గీత నీతి--15-Truth about Gita




నీతి శాస్ర్తం విశాలమైనది. లోతుపాతులతో కూడినది. విశ్వవ్యాప్తమైనది. ప్రవర్తన నియామావళి కంటె నీతి శాస్త్ర పరిధి పెద్దది గ్రీస్ లో పెంపొందినట్లుగా భారతదేశంలో నీతిశాస్ర్తం పెంపొందలేదు. గౌతమ బుద్ధుడు మతానికి నీతిప్రాతిపదిక అందించాడు. కాని, మహాయాన, తదితర శాఖలు నీతి ప్రాతిపదికను తగ్గించివేశాయి. నీతి శాస్ర్తం ప్రధానంగా సమాజపరమైనదని బెర్ర్డాండ్ రసెల్ అన్నారు. (Bertrand Russell : An Outline of Philosophy, London, 1948). సామాజికంగా పొందిన ఉన్నచోట నీతి విధానం పెంపొందుతుంది. కులాలూ, ఉపకులాల వలన మనకది లేకుండా పోయింది. సామాజిక ప్రవృత్తి కూడా మనకు లోపించింది. ఎప్పుడైనా ఉంటే అది కాస్త కర్మ, పునర్జన్మ వలన బలహీన పడింది. వేదాంతం యింకా కుంటుపరచింది. ముక్తి, మోక్షం, నిర్వాణం అంతిమ లక్ష్యాలుగా నీతిని చంపేశాయి. జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు బోధించాడు. (Sankaracharya, Bhagavadgeetha with commentary, transleted by Alladi Mahadevasastry, Madras, 1979). ఈ విషయంలో ఎలాంటి సందేహం మిగల్చకుండా శంకరాచార్య భాష్యం చెప్పాడు. భగవంతుని పట్ల లీనం కావలసిన దశ పొందాలంటే సమాజంలో మనుషులకు దూరంగా ఉండాలన్నాడు. ఈ దారుణ పంథాను గురించి రంగనాధనంద యిలా చెప్పాడు. రెండు వేల సంవత్సరాలనుండీ గీతలో కృష్ణుడు బోధించినట్లు హేతుబద్ధమైన విశ్వజనీన ఆధ్యాత్మిక పంథాను అనుసరిస్తే నేటి గందరగోళ పరిస్థితులకు మార్గాంతరంగా ఉంటుంది. గీతాబోధన ప్రపంచమానవాళికి చిరకాల ప్రయోజనాన్ని అందించాలని కోరుకుందాం. (Swami Ranganadhananada : Studies in the Geetaed M.D. Paradkar Bombay, 1970).
అయిష్టంగా ఉన్న అర్జునుడిని ఆయుధాలు చేపట్టి చంపమని పురికొల్పిన గీత ప్రపంచశాంతికేమి దోహదం చేస్తుంది? అర్జునుడికి స్వేచ్ఛ లేదనీ, అతడు గురువుతో సహా అందరినీ చంపివేయాలనీ, కృష్ణుడు వారినిముందే చంపేశాడని బోధించిన గీత స్వేచ్ఛను ఎలా పెంపొందజేస్తుంది? అందులోని సత్యాన్ని రంగనాధానంద మాత్రమే గ్రహించగలడు. శుశ్రువ రాసిన గీతావ్యాఖ్యానం నాకు బొత్తిగా అర్ధం కాలేదు. (Susruva : The Esoteric Gospel of Geetha, Madras, 1978).
గీతలోని నీతిని గురించి జి. డబ్ల్యు కావీశ్వర్ రాశాడు. మానవాళి ముందు ఆచరణకు వుపక్రమించివలసిన లక్ష్యాన్ని గీత చూపినట్లు పేర్కొన్నారు. బహుశ కర్మ యోగాన్నిదృష్టిలో పెట్టుకొని ఆయన ఈమాటలని ఉంటాడు. భాషకూ, మనసుకూ అందని విషయాలను రాయటం మూర్ఖత్వమని కావీశ్వర్ గ్రహించి ఉండవలసింది. శంకరుడు, రామానుజుడు, మధ్వుడు, ఇతర వేదాంతులను పాశ్చాత్య తాత్విక ఆచార్యులతో పోలుస్తుంటారు. ఎ.ఎస్. శర్మ బట్లర్ నీతిశాస్త్రం భగవద్గీతలో కార్యాచరణతో పోల్చిరాశాడు. మరొక ఆచార్యుడు బి.యస్.గస్ఖ్ వాల్ కాంట్ నూ, గీతనూ పోల్చిరాశాడు. బహుళ గీతను చూచి జర్మనీ తత్త్వ వేత్త తమ ఆలోచనను రూపొందించుకొని ఉంటాడన్నాడు. (B.S. Ganchkwal : The concept of Perfection in the Teachings of Kant and Geetha, Delhi 1967) కాంట్ 1804లో చనిపోయాడు. జర్మనీలో 1908లో ఫ్రెడరిక్ ష్రీగల్ గీతలోని కొన్ని భాగాలను అనువదించి ప్రస్తావించాడు. అలాంటి గీతాప్రభావం కాంట్ పై ఉన్నదనటం అర్థం లేనిది. అలాగే ఎస్.ఎస్. రాఘవాచార్య గీతను విశిష్ఠాద్వైత గ్రంధంగా పేర్కొన్నాడు. ప్రతి మానవుడినీ లక్ష్యంగా పరిగణించాలని కాంట్ చెప్పిన తత్త్వం గీతకే మాత్రం పొసగడు. గీతపై ఇలా వివిధ రచనలు వెలువడుతూనే వచ్చాయి. పి.ఎన్. శ్రీనివాసాచారి, హెచ్.వి. దివాతియా గ్రంధాలు రాశారు. బ్రిటిష్ కాలంలోనూ, స్వతంత్ర భారతంలోనూ అనుభవం గల దివాతియా గీతలోని నీతి అవగాహన చేసుకోటానికి వీలులేనిదని రాశాడు. గీతపై ఎవరు ఎలా వ్యాఖ్యానం చేసినా నీతికి సంబంధించిన గీత చాలా దూరమనేది స్పష్టం.
అశోకుడి నుండి మార్క్స్, ఏంగెల్స్ వరకూ అనేక నీతివిధానాలు వచ్చాయి. విల్డ్యురాంట్ వీటన్నిటినీ మూడు రీతులుగా వర్గీకరించాడు. 1. బుద్దుడూ, జోస్ ఫ్ చెప్పినది, 2. మెకవల్లీ, నీషే ప్రవచించినది,. 3. సోక్రటీస్, ప్లేటో, ఆరిస్టోటిల్ చెప్పిన తీరు ఇందులో గీతాకారుడు అనుకొంటున్న కృష్ణుడు నీతిలో మెకవిల్లీ, నీషేలను పుణికిపుచ్చుకొన్నాడు. మెకవెల్లీ నిరంకుశ పాలనను కోరాడు. గట్టి రాజ్యపాలన అభిలషించాడు. నీషే సూపర్ మాన్ కావాలన్నాడు. లక్ష్యాన్ని సాధించటానికి మార్గం ఎలాంటిదైనా వారు పట్టించుకోలేదు. బలం గల వారిదే రాజ్యం అనే ధోరణిలో చెప్పారు. కృష్ణుడి ధోరణికూడా అదే, మహాభారతం, పురాణాలూ చూపుతున్న కృష్ణుడిలో ఆధోరణి ఉండవచ్చుకాని, గీతలోని కృష్ణుడిలో అలాంటి లక్షణాలు లేవని కొందరంటారు. నా దృష్టిలో ఆలక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. యదుకుల నాయకుడైన కృష్ణుడు నిరంకుశపాలనలోనే ఉన్నాడు. ప్రజాస్వామ్య శక్తులకు అతడు మద్దత్తు ఎందుకు యివ్వలేకపోయాడు? సామ్రాజ్యవాదానికి తొలిమెట్టుగా రాజరికాన్నే పురికొల్పాడు. నేనేరాజునని ప్రకటించుకున్నాడు. అతడికున్న పలుకుబడితో పాండవ కౌరవుల మధ్య సామరస్యం సాధించవచ్చు. హస్తినా పురానికి సంధి రాయబారిగా వెళ్ళి అనంగీకార కోర్కెలను ముందుపెట్టాడు. ఐదు ఊళ్ళిస్తే పాండవులు సంధికి ఒప్పుకుంటారని చాలా మంది భావించారు. కౌరవులు పరువు గలవారిగా పాండవులతో సంధి నిమిత్తం తన పాలును వదులుకోమని ద్రోణుణ్ణి అడగలేకపోయారు. కృష్ణుడికా విషయం తెలుసు. ఐనా కౌరవులు గర్విష్టులని చిత్రించారు.
కృష్ణుడు యుద్ధంలో తటస్థవైఖరి నటించాడు. వాస్తవానికి పోరాటానికి మించిన పాత్ర వహించాడు. అర్జునుడు ఉపసంహరించుకోటానికి అంగీకరిస్తే, యుద్ధం సాగేదికాదు. అర్జునుడి పై అన్ని విధాలైన ఎత్తుగడలూ ప్రయోగించాడు. గెలిస్తే రాజ్యం వస్తుందనీ, విఫలమైతే స్వర్గం లభిస్తుందనీ చెప్పాడు. అర్జునుడిని అతడి మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించమనటం నీతివంతుడి లక్షణం కాదు. పైగా అందరినీ తాను ముందే చంపేసాననీ, నీవు చంపబోతున్నానుకోటం అజ్ఞానం అనీ చెప్పి విశ్వరూపం చూపాడు. అర్జునుడిని మోహనిద్రలో పడవేశాడు. అందుకే ప్రేమనాధ్ బజాజ్ గీతను గురించి అదొక హత్యాకాండగా పేర్కొన్నాడు. (Premnath Bajaj : the Role of the Bhagavadgeetha in Indian History, Delhi 1975).
డి.డి. కొశాంబి గీతలోని నీతిని గురించి రాస్తూ, నాలో విశ్వసం ఉంటే పాపాలన్నీ క్షమించబడతాయనీ, నీ విధి ప్రకారం సోదరులనైనా చంపేయాలని గీత బోధించిందన్నాడు.
గీతాభిమానులకు యివ న్నీ పట్టవు. ఉపనిషత్తుల సారాంశమేగాక వాటిని ప్రపంచంలోకి తెచ్చింది గీతమాత్రమే నంటారు. పోరాడమని గీత భోదించటంలోనూ అందిక పొందక లేదని అరుణ్ శౌరి రాశాడు. ఈ పోరాటాలు ప్రపంచాన్ని మెరుగు పరచటానికి కాదు. ఆత్మను పరమాత్మలో లీనం చేయటానికి మాత్రమే.
నా దృష్టిలో ఆత్మ పరమాత్మలో లీనం అనేది సంకుచితం, స్వార్ధపూరితం, నీచం, లీనం కావల్సింది బ్రతుకుతోనూ, మానవాళితోనూ మాత్రమే. నేడు మనమున్న స్థితికి రావటానికి ఎన్నో తరాలవారు పుట్టిగిట్టారు. గతతరాలకు మనం రుణపడిఉన్నాం. ఈ గత తరాల సంపదను భావి తరాలకు అందించటం మన కర్తవ్యం. ఇందులో చేతనైనంత కృషి చేయాలి.
గీతను గమనిస్తే స్వార్ధం లేకుండా చర్యకుపూనుకోవాలనటం ఔన్నత్యమే కావచ్చు కాని, ఫలితాలు ఎలా ఉంటాయో పట్టించుకోకుండా పనులు చేయటం చాలా తప్పు. చేసిన పని ఫలితంగా దోషాలు రాబోతున్నాయని తెలిస్తే ఆ పని చేపట్టకూడదు. కులవృత్తిగా, ప్రవృత్తిగా పనిచేయటం మందలో ఆలోచనా రహితుడి ధోరణి మాత్రమే. అరమరికలు లేకుండా చంపేయమనీ, అది కుల వృత్తి ధర్మమనీ చెప్పటం కంటే ఘోరం మరొకటి లేదు.
గీత నీతి మెకవెల్లీ, నీషేలను పోలినది. మెకవెల్లీ చివరిదశలో పదవికి దూరంగా కారాగారంలో బతికాడు. నీషే పిచ్చాసుపత్రిలో మరణించాడు. కృష్ణుడు ఒక ఆదివాసి విలుగాని చేతిలో హతమాయ్యాడు. వీటికి ప్రాధాన్యత లేకపోలేదు.
by Late V R Narla Telugu: Innaiah Narisetti

3 comments:

G.P.V.Prasad said...

మొదట మీరు గీత చదివి ఆ తరువాత ఈ అనువాద లహరి వ్రాయండి.
ఇక నా ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకూ వ్రాయలేదు
8 వ శతాబ్ధంలో వచ్చిన బ్రాహ్మణులు 3 వ శతాబ్ధంలో గీతను ఎలా వ్రాసారు?
పైగా ఆ వ్యఖ్యానాన్ని తొలగించారు కూడా!
ఇక గీతలో శ్రీకృష్ణుడు అర్జునిడికి ఉపదేశించినది యుద్దం మొదలయ్యాకా యుద్దానికి ముందుకాదు అనే వివేక జ్ఙానం కూడా లేకుండా అన్ని కర్మలు నేనే చేయిస్తాను అన్న వ్యాఖ్య ఎలా వ్రాస్తున్నారు?

G.P.V.Prasad said...

ఇక మీ Blog Roman Catholics కు వ్యతిరేకం కానీ protestants Christians లో భాగం అని అర్ధం అవుతుంది.

G.P.V.Prasad said...

మనం పనిముట్టు ఎక్కువ కాలం మన్నడానికి రోజూ శుభ్రం చేస్తాం వాటిని తయారు చేసిన సంవత్సరం Science చెప్పలేదు అలాంటిది గీత పుట్టిన తేదీ ఫలానా అని ఎలా చెబుతుంది ఆ Science?
ఇక అనువాదాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మొదటి అనువాదం మీరు వ్రాసినట్టు ౩ వ శతాబ్ధంలో జరిగిందేమో!
ఇక మన వాళ్ళు చరిత్ర వ్రాయనిది చరిత్ర అబద్దాల పుట్ట ఎప్పుడూ అందులో అబద్దాలే తమని తాము గొప్పవారిగా చూపించుకోవడానికి వ్రాసేది TROY చిత్రం లాంటిది.
ఇక ఆంగ్లేయుల చరిత్ర వ్రాసుకున్నది వాళ్ళను వాళ్ళు గొప్పగా చూపించుకోవడానికి తప్ప వేరే కారణం లేదు.
ఇక చరిత్ర వ్రాస్తే ప్రకృతి గుర్రించి వ్రాయడానికి పుస్తకాలు సరిపోవు, మొన్న మన దేశంలో ప్రముఖులు వ్రాసిన పుస్తకాల లాగా
Sachin Amithabh etc.........
వాటి గురించి పేజీలు సరిపోవు కాబట్టి.
అయినా ఆంగ్లేయులు మన దేశానికి వచ్చింది మొఘల్ సామ్రాజ్య విస్తరణ తరువాత వాళ్ళు తగుల బెట్టిన వాటిని ఉపయొగించి వీళ్ళు మీ నాగరికత ఇంత పురాతనమైనది అని చెప్పారు దాన్ని మీరు అనువదిస్తున్నారు.

Post a Comment