ఇస్లాం పై ప్రముఖుల వాదనలు-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ? -3 chapter


ఇబన్ వారక్మూలాధారాల సమస్య
ప్రత్యేక కాలానికి చెందిన మనం ఏ విమర్శకూ అంకితులం కాదు. మహమ్మద్ అసలు లేడని ఒకనాడు వినొచ్చు కూడా
స్నోక్ హర్ గ్రోంజె (రెవ్యూ ఆఫ్రికన్ 95 (1951) 273-88 బొసాకె అనువాదం పేజి 16 La legenda.
Qoranique d’ Abraham et la politique religense du propheta Mohammad)
సంప్రదాయ ముస్లింలు మహమ్మద్ జీవితాన్ని గురించి, ఇస్లాం ఆవిర్భావం గురించి కేవలం ముస్లిం మూలాధారాలపై ఆధారపడి నమ్ముతున్నారు. ఖురాన్ ముస్లింలు రాసిన మహమ్మద్ జీవితం, ముస్లిం సంప్రదాయం అనే హాదిత్స్ అనేవి మూడు ఆధారాలు.
1.                  ఖురాన్, ముస్లింలు విపరీత భావనలు ఖురాన్ పట్ల చేస్తున్నారు. రాస్ గ్రంథ చరిత్ర ఎలా వచ్చిందీ సంప్రదాయ ముస్లిం ఆధారాలు తెలుపుతున్నాయి. అవన్నీ తప్పుడివే. గందరగోళం, విరుద్ధాలు, అసంబద్ధాలతో అవన్నీ ఉన్నాయి. (బర్టన్ - ఖురాన్ సంకలనం, కేంబ్రిడ్జ్ 1977 పుట 225) పండితులు ఖురాన్ నిజానిజాలనే ప్రశ్నించారు. వారి వాదనలు పరిశీలిద్దాం. ఖురాన్ పై వ్యాఖ్యానాలు చేసిన పవిత్ర ముస్లింలు ఎవరో చూద్దాం. వారి గ్రంథాలను తరచు ప్రస్తావిస్తాం.
      మహమ్మద్ ఇబ్న అల్ తబరి (క్రీ.త. 923)
      అల్ బగవి (1117 లేదా 1122)
      అల్ జమక్షరి (1143 మరణం)
      అల్ బేదావి (1286 లేదా 1291 మరణం)
      ఫకర్ అల్ దిస్ అల్ రజి (1210 మరణం)
      జలాల్ అల్ అల్ మహలి (1459 మరణం)
      జలాల్ అల్ దిస్ అల్ సుయూతి (1505 మరణం)
2.     ముస్లింల విరచిత జీవిత చరిత్రల ప్రకారం ప్రవక్త మహమ్మద్ క్రీ.త. 632లో మరణించాడు. అతనిపై లభించిన తొలి జీవిత ఆధారాలు 750 క్రేతలో ఇబ్న ఇషాక్ రచనలో. అంటే మహమ్మద్ అనంతరం ఒక శతాబ్దం అన్నమాట. ఇబ్న ఇషాక్ మూల రచన లభించలేదు. మార్పులతో కొన్ని భాగాలను మాత్రమే. ఇబ్న ఇషాక్ (834లో మరణం) వెలువరించాడు. అంటే ప్రవక్త మరణానంతరం రెండువందల ఏళ్ళకు అన్నమాట. ఇబ్న ఇషాక్ ను ఉదహరిస్తూ అల్ తబారి రాసిన ఆనల్స్ వంటివి ఉన్నాయి.  మహమ్మద్ జీవితాన్ని గురించి ప్రధాన ఆధారాలు.
ఎ. ఇబ్న ఇషాక్ (767లో మరణం), మహమ్మద్ జీవితంతో బాటు అల్ తబారి ప్రస్తావించిన ఖలీఫాల చరిత్ర కూడా రాశాడు.
బి. ఇబ్నహిషం (833లో మరణం) మహమ్మద్ జీవితం (సిరా) రాశాడు. ఇబ్న ఇషాక్ రచన పరిష్కరించాడంటే సరిగా ఉంటుంది.
సి. సయఫ్ బి. ఉమర్ (796లో మరణం). ఇస్లాం తొలి రోజుల గురించి అల్ తబారీకి ప్రధాన ఆధారం.
డి. అల్ వాఖిది (823లో మరణం) ప్రవక్త జీవితం. అతని ఉద్యమాలు రాశాడు. అల్ తబారి, అల్ బలొదురి (829లో మరణం) వీటిని విస్తారంగా వాడారు.
ఇ. మహమ్మద్ ఇబ్నసాద్ (845లో మరణం) అల్ వాఖిది ప్రధాన సంపాదకుడు. జీవిత చరిత్రల నిఘంటు సంకలనకర్త.
ఎఫ్. అల్ తబారి చాలా వాదోపవాదాలు చేశాడు. ఖురాన్ పై వ్యాఖ్యానంతో సహా అనేకం రాశాడు. ప్రపంచ చరిత్ర అతని సుప్రసిద్ధ రచన. 915 జూలై వరకూ ఇందులో ఉంది.
జి. అలీబి మహమ్మద్ అల్ మదైని (840లో మరణం) పర్ష్యాపై అరబ్బు దండయాత్రలకు ఇది ముఖ్యం.
3.(హాదిత్స్) సంప్రదాయాలు
      సంప్రదాయాలన్నీ మహమ్మద్ ప్రవక్త చేసిన, చెప్పిన వాటి పేరిట సంకలనాలు నమ్మదగిన సాక్ష్యుల పరంపరను ఇందుకు పేర్కొంటారు. మహమ్మద్ చేసినవి అనుభవించినవిగాక, అతని ఎదుట జరిగినవి. అతడు నిషేధించినవి, ప్రవక్త అనుచరులు అధికారికంగా చెప్పినవి, చేసినవీ ఉన్నాయి.
      సున్నా అంటే అచారం. ఈ పదాన్ని విరివిగా ప్రయోగించారు. ప్రవక్త సున్నాలో అతడి చర్యలు, మాటలు, ఆమోదాలు ఉన్నాయి. సున్నాను పాటించడం మహమ్మద్ ను అనుకరించడం వెన్ సింక్ అన్నాడు.
      హాదిత్స్ నోటిమాటగా ప్రవక్త చెప్పిన దానిని బట్టి రాబట్టినవి. సున్నా సంప్రదాయ క్రతువు, నియమం. జీవిత ప్రవర్తనకు సంబంధించినదన్నమాట.
      సున్నా, మత లేదా చట్టపరమైన అభిప్రాయాన్ని చెబుతుంది. దీనికి నోటిమాట సంప్రదాయం ఉండాలనేమీ లేదు. అంటే సున్నాగా పరిగణించే దానిలో హాదిత్స్ సంబంధం ఉండకపోవచ్చు.
      ముస్లిం ప్రపంచంలో (హాదిత్స్) నోటిమాటను ఎంత గౌరవిస్తారో ముస్లిమేతరులకు, నిపుణులు కాని వారికి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఖురాన్ తరువాత అంత గౌరవంతో ముస్లిం ప్రపంచం హడిత్ ను చూస్తుంది. కొన్నిసార్లు దేవుని పలుకు హడిత్ లోనూ కొరాన్ లోనూ కనుగొనవచ్చంటారు. ఇస్లాంకు, ఇస్లాం చట్టానికి సంప్రదాయ రచనలు సిద్ధాంత ప్రాతిపదికలుగా ఉన్నాయి.
      సున్నీ ముస్లింలు ఆమోదించే అధికారిక సంకలనాలు, సంప్రదాయాలకు సంబంధించి అరువున్నాయి. ఎ. అల్ బుఖారి (870లో మరణం) బి. ముస్లిం ఇబ్న అల్ హజిజ్ (875లో మరణం) సి. ఇబ్నమజా (887లో) మరణం) డి. అబూదావూద్ (889లో మరణం) ఇ. అల్ తిర్ మిథి (892లో మరణం) ఎఫ్. అల్ నిసై (915లో మరణం).
      అహమ్మద్ ఇబ్న హన్ బల్ (855 లో మరణం)ను కూడా పై పట్టికకు చేర్చుతారు. ఇతని సంప్రదాయాల సర్వస్వం ముస్నాద్ అంటారు. అందులో 29 వేల సంప్రదాయాలున్నాయి. పవిత్రంగా వాటిని పఠిస్తారు.
సందేహవాదం, శంకలు
    19వ శతాబ్దాంతంలో మహమ్మద్ కు సంబంధించిన చారిత్రక జీవిత సంప్రదాయాలను, ఇస్లాం తొలినాటి విషయాలను సమగ్రంగా పరిశీలించారు. అంతవరకూ గాథలూ, మత విషయాలు, సంప్రదాయాలలో ఏ మేరకు ఉన్నాయో పండితులకు తెలుసు. పక్ష దృష్టితో వచ్చిన సంప్రదాయాలున్నవి. కొన్ని కుటుంబాల, వ్యక్తుల అసక్తుల దృష్ట్యా చారిత్రక ప్రాతిపదికలు కల్పించారు. ఆ తరువాత కూడా మహమ్మద్ జీవితం గురించి స్పష్టమైన అవగాహనకు అవకాశాలు మిగిల్చారు. విశ్వమత స్థాపకుల కంటె, వీటిలో ఈ స్పష్టత  కానొస్తుంది. (హర్ గ్రోంజె పుట 23 మహమ్మడనిజం 1916, న్యూయార్క్)
      వెల్ హసన్, కాటని, లామెన్స్ లు ఇలాంటి భ్రమలన్నీ పటాపంచలు చేసి, ముస్లిం సంప్రదాయాల్ని వరుసగా ప్రశ్నించారు.
      9, 10 శతాబ్దాలలో సంకలనం చేసిన ప్రాచీన చారిత్రక సంప్రదాయాల్ని రెండుగా విభజించి వెల్ హసన్ చూపాడు. (హంఫ్రేస్ పుట 82 ఇస్లామిక్ హిస్టరీ 1991 ప్రిన్స్ టక్) మొదటిది. 8వ శతాబ్దం చివరిలో సంకలనం చేసిన ప్రామాణిక ఆదిమ సంప్రదాయం. రెండవది కావాలని కూర్చిన గాథలు సఫ్ బి. ఉమర్ వంటి చరిత్ర కారుడి రచనలో వీటిని చూడవచ్చు. ఇంత వరకు  నిష్పాక్షికం అంటున్న ఆధారాలను సైతం ప్రిన్స్ కాటాని, ఫాదర్ లామెన్స్ లు సందేహించారు. మహమ్మద్ కాలానికి చాలా సమయానంతరం చరిత్రకారులు జీవితాలు రాసినందున తగిన సమాచారం. భావనలు వారికి లేవు. కావాలని అల్లిన కథలు చోటు చేసుకున్నాయి. అదీగాక జరిగింది జరిగినట్లు తెలుసుకోవడం చరిత్రకారుల ఉద్దేశం కాదు. గతాన్ని ఆదర్శంగా మలచాలని తలపెట్టాడు. ఖురాన్ సూత్రాలకు వివరణ కావలసి ఉండగా, సంప్రదాయ వాదులు ధైర్యంగా ఒకానొక ముఠా కోర్కెలకు, అశయాలకు అనుగుణంగా అలంకరించి దిద్దారు. లామెన్స్ ఉపమాలంకారంగా పేర్కొన్నట్లు, శూన్యావస్తను నింపారు. ప్రతి ప్రతిమ వెనుక ఏముందో గ్రహించే పని విమర్శకులకు వదిలేశారు. (హర్ గ్రోజే పేజి 24 మహమ్మడనిజం 1916 న్యూయార్క్)
ఇస్లాం పై  ప్రముఖుల వాదనలు
      మొత్తం జీవిత చరిత్రను కట్టుకథగా, ఊహగా కావాలని అతిశయోక్తులతో అల్లినదిగా, ఖురాన్ లోని కొన్ని పాఠాల విస్తరణగా లామెన్స్ రాశాడని లూయీస్ స్పష్టం చేశాడు.  (లూయీస్ పుట 94 రేస్ అండ్ స్లేవరీయిన్ ది మిడిల్ యీస్ట్ 1990 న్యూయార్క్) కాటాని  సందేహవాదాన్ని నిరాకరించిన పండితులు సైతం, లామెన్స్ సంశయవాదం తృణికరించిన వారు కూడా, మహమ్మద్ దైవదూతగా ఆవిర్భవించక  ముందు, జీవిత వివరాలు బహుస్వల్పంగానే తెలుస్తున్నాయన్నారు.  భక్తులు అట్టిపెట్టిన జీవిత గాథ మినహా మరేదీ లేదు (హర్ గ్రోంజే పుట 25)
      కాటాని, రజెసూట్ లామెన్స్ భావనలు విస్మరించలేదు. సోవియట్ ఇస్లాం వాదులు కొందరు వాటిని చేబట్టి, చివరి దాకా వాదాన్ని తెగలాగారు. సోవియట్ పండితుల భావాల్ని 1970 ప్రాంతాల్లో స్వీకరించగా, సనాతనులకు అదొక సవాల్ అయింది. అందులో వాస్తవంగా నమ్మేవారూ, మితవాద  పరిశోధకులూ ఉన్నారు. మత దండయాత్రలవరకూ యూదు వాదానికి ఇస్లాంకూ తేడా విడమరచి చూడజాలమని ఎన్.ఎ.మొరోజోల్ చెప్పారు. ఆ తరువాత ఇస్లాంకు స్వతంత్ర స్వభావం వచ్చిందన్నారు. మహమ్మద్ తొలి ఖలీఫాలు మిథ్యాపురుషులన్నాడు. 1930లో క్రీస్తు పుస్తకంగా వెలువడి మొరోజోల్ వాదనల సారాంశంగా స్మిర్ నోవ్ ఇలా రాశాడు.
      మక్కా సమీవంలో ఎర్ర సముద్రం చెంత హఠాత్తుగా తలెత్తిన అరియనిజం ద్వారా మధ్య యుగాలలో ఇస్లాం వచ్చింది. బై జాంటైన్ భావచ్ఛేదాన్ని పోలిందే ఇది. 11వ శతాబ్దం వరకూ ఖురాన్ రాస్తూ పోయినట్లు లక్షమతాల సృష్టికి సమర్థత గలదిగాదు. మామూలు నాగరికతలకు అది చాలా దూరం. మధ్యయుగాలలో ఆరియన్ ఇస్లాం వాదులు, అగర్స్, ఇస్మాయిలైట్స్, సారసిన్స్ గా చలామణి అయ్యారు. మత యుద్ధాలు జరిగేటంత వరకూ వీరికీ యూదులకూ తేడాలేదు. క్రీస్తు, వారి దేవదూతలవలె, మహమ్మద్ అతని తక్షణ వారసులు సందేహించదగినవారే. (స్మిర్ నోవ్, రష్యా అండ్ ఇస్లాం 1954 లండన్, పుట 48)
విమర్శల మధ్య మహమ్మదు గాథ
      మోరోజోవ్ భావాలు కేంబ్రిడ్జి ఇస్లాం వాదుల అభిప్రాయాల్లో పోలిక ఉన్నది. మోరోజోవ్ ప్రభావంలో మహమ్మద్ ఉన్నాడా ? (1930) అనే వ్యాసాన్ని క్లిమోవిచ్ ప్రచురించాడు. మహమ్మద్ జీవితాన్ని గురించిన సమాచారమంతా అలస్యంగా లభించిన ఆధారాలతో కూడిందేనన్నారు. ప్రతి మతానికీ స్థాపకుడుండాలి. గనుక అతన్ని అట్టి పెట్టారేగాని మహమ్మదు కల్లబొల్లి కబుర్లేనన్నాడు. యూకుత్తులూ, బురియత్తులూ, అల్లాయిలూ దైవత్వాన్ని సమనులకు ఆపాదించినట్లే మహమ్మద్ కథకూడా వ్యాపించిందని టాలస్టాయ్ పేర్కొన్నాడు. నాడు రాజకీయ ముఠాగా వ్యాపారస్తులూ, సంచార దళాలూ, రైతులు విచ్ఛిన్నంగాకుండా ఆపటానికి ఆ భ్రమ కొంతవరకూ సామాజిక ప్రయోజనాన్ని సమకూర్చిందన్నాడు. ఫ్యూడల్ సంపన్న వర్గాల అధికారం కొత్తగా అమలులోకి వచ్చింది. మహమ్మదు గాథను షామనిజంతో విన్నికోవ్ పోల్చాడు. ఆదిమ మాంత్రిక దృక్పథం ఉన్న తీరును పేర్కొంటూ మహమ్మదుపై నీటిని పోయటం వంటి క్రతువుల్ని ఉదహరించాడు.  (స్మిర్ నోవ్, పుట 48, 49) లండన్, 1954, రష్యా అండ్ ఇస్లాం) చారిత్రక జీవిత చరిత్రలకు కాటాని లామెన్స్ చేసిన సేవల్ని, హాదిత్స్ అధ్యయనంలో ఇగ్నాజ్ గోల్డ్ జీహర్ చేశాడు. ఇస్లాం అధ్యయనంలో గోల్డ్ జీహర్ ప్రభావం విపరీతంగా ఉన్నది. హర్ గ్రోంజే, నోల్డెక్ ఆధునిక ఇస్లాం అధ్యయనానికి పితామహులవంటివారు. అలాగే గోల్డ్ జిహర్ కూడా. ప్రపంచ వ్యాప్తంగా అతను రాసింది విశ్వ విద్యాలయాలలో చాలా శ్రద్ధగా చదువుతున్నారు.  (1870-1920 మధ్య రచనలు) హాదిత్స్ పరిణామం గురించి గోల్డ్ జిహర్ ప్రచురించిన వ్యాసంలో  హాదిత్స్ లోని చాలా భాగాలు నిశిత పరిశీలన చేసిన ముస్లిం సంకలనాలలో సహితం 8, 9 శతాబ్దాల నుండి చౌర్యం చేసినవే నన్నాడు. దీని ఫలితంగా వాటిని సమర్థించే ఇస్నాద్ లు అన్నీ కల్పితాలే. (హంఫ్రీ. పుట. 83, ఇస్లామిక్ హిస్టరీ, ప్రిన్ స్టన్ 1991)
      గోల్డ్ జిహర్ నిర్దుష్టంగా ఆధారాలతో వాదన చేసినందున చరిత్రకారులు కలవరం చెంది, సందేహవాదాన్ని దూరంగా అట్టిపెట్టడానికి వక్రమార్గాలన్వేషించారు. చట్టబద్ధమైన వాటికీ, చారిత్రకమైన సంప్రదాయాలకూ, తాత్కాలిక తేడాలున్నాయన్నారు. లాంఛనప్రాయమైన నిర్మాణంలో హీదిత్స్ కు, చారిత్రక సంప్రదాయాలకూ పోలిక ఉన్నదని హఫ్రీ సూచించాడు. (పుట 83, ఇస్లామిక్ హిస్టరీ 1991) 8, 9 శతాబ్దాల ముస్లిం పండితులు ఈ రెండు రకాల గ్రంథాలను రాశారు. మొత్తం మీద హాదిత్స్ ఇస్నాద్ లను సందేహిస్తే, చారిత్రక నివేదికలకు అనుబంధంగా ఉన్న ఇస్నాద్ లను కూడా అనుమానించాల్సిందే.
     
ఇస్లాం చారిత్రక, సామాజిక అభివృద్ధిలో హదిత్స్ పాత్ర
            గోల్డ్ జిహర్, హాదిత్స్ లు తెచ్చిపెట్టిన సందేహవాదానికి సన్నిహితుడయ్యాడు. (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్, రెండవ సంపుటి. పుట. 19, అనువాదం సి. ఆర్. బార్బర్, ఎస్.ఎం.స్టెర్న్, లండన్ 1967-71) మొదటి రెండు శతాబ్దాల ఇస్లాం చారిత్రక, సామాజికాభివృద్ధిలో భాగంగా హాదిత్స్ రూపొందిందన్నారు. శాస్త్రీయమైన చరిత్రకు ప్రాతిపదికగా హాదిత్స్ పనికిరాదన్నాడు. తొలి ముస్లిం సమాజానికి ప్రతిబింబంగా కొన్ని ధోరణులు పరిశీలించటానికి మాత్రమే ఇది పనికి వస్తుందన్నాడు.
      గోల్డ్ జిహర్ వాదనలు సరిగా అవగాహన చేసుకోవడానికి, చారిత్రకంగా కొంచెం పక్కకు పోయి చూడాలి. ప్రవక్త మరణానంతరం ముస్లిం సమాజానికి నాయకులుగా ఆయన అనుచరులు నలుగురు బయలుదేరారు. అందులో చివరివాడు అలీ, అతను ప్రవక్తకు అల్లుడు. అలీకి వ్యతిరేకంగా సిరియాలో గవర్నర్ మావియా యుద్ధ నినాదం చేశాడు. అలీ తన పెత్తనాన్ని సిరియాపై సాగించలేకపోయారు. (మావియా, ఉత్తమన్ సంబంధీకులు, ఉభయులూ మక్కా ఉమయ్యా తెగకు చెందినవారు.
      సిఫిన్ వద్ద ఉభయ సైనికులూ తారసిల్లి ఎటూ తేలని పోరాటం సాగించారు. 661లో అలీ హత్యానంతరం ఉమాయద్ సామ్రాజ్యానికి తొలిసారిగా ఖలీఫా మావియా వచ్చాడు. 750 క్రీ.త. వరకూ అది కొనసాగింది. అప్పుడు అబ్బాసిద్ధులు వచ్చి 13వ శతాబ్దం వరకూ ఇరాక్, బాగ్దాద్లో కొనసాగారు. ఉమాయద్ రాజ్యం తొలి దశలో కర్మకాండలూ, సిద్ధాంతాల గురించి చాలామంది ముస్లింలకు బొత్తిగా తెలియదు.  మతం పట్ల పాఠకులకే ఏమంత ఉత్సాహం లేకపోగా సన్యాసులూ పవిత్రులమంటూ సిగ్గు లేకుండా సమాజ క్షేమం కోసం కొన్ని సంప్రదాయాలు అల్లి వాటన్నిటినీ ప్రవక్తకు అంటగట్టారు. దేవుడు పై నమ్మకం లేని ఉమాయద్ లను వ్యతిరేకించినా బయటపడలేక ప్రవక్త కుటుంబాన్ని పొగడుతూ సంప్రదాయాలల్లి అలీ మద్దతుదార్లకు పరోక్షంగా బాసట కల్పించారు. గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. (ముస్లిం స్టడీస్, సంపుటి-1, లండన్, 1967-71, పేజీ, 19) పాలకవర్గాలు ఆదర్శవంతంగా లేవు. ప్రజలు గుర్తించే అభిప్రాయాలను ప్రవేశపెట్టాలంటే పవిత్ర వర్గాల వ్యతిరేకతను అణచివేయాలంటే, తమకు అనుకూలమైన హాదిత్స్ ను కనుగొనాలని భావించారు.  శత్రువులు చేసినపనే వారూ చేస్తూ హాదిత్స్ లు సృష్టించారు. అధికారికంగా అణచివేశారు. మువాయియా తన నమ్మిన బంటు. గవర్నర్ అల్ ముఘీరాకు ఉత్తరువులిస్తూ ఉమాయద్ ల ధోరణిలో కొన్ని సూచనలు చేశాడు అలీని అవమానించటంలో, దూషించటంలో అలసిపోవద్దు. అలీ సహచరులపై బురద చల్లాలి. ఉత్మన్ పై ప్రభువు దయకై ప్రార్థించాలి. ఉత్మన్ తెగను సన్నిహితుల్ని చేసుకోవాలి. అలీకి వ్యతిరేకంగా హడిత్తులు వ్యాపింప చేయటానికి ఇదొక కొత్త్ రకమైన ప్రోత్సాహక చర్య, ఉమాయద్దులూ వారి రాజకీయ అనుచరులూ పవిత్రమతం పేరిట అబద్ధాలు వ్యాపింపజేసి నీతి బాహ్యంగా ప్రవర్తించారు. వారి పెత్తనాన్ని పవిత్రులకు వ్యతిరేకంగా వ్యాపింపజేయడానికి ఎంతకైనా సిద్ధపడ్డారు. (గోల్డ్ జిహర్, పుట 44, ముస్లిం స్టడీస్)
      ఎందుకూ కొరగాని క్రతువులకు సహితం హాదిత్స్ లు అంటగట్టారు. ప్రత్యర్థులకూ వారి రాజ్యానికి సంబంధించిన అనుకూల వచనాలు అణచి వేయటానికి అనేక ధోరణుల అవలంబించారు. అబ్బా సిద్ధుల ఆధ్వర్యాన హాదిత్స్ చిలవలు పలవలుగా అల్లారు. తమ రాజ్యహక్కును వ్యక్తం చేయటానికి అలిద్దులను వ్యతిరేకించటానికి అలాంటి పని చేశారు. అలీ తండ్రి అబుతాలిబ్ నరకంలో కూర్చున్నాడని ప్రవక్త చేత చెప్పించారు. వునరుత్థానం నాడు నాజోక్యంతో అతన్ని కొంతమేరకు బయట పడవేయగలిగితే అప్పటికీ మెదడు కాలిపోయేటంత వేడి ఉండనే ఉంటుందని చెప్పించారు. దీనికి వ్యతిరేకంగా అలిద్ మతవాదులు అబూతాబిన్ ను దివ్యంగా పొగిడే సంప్రదాయాలను ప్రవక్తచే  చెప్పించారు. గోల్డ్ జిహర్ చూపించినట్లు ప్రత్యర్థులు కావాలని ఈ సంప్రదాయాలను దురుద్దేశ పూర్వకంగా కల్పించారు. (గోల్డ్ జిహర్ పుట. 108, ముస్లిం స్టడీస్)
      కథలల్లేవారు ఇలా హాదిత్స్ ను  సృష్టించి బాగా బతుకుతెరువు జరుపుకున్నారు. జనం వాటిని యథాశక్తి పలికారు. శూన్యం నుండి సృష్టించి జనాకర్షణ కల్పించారు. హాదిత్ సృష్టి వ్యాపార స్థాయికి దిగజారింది. హాదిత్స్ అన్వేషణ చేస్తూ మూలాధారాలకు పోతున్నామని కొందరు ధనార్జన చేసి అవరసరాన్ని బట్టి గిట్టుబాటు చేసుకున్నారు. (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్. పుట. 169)
      చాలామంది ముస్లింలకు ఈ చౌర్యాల సంగతి తెలుసు. హడిత్తుల అధికారిక ఆరు సంకలనాలూ అల్బుఖారీ, ఇతరులూ చేసినప్చటికీ అవి ఆశించినంత నిర్దుష్టంగా లేవు. ఏది సరైన హాదిత్స్ అనేది నిర్ధారించడానికి ఆరుమంది ప్రమాణాలు భిన్న తీరులలో ఉన్నాయి. కొందరు గిరిగీసుకోగా మరికొందరు ఉదారంగా వ్యవహరించారు. ఈ సంకలన కర్తల ప్రామాణికత ఉండనే ఉన్నది. ఒక సందర్భంలో బుఖారీ పాఠాంతరాలు 12 ఉన్నాయి.  ఈ వైవిధ్యం మాట అలా ఉంచి కావాలని చేర్చిన ప్రక్షిప్తాలూ ఉన్నాయి. గోల్డ్ జిహర్ ఇలా వాదించాడు. బుఖారీ, ముస్లిం ఇబ్న అల్ హజాజ్ సంకలనాలు పాండిత్య పరిశోధన వలన తిరుగులేని నిర్దుష్టత వలన సమకూడినవి కావు. (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్, పుట 236) హజాజ్, బుఖారీ పుస్తకాలలో 200 సంప్రదాయాలు చేర్చినట్లు 10వ శతాబ్దపు విమర్శకుడు పేర్కొన్నాడు.
ప్రవక్త మరణానంతర పరిస్థితులపై ఇస్లాం వాది జోసఫ్ షాట్ విశ్లేషణ
      గోల్డ్ జిహర్ వాదనల తరువాత 60 ఏళ్ళ అనంతరం జోసెఫ్ షాట్ అనే ఇస్లాం వాది అలాంటి ప్రతిపాదనలు కొన్ని బయటపెట్టాడు. అతడి నిర్ణయాలు ఇంకా సమూలంగానూ, కలవర పరిచేవిగానూ ఉన్నాయి. వాటి ఫలితాలు చూడవలసి ఉన్నది. హంఫ్రీ వాటిని పేర్కొంటూ, షాట్ సిద్ధాంతాలు వివరించాడు. (1.8వ శతాబ్దం మధ్యలో అబ్బాసిద్ విప్లవ కాలంలో ఇస్నాద్ వాదనలు ప్రవక్తకు అంటగట్టాడు. 2. ఇస్నాద్ సరిగా ఉందంటేనూ, విపులీకరీస్తేనూ, అది అంత తప్పుడుదని భావించాలి. ఉన్న హడిత్ ఏదీ కూడా ప్రవక్తకు అంటగట్టడానికి వీలు లేదు. కొన్ని అతడి బోధనలకు మూలం అయితే కావచ్చు. షాట్ చారిత్రక నివేదికల గురించి తొలి ఖలీఫాల ప్రస్తావనలు పరిమిత పుటలలో పేర్కొన్నా, వారికి కూడా అదే నిషేధాజ్ఞలు వర్తించాలన్నారు.  షాట్ వాదనలు అంత సులభంగా కొట్టి పారేయటానికి వీలు లేదు. అతడిచ్చిన ఆధారాలు అంత నిర్దుష్టమైనవి.
      షాట్ తన వాదనను ఇలా ముగించాడు. (లా అండ్ జస్టిస్, కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇస్లాం, 4 సంపుటాలు, కేంబ్రిడ్జి, 1970, పుట 4-5)
      మహమ్మదీయ పండితులు పాటించే సంప్రదాయాలు తగినంత విమర్శకు గురికాలేదు. విదేశీయుల్ని పక్కన బెట్టారు. సంప్రదాయాలలో చాలామట్టుకు నిర్దుష్టం కానివే ఉన్నాయి.  చారిత్రక సంస్థ ఈ సంప్రదాయాల నుండి  అధికారికంగా రాబట్టడం, పరస్పర విరుద్ధాల మధ్య కుదరడం లేదు. గోల్డ్ జిహర్ తన మౌలిక రచనలో సంప్రదాయాల గురించి సందేహాలు వెలిబుచ్చడమే గాక ప్రవక్త పేరిట సంప్రదాయాలు సైతం, అవి పేర్కొనే కాలానివి కాదన్నాడు. అవి ఉత్తరోత్తరా ఇస్లాం తొలి శతాబ్దానికి చెందాయన్నాడు. అతడు కనుగొన్న విషయం పరిశీలనకు దారి తీసింది.
    గోల్డ్ జిహర్ కనుగొన్న వాటిని షాట్ రచన ధృవపరుస్తున్నది. అదింకా ముందుకు పోయి ఇలా పేర్కొంటున్నది. షాఫి అనంతరమే చాలా సంప్రదాయాల్ని అమలులో పెట్టారు. షాఫి న్యాయచట్టాన్ని స్థాపించిన ప్రముఖుడు. అతడు క్రీ.త. 820లో మరణించాడు. 8వ శతాబ్దం మధ్య కాలానికి ముఖ్యమైన ప్రవక్త చట్టసంప్రదాయాలు వచ్చాయి. అతని సహచరుల, తదితర సంప్రదాయాలు  ఇంచుమించు అప్పుడే వచ్చాయి. అవన్నీ మార్పులకు గురైనవే. ఇస్నాద్ లను గమనిస్తే వెనక్కు నడిచే ధోరణి కనిపిస్తుంది. ప్రవక్త వరకూ చేర్చే సంప్రదాయాలకు బాగా అధికారిక స్వభావాన్ని సమకూర్చుతూ పోయారు. చట్ట సంప్రదాయాలు క్రీ.త. 718 ప్రాంతాలకు చెందినవే.
    సంప్రదాయం ఒకానొక కాలానికే పరిమితం కాదని  షాట్ చెప్పాడు. చట్ట వాదనలో అది తప్పనిసరి అని చూపలేదన్నాడు. ప్రవక్త నుండి వచ్చిందన్న చట్ట సంప్రదాయం అధికారికమైంది కాదనీ, కట్టుకథగా అది తరువాత పుట్టిన విషయం అనీ షాట్ రాశాడు.
      సూటిగా అధికారికమని పరిగణించే సంప్రదాయం ఏదీ ప్రవక్త నుండి వచ్చిన దాఖలాలు లేవు.  (షాట్, పుట 4-5, లా అండ్ జస్టిస్, కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం. 4 సంపుటాలు, 1970, కేంబ్రిడ్జి)
      విరుద్ధ సిద్ధాంతాన్ని, ఆచారాన్ని ఖండించడానికి, వాదోపవాదాలతో సంప్రదాయాల్ని రూపొందించారు.  ఇవి ప్రత్యర్థి సంప్రదాయాలని షాట్ పేరు పెట్టాడు. వాదనల మధ్య ఈ సిద్ధాంతాలకు ఉన్నత ఆధికారికత అంటగట్టారు. ప్రవక్త వారసుల సంప్రదాయాలు, ప్రవక్త సంప్రదాయాలుగా మారాయి. చట్ట సిద్ధాంతాలను సమర్థించుకోడానికి ప్రవక్త జీవితంలో కొన్ని సృష్టించారు.
      అజాగ్రత్తగా సమకూర్చిన ఇస్నాద్ లను షాట్ విమర్శించడు. ప్రాచీన ఆధికారిక విషయంగా చూపదలచిన ముఠా, తమ వాదనలను ఎంపిక చేసి, ఇస్నాద్ లన్నారు. ఒకే తీరులో కనిపించే ఇస్నాద్ లకు ప్రత్యామ్నాయ పేర్లుండడానికి ఇదే కారణం.
      ప్రవక్త మరణానంతరం ఒక శతాబ్దానికి మించి ఇస్లాం సంప్రదాయంలో ఇస్లాం చట్టారంభాన్ని చూడలేమని షాట్ అన్నాడు. (క్రోనే. పుట. 7, రోమన్, ప్రోవిన్షియల్ ఇస్లామిక్ లా ? కేంబ్రిడ్జి, 1987) షాట్ విశ్లేషణ సక్రమంగా ఉందని కొందరు పండితులు గ్రహించారు. షాట్ వాదనల ఫలితాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. జాన్ వాన్స్ బ్రో అందులో ఒకరు. ఆయన రెండు రచనలు వెలువరించారు. ఖురానిక్ స్టడీస్ (1977), సక్టేరియన్ మిలూ (1978) ఇవి జటిలమైనవి. ముఠా తగాదాలలో ఖురాన్, హడిత్ లు జనించాయని, ఇవి రెండు శతాబ్దాలకు చెందిన వివాదాలనీ అన్నాడు. తరువాత అరబ్బు దృష్టితో జనించినట్లు చూపారన్నాడు.
      (హంప్రేస్ పేజి. 84, ఇస్లామిక్ హిస్టరీ, ప్రిన్స్ టన్ 1991)
      రాబై యూదు ప్రభావంతో, సంబంధాలతో ఇస్లాం ఆవిర్భవించిందన్నాడు. రాబై యూదు నమూనాలో మహమ్మద్ రూపం, ఇస్లాం సిద్దాంతాలు వచ్చాయన్నాడు. ఈ నిర్ణయాల ఆధారంగా విశ్లేషణ చేస్తే, పాత నిబంధనలోని విమోచన చరిత్రకు బాహ్యరూపంగా ఇస్లాం చరిత్ర కనిపిస్తున్నది.
     
ఖురాన్ ఆధారాల సేకరణ
      ఖురాన్ కు సంబంధించి సంప్రదాయ ఆధారాలు చూస్తేగాని వాన్స్ బ్రో వాదనలు అవగాహనకావు. కాని ఏ ఒక్క సంప్రదాయమూ లేదు. అసంబద్ధమైన అనేక సంప్రదాయాలున్నవి.  ఒక సంప్రదాయం ప్రకారం అబు బకర్ ఖలీఫా (632-634) అనంతరం ఖలీఫాగా ఉమర్ రావలసి ఉంది. ఖురాన్ కంఠస్తం చేసిన అనేకమంది ముస్లింలను యమామ యుద్ధంలో మధ్య అరేబియాలో హతమార్చారు. అంతకుముందే ఖురాన్ సేకరించి భద్రపరచి ఉంటే తప్ప, ఖురాన్ లోని కొన్ని భాగాలు శాశ్వతంగా పోయి ఉంటాయి. ఉన్నవాటిని దాచడానికి అబూబకర్ అనుమతించాడు. ప్రవక్త మాజీ కార్యదర్శి జయద్ ఇబ్న తాబిత్ కు ఆ పని పురమాయించాడు. కొరాన్ కు సంబంధించి, ఆకుల మీద, రాళ్ళమీద, తాళపత్రాలపైనా, జంతువుల పక్క ఎముకల మీద, తోళ్ళపైన, చెక్కలపైనా రాసినవి. కంఠస్తం చేసిన జ్ఞాపకాల ఆధారంగా ఖురాన్ సేకరించనారంభించాడు. అలా చేసిన తరువాత, అబూబకర్ కు అప్పగించారు. అతడు చనిపోతూ ఉమర్ కు అందించాడు. అతడు తన కుమార్తె హప్సకు అప్పగించాడు. దీనికి సంబంధించి భిన్న పాఠాలు ఉన్నాయి. ఖురాన్ సేకరణకు కొందరు ఉమర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. మరికొందరు 4వ ఖలీఫా అలీకి ఇచ్చారు. చనిపోయిన వారికి ఖురాన్ కంఠస్తం వచ్చనే దాఖలాలు లేవు. రెండేళ్ళలో అంత బృహత్తర కృషి పూర్తి కావడం దుర్లభం అబూబకర్ ఖురాన్ కు అధికారికత ఉందనే ఆధారాలు లేవు. వేరే రాష్ట్రాలలో ఇతర ఖురాన్ సంకలనాలు అధికారికాలన్నారు.  భద్రపరిచే నిమిత్తం అధికారిక ప్రమాణ ప్రతి ఖురాన్ ఉమర్ కుమార్తెకు ఇచ్చి ఉండకపోవచ్చు. అబూబకర్ ఆధ్వర్యాన ఖురాన్ సేకరణ, కల్పితం కావచ్చు. 3వ ఖలీఫా ఉత్మన్ శత్రువులు ఈ కథను ప్రచారంలో పెట్టి ఉండొచ్చు. తొలి సంకలన ఖ్యాతి ఆయనకు దక్కకుండేందుకు ఇలా చేసి ఉంటారు.
      సంప్రదాయం ప్రకారం తరువాత చర్య ఉస్మాన్ (644-656) చేబట్టాడు. ఖురాన్ సరైన పాఠం గురించి సైనికులలో తగాదా వచ్చిన దృష్ట్యా, ఉత్మన్ సైనికాధిపతులు ఈ సంకలనం చేయవలసిందిగా ఖలీఫాను కోరారు. జయద్ ఇబ్న తాబిద్ అధికారిక ఖురాన్ పాఠం సిద్ధం చేయాలని ఉస్మాన్ పురమాయించాడు. జయద్ జాగ్రత్తగా ఖురాన్ తిరగ రాశాడు. ఉమర్ కుమార్తె వద్ద్ ఉన్న పత్రాలతో పోల్చి చూశాడు. జటిలంగా తోచిన చోట, ప్రవక్త తెగ ఖురాయిష్ ల భాషను అనువసరించాడు. కొత్త ప్రతిని 650-656 (ఉస్మాన్ మరణించిన సంవత్సరం) పూర్తిచేసి, కూఫ, బస్రా, డమాస్కస్, బహుశ మక్కాకు పంపిఉండొచ్చు. ఒకటి మదీనాలో అట్టిపెట్టారు. మిగలినవన్నీ తగులబెట్టామన్నారు. ఇదంతా కూడా విమర్శకు గురి కావలసిన విషయమే. ఉమర్ కుమార్తె హప్స వద్ద్ ఉన్న పత్రాలు ఎలాంటివో తెలియదు.ఎందరు ఈ సేకరణలో కృషి చేశారో స్పష్టత లేదు. ఖురాన్ లో ఉన్న అరబిక్ ఒక డయలెక్ట్ కాదు. ఇలాంటిని ఎన్నో ఉన్నవి.
      ఏమైనప్పటికీ ఈ చివరి సంప్రదాయం ఆధిక్యతలోకి వచ్చింది. మైకెల్ కుక్ చెప్పినట్లు వాస్తవం బహుశ బయటి ఆధారాలతోనూ, వదిలేసిన సంప్రదాయాల్లోనూ ఎక్కడో ఉండి ఉంటుంది. అధికారికంగా ఎంపిక చేసింది మాత్రం నిరంకుశమే. (కుక్, పుట. 68, మహమ్మద్, ఆక్స్ ఫర్డ్ 1983).
      నేటి సనాతన ముస్లింలకు ఖురాన్ అంటే 7వ శతాబ్దంలో ఉత్ మన్ ఆధ్వర్యాన లభించినదే. ఉత్ మన్ సేకరించిన ఖురాన్ ఎలాంటి మార్పులు చేయకుండా అట్టిపెట్టి వెలువరించినట్లు, అందువలన ఇది అందరూ ఆమోదిస్తున్నట్లు చెబుతారు. దీనిలో చారిత్రక ఆధారం కంటే మొండి వాదనే ఎక్కువ. (ఖురాన్ పై ఆడమ్స్ వ్యాసం, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్).
      లోగడ సంప్రదాయాలను వాన్స్ బ్రో కొట్టిపారేశాడు. 7వ శతాబ్దంలో ఖురాన్ లభించలేదని, 9వ శతాబ్దం వరకూ ఖురాన్ ప్రమాణ ప్రతి సాధించలేదనీ అన్నాడు. ఇస్లాంకు అరేబియన్ మూలం ఉందనటం సరికాదు. అరబ్బులు హిజాజ్ వెలుపల మక్కా మదీనాలలో యూదులతో సంబంధం వలన తమ శాఖను రూపొందించుకున్నారు.
      యూదు క్రైస్తవ గ్రంథాలతో సుపరిచితం వలన కొరాన్ లో పాఠాంతరాలు ఉన్నట్లు ద్యోతకమవుతుంది. వీటిని కలిపి చూస్తే, సందర్భానుసారాలూ, ఉన్నది ఉన్నట్లు తిరిగి చెప్పటం, వాదోపవాదాల శైలి గమనిస్తే ముఠా వాతావరణం అలముకొని ఉన్నట్లు, అంతగా ప్రచారంలో లేని సిద్ధాంతాన్ని అమలు పెట్టినట్లు తెలుస్తుంది.  (వాన్స్ బ్రో ఖురానిక్ స్టడీస్, ఆక్స్ ఫర్డ్, 1977, పుట. 20)
      వాన్స్ బ్రో మరోచోట రాస్తూ యూదుల వాదనలు దృష్టిలో పెట్టుకుని ఖురాన్ లో 5 చోట్ల ఒకేతీరైన పాఠాన్ని లేదా ఉన్నతమైన పాఠాన్ని సృష్టించాలనే ప్రయత్నం కనిపిస్తుంది. (వాన్స్ బ్రో పుట. 79)
      రాబై సాహిత్యం నుండి ఖురాన్ లోకి వచ్చిన కొన్ని పాఠాలు దృష్టిలో పెట్టుకుని తోరే వంటి పండితులు మధ్య అరేబియాలోని హిజాజ్, యూదు జనాభాను గురించి నిర్ణయాలకు వచ్చారు. కాని వాన్స్ బ్రో. ఈ విషయమై హెచ్చరిస్తూ 6, 7 శతాబ్దాలలో హిజాజ్  చారత్రక పునర్మిర్మాణంలో రాబై సాహిత్యాన్ని అరేబియాలో ప్రస్తావించటం ఏమంత ఔచిత్యంతో కూడినది కాదన్నారు. (వాన్స్ బ్రో పుట. 51)
      రాబై రచనలతో ప్రభావిత అయిన ముస్లిం సంఘాలు మోజెస్ ను  ఆదర్శంగా స్వీకరించారు. తరువాత నెమ్మదిగా, మతావసరాల దృష్ట్యా మహమ్మదు ఆవిర్భవించాడు. మోజెస్ నమూనాలో మహమ్మద్ ప్రతిష్ఠను ప్రవక్తగా నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఇందుకుగాను ప్రమాణం చూపించే పవిత్ర గ్రంథం కావలసి వచ్చింది. క్రమేణ ఇస్లాం అరేబియాలో పుట్టిందని చెబుతూ వచ్చారు. ఇందుకుగాను అరబిక్ ను పవిత్ర భాషగా చిత్రించారు.  అరబ్బుల ప్రాచీన కవితా సంకలనాలు 9వ శతాబ్దంలో జరిగాయి. ఐతే ఈ సంకలన కర్తల దృష్టిలో ప్రతివాదం అనుకూలంగా మార్చడానికి చేసిన ప్రయత్నం తెలుస్తూనే ఉన్నది. (వాన్స్ బ్రో. పుట. 97) ఆ విధంగా ముస్లిం భాషావాదులు ఇస్లాం ముందున్న నబీఘాజాది అనే కవి రచనలకు కూడా ఖురాన్ నిర్మాణంలో ఆధారాలున్నట్లు చూపటానికి ప్రయత్నించారు. అందులో రెండు ఉద్దేశాలున్నాయి. పవిత్ర గ్రంథానికి ప్రాచీన ప్రమాణికత కూర్చడం ఆ విధంగా అధికారికతను నిర్ధారించటం ఒక లక్ష్యం. వాస్తవానికి గ్రంథాన్ని కొందరు అల్లారు. 9వ శతాబ్దం చివరలో సంప్రదాయాలు ప్రోది చేసి మద్దతు ప్రకటించారు. దీనికి అరేబియా వాతావరణం సృష్టించిన యూదులకూ, క్రైస్తవులకూ భిన్నంగా ఉండాలని ప్రయత్నించారు. ఇస్లాం మూలానికి హిజాజ్ ఆధారాలున్నాయని చూపదలిచారు. ఖురాన్ 9వ శతాబ్దం ముందు నిర్దుష్ట రూపాన్ని దాచలేదని వాన్స్ బ్రో పరోక్ష ఆధారాలను చూపాడు.
      కొన్ని మినహాయింపులతో సమాజంలోని చట్ట నియమాలు గమనిస్తే ఖురాన్ నుండి ముస్లిం న్యాయశాస్త్రం రాబట్టలేదని తెలుస్తుంది. మినహాయింపులేవైనా ఉంటే చట్టానికి అవి ప్రమాణం కాదు. పవిత్ర గ్రంథం నుండి రాబట్టినట్లు పేర్కొన్నా అవి తొలుతనే ఉన్నాయని అనటానికి వీలు లేదు. 9వ శతాబ్దంలో మాత్రమే వవిత్ర గ్రంథం నుండి న్యాయసూత్రాలను రాబట్టారు. ఒకటవ ఫికా అక్బర్ కు ఖురాన్ లో ఎలాటి ప్రస్తావనాలేదు. ఇదొక పరోక్ష ఆధారం (వాన్స్ బ్రో, పుట. 44).
      ఫిక్ అక్బర్ సనాతనుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. ఖురాన్ అప్పటికే ఉండి ఉంటే దాని ప్రస్తావన తేకపోవటం అనూహ్యం.
      వాన్స్ బ్రో ఖురాన్ ను చాలా ఉన్నత సాంకేతిక విశ్లేషణకు గురి చేసి కొద్దిమంది దీనిని కావాలని పరిష్కరించలేదనీ, చాలాకాలం స్వతంత్రంగా పెంపొందిన పరిణామ ఫలితమేనని రాశాడు.
      వాన్స్ బ్రో ప్రవక్తకు సంబంధించి సరైన చారిత్రక సమాచారం ఖురాన్ లోనే లభిస్తుందనటం సరికాదన్నాడు. దీన్ని జఫ్రి ఇలా వ్యక్తం చేశాడు. ఖురాన్ వైపుకు పోదామని  ఈ విమర్శ ప్రధానంగా చెపుతున్నది. సంప్రదాయాలలో నిశిత పరిశీలనతో కూడిన జీవిత చరిత్రకు ఆధారం లేదు. ఖురాన్ ఇందుకు ప్రాతిపదిక. (జఫ్రి, ది క్వెస్ట్ ఆఫ్ ది హిస్టారికల్ మహమ్మద్, ముస్లిం వరల్డ్, 16, సం.4, అక్టోబర్ 1926)
      వాన్స్ బ్రో ఈ విధంగా రాశాడు. అరేబియా ప్రవక్తకు సంబంధించి ఖురాన్ పాత్ర అంతంతమాత్రంగానే ఉన్నది. అందులో పరిస్థితుల నివేదిక లేదు. కేవలం దైవసూచనలు మాత్రమే ఉన్నాయి. ఖురాన్ లో జీవిత చరిత్ర సమాచారాన్నివెతకాలనటం బాహ్యపరిస్థితుల దృష్ట్యా చేసే పని మాత్రమే. వాన్స్ బ్రో,  ఖురానిక్ స్టడీస్, ఆక్స్ ఫర్డ్, 1977, పుట 56)
      వాన్స్ బ్రో ప్రభావం కింద కొందరు పండితులు తీవ్రస్థాయికి పోయి తొలి ఇస్లాం చరిత్రలో ఇస్లాం పాఠాన్ని నిరాకరించారు. 1977, 1978 మధ్య రాసిన మైకెల్ కుక్, పెట్రీషియా క్రోన్, మార్టిన్ హింట్స్ ఇలా అన్నారు.
      అబ్దుల్ మాలిక్ కాలం వరకూ ఆధికారికంగా వచ్చిన ఇస్లాం చరిత్ర అంతా అల్లినదే. యూదు సందేశం నుండి ఉత్తేజం పొందిన అరబ్బులు ఖలీఫా వ్యవస్థనేర్చరచటం, అరబ్బు దండయాత్రలను  తిరగ రాయటం జరిగింది. ఇందులో ఇస్లాంను స్వతంత్రంగా సంస్కృతిగా ఆవిర్భవించేటట్లు చేశారు. దండయాత్రల వలన గందరగోళంగా ఉన్న అనేకమంది ప్రజలు కలిసినట్లు చూపారు. ఇందులో జాకోబైట్ సిరియన్లు, నెస్టోరియన్ ఆర్మీనియన్లు, యూదులు, కోప్టులు. అరబ్బులు ఉన్నట్లు చూపారు హంఫ్రీ, ఇస్లామిక్ హిస్టరీ, పుట. 84, 85, ప్రిన్స్ టన్, 1991)
      ఇందలి మంచీ చెడులు పరిశీలించేముందు మహమ్మద్ జీవితం, ఇస్లాం తలెత్తడాన్ని గురించి గమనించాలి. క్రీస్తు తరువాత 570లో బహుశ మహమ్మద్ పుట్టి ఉంటాడు.    ఒకప్పుడు శక్తివంతంగా గౌరవప్రదంగా ఉన్న కుటుంబం తరువాత కష్టాల్లో పడింది. అరబ్బు జాతికి చెందిన కురాయిష్ ప్రాంతంలో హాషిమ్ కుటుంబం ఇది. అనాధగా పెరిగిన మహమ్మద్ మామ అబూ తాబిన్ సంరక్షణలో పెరిగాడు. అతనితోపాటు వాణిజ్య ప్రయాణాలలో సిరియాకు వెళ్ళాడు. ఖదీజా అనే సంపన్న విధవకు వాణిజ్య ఏజెంటుగా పని చేశాడు. వ్యాపారం వర్థిల్లగా ఉత్తరోత్తరా ఆమెను వివాహమాడాడు.
దైవదూతగా మహమ్మద్
     
      హీరా పర్వతంపై సంచరిస్తుండగా మహమ్మద్ కొన్ని దృశ్యాలు చూసి దైవం తనని దూతగా పంపిందని నమ్మాడు. క్రీస్తు తరువాత 610లో తన అనుభవాలను బంధువుకూ సన్నిహిత మిత్రులకూ చెప్పాడు. 3 ఏళ్ళ తరువాత బాహాటంగా బయటపడమని దేవుడు ఆదేశించినట్లు పేర్కొన్నాడు. పేగస్ మక్కావాసులు వారి దేవుళ్ళను విమర్శించటం మొదలు పెట్టనంతవరకు సహించాడు. నాడు మక్కా వాణిజ్య కేంద్రంగా విలసిల్లి వ్యాపార కూడళ్ళను అదుపులో పెడుతుంది. సంపన్న వర్తకులు మహమ్మద్ విజయం పట్ల భయం వ్యక్తపరచి తమ జీవన విధానాన్ని అతడు విమర్శింటం నిరశించి వ్యతిరేకించాడు. మక్కావాసులతో శాంతిగా ఉండటానికి తొలుత తన ఏకేశ్వరాధనకు మహమ్మద్ కొంతవరకు రాజీపడ్డాడు. ఇదే సంఘటనను శటానిక్ వర్సెస్ లో మరొకసారి పేర్కొన్నాడు. ఇది కాఫిర్లు అల్లిన కథకాదు. అల్ తబారి.  ఇబ్నసాథ్ వంటి వారి నుండి తిరుగులేని ముస్లిం ఆధారలతో వచ్చిన కథనం. మక్కా వర్తకులతో రాజీ పడటానికి సంసిద్ధవమవుతున్న మహమ్మద్కు మళ్ళీ దైవ సందేశం అందింది. మక్కావాసుల దైవాలైన అల్-లత్, అల్-ఉజా, మనత్ లు దైవాలేనని అందలి సారాంశం. కాని అవన్నీ సైతాను ప్రవేశపెట్టినవని త్వరలోనే మహ్మద్ గ్రహించాడు. సైతాన్ భాగాలను తొలగించమని దైవ సందేశం అందింది. దేవతల్ని మాత్రం అట్టిపెట్టాలన్నారు. దేవుడికి కుమార్తెలుండడం, మానవులకు కుమారులుండడం సరైనది కాదు అన్నారు. (సుర 53.19-23) ఆ సమయంలో మహమ్మద్ నూ అతని కుటుంబాన్నీ శక్తివంతమైన వర్తకవర్గం బహిష్కరించింది. మామ అబూ తాలిబ్, భార్య ఖదీజా చనిపోయిన తరువాత మహమ్మద్కు ఆధారం పోయింది. తయిఫ్ గా తనను వాడుకోవాలని మహమ్మద్ విఫలప్రయత్నం చేశాడు.
క్రీ.త. 622లో మదీనాకు ప్రవాసం
    మదీనాను యాత్రిబ్ అనేవారు. అక్కడ నుండి వచ్చిన కొందరిని మహమ్మద్ కలిశాడు. వారి రాజకీయ సమస్యలకు అతడు తోడ్పడ వచ్చునని ప్రజలు గ్రహించారు. మహమ్మద్ నుండి ఇస్లాంను స్వీకరించి కొత్త మతాన్ని మదీనాలో బోధించారు. 622లో చాలామంది మదీనావాసులు తమ మద్దతును ప్రకటించి మహమ్మద్ కు రక్షణ కల్పిస్తామన్నారు. మక్కాలో తన అనుచరులను మదీనాకు ప్రవాసం వెళ్ళమని తానూ చివరలో వెళ్ళిపోయాడు. మహమ్మద్ ఇలా ప్రవాసం వెళ్ళటాన్ని హిజ్రా అంటారు. ముస్లిం కాలమానానికి ఇదే ప్రారంభదశ. సంప్రదాయం ప్రకారం 622 సెప్టెంబరులో హిజ్రా జరిగింది. 622 జూలై 16న ముస్లిం శకం ప్రారంభిస్తున్నట్లు ఆచరణలోకి వచ్చింది.
      మహమ్మద్ వచ్చినప్పుడు మదీనాలో 3 పెద్ద యూదు వర్గాలూ, ఎనిమిది పెద్ద అరబ్బు ముఠాలు ఉండేవి. సంవత్సరాలతరబడి వీరి మధ్య కలహాలుండేవి. 618లో పెద్ద యుద్ధానికి దారితీయగా అనేకమంది హతులయ్యారు. రాజకీయ స్థిరత్వం కోసం మహమ్మద్ మక్కా మదీనాలలోని తన అనుచరులతో ఒక సంఘాన్ని స్థాపించాడు. దీనిని ఉమ్మా అంటారు. ముఖ్య సమస్యలన్నీ తనకూ, దైవానికీ నివేదించాలన్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మదీనా రాజ్యాంగంలో పొందుపరచారు. కుక్ రాసినట్లు, ఇందులో ప్రధానాంశం యుద్ధం చేయటం.
      మదీనాలో ఆరు మాసాలు ఉన్న తరువాత సిరియా వెడుతున్న మక్కా వాణిజ్య యాత్రికులను దాడిచేసి వశపరచుకోవటం మహమ్మద్ ప్రారంభించాడు. పేగన్ పవిత్ర మాసంలో మక్కా యాత్రికులను మహమ్మద్ మనుషులు వశపరచుకున్నారు. దాడిలో చేజిక్కిన దానిలో 5వ వంతు మహమ్మద్ స్వీకరించాడు. పవిత్రమాసంలో ఇలా జరగటం మదీనా వాసులకు విభ్రాంతి కలిగించినా క్రమేణా వారి నాయకులు దాడులను సమర్థించారు.
మహమ్మద్ దాడులు
      యూదులతో మహమ్మద్ సంబంధాలు తేలిపోజొచ్చాయి. ప్రవక్తగా తనను ఆమోదిస్తారని తాను బోధించేది మోజెస్ కు భిన్నం అయింది. కాదుగనుక అలా జరుగుతుందని ఆశించారు. యూదుల ఆచారాలను చాలావరకు అతడు స్వీకరించాడు కూడా. ఐనా అతడిని నిజమైన ప్రవక్తగా వారు అంగీకరించలేదు. అంతటితో యూదు క్రైస్తవుల నుండి తెగతెంపులు చేసుకొని అబ్రహాం మత భావనను మహమ్మద్ పెంపొందించాడు. ఏకేశ్వరాధన తత్వంగల రెండు మతాలకంటే స్వతంత్ర మతంగా ఇస్లాం ఆధిక్యత వహించింది. చివరకు యూదుల్ని మదీనా నుండి వెళ్ళగొట్టడమో, హతమార్చటమో చేశారు. సంపన్న మక్కా వాణిజ్య బృందం వెళుతున్నట్లు తెలుసుకున్న మహమ్మద్ బదర్ వద్ద దాడి చేయాలని సంకల్పించాడు. మహమ్మద్ పథకం తెలిసిన మక్కావాసులు ముస్లింలకు గుణపాఠం నేర్పాలని చాలామంది సైన్యాన్ని పోగు చేశారు. అది చూచి ముస్లింలు అశ్చర్యపోయినప్పటికీ అల్లా, ప్రవక్తల ప్రేరణతో 624లో విజయం సాధించారు. చాలామందిని బందీలుగా పట్టుకున్నారు. అల్ నదర్ తో సహా ఇరువుర్ని ఉరితీశారు. అందుకు మహమ్మద్ ఉత్తరువులున్నాయి. అల్ నదర్ వినోద కథలు చెప్పి మక్కాలో  ప్రవక్త జనాన్ని పక్కదారులు పట్టించాడు. మరుసటేడు మక్కావాసులు అబూ సూఫియాన్ ఆధ్వర్యాన ఉహుద్ వద్ద జరిగిన సమరంలో ముస్లింల నోడించి పగదీర్చుకున్నాడు. రెండేళ్ళపాటు మహమ్మద్ దాడుల్ని కొనసాగించారు. మక్కావాసులు  దాడులకు సిద్ధపడ్డారు. 627లో మక్కావాసులు ఒక పక్షం పాటు ముస్లింలను చుట్టుముట్టి కందకం దాటలేక ఉపసంహరించుకున్నాడు. పర్షియన్ సాలమన్ సలహాపై ముస్లింలు కందకం తవ్వారు. మక్కావాసులు ఉపసంహరించుకోగానే మిగిలిన యూదులూ, కురాజీవారిపై మహమ్మద్ దాడి చేయాలనుకున్నా వారే లొంగిపోయారు. పురుషులందరినీ చంపేసి, స్త్రీలనూ, పిల్లలనూ అమ్మేశారు.
      628లో అల్ హుదా ఇబా వద్ద మహమ్మద్ ఒక ఒడంబడిక చేసుకొని ముస్లింలు మక్కాయాత్రకు వెళ్ళడానికి ఒప్పించాడు. అప్పటికే మక్కాను స్వాధీనం చేసుకోటానికి తగిన సత్తా మహమ్మద్ కు లభించింది. ఏమంత రక్తపాతం లేకుండానే 630లో మక్కాను చేపట్టాడు. మధ్య ఆరేబియాలో తన పెత్తనాన్ని నిలదొక్కుకోగా అరబ్బు తెగలు క్రమేణా అతని చుట్టూ చేరారు.
      632లో చనిపోయేనాటికి సంప్రదాయాల ప్రకారం మహమ్మద్ తన అధికారాన్నీ, ప్రభావాన్నీ అరేబియా వెలుపల విస్తరిస్తున్నట్లు కలలు గన్నాడు. 631లో 30 వేలమందితో, 10 వేల గుర్రాలతో తబుక్ వద్ద రోమనులపై  దాడి చేయటానికి సిద్ధ పడ్డాడు. మదీనా డమాస్కస్ మధ్య ఈ నగరం ఉన్నది. ఈ దాడి వలన ప్రయోజనం జరగలేదు. కొంత సైన్యాన్ని దుమాహ్ కు పంపగా యూదు, క్రైస్తవ తెగలు  ఖాలిద్ అనే ముస్లిం కమాండర్ కు లొంగిపోయారు. పాలస్తీనాలో రోమన్ ప్రాంతానికి సైన్యాన్నిపంపటానికి మహమ్మద్ తలపెట్టినా 632లో అతడు చనిపోవటంతో ఆ పథకం అమలు జరగలేదు.
      23 ఏళ్ళ ప్రవక్త కాలంలో మహమ్మద్ నిరంతరం దైవం నుండి ఆజ్ఞలు పొందాడు. ఇస్లాం  క్రతువులూ, విధులూ స్థాపించబడ్డాయి. కొన్నింటిని మెరుగులు  దిద్దారు. అందులో ప్రక్షాళన, ప్రార్థన, దానం, ఉపవాసం, యాత్రా ఉన్నవి దైవాజ్ఞలలో మత నియమాలూ, ఆస్తి సంక్రమణ, వివాహం విడాకులు కూడా ఉన్నవి.
మహమ్మద్ పై ముస్లిం పండితుల వాదనలు
      కుక్, క్రోస్, హిల్స్ వంటి పండితులు ఇలాంటి సంప్రదాయాలను ఆమోదించలేదు. జీవిత చరిత్ర సంప్రదాయాలను నిరాకరించటానికి కుక్ కారణాలు పేర్కొంటూ చిన్న పుస్తకం రాశాడు.
      8వ శతాబ్దం పండితులలో తప్పుడు సూచనలు జొప్పించటం సర్వసాధారణమయింది.  ఇబ్న ఇసాక్ అతని సమకాలీనులు నోటిమాటగా సంప్రదాయాలను రాబట్టారు. ఈ ప్రతిపాదనలన్నీ నిరంకుశాలే. అనేక పిడివాదాలూ, చట్టాలూ వాడుకలో పెట్టిన వారి పేర్లు కూడా సరైనవి కావు.  8వ శతాబ్దంలో నోటి మాట సంప్రదాయాన్ని రాయవచ్చునా అనే వాదన కూడా ఉన్నది. ఆధారాలను ఎంత వరకు నమ్మవచ్చు అంటే పరోక్ష సమాధానమే వస్తున్నది. అధికారికంగా ప్రస్తావించిన వారిని నమ్మజాలనప్పుడు వాటికి సంబంధించిన సాక్షులు ఉన్నారనలేము. మహమ్మద్ జీవిత విషయాలు నోటిమాటగా ఒక శతాబ్దం పాటు వ్యాపించిన తరువాత రాస్తే సహజంగా అనేక మార్పులు గురికావటం సత్యం (కుక్, మహమ్మద్ పుట. 65, ఆక్స్ ఫర్డ్, 1983)
      ముస్లిమేతరుల ఆధారాలను కూడా కుక్ పరిశీలించాడు. ఇందులో గ్రీక్, సిరియా, ఆర్మీనియా మూలాలు ఉన్నాయి. అప్పుడు అనుకోని పరిణామం సంభవించింది. మహమ్మద్ అనే వ్యక్తి ఉన్నాడనీ, అతడు వర్తకుడనీ 622లో ప్రధానఘట్టం జరిగిందనీ, అతడి బోధనలలో అబ్రహాం కీలక స్థానాలలో ఉన్నాడనీ, అరేబియా మారుమూలల్లో మహమ్మద్ పేరు వినలేదనీ, మక్కా ప్రస్తావన లేదనీ, ఏడవ శతాబ్దం చివర వరకూ ఖురాన్ రంగంలోకి రాలేదనీ తెలిసింది. అంతేగాక ముస్లింలు మక్కాకు ఉత్తరంగా తిరిగి ప్రార్థనలు చేసినందున అప్పటికి మక్కావారి పవిత్ర స్థలం కాదు. ఖురాన్ లో తొలి ప్రస్తావనలు నాణాలపై, శాసనాలపై 7వ శతాబ్దం చివరలో కనిపించినప్పుడు ప్రమాణ గ్రంథానికి భిన్నమైన పాఠాలు ఇందులో ఉన్నవి. విషయాన్నిబట్టి చూస్తే ఇవి స్వల్ప తేడాలే అయినా ప్రమాణగ్రంథం అప్పటికే గిడసబారిందనటానికి ఇదొక ఉదాహరణ (కుక్. పుట 74)
      మహమ్మద్ ను గురించి ప్రస్తావించిన తొలి గ్రీక్ ఆధారాన్నిబట్టి 634లో అతడు ఉన్నట్లు పేర్కొన్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇది అతని మరణానంతరం రెండేళ్ళ తరువాత అని తెలుస్తుంది. యూదులతో మహమ్మద్ తెగతెంపులు చేసుకున్నట్లు ముస్లిం ఆధారాలు చెపుతున్నాయి. కాని,
      660లో ఆర్మీనియన్ వివరాల ప్రకారం మహమ్మద్ స్థాపించిన సంఘంలో ఇస్మాయిలైట్లు (అరబ్బులు), యూదులూ ఉన్నారు. ఉభయులకూ అబ్రహాం వారసత్వం ప్రాతిపదిక. వీరు పాలస్తీనాను జయించటానికి పూనుకొన్నారు. ప్రాచీన గ్రీకు ఆధారాన్నిబట్టి సారసిసుల (అరబ్బులు) మధ్యప్రవక్త ప్రకటిస్తూ యూదు దేవదూత వస్తున్నట్లు చెప్పాడన్నారు. యూదులతో సారసిసులు కలిసే ప్రస్తావన ఉన్నది.  అలాంటి యూదుల, సారసిన్లకు రానున్న ప్రమాదాన్ని గూడా చూపారు. దీనికి హీబ్రూ ఆధారాలున్నందున క్రైస్తవుల సృష్టిగా కొట్టి పారేయడానికి వీలు లేదు. జెరూసలేంను అరబ్బులు దాడిచేసి జయించిన తరువాత యూదులతో తెగతెంపులు జరిగినట్లు ఆర్మీనియా వివరణ చూపుతున్నది. (కుక్, పుట. 75-76)
    ముస్లిం సంప్రదాయాలలో పాలస్తీనా కొంత ప్రాధాన్యత వహించినా హిజ్రా రెండవ సంవత్సరంలో మక్కాకు అనుకూలంగా పాలస్తీనాను తగ్గించి జెరూసలేం వైపుకు కాక మక్కావైపుకు తిరిగి ప్రార్థన చేయాలని మహమ్మద్ సూచించాడు. అప్పటి నుండి మక్కా కేంద్రస్థానంలోకి వచ్చింది. ముస్లిమేతర ఆధారాలతో అతని ఉద్యమానికి ప్రధానదృష్టి పాలస్తీనా కాగా, మత దృష్టితో దానిని జయించాలనుకొన్నాడు. ఆర్మీనియన్ పట్టికలో ఇందుకు వేరే హేతువులు కూడా ఇచ్చారు. అబ్రహాం సంతతి అయిన అరబ్బులు, అబ్రహాంకు దేవుడు ఇస్తానన్న భూమిలో భాగం ఉందని మహమ్మద్ చెప్పాడు. ముస్లిం ఆధారాలలో వలె ఆర్మీనియా వివరాలలోనూ అబ్రహాం మతం మహమ్మద్ బోధనలలో ప్రధానపాత్ర వహించింది. ఐతే దీనికి భౌగోళిక తిరకాసు కల్పించారు.
      అలాంటి విషయాలలో బాహ్య ఆధారాలు సరైనవైతే సంప్రదాయం తప్పుగా భావించవలసి వస్తుంది. మహమ్మద్ జీవితం, ఖురాన్ సందేశం అనుమానాస్పదాలవుతాయి. ముస్లిం ఆధారాలను గురించి పైన పేర్కొన్న వివరణ చూసిన తరువాత అలాంటి నిర్ణయానికి రావటం సహజమే. ఏమైనా రాబట్టిన అంశాలు క్రమంగా మాత్రం లేవు. (కుక్ పుట. 76-82)
      ముస్లిం విశ్వాసాలు, ఆచారాలకు సమరిటన్లకూ పోల్చి కుక్ కొన్ని విషయాలు చెప్పాడు. అబ్రహాం మతాన్ని గురించి మహమ్మద్ చెప్పిన ప్రధాన అంశాలు యూదుల రచనలో ఉన్నాయి. (140-100 క్రీ.వూ.) దీనిని జూబిలీ గ్రంథం అంటారు. ఇస్లాం భావాలపై దీని ప్రభావం ఉన్నది. 5వ శతాబ్దంలోని క్రైస్తవ రచయిత సోజోమినస్ రాస్తూ ఇస్మాయిలైట్ ఏకేశ్వరాధనవాదం వంటిదే మోసెస్ కాలం నాటి వరకూ హిబ్రూలోనూ ఉన్నది. కాలానుగుణంగా పేగన్ పొరుగు వారి ప్రభావంలో ఇస్మాయిల్ చట్టాలు వక్రీకరించి ఉండవచ్చు.
      అరబ్బు తెగలు తమ ఇస్మాయిలైట్ పుట్టుపూర్వోత్తరాలను యూదుల ద్వారా నేర్చుకున్నారని సోజోమెనస్ అంటాడు. ఈ ఆధారాలతో కూడా ముస్లిం సమాజంపై ప్రభావం ఉన్నట్లు కుక్ చెప్పాడు. యూదుల దైవదూత సందేశాలలో, మోజెస్ దూతగా వచ్చినట్లు స్పష్టపడుతున్నది. జనం తరలి వెళ్ళటం, అణచివేత తప్పించుకోవటానికి ఎడారిలోకి పోవటం, పాలస్తీనాను తిరిగి జయించి పవిత్ర యుద్ధాన్ని సాగించటం ఇందుకు ఉదాహరణలు. మహమ్మద్ తో యూదుల సంబంధాలు, యూదుల దైవదూత సందేశాలు గమనిస్తే రాజకీయ భావాలలో మహమ్మద్ పై ప్రభావం కనిపిస్తుంది.
      కుక్, పెట్రీషియాక్రోస్ రాసిన పుస్తకంలో ఈ భావాలను విపులీకరించారు. (ది హేగరిజం, ది మేకింగ్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్, 1977) వాన్స్ బ్రో అనుసరించిన జటిలమైన శైలిని వీరు అనుకరించారు. ఎంతో దీక్ష ఉన్నవారే ఇది చదువగలరు. అనేక ఉపమానాలు, పోలికలతో తలదిమ్మెక్కే వాదాలు ప్రవేశపెట్టారు. (హంఫ్రీ, పుట. 85, ఇస్లామిక్ హిస్టరీ) హేగరిజంలో కుక్, క్రోన్ లు చేసిన వాద  సారాంశాన్ని కుక్ రాసిన మహమ్మద్ పుస్తకంలో చూడవచ్చు. వారి వాదనలు ఇలా పట్టిక వేసి చూపవచ్చు.
1.      ఇస్లాం సంప్రదాయ చరిత్రలో సందేహవాదం.
2.      ముస్లిమేతర ఆధారాలు వాడటం
3.      యూదు-అరబ్బు సమైక్యతా, క్రైస్తవ వ్యతిరేకత
4.      తొలి ముస్లిం దండయాత్రలు
5.      యూదు వాదాన్ని వదిలివేయడం.
6.      క్రైస్తవులపట్ల సరళ ధోరణి
7.      సిద్ధాంత అక్షరాస్యత, సమరిటన్ల ప్రభావం
8.      మోజెస్ నమూనాలో అరబ్బు ప్రవక్తసృష్టి
9.      పవిత్ర మందిర సృష్టి.
10.   పవిత్ర కేంద్ర సృష్టి
            కుక్, కోన్ తరచు వాడిన హేగర్, హేగర్ వాదం, హేగరిన్ అంటే ఏమిటో పరిశీలించాలి. ఇంతకుముందు భావించిన దానికంటే ఇస్లాం తరువాత ఎప్పుడో జనించిందని వారి సిద్ధాంతంలో ఒక భాగం పాలస్తీనా, తూర్పు, మధ్య, ప్రాచ్య దేశాలలోని ప్రాచీన నాగరికతల సంబంధం వలన ఇస్లాం జనించిందన్నారు. కనుక తొలుత అరబ్బులకూ, వారి విధానాలకూ ముస్లిం, ఇస్లాం అని వాడటం సరైంది కాదు. ముస్లిం అని కాక తొలి అరబ్బు సమాజాలు తమ సొంత మతాలను పెంపొందించుకున్నాయి. వీటిని మాగరిత్, మాగ్రే అని గ్రీక్, సిరియా ప్రస్తావనలలో ఉన్నాయి. మాగ్రాయ్ అనేవారు. అబ్రహాం సంతతి గనుక హేగర్ ద్వారా  సంక్రమించటంతో హేగర్ వాదం వచ్చింది. హిజ్రాలో పాల్గొనే మొహజిరిస్ అనే అరబ్బు పదం కూడా వాడుకలో ఉన్నది. ఇజ్రాలో పవిత్ర భూమికోసం పాల్గొనే హేగరేసులనే మగరాయి అనికూడా అన్నారు. ఉత్తరోత్తరా అది ఇస్లాంగా మారింది. (హేగరిజం, కేంబ్రిడ్జి, 1977, పుట. 9)
            ఇంతకు ముందు ముస్లిమేతర ఆధారాలను అశ్రద్ధ చేయగా క్రోనే, కుక్ వంటి ఆధారంగా ఇస్లాం తలెత్తడానికి కొత్త వివరణ ఇచ్చినా ముస్లింలెవరూ దీనిని ఆమోదించడం లేదు. ముస్లిం ఆధారాలు అలస్యంగా రావటం, నమ్మటానికి వీలులేనివిగా ఉండటం వలన ఇస్లాం సంప్రదాయాన్ని ఆమోదించటానికి నిర్దుష్ట ఆధారాలు లేవన్నారు. 634-636లో వెలువడిన ఒక గ్రీకు గ్రంథంలో ప్రవక్త సందేశం యూదు దివ్య సందేశంగా ఉన్నది. యూదులు సంప్రదాయంగా భావించినట్లు ముస్లిం వ్యతిరేకులు కాదు. అరబ్బు దండయాత్రలను వారు ఆమోదించి, దివ్యవాణికి అనుకూలంగా ఉందన్నారు. క్రైస్తవ వ్యతిరేకత, యూదు-అరబ్బు సామరస్యత సాక్ష్యాధారంగా చూపారు. 660లో వెలువడిన ఆర్మీనియన్ చరిత్ర ప్రకారం మక్కా అరబ్బుల మత కేంద్రం కాదని తెలుస్తుంది. ఇందుకు బదులుగా ఉద్యమంలో పాలస్తీనా వైపుకు మొగ్గు కనిపించింది. ప్రవక్త చెప్పిన దానిలో యూదు దివ్యవాణి ఆచరణలో అరబ్బులు ఎలా పాల్గొంటున్నారో వివరణ ఉన్నది. అరబ్బులు ఇస్మాయిలైట్లుగా, అబ్రహాం వారసులుగా వచ్చారు. వారికి పవిత్ర స్థలంలో జన్మహక్కు ఉన్నది.
      మరొక వైపున ఏకేశ్వర వాదన పారంపర్యత కూడా చూపారు. (కుక్, క్రోన్, పుట. 8, హేగరిజం) ముస్లిం హిజ్రా మక్కా నుండి మదీనాకు కాక అరబ్బులు (ఇస్మాయిలైట్లు) అరేబియా నుండి పవిత్ర భూమికి ప్రవాసం పోవటంగా కనిపించింది. (మక్కా నుండి మదీనాకు అనే విషయమై తొలి ఆధారాలు ఏవీ అనుకూలంగా లేవు).
        యూదులతో కలహించిన అరబ్బులు క్రైస్తవులతో సానుకూలత చూపి రాజకీయంగా క్రైస్తవుల నుండి ప్రమాదం అంతగా లేదని గ్రహించారు. ఒకమతం కావలసి వచ్చి అబ్రహాం మతాన్ని పాటించి పేగస్ ఆచారాలను జొప్పించి కొత్త దారులు తొక్కారు. ఐనా తమకాళ్ళపై నిలిచే మతం వారికి లభించలేదు. అక్కడే సమరిటన్ల ప్రభావం వారిపై పడింది.
        సమరిటన్ల ఉదంతం స్పష్టంగా లేదు. మధ్య పాలస్తీనాలో ఇజ్రాయలైట్లుగా 722 క్రీ.పూ. ప్రాంతాలలో అసీరీయా రాజులు సమారియనులను ప్రవేశపెట్టగా వారి సంతతి పెంపొందింది. యూదుల ఏకేశ్వరాధనే సమరిటన్ల విశ్వాసం. యూదుల ప్రభావాన్ని వదిలించుకొని వీరు సొంత మత ప్రాధాన్యత పెంపొందించుకున్నారు. ఉత్తరోత్తరా అరబ్బులు చేసింది కూడా అదే. సమరిటన్లు తమ విశ్వాసానికీ, ప్రవర్తనకూ ఏకైక ఆధారంగా పెంటకాక్ ను స్వీకరించారు.
        దేవుడు ఒక్కడే అనేది సమరిటన్ల సాహిత్యంలో ఉద్భవించింది. దైవ సమైక్యత, పవిత్రత అనేవి ఈ సాహిత్యం అంతటా కనిపిస్తాయి. ఇందులో ముస్లింల విశ్వాసమే  అల్లా తప్ప మరో దేవుడు లేడనే మాటలకు పోలిక ఉన్నది. ఇస్లాంలో అది మౌలిక సూత్రం. దైవం పేరిట బిస్మిల్లా అనే ముస్లిం సూత్రం సమరిటన్ సాహిత్యంలో బషమ్ అని ఉన్నది. ఖురాన్ తొలి అధ్యాయం ఫాతిహా విశ్వాసానికి ప్రారంభదశగా పేర్కొంటారు. సమరిటన్ ప్రార్థనలో నీ ద్వారం ముందు నిలుచుని నీ దయకోసం చూస్తాము.  ఫతా అనేది పలీహా అనే మాట నుండి వచ్చింది. ద్వారం అని దీనికి అర్థం. (కుక్, క్రోస్ పుట. 14)
        సమరిటన్ల పవిత్రగ్రంథం పెంటకాక్ దేవుని మాటలతో ఉన్నందున చాలా పవిత్రంగా చూస్తారు. మహమ్మద్ కూడా పెంటకాక్ కీర్తనల గురించి తెలుసుకున్నాడు. ప్రవక్త జ్ఞానం చారిత్రక రచనలూ అతడికి తెలియవు.
        సమరిటన్లు మోజెస్ ను ఉన్నతంగా చూశారు. అతడు ప్రవక్త  కావటం అతడి ద్వారా చట్టం వెల్లడి కావటం ఇందుకు కారణం. సమరిటన్లకు ఎహోవాను పూజించే నిమిత్తం జెరీజిం పర్వతం కేంద్రంగా ఉండేది. ఆదాం, సేత్, నోవాలకు చెందిన ఈ పర్వతం ఐజాక్ ను అబ్రహాం బలి ఇచ్చిన చోటు కూడా. దైవదూత రావటం నమ్మకానికి సంబంధించిన విషయం ముస్లిం మెహదీకి ఇందులో పోలికలున్నాయి. మోజెస్, ప్రవాసం, పెంటకాక్, సెనాయ్ పర్వతం, గెరిజిం పర్వతం, షెకెమ్.
మహమ్మద్, ఇజ్రా, కొరాన్ - హీరా పర్వతం - మక్కా
        సమరిటన్ల ప్రభావంలో అరబ్బులు మహమ్మద్ కు మోజెస్ పాత్రను ఇచ్చి హిజ్రా నాయకుడుగానూ, ఖురాన్ స్వీకరించిన వాడుగానూ అరేబియన్ పవిత్ర పర్వతం హీరాపై ఇదంతా జరిగినట్లు చూపారు.  పవిత్ర గ్రంథాన్ని సంకలనం చేయవలసి వచ్చింది. క్రోన్, కుక్ ల ప్రకారం ఖురాన్ చాలా గ్రంథాల సంకలనం. 3వ ఖలీఫా ఉస్మాన్ ఒక పుస్తకాన్నే వదిలిపెట్టి పోయాడు. చట్ట ఆధారాలకు సూరత్ అల్ బాఖరా అనే గ్రంథానికి, ఖురాన్ కూ ఒక క్రైస్తవ మత గురువు విచక్షణను చూపించాడు. 661-714లో ఇరాక్ గవర్నరుగా ఉన్న ఎజాజ్ తొలి ముస్లిం రచనలన్నిటినీ స్వీకరించి ధ్వంసం చేశాడు. వాన్స్ బ్రోను అనుసరించి క్రోన్, కుక్ లు ఖురాన్ ను గురించి ఒక చట్రం లేని అయోమయ గ్రంథంగా పేర్కొన్నారు. భాష, విషయపరంగా పట్టులేని గ్రంథంగానూ చెప్పారు. అనేకచోట్ల పునరుక్తి ఉందన్నారు. ఆలస్యంగా ఖురాన్ రాసి అసంపూర్ణంగా పరిష్కరించి అనేక సంప్రదాయాలకు కూడలిగా రూపొందించారన్నారు. (క్రోన్. కుక్ పుట 18)
        జెరూసలేం పవిత్రతను నిరాకరించిన సమరిటన్లను ప్రాచీన ఇజ్రాయిల్ పవిత్ర స్థలమైన షాకెమ్ ను స్వీకరించారు. జెరూసలేం నుండి తప్పుకున్న ముస్లింలు కొత్త పవిత్ర స్థలాన్ని ఏర్పరచుకోవటంలో షాకెమ్ ను ఉదాహరణగా తీసుకున్నారు.
        వీటి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. సమీపంలో ఒక పవిత్ర పర్వతాన్ని, ఒక పవిత్ర నగరాన్ని ఏర్పరచుకొని నగరం నుండి పర్వతానికి యాత్ర సాగించారు. అబ్రహాం వేసిన బాటలోనే అతడు బలి ఇచ్చిన స్తంభం వంటిదే కాబాలో యామని మక్కా పవిత్ర స్థలంగా ఎంచుకున్నారు. సమరిటన్లు జోసఫ్ నూ, మక్కాలో ఇస్మాయిల్ నూ స్వీకరించి వారి సమాధులను గౌరవించారు. (కుక్, క్రోన్, పుట. 21)
        మధ్య అరేబియాలో మక్కా నేడు మనకు తెలిసిన రీతిలో ముస్లిం సంప్రదాయాలకు నాడు కూడలి కాదు అని క్రోన్, కుక్ వాదించారు. ముస్లిమేతర ప్రస్తావనలు మక్కాను గురించి లేవు. అరేబియాకు నైరుతి మూలగా ముస్లింలు తొలుత ప్రార్థనలు చేశారు. (కిబ్లా). క్రైస్తవ సాహిత్య ఆధారాలూ, కొన్ని మసీదుల నిర్మాణం ఇందుకు ఆధారం. తరువాత ముస్లింలతో పవిత్ర స్థలంగా మక్కాను ఎంపిక చేసుకొని అరేబియాలోనే ప్రాచీన చరిత్రను చూపుతూ యూదులతో పూర్తి తెగతెంపులు కావించి ప్రత్యేక మతాన్ని ఏర్చరచుకున్నారు.
        ఇస్లాం అనేక దాడుల ఫలితంగా విదేశీ ప్రభావాలను కలుపుకొని ప్రాచీన నాగరికతతో తాదాత్మ్యం చెంది యూదు, క్రైస్తవ హెలెనిజం, పర్ష్యా భావాలు పుణికి పుచ్చుకున్నారు. అరబ్బు దాడులు  ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేయగా మరొక భూభాగాన్ని శాశ్వతంగా వేరు చేశాయి. ఇదంతా దారుణ ఫలితాలకు దారీతీసింది. (కుక్, మహమ్మద్, ఆక్స్ ఫర్డ్. 1983, పుట. 86)
        పెట్రీషియా క్రోన్ తన పుస్తకంలో తొలి ఖలీఫాను గురించిన ముస్లిం సంప్రదాయాలను 680 వరకూ కట్టుకథలుగా పేర్కొనే చాలా అంశాలు ఖురాన్ లోని జటిల భాగాలకు కలిపించిన ఊహా విస్తరణలని ఆమె వాదించారు. (మెక్కన్ ట్రేడ్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, 1987, కేంబ్రిడ్జ్, పుట. 215) ఖురాన్ లో చాలా సమాచారం సరైనది కాదని మెక్కన్ ట్రేడ్ ద్వారా ఆమె నిర్ధారించారు. బదర్ యుద్ధం వంటిని కొన్ని దైవాజ్ఞలకు ప్రేరితాలని చెప్పేవన్నీ ఖురాన్నుండి స్వీకరించారు. కథకుల సృష్టి కానివారి సమాచారం పరస్పర విరుద్ధంగా ఉన్నది.
        మహమ్మద్ తొలిసారి మదీనాకు వచ్చినప్పుడు నగరమంతా ముఠా తగాదాలతో ఉన్నదని చెప్పారు. అదే సందర్భంలో ఉబ్బై నాయకత్వాన మదీనా ప్రజలు సమైక్యంగా ఉన్నారని  కూడా చెప్పారు. స్వతంత్ర అంశాలు కొన్ని సందర్భాలలో కుప్పకూలిపోయాయి. ఇందుకు ఉదాహరణగా ఆద్యతన ప్రవక్త ఇస్లామేతర మత ప్రతినిధులను కలిసినప్పుడు వారతన్ని గుర్తించారనీ, మహమ్మద్ గురించి చెప్పారు. ఒక్కొక్క అంశాన్ని గురించి చిత్రించేటప్పుడు  అది ఎంత ప్రాచీనమైందయితే అంత చిలువలు పలువలకు గురయింది. ఒక కథకుడు ఒకదాన్ని గురించి చెపితే, మరొకతను ఏ తేదీన జరిగినదీ వర్ణిస్తాడు.  మరొకతను ఇంకా వివరాలకు పోతాడు. వాఖిడి (823 మరణం) 768 మరణించిన ఇబ్న ఇషాక్ అనంతరం రాస్తూ సంఘటనలకు నిర్దుష్ట ప్రాంతాలూ, పేర్లూ, తేదీలూ, కారణాలూ, చిత్రవిచిత్ర కథనాలు అల్లేవాడు. అసలు పోరాటం జరగని వాటిగురించి గూడా అలానే కథలు అల్లాడు. పండితులు సహజంగా వాఖిడి పట్ల అసక్తి చూపారు. అంత కచ్చితమైన సమాచారం అందిస్తుంటే ఇంకేం కావాలి అన్నారు.  ఇబ్న ఇషాక్ కు తెలియని ఈ సమాచారం ఎంత విలువైనదో ఊహించవలసిందే. ఇబ్న, ఇషాక్, వాహిడిల మధ్య రెండు తరాలలో తప్పుడు సమాచారం ఎంత చేరిందో గ్రహించవచ్చు. ప్రవక్తకూ, ఇబ్న, ఇషాక్ కూడ మధ్య 3 తరాలలో ఇలాంటిది ఇంక ఎంతో వచ్చిపడి ఉంటుంది. ఈ కథలకు కట్టుకథల నుండి ముస్లిం చరిత్రకారులు తొలి విషయాలు రాబట్టారు. ఇస్లాం ఆవిర్భవించటంలో ముస్లిం ఆధారాల చారిత్రకతను సమర్థించిన వాట్ వంటి ఆధునిక మితవాద చరిత్ర కారులను క్రోన్ దుయ్యబట్టారు.
        ఈ ముస్లిం ఆధారాల గురించి క్రోన్ ఇలా రాశాడు.
        ఆధారాలను సరిగా నిర్ణయించలేని రీతిలో వాట్ ఆధారపడ్డాడు. కొన్ని స్వల్ప వక్రీకరణకు చేర్పులు ప్రధాన సనస్య కాదు. సంప్రదాయ మూలమే ముఖ్య సమస్య. వక్రీకరణలు వస్తాయనేది దృష్టిలో పెట్టుకుని వాటిని చక్కదిద్దటానికి ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. యావత్తు సంప్రదాయమూ కావాలని పెంపొందించినవే. ఇవన్నీ విస్తృతంగా మనకు నేడు తెలిసిన రూపంలో వాస్తవాల పేరిట చూపుతున్నారు. ఇదేదో పాక్షిక ధోరణి అనుకోటానికి వీలులేదు. (క్రొన్. పుట. 230)

---
      అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
   
     

No comments:

Post a Comment