మానవుడి బ్రతుకే విషాదం అనే దృక్కోణం పోగొట్టుకోవాలి-జీవితమే సఫలము--3



కొత్త కొలమానం

మానవాసక్తి గల అన్ని రంగాలలో స్వేచ్ఛగా అన్వేషించే సరికొత్త ప్రమాణం తలెత్తుతున్నది.
  • మనం ఆధారపడగల జ్ఞానం సాధ్యమేనంటున్నది. నమ్మకాలన్నీ పరిశోధించవచ్చు. వాటి ఫలితాలను బట్టి, అవి పొందికాగ వివేచనాత్మకంగా వుండడాన్ని బట్టి నిర్ధారణ చేయవచ్చు.
  • ప్రకృతిని అవగాహన చేసుకోవడానికీ మానవసమస్యలు పరిష్కరించడానికీ వైజ్ఞానిక పద్ధతి సహజంగా ప్రయోగించవచ్చు.
  • సరైన సాక్ష్యాధారాలు లేకుంటే, తగిన వివేచన లోపిస్తే సందేహం వ్యక్తపరచవచ్చు. దివ్యశక్తులను, మార్మికతకు, విశ్వాసానికీ, పెత్తందారీతనానికీ, సంప్రదాయానికీ యిది వర్తిస్తుంది.
  • విద్యకావాలనీ, నిశిత ఆలోచన అవసరమనీ, వివేచనాత్మకంగా నచ్చజెప్పవచ్చనీ, తద్వారా సాంఘిక మార్పు సాధ్యమనీ స్పష్టపడుతున్నది.
  • కొత్త ప్రమాణం మానవదృష్టి.
  • ఈ లోకంలో మానవుడు సుఖసంతోషాలు సాధించవచ్చనేది ప్రధానం.
  • మానవులందరూ మానవహక్కుల్ని సాధారణ విలువల్ని, శ్రద్ధాసక్తుల్ని పంచుకోవచ్చు. భిన జీవన సరళులు సహించవచ్చు.
  • సృజన, స్వయంసాధన విలువలు ఎక్కువగా పొందవచ్చు.
  • మతం నుండి రాజ్యాన్ని వేరుచేసి, రాజకీయాల నుండి మతజ్ఞానాన్ని, నీతి నుండి మత ధోరణిని వేరుచేయవచ్చు.
  • ప్రతి వ్యక్తి విలువైనవారే. అందరి గౌరవం కాపాడాలి. మానవ స్వేచ్ఛను విస్తృతపరచాలి. సాంఘిక న్యాయం, సమానత్వం, సమతాభావన, జీవితంలో మంచిని సాధించడం సాధ్యమే. ఇదే ప్రజాస్వామికం.
  • గతంలోని సంకుచిత ప్రాంతీయ ఆసక్తులు దాటిపోయి, ప్రపంచస్థాయిలో సమాజాన్ని, నీతిని స్థాపించుకోవచ్చు.
  • మానవులు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలరనే వాస్తవాన్ని, అవకాశధోరణిని గుర్తించాలి.
  • మంచిని పెంచాలి. సంప్రదింపులు, రాజీధోరణి, శాంతియుత పరిష్కారం కోరుతుంది. హింసను, బలవంత ధోరణిని కాదంటుంది కొత్త విధానం.
  • నూతన ప్రపంచ నిర్మాణం సాధ్యమేనని రుజువు చేస్తుంది.
  • ఉదాశీనంగా వెనుకంజ వేయకుండా, సాహసోపేత ధర్మాన్ని సాధించే ప్రయత్నానికి పూనుకుంటారు. మనం నమ్మేదాన్ని సాధించడానికి అవరోధాలు తొలగించుకుంటాం.
  • మానవుడి బ్రతుకే విషాదం అనే దృక్కోణం పోగొట్టుకోవాలి. మనం అత్యుత్తమ సాధనం చేయగలం. మంచి మనకోసం, తోటివారికోసం తీసుకరాగలం.
  • జీవిత చుక్కానిగా మానవ వివేచనను వాడుకోవచ్చు.

No comments:

Post a Comment