ఉత్తమ ప్రపంచం కోసం పనిచేయడం మంచిది-13

జీవితమే సఫలము



  • సంకుచిత ప్రాంతీయ ధోరణిని మించిపోయి ఒక మంచిపని కోసం కృషిచేయడం మన పరిధిని విస్తృతపరచుకోవడమే. చాలామంది తమ దైనందిన చర్యలలో, బ్రతకడానికి, పరిమిత లక్ష్యసాధనకు తిప్పలు పడతారు. అందులో పరిమితంగానే స్నేహితులు, ఆసక్తులు వుండడం కూడా జరుగుతుంది. ఈ పరిధిని విస్తృతపరడమంటే వికాసాన్ని, స్వేచ్ఛను గ్రహించడమే. స్వల్ప విషయాలను అధిగమించడానికి యీ ధోరణి తోడ్పడుతుంది.
  • మనం ఉన్నత విషయాలపట్ల కలలు కనడమేగాక, ఇతరులతో యీ సంగతిలో భాగం పంచుకోవచ్చు. ఉన్నత కారణానికి అంకితం కావచ్చు. అలాంటి కారణాలు చాలా వుంటాయి. సంస్కృతులు ఎన్నో వున్నట్లే. యీ ఉన్నత కారణాలూ భిన్నంగా వుంటాయి. ఆకలి బాధలు తీర్చడం, వసతిలేనివారికి ఆశ్రయం కల్పించడం, శాంతికోసం కృషి సల్పడం, శాంతి, ప్రజాస్వామ్య, ప్రపంచ ప్రభుత్ సాధనకు కృషి, రాజకీయ పార్టీకి పనిచేయడం, స్వేచ్ఛకై పోరాడడం, న్యాయం సమాన హక్కులకోసం పెనుగులాట, విద్య వికాసాలకు ఉద్యమించడం, ప్రకృతి పరిరక్షణ కృషి, కేన్సర్, తాగుడు తొలగించే పని, ఫాసిజంపై పోరాటం వంటివి పేర్కొనవచ్చు.
  • ఇతరులతో కృషిలో భాగం పంచుకొని, వారి వ్యక్తిత్వ వికాసంలో భాగం పంచుకోవడం.
  • వ్యక్తిగత లక్ష్యాలు సాధించదగినవైనా, విశాల లక్ష్యాలు వ్యక్తి లక్ష్యాలకు మించిపోయినవి. అలాంటి వాటికోసం శక్తిని వినియోగించి పనిచేయడం ఉత్తమం.
  • మన సమకాలీనతను విస్మరించి, సాంఘిక మార్పుకు కృషి చేస్తామనడం నైతిక బాధ్యతను కాదనడమే.
  • ఉత్తమ ప్రపంచం కోసం పనిచేయడం మంచిది. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి వుండడం నైతిక విలువ.

రచన    అనువాదం
   పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment