ఇన్నయ్యగారిని, కోమలగారిని పెళ్ళి పుస్తకం ఝాన్సీ ఇంటర్వూ చేశారు.

నరిసెట్టి ఇన్నయ్యగారు ప్రముఖ పాత్రికేయులు, హేతువాది, మానవవాది, రచయిత, అనువాదకులు. వీరు అనేక హేతువాద, మానవవాద ఉద్యమాలలో పాల్గొని ప్రజలు మాఢనమ్మకాల నుంచి బయటికి రావాలని వారికి పిలుపునిచ్చారు. ఎం.ఎన్.రాయ్, ఎ.బి. షా , వి.బి.కార్నిక్ , అగీహానంద భారతి , పాల్ కర్జ్ రచనలు అనువదించారు. అంతర్జాతీయ పత్రికలు ఫ్రీ ఎంక్వైరర్, ఎన్‌సైక్లోపీడియా ఆన్ బిలీఫ్ లలో రచనలు చేశారు.  సతీమణి వెనిగళ్ళ కోమలగారు ఇంగ్లీషు ప్రొఫెసరుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీనుండి పదవీవిరమణ చేశారు. కోమలగారు రచయిత, అనేక అనువాదాలు కూడా చేశారు. గొప్ప వ్యక్తిత్వంగల ఇన్నయ్యగారిని, కోమలగారిని  పెళ్ళి పుస్తకం  ఝాన్సీ 2010లో ఇంటర్వూ చేశారు.
పెళ్ళి పుస్తకం లింకు . https://www.dropbox.com/s/gozf7bzzz3c31ia/Pelli%20pustakam%20of%20N.Innaiah_mpeg2video.mpg?dl=0   

ఎం. ఎన్.రాయ్ రచనల సంకలనం-కవనీథ్ పరిచయం

ఆధునిక భారతీయ తత్వవేత్తలలో మానవవాదిగా ఎం. ఎన్.రాయ్ ప్రపంచ గుర్తింపు పొందిన వ్యక్తి.ఆయన్ రచనలనుండి కూర్చిన సంకలనం ఇన్నయ్య రూపొందించగా అమెరికాలో ప్రొమిథియస్ ప్రచురణలు వెలికి తెచ్చారు . దీనిపై కవనీథ్ సింగ్ విపులమైన పరిచయం రాశారు. కవనీత్ తమిళనాడులో పుట్టి అమెరికాలో స్తిరపడిన హేతువాది.మంచి సమీక్షకుడు .
M.N.Roy - Radical Humanist; Selected Writings by Innaiah Narisetti (2004) [209P]

ISBN:1-59102-141-3 Prometheus Books

Book Review by Kavneet Singh

Innaiah Narisetti, a man with impeccable courage who fought through the Indian Court

system for 12 years, to finally receive his PhD in Philosophy is a diehard humanist.

Rationalist humanism is a very uncommon line of thinking among Indians in general and

an educated guess would be less than half of one percent proscribe to it. Dr.Narisetti has

been a journalist, written several books in English and Telugu on Humanism, Religion &

Politics. He has complied papers and lectures of M.N.Roy and published them in a

readable logical sequence.

Manabendra Nath Roy is the father of Humanism in the South Asian sub-continent. His

radical thinking brought to light several problems of rule of the people and the

democratic process in its current form. Many of his insights were uncannily well ahead of

his time and the solutions incisive. Born in 1887 into a Bengali Brahmin household, grew

up with no formal schooling, landed in the US and converted to Marxism in Mexico and

later formed the Radical Democratic Party in pre-India. Finding a dead end with all the

current systems he started ‘New Humanism’ which was simultaneously coming of age in

Europe and the US, unknown to Roy at the time.

Chapter 1:

The common cry of all is: back to the religious mode of thought. Their new religious

philosophy is differentiated from orthodox revivalism by a discriminating association

with rationalism and scientific knowledge. But yet another attempt to reconcile faith with

reason, theism or mysticism with humanism, mediation of moral values deserves

endorsement, but the morality of the modern man requires no transcendental

sanction.....[Page 21]

M.N.Roy clearly advocates rationality to be used as a moral guide for man versus religion

to guide man through this world. A free thinking individual’s mind should not be

cluttered and fettered to the obscure theological concepts of the various man-made

earthly faiths. The intellectual bankruptcy of men of faith has caused a moral crisis in

modern times.

I see no other way out of the crisis. It is the creation of people who were to lead mankind.

They have failed. A mighty resurgence of the common man and woman only can save

modern civilization. To inspire that resurgence, organize it, and guide it to fruition-that is

the mission of New Humanism....[Page 28]

Roy is convinced that all religious systems have failed mankind to get ‘him’ out of the

quagmire of our present human condition and unless and until individuals can completely

free themselves of the chains of religious indoctrination there is little chance of freedom

of the utopian kind.

Chapter 2:

A cosmopolitan commonwealth of free men and women is a possibility. It will be a

spiritual community, not limited by the boundaries of national states-capitalist, fascist,

communist, or of any other kind-which will gradually disappear under the impact of

cosmopolitan humanism.....[Page 33]

Roy insists that every individual be educated and use his discerning intellect to

understand and make sound decisions for the betterment of mankind.

Chapter 3:

No political philosophy or a scheme of social reconstruction can have more than a very

limited revolutionary significance if it dismisses the concept of individual freedom as an

empty abstraction.......Politics cannot be divorced from ethics without jeopardizing the

cherished ideal of freedom.......[Pages 36-37]

The heart of New Humanism lies in the freedom of the individual being the absolute

beachhead of this radical thought. But in order to practice democracy the current form of

simply counting heads especially when the heads are devoid of proper information and

sovereign intellect. The herd mentality persists because the individual has not matured

enough to do independent thinking due to the peer pressure of the masses to toe the line

of religious fascism and hyperbole.

What is suggested is not a rule of the “intellectual elite,” but such an organization of

society as will give unlimited scope for the unfolding of the creative genius of man, by

placing the executive power of the state under the control of free individuals.....[Page39]

Roy’s suggested style of Democracy is ideal and indeed Radical but not novel in its form

because the Sikh Gurus coined the concept of “halimi raj” [benevolent rule] more than

three centuries earlier which was the original radical democracy where every Sikh was a

sovereign free thinking individual with a voice which made a difference. It is uncanny

that the World Sikh Council-America Region organizational setup is based on the Sikh

religio-political concepts yet they happen to be exactly the way Roy envisions an ideal

democracy. Furthermore the Sikh rule by Maharaja Ranjit Singh where the Sikhs being

only 13% of the entire population ruled with the full backing of all the people and is on

record to be the most benevolent ruler in Asia in the last many centuries. Even though

there is no reference to it in the book, it is quite possible for Roy to have studied the

concepts of Sikh theological governance to have come up with this idea as Bengali

writers were the first non-Sikh/non-Western writers to study the Sikhs.

Chapter 4:

It has been elected by less than 12 percent of the people....Because a large majority of

these 12 percent did not vote consciously and intelligently for those particular gentlemen.

They voted in many instances simply because they were dragged to polling stations like

dumb-driven cattle and voted as they were told by those who dragged them.....will have

the privilege of being ruled by a minority government representing a very small

percentage of the people.....[Pages 51-52]

Nothing has changed since the supposed independence of India as the same is truer today.

Roy’s prophetic insight to the Indian mind gave him a unique foresight as all his

predictions have pretty much come true. No wonder Roy’s Politics of Freedom is the

need of the hour not only for India but for all; albeit it requires rigorous training of honest

inquisitive humble men in order to build a legitimately solid foundation upon which

Radical Humanist democracy can thrive!

That is the relation between philosophy and politics. We believe that politics, in theory

and practice, is related to certain human values and ethical concepts........[Page 58]

Roy’s appraisal is very similar to the ‘miri-piri’ concept a precursor to the ‘halimi raj’ of

the Sikh theology. A ‘Just’ religion or a Philosophy governs politics and not vice a versa,

otherwise like Roy states politics becomes a dirty scramble for power and success.

Chapter 5:

We have had the experience of previous elections. There were many cases of voters going

to polling booths as if they were going to the temple.......With universal suffrage things

will be worse....Consequently, demagogues will have a greater chance to come to power

by appealing to the prejudices and superstitions of the people.....Demagogues will vie

with each other to sway the people.....The future of democracy in India, therefore is not

very bright......[Page 66]

Absolutely nothing has changed since the Independence of India, except for ratcheting up

the level of corruption hundredfold. Roy’s vision of educating the individual and freeing

the Indian mind to make independent ethical decisions is still a distant dream. Today’s

game of power and pelf is no different from 60 years ago as Roy saw except its worse.

Chapter 6:

Thus the electorate will gradually become critical and discriminating; the time will come

for the voters of a locality will tell candidates of all parties to leave them alone; among

themselves they will find men in whom they can have confidence and who will remain

responsible between two elections........In the process, we shall already have laid down

the foundation of a decentralized state of local republics......power will remain with them,

to be wielded directly by the individual members of small communities. Being thus reared

upon a broad foundation of direct democracies, the state will really be democratic.

Usurpation of power will be out of question.......[Page 77]

Roy’s intellect shines through with his clear thinking. Again Roy’s ideas are completely

akin to the theo-political state envisioned by the Sikh Gurus and uniquely Sikhs are

running a few organizations on very similar lines already.

Chapter 7:

A little analysis will reveal......the large bulk of the Indian population, have not risen to

the level where democratic practice is possible, since it belongs in the 16th if not 15th

century......therefore its argued the institutions of the bygone days would be more

suitable for India.....the advocate’s of India’s “special genius” argue: don’t try to

introduce modern political institutions into this mediaeval atmosphere, but let us glorify

medievalism and give India the equivalent of medieval institutions......[Page81]

Roy clarity is still relevant today. Instead of progressively building the common man’s

mental makeup, institutional parties have inundated the minds of the public with

retrograde “Hinduvata” instead; taking Indians further back into a medieval morass.

Once a representative is elected, he is no longer under the control of his electors but of

his party.....You may have noticed that during the debate of the constitution in the

Constituent Assembly, many members advocated in the beginning a point of view of their

own which they suddenly abandoned simply because the party whip had cracked, and

they voted against their conscience......[Pages 83-84]

This is precisely the problem with the present form of election process due to which the

sovereignty of the voter is over immediately upon his representative being elected.

Anything done for a good end is right, morality disappears, and that is the main evil in

the public life of all countries ....Morality has disappeared because it is forgotten or

ignored...an attribute of men, and men have been lost in the masses....because men

merge into masses on the lowest denominator......[Page 86]

Ethics and morality are thrown to the winds because it has no place in the flesh market

where politicians are free wheeling traders.

History has proved that if the French Revolution were to be traced to a single cause, it is

this book. Through this book, Enlightenment spread to the farthest corners of

France.......to spread enlightenment in all the dark corners of our social life, where

superstitions lurk and prejudice breeds, is the most fundamental task of all....But once3

the theory becomes a live integral part of my existence, all my actions will be practical

expressions of that theory......[Pages 89-91]

To a very large extent Roy is correct in thinking that through the dissemination of written

ideas people can get enlightened to push for positive change to better their lot.

Unfortunately in India the illiterate masses are not the only ones, but also the educated

that are carrying the virus of blind faith in umpteen kinds of ritualistic digressive

religious philosophies. In a country where there is a state sanctioned department of

Astrology what can you expect from the uneducated masses? It is a long uphill battle.

Chapter 8:

The result would be that America acquires a stake in our country, Thus, on one hand, in

association with American capital, which today dominates the world markets, India

might get a share in world trade.......[Page 98]

As a political economist Roy was visionary. It took over 40 years for India to realize the

potential of allowing America and other western countries to invest capital with strings

attached but nevertheless helping greatly advance its foreign currency reserves, its image

but only very limited advancement in creating jobs for the teeming rural poor.

Most people who have any political ideas at all, whether of the left or right, are obsessed

with notions of one kind of dictatorship or another, whether Ramraj or Soviet, or a

paternal despotism under the garb of formal parliamentarism. In India the experience of

imposing democracy from above will have worse results than elsewhere, because 90

percent of the electorate are illiterate.....this places a heavy premium on demagogy in all

elections.......[Page 104]

India has had an admixture of nepotistic, autocratic, socialized, with a heavy dose of

paternalistic democratic structure which is completely self serving the elected that have

done very little other than lining their pockets. Recent investigations have revealed that

Indian bureaucrats among other Indians are the world’s biggest secret Swiss bank account

holders.

Chapter 9:

But modernity is not a chronological concept only......Some my be living physically in the

20th century but culturally perhaps in the prehistoric age.........the average Indian is

religiously inclined – in fact, religion for him is nothing spiritual but sheer old inherited

prejudice – that he is therefore the representative of mankind as a whole, more spiritual

than the rest, as is often claimed by Indian Nationalists......[Page 111]

Roy has hit the nail on the head and is being pretty sarcastic about it, and rightly so! The

bane of the Indian mindset has been the casteism, racism and really age old prejudices

which have handicapped them and in their own convoluted thinking; and all that is

genuine spiritualism. Unless all that dross is discarded, humanistic values become very

hard to inculcate into anyone.

The individual being the starting point of New Humanism, its practice must necessarily

start from the actions and behavior of individuals. A number of individuals who feel the

necessity....will begin by themselves becoming moral....Naturally, when a hundred of

them will be guided by the same ideal and will be engaged in the same practice, there

will be cooperation among them. A humanist movement will develop among such groups

of humanists......[Page 116]

In theory Roy has an excellent idea but in the real world this is a utopian concept. One

possibility is to implement this book immediately into every higher learning institution in

the country and make it mandatory which would enlighten the impressionable young

minds and would hopefully start a mass crusade, like the one Roy envisions.

Chapter 10:

Free and compulsory primary education is considered a great democratic

achievement....you are trained to salute a flag or the picture of a man; books are

prescribed and cannot use any other book than the ones prescribed by a particular

government.....the result is a high degree of conformism and sub-democratic system in a

backward country......the possibility is extremely remote-to raise the intellectual and

cultural level of the people through government sponsored education......[Page 126]

Roy’s insight through practical experience is, to either change the system; which is

extremely difficult or to start a system outside the existing one. Since the affairs of big

communities have to be administered and that administration is politics. Politics cannot

be relegated to the background instead a humanistic approach should be used to solve all

of those political problems.

If a philosophy is lived instead of being only preached, it has much greater influence than

one which is preached but mostly denied in the living o those who preach it......as such I

appeal to the innate reason and morality of my fellow human beings....This new can be

lived and practiced everywhere in the world. By its spread the political life of India also

can be changed for the better.......[Page 135]

Again Roy is setting an extremely high bar for a humanist to reach. Living an honest

ethical life is exactly what the Sikh Scripture teaches its followers yet they are also

lacking in many ways because ‘that’ path is a difficult one but the right one. Similarly

Roy’s ideas can work wonders provided a group of humanists actually practice before

they preach and in one or two generations maybe there is hope if there are no disruptions

or the humanists themselves don’t give up because this will take a very long time to solve.

Chapter 11:

Revolting against organized religious faith, which had become a spiritual tyranny, the

philosophers of the Renaissance declared man to be sovereign. But the defect was that

the people who had talked about man as the center of all things and attached such a high

value to the human being kept the concept of man himself clouded in mystery....Therefore

the, this view of man was bound to degenerate into some form of mysticism and even in a

new religion......[Page 141]

Roy has given up on organized religion and looks down on any such spiritual philosophy

which involves superhuman and supernatural agencies. There will be continued debate on

this point for the foreseeable future, because spiritually inclined humanists will have their

own take on this! But coming from an ex-Brahminical perspective I can understand

Roy’s vehement distaste to organized religion being the administrator of society since

Brahminism has been the bane of society since time immemorial.

New Humanism is a scientific integral philosophy. The human being is taken not only in

the context of society but of the whole universe. It is not anarchic individualism, because

a point has no existence in space. Similarly, individuals cannot exist independent of

society.....that led to the theory....we must capture power first and that this end justifies

all means. At this point all “goodness” goes by the board. To make a good society even

bad means are justified. But bad means spoil good men. In the process good men become

bad. And bad men cannot make a good society......[Page 149]

Roy’s New Humanism is based on a highly disciplined group of individuals who will

stick by their high ethical code of conduct and not waver at all. This could work but its

being pretty idealistic. Every pessimist is a secret optimist and I for one hope Roy’s

vision comes to fruition for the betterment of all societies. Unless and until a society like

India where people are first brainwashed completely of the existing ignorance and then

through mass literacy programs inculcated the right ideas to germinate, such fantastic

ideas will remain a utopia.

Chapter 12:

The idea of philosophy deluded the best of men, the noblest of souls. In the quest of truth

and search for knowledge, they kept themselves aloof from the affairs of the world,

engaged in contemplation and introspection with the vain hope of finding the infinite in

their finite selves......bulk of mankind was not concerned with this sort of philosophy. If

philosophy was indifferent to their problems, they had no use for philosophy. The

artificial differentiation between the world of spirit and the world of matter led to the

belief that there is no place for the truth and moral values in the latter, which is therefore

destined to be ruled by the laws of the jungle.......[Page 167]

I agree with Roy’s above statement but on the same token I have to disagree that not all

enlightened noble souls have remained aloof from the mundane. The Sikh Gurus spent

nearly 239 years through practice and leadership; germinating a community, then a

society and finally a nation of ‘sovereign’, individuals who could think freely after being

trained through logic to drop all that was previously learnt. Administration of society

should be based clearly upon rule by honest, moral & ethical conduct albeit through the

form of “servant-leadership”. This was uniquely the Sikh Way! Some 225 years later Roy

has proposed ideas which have already been played out and a lot can be learnt from that.

Chapter 13:

Religion in the last analysis remained the only sanction of morality. But in proportion as

science undermined the faith in the supernatural, religion became a mere conventionality.

Consequently, the position of morality in public life became very precarious. With the

modern believing man, religion is the anchor or a mere preoccupation of private life.

Having no bearing upon the public life, it logically cannot dictate the norms of his social

behavior and political practice......[Page 172]

Again based on Roy’s own experience of primarily Brahminism, but Christianity and

Islam the prevailing faiths of his time; it seems like his disenchantment is real. But the

anomaly happens to be again the Sikh Faith where the empirical world is real. Man’s

public life and politics is part and parcel of his personal life to be governed by the moral

dictates of his faith. All political life is to be governed and guided by religion provided it

is wholesome and betters everyone’s lives but with the explicit permission of all those

being governed. The spiritual and the temporal go hand and hand without being divorced

from each other.

In the last analysis, education of the citizen is the condition for such a reorganization of

society as will be conducive to common progress and prosperity without encroaching on

the freedom of the individual. New Humanism advocates a social reconstruction of the

world as a commonwealth and fraternity of free men, by the cooperative endeavor of

spiritually emancipated moral men......[Page 184]

It is difficult to disagree with Roy who is so profoundly logical. Yet, Brahminism and the

modern Democracy of India have stifled the élan of a highly spirited society of

individuals who have practiced and strived for all those great ideas which Roy so

eloquently proposes. If only the Sikh people were allowed to breathe the “liberty” which

is the birth right of all free men as Roy states; Roy would have a readymade model for

others to imbibe and make profound, radical changes which he so desires. That is why

Dr.Ambedkar was very seriously considering that he and his followers convert to the

Sikh Faith in 1930’s except to be blackmailed into submission by the infamous Gandhi.

Chapter 14:

“Man is the measure of everything”....and advocates reconstruction of the world as a

commonwealth and fraternity of free men, by the collective endeavor of spiritually

emancipated moral men......[Page 194]

What Roy is advocating is exactly what the genius of the Sikh Gurus created in a final

culmination of the egalitarian Sikh Faith. The very core of the theological concept of the

Sikh Faith extols to its followers to live and function within society by highly ethical

moral honest means but ultimately serving (all) ‘others’ through selfless service. Further

one of two pillars of the Sikh Faith is that the entire collective of followers have the

power vested in them to wield as they deem fit through collective deliberation for the

benefit of everyone in all facets of the religious and political arena. The Sikhs are a

fraternity of equals who do not consider anyone their master except the Creator. Finally

governance of all would be through the benevolent rule where the power is vested in the

ordinary (Sikhs) people who would nominate not elect a “servant-leadership” which

could be removed as easily if corrupted.

This is the first time in a long time I have come across a man with great intellect on

subject such as this and even rarer is the fact that Roy was a Hindu-Brahmin with ‘ethics.

This book should be standard text to be read by every university student at least in India

and any other third world country whose leaders practice medieval chicanery to rule the

people. Roy’s ideas if studied in depth can make deep changes in the impressionable

young who normally are the torch-bears of change anywhere in the world to gain justice

and freedom from the mental shackles proscribed by various governments. If this book is

really understood by Indian readers they may start questioning the morally and physically

debilitating faith of India which is followed by the majority. The editing author

Dr.Narisetti must be highly commended for bringing out this fantastic book.

నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా

నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా
(1902-1975)


వేదాలు నాలుగు వేడి వేడి నేతిగారెలవలె ఆరగించే సద్ర్బాహ్మణ కుటుంబంలో గోపరాజు వెంకట సుబ్బారావుకు 1902లో నవంబరు 15న గోరా పుట్టారు. అప్పట్లో ఒరిస్సాలోని క్షత్రపూర్ లో ఉండేవారు. గోరా వృక్షశాస్త్రంలో నిష్ణాతుడై కాలేజీ ఉద్యోగంలో ప్రవేశించేవరకూ జంథ్యం వేసుకొని, జేబులో పవిత్ర విబూది పొట్లాన్ని పెట్టుకుని తిరిగేవాడు. గోరా 1922లో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పదేళ్ళ వయస్సుగల సరస్వతిని వివాహమాడారు. ఆనాడు బాల్య వివాహాలు మామూలే.
నేను అమెరికాలో, యూరోప్ లో మానవవాద సంఘాల సభలకు వెళ్ళినప్పుడు ‘నీకు గోరా తెలుసా’ అని అడిగేవారు. ఆయన ఆ సంఘాలన్నింటిలో బహుళ ప్రచారంలోకి వచ్చిన వ్యక్తి.
నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా
చదువు ముగించిన తరువాత మధురైలోని అమెరికన్ మిషన్ కాలేజీలో ఉద్యోగంలో ప్రవేశించి 1926 నాటికి కోయంబత్తూరులోని వ్యవసాయ పరిశోధనా సంస్థలోనికి అడుగు పెట్టారు. 1927 నాటికి కొలంబో వెళ్లి ఆనంద కళాశాలలో చేరి బౌద్ధ తాత్విక విషయాలను పరిశీలించారు. కొలంబోలో (శ్రీలంక) ఒక ఏడాది ఉద్యోగానంతరం కాకినాడ పి.ఆర్. కళాశాలలో బోటనీ లెక్చరర్ గా చేరారు.  ఆయన జీవితం అప్పటి నుండి సాఫీగా సాగలేదు. అతని నాస్తిక భావాలని బయట సంఘం మాట అట్లా వుంచి కుటుంబమే ఆమోదించలేదు. గోరా మొండివాడు. నాస్తిక భావాలు వెల్లడిస్తూనే పోయాడు. ఆగ్రహించిన తండ్రి 1928లో అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. అప్పటికే గోరా జంథ్యం తీసివేశారు. అలా వెలివేయబడిన గోరా తన జీవితాన్ని కొనసాగిస్తూండగా రెండున్నర సంవత్సరాల అనంతరం రాజీపడిన తల్లిదండ్రులు గోరాను మళ్ళీ పిలిచారు. బంధుమిత్రులు, బ్రాహ్మణ సమాజం అంగీకరించకపోగా గోరాతోపాటు తల్లిదండ్రులను కూడా వెలివేశారు. గోరా నాస్తిక భావాలు మింగుడు పడని పి.ఆర్.కళాశాల యాజమాన్యం 1933లో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. దైవ భావాన్ని తృణీకరిస్తూ కాలేజీ మేగజైన్ లో వ్యాసం రాసినందుకు ఈ శిక్ష వేశారు. బ్రహ్మ సమాజం ప్రభావంలో ఉన్న కళాశాల యాజమాన్యం గోరాను జీర్ణించుకోలేకపోయింది. ఆ తరువాత బందరు హిందూ కళాశాలకు వెళ్ళి లెక్చరర్ గా గోరా చేరారు. అక్కడ కూడా ఆయనకు నాస్తిక వాదంతో కష్టాలు ఎదురయ్యాయి. కళాశాలలో పనిచేస్తూనే వారాంతంలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి నాస్తిక ప్రచారం చేసేవారు. అది ఆకళింపు చేసుకోలేని యాజమాన్యం1939లో గోరాను ఉద్యోగం నుంచి తొలగించింది. అదే గోరా జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. 1940లో కాలేజీ నుంచి బయటపడ్డ గోరా మళ్ళీ ఉద్యోగాలు చెయ్యలేదు.
కృష్ణాజిల్లాలో ముదునూరు గ్రామానికి చెందిన స్వాతంత్ర్య యోధుడు అన్నె అంజయ్య సహకరించగా ఆ గ్రామంలో ఉంటూ అంటరాని వారి మధ్య సహపంక్తి భోజనాలు చేస్తూ గ్రామ సేవలో నిమగ్నమయ్యారు. నాస్తిక కేంద్రాన్ని నెలకొల్పారు. గ్రామస్తులు ఆయనకు బాగా సహకరించారు. నాస్తికత్వం గురించి గోరా రాసిన పుస్తకాన్ని 1941లో ముదునూరు గ్రామస్తులు ప్రచురించటం విశేషం. ఇప్పటికీ గోరా ప్రభావంతో ఆ గ్రామంలో సహపంక్తి భోజనాలు సాంఘిక సేవా కార్యక్రమాలు డాక్టర్ ఎన్. భాస్కరరావు ఆధ్వర్యాన జరుగుతూనే ఉన్నాయి.
గోరాకు 9 మంది సంతానం. పిల్లలందరికీ మతరహిత పేర్లు పెట్టటం గమనార్హం. ఉప్పు సత్యాగ్రహంలో పుట్టినందుకు కుమారుడికి ‘లవణం’ అని పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన కుమారుడికి ‘సమరం’, యుద్ధానంతరం పుట్టిన కుమారుడికి ‘విజయం’ అని పెట్టారు. 9వ సంతానంగా పుట్టిన కుమారుడికి ‘నవ్’ అని పేరు పెట్టారు.
ముదునూరు నుండి కేంద్రాన్ని బెజవాడలోని పటమటలో ఏర్పరుచుకున్నారు. అదే ఉత్తరోత్తరా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అక్కడ నుండే గోరా గాంధీని కలిసి ఆయన సేవా కార్యక్రమాలను అంగీకరిస్తూ ఆయన మత భావాలను నిరాకరించారు. గోరా ఆధ్వర్యాన కొన్ని వందల సెక్యులర్ పెళ్ళిళ్ళు జరిగాయి. తన సంతానానికి కూడా గాంధీ సేవాగ్రామ్ లో పెళ్ళిళ్ళు చేయించారు. 1951 నాటికి వినోబా భావేతో సన్నిహితంగా భూదానం, శ్రమదాన ఉద్యమాలలో పాల్గొన్నారు.
మదరాసులో నాస్తిక ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో నడిపిస్తున్న పెరియార్ రామస్వామి నాయక్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు.
భావ ప్రచారకుడిగా గోరా
పార్టీరహిత ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో తొలుత తెచ్చిన ఎమ్.ఎన్.రాయ్ భావాలు ఆయనను ఆకర్షించాయి. అదే ధోరణిలో పార్టీ రహిత అభ్యర్థులుగా పోటీ చేయటం, ఎన్నికలలో పాల్గొని ప్రచారం చేయటం గోరా కొనసాగించారు. ఆవిధంగా చేస్తున్న జయప్రకాష్ నారాయణ్ తో సహకరించారు. గోరా ప్రపంచంలోని నాస్తికులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. తెలుగులో, హిందీలో, ఇంగ్లీషులో పత్రికలు పెట్టి భావ ప్రచారం చేశారు. నాస్తిక కేంద్రం చాలామందిని ఆకట్టుకుంది. అయితే ఆయన శాఖలు ఏర్పరచి విస్తృత పరచలేదు. ఒకే కేంద్రం నుండి పనిచేశారు. ఇప్పటికీ అలాగే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నాస్తికులు ఆయన కేంద్రాన్ని సందర్శించారు. భారతదేశంలో విస్తృతంగా పర్యటించిన గోరా 1972లో ప్రథమ ప్రపంచ నాస్తిక సభలు జరిపి ఎందరినో ఆకర్షించారు.
1970లో గోరా విదేశీ పర్యటన చేశారు. అమెరికాలో వీరనాస్తికురాలిగా పేరొందిన మేడలిన్ ఓహేర్ ను కలిశారు. ఆమె కూడా తరువాత ఇండియా వచ్చి పర్యటించింది. యూరోపులో, ఆస్ట్రేలియాలో నాస్తిక ప్రముఖులు రావడం ప్రచారం ముమ్మరంగా సాగించడం జరిగింది.
1972లో గోరా నిర్వహించిన మాంసాహార విందు ఎందరినో ఆకర్షించగా మరెందరినో దూరం చేసింది. అందులో ఆవు మాంసం, పంది మాంసం రొట్టెలలో పెట్టి విందు చేశారు. ఆయన సిద్ధాంత ప్రకారం భోజన విషయంలో నిషిద్ధాలు ఉండకూడదని ఎవరిష్టం వచ్చిన భోజనం వారు చేసుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పారు. కానీ అటు సనాతన హిందువులు, ఇటు ఛాందస ముస్లింలు గోరా విందును బహిష్కరించి నిరసించారు. అయినా గోరా వెనుకాడలేదు. తన భావాలను గాంధీ దగ్గరకు వెళ్ళి కూడా నిస్సంకోచంగా చెప్పిన వ్యక్తి ఆయన.
అనేక రచనలు తెలుగులోను, ఇంగ్లీషులోను పుస్తక రూపంలో వ్యాసాల పరంగా ప్రచురించారు. ఎమ్.ఎన్.రాయ్ అనుచరులు రాడికల్ హ్యూమనిస్టులు ముఖ్యంగా ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటివారితో సహకరించి పనిచేశారు.
ప్రపంచ మానవవాద సంఘ సమావేశాలలో రెండు పర్యాయాలు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో అమెరికా, రష్యా యూరోపు దేశాలు, ఆస్ట్రేలియా, ఫిజి దీవులు, ఇండోనేషియా, ఈజిప్టు పర్యటించారు. ఎక్కడికి వెళ్ళినా హ్యూమనిస్టుల ఇళ్ళల్లో వుంటూ వారితో సన్నిహిత సంబంధాలు పెంపొందించే పద్ధతులు గమనార్హం. ఇంగ్లీషులోను తెలుగులోనూ స్పష్టంగా మాట్లాడేవారు. అలాగే రాసేవారు. 1956 నుండి ఆయన చనిపోయేవరకూ నేను గోరాతో సన్నిహితంగా ఉన్నాను. ఆయన వస్త్రధారణలో చొక్కాలు వేసుకునేవాడు కాదు. ఒక వస్త్రాన్ని కప్పుకునేవాడు. మోకాళ్ళవరకే పంచ కట్టుకునేవాడు. ఆయన దగ్గరకు నేను వెళ్ళటం, మా ఇంటికి ఆయన రావటం అనేక పర్యాయాలు జరిగింది. నేను నిర్వహించిన మానవవాద, హేతువాద అధ్యయన శిబిరాలలో పాల్గొని మాట్లాడారు. అభిప్రాయ భేదాలను వ్యక్తిగత సంబంధాలలోకి తెచ్చేవారు కాదు. అదీ ఆయన గొప్ప సుగుణం. భావాలలో ఎక్కడా రాజీపడేవారూ కాదు.
1975లో గోరా సమావేశాలలో పాల్గొంటూనే చనిపోయారు. అప్పటికాయన వయసు 73 సంవత్సరాలు. ఆయన ప్రారంభించిన నాస్తిక ఉద్యమాలు పట్టుదలగా ఆయన కుటుంబీకులు వారి మిత్రుల సహకారంతో కొనసాగిస్తున్నారు. గోరా శాస్త్రీయ పద్ధతికి అనుకూల వ్యక్తి. అదే ఉద్యమానికి ఆయువు పట్టు. మేము అనేకసార్లు వాదోపవాదాలలో ఆయనతో భేదించినా మళ్ళీ ఇంటికి వచ్చి, మాతో భోజనాలు చేస్తూ హాయిగా మాట్లాడేవాడు. అదీ గోరా వ్యక్తిత్వం. ఇంతకూ గోపరాజు రామచంద్రరావు గోరాగా ఎప్పుడు మారాడు. తనను వెలివేసిన సందర్భంగా అలాంటి మార్పు పేరులోనూ తెచ్చాడు.
గోరా నాస్తిక వాదంలో కొన్ని తేడాలు గమనించి విమర్శించిన మానవవాదులు రావిపూడి వెంకటాద్రి, మల్లాది రామమూర్తి, లేకపోలేదు. కానీ అలాంటివి పక్కన పెట్టి ఆయనతో సహకరిస్తూ ఆవుల గోపాలకృష్ణమూర్తివంటి మానవవాదులు ముందుకు సాగారు.
గోరా ఆదర్శాలు
గోరా చేపట్టిన ఉద్యమాలలో పదవులలో ఉన్నవారు ఆదర్శంగా సాధారణ జీవితం గడపాలని, ప్రజాధనం దుర్వినియోగం చేయరాదని, విలాసవంతమైన భవనాలలో ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు ఉండరాదని, ఫస్ట్ క్లాస్ ప్రయాణాలు చేయరాదని పట్టుబట్టారు. సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వుంటున్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ముందు కూర్చొని సమ్మె చేశారు. ఆ సమయంలో (1957) నేనూ ఉన్నాను. విషయాన్ని అర్థం చేసుకున్న సంజీవరెడ్డి లౌక్యంగా గోరాను ఆహ్వానించి తనతో భోజనం చేయమని, విషయాన్ని చర్చించి గోరాతో అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అంతేగాని గోరా కోరినట్లు సాధారణ జీవితం గడపలేదు.
పూలమొక్కల బదులు కూరగాయ మొక్కలు వేయమని ప్రభుత్వాన్ని అర్థిస్తూ హైదరాబాదులో ఆకాశవాణికి ఎదురుగా ఉన్న పూలమొక్కలను పెకిలించి వేశారు. పోలీసులు దానికి అభ్యంతర పెట్టి నిర్బంధంలోకి తీసుకున్నారు.
గోరా తన నాస్తిక వాదాన్ని గురించి విపులీకరిస్తూ కేవలం దేవుడు లేడు అనడం కాదని నాస్తిక జీవితంలో రామణీయకతను జీవిత విలువలు సంతోషంగా బతకటం, సహకారం, మానవ విలువలను పాటించటం ప్రధానంగా వుంటుందన్నారు.
- నరిసెట్టి ఇన్నయ్య
ఉపన్యసిస్తున్నవారు ఆవుల గోపాలకృష్ణమూర్తి (న్యాయవాది, రచయిత, హేతువాది, ఆదర్శవివాహ నిర్వాహకులు, 1964 అమెరికా యాత్ర చేశారు) కూర్చున్నవారు ఎథియిస్ట్ లీడర్ గోరా, హ్యూమనిస్ట్ లీడర్ మల్లాది రామమూర్తి, ఎడిటర్, వెనుక కూర్చున్నవారు నరిసెట్టి ఇన్నయ్య

         



సరస్వతీ గోరా, గోరా


--
13.61 GB (90%) of 15 GB used
©2015 Google - Terms - Privacy
Last account activity: 12 minutes ago
Details


బండారు రత్నసభాపతి-ప్రతిపక్షం నుండి పదవిలోకి పయనించిన


రత్న సభాపతిని ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో  చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది.  అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం పూర్వాపరాలు తెలుసుకోనిదే ఎవర్ని గురించీ అంచనా వేయలేం. ఆ దృష్టితో ఒక్కసారి రత్నసభాపతి గత జీవితచరిత్రను ప్రస్తావించక తప్పదు.
బాల్యం
బండారు రత్నసభాపతి కడప జిల్లాకు చెందిన రాజంపేట నియోజకవర్గంలోని ఎల్లంపేట గ్రామస్థులు. ప్రకృతి సౌందర్యం బాగా ఆనందించగలవారు. ఎల్లంపేటలో హాయిగా కాలక్షేపం చేయగలరు. ఒక ఏడాది క్రితం వరకు కరెంటు కూడా లేని ఎల్లం పేటకు నేటికీ మంచి రోడ్డు లేదు. ఒంటిమిట్ట నుండి బస్సులు ఊళ్లోకి వెడతాయి. మట్టిరోడ్డు ఆధారంగానే. చెయ్యేరు గుంజన ఏర్లు కలిసిన ఒక నది - చిన్నదే. ఎల్లంపేట పక్కగా ప్రవహిస్తుంది. కనుక వూరికి నీటి సౌకర్యం వున్నది. మెట్ట మాగాణి పంటలు, మామిడి, బత్తాయితోటలు ఆ వూరి సౌభాగ్యాలు. ఊరిలో బలిజ, కమ్మ కులాలు ప్రధానమైనవి.
రత్నసభాపతి బలిజ కులానికి చెందిన వారు. సెట్టి బలిజలు, గాజుల బలిజలు, రాజ మహేంద్రవరం బలిజలని మూడు తెగలున్నవి. అందులో సభాపతి మొదటి తెగకు చెందినవారు. బలిజలు వ్యవసాయానికి, రత్నాల వర్తకానికేకాక ఉపాధ్యాయవృత్తికీ – యీ జిల్లాలో పేరుమోసినవారు. అందులో రత్నసభాపతి మొదటి కోవకు చెందిన కుటుంబీకులు. ఆయన చిన్నతనంలో వాళ్ళయింట బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట. మణుగు బంగారం వాళ్ళ తండ్రిగారి వాటాగా ఉండేదట. అట్లాంటి సంపన్న కుటుంబంలో జన్మించిన రత్న సభాపతి మరొక ఆరుగురు తోబుట్టువులతో ఆ సంపదను హారతి కర్పూరంచేశారు. నేడుతండ్రీలేడు. ఆ బంగారమూ లేదు. పొలాలు, తోటలు మాత్రం మిగిలాయి. వ్యవసాయంలో రత్న సభాపతికి శ్రద్ధ, ఆసక్తి మిక్కుటముగా వున్నవి.
రత్నసభాపతి ఇంటర్మీడియేట్ అనంతపురంలోనూ, బి.ఎ. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ చదివారు. బి.ఎ. చదువుతుండగా రాజకీయాలలో ఆసక్తి కలిగి,   ప్రవేశించారు. పి.వి.జి. రాజు ఆయనకు చదువుల్లో సహాధ్యాయి. మధ్యలో మద్రాసు వదలి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయారు రాజుగారు. రత్న సభాపతి బి.ఎ.తో చదువుకు స్వస్తి చెప్పారు. అప్పటికి యింకా కంఠశోషగానే ఉన్నాయి సోషలిస్టు రాజకీయాలు. సోషలిస్టు రాజకీయాలు వారిని ఆకర్షించాయి. కళాశాలలోని ఒక ఆర్థిక శాస్త్రాచార్యులు (కల్లుకరన్) రత్నసభాపతికి సిద్ధాంతపరమైన రాజకీయాల్లో ఆసక్తిని కలిగించారు. అప్పటికీ యిప్పటికీ ఆయన్ను తలుస్తూ, పుస్తక పఠనాసక్తిని పోనివ్వకుండా పట్టుకొస్తున్నారు. నెహ్రూ, ఎం.ఎన్.రాయ్, జయప్రకాశ్ రచనలతో ప్రభావితుడైనాడు. 1948 జనవరి 1న  కాంగ్రెసు నుండి సోషలిస్టు వేరుబడి కాపురం పెట్టినప్పుడు, అందులో చేరారు రత్నసభాపతి.
సోషలిస్టుగా సభాపతి
ప్రధానంగా జిల్లాస్థాయి పార్టీలోనూ కొంతవరకు రాష్ట్రస్థాయి పార్టీలోనూ ప్రముఖపాత్ర వహిస్తూ, సోషలిస్టు కార్యకర్తగా అనుభవాల్ని సంతరించుకుంటూ వచ్చారు. తినటానికి, తిరగటానికి లోపంలేని ఆస్తిపాస్తులు వున్నవి. అయినా (అప్పుడు సోషలిస్టు సిద్ధాంతమే ప్రధానాశయం) 1954లో కర్నూలు జిల్లా కరివెది గ్రామం నుండి ఈనాందారీ సత్యాగ్రహం తలపెట్టి సోషలిస్టు జైలుపాలౌతున్నప్పుడు, రత్నసభాపతి ముమ్మరంగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కార్యకర్తల్ని సంఘటితపరచి, ఆ వుద్యమానికి జీవనాడి అయ్యారు.
సోషలిస్టు పార్టీ అఖిల భారత సమావేశాలన్నిటిలో పాల్గొంటూ, పరిచయాలను, అనుభవాల్ని పెంచుకున్నారుకాని తృప్తిలేదు. పార్టీలో డాక్టర్ లోహియాతో సన్నిహితంగా వుండేవారు. ‘Mankind’ English మాసపత్రికకు ఎడిటర్ గా కొన్నేళ్ళపాటు ఉన్నారు. అనేక వ్యాసాలు ఆయన పేరుతో ప్రచురితమయ్యాయి.
సరిగ్గా ఆ సమయంలోనే భూదానోద్యమాన్ని పురస్కరించుకొని, వినోబాభావే కడప జిల్లా పర్యటన చేస్తున్నారు. రత్నసభాపతి వారిని ఇంటర్వ్యూ అడిగారు. ఒక్క ప్రశ్నకే అవకాశం ఇస్తామని వినోబాభావే అన్నారట అప్పుడే ఉపన్యాసం ముగించి. ఉపన్యాసంలో ‘మంచి’ ప్రభుత్వం కావాలని నొక్కి వక్కాణించారట భావేగారు రత్నసభాపతి తన ఒక్క ప్రశ్నను అడుగుతూ, “మంచితనాన్ని ఎట్లా నిర్వచిస్తారు  గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా’’ అనిఅడిగారట. వినోబాకు ఆగ్రం వచ్చి ఉండాలి. ఆ ఇంటర్వ్వూ కాస్తా రద్దు. యీ వుదంతం ఆచార్య జయప్రకాశ్ కు ఉత్తరం వ్రాశారట బావే. జయప్రకాశ్  ఈ విషయాన్ని లోహియాకు వ్రాస్తూ, సభాపతితో మాట్లాడమన్నారట. తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు లోహియా పరామర్శించి, జయప్రకాశ్ తో చర్చించమన్నారట. కానీ ఆ చర్చల ఫలితంగా సభాపతి ఏమీ మారలేదు. జయప్రకాశ్ గోరుముద్దలు కలిపి నోట్లో పెడతాడు. ఆలోచనకు తావులేదు. కాని డా. లోహియా సమస్యను లేవనెత్తి, కొంత దూరం తీసుకువెళ్ళి, ఆలోచనకు వదిలేస్తాడు. అదీ వారిద్దరిలో ప్రధానమైన తేడా అంటారు రత్నసభాపతి., ప్రైవేట్.గా, జయప్రకాశ్.ను ‘రాజకీయ నపుంసకుడని’ లోహియా అనేవాడట. గత నలుబది సంవత్సరాల రాజకీయరంగములో జయప్రకాశ్ వహించిన పాత్రను పరిశీలించిన వారికి డా.లోహియా అన్నమాట సత్యానికి దూరం కాదంటాడు సభాపతి. జయప్రకాశ్.తోపాటు పర్యటించి, ఆయన కార్యక్రమాలు రాయలసీమలో ఏర్పాటు చేసి, సోషలిస్టు పార్టీ ప్రచారం చేసిన అనంతరం రత్నసభాపతికి కలిగిన అభిప్రాయలివి.
సోషలిస్టు పార్టీ చీలిపోయినప్పుడు రత్నసభాపతి సహజంగానే లోహియాకు చేరువయ్యారు. లోహియాతో కలిసి కూర్చుని సుదీర్ఘ చర్చలు చేసేవారు. ఆ మధురస్మృతుల్ని రత్నసభాపతి నేటికీ స్ఫురణకు తెచ్చుకుంటూనే ఉంటారు. మొత్తం మీద లోహియా ప్రభావం ఆయనపై ఎక్కువగానే ఉన్నది. లోహియాకు కూడా రత్నసభాపతి ఎంతో నచ్చాడనటానికి ఒక్క మాటేచాలు. ‘రత్నసభాపతి కాంగ్రెసులో చేరాడని విన్న తరువాత నాకు మానవులపై నమ్మకం సడలింది’ అని లోహియా మాన్ కైండ్.లో వ్రాశాడు.
1955లో ఆంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పి.ఎస్.పి. అభ్యర్థిగా బద్వేల్ నుండి మొత్తం పోలైన ఓట్లలో 64.36% ఆధిక్యతతో రత్నసభాపతి నెగ్గారు. శాసనసభలో ప్రవేశించారు. ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఆ తరువాత కొద్దికాలమే ఉన్నది. 1956 నుండి రంగం హైదరాబాద్.కు మారింది. శాసనసభలో తమ పక్షపు నాయకుడుగా రత్నసభాపతి, ఉపనాయకుడుగా రాజమల్లు వుండేవారు. అది సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం! అంతా నల్లేరుపై బండివలెసాగేది. అసెంబ్లీ ఎలక్షన్.లో వోడిపోయిన అనంతరం జె.వి.నరసింగారావును విద్యుత్ బోర్డు ఛైర్మన్.గా నియమించారు. ఆయనపై రత్నసభాపతి విరుచుకుపడి, “అవినీతి చర్యల ద్వారా కాజేసిన వాటాలో జె.వి. నీ భాగమెంత” పదవియిచ్చిన సంజీవరెడ్డి భాగమెంత.. ఆట్టేకాలం తిరగకముందే, సోషలిస్టు ప్రముఖులైన పి.వి.జి.రాజును, రత్నసభాపతిని కాంగ్రెసులో ఆహ్వానించారు. అఖిలభారత స్థాయిలో సోషలిస్టు పక్షం చీలిపోయిన తరువాత, ఆంధ్రలో పి.వి.జి. లోహియాతో తగాదాపడి సోషలిస్టు డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ తరువాత జరిగిన కథయిది. అంటే 1959లోనన్నమాట. అప్పుడు లోహియాకు స్వస్తిపలికిన సభాపతి, సోషలిజానికి విడాకులు యిచ్చి పి.వి.జి. వర్గంతో సంజీవరెడ్డిగారి కాంగ్రెసులో చేరారు. సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ‘కులాన్ని’ కట్టుదిట్టం చేశాడని రత్న సభాపతి అభిప్రాయం.
1962 సాధారణ ఎన్నికలలో రత్న సభాపతి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబడి                   శ్రీ చిదానందంగారితో పోటీచేసి వోడిపోయారు. కాని సంవత్సరం తిరగకముందే చిదానందం కీర్తి శేషులుగావటం, బద్వేలులో ఉప ఎన్నిక రావడం తటస్థించింది. మళ్ళీ కాంగ్రెసు సీటు యివ్వమని రత్నసభాపతి కోరారు. సంజీవరెడ్డి సుముఖత చూపినా, బసిరెడ్డిగారు తెచ్చిన వత్తిడి వలన సంజీవయ్యగారు ససేమిరా యివ్వకూడదన్నారు. జిల్లాలో రెడ్డి, యాంటిరెడ్డి రాజకీయాలు యిందుకు ప్రధాన కారణం. మొత్తం మీద రత్నసభాపతికి సీటు రానేలేదు. 1963 నుండి 1967 ఎన్నికలవరకు రత్నసభాపతి రాజకీయరంగం నుండి తాత్కాలికంగా నిష్క్రమించి, వూళ్ళో వ్యవసాయం, చూసుకున్నారు.
1965లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటినుండి రత్నసభాపతి రాజంపేట నియోజకవర్గానికి అంటిపెట్టుకున్నారు. ఏమి మాట్లాడినా, ఏం చేసినా రత్నసభాపతి తన నియోజకవర్గాన్ని విస్మరించలేదు. అంతేకాదు, అక్కడి పరిస్థితులు ఆయన రాజకీయాల్ని మలచినవి. అందుకే కులప్రసక్తి తీసుకు రాక తప్పదు. పార్టీ మార్పులు ప్రస్తావించకా కుదరదు. ఇది రాజకీయాల్లో నూటికి 99 మందికి వర్తిస్తుందికూడా.
1967 సాధారణ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెసు స్థానానికి రత్నసభాపతి ప్రయత్నించారు. సంజీవరెడ్డి అనుకూలంగానే వున్నారు. కాని అప్పటికే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చాలా మార్పులు వచ్చాయి. జిల్లా నుండి బసిరెడ్డి మళ్ళీ తీవ్ర వ్యతిరేకత చూపారు. రత్నసభాపతి ఢిల్లీ వెళ్ళి ధేబర్.ను, సంజీవయ్యను కలసినా ప్రయోజనం లేకపోయింది. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా రాజంపేట నుండి నెగ్గిన శ్రీ మారా రెడ్డికి 1967లో స్వతంత్ర పార్టీవారు మళ్ళీ సీటు ఇచ్చారు.  కాంగ్రెసును ఎన్నుకున్నారు. రత్న సభాపతిని స్వతంత్రపక్షంగా పార్టీతరఫున నిలబడమని లచ్చన్న కోరినా ఆయన ఇండిపెండెంటుగానే నిలబడ్డారు. స్వతంత్రపార్టీ మద్దత్తు యిచ్చింది. రత్నసభాపతి నెగ్గారు. కాంగ్రెసు నుండి బయటకు పోవద్దనే సంజీవరెడ్డి సలహాను రత్నసభాపతి వినిపించుకోలేదు.
ప్రతిపక్షనాయకుడుగా
1967 నుండీ అసెంబ్లీలో రత్నసభాపతి నిజంగా చరిత్ర సృష్టించారు. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంపై ధ్వజం ఎత్తారు. సంజీవరెడ్డి కులంవరకే పరిమితమైతే, బ్రహ్మానందరెడ్డి కులానికి అవినీతిని కూడా జోడించారని రత్నసభాపతి సిద్ధాంతం.
తొలిదశలో బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకపక్షంవారు కాంగ్రెసులోనే ముసుగులో గుద్దులాట ఆరంభించారు. ఎ.సి.సుబ్బారెడ్డి, జలగం వెంగళరావు, కాజరామనాథం, సుధాకర్, రత్నసభాపతి యిత్యాదులందరూ కలసి జన కాంగ్రెసు స్థాపించారు. దాని నాయకత్వ విషయంలో తగాదాలు పడ్డారు. రత్నసభాపతిని నాయకుడుగా పెట్టాలని ఎ.సి.సుబ్బారెడ్డి, వెంగళరావులు తలచారు. కాని రామనాథం ఎదురు తిరగగా, రాజీపడి రత్నసభాపతిని ఉపనాయకుడుగా ఉంచారు. ఇది వెంగళరావుగారి సలహాపై జరిగింది. వెంగళరావు, రత్నసభాపతిగార్ల స్నేహం పార్టీలతో నిమిత్తం లేకుండా కొనసాగింది. పరస్పర గౌరవం చూపుకున్నారు. నాటికీ నేటికీ అది అట్లానే ఉన్నది. ఇది రాజకీయాలలో గమనార్హమైన విషయం.
జన కాంగ్రెసు, కాజరామనాథం నాయకత్వాన ఏర్పడినా అది ఆట్టేకాలం సాగలేదు. నిజమైన నాయకుడుగా రత్నసభాపతి చలామణి అయ్యారు. కాని పార్టీ సమావేశాల్లో జరిగే నిర్ణయాలు వెంటనే బ్రహ్మానందరెడ్డిగారికి తెలుస్తున్నాయని అనుమానం వచ్చింది. జనకాంగ్రెసు చీలింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లచ్చన్నగారి నాయకత్వాన ఏర్పడింది. స్వతంత్రపార్టీ అందులో ప్రధానమైంది. కాంగ్రెసువారు క్రమంగా చీలిపోగా, రత్నసభాపతి, లచ్చన్నలు చేరువయ్యారు. లచ్చన్న తాత్కాలికంగా ‘అపరలోహియా’గా కన్పించాడు రత్నసభాపతికి. లచ్చన్నగారి ప్రయత్నంతో, ఆయనపైగల గౌరవంతో రత్నసభాపతి స్వతంత్రపార్టీలో చేరాడు. అంతకుముందే ఢిల్లీలో మరణశయ్యపై వున్న లోహియాను చూచివచ్చారు రత్నసభాపతి. లోహియా బ్రతికివుంటే బహుశ మళ్ళీ సోషలిస్టు పార్టీలో చేరేవాడినేమోనంటారు.
1967 నుండి 1972 వరకూ శాసనసభ్యుడుగా రత్నసభాపతి అనేకమంది  అవినీతి చర్యల్ని బయటపెట్టారు. చెంచు రామానాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఓ.పుల్లారెడ్డి, డాక్టర్ నాయక్, యింకా అనేక అధికార అనధికారుల గుట్టులు వెల్లడించారు,. కుప్పతెప్పలుగా వచ్చిపడే సమాచారాన్ని జాగ్రత్తగా సమీకరించి, చిత్రికపట్టి, కొన్నిటిని స్వీకరించి, మరికొన్నిటిని త్యజిస్తూ, రత్నసభాపతి అసెంబ్లీలో రికార్డు స్థాపించారు. అసెంబ్లీలో ఒకసారి రత్నసభాపతి మాట్లాడుతుండగా బెజవాడ బాపిరెడ్డి బజారుటాక్ వలె ఉన్నదని ఎద్దేవ చేశారు. దానికి తిప్పి కొడుతూ ‘బజారు టాకా - బార్ టాకా’ అని సమయస్ఫూర్తిగా అన్నారు.
1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఆందోళనను సమర్థిస్తూ, వరంగల్లులో ఉపన్యాసాలు చేసి, రాష్ట్రాన్ని చీల్చమని రత్నసభాపతి చెప్పారు.
అట్లాగే 1973లో జరిగిన ప్రత్యేకాంధ్రోద్యమంలోనూ రాష్ట్రాన్ని చీల్చమని అభిప్రాయం వ్యక్తపరచారు. రెండు ఆందోళనలలో ఆయన ధోరణి పొందికగా వున్నది.
1972 ఎన్నికలలో గెలిచిన రత్నసభాపతి స్వయంగా కడపనుండి జీపు నడుపుకుంటూ స్వగ్రామానికి పోతూన్నప్పుడు దారిలో ప్రమాదం సంభవించింది. చికిత్స అనంతరం పునర్జన్మ ఎత్తారు. ఏది చేసినా మేజర్ ఏక్సిడెంటే అని చూడటానికి వచ్చిన కాకానివారు వ్యాఖ్యానించారు. స్వతంత్రపార్టీలో వుండగా రత్నసభాపతి కొత్తవ్యక్తులతో కొత్త కొత్త అనుభవాలు సంతరించుకున్నారు. మసానీకి బాగా సన్నిహితుడయ్యారు. ఇద్దరూ మాజీ సోషలిస్టులు గావటం, మేథాశక్తి సంపన్నులు కావడం వలన కలయికకు ఆధారం లభించింది. అయితే మసానీకి దగ్గర అయ్యేకొద్దీ లచ్చన్నకు (రంగాకు) దూరంగాక తప్పలేదు. తొలుత లచ్చన్నగారి వారపత్రిక ‘బహుజన’ బాగా నడపాలని రత్నసభాపతి చేతులు కాల్చుకుని తరువాత ఆ ప్రయత్నం విరమణ చేశారు. ఇక రంగా అంటే ప్రత్యేకంగా ఆయనకు ప్రేమ లేదు. 1958 ప్రాంతాల్లోనే ‘మాన్ కైండ్’లో రంగా పుస్తకాలను దుయ్యబడుతూ సమీక్షలు వ్రాశాడు. ఎంత పరుషంగా వ్రాశాడంటే, చివరకు లోహియాకూడా, కాస్త దుడుకు తగ్గించమని సలహా చెప్పేటంతవరకూ! ఆ తరువాత రత్నసభాపతి స్వగ్రామం ఎల్లంపేటలోనే రంగాగారు ఎవరినో చూడటానికి వచ్చి రత్నసభాపతిని కూడా కలిశారు.
అఖిలభారత స్థాయిలో రత్నసభాపతికి గౌరవం లభించింది. అయితే లచ్చన్నకు యిది గిట్టక రత్నసభాపతిని తగ్గించనారంభించారు. మసానీ బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఆ కాలంలోనే రత్నసభాపతిని ఇజ్రాయిల్ ప్రభుత్వం తమదేశానికి ఆహ్వానించింది. పరిశీలకుడుగా వెళ్ళివచ్చారు. ఇజ్రాయిల్ లో వ్యవసాయం రైతులకు అనుకూలంగా వుండే తీరు బాగా అధ్యయనం చేసివచ్చి రాష్ట్రంలో రైతులకు వివరించారు.  మొత్తం మీద స్వతంత్ర పార్టీలో వుంటున్నా, రత్నసభాపతి మాత్రం పూర్తిగా ఆ పార్టీలో యిమడలేకపోయారు. తనకు తోడన్నట్లుగా తెలంగాణా నుండి పురుషోత్తమరావుగారిని కూడా పార్టీలో చేర్చటానికి రత్నసభాపతే కారణభూతులయ్యారు.
ఆంధ్ర ఉద్యమం అంతా చల్లారిపోతున్న రోజుల్లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని లచ్చన్న ఒక ప్రతిపాదన తెచ్చారు. తాను కౌన్సిల్.కు రాజీనామా యిచ్చారు. ఆ విధంగా రత్న సభాపతి మాటకు నిలబడి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు! . మళ్ళీ రాజంపేటకు ఉపఎన్నికలు వచ్చే లోపుగానే, ముఖ్యమంత్రిగా తన చిరకాల మిత్రులు వెంగళరావు ఎన్నిక అయ్యారు. రత్న సభాపతిమళ్ళీ పోటీ చేయడానికి తగినంత డబ్బు, మంది, మార్బలం వాగ్దానంచేసిన పార్టీ కాస్తా ఎగవేసింది. అంటే లచ్చన్నగారు అనుకున్నట్లు సహాయం చేసే స్థితిలో లేరు. జాగర్లమూడి చంద్రమౌళి వంటివారు ఎవరిదారు వారు చూసుకోండి అన్నట్లు రత్న సభాపతికి సలహా చెప్పారు. ఆ పరిస్థితిలో వెంగళరావుగారి పక్షం నుండి రత్న సభాపతికి కొన్ని సూచనలు వచ్చినవి. పోటీ చేయవద్దని, కాంగ్రెసులో చేరమని (1973 డిసెంబరులో) వాటి సారాంశం. ఇట్లా రాజీనామా యిచ్చిన సందర్భాలలో లోగడ పోటీ పెట్టని ఉదాహరణలు వున్నాయనీ, ఆ సంప్రదాయం పాటించి తనపై పోటీ పెట్టకుండా వుండరాదా అని రత్నసభాపతి గారి తిరుగు సూచన. కాంగ్రెసులో చేరతాడని వదంతులు వ్యాపించాయి. చేరమని రాజంపేట నియోజకవర్గంలో ‘తనవారు’ రత్న సభాపతికి సలహా యిచ్చారు. కాని సభాపతి చేరడంలేదన్నారు. పోటీకి తలపడ్డారు. రత్న సభాపతికి సీటు యివ్వటానికి, కౌన్సిల్ సభ్యత్వం యివ్వటానికి బసిరెడ్డి అంగీకరించలేదని మరొకవార్త. అవి జిల్లా రాజకీయాల బలాబలాల సమస్య. మొత్తం మీద వెంగళరావుగారే నెగ్గారు. పోటీ చేయకుండా రత్నసభాపతి ఆపారు. కాంగ్రెసులో చేరినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాజకీయాల్లో జడత్వము
రత్నసభాపతికి దృష్టి లోక్ సభపై లేకపోలేదు. ...బహుద.. అనే పేరిట ఒక వారపత్రిక నడిపి, నియోజకవర్గంలో బాగా పనిచేయాలని ఆలోచించారు. ఆ పరిస్థితిలో భూమి తనఖా బ్యాంకు పదవి లభించి మరొక మలుపు తిరిగింది ఆయన సేవా జీవితం. స్వతంత్ర పార్టీలో తన కొత్త అనుభవాల్ని వెల్లడిస్తూ సభాపతి ఇలా అంటారు  -“వేదికలపై అధికారంలో వున్నవారిని విమర్శించటం, మళ్ళీ వాళ్ళ దగ్గరకే పోయి పనులు చేయించుకోవడం యిది రంగా, లచ్చన్న వర్గానికి బాగా అలవాటైంది” అని. అదిసరే. లోహియా భావాలమాటేమిటి? అంటే- లోహియా బ్రతికుంటే నేడు ఇందిరా గాంధీ విధానాలను సమర్థించేవారని జోస్యం చెబుతున్నారు. మరి యిన్ని పార్టీలు మారటం, అందులోనూ అందికా పొందికాలేని సోషలిస్టు పార్టీ – స్వతంత్ర పార్టీలలో చేరటం గురించి ఏమంటారంటే-
ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వాలు, లోగడ కమ్యూనిస్టులు చేసిన నినాదాలు, చెప్పిన ఆర్థిక మార్పులు, కాపీకొట్టి, అమలు పరచటానికి ప్రయత్నించుతుందిగాదా, దీన్ని మీరేమంటారు అని ఎదురు ప్రశ్నించారు సభాపతి.
పార్టీలు మార్చటం నేరమనేది కాలదోషం పట్టిన సిద్ధాంతమని, అవకాశ వాదం గనుక పదిమందికీ తోడ్పడగలిగితే మార్పులో తప్పులేదంటారు. రాజకీయాలలో వున్నవారు, ఓటర్లను దృష్టిలో పెట్టుకోటం వాస్తవమౌతుందంటారు. ఇవన్నీ చాలా యదార్థమైనా వివాదాంశ విషయాలు గాన, ఒక పట్టాన అందరూ అంగీకరించేవి మాత్రం కావుగదా.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లండ్.లో లేబరు ప్రభుత్వం ప్రకటించిన ప్రజాసంక్షేమ విధానాలను కన్సర్వేటివం పార్టీ తూ.చ. తప్పకుండా అనుసరించక తప్పలేదు. మారుతున్న రాజకీయ వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే గుణం మామూలైంది. విరుద్ధ భావాలూ, వ్యవస్థలూగల అమెరికా, రష్యాలు స్నేహం పెంచుకోవాలని తాపత్రయపడటం. ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా యిది తప్పనిసరి అని రాజకీయవేత్తలే కాకుండా మేధావులు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇంకా దగ్గర ఉపమానం చెప్పాలంటే అహింసనే పరమధర్మంగా మలచుకొని మూడు మతాలను ముక్కాళ్ల పీటగాచేసి దేశరాజకీయాలు నడిపిన గాంధీజీకి, పై వాటిలో ఈషణ్మాత్రమైన నమ్మకంలేని నెహ్రూని వారసుని చేసుకోవాలని బహిరంగంగా కోరుకొన్నాడు. తదను గుణంగా మసలుకొని తన పాత్రను సమయోచితంగా నిర్వహించి నెహ్రూ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయాడు.
కమ్యూనిస్టు వ్యవస్థకు కవలపిల్లలైన రష్యా, చైనాలు యీవేళ గర్భశతృవులుగా ఒకరినొకరు ద్వేషించుకోవడం, కమ్యూనిస్టు వ్యవస్థకు గర్భశతృవైన బూర్జువా అమెరికాతో స్నేహం చేయాలని ప్రయత్నించటం. ఇవన్నీ ఏ వాదంకింద వస్తవో చెప్పలేం. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఎవరు ఏ విధంగా సంచరించాలి. సంచరించగూడదు అనేది ఆ పరిస్థితి సృష్టించిన వాతావరణం. దాని వెనుక మరుగుబడివున్న ఎత్తుగడలు, స్వార్థాలు, కారణాలు – వీటన్నిటినీ కలిపి చూస్తేనేగాని ఒక అభిప్రాయానికి రాలేం. ఒక వ్యక్తి పదిమందికి ఉపయోగపడటం కోసం తన భావాలను కొన్నిటిని కొంతకాలంపాటు అటకమీద పెట్టినా ఫరవాలేదనుకొంటాను అని నా వాదం అంటాడు సభాపతి. ఏదీ చివరి మాట కాదు. అందులో రాజకీయాల్లో, దేనికీ జడత్వం లేదు యీ సృష్టిలో అంటాడు రత్నసభాపతి.
శాసనసభలో సభాపతి
ప్రత్యేక తెలంగాణా పోరాటం రోజుల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్య జోరుగా సాగింది. అట్లాంటప్పుడు రత్నసభాపతి ఏదో మాట్లాడబోతుంటే, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అడ్డుతగిలి “నీ సంగతి నాకు తెలుసులే” అన్నారు. ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన సభాపతి, వెంటనే తేరుకుని “అవును. నా సంగతి మీకుగాక మరెవరికి తెలుస్తుంది. నా సంగతి నా పెళ్ళాం సంగతి హైదరాబాద్ గోడలపైన వుందిగదా” అనటంతో, బ్రహ్మానందరెడ్డి మళ్ళీ గుక్క తిప్పుకోలేక కిక్కురుమనకుండా కూర్చొన్నాడు. అవిశ్వాస తీర్మానంపై శ్రీమతి ఈశ్వరీబాయి మాట్లాడుతుంటే, ఒక సందర్భంలో మంత్రి జి.సి.వెంకన్న లేచి, షటప్ అన్నారు. ఈశ్వరీబాయి వెంటనే చెప్పుతీసి చూపిస్తూ, దీనితో కొడతాననటంతో సభ నివ్వెరపోయింది. స్పీకరు కీ.శే.బి.వి.సుబ్బారెడ్డి ఛాంబర్స్.లోకి రత్నసభాపతిని పిలిచి యిదంతా నీవు చేశావుగదా అనడిగితే, చెప్పు భాగోతం వరకూ తన పాత్ర లేదని నిజం చెప్పాడు రత్నసభాపతి.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ శ్రీ ఒ. పుల్లారెడ్డిపై అవినీతి చర్యల ఆరోపణలు చేసి, తీవ్ర విమర్శలుచేయటం రత్నసభాపతి అసెంబ్లీ జీవిత ఘట్టాలలో చాలా ప్రముఖమైనది. అసలు రత్నసభాపతిని మాట్లాడటానికి అనుమతించాలా లేదా అనే చర్చ చాలాసేపు జరిగింది – 1971 ఆగస్టు 25న ఆ చర్చలో ఒకసారి రత్నసభాపతి, “ఎంతసేపండి, చచ్చిపోతున్నాం” అన్నారు.
బ్రహ్మానందరెడ్డి లేచి, “చచ్చిపోయినా, కొంచెం బయటకు పోయినా అసలు కర్మకాండ బాగా జరుగుతుంది” అన్నారు.
వ్యక్తిగత ద్వేషాలు ఆ స్థాయికి పోయాయి.
తిమ్మారెడ్డిపై వచ్చిన ఆరోపణలు తొలుత అసెంబ్లీ మెంబరు అయిన ఒక విప్లవ నాయకుడికి అందాయి. కాని ఆయన కారణాంతరాలచే ఫైలు స్వీకరించలేదు. అట్లాంటి దశలో అది రత్నసభాపతి చేతికొచ్చింది. ఇంకేముంది. తాబేలును త్రిప్పి బాదారు.
పాత ఎం.ఎల్.ఎ. కార్వర్టర్స్.లో స్పెషల్ ఇంట్లో వుంటుండగా, ఒకనాడు పొద్దున్నే ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి, రత్నసభాపతి పాదాలు చుట్టేసుకున్నాడు. గయోపాఖ్యానం పునరావృతమైంది. క్షమిస్తానంటే గాని వదలనన్నాడు. ఎవరా అని విచారిస్తే, అప్పుడు శాసనసభలో రత్నసభాపతి నిశిత విమర్శకు గురవుతున్న ఒక పెద్ద డాక్టర్. ఇట్లా తెరచాటున ఎన్ని వింతలు, విడ్డూరాలు జరిగాయో చెప్పనలవికాదు.
ఏమైనా, శాసనసభలో మాట్లాడబోయేముందు రత్నసభాపతి చాలా హోంవర్క్ చేసేవారు. లైబ్రరీలో గ్రంథాలు తిరగేసేవారు. అసెంబ్లీలో ఇంగ్లీషు, తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారు. ఆంధ్రదేశంలో తయారయిన బహుకొద్దిమంది రాజకీయ వక్తలలో యితడు పేర్కొనదగినవాడని చెప్పవచ్చు. అసెంబ్లీలో మాట్లాడటం అదొకకళ. దీనికి కొన్ని పరిమితులున్నవి. ఆ పరిమితులలో వుండి విషయాన్ని ప్రజల దృష్టికి తేవలె. తరచు ఇంగ్లీషులో తర్జుమా చేసేవారు. లేదా తెలుగులో చెప్పి తిరిగి అంగ్లంలో చెప్పేవారు. అట్లా చెప్పగలిగితేగాని, సభలో దృష్టిని ఆకర్షించలేమనే దృష్టి వారిది. వ్రాయటం వరకు తెలుగుకంటె ఆంగ్లంలో సునాయాసంగా వ్రాస్తారు. బాగా వ్రాస్తారు. ఎందరికో ఘోస్ట్ రచయితగా రత్నసభాపతి తోడ్పడ్డారని చెబితే, రహస్యం బయటపెట్టినట్లే అవుతుందిగాని, వాస్తవానికి దూరంకాదు.
ఆంధ్రప్రదేశ్.లో కొన్ని అవినీతిచర్యలు బయటపెట్టడంలో రత్నసభాపతి పాత్ర ఎంత వుందో, వాటిని విచారణకు పెట్టి న్యాయాన్యాయాలు తేల్చటంలో వెంగళరావుగారి పాత్ర కూడా అంతేవుంది. ఇరువురూ ఎం.ఎల్.ఎ.లుగా స్నేహితులు. కొత్త ఎం.ఎల్.ఎ. కార్టర్స్.లో తరచు కలుసుకొని, విషయాలు చర్చించుకుంటూ, కలసి భోజనాలు చేసిన ఘట్టాలు ఎన్నో వున్నవి. ఆ తరువాత యాదృచ్ఛికంగా రత్నసభాపతిగారు ప్రతిపక్షంలో వుండటం, వెంగళరావుగారు అధికారంలో పరిశ్రమల, హోంమంత్రిగా వుండటం సంభవించినా – యిరువురి సంబంధాలు, అన్యోన్యత – యీ పదవులతో నిమిత్తం లేకుండానే సాగింది.
రత్నసభాపతికి యిష్టమైన రచయితలు మోరిస్ వెస్ట్, ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ స్టోన్, ఎలేడ్రురీ యిత్యాదులున్నారు. టైం న్యూస్ వీక్లీవంటి వారపత్రికలు చదవటం అభిలాష, విషయాలను చదవటం, మనసుపెట్టి పట్టించుకోవటం, జ్ఞాపకం పెట్టుకోటం రత్నసభాపతికి అలవాటు.
రత్నసభాపతికి అక్షరాలా  మానవుడికి వుండాల్సిన సమస్త లక్షణాలు  ఉన్నవి. వాటిని ఏ మోతాదులో ఎట్లా వాడాలో, ఎవరి దగ్గర ఎట్లా ప్రయోగించాలో తెలుసు. రాగద్వేషాలు యిష్టా యిష్టాలు మెండు. అభిప్రాయాలు ఏర్పచుకోవటంలోనూ, మార్చుకోవటంలోనూ, అతివృష్టి అనావృష్టి కనిపిస్తుంది. చెప్పదలచుకున్నది ఘాటుగా చెబుతాడు. అంతేగాదు. స్థాయీ భేదాలతో మీటగలడు. శెట్టిగారుగా ఎల్లంపేటలోనూ, తోలువలుస్తానంటూ కడప రాజకీయాల్లోనూ, ఎంతో హుందాగా రాష్ట్రస్థాయిలోనూ మేథాసంపన్నత చూపటంలో అఖిలభారత నాయకుల దగ్గర శైలి, బాణీ మార్చగలడు. ఐ.ఎ.ఎస్. అధికార్లతో సన్నిహిత మిత్రుడుగా మెలగగలడు. ఐ.ఎ.ఎస్. అంటే కొమ్ములొచ్చినట్లు కాదని నిరూపించగలడు. ఇవన్నీ అనుభవైకవేద్యాలు. జీవితంలో వెలుగునీడలు చూచిన వ్యక్తి రత్నసభాపతి.
మనిషినిబట్టి సంస్థ మారుతుందనీ, సరుకుంటే చూపొచ్చుననీ రత్నసభాపతి నిరూపించాడుభూమి తనఖా బాంకును. అయితే నూటికి నూరుపాళ్ళు జయప్రదం అయ్యాడనటంలేదు. తాను పరిగెడదామనుకున్నంత త్వరగా పాలనాయంత్రాంగంగానీ, తన ఉద్యోగులుగాని గమనాన్ని హెచ్చించటానికి సిద్ధంగా లేరు. అయినా ఎదురీదుతున్నాడనే చెప్పాలి. చేసిన వరకైనా బాగా చేసాడనిపిస్తున్నాడు. వాటి ఫలితాలు ప్రయోజనాలు పల్లెటూళ్లకు ప్రాకటానికి కొంతకాలం పట్టక తప్పదు. అయితే యీ పదవి తాత్కాలికమని రత్నసభాపతికి గుర్తున్నదా? ఉన్నన్నినాళ్ళు చేసి చూపెడదామనీ, శాశ్వతంగా అంటిపెట్టు కుందామనే ఆశలేదనీ అనుకుంటున్నారా లేదా... మన రైతులు సాంప్రదాయాల్ని పాటిస్తున్నారనీ వ్యవసాయ రంగంలో అది యిక ప్రయోజనం లేదనీ రత్న సభాపతి ఉద్దేశ్యం. వ్యవసాయం కేవలం బ్రతుకుదెరువుకు ఆధారమైన వృత్తిగా భావించరాదంటాడు. ఇతర పరిశ్రమలవలె వ్యవసాయాన్ని పరిశ్రమగా పరిగణిస్తేనే రైతుల దృష్టి మారుతుందంటాడు. అంటే వ్యవసాయం కూడా ఒక పెట్టుబడి అనీ, దానిపై లాభాలు రావాలనీ రైతు ఆశించాలన్నమాట. అట్లా అయితేనే అతను భూమిని అభివృద్ధి చేస్తాడు. దీనికి తగిన డబ్బు అతనివద్ద లేనిమాట నిజమే. అందుకే రైతు అభివద్ధికి రుణాలు గుప్పించాలి. రైతు అభివృద్ధి అయితేనే భూమి అభివృద్ధి అయి, అదొక పరిశ్రమగా భావించబడి, సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. ఇన్నాళ్ళూ భూమి అభివృద్ధి జరగాలనే దృష్టి ఉండేది. అది సరికాదు. అది తిరగేసి చెప్పిన సిద్ధాంతం అని రత్నసభాపతి ఉద్దేశ్యం.
రత్నసభాపతి రెడ్ల వ్యతిరేకి అనీ, కమ్మ ద్వేషి అనీ, స్వకులాభిమాని అనీ యిట్లాంటి ప్రచారాలు చాలా వింటుంటాం. వీటి నుండి దూరంగా రత్నసభాపతి పారిపోవటంలేదు. కులం గురించి ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలున్నవి.
కులం వాస్తవం, రాజకీయాలతోసహా అన్నిరంగాల్లోనూ కులం విలయతాండవం చేస్తున్నది. ఇది గమనించకుండా, నేలవిడిచి సాముచేసేవారు చేయవచ్చు. కానీ రాజకీయాల్లో వున్నవారు అట్లా చేయజాలరు. కులాల్లో అణగారిపోయిన కులాలున్నవి. వాటికి చారిత్రక కారణాలున్నవి. అణగారిన కులాలను ఉద్దరించాలని పెద్దలు చెబుతున్నారు. కాని ఎట్లా? లోహియా చెప్పిందే పరిష్కారమార్గం అంటారు రత్నసభాపతి. అన్నికులాలకు సమాన ప్రతిపత్తి, స్థాయి, అంతస్థు సమకూడాలి. అంటే ఇన్నాళ్ళూ అసమానంగా ఉన్న కులాలమధ్య విచక్షణ తొలగాలి. వెనుకబడిన కులాలకు 60 శాతం రిజర్వేషన్లు అన్నింటా వుండాలి. ముఖ్యంగా రాజకీయాధికారం వారికి సంక్రమించాలి. అప్పడుగాని సమానత్వం సాధించలేం. ఇదీ, స్థూలంగా సభాపతి అభిప్రాయం.
లౌకికంగా చూస్తే, రత్నసభాపతికి అన్నికులాల్లోనూ ఆప్తులున్నారు. కనుక సులభంగా ఫలనా కులానికి వ్యతిరేకి అనటంకంటె, సూక్ష్మంగా చూడటం మంచిది. ఆయన తన కులంవారిని తోలువొలుస్తానన్న సందర్భాలూ వున్నవి. అంతమాత్రం చేత స్వకులాభిమాని కాదనగలమా?
రత్నసభాపతి శారీరకంగా ఆట్టే ఆరోగ్యవంతుడు కాదుకానీ, మానసికంగా మాత్రం చాలా గట్టి అభిప్రాయలున్నవాడు. హార్దంగా నవ్వుతాడు. ఆప్యాయంగా పలకరిస్తాడు. పిట్ట కథలు చెప్పి కడుపుబ్బ నవ్వించగలడు. కటువైన సత్యాలు చెప్పి ఏడిపించగలడు. సినిమాలంటే యిష్టం. జీవిత మాధుర్యాలు చవిచూడటం ప్రీతి. ఎంతకష్టించగలడో అంతగా ‘రిలాక్స్’ కాగలడు. ఘాటైన అభిరుచులున్నవి. అంతకంటె ఘాటైన అభిప్రాయాలున్నవి.
సభాపతి 20 ఏళ్ళుగా శాసనసభలోనూ బయటా ప్రతిపక్ష విమర్శకుడుగా రాణించాడు.   అంతగా వెలుగులోకి రాని భూమి తనఖా బాంకును  ప్రజల చేరువకు తెచ్చాడు. చేయదలచింది స్పష్టంగా కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పాడు, చేశాడు. ఎవరి అర్హ స్థానం వారికి చూపట్టాడు. తక్కువవాడు కాదనిపించాడు.
పదవిలో ఉన్నా లేకున్నా, చేసిన నాలుగు రోజులూ గుర్తుపెట్టుకోదగిన పనులు చేస్తున్నాడు. అంతకంటే ఏంకావాలి?
రత్నసభాపతి కొలువుదీర్చి పేరోలగంలో వున్నప్పుడు విన్న కొన్ని అనుభవాలు, హాస్యోక్తులు, చతురోక్తులు, నర్మగర్భోక్తులు పేర్కొనదగినవి.
ఒక పర్యాయం, ఎన్నికలలో గెలిచిన తరువాత రత్నసభాపతిని మరొక ఎం.ఎల్.ఎ.ను క్రైస్తవ సంఘంవారు సన్మానానికి  పిలిచారట. ముందుగా ఆ ఎం.ఎల్.ఎ. అక్కడున్న జీసస్ క్రైస్తు అనేమాటలు చూచాడట. అంతకు ముందురోజు పిలవటానికి వచ్చిన వారు జీసస్ అనే చెప్పారు. ఇప్పడు క్రైస్తు అని కూడా వున్నది. సభావేదిక పై తెలియనట్లు వుండరాదుగదా. అందువలన లేచి మాట్లాడుతూ జీసస్ ఎంత గొప్పవాడో క్రైస్తు కూడా అంతే గొప్పవాడంటూ మాట్లాడాడట. రత్నసభాపతి లేచి వారు మాట్లాడిన అనంతరం యిక – నేను మాట్లాడటం ఉచితంగా వుండదని తప్పుకున్నారట..
ఈ విధంగా ఎన్నో వున్నవి. తనమీద తానే జోక్ వేసుకోటం మరొక ప్రత్యేక లక్షణంగా సభాపతిని చెప్పుకోవచ్చు. ఏమైనా పొగడ్తలు ఎక్కువైతే, పొగిడించుకునేవారికి తాత్కాలికంగా బాగానే వుంటుంది. అది పొగడ్త అని గ్రహిస్తే చాలు ఆరోగ్యం నిలబడుతుంది. నీరు పాలు విడదీసి చూసే విచక్షణ సభాపతికి
పరిపాలన ‘వూబి’లో రత్నసభాపతి
రాజకీయాల్లోవుంటూ, నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన రత్న సభాపతి, అధికారంలోకి రాగానే త్వరత్వరగా పనులు చేయాలనుకోవటం సహజం. కాని యిక్కడ మహమ్మారి ఉన్నదని అది నాగజెముడువలె అల్లుకుని వున్నదని మరచిపోయాడు. పరిపాలన, నియమాలు, నిబంధనలు, చట్టాలు అన్నీ ఎక్కడికక్కడ సంకెళ్ళు అని తెలిసినా, వాటి వుచ్చులు యింతగా బిగుసుకొనివుంటాయని గ్రహించలేదు. సంవత్సరం అయ్యేసరికి తలబట్టేటంత ఆటంకాలు ఎదురైనాయి. అందులో కొన్ని ప్రస్తావిస్తాను.
పేరు మార్చటానికి నవమాసాలు
భూమితనఖా పేరు స్థానే ‘వ్యవసాయాభివృద్ధి’ అనే నామకరణం చేయాలని, ఇదే సరైనదని రత్నసభాపతి ప్రతిపాదించి నవమాసాలు నిండుతున్నవి. ఆ సచివాలయంలో యీ ప్రతిపాదన ఎక్కడ పడిపోయిందో?
సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది
1965 నుండి ప్రాథమిక భూమితనఖా బాంకులలో వివిధ వ్యక్తులు చేసిన దుర్వినియోగం ఎనిమిది లక్షల రూపాయలు దాటింది. సుమారు 50 మంది వ్యక్తులు యిందులో యిరుక్కున్నారు. అంటే పదేళ్ళనుండి యీ కేసుల విషయం పరిష్కారం కాలేదన్నమాట. సభావతి వచ్చి చూచి, దీనికి కారణం ద్వంద్వపాలనలో వున్నదని తెలుసుకున్నాడు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్లు, డబ్బిచ్చేది తనఖా బాంకు అయితే, కేసుల పరిష్కారం సహకార రిజిస్ట్రార్.ది. వారి పర్యవేక్షణ తేలదు. కనుక కేసు పరిష్కారం కాదు. ప్రాథమిక భూమితనఖా బాంకుల కార్యదర్శి, మేనేజర్లపై యాజమాన్యం కేంద్ర తనఖా బాంకుకు ఉన్నట్లయితే, చూస్తూ వుండగా యిట్లా సొమ్ము పోయేది కాదు. పోయినా తిరిగి రాబట్టటానికి వీలుండేది. ఈ ప్రతిపాదన రత్నసభాపతి చేస్తే, సహకార రిజిస్ట్రార్ అంగీకరించారు. వారి సిబ్బందికి యిబ్బందిగా వున్నది. ఇక సచివాలయం సంగతి సరేసరి. వారసలే ఒప్పుకోలేదు. కాని ఎక్కడి గొంగళి అక్కడే వున్నది. సహకార వ్యవస్థలో ప్రజలు స్వచ్ఛందత ఎక్కవగానూ, ప్రభుత్వ జోక్యం కనీసంగానూ వుండాలి. మనదగ్గర అందుకు విరుద్ధంగా వున్నది...
రైతులు అప్పులకు దరఖాస్తులు పెట్టుకున్న 25 రోజులలోగా మంజూరు చేసి వారికి, అందేటట్లు చూడాలని రత్నసభాపతి హుకుం జారీ చేశారు. అందరూ ఆనందించారు. కానీ గ్రామోద్యోగులు అడ్డంపడి, తమ దగ్గరవున్న రికార్డు నకలు యివ్వటానికి, చేతులు చాపుతున్నారు. ఇందుకు మార్గాంతరంగా రత్న సభాపతి మరొక సూచన చేశారు. తాలూకా కార్యాలయంలో శిస్తు చెల్లించే సమాచారం, గ్రామపటం, సహాణి పత్రిక, రికార్డు (అడంగల్) అంతా వుంటుంది గదా. దాని నకళ్లు ఒక్కసారే భూమితనఖా బాంకుకు యిస్తే, మళ్ళీ మళ్ళీ ఆ కార్యాలయాల చుట్టూ తిరగడం గాని గ్రామోద్యోగులకు రూ.200 ల వరకూ సమర్పించుకునే అవసరం గాని వుండదని రత్నసభాపతి ప్రతిపాదన. రెవిన్యూ శాఖ ఒక పట్టాన ససేమిరా అంటుంది. “రెవిన్యూశాఖ అంటే ఎనుబోతుగదా.”
భూమితనఖా బాంకుపై రిజిస్ట్రార్ అధికారం వుండటంవలన ప్రతి చిన్న విషయానికీ వారి అనుమతి కావాల్సివస్తున్నది. ఒక ఉద్యోగికి జీతం పెంచాలన్నా, బాంకు భవనం నిర్మించాలన్నా, డిబెంచర్లు యివ్వాలన్నా, రిజిస్ట్రార్ రాజముద్ర కావాలి. ప్రతిపాదన రిజిస్ట్రార్ కార్యాలయానికి పోగానే యికకాల దోషం పట్టినట్లే, పెళ్లికి దరఖాస్తు పెడితే తద్దినానికే మంజూరు..
రత్నసభాపతి వాదనేమిటి? బాంకుకు పరపతి వున్నది. ఈ విషయం రిజర్వ్ బాంకు సైతం గుర్తించి, ఎట్లాంటి గ్యారంటీ అడగటంలేదు. కాని మన ప్రభుత్వాధికారులు మాత్రం గుర్తించలేదు. ప్రతిచిన్న పనికీ బాంకునుకూడా గ్యారంటీ అడుగుతున్నారు. ఇది అవసరంలేదంటారు సభాపతి, అదీ అరణ్య రోదనంగానే వున్నది. ఆలస్యం అయినాసరేగాని యిది మాత్రం అంగీకరించ మంటున్నారు అధికారులు. మరి ఈ స్థితిని తప్పించే వారెవరు?
అధికారుల బలం జాస్తి అయితే ప్రజాస్వామ్యం బలహీనంగా వున్నదని గుర్తు. ఆ సూచనలు మన దగ్గర బాగా కనిపిస్తున్నాయి.
ముక్తాయింపు
ట్రాక్టర్ల కొనుగోలు నిమిత్తం ప్రపంచ బాంకు 6.5 కోట్ల రూపాయలు అప్పులిస్తున్నది. ఇది వాణిజ్య బాంకులు, భూమితనఖా బాంకుల ద్వారా యిస్తారు. ఏ ప్రతిపాదనపై యిది యివ్వాలి అనే విషయమై కేంద్ర ప్రభుత్వం, మిగిలిన ప్రతినిధులు                      ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర భూమి తనఖా బాంకుకు 90 శాతం యివ్వాలన్నారు. ఇందులో తెలంగాణాకు 40శాతం, కోస్తా ప్రాంతానికి 40 శాతం, రాయలసీమకు 20 శాతం కేటాయించారు. దీని ప్రకారం జులై 7వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులు ఆమోదించి పంపగా కోస్తా, రాయలసీమలకు సరిపోయింది. కాని తెలంగాణా కోటా పూర్తి అయ్యేటంతగా దరఖాస్తులు రాలేదు. దరఖాస్తుల వ్యవహారం చాలా చిక్కులతో కూడినది గావటమే యిందుకు కొంతకారణం         కూడా. జులై 7 తరవాత తెలంగాణా నుండి వచ్చిన దరఖాస్తులు వున్నయ్ అని కూడా ఆమోదిస్తే సరిపోతుంది. కాని రూల్సు ఒప్పుకోవటం, జులై 7 నియమం పెట్టుకున్నది మనమేగదా. మిగిలిన ట్రాక్టర్లు అన్నీ వాణిజ్యబాంకుల ద్వారా యివ్వాలని అగ్రికల్చరల్ కార్పొరేషన్ అంటుంది. లోగడ 6 కోట్ల రూపాయలు వాణిజ్య బాంకులకు యిస్తే, 50 లక్షలే ఖర్చు చేయగలిగారు. భూమి తనఖా బాంకుకు రు.17 కోట్లు యిస్తే అంతా ఖర్చు అయింది. ఇదంతా గ్రహించే వాణిజ్య బాంకులకు 10 శాతమే యీసారి యిచ్చారు. కాని అగ్రికల్చరల్ కార్పొరేషన్ కు వారిపైనే ఎందుకోగాని విపరీతమైన ప్రేమ వున్నది.
ఎన్.టి.ఆర్. మంత్రి వర్గంలో సభాపతి
రాష్ట్ర వెనుకబడిన తరగతుల మంత్రిగా సభాపతి ఎన్.టి.రామారావు రెండవసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఉన్నారు. అప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాట పూర్తిగా పడిపోయింది. అందువలన పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఆతరువాత కొద్దికాలానికే చనిపోయారు.


- నరిసెట్టి ఇన్నయ్య