జీవితమే సఫలము
- మంచి పెళ్ళికి అర్థం ఏమంటే సహజీవికి ప్రేమను పంచడం అత్యుత్తమ చర్యగా భావించడమే.
- తోటి సహచరుణ్ణి యిష్టపడడమంటే, ఆ వ్యక్తి యధేచ్ఛగా వికసించాలని కోరుకేవడమే.
- పెళ్ళి భాగస్వామ్యంలో ఆనందం, నవ్వుల మయం వెల్లివిరియడం చూడొచ్చు. విషాదాలు, దుఃఖాలు, పొసగని రీతులు ఎదురు కావచ్చు. వ్యక్తిగత ఆశయాల సాధనలో యివి భాగమే.
- సహచరుల మధ్య గాఢానుబంధం పెంపొందుతూ, బలహీనతలు అంగీకరిస్తూ ఓటమి ఒప్పుకుంటూ, జీవితంలో మంచి లక్షణాలు సాధిస్తూ, పరస్పరం సాగిపోవడమే.
- గృహనిర్మాణంలో, పిల్లల పెంపకంలో, వృత్తిలో వివాహబంధం ఒక కళగా మారుతుంది. ఇరువురూ దానికి రూపురేఖలు దిద్దుతూ పడుగుపేకలవలె అల్లుకపోతారు.
- పెళ్ళి అయినవారికి నిత్యమూ వారి బంధాలపట్ల సవాళ్ళు ఎదురౌతాయి. అందులో సాధించేదంతా రామణీయకతగా ప్రేమగా వికసించడమే పెళ్ళి జీవితం.
రచన అనువాదం
పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment