మంచి తల్లిదండ్రులు-12

జీవితమే సఫలము  • తమ పిల్లలకు సాధ్యమైనంత మేరకు చేస్తూ, వారు వ్యక్తులుగా పెంపొందడానికి తోడ్పడుట ఉత్తమ దంపతుల పని, పిల్లలు ఏది కాదలచుకున్నారో అది సాధించడానికి చేయూతనివ్వాలి. వారికి మార్గదర్శకత్వం, వారి పోషణకు తోడ్పాటు, వారి సంక్షేమానికి తగిన త్యాగం చేయడం తల్లిదండ్రుల పని. ఆ విధంగా పిల్లల్ని విశిష్ట వ్యక్తులు అయ్యేట్లు చూడాలి.
  • పిల్లలు పెరిగేటప్పుడు వారి పరిమితులు గుర్తించాలి. అసాధ్యమైనవి వారినుండి ఆశించకూడదు. వారిపట్ల ప్రేమను మాత్రం కొనసాగించాలి.
  • పిల్లలు శారీరకంగా, మానసికంగా పెంపొందడంలో తోడ్పడాలి. ఒక స్థాయిలో వారి మనకు దూరమై ప్రపంచంలో తమ భవిష్యత్తు నిర్ణయించుకుంటారు. అందుకు సిద్ధపడాలి.
  • వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే, ఆ వ్యక్తి స్వయంప్రతిభతో పెంపొందడాన్ని గౌరవించాలి. తల్లిదండ్రులు మితిమీరిన ఆంక్షలు పెట్టకూడదు. పిల్లల నుండి ఆశించకూడదు. అలాంటి సంబంధాలు చెడిపోతాయి.
  • పిల్లల్లో సృజన ప్రోత్సహించాలి. వ్యక్తిత్వాన్ని పెంపొందించాలి. స్వతంత్రంగా నిలబడేటట్లు ప్రోత్సహించాలి. స్వేచ్ఛగా వుండేట్లు చూడాలి. ఇతరుల పట్ల పిల్లల బాధ్యతల్ని కూడా పెంపొందించాలి.
  • తమ పిల్లలు చిత్తశుద్ధితో గౌరప్రదంగా వుండాలని ప్రేమించే తల్లిదండ్రులు కోరుకుంటారు. ప్రేమ యిచ్చిపుచ్చుకోవడం పెంపొందించకపోతే, విఫలమైనట్లే.
  • పిల్లల్ని ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించడంలోనే విశేషం వుంటుంది. ప్రేమ, ఆప్యాయతలు పరస్పరం వుండాలనే భావన వలన వారిలో నైతికత విప్పారుతుంది.

రచన అనువాదం

పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment