చనిపోవడం బ్రతుకులో భాగం. అది ధైర్యంగా స్వీకరించాలి. -15 final

జీవితమే సఫలము


  • మానవులందరికీ మంచిని, విలువను యిచ్చేది జీవితమే. మరణాన్ని అడ్డుకోవడానికి  నిరంతరం కృషి చేస్తూనే, ఏ విధంగానైనా బ్రతుకు సాగించాలనుకుంటాం. విశ్వంలో ఏ విషయంలో స్పష్టత లేకున్నా, ఒకనాడు జీవితం ముగస్తుందనేది స్పష్టం.
  • ఒక దశలో మానవుడు చావును చూడాల్సిందే. మరణం వుందని తెలియబట్టే జీవితానికి అర్థం, విలువ యినుమడిస్తున్నాయి. మనుగడ సాగించే పోరాటంలో విలువలు, బ్రతుకు తగిన రీతిగా మలచుకుంటాం.
  • జీవితంలో అనంతమైన మంచి వుండడం వలన, దానిని ఏమాత్రం వృధా చేయకూడదు.
  • మరణాన్ని ఎదుర్కోవడంలో బ్రతుకు విలువ పెరిగింది. బ్రతుకు కొనసాగించడంలో, సాధించడంలో చేతనైనంత చేయాలి. అందుకే ప్రతిక్షణం విలువైనది. మనం బ్రతికినన్నాళ్ళూ - అనుభవంలో, ఆలోచనలో, పనిలో ఉత్సాహం, తీవ్రత పాటించాలి.
  • నా జీవితమే నా పథకం. అదే నా కళాత్మక చర్య. జీవితంలో ప్రతిదీ నా సృష్టి. అందులో రంగు రుచి మిళితమై వుంటాయి.
  • చనిపోవడం బ్రతుకులో భాగం. అది ధైర్యంగా స్వీకరించాలి.
  • బాధ లేకుండా చనిపోగలిగితే చావుకు భయపడాల్సిందేమీ లేదు. జీవితానంతరం బ్రతుకు లేదు. ఇంత ఉత్సాహాన్నిచ్చిన ప్రపంచాన్ని వదలడం విచారకరం. ముఖ్యంగా మరణం తొందరగా వస్తే బాధాకరం.
  • రానున్న చావు వాస్తవం అని తెలిసే, దాచిపెట్టడం అనవసరం. మానవతతో చనిపోదలచిన వ్యక్తిని అలా చనిపోనివ్వాలి. ఆస్పత్రిలోనే చనిపోవాలనుకోవడం సరికాదు. చివరి దశలో చుట్టూ మనుషులు లేని దారుణ పరిస్థితుల్లో చనిపోవాలనడం క్రూరం. అనుకూల పరిస్థితుల్లో తనవారి మధ్య చనిపోదలిస్తే అలా మరణించడం మంచిదే.
  • చేసిన వాటికి చేయని వాటికి బాధపడుతూ చనిపోవడం బాధాకరమే. కొందరు సామూహికంగా తప్పులు చేస్తారు. గతంలో మధురానుభూతులతో, ప్రేమ, ఆదరణ, స్నేహం, సృజన, సాధనలతో చనిపోవడం మంచిదే.
  • చివరి దశలో దగ్గరివారి చేతులు పట్టుకొని, కన్నీళ్ళతో కొందరు పోతారు.
  • బ్రతుకులో నిండుదనం అనుభవించినవారు పోతుంటే, ఎంతో మధురజీవనం గడిపావు. జీవిత రహస్య తాళపు చెవి లభించకుండానే పోతున్నావు అనాలనిపిస్తుంది. అందులో తృప్తి వుంది. బ్రతుకు ఎంతకాలం బ్రతికినా సరే - స్వల్పమే. అయినా మరణాన్ని సాహసంతో స్వీకరించాల్సిందే. జీవితాన్ని ప్రేమించాను. వృధా చేయలేదు. అదొక గొప్ప అనుభవం అంటూ చనిపోవడం గొప్ప సంగతి.

రచన    అనువాదం
   పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య



No comments:

Post a Comment