కాట్రగడ్డ బాలకృష్ణ (1898-1950)

భారతస్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో అనేకమంది భారతీయులు చదువుల కోసం ఇంగ్లండ్ఐర్లండ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినవాళ్ళు చాలా తక్కువ.అందులో తెలుగువారు మరీ అరుదుఅలా వెళ్ళినవారిలో
కాట్రగడ్డ బాలకృష్ణ 
(1898-1950) ఒకరుఆయన ఇంటూరు (గుంటూరు జిల్లా అమృతలూరు మండలంగ్రామము నుండి వెళ్ళారుతొలుత ఇంగ్లండులో లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ లో హెరాల్డ్ లాస్కీ వద్ద చదువుదామనుకున్నారుకానీఅక్కడి ఖర్చులు భరించే స్థితి లేక అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. రూపర్ట్ ఎమర్సన్ వద్ద పిహెచ్.డి. (1932-37) చేశారుఎమర్సన్ ఆసియా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలవారు.బాలకృష్ణ స్థానికంగా బోస్టన్ లో విద్యార్థి సంఘాల సమావేశాల్లో పాల్గొని, 1933 నుండి బోస్టన్ రచయితల సంఘానికి అధ్యక్షులయ్యారుభారత స్వాతంత్ర పోరాటాన్ని గురించి వారికి వివరించేవారుబ్రిటీషు వారి సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా విమర్శించేవారుద్రావిడ సాహిత్యంలో రాజకీయాల గురించి బాగా అధ్యయనం చేశారుభారత జాతీయవాదాన్ని కూలంకషంగా పరిశీలించారు.బౌద్ధ సాహిత్యంలో రాజకీయ సామాజిక విషయాలను లోతుగా అవగాహన చేసుకున్నారుపిహెచ్.డిపూర్తి చేసిన తరవాత 1937లో ఇండియాకు తిరిగి వచ్చి బ్రిటిష్ వ్యతిరేక కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారుదానివల్ల జైలుపాలయ్యారుఅప్పటికే జైళ్ళలో కాంగ్రెస్సోషలిస్టు పార్టీలవారుండేవారుఎన్.జి.రంగా జైళ్ళలో రాజకీయ పాఠశాలలు పెట్టి డిటెన్యూలకు పాఠాలు చెప్పేవారురంగాకు వ్యతిరేకంగా కె.బి.కృష్ణ కమ్యూనిస్టు తరగతులు నడిపేవారుజైలు నుండి విడుదలయిన తరువాత కె.బి.కృష్ణ కొద్ది కాలంపాటు బెల్గాం యూనిర్సిటీలో పనిచేశారుకానీ క్షయ వ్యాధితో ఎక్కువ కాలం బతకలేదు. 1950 లో చనిపోయారు.హిందూ ముస్లిం సమస్యలపైఅల్పసంఖ్యాకుల విషయాలపై ఆయన రచనలు యునెస్కోవారు ఉత్తమమైనవిగా స్వీకరించారుకె.బి.కృష్ణ విషయాలు మరుగున పడిపోయాయిబాపట్ల నుండి రవిచంద్ బాగా పట్టించుకుని ఆయన రచనలు అన్నీ వెలికి తెచ్చారు. 2000 సంవత్సరం ప్రాంతంలో నేను అమెరికాలో వుండగా మిత్రులు అమెరికా వచ్చి బాలకృష్ణ విషయాలు తెలుసుకోమని కోరారుహార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీ ద్వారా కొంతవరకు విషయ సేకరణ చెయ్యగలిగానుకారణం తెలియదు గాని కమ్యూనిస్టులు బాలకృష్ణ విషయంలో ఉదాసీనత వహించారుఅమెరికాలో ఆనాడు బాలకృష్ణకు అరుదైన ఆదరణ హార్వర్డ్ లో లభించింది. ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు :
1. Studies in Hindu materialism by K. B Krishna 

2. Political and social thought of the Buddhist writers of the early Christian era : (a study of the movement of protest against caste system from the 2. century A.D. to the 5. century A.D.) by K. B Krishna

No comments:

Post a Comment