గితారహశ్యం -లోగుట్టు--అధ్యాయం ఆరు

.


కోటలోకి ప్రవేశించాలంటే ప్రహారీగోడలు పగులగోట్టాలి. మహాభారతంపై దాడి చేసి, అది అబద్దాల పుట్టఅనీ, మోసపూరితమనీ చూపితేగాని గీతను ఎదుర్కోలేము. చుట్టూ అల్లిన నాటకాన్ని పొరలు విప్పుకుంటూ పోతే, గీత బండారం బయట పడుతుంది.
మహాభారతం ఎన్ని వంకలు తిరిగినా చివరకు కురుక్షేత్రాన్ని చేరుకుంటుంది. అది యుద్ధరంగమే గాక, ధర్మక్షేత్రంగా పేర్కొన్నారు. ఉభయ సైన్యాలు ఢీకొన్నాయి. గుర్రాలు కదం తొక్కుతున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. రధాలపై పతాకాలు రెపరెపలాడుతున్నాయి. కాల్బలం పోరాటానికి సిద్ధంగా ఉన్నది. చెవులు గింగురు మనే ధ్వనులు వినిపిస్తున్నాయి. అలాంటి భూమికలో తాను ఎదుర్కొనవసిన వారిని పరిశీలించటానికి గాను రథాన్ని పక్కకు తిప్పమని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. ఎదుట తండ్రులనూ, తాతలనూ, గురువులనూ, బంధుమిత్రులను తిలకించాడు. అతడికి నోటమాట రాలేదు. నాకు విజయం సాధించాలని లేదు. రధాన్ని వెనక్కుతిప్పమని కోరాడు. కృష్ణుడు నవ్వి గీతాబోధన ప్రారంభించాడు. కురుక్షేత్రం మౌనం దాల్చింది. అందరూ గీతను విన్నారు.
ఈ నాటక రంగాన్ని తొలగిస్తే, గీతలో ఏమి మిగిలింది? నేను దేవుణ్ణి, సత్యాన్నీ, జీవితాన్నీ, మార్గాన్నీ అంటూ కృష్ణుడు చెప్పాడు. మహాభారతంలోకి గీతను ఎవరు తొలుత చొప్పించారో గాని అతడు గొప్ప మానసికవేత్త. పి.డి. మెహతా వ్యాఖ్యానిస్తూ తాత్త్విక గీతాలాపనకు ఎంపిక చేసుకున్న దృశ్యం చాలా ఆకర్షణీయమైందన్నాడు. (P.D. Mehta : Early India Religious Thought, London, 1956, Page : 246).
మహాభారతాన్ని రాజగోపాలాచారి, మున్షీ సుక్తాంకర్ అభినందించినట్లు నేను చేయలేను. గీత వారి దృష్టిలో గొప్పది కాగా, మహాభారతం నీతి కూడలి. కాని, ప్రపంచంలోని ఇతిహాసాలో అంత గందరగోళమయింది మరొకటి లేదు. అది కలగాపులగం అని హాప్ కిన్స్ అన్నాడు. పురోహితులతో సహా ఎందరో జోక్యం చేసుకున్నారు. సూతులు దీని తొలిరచయితలు. వారు కవులు. సామాన్య ప్రజలను ఆకట్టుకున్నారు. వారి దృష్టిలో ఒక యుధిష్టిరుడు, ఒక భీముడూ, ఒక దుర్యోధనుడూ, సంజయుడూ, శకుని ఉన్నారు. వారి సృష్టిలో ద్రౌపది చాలా గొప్పది. మహాభారతానికి తొలి ఆకర్షణ ఆ పాత్రలే.
మహాభారతాన్ని ఉన్నత నీతి గ్రంధంగా పేర్కొనటం ఘోరమైన విషయం. సుక్తాంకర్ వంటి వారు అందులో స్వర్ణ సంపదను చూచారు. బాణుని కాలంలో ఇది విద్యాగంధంగా ఉపకరించిందన్నారు. (V.S. Suktankar : The Meaning of Mahabharata) బాణుడు ఏడవ శతాబ్దంలోనివాడు. రాజరికంలో నివసించాడు. ప్యూడల్ సాంఘిక ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఐనా, మహాభారతాన్ని నేడు మన పాఠ్యగ్రంధంగా ఉంచాలని సుక్తాంకర్ కోరుకుంటున్నారు. బహుళ ప్రచారం నిమిత్తం రాజగోపాలాచారి వీటిని అనువదించాడు. మున్షీ తన చివరి దశలో కృష్ణావతారం పేరట ఏడు సంపుటాలు ప్రచురించాడు. ఇలాంటి వారు మన మధ్య లక్షలాదిగా వున్నారు. వారిది ఫ్యూడల్ మనస్తత్వం. ప్రాచీన సమాజాన్ని అట్టే పెట్టాలన్న స్వార్ధచింతన ఉన్నది. మహాభారతాన్ని పాఠ్యగ్రంధంగా, గీతను పవిత్ర గ్రంథంగా కోరుకుంటున్నారు. ప్రపంచ చరిత్రను చదివి పాఠాలు నేర్వటం వారికిష్టం లేదు. జర్మనీ రసాయనిక శాస్ర్తజ్ఞుడూ, వైద్యుడూ పరసిలస్ 15వ శతాబ్దంలో ప్రాగ్ లో వైద్యం పై తన ఉపన్యాసాలు ప్రారంభించే ముందు హిపోక్రిటస్, గాలెన్ పుస్తకాలను తగ్గుల బెట్టాడు. ఆధునిక వైద్యానికి నాందిపలికిన ధోరణి అది. మృత ప్రాయమైన మన గతాన్ని అలా వదిలేస్తే గాని, ఆధునిక భారతదేశం ఆవిర్భవించదు. మానవ నాగరికతో ప్రాచీన గాధలకు స్థానం ఉన్నదనీ, నమ్మకాలను క్రోడీకరిస్తుందనీ చెప్పాడు. ఆనాటి మానవుడికి మార్గగామి అయినగాధలు చాలా ముఖ్యదశను చూపుతున్నాయి. అతడు ఆదిమ సమాజాన్ని గురించి ఈ మాటలన్నారు. మన సమాజం నేడు ఆదిమస్థితిలో లేదు. అలాంటప్పుడు ప్రాచీన గాధల్ని నేడు యథాతధంగా స్వీకరిస్తే ఎవరో కొందరు ఉన్నతస్థాయిలో కొనసాగటానికి ప్రయత్నించటమే అవుతుంది. (Bronislew Malinowski : Magic, Science and Religion and other Essays, New York, 1954) గాధలు సామాజిక వడిదుడుకులలో, హెచ్చుతగ్గులలో పనిచేస్తాయని కూడా అన్నారు. అలాంటి స్థితి నేడు మన సమాజంలో ఉన్నది. వాటిని తొలగించి సమసమాజాన్ని ఏర్పరచాలంటే పాతవ్యవస్థను తుడిచిపెట్టాలి

by Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

1 comment:

Anonymous said...

మీ బ్లాగును బ్లాగ్ వేదికలో అనుసంధానం చేసుకోండి.
http://blogvedika.blogspot.in/

Post a Comment