విశ్వమానవ వాదం-14

జీవితమే సఫలము


 • వివేచనా పంథాను పాటించి రాజకీయ, సామాజిక సమస్యలు పరిష్కరించడం మంచిది. మన రాజకీయ కార్యక్రమాలు, మార్గాలు భిన్నంగా వుండొచ్చు. నిశిత దృక్పథం అనే పద్ధతి అనుసరించడమే సాంఘిక కార్యక్రమాలలో చక్కని విధానం.
మూడు నైతిక సూత్రాలను మనం గమనించాలి.
 • ప్రజాస్వామ్యానికి కట్టుబడి వుండాలి. చదువుకున్న పౌరులు సమాజసేవ బాగా చేయగలరు. ప్రజాస్వమిక సమాజం స్వేచ్ఛ, పౌరహక్కలు, పత్రికా స్వాతంత్ర్యం, ప్రతిపక్షాలు చట్టబద్ధమైన హక్కులు అల్పసంఖ్యాకుల హక్కులు, చట్టబద్ధత పాటించాలి. మానవస్వేచ్ఛ, మానవహక్కులున్నచోట భావస్వేచ్ఛ వుంటుంది.
 • ప్రభుత్వం నుండి మతాన్ని వేరుచేసే సెక్యులరిజం అవసరం. ప్రజాపాలనలో మతాన్ని రుద్దడం తగదు. మత శక్తుల ఆధిపత్యం ప్రభుత్వంలోకి రానివ్వదు.
 • విశ్వధోరణి అవసరం. మన భూమిని కాపాడుకోవాలి. ప్రపంచ ప్రజల్ని సంరక్షించుకోవాలి. మానవనీతి విశ్వం అంతా పాటించాలి. ఆకాశాన్ని పరిశోధిస్తున్న నేపథ్యంలో, ప్రపంచం పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడే రీతులు పాటించాలి. మన నీతి కేవలం మన ప్రాంతానికి, జాతికి, దేశానికి పరిమితం కాగూడదు. ప్రపంచమంతా వ్యాపించాలి. మానవులతోబాటు విశ్వంలో అందరికీ యీ సూత్రాలు వర్తిస్తాయి.

విశ్వమానవతలో యిమిడిన విషయాలు
 • మన చర్యలు అవి చూపే ఫలితాలు ఎలాంటి ప్రభుత్వాన్ని చూపుతున్నాయో గమనించాలి. ఇది విశ్వానికి అన్వయించడంలో, ఆకాశం నుండి చూస్తే కలిగే దృక్పథం గూడా స్వీకరించాలి.
 • ప్రకృతిని కలుషితం చేయరాదు. నాశనం చేయరాదు.
 • మానవులందరి యోగక్షేమాల దృష్ట్యా కార్యక్రమాలుండాలి. అందరికీ సమాన విలువ, హుందాతనం వుందని గ్రహించాలి.
ఇందుకు పాటించాల్సినవి
 • అందరికీ చెందిన విశ్వవనరుల్ని దుర్వినియోగపరచరాదు.
 • మితిమీరి జనాభా పెరగరాదు.
 • ప్రకృతి పరిసరాలను పాడుచేయరాదు.
 • వాతావరణం వేడెక్కేటట్లు చేయరాదు.
 • ఆదాయం, సంపదలలో విపరీత వ్యత్యాసాలుండరాదు.
 • చాందసవాదం, టెర్రరిజం తలెత్తనివ్వరాదు.
 • సమస్యల పరిష్కారానికి యుద్ధం, హింస మార్గాలనుకోరాదు.
ఈ ధోరణి వలన కొత్త నైతిక దృష్టి తలెత్తుతుంది.
మనందరం యీ తరంవారికి, భవిష్యత్తు తరాలకు కట్టుబడి పనిచేయాలి. భూమిపై ప్రాణుల సంరక్షణ, సంక్షేమానికి కృషిచేయడం మన నైతిక బాధ్యత.

రచన    అనువాదం
   పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment