక్కనబెట్టి, లైంగిక అనుభూతులు వ్యక్తి స్థాయిలో ఆనందంగా పంచుకుంటారు.
  • మరొకరితో జీవితానందాల్ని పంచుకోవడం వెలలేని విలువ. అది ఆప్యాయంగా అనుభవించి చూడాల్సిందే.

రచన అనువాదం
పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment