నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ? -2వ అధ్యాయం--ఇస్లాం-మక్కా యాత్ర


ఇబన్ వారక్

ఇస్లాం
స్లాం చరిత్రలో ఇతర ప్రభావాలను కలుపుకు పోవడం ప్రధాన ఘట్టం. దీని స్థాపకుడు మహమ్మద్ కొత్త భావాలు వెల్లడించలేదు. పారమార్థికానికీ, అనంతానికీ, మానవుడికీ గల సంబంధాలను గురించి లోగడ ఉన్న భావాలకు ఆయన మెరుగులు దిద్దలేదు. మత భావాల, కట్టుబాట్ల కలగాపులగమే అరబ్బు ప్రవక్త సందేశం, యూదు, క్రైస్తవ, తదితరులతో సంబంధాల వలన ఆయన ప్రేరేపితుడై తన భావాలు సూచించాడు. (ఇగ్నజ్ గోల్డ్ జిహర్, పుట 4-5 ఇన్.ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అనువాదం ఆండ్రాస్, రూత్ హమోది 1981 ప్రిన్స్ టన్) మహమ్మద్ సొంత ఆలోచన గలవాడు కాదు. కొత్త నీతి సూత్రాల్ని అతడు రూపొందించలేదు. అప్పట్లో ఉన్న సాంస్కృతిక సంపద నుండి స్వీకరించాడు. ఈ కలగాపులగ స్వభావాన్ని ఇస్లాంలో చాలాకాలం గుర్తించారు. ఇస్లాం కొత్త మతం కాదని మహమ్మద్ కు తెలుసు. లోగడ ఉన్న గ్రంథాలలోనివే ఖురాన్ పేర్కొన్న దైవదత్త సూత్రాలని తెలుసు. యూదు, క్రైస్తవ తదితర మతాలతో అనుబంధాన్నిప్రవక్త గుర్తించాడు. హేదెన్, పేగన్ అరబ్బుల నమ్మకాలు, ఆచారాలను ప్రవక్త ఇస్లాంలోకి తెచ్చాడని ముస్లిం వ్యాఖ్యాతలు అల్ షరెస్తానీ వంటివారు గుర్తించారు. మక్కా యాత్రకు సంబంధించిన క్రతువులలో ఇది మరీ కనిపిస్తుంది.  అయినా తమ మతం సరాసరి స్వర్గం నుండి వచ్చిందనీ, దేవుని నుండి గాబ్రియల్ స్వయంగా ఖురాన్ ను మహమ్మద్ కు ఇచ్చాడని ముస్లింలు నమ్ముతారు. ఖురాన్ అనాది అని, స్వర్గంలో సృష్టి అయిందని, ఫలకాలపై అట్టి పెట్టిన తీరులో సంక్రమించిందనీ భావిస్తారు. (సురా 85.21, 6.19, 97) ఇస్లాంకు మూలం దైవం ఏ సందర్భంలోనైనా మానవుడి జోక్యం ఉందనడం అర్థరహితం, ద్రోహం అంటారు.
మతాలు - మతప్రభావాలు
ఖురాన్ కు మానవ ఆధారాలు వెలికి తీస్తే, మొత్తం కట్టడమంతా కుప్పకూలుతుందనే భయం అనుకోని రీతిలో  ముస్లింలలో ఉందేమో రెనాన్ ఇలా అంటాడు. మతాలు వాస్తవాలు. వాటిని వాస్తవాలుగానే చర్చించాలి. చారిత్రక విమర్శకు గురి చేయాలి. (అనటోల్ ఫ్రాన్స్. ది అన్ రైజస్ డాన్ లో ఉదహరించాడు. లండన్ 1929 పుట 110-11) రేనాక్ ఇలా చెప్పాడు. పిడివాదంతో ప్రభావితం కానివారు మతేతరంగా పరిశీలిస్తే ఇస్లాం పుట్టు పూర్వోత్తరాలు చారిత్రక విషయాలు తెలుస్తాయి. (రెనాక్ పుట. 352 పారిస్ 1984 హిస్టరీ ఎట్ పెరోల్) అప్పుడే చారిత్రకంగా మహమ్మద్ ను తెలుసుకుంటాం. అతడి విశేష జీవితాన్ని మానవ చరిత్రలో భాగంగా చూస్తాం. ముస్లింలకు ముస్లిమేతరులకు సెక్యులర్ అర్థం అవగాహన అవుతుంది.
ఇస్లాంపై జొరాస్ట్రియన్ ప్రభావాన్ని ఇగ్నజ్ గోల్డ్ జిహర్ చూపాడు. అలాగే హెన్రీ కోర్బిన్ కూడా చూపాడు. యూదు ప్రభావాన్ని గైగర్, టోరెట్, కాష్ లు చూపారు. క్రైస్తవ ప్రభావాన్ని రిచర్డ్ బెల్ సమూలంగా పరిశీలించారు. శాబియనిజం, ఇస్లాంకు ముందు అరేబియా ప్రభావాలను వెల్ హాసన్ నాల్ డెక్ హర్ గ్రోంజే, రాబర్ట్ సన్ స్మిత్లు పరిశోధించారు. ఖురాన్ ఇతర మాటల గురించి ఆర్థర్ జెఫ్రీ చూపారు. జూమర్ ఇలా అంటాడు. ఇస్లాం కొత్తగా కనుగొన్నది కాదు. అదొక కలయిక. అందులో కొత్త ఏదీ లేదు. పాత కొత్తల కలయికను మహమ్మద్ కలిపి, మానవ రుగ్మతలకు పరిష్కారాలుగా, కత్తితో వాటిని సాధించాల్సిన తీరు చూపాడు. (జూమర్ పుట. 24 ఇస్లాం. ఎ. ఛాలంజ్ టు ఫెలియ్ న్యూయార్క్ 1908)
అరేబియా దేవతలు
      ఖురాన్ లో చాలాచోట్ల హిదెన్ సంప్రదాయాలకు ఇస్లాం రంగు పులిమారు. (జెఫ్రి. ది ఫారిన్ వకాబ్యులరీ అఫ్ ఖురాన్, బరోడ, 1938 పేజి 1) ఉదాహరణకు  సుక 113 దయామయుడైన దైవం పేరిట దోషానికి దూరంగా సూర్యోదయంలో శరణు కోరతాను. రాత్రిళ్ళ దోషాలకు దూరంగా రక్షణ వేడుతాను. పాప పిశాచాలకు దూరంగా ఉండాలని కోరుకుంటాను.
    ప్రాచీన అరబ్బుల నుండి ఇస్లాం అనేక మూఢనమ్మకాలనూ, మక్కా యాత్రకు సంబంధించిన కర్మకాండను స్వీకరించింది. (సుర. 2.153, 22.28-30, 5.1-4, 22-37) కొందరు ప్రాచీన దేవతలకు సంబంధించి కూడా పేగన్ వాదం నుండి స్వీకరించినట్లు తెలుస్తుంది. (సుర.53.19.20, 71.22.23) జిన్ (గిలి, అగ్ని దేవతలు) అద్ ధాముద్ కు చెందిన జన గాథల్లో కూడా పేగన్ ఆధారాలున్నాయి.
మక్కా యాత్ర
యాత్రకు సంబంధించిన ఆధార విషయాలను అల్ మారి జలాలుద్దీన్ రూమీ, ఖలీఫ్ ఉమర్, అమర్ లు ప్రస్తావించారు. (అలీ దస్తీ. పుట 94. ట్వెంటీత్రీ ఇయర్స్, ఏ స్టడీ ఆఫ్ ఎ ప్రాపటిక్ కారియర్ ఆఫ్ అహమ్మద్, 1985. లండన్ పుట. 1, 185, జమర్ ది ఇన్ ఫ్యూయన్స్ ఆఫ్ యానిమిజం ఇన్ ఇస్లాం, లండన్. పుట. 150, 148).
యాత్రకు సంబంధించి జరుగుతున్నదంతా ఇస్లాంకు ముందున్న ఆధారమే. అదంతా ఇస్లాంలోకి యథాతథంగా స్వీకరించారు. (జిమర్ పుట 150) ముస్లింలు 12వ మాసంలో మక్కా యాత్ర హజ్ జరుపుతారు. ఇది విధిగా జరపాలని ఖురాన్ ఆదేశిస్తున్నది. ఆరోగ్యవంతులూ, తగిన ఆదాయం ఉన్నవారూ జీవితంలో ఒకసారైనా హజ్ యాత్ర జరపాలి. మొదటి 7 రోజులూ ఎప్పుడు జరిపినా 8. 9. 10 రోజులు మాత్రం దూహల్ హిజా మాసంలో జరపాలి. 8వ రోజున ఈ హజ్ యాత్ర ప్రారంభం అవుతుంది.
యాత్రలో మొదటి 5 రోజూలు
      మక్కాకు వెలుపల కొన్ని మైళ్ళ దూరాన చేరుకున్న యాత్రికులు పవిత్ర మానసిక స్థితికి సిద్ధపడతారు. ప్రార్థనలు జరిపి అతి సాధారణ దుస్తులు ధరించి పవిత్ర మక్కా ప్రాంగణంలో ప్రవేశిస్తారు. అక్కడ జంతువులను చంపరాదు. మొక్కలు పీకరాదు. హింస చేయరాదు. లైంగిక సంపర్కాలు ఉండరాదు. మక్కా పవిత్ర మసీదులో ప్రార్థనలు జరిపిన తరువాత కాబాకు తూర్పు దిశగా ఉన్న నల్లరాతిని ముద్దు పెట్టుకుంటారు.
      తరువాత యాత్రికుడు కాబా చుట్టూ 7సార్లు ప్రదక్షిణలు చేస్తాడు. మూడుసార్లు వేగంగానూ, నాలుగుసార్లు నెమ్మదిగానూ చేస్తాడు. కాబా చుట్టూ తిరిగేటప్పుడు యామని మూల మరొక పవిత్రమైన రాతిని ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇబ్రహీం అనే చోటుకు వెళ్ళియాత్రికుడు కాబా
వైపుకు తిరిగి అబ్రహాం ప్రార్థించిన చోట ప్రార్థనలు జరిపివచ్చి నల్లరాతిని ముద్దు పెట్టుకుంటాడు. సమీపంలో ఉన్న జమ్ జమ్ అనే పవిత్ర బావిని సమీపిస్తాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం హగర్, ఇస్మాయిల్ అందులో నీరు తాగారు.  వీరిరువుర్నీ పాతిపెట్టిన చోట, మహమ్మద్ మక్కా నుండి జెరూసలేం పోతూ నిద్రించాడంటారు. దీనిని అల్ హిజర్ అంటారు. యాత్రికులు అక్కడకు వెళతారు.
6 నుండి 10వ రోజు వరకు
      యాత్రికుడు 24 గేట్లలో ఒక దాని నుండి పవిత్ర మసీదు  వెలుపలకు వస్తాడు. అక్కడ అల్ సఫా అనే కొండ ఎక్కుతూ ఖురాన్ సూత్రాలు చదువుతాడు. అల్ సఫా శిఖరం నుండి అల్ మర్వా శిఖరానికి 7 పర్యాయాలు ప్రార్థనలు చేస్తూ పరుగెడతాడు. అడవిలో నీటికోసం హగర్ చేసిన అన్వేషణను ఈ ఆచారం గుర్తుకి తెస్తుంది.
      6వ రోజు మక్కాలో గడిపి మరొకసారి కాబా చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. 7వ రోజు మసీదు ప్రసంగం వింటాడు. 8వ నాడు మీనాకు వెళ్ళి కర్మకాండ జరిపి  ఆ రాత్రి అక్కడ ఉంటాడు. 9వ రోజు ఉదయం ప్రార్థనల అనంతరం అరాఫత్ పర్వతానికి వెళ్ళి నిలుచుండే క్రతువు జరుపుతాడు. స్వర్గం నుండి వెళ్ళగొట్టబడిన ఆదం, అవ్వలు అక్కడ కలిసారని సాంప్రదాయం చెబుతుంది. యాత్రికుడు ప్రార్థనలు జరిపి పశ్చాత్తాపం పై ప్రసంగాలు వింటాడు. తరువాత మీనా అరాఫత్ ల మధ్య ముబ్జాలిఫా అనే చోట సూర్యాస్తమయం ముందే ప్రార్ధనలు చేయటానికి వెళతారు.
      10వ నాడు త్యాగదినంగా భావిస్తారు. ముస్లింలు దీనిని ఈద్-ఉల్-అజా అంటారు. భక్తులు ప్రార్థనలు జరిపి మీనా స్తంభాల దగ్గరకు వెళతారు. ఈ స్తంభాల మధ్య రాయి పట్టుకుని, కుడి చేతితో 15 అడుగుల దూరానికి విసిరేస్తూ దేవుని పేరిట ఈ పని చేస్తున్నానని దయ్యాలను ద్వేషిస్తున్నానని అనాలి. మిగిలిన రాళ్ళను కూడా అలాగే విసరాలి. తిరిగి వచ్చి మేకను కానీ, మేక పిల్లను కానీ బలి ఇవ్వాలి. తరువాత జుట్టు తీసివేసుకోవటం కానీ, కొన్నికత్తిరింపులివ్వటం గానీ చేస్తారు.
      ఈ ఆచారాన్ని ముస్లింలు సమర్థిస్తూ, దయ్యాల్ని అబ్రహాం నిరాకరించినందుకు సూచనగా చేస్తున్నామంటారు. అతడు తన కుమారుడు ఇస్మాయిల్ ని దైవాజ్ఞప్రకారం త్యాగం చెయ్యకుండా నిరోధించగలిగారు. దీని బదులు గొర్రెను  బలి ఇస్తారన్నమాట.
      ఇస్లాంలో ఏకేశ్వరాధన, విగ్రహ వ్యతిరేకత పేర్కొన్న మహమ్మద్ ఈ మూఢ నమ్మకాలను ఎలా ప్రవేశపెట్టాడు. యూదులూ, క్రైస్తవులూ మోజేస్ నూ, జీసస్ నూ నిరాకరించి మహమ్మద్ ను ప్రవక్తగా అంగీకరించినట్లయితే మక్కా బదులు జెరూసలేం, కాబా బదులు సాక్రా పుణ్యస్థలాలయ్యేవని చరిత్రకారులంటారు.
      యూదులు తనను కొత్త ప్రవక్తగా ఆమోదించే అవకాశం లేదని గ్రహించిన మహమ్మద్ మక్కాలో కాదాకు పవిత్రతను మార్చమని దైవాజ్ఞగా పేర్కొంటారు. (సుర.2-138) మక్కాను ఉత్తరోత్తరా వశపరచుకోవచ్చని మహమ్మద్ గ్రహించాడు.
మహమ్మద్ మక్కా ప్రవేశం
      మక్కాలో ప్రవేశించటానికి ముస్లింల 6వ సంవత్సరంలో మహమ్మద్ విఫలుడయ్యాడు. మక్కా మదీనా వాసులు హుదైబా సరిహద్దులలో  సమావేశమై చర్చలు జరిపి మదీనాకు ముస్లింలు తిరిగి రావడానికి, మరుసటేడు మక్కాలో ఉత్సవం జరపటానికి అంగీకరించారు. మహమ్మద్ తన అనుచరులతో వచ్చి కాబా ప్రదక్షిణలు జరిపి నల్లరాతిని ముద్దుపెట్టుకున్నాడు.
      మరుసటేడు మహమ్మద్ మక్కాను జయించాడు. తొలుత ప్రవక్త లేకుండానే చాలామంది ముస్లింలు నమ్మకంలేని అరబ్బులతో హజ్ లో కలిసారు. తరువాత నమ్మకం లేనివారు మక్కాకు, హజ్ కు రాకూడదని దైవ నిర్ణయంగా ప్రకటించారు. (సుర. 9)
      జమర్ ఇలా రాసాడు. మహమ్మద్ 10వ ఏట తన పూర్వీకుల మందిరం ఉన్న మక్కాకు యాత్ర జరిపి ఇస్లాం పేరిట మూఢనమ్మకాలన్నీ అమలు పరిచారు. అర్థం చేసుకోవటానికి వీలు లేనంత కట్టుకథలతో ముస్లిం గాథలను బైబిల్లో ఉదంతాలకు అంటగట్టి, పేగన్ ఆచారాలను వివరిస్తూ పోయారు. (జిమర్ పుట. 157).
     
ఇస్లాం పుట్టుక – మహమ్మద మతోద్ధరణ
మధ్య, పశ్చిమ అరేబియాలలో ఇస్లాం పుట్టింది. ఆ ప్రాంతాలలో నాటి అరబ్బుల మతాన్ని గురించి మనకంతగా తెలియదు. ఇబ్న కల్బీ వంటి పండితులు ది బుక్ ఆఫ్ ఐడల్స్ లో పేర్కొన్న పేర్ల ఆధారంగా కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఖురాన్ లో ప్రస్తావనలూ ఇస్లాంకు పూర్వం కవితలూ, దేవతల్ని గురించి కించిత్తు గ్రహించగలుగుతున్నారు. నాల్డెక్ ఇలా రాశాడు. మహమ్మద్ తన మతంలో, ఎలాంటి మార్పులూ లేకుండానే హిదెన్ల ఆచారాలనూ, నమ్మకాలనూ స్వీకరించాడు. సనాతన ఇస్లాంలకు గిట్టని అనేక పద్ధతులను స్వీకరించాడు. అరబ్బులలో అవి నేటికీ ఉన్నాయి. ప్రజా బాహుళ్యంలో ఉన్న నమ్మకాలు కొత్త మతం వలన పోలేదు. వేరే పేర్లతో అవి కొనసాగాయి. (నాల్డెక్, అరబ్స్. పుట. 659-72)
      లోగడ స్థానికంగా ఉన్న అనేక క్రతువుల్ని ముస్లిం యాత్రలో చాకచక్యంగా మహమ్మద్
ప్రవేశపెట్టాడు.
      ఇస్లాంకు ముందు మధ్య అరేబియా తెగల ఆధారంగా ఉన్న సమాజానికి ఒక్కొక్క తెగకు ఒక దైవం ఒకచోట నెలకొల్పి సంచార జాతులు పూజిస్తుండేవారు. అవి మానవాకారం కాకపోయినా, రాతి రూపులో ఉండేవి. ఒక్కొక్క సందర్భంలో మానవాకారంలోనూ లేదా కేవలం నల్లరాయిగానూ ఉన్న వాటిని ప్రతిష్టించేవారు. నల్లరాతిలో దివ్యత్వం ఉన్నదని హిదెన్ అరబ్బులు నమ్మారు.
      అల్ సఫా, అల్ మర్వా అనే రెండు కొండలను విగ్రహాలను సూచిస్తాయి. పేగన్ లు ఈ రెండు కొండల మధ్య పరుగెత్తి ఇసాఫ్, నైలా ప్రతిమలను ముద్దుపెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుందని నమ్మారు.
పవిత్ర నల్లరాయి, హ్యూబల్
      అరబ్బుల లోకంలో నల్ల రాళ్ళను ఆరాధించారు. అలెగ్జాండ్రియాకు చెందిన కెమెంట్, అరబ్బుల నల్లరాతి ఆరాధన ప్రస్తావించాడు. 2వ శతాబ్దిలో మాక్సిమన్ టైరియస్ రాస్తూ దీర్ఘ చతురస్రకార రాతికి అరేబియన్లు పూజించటం తెలుసుకున్నాడు. నల్లరాతి కాబాను ప్రస్తావించాడు. మహమ్మద్, అతని వారసులు కాబాలో నల్లరాతిని, ఇతర విగ్రహాలను ప్రతిష్టించారని, అవి శని గుర్తులని పర్షియన్లు అన్నారు.
      కొందరు పవిత్ర వ్యక్తులకు సంబంధం అంటగట్టిన రాళ్ళకు మక్కా పరిసరాలలో మహమ్మదీయ గౌరవం లభించింది. (నోల్డెక్ అరబ్స్ పుట 659-72 మతం నీతి సర్వస్వం)
      నల్లరాయి ఒక ఊడిపడిన ఉల్క. స్వర్గం నుండి వచ్చిన ప్రతిష్ట దీనికుంది. గాబ్రియల్ దేవత ఇస్మాయిల్ కు ఇచ్చిన రాతిని ముస్లింలు ఆరాధించడం విచిత్రం. 4వ శతాబ్దిలో కార్మషియన్లు ఈ నల్లరాతిని తొలగించారు. తరువాత కొన్నేళ్ళకు మళ్ళీ ప్రతిష్ఠించారు. తొలగించిన రాయినే మళ్ళి పెట్టారా అనేదే సందేహాస్పదం. (మార్గోలియత్ - ఐడియాస్ అండ్ ఐడియల్స్ ఆఫ్ మోడ్రన్ ఇస్లాం. 20 సంపుటి, పుట 241 ముస్లిం వరల్డ్)
హ్యూబల్ ఆరాధన
      మక్కాలో హ్యూబల్ ను ఆరాధిస్తారు. ఒట్టిపోయిన బావి కాబాకు చెంత ఉండగా, అందులో ఎర్రని విగ్రహాన్ని పెట్టారు. హ్యూబల్ కు మానవాకారం కద్దు. నల్లరాతి పక్కనే ఉన్నందున, హ్యూబల్ కు దీనికీ సంబంధం ఉండవచ్చు. తొలుత హ్యూబల్ కూడా నల్లరాయి అని వాల్ హుసేన్ భావించాడు. కాబా ప్రభువుగా దేవుణ్ణి చూచారనీ, మక్కా ప్రాంత ప్రభువుగా ఖురాన్ పేర్కొన్నదనీ వాల్ హుసేన్ చూపాడు. అల్ లత్, మనత్, అల్ ఉజా దేవతల ఆరాధన మహమ్మద్ వ్యతిరేకించాడు. అరబ్బులు వీరిని దేవుని కుమార్తెలన్నారు. హ్యూబల్ ను అల్లాగా వాల్ హుసేన్ పేర్కొన్నాడు. మదీనా వద్ద్ ప్రవక్తను మక్కా వాసులు ఓడించినప్పుడు హ్యూబల్ విజయంగా వీరి నాయకుడు నినదించాడు. ప్రదక్షిణలు చాలా చోట్ల ఆచారంగా ఉంది. యాత్రికుడు ప్రదక్షిణలో తరచు రాతిని ముద్దు పెట్టుకోవడం, కౌగలించడం కద్దు. ఏడుమార్లు ప్రదక్షిణ జరపడం 7 గ్రహాలు తిరగడాన్ని సూచిస్తున్నదని సర్ విలియం మూర్ భావించాడు. (మూర్ - ది లైఫ్ ఆఫ్  మహమ్మద్ 1923 ఎడిన్ బరో, పీఠిక) బయట, లోపలి గ్రహాల చలనాన్ని అనుకరిస్తూ, కాబా చుట్టూ మూడుసార్లు వేగంగా, 4 సార్లు నెమ్మదిగా ప్రదక్షిణ చేయడాన్ని జిమర్ చిత్రించాడు. (జిమర్ - ది ఇన్ ఫ్లూయన్స్ ఆఫ్ యానిమిజం ఆన్ ఇస్లాం, లండన్ 1920 పుట. 158)
అరబ్బుల సూర్యారాధన
అరబ్బులు సూర్యుణ్ణి ఆకాశంలో ఇతర తారల్ని ఆలస్యంగా ఆరాధించారనడంలో సందేహం లేదు. (నోల్డెక్ - మతం నీతి సర్వస్వం సంపుటి 1, పుట 660) స్టేడిమ్స్ పుంత వర్షదేవతగా భావించారు. అల్ ఉజా పేరిట వీనస్ గ్రహాన్ని గొప్ప దేవతగా గౌరవించారు.
      సూర్యుణ్ణి షమ్స్ పేరిట ఆరాధించారు. అనేక తెగలకు ఇది దేవత. దీనికి మందిరం, విగ్రహం ఉండేది. వుకుఫ్ ఉత్సవంలో సూర్యారాధన స్నోక్ హర్ గ్రోంజే గమనించాడు. (జిమర్ - పుట 159, ఇన్ ఫ్లుయన్స్ ఆఫ్ యానిమిజం ఆన్ ఇస్లాం, లండన్ 1920)
      సూర్యదేవతగా అల్ లత్ దేవతను చూశారు. ఉదయిస్తున్న సూర్యుడు ధారీ దేవత. సూర్యాస్తమయానికి, సూర్యోదయానికి మధ్య ముస్లింలు ఆరఫత్ - ముజ్దాలిఫా, మీనా, ముజ్దాలిఫా కొండలమధ్య పరుగిడతారు. పేగన్ల సూర్యారాధన స్థానే కావాలని మహమ్మద్ ఇది ప్రవేశపెట్టాడు. చంద్రుడికి హిలాల్, ఖమర్ వంటి పేర్లు నెలవంక వంటివి పెట్టి ఆరాధించారు.
      సూర్య రాక్షసుణ్ణి ఉద్దేశించి మీనాలో రాళ్ళు విసరడం తొలుత జరిగిందని హోట్సామా పేర్కొన్నారు. (జిమర్ పుట 160) వేగన్లు వసంత కాలంలో యాత్ర చేయడాన్ని బట్టి ఇలా భావించారు. సూర్య రాక్షసుణ్ణి బహిష్కరించి, వేసవిలో అతడి తీవ్ర పాలనకు స్వస్తి పలికేవారు. ఉరుముల దేవత పంట తెస్తాడని ఆరాధించినట్లు ముజ్దాలిఫా వద్ద ఇలా జరిగినట్లు చెప్పాడు. ముజ్దాలిఫా అగ్ని ఆరాధన ప్రాంతం ఇది పవిత్ర అగ్ని పర్వతంగా ముస్లిం చరిత్రకారులు  పేర్కొన్నారు. ముజ్దాలిఫా దేవత. ఖుజా ఉరుముల దేవత. వెన్ సింక్ ఇలా రాశాడు. ఖుజా పవిత్ర కొండపై అగ్ని వెలిగించి, యాత్రికులు విడిది చేసిన తీరు, సినాయ్ తో పోలి ఉంది. ఉభయులు నిప్పులు కురిపించే ఉరుముల దేవతలే. ఉరుమును ఉద్దేశించి భక్తులు పెద్దగా ధ్వని చేయడం, సానుభూతితో స్తుతించడం కద్దు. (జిమర్ పుట. 159)
    రాళ్ళు విసిరే ఆచారాన్ని గోల్డన్ బేలో ఫ్రేజర్ వివరించాడు. ప్రమాదకర దోషాన్ని తొలగించడానికి రాళ్ళు విసిరేవారు. మంచిది పొందడానికి కూడా ఇది ఉద్దేశించారు. దోషాన్ని పోగొట్టడానికే ఆదిమవాసులు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. మక్కాలో రాళ్ళు విసిరే సంప్రదాయానికి ఇలాంటి వివరణే ఇవ్వవచ్చు. భక్తులు తమ అపవిత్రతను రాళ్ళకు అంటగట్టామని పవిత్రులమయ్యామని అనుకోవచ్చు. (జిమర్ పుట. 121).
      హజ్ కు తొలుత మాంత్రిక స్వభావం ఉండేదని జ్యున్ బాల్ భావించాడు.
      నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షం, సూర్యకాంతి, సంపద, పశు పాడి సంపద కావాలని తొలుత ఉద్దేశించారు. ఆరఫత్, ముజ్దాలిఫాల వద్ద సూర్యుణ్ణి ఉద్దేశించి పెద్ద మంటలు వేసేవారు. కరువుకు విరుగుడుగా  నేలపై నీరు పోసేవారు. ఆదిమ హేథెనులు రాళ్ళుగా ఉన్న మీనా వద్ద రాళ్ళు విసరడం, గత సంవత్సర దోషాలు పోవాలనే ఉద్దేశంతో చేశారు. శిక్షకు, దురదృష్టానికి వ్యతిరేకంగా ఇదొక ఆచారంగా ఉండేది. (జ్యూన్ బోల్ కళ. యాత్ర మతం నీతి సర్వస్వం).
      ఆరఫత్ - ముజ్దాలిఫా, మీనా- ముజ్దాలిఫాల మధ్యపరుగిడడం కూడా మాంత్రిక  ప్రాధాన్యతతో కూడినదే. అన్ని క్రతువుల అనంతరం, విందును బట్టి, సంవత్సరాంతంలో సమృద్ధికి సూచన కావచ్చు. యాత్రికునిపై వివిధ ఆక్షలు విధించడం కూడా అతడిని ఒక మాంత్రిక స్థితిలోకి తీసుకురావడం కోసమే.
కాబా (నల్లరాయి)
      కాబాను ఎప్పుడు నిర్మించారో తెలియదు. కాని, జమ్ జమ్ అనే బావి చెంత ఇది నిర్మించడంలో, నాడు మక్కా మీదుగా ఎమెస్ సిరియాలకు వెళ్ళే ఒంటె ప్రయాణీకులకు మంచి నీరు అందించే ఉద్దేశం కనబడుతుంది.
      భక్తులు దీనివద్ద బలులు ఇస్తూ ఆరాధనా వస్తువులు పెడతారు. కాబాలోన నీరు లేని బావి చెంత ముడుపులు చెల్లిస్తుంటారు. గర్భగుడివంటి ఈ స్థలంలో భక్తులు తల గొరిగించుకుంటారు. ముస్లిం హజ్ లో ఈ పద్ధతులు గమనించవచ్చు.
      కాబా తొలుత స్వర్గంలో నిర్మితం అయిందనీ, దాని నమూనా ఇప్పటికీ ఉందనీ, ప్రపంచ సృష్టిలో రెండువేల ఏళ్ళ పూర్వం ఇది జరిగిందనీ ముస్లిం రచయితలు పేర్కొన్నారు. భూమిపై ఓ కాబాను ఆదాం నిర్మించగా పెద్ద ఉప్పెనలో అది కొట్టుకు పోయింది. తిరిగి నిర్మించమని అబ్రహాంను ఆదేశించారు. ఇస్మాయిల్ అతడికి తోడ్పడ్డాడు. భవనం మూల రాతి ప్రతిష్ఠాపనకై చూస్తుండగా, గాబ్రియెల్ తటస్థపడి నల్లరాతిని ఇచ్చాడు. తొలుత అది పాలరాతి వలె ఉండేది. దానిని ముట్టుకునే వారి పాపాలతో రాయి నల్లబడింది. జెరూసలేం గురించి పరలోక ఇహలోక స్థితిని యూదులు వర్ణించిన తీరును పోలిన స్థితి ఇది. అబ్రహాం ద్వారా కాబా వచ్చిందనేది మహమ్మద్ కు పూర్వం ఉన్న నమ్మకంగా మూర్, బోరేలు భావించారు. కాబా విషయంలో అబ్రహాంను చూపడం మహమ్మద్ చర్యగా స్నాక్ హర్ గ్రొంజే, అలాస్ స్ట్రెంగర్ లు చెప్పారు.
      యూదుల నుండి ఇస్లాంను కాపాడడానికి ఇది ఉపరకరించిందన్నారు. స్ట్రెంగర్ ఇలా నిర్ణయించాడు. ఇలాంటి అబద్ధంతో మానవుడికి కావలసిందేదో మహమ్మద్ సమకూర్చాడు.  మతానికీ తత్వానికీ తేడా అక్కడే ఉంది. జాతీయత, క్రతువులు, చారిత్రక స్మృతులు, మార్మికాలు, స్వర్గ ప్రవేశం అన్నీ కల్పించి, తన చిత్త ప్రవృత్తిని  మోసగించాడు. బాస్క్వే ఉదహరించిన తీరు. హర్ గ్రోంజే  పుస్తకంలో మలిపలుకు, పుట. 287, రివ్యూ ఆఫ్రికన్ 95 (1951)
అల్లా ఉద్భవం
      హీదిస్ అరబ్బుల నుండి అల్లా అనే మాట ఇస్లాంలోకి వచ్చింది. ఉత్తర అరేబియా సబాసియన్లు పెట్టుకున్న పేర్లలో అల్లా ఉన్నది. తరువాత అరబ్బులలో, థియోపోరస్ పేర్లలోనూ ఉన్నది. ఇస్లాం ముందున్న సాహిత్యంలో అల్లాను గొప్ప దైవంగా పేర్కొన్నట్లు వెల్ హాసన్ చూపారు. కొరాన్ లో అతడు వర్షాన్ని ఇస్తాడనీ, సృష్టికర్త అనీ పేర్కొన్నారు. అతని ప్రక్కనే ఇతర దేవుళ్ళను ఆరాధించటమే మక్కా పౌరుల నేరం అయింది. రాను రాను అల్లాను పరమ దైవంగా పేర్కొన్నారు. కొత్త దైవాన్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత మహమ్మద్ కు లేకపోయింది. హీదెన్ల అల్లాను పవిత్రం చేసి చూపాడు. మక్కాలో అల్లాను దైవంగా చూపకపోయినట్లయితే మహమ్మద్ ఏకేశ్వరాధన బోధకుడయ్యేవాడు కాదు. (నోల్డెక్ - మతం నీతి సర్వస్వం. సంపుటి 1, పుట 664).
      పేగస్ అరబ్బుల నుండి బహుదేవతారాధన బానిసత్వం, సులభంగా విడాకులు, సామాజిక చట్టాలూ, సున్తీ, క్రతువుల ప్రక్షాళన ఇస్లాంలోకి వచ్చాయి. ముస్లింల ప్రార్థనలో క్రతువులకు సంబంధించిన విషయాలను వెన్ సింక్ నోల్డెక్, గోల్డ్ జిహర్ అధ్యయనం చేశారు. (జిమర్, ముస్లిం వరల్డ్, సంపుటి 8, పుట 359. యానిమిస్టిక్ ఎలిమెంట్స్ ఇన్  ముస్లిం ప్రేయర్) రోజూ ఐదుసార్లు ప్రార్థించటంలో, ప్రక్షాళన చేసుకోవటంలో భక్తుడు దోషాల నుండి బయటపడటమే ప్రధానంగానీ, శారీరకమైన శుద్ధి ముఖ్యం కాదు. మహమ్మదు సైతం పైశాచిక కల్మషంపట్ల అనేక మూఢనమ్మకాలను అట్టిపెట్టాడు. అవన్నీ అతడి యవ్వన దశలో పేగన్ వాదం నుండి స్వీకరించినవే. రాత్రిళ్ళు దయ్యాలు మానవుడి ముక్కులో నివసిస్తాయి గనుక మేలుకోగానే మూడు పర్యాయాలు చీదాలి  అని మహమ్మద్ ఒక సంప్రదాయం ప్రకారం చెప్పాడు. ఒకసారి ఒకతను కడుక్కున్న తరువాత కూడా కాలు తడవకపోవటం గమనించిన మహమ్మద్ వెళ్ళి కడుక్కురమ్మని సలహా ఇచ్చి ఇలా చెప్పాడు. ముస్లిం భక్తుడు ప్రక్షాళన చేసుకున్నప్పుడు మొఖం నీటితో కడుక్కుంటే అతడి పాపాలు కడిగేసుకున్నట్లే, చేతులు కడుక్కుంటే చేతులు చేసిన పాపాలు తుడిచేసినట్లే, అలాగే పాదాలు కడుక్కుంటే కాళ్ళు చేసిన పాపాలన్నీ పోయినట్లే గోల్డ్ జిహర్ ఈ విషయమై రాస్తూ నీటివలన దయ్యాలను పారద్రోలవచ్చుననే భావన ఉండేదన్నారు. ప్రవక్త చెప్పులు బయట భాగాన్ని చేతితో తుడిచి కాళ్ళు కడిగినట్లు భావించేవాడు.
      సంప్రదాయ బద్ధంగా ముస్లిం తలను కప్పుకోవాలి. ముఖ్యంగా తల వెనుక భాగాన్ని కప్పుకోవాలి. శరీరంలోకి దోషాలు ప్రవేశించకుండా అలా ఉద్దేశించారనీ వెల్ సింక్ భావించాడు. ముస్లింలు చేసే సంజ్ఞలు, ప్రార్థనలకిచ్చే పిలువు చేతులు పైకెత్తే విధానం అన్నీ దోషాలను పోగొట్టే ఉద్దేశంతోనే అని అంటారు.
జొరాష్ట్రియన్ వాదం
      ప్రపంచ మతాలపై జొరాష్ట్రియన్ వాద ప్రభావం. దీనినే పార్శీవాదం అంటారు. బాగా ఉన్నట్లు కొందరూ, లేదని కొందరూ వాదించారు.
      ఇరానియన్ మతాల చారిత్రక ప్రాధాన్యత ఇరాన్ అభివృద్ధిలో వాటి పాత్రను బట్టి చెప్పవచ్చు. పాశ్చాత్యలోకంలో, ముఖ్యంగా  యూదు మతంపై ఇరాన్ మత ప్రభావం ఉన్నది. గ్రీక్ మార్మిక మత వాదం అయిన మైత్రేయ వాదం, మార్మిక వాదం షియాలపై కనిపించినా ఇరాన్ భావాలూ, మధ్యయుగాలలో ప్రజా బాహుళ్యంలో ఉన్న ఆచార వ్యవహారాలూ స్పష్టంగా ఇస్లాంపై ప్రభావం చూపాయి.  (వైడన్ గ్రన్ - ఇరానియన్ మతాలు, బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం. 11వ ప్రచురణ పుట. 867) బైబుల్ పాత నిబంధనలో యూదులు బాబిలోనియన్ ప్రవాసం వెళ్ళినప్పుడు జొరాస్ట్రియన్ ప్రభావానికి గురైనట్లు వైడన్ గ్రన్ చూపాడు. (డైరెలిజియన్ ఇరాన్స్ 1965) ఈసయ్య 40-486, జొరాస్ట్రియన్ సూక్తులలో గాతకూ 44 3-5 కి సన్నిహిత సంబంధాన్ని మోర్టన్ స్మిత్ ప్రప్రథమంగా చూపించారు. ఈ రెండిటిలోనూ వెలుగు-నీడలను దేవుడు సృష్టించినట్లున్నది.  కొత్త నిబంధనపై జొరాస్ట్రియన్ ప్రభావాన్ని జాన్ హినెల్స్ రాశాడు.  యూదులు పార్సియన్ల మధ్య క్రీస్తు పూర్వం రెండు ఒకటి శతాబ్దాలలో సంబంధాలవలన ఈ ప్రభావాలు ఏర్పడ్డాయి. (హినెల్స్, ఇన్ న్యూమెన్ 16, 161-85, 1969) ఇరానియన్ మత ప్రభావం ఇస్లాంపై ప్రత్యక్షంగా ఉన్నది. ఇస్లాంపై యూదు, క్రైస్తవ పరోక్ష ప్రభావాలని ఎన్నడూ సందేహించలేదు. ఈ దృష్ట్యా యూదు, జొరాస్ట్రయన్ల వాదాల సమాంతరాలను చూద్దాం.
      ఇరాన్ పరమదైవం, అహూరమజ్జా సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, నిరంతరుడూ, సృష్టికర్త, తన శక్తులను స్పంటామైన్యూ అనే దివ్య లక్షణం ద్వారా వెల్లడిస్తాడు. విశ్వాన్ని దేవతలతో పరిపాలిస్తాడు. సైతాను వలె అహ్రిమన్ ఈ దైవానికి విరుద్ధంగా ఉండగా, ప్రపంచాంతంలో దానిని నాశనం చేస్తారు. ఆ తరువాత పునరుజ్జీవనం, సంపూర్ణ రాజ్యం, మళ్ళీ ప్రవక్త రావడం, చనిపోయినవారు లేవటం, శాశ్వత జీవనం ఇలాంటివన్నీ ఉదహరించారు. రెండు మతాలు దైవం ఇచ్చినవి. అహూరమజ్జా జొరాస్టర్ కు కొండపై తన ఆజ్ఞలను ప్రసాదిస్తాడు. అలాగే సినాయిపై మోజెస్ కు ఎహోవా ప్రసాదిస్తాడు. చనిపోయిన వారితో, మలిన పదార్థంతో సంబంధాల వలన వచ్చిన అంటును ప్రక్షాళనం చేసుకోవటానికి జొరాస్ట్రియన్ నియమాలు అవస్తే విందిదాద్ లో విపులంగా ఇచ్చారు. బైబుల్లో సృష్టివలే జొరాస్ట్రియన్ గ్రంథాలలో 6 కాలాల సృష్టి ప్రస్తావన ఉన్నది. ఈ మతాల ననుసరించి ఒకే దంపతుల ద్వారా మానవాళి ఆవిర్భవించింది. ప్రళయం వలన ఒక పుణ్యకుటుంబీకులు తప్ప అందరూ నాశనం  అవుతారు. అవస్తే ప్రకారం ఒక చలి కాలంలో దీవనలు పొందిన ఇమా తప్ప మిగిలిన వారంతా పోతారు. తరువాత భూమిపై ఉత్తమమైన జంటలను స్వీకరించి మూడు భాగాలలో విభజిస్తారని రెండు మతాలూ పేర్కొన్నాయి. దయ్యాలూ, దేవతలకు సంబంధించి పునరుత్థానానికి సంబంధించి యూదు, జొరాస్ట్రియన్ చెప్పే వాటిలో ఇలాగే పోలికలున్నాయి. (జూయిష్ ఎన్ సైక్లోపీడియాలో జొరాస్ట్రియనిజం. పుట. 695-97.)
      ఖడిసియా యుద్ధంలో నసానియన్ పర్షియన్ సైన్యంపై 636 కీ.పూ.లో ముస్లింలు జయించినప్పుడు, ఇరుపక్షాల ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఉన్నత సంస్కృతితో ఏర్పడిన ఈ సంపర్కం వలన అరబ్బులు ఇస్లాంకు ఎంతో ప్రభావితులయ్యారు. కొత్తగా మతం మారిన పర్షియన్లు  ఇస్లాం మత జీవనంలో కొత్త దనాన్ని తెచ్చారు.
      ఉమాయద్ సామ్రాజ్యం పతనమైనప్పుడు పర్షియన్ మత రాజకీయ భావాల ప్రభావంతో ఆబాసిద్ లు మత రాజ్యాన్ని స్థాపించారు. అబూ ముస్లిం విప్లవంవలన అధికారం సంక్రమించిన అబాసిద్ లు తొలుత పర్షియన్ ఉద్యమంలోని వారే. ససానియన్ల సంప్రదాయాల్ని అబాసిద్ లు పుణికిపుచ్చుకున్నారు. పర్ష్యా రాచరికాన్ని స్వీకరించినవారికి, ఖలీఫా సంస్థ, రాచరికపు సన్నిహితత్వం బాగా తెలుసు. వారిది మత రాజ్యం. వారు మతాధిపతులు. ససానియన్లవలే వీరు దివ్యత్వాన్ని ఆపాదించుకున్నారు. ప్రభుత్వానికి, మతానికి సన్నిహిత సంబంధం ఉండేది. ఒకరిపై ఒకరు ఆధారపడేవారు. సంపూర్ణ సమ్మిళితం ఉండేది. ప్రభుత్వం మతం తాదాత్మ్యం చెందాయి. కనుక మతమే ప్రజల ప్రభుత్వం. పర్షియన్లు అవెస్తా వెందిదాద్ పఠించినట్లే వీరూ కొరాన్ చదివారు. అలా చదివినందువలన భూమిపై సంక్రమించిన అక్రమాలన్నీ పోతాయన్నారు. ఆత్మ విముక్తికి ఇది అవసరమన్నారు. కుటుంబంలో సభ్యుడు చనిపోయిన తరువాత జొరాస్ట్రియన్లు ముస్లింలు తమ పవిత్ర గ్రంథంలో కొన్ని పాఠాలు చదువుతారు. చనిపోయిన వారిపట్ల విచారం వ్యక్తం చేయడాన్ని ఉభయులూ ఖండిస్తారు. ముస్లిం మిజాన్ సిద్ధాంతం పర్షియన్లనుండి తెచ్చుకున్నదే. మనుషుల చర్యల్ని దీనివలన కొలుస్తారు. (కొరాన్ సుర 21.47) మంచి చెడ్డల బేరీజు చేయడానికి యీ సూత్రాలు వాడతారు. ప్రవక్త ఇలా చెప్పాడంటారు. చనిపోయినప్పుడు ప్రార్థనలు చేస్తే ఒక కిరాతక, మృత దేహానికి అంత్యక్రియలు జరిగే వరకూ ఉన్న వారికి రెండు కిరాత్ లు లభిస్తాయి. వ్యక్తిగత ప్రార్థనలకంటే సామూహిక ప్రార్థనలకు 25 రెట్లు ఉన్నత విలువ గలదు.
      తుది తీర్పునాడు దేవదూత గాబ్రియల్ మంచి చెడులను నిర్ధారిస్తాడు. దానికి ఒకవైపు స్వర్గం మరొక పక్క నరకం ఉంటాయి. పార్శీవాదం ప్రకారం తీర్పునాడు స్వర్గనరకాల మధ్య ఇరువురు దేవతలు నిలిచి, ప్రతివ్యక్తిని పరిశీలిస్తారు. దైవ ప్రతినిధిగా ఒక దేవత అందరి చర్యల్ని తులనాత్మకంగా చూస్తాడు. మంచి చర్యలు ఎక్కువైతే స్వర్గానికి, లేకుంటే నరకానికి పంపిస్తాడు. అలా మిగిలిన తులనాత్మక కొలతలు క్రైస్తవ ఆచారాల నుండి ఇస్లాం భావాలలోకి వచ్చాయి.
      రోజూ 5సార్లు ప్రార్థించే ముస్లిం సంప్రదాయం పర్షియన్ మూలంలోనిదే. తొలుత మహమ్మద్ రెండుసార్లే ప్రార్థన ప్రవేశపెట్టాడు. ఉత్తరోత్తర యూదుల షకారిత్, మింకా, ఆర్బిత్ లను పోలిన ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రార్థనలు కొరాన్ పేర్కొన్నది. జొరాస్ట్రియన్ల మత తీవ్రతను చూచి, ముస్లింలు వారి ఆచారాన్ని అలాగే స్వీకరించారు. అప్పటినుండీ ముస్లింలు తమ దైవానికి 5సార్లు ప్రార్థనలు చేస్తున్నారు. ఇది పర్షియన్ల అనుకరణే.
      యూదు, క్రైస్తవ భావాలు పర్షియా సిద్ధాంతాల నుండిగాక, ఇస్లాం పూర్వపు అరేబియాలోనూ పర్షియన్ భావనలు వచ్చాయి. పర్షియన్ సంస్కృతిలో మక్కా వర్తకులు తరచు తారసిల్లేవారు. పర్షియా ప్రభావం కింద ఉన్న యూఫ్రేట్స్ వద్ద అరబ్ రాజ్యమైన అల్ హిరాకు అరబ్బు కవులు పయనిస్తుండేవారు. అరబ్బులలో ఇరాన్ సంస్కృతి వ్యాపించడానికి అదొక కేంద్రస్థానమని జెఫ్రీ రాశాడు. (జెఫ్రీ. పుట. 14, బరోడా 1938 ది ఫారిన్ ఒకాబ్యులరి ఆఫ్ ది కొరాన్)
      అల్ అషా వంటి కవుల రచలనలో పర్షియన్ పదాలు గుప్పించారు. అవస్తే, పెహ్వలి నుండి అనేక పర్షియన్ పదాలు అరబిక్ లోకి వచ్చాయి. కొందరు పేగన్ అరబ్బులు జొరాస్ట్రియన్లు అయ్యారు కూడా. దక్షిణ అరేబియాలో పర్షియా ప్రభావం ఉంది. నసానియన్ల పేర పర్షియన్ అధికారులు పెత్తనం సాగించారు. కొరాన్ లో జొరాస్ట్రియన్లను మద్ జూస్ అంటూ వారిని యూదుల స్థాయిలో చూపారు.  అలాగే క్రైస్తవులు, సబియన్లు కూడా. (సుర 22.17) ప్రవక్త జీవితాన్ని రాసిన ఇబ్న హిషం ప్రస్తావిస్తూ, అన్ నదిర్ ఇబ్న హరిత్ ఒకప్పుడు రుస్తుం కథల్ని మక్కా వాసులకు చెబుతూ, పర్ష్యా రాజులు, ఇప్నదియారా గాథలు వల్లించేవాడన్నారు. అంతేగాక తన కథలకంటే  మహమ్మద్ కథలు గొప్పవేమీ కాదనేవాడట. టోరే ఇలా రాశాడు. తన ప్రేక్షకులు అదృశ్యం కావడాన్ని గమనించిన ప్రవక్త, బదర్ యుద్ధానంతరం కసి, తీర్చుకున్నాడు. జనరంజకుడైన తన ప్రత్యర్థిని యుద్ధంలో పట్టుకుని, కథలు చెప్పిన దానికి చంపేశారు. (టోరే పుట 106 ది జ్యూయిష్ ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం 1933 న్యూయార్క్)
      ప్రవక్త అనుచరులలో సాల్మన్ అనే పర్షియన్ ఉండేవాడనీ, అతడు తన పూర్వీకుల మత విషయాలు మహమ్మద్ కు చెప్పి ఉండవచ్చునని ఇబ్నహిషాం రాశాడు.
మతము - మహమ్మద్
ఆరు రోజులలో సృష్టి చేసిన దేవునికి విశ్రాంతి కావాలనే భావనను మహమ్మద్ వ్యతిరేకించాడు. ఈ విషయంలో అతనిపై జొరాస్ట్రియన్ ప్రభావం ఉండవచ్చు. యూదుల సాబత్ పట్ల కూడా పార్సీమతవాదులు అలాంటి అభిప్రాయంతో ఉన్నారు.  మహమ్మద్ కూ ముస్లింలకూ శుక్రవారం విశ్రాంతి దినం కాదు. వారాంతంలో సమావేశం కావలసిన దినం మాత్రమే.
      గాడిద, కంచరగాడిద మధ్య పరిమాణం గల రెండు రెక్కల జంతువులపై స్వర్గానికి వెళ్ళిన మహమ్మద్. అక్కడ దేవదూత గాబ్రియల్, మోసెస్, అబ్రహాంలను కలిశాడు. తెల్లని ఆ జంతువును బురఖ్ అంటారు. ఇది అస్సీరియన్ల గ్రిఫన్ కు పోలింది కావచ్చు. ముస్లింల భావన పర్ష్యన్ భావాల నుండి సంక్రమించాయని బ్లాట్ అన్నాడు. స్వర్గారోహణ కూడా జొరాస్ట్రియన్ సాహిత్యం నుండి అరువు తెచ్చుకున్నవే. మహమ్మద్ చెప్పినట్లు ముస్లింలు ఇలా అంటారు.
     
స్వర్గానికి వెళ్ళిన మహమ్మద్
గేబ్రియల్ నన్ను గాడిదమీద కూర్చోబెట్టి స్వర్గద్వారాల దాకా తీసుకు వెళ్ళి తలుపులు తీయమని అరిచాడు. ఎవరు అని అడిగారు. గేబ్రియల్ అని చెప్పగా నీతోబాటు ఎవరు ఉన్నారు అంటే మహమ్మద్ ఆని చెప్పాడు. అతన్ని పిలిచారా అని అడిగితే అవునని గేబ్రియల్ చెప్పాడు. ఐతే ఆహ్వానిస్తున్నాం అన్నారు. ద్వారాలు తెరవగానే అరుగో నీ తండ్రి ఆదాం, ప్రణామం చేయమని గేబ్రియల్ అన్నాడు. నేను సలాం చేశాను. అతను కూడా సలాం చేస్తూ ఆహ్వానం పంపాడు. తరువాత 2వ స్వర్గ ద్వారం దగ్గరకు గేబ్రియల్ తీసుక వెళ్ళారు. అక్కడ జాన్, జీసస్ లు ఉన్నారు. 3వ ద్వారం దగ్గర జోసెఫ్ 4వ ద్వారం దగ్గర ఈనాక్, 5వ ద్వారం దగ్గర ఆరస్, 6వ ద్వారం దగ్గర మోజెస్ ఉన్నారు.  ప్రణామం తరువాత మోజెస్ విలపిస్తుండగా కారణం అడిగితే అతను సమాధానమిస్తూ నాకంటే తరువాత వచ్చిన వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నారన్నాడు. 7వ స్వర్గ ద్వారం దగ్గర నీ తండ్రి అబ్రహాం అని గేబ్రియల్ చూపగా ప్రణామం చేశాను. తుది ఆరోహణలో ఏనుగు చెవులంత ఆకులు, మంచి ఫలాలు లభించాయి, గేబ్రియల్ అదే చివరి స్వర్గం అని చెపుతూ లోనున్న రెండు నదులూ స్వర్గానివనీ, వెలుపల ఉన్న రెండు నదులూ నైల్, యూఫ్రటిస్ అని చెప్పారు.
    అరబిక్ లో మిరాక్ అనే ఈ స్వర్గారోహణ ముస్లిం శకానికి ముందే వందల సంవత్సరాల  క్రితం అర్త అనే పహాల్వీ గ్రంథంలో ఉన్నది. (టిస్ డల్, ఒరిజినల్ సోర్సెస్ ఆఫ్ ఇస్లాం, ఎడింబరో 1901, పుట. 80) జొరాస్ట్రియన్ పురోహితులు తమ విశ్వాసం సడలిపోతున్నదని, అర్తా విరాఫ్ ను స్వర్గానికి పంపి ఏం జరుగుతున్నదో  తెలుసుకు రమ్మన్నారు. స్వర్గారోహణ అనంతరం భూమ్మీదకు తిరిగి వచ్చి ఇలా వివరించాడు.
      తొలుత స్వర్గంలో కింది దశకు చేరుకున్నాను. అక్కడ వెలుగుతున్నదేవతను చూశాను. సారోష్, అజర్ లను చూశాను. ఇదేమి స్థలం, వారెవరు అని అడిగాను. బంగారం తొడిగిన సింహాసనం నుండి లేచి బహమన్ అనే దేవత ఓర్వజ్ అనే దేవత దగ్గరకు తీసుకెళ్ళారు. లోగడ అలాంటి దృశ్యం చూడలేదు.  ఆర్మజ్ కు సలాం చేసి అలాంటి స్థలానికి వచ్చినందుకు నన్ను ఆహ్వానించారు. స్వర్గం తరువాత నరకానికి తీసుకు వెళ్ళారు. ప్రణామం చేసిన అనంతరం దేవత నాతో మాట్లాడుతూ మళ్ళీ భూమి మీదకు వెళ్ళి చూసిందంతా చెప్పమని పంపించారు.
    ముస్లిం సంప్రదాయంలో సిరాత్ అనే రహదారి ప్రస్తావన ఉంది. చక్కని మత మార్గం అని కూడా అర్థం. నిప్పుల మీద ఈ వంతెన దారి ఉంటుంది. ఈ వంతెన వెంట్రుక వాసి సన్నగా కత్తికంటే పదునుగా ఉంటుంది. ఇరువైపులా ముళ్ళు ఉంటాయి. ధర్మపరులు మెరుపు కంటే వేగంగా నడిచి వెడతారు. పాపాత్ములు తప్పి పోయి నరకంలో పడతారు.
    ఇది జొరాస్ట్రియన్ పద్ధతి నుండి స్వీకరించి ఉంటారు. దీని ప్రకారం, మరణానంతరం, ఆత్మ ఒక వంతెన ద్వారా పోతుంది. పాపాత్ములు పోవడం అసంభవం.
      ఇండోయోరప్ జాతులలో ఒక భాగమైన ఇండో-ఇరానియన్లలో కలసికట్టుగా ఉన్న సామాన్య
సాంస్కృతిక సంపద ఉంది. వారి పూర్వీకులు ఒక జాతిలో భాగం కావడమే అందుకు కారణం. యజుర్వేదంలో ఈ వంతెన ప్రస్తావన హిందువుల సంప్రదాయంగా వచ్చింది. స్వర్గాన్ని గురించి ముస్లింల భావన ఇరానియన్ ఇండియన్ భావాలకు సన్నిహితమే. మరణానంతరం ఆత్మస్తుతిని జొరాస్ట్రియన్ గ్రంథం హాద్ హోక్స్ నస్క్ పేర్గొన్నది. పుణ్యాత్ముడి ఆత్మ, శవం వద్ద మూడురోజులుండి, చివరలో అందమైన 15 ఏళ్ళ యువతితో చేరి, స్వర్గానికి కలసికట్టుగా వెడతారు. ఇది అప్సరసల హిందు కథలను పోలి ఉంది. వారంతా ఇంద్రుని స్వర్గంలో ఉంటారు. (స్టట్లే డిక్షనరీ ఆఫ్ హిందూఇజం పుట.16, లండన్ 1977)  వీరంతా నర్తకిలే. స్వర్గానికి ఆత్మల్ని వీరు ఆహ్వానిస్తారు. యుద్ధంలో ఓడిన హీరోలను ఇంద్రుని స్వర్గం ఇలా సత్కరిస్తుంది. (డోసన్ పే 20 హిందూ మిథాలజీ అండ్ రెలిజియన్, కలకత్తా ముస్లింల స్వర్గభావన హిందువులను పోలినదే. తొలి క్రైస్తవ వ్యాఖ్యాతలు ఈ విషయాలను అపహాస్యం చేశారు కూడా. ముస్లింల కోసం అసువులు బాసినవారికోసం స్వర్గంలో కన్యల్ని అప్పగిస్తారు. కొరాన్ లో స్వర్గానికి వాడిన పదాలు పర్షియన్ లో ప్రస్తావించారు. కూజా (ఇబ్రిక్), ఆరిక్ (బండి) ఇలాంటివే. జెఫ్రీ ఇలా రాశాడు. క్రైస్తవ జాతుల నుండి అరువు తెచ్చుకొని, తెల్లని కన్యల గురించి ఉత్తరాది అరబ్బులు వాడగా వారి గురించే, స్వర్గ కన్యలుగా మహమ్మద్ ప్రస్తావించడంలో ఇరాన్ మాటల ప్రభావం కనిపిస్తుంది. (జెఫ్రి పుట 120, ది ఫారిన్ ఒకాబ్యులరీ  ఆఫ్ ఖురాన్ బరోడా 1938).
      పహల్వి గ్రంథంలో వర్ణించిన స్వర్గం వసంతకాలంలో విరబూసిన చెట్ల తోటల వంటిదే. ఇది ముస్లింల ఆనందకర ఉద్యానవనాలను పోలినదే. (సుర 56. 12-39, 76.12-22, 10.10, 55-50) ప్రభువుపట్ల భయం ఉన్నవారికి రెండు ఉద్యానవనాలు ఉన్నాయి. అన్ని రకాల ఫలాలు రెండేసి ఉన్న ఈ చెట్లకు జలజల పారే సెలయేటి నీరు అందుతుంది. కొన్ని నీడనిచ్చే వృక్షాలు ఉన్నాయి.
    సూఫీ ముస్లింల సంపూర్ణవ్యక్తికి జొరాస్ట్రియన్ మత వ్యక్తికి పోలిక ఉంది. ఉభయులకూ ఆమోదముద్ర  కావాలంటే  ప్రార్థన అవసరం. ఉభయులూ కొన్ని సంఖ్యలపట్ల మూఢనమ్మకాలతో ఉన్నారు. 33 అలాంటిదే 33 దేవతలు మనిషిని స్వర్గానికి తీసుకెడతారు. పవిత్రి విషయాల ప్రస్తావనలో 33 సంఖ్య ఉంది.
దయ్యాలు, అగ్ని, గాలి శక్తులు
      ఇన్ని మూఢనమ్మకాలతో ఉన్న ఇస్లాంను హేతుబద్ధమైన మతంగా 18వ శతాబ్దపు తాత్వికులు ఎలా భావించారో ఆశ్చర్యం వేస్తుంది. గాలి. అగ్ని శక్తులు, దయ్యాలు, భూతాల గురించి ముస్లింల భావాలను కొంచెం లోతుగా పరిశీలిస్తే తమ మూర్ఖత్వానికి ఈ తాత్వికులు కలవరపడేవారే.
      పర్షియనుల నుండి దేవతలూ, దయ్యాల నమ్మకాలు ఖురాన్ లోకి వచ్చాయి. పేగన్ అరబ్బులలో ఇస్లాంకు పూర్వం ఈ శక్తులూ, భూతాలను గురించి గందరగోళ భావనలుండేవి. చీకటిని జిన్ అనేవారు. ప్రకృతిలో విరుద్ధ శక్తులకు ఈ పేరు పెట్టారు. హిదెన్ అరేబియాలో వీటిని భయంకర శక్తులుగా చూశారు. ఇస్లాం కొన్ని సందర్భాలలో ఈ శక్తులను దయామయంగా భావించింది.
      హీదెన్ అరబ్బులు అదృశ్య జిన్ శక్తి వివిధ రూపాలలో అవతరిస్తుందని, పాములు, బల్లులు, తేళ్ళు అలాంటివేనని నమ్మారు. మనిషికి కూడా జిన్ పూనుతుందన్నారు. మూఢనమ్మకాలలో పెరిగిన మహమ్మద్ భూత శక్తులలో నమ్మకం కనబరచారు. హిదెన్ దేవుళ్ళను గుర్తించి దయ్యాలుగా వాటిని ప్రవక్త చూపాడు. (సుర. 37.158) అరేబియా ముస్లింలలోనేగాక ఈ నమ్మకాలు ఇతర ముస్లింలలోనూ వ్యాపించి విదేశాలలో ఉన్న నమ్మకాలతో చిలువలు పలవలుగా మారాయి.
      మహమ్మద్ కు సన్నిహిత మిత్రుడైన హసన్ ఇబ్నతబిత్  స్త్రీ శక్తి ప్రభావంతో కవిత్వం రాసిన తీరును ప్రొఫెసర్ మెగ్డానాల్డ్ వర్ణించాడు.
      మదీనా వీధుల్లో ఈ శక్తి అతన్ని కలిసి మీదపడి 3 కవితలు అల్లవలసిందిగా వత్తిడి చేసింది. అప్పటినుండి అతను ఆమె ప్రభావంతో కవి అయ్యాడు. జిన్ సోదరుడుగా తనను తాను వర్ణించుకొని తన కవితలో బరువైన పద్యాలన్నీస్వర్గం నుండి వచ్చాయన్నారు. కొరాన్ లో దైవదత్తాలను వ్యక్తం చేసే వాటినే ఇతడూ వాడాడు. (జిమర్. పుట. 126-27 ది ఇన్ ఫ్లూయన్స్ ఆఫ్ యానిమిజం ఇన్ ఇస్లాం) మహమ్మద్ కు తొలుత దైవం సందేశం వచ్చిన దానికీ, హసన్ ఇబ్నతాబిత్ వాడిన పదాలకూ పోలిక ఉన్నదని మెగ్డానాల్డ్ సూచించాడు.
      హసన్ ను స్త్రీ శక్తి పట్టి కవితలు చెప్పించినట్లే గేబ్రియల్ దేవత మహమ్మద్ తో ప్రవక్త వచనాలు చెప్పించింది. గేబ్రియల్ దేవత మహమ్మద్ కు అనుచరుడైనట్లే నఫాతా అనేమాట సమ్మోహనంగా జిన్ శక్తిని గురించి ప్రయోగించాడు.
    కొరాన్ లో మహమ్మద్ జిన్ శక్తులపట్ల నమ్మకాలుంచినట్లు అనేక సందర్భాలలో చూడవచ్చు. (సుర.72, సెమికోలన్ 6.3) అల్లాకు అనుచరులుగా జిన్ చూపినందుకు మక్కావాసులను మందలించటం కనిపిస్తుంది. (6.128) మక్కావాసులు ఈ శక్తులకు బలులిచ్చారు. (37.158) అల్లాకూ, ఈ శక్తులకూ సంబంధాన్ని మక్కావాసులు చూశారు. (55.14) పొగలేని నిప్పు నుండి ఈ శక్తుల్ని దేవుడు సృష్టించాడన్నాడు. జిన్ శక్తులు ఇస్లాం గుర్తింపు పొందినవి. కొరాన్ లో ఈ మూఢనమ్మకాలకు ఆమోదముద్ర ఉన్నది. మెగ్డానల్డ్ ఇలా రాసాడు. ఇస్లాం చట్టంలో ఈ శక్తుల చట్టబద్ధమైన స్థాయిని చర్చించి నిర్ధారించారు. వాటికి, మానవులకూ వివాహాలలో, ఆస్తులలో ఎలాంటి సంబంధాలున్నాయో చూపారు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం జిన్ వ్యాసం)
      ఇబ్నసెనా ఇలాంటి శక్తులు  లేవంటూ తొలి ఇస్లాం తాత్వికుడుగా ఖచ్చితంగా చెప్పాడు. ముస్లింలలో దృష్టిదోషం అనే మూఢనమ్మకం విపరీతంగా వ్యాపించి ఉన్నది. దురదృష్టాలకు అది కారణం అంటారు. కొరాన్ దీన్ని ఆమోదించింది. (సుర. 113) దీని చెడు ప్రభావాన్ని మహమ్మద్ నమ్మాడు. ప్రవక్తతో ఆస్మ-బిన్-ఉమాయిస్ చెపుతూ జఫర్ కుటుంబం దృష్టిదోషాలకు గురయింది. వాటిని తొలగించేదా అని అడుగుతుంది. ప్రవక్త సమాధానం ఇస్తూ విధిని అధిగమించేది దృష్టి దోషం ఒకటేనని, కనుక తొలగించమని అంటాడు.
యూదు వాదానికి రుణపడిన ముస్లింలు
      మహమ్మద్ దేవదూత విధానం, యూదు వాదం కలిపితే ఇస్లాం అవుతుంది. (జిమర్. ఎస్.ఎం. పుట.17 ఇస్లాం, ఎ ఛాలెంజ్ టు ఫెయిత్, న్యూయార్క్, 1908)
      మదీనా జీవితంలో సామాజిక, వాణిజ్య రంగాలకు సంబంధించి యూదులు ప్రముఖపాత్ర వహించారని ముస్లిం చరిత్రకారులే రాసారు. యూదు తెగలలో బాను, కానూక, బానూకు రాజ్య, బానునాదిర్ చాలా సంపన్నులుగా భూముల్ని, తోటల్ని సంపాదించారని చరిత్ర చెబుతున్నది. ఆ నగరంలో వృత్తి నిపుణులూ వ్యాపారస్తులూ ఉండేవారు. ఉత్తర అరేబియాలోని కైబర్, తైమా, ఫదక్ నగరాలలో చాలామంది యూదులుండేవారు. క్రీస్తు శకంలో తొలుత యూదుల నివాసాలు అక్కడ ఉండేవి. క్రీ.త. 70లో జెరుసలేం విధ్వంసమైనప్పుడు కొందరు ప్రవాసం వెళ్ళారు. దక్షిణ అరేబియా లోనూ యూదులు ఉన్నట్లు వర్తకులు కనుగొన్నారు. దక్షిణ అరేబియా మత ప్రస్తావనల్లో యూదు మత భావాలు కనిపించాయి. హిమియారెట్ రాజు ధూన్ వాస్ యూదులలోకి మారాడని కూడా సంప్రదాయం చెబుతున్నది.
      తోరె ఇలా రాశాడు. హిజాజ్ యూదుల నుండి విశ్వాసాలూ, ఆచారాలూ, మహమ్మద్ కు సంక్రమించాయని ఖురాన్ చదివినవారికి స్పష్టపడుతుంది. కొరాన్ లోని ప్రతిపుటలోనూ హిబ్రూ చరిత్ర యూదుల గాథలూ, యూదుల చట్టం, దైనందిన ఆచారవ్యవహారాలూ కనిపిస్తాయి. అబ్రహాం, మోజెస్ ల మతమే ఇస్లాంగా అవతరించింది. (పేజి. 2)
మహమ్మద్ అక్షరజ్ఞానం
      నోల్డెక్, వెల్ హాసన్ వంటి పండితులననుసరించి మహమ్మద్ నిరక్షరాస్యుడనీ, ముస్లిం సంప్రదాయం అలానే పేర్కొంటున్నదనీ తేటతెల్లమవుతున్నది. తోరే, స్ట్రెంగర్ లు మహమ్మద్ ను అక్షరాస్యుడు అంటున్నారు. మహమ్మద్ సామాజిక పరిస్థితి గమనిస్తే చదువుకున్న దాఖలాలేమీ లేవు. గౌరప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మహమ్మద్ చదవటం, రాయటం రాకపోతే వ్యాపారం చూచి పెట్టమని ఒక సంపన్న వితంతురాలు కోరిందనటం సహజంగా లేదు. పుస్తకాల పాండిత్యం ఉన్నవాడుగా తనను గుర్తించటం మహమ్మద్ కు ఇష్టం లేదు. అలాగైతే దైవం నుండి ప్రత్యక్షంగా తనకు వెల్లడైనట్లు నొక్కి చెప్పటం కష్టం అవుతుంది.
      ప్రవక్తకు యూదు చరిత్ర, చట్టం ఆచారాలూ ఎలా తెలిశాయి ? బహుశ యూదు పురోహితుడూ, లేదా ఉపాధ్యాయుడూ ఇందుకు తోడ్పడి ఉండవచ్చునని ఖురాన్ లో రెండు సూచనలున్నాయి. 25.5 సురలో నమ్మకం లేనివారు తనను ఎవరో చెప్పిన కథల్ని విన్నందుకు  అధిక్షేపించారన్నారు. తనకు అధ్యాపకులు ఉన్నారని మహమ్మద్ నిరాకరించకపోయినా, తనది దైవ ప్రేరణ అని చెప్పాడు. 16.105 సురలో దైవదూత ఇలా చెపుతుంది. వారన్నట్లు మనిషి అతడికి బోధించాడు. కాని వారు అన్యథా భావించే అతడి భాష అరబిక్  భాషే  దక్షిణ మెసపొటేమియా నుండి బేబిలోన్ యూదు ఉపాధ్యాయుడుగా  ఉండి ఉండవచ్చునని తోరే వాదించాడు.
      వ్యక్తుల నుండి నేర్చుకోవటం, యూదుల కేంద్రాలను సందర్శించటం కాక, యూదుల ఆచార వ్యవహారాలను మహమ్మద్ ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. యూదులతో సంబంధంగల అరబ్బులు వారి కథలూ, గాథలూ, అలవాట్లు గ్రహించాడు. ఇస్లాంకు ముందున్న కవితలో ఇవన్నీ ఉన్నాయి.
      ఖురాన్ లోని తొలి సురలననుసరించి యూదులూ, వారి మతం పట్ల మహమ్మద్ మెప్పు కనిపిస్తుంది. జెరూసలేం వైపుకు తిరిగి ప్రార్థించటం లాంటివి అవలంబించి వారి మెప్పు పొందటానికి మహమ్మద్ ప్రయత్నించాడు. లోగడ ప్రవక్తలనే తాను అనుసరిస్తున్నట్లు వారికి నచ్చజెప్పజూపాడు.
      గైగర్ రాసిన జుడాయిజం అండ్ ఇస్లాం ఆధారంగా ఇస్లాం పై యూదు ప్రభావాన్ని జిమర్ ఒక పట్టిక వేసి చూపాడు.
      (ఎ) భావాలు, సిద్ధాంతాలూ
      (1) ఖురాన్లో రబీ హిబ్రూ పదాలు
      (2) సిద్ధాంత అభిప్రాయాలు
      (3) నైతిక, ఆచార నియమాలు
      (4) జీవితం పట్ల అభిప్రాయాలు
      (బి) కథలూ, గాథలూ
1.      ఖురాన్లో రబి హిబ్రూ మాటలు
      హిబ్రూ నుండి 14 మాటల్ని గైగర్ చూపుతూ యూదుల భావాలు అందులో ఉన్నాయనీ పేగన్ అరేబియాలోనూ, హిదెన్ అరబ్బులలోనూ ఇవి లేవని అన్నారు.
      ఎ) తబూత్ అరబ్బు పదం ఏదీ కూడా ఇలా చివరలో ఉండదు. కనుక ఈ పదాంతం హిబ్రూ నుండి వచ్చింది.
      బి) తోర-యూదులకు వెల్లడయింది.
      సి) జన్నతు - అదన్ - స్వర్గం, ఈడెన్ వనం
      (డి) జహాన్నమ్ - నరకం. ఇది తొలుత విగ్రహారాధనగా సూచిస్తూ తరువాత నరకం అనే అర్థంలో వాడారు.
      (ఇ) అహబర్ - ఉపాధ్యాయుడు
      (ఎఫ్) దరస - గ్రంథ మూలార్థాన్ని నిర్దుష్టంగా, జాగ్రత్తగా పరిశీలించడం.
      (జి) రబాని - టీచర్
      (హెచ్) శబత్ - విశ్రాంతి దినం
      (ఐ) సికీనత్ - దైవసాక్షాత్కారం
      (జె) తగూర్త్ - దోషం
      (కె) ఫుర్ కన్ - విమోచన
      (ఎల్) మాన్ - ప్రవాసం
      (ఎమ్) మసాని - పునరుత్తం
      (ఎన్) మలాకుట్ - ప్రభుత్వం, దైవపాలన
      మహమ్మద్ తను అరబిక్ లో కొన్ని పదాలు వ్యక్తం చేయలేనందున ఖురాన్ కూడా, అరబిక్, సిరిక్ పదాలను స్వీకరించింది. మదీనా, మసీదు, సుల్నాస్, నబి ఇలాంటి పదాలే.
      యూదు వాదం నుండి ముఖ్యమైన ఇస్లాం సిద్ధాంత భావాలు స్వీకరించారు. అందులో కొన్ని.
దైవ ఏకత్వం
      పేగన్ అరేబియాలో దైవ ఏకత్వం కొత్త కాదు. యూదుల తిరుగులేని ఏకేశ్వర వాదం మహమ్మద్ ను ప్రభావవంతం చేయగా ఏకేశ్వర వాదాన్ని బోధించాడు.
లిఖిత అపౌర్షేయాలు
      మహమ్మదు పరిణామంలో అల్లా తనకు ఉత్తేజితులైన వారి ద్వారా లిఖిత పూర్వకంగా అందించాడనే విషయం ప్రధానమైనది. యూదు పండితులు తమ పవిత్ర గ్రంథాలపట్ల లోతుపాతులు తెలుసుకుని ఉండటం మహమ్మదుకు నచ్చింది. తమ సంతానం వలె వారికి పవిత్ర గ్రంథం కూడా తెలుసు. (2.141, 6.20) అదే ధోరణిలో తన అనుచరులు కూడా పాటించేటట్లు అరేబియన్ గ్రంథం కావాలనుకున్నాడు. ఖురాన్ కు మూలం స్వర్గంలో ఉందనీ, దాని ప్రతి లభించిందనీ భావించారు. (85.22) ఇలాంటి భావన పిర్కే అబోత్ (వి.6)లో కూడా ఉన్నది.
సృష్టి
      సృష్టిని గురించి మహమ్మద్ పేర్కొన్నది. బైబుల్ లోని ఎక్సోడస్ లో ఉన్నది. (20.11) భూమి, ఆకాశం సృష్టించిన తరువాత వాటి మధ్యదంతా అరు రోజుల్లో సృష్టి అయినా అలసట రాలేదు. (సుర. 1.37) మరొకచోట 2 రోజుల్లోనే భూమిని సృష్టించినట్లు ఖురాన్ పేర్కొన్నది. (41.8.11)
ఏడు స్వర్గాలు, ఏడు నరకాలు
      ఖురాన్ లో తరచూ ప్రస్తావించిన ఏడు స్వర్గాలూ (17.46, 23.88, 41.11, 65.12) చగీజా (9.2)లోనూ ఉన్నది. కొరాన్ లో నరకాన్ని ఏడు విభాగాలుగా చూపారు. (15.44) జుహార్ లో ఇలాంటి చిత్రణే ఉన్నది. (2.150) ఈ భావనలన్నీ ప్రాచీన ఇండో-ఇరానియన్ మూలాధారాలలో కనిపిస్తాయి. హిందూ, జొరాస్ట్రియన్ గ్రంథాలలో 7 సృష్టులు, 7 స్వర్గాలు ఉన్నాయి. దేవుడి సింహాసనం నీటిమీద  ఉన్నది. (సుర. 11.9) యూదుల రాషితో దీన్ని పోల్చి చూడవచ్చు. జూనిసిస్ లో దివ్య సింహాసనం స్వర్గం నుండి నీటిమీదకు వచ్చిందని ఉన్నది. (1.2) మాలిక్ నరక కాపలాదారుగా చిత్రహింసలను జరిపిస్తుంటాడని పేర్కొన్నాడు. (సుర. 43.76) అలాంటి రాకుమారుణ్ణి యూదులు కూడా పేర్కొన్నారు. అగ్ని దేవత విచిత్ర రూపమే మాలిక్. ఇది అమోనైట్స్, మోలెక్, లెవిటికస్, కింగ్స్, జరీమియాలో కనిపిస్తుంది.
      స్వర్గ, నరకాలను వేరుచేసే అరఫ్ గోడ ప్రస్తావన సుర 7.44లో ఉన్నది. ఇరువురి మధ్య పలుచని తెర అడ్డంగా ఉండగా ఉభయులూ పరస్చరం గుర్తిస్తారు. స్వర్గంలో ఉన్నవారిని ఉద్దేశించి  మీకు శాంతి కలుగుగాక అంటుంటారు.  వారికి స్వర్గం ప్రవేశించాలని ఉన్నా అలా చేయలేరు . ఎక్లీసియాస్ట్ 7.14 యూదుల మిద్రాష్ ఇలా ప్రస్తావిస్తుంది. మధ్య స్థలం ఎంత ఉన్నది ? జుకానన్ రబి ఒక గోడ ఉన్నదనగా అచారబి ఒక తెర ఉన్నదంటాడు. ఉభయులూ పరస్పరం చూసుకోవచ్చు. జొరాస్ట్రియన్ రచనలలో కూడా వెలుగు నీడల మధ్య ఉన్న అంతరమేనని ఇలాంటి ప్రస్తావనలు పేర్కొన్నాయి.
      ఖురాన్ లో సైతాను చాటుగా వినడం, రాళ్ళతో కొట్టి అతన్ని తరమటం ప్రస్తావించారు. (సుర. 15.17, 37.1, 67.5) యూదుల రచనలలో తెర వెనుక నుండీ వింటూ రాబోయే విషయాలు తెలుసుకోవడానికి జనై ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. సుర. 1.29 ప్రకారం నరకాన్ని ఉద్దేశించి  నిండిపోయిందా ? అనగా సమాధానంగా ఇంకెవరైనా ఉన్నారా ? అని అన్నది. అకిబాలో కూడా నరకాధిపతి రోజూ తనకు కడుపునిండా ఆహారం ఈయమని అడగటం కనిపిస్తుంది. (8.1)
      సుర 11.42, 23.27లో వరద ప్రళయాన్ని గురించి పాత్ర పొంగింది అని ప్రస్తావన ఉన్నది. యూదుల రచనలో మసిలే నీటితో ప్రజలను శిక్షించినట్లున్నది. స్వర్గంలో ప్రవేశించటం ఏనుగు సూది బెజ్జం గుండా వెళ్ళినట్టేనని రబైలు చెప్పగా, ఖురాన్ లో ఒంటె సూది బెజ్జం నుండి వెళ్ళినట్లే అన్నారు.  (సుర. 7.36)
      టాల్ మండ్ లో మనిషి చేతులే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెపుతాయని ఉన్నది. (చగీజ 16, తనిత్ 11) మనుషులకు వ్యతిరేకంగా మనుషులే సాక్ష్యం చెపుతారు.   మీరే నాకు సాక్ష్యం అని ప్రభువు అన్నాడు. సుర 24.24లో వారి చర్యలకు విరుద్ధంగా వారి నాలుకలూ, చేతులూ, కాళ్ళే సాక్ష్యం చెపుతాయి.
    సుర 22.46లో దేవునితో ఒకరోజు నీ వేయి సంవత్సరాలతో సమానం బైబుల్ సామ్స్ లో 90.4 ప్రకారం దేవుని సృష్టిలో వేయి సంవత్సరాలు గడిచినా ఒక్క రోజుతో సమానం.
కాఫ్ పర్వతం
      సంప్రదాయాల ప్రకారం అబ్దల్లా ఒకనాడు భూమి మీద అత్యున్నత పర్వతం ఏదని ప్రవక్తనడగగా  కాఫ్ పర్వతం అనీ, అక్కడ పచ్చలు (ఎమరాల్డ్స్) దొరుకుతాయన్నాడు. జనెసిస్ లో 1.2 లోహు యావత్తు ప్రపంచాన్ని పచ్చని రేఖతో నింపుతుంది. కనుక చీకటి వచ్చిందని ఉన్నది. దాని ముసుగు రూపమే పై సంప్రదాయాలలోకి వచ్చింది.
నైతిక చట్టబద్ధమైన నియమాలు
      మహమ్మద్ కొన్ని నీతి ప్రవచనాలను తాల్మడ్ నుంచి తెచ్చుకున్నాడు. పాపాన్ని అనుసరించమని తల్లిదండ్రులు కోరినా పిల్లలు నిరాకరించాలి. జబామత్ 6, సుర 29.7, రంజాన్ సందర్భంగా ఉపవాసంలో తినటం, త్రాగటాన్నిగురించి సుర 2.187 ఇలా చెప్పింది. సూర్యోదయంలో తెలుపు నలుపు దారాల మధ్య తేడా చూడగలిగినంతవరకూ తిని, తాగి తరువాత ఉపవాసం ఉండు. మిష్న, బెరాకోత్ 1.2లో షమా ప్రార్థన చేయాలి.  సుర 4.46లో భక్తులు  తాగినప్పుడూ, మలినం అయినప్పుడూ, స్త్రీ సంపర్కం ఉన్నప్పుడూ ప్రార్థన చేయరాదన్నాడు. బెరాకాత్  31.2, 111.4, ఎరుబిన్ 64 ప్రకారం ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. ప్రార్థన నిలుచుండి, నడుస్తూ, స్వారీలో  కూడా చేయవచ్చు.  బెరాకత్ 10, సుర 2.230, 3.188, 10.13, అత్యవసర పరిస్థితులలో పాపం చేయకుండా ప్రార్థనల వ్యవధి తగ్గించవచ్చు. మిష్న జరాకత్ 4.4, సుర 4.102 జరాకత్ లో పేర్కొన్నట్లే ప్రక్షాళన క్రతువు 5.8 సురలో ఉన్నది. నీరు లేనప్పుడు  ఇసుకతో ప్రక్షాళన చేసుకోవచ్చని సుర 4.46, 5.8 చెబుతున్నది. తాల్ మద్ లో ఇసుకతో శుభ్రం చేసుకుంటే చాలు అని అన్నారు. బెరాకాత్ 46 ప్రార్థనలు మరీ బిగ్గరగా ఉండరాదని సుర 17.110 చెపుతుండగా, అదే విషయం 31.2లో బెరాకాత్ పేర్కొన్నది.
      ఖురాన్  సుర 2.28 ప్రకారం విడాకులు పొందిన స్త్రీ తిరిగి పెళ్ళి చేసుకోటానికి  3 మాసాల వ్యవధి ఉండాలి. అదే నిబంధనను మిష్న జబామత్ 4.10 చెప్పింది. తాల్ మద్ కెతూబత్ 40.1 పేర్కొన్న వివాహ సంబంధాలు కొరాన్ సుర 2.33లో అనుసరించింది. బిడ్డకు రెండేళ్ళపాటు తల్లిపాలివ్వాలని ఉభయ మతాలు నొక్కి చెబుతున్నాయి.  సుర  31.13, 2.223, కేతుబత్ 60.1.
      యూదుమతం నుండి మహమ్మద్ స్వీకరించిన సిద్ధాంతాలను తోరే ఇలా పేర్కొన్నాడు.
      డేనియల్ 19.2లో చిరపరిచితమైన భావన పునరుత్థానం, ఇందులో ప్రస్తావన ఉన్నది. తీర్పునాడు అందరి వివరాలు వివరంగా చూస్తారు. స్వర్గం, నరకం, ఉద్యానవనం, నిరంతర అగ్నిలో దహనం అనేవి నిర్ణయిస్తారు. వీటినే మహమ్మద్ తన కల్పనతో ఇంకా మెరుగులు దిద్దాడు. దేవతలూ, దయ్యాలూ సిద్ధాంతపరంగా చోటు చేసుకున్నాయి. ఖురాన్ లో స్వర్గానికీ, భూమికీ, మనిషికీ, ప్రకృతికీ ఇచ్చిన చోటునుబట్టి చూస్తే జెనెసిస్ ప్రథమాధ్యాయం మహమ్మద్ ను బాగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.
కథలూ, గాథలూ
    ఇమాన్యుఅల్ డాష్ ఇలా రాసాడు.
      మహమ్మద్ చిన్నప్పటి నుండీ సమకాలీన యూదు మతాన్ని బాగా ఆకళింపు చేసుకొని, మనకు తాల్ మద్, తార్గం, మిద్రాష్ లో కనిపించేదంతా జొప్పించాడు  
    ఖురాన్ లో కనిపించే పాత నిబంధన పేర్లుః
    అరన్-హరుణ్, ఏబెల్ -హబిల్, అబ్రహాం-ఇబ్రహీం, ఆదం-ఆదం, కెయిన్-కబిల్, డేవిడ్ -దావూద్, ఎలియాస్ - ఇలియాస్, ఎలీజా-అల్యాన, ఇనాక్-ఇద్రీస్, ఎజ్రా - ఉజేయిర్, గేబ్రియల్ -జిబ్రిల్, గాగ్-ఎజూజ్, గోలాయత్ - జలూత్, ఐజాక్ - ఇషాక్, ఇస్మాయిల్, ఇస్మాయిల్, జేకబ్-యాకూబ్, జోబ్ - అయూబ్, జోనా - యూనస్, జాషువా-యూష, జోసెఫ్-యూసఫ్, కోరా - కొరాన్, లోట్ - లూత్, మజాగ్ - మజూజ్, మైకల్ -మికెల్, మోజెస్-మూసా, నోవా-నూహ్, ఫెరొ-ఫెరాన్, సాల్-సాలుత్, సోలమన్ - సులేమాన్, తెరా -అజర్.
      పాత నిబంధనల నుండి స్వీకరించిన ఘట్టాలూ, కథలపై ఇస్లాం నిఘంటువు వ్యాఖ్యానిస్తూ వింత నిర్దుష్టత కోసం తాల్ముడ్ గాథలను మిళితం చేసి చూశారని పేర్కొన్నది. ఆరస్ ఆవుదూడను చేస్తాడు 20.90.
      కెయిన్, ఎబెల్ 5.30
      అబ్రహాం దేవతల్ని సందర్శించుట 11.72, 15.51
      కుమారుని బలి ఇవ్వటానికి అబ్రహాం సంసిద్ధత 37.101
      ఆదాం పతనం 7.18, 2.84
      కొరా, అతని వర్గం, 28.76, 29.38, 40.25
      ప్రపంచసృష్టి 16.3, 13.3, 35.1, 12
      దావీద్ దైవస్తుతి 34.10
      ప్రళయం 54.9, 59.11, 11.42
      జేకబ్ ఈజిప్టుకు పోవుట 12.100
      జోనా-చేపలు 6.86, 10.98, 37.139, 68.48
      జోసెఫ్ చరిత్ర 6.84, 12.1, 40.86
      అమృత వర్షం 7.160, 20.82
      మోజెస్ శిఖరాన్ని తాకుట 8.160
      నోవానవ  11.40
      పేరో 2.46, 10.76, 43.45, 40.38
      సోల్ మన్ తీర్పు 21.78
      షీబారాణి 27.72
      మహమ్మద్ లోగడ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలను ముఖ్యంగా హిబ్రూ గ్రంథాలను దృష్టిలో పెట్టుకుని సన్నిహిత సంబంధం ఏర్చరచుకున్నాడు. (తోరే పుట 105) మహమ్మద్ ఈ విధంగా పాత నిబంధనలనుండి అనేక సంఘటనలు, పాత్రల్ని స్వీకరించినా వాటితో సూటిగా పరిచయం ఉండబోదని చాలమంది పండితులంటారు, ఓబర్ మన్ ఇలా రాసాడు.
      మహమ్మద్ దైవదత్తంగా భావించేవన్నీ పాత నిబంధన చుట్టూ పరిభ్రమిస్తుండగా అందులో ఎన్నో అసంబద్ధతలు, వ్యత్యాసాలు, భ్రమలు కనబరచాడు. అలాగే కొత్త నిబంధనకు సంబంధించి కూడా ఉన్నది. ఇలా వక్రీకరించిన బైబుల్ విశేషాలు మహమ్మద్ వెల్లడించిన వాటిలో ఉండగా బైబుల్ అనంతర ఆధారాల్లోనూ అలాంటివి కనిపించాయి.  (ఓబర్ మన్ పుట 94 అరబ్ హెరిటేజ్ ప్రిన్స్ టన్ 1944)
మహమ్మద్ పై తోరే అభిప్రాయం
      తాల్ ముద్ తదితర యూదు ఆధారాల నుండి స్వీకరించినప్పుడు కూడా మహమ్మద్ సొంతమేదీ చూపలేదు. తోరే ఇలా రాశాడు.
      అతడి పాత్రలన్నీ ఒకే తీరులో ఉంటూ ఒకే భాషణలు చేశాయి. అతడికి నాటకీయ సంభాషణ ఇష్టం. కాని నాటకాలలో దృశ్యం సాగేతీరు ఆట్టే తెలియదు. సంఘటనల క్రమం తార్కికంగా ఉండేది కాదు. కథావగాహనకు అవసరమైన స్పష్టత వదిలేసేవాడు. పునరుక్తి కనబడేది. హాస్యం లోపించింది. సుర 11.27-51లో నోవా అనుభవాలు సుదీర్ఘంగా పేర్కొన్నారు. ఖురాన్ లో అనేకసార్లు చెప్పిన ధోరణిలోనే ఒకేరీతిలో ఉత్తేజంలేని, విసుగుపుట్టించే సందర్భాలున్నాయి. నోవా సమకాలీనులు 40 పగళ్ళూ, 40 రాత్రిళ్ళూ ప్రళయంలో పయనించటానికి సంసిద్ధులయ్యేవారేమో, (తోరే, పుట 108, న్యూయార్క్ 1933, ది జ్యూయిష్ ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం)
    హిబ్రూ వరుస క్రమం గురించి మహమ్మద్ కు స్పష్టత లేదు. సాల్, డేవిడ్, సోలమన్లు పేట్రియార్క్ కు తరువాత వచ్చారని తెలుసు. ఇతర ప్రవక్తలూ, వారి నివాసకాలం క్రమంగా తెలియదు. ఎజ్రాను గురించి స్పష్టత లేనందున నిర్దుష్టంగా అతడిని ఎక్కడ ఉంచాలో తెలియదు.
      ఎలీజా, ఎలీషా, జోబ్, జోనా, ఇద్రిస్ మొదలైనవారిని ఎక్కడ ఉంచాలో తెలియక వదిలేశాడు. జీసస్ వంశక్రమం అతడు వినలేదు. జాన్ ను గురించి తప్ప మిగిలిన సమకాలీనుల గురించి కూడా తెలియదు. క్రైస్తవ చరిత్ర తెలియదు. మోజెస్ ను జీసస్ తో కలిసి చూపేవాడు.  జీసస్ తల్లి మేరీని మోజెస్ సోదరి మిరియం. ఆరన్ లతో కలిపి చూశాడు. నోవా కాలంలో రాజైలు పేర్కొన్న సంఘటనను మహమ్మద్ సాలమన్ కు సంక్రమింపజేశాడు. 950 సంవత్సరాలు బ్రతకగా (జెనెసిస్ 9.29) మహమ్మద్ వరద ప్రళయ కాలాన్ని అన్ని సంవత్సరాలుగా పేర్కొని  గందరగోళం సృష్టించాడు. (సుర 29.13) జెనెసిస్ లో (9.22) ప్రళయానంతరం జరిగిన హేమ్ చెడు ప్రవర్తనను గురించి కూడా మహమ్మదు గందరగోళం చెందాడు. నోవా భార్యను నమ్మకం లేని వారిలో ఎందుకు చేర్చాడో తెలియదు. ఖురాన్ లో సాల్ గిడియన్ల మధ్య ఇలాంటి గందరగోళమే ఉన్నది. (సుర. 2.250,  జడ్జిమెంట్ 7.5)
ఆదాము సృష్టి
    సుర 2.28-33 ఇలా చెబుతున్నది. దేవతలతో ప్రభువు ఇలా అన్నాడు. భూమి మీద నా బదులు ఒకరిని ప్రవేశపెట్టబోతున్నాను అని దేవుడు అనగా వారు ఇలా అన్నారు. పాపాలు చేసి, రక్తం చిందించేవారిని ప్రవేశపెడతారా, ఐనా నిన్ను శ్లాఘించి కొలుస్తాము. దీనికి భగవంతుడు మీకీ విషయం తెలియదని నాకు తెలుసు అన్నాడు. ఆదాముకు అన్ని వస్తువుల పేర్లు  చెప్పి దేవతలవైపు తిరిగి మీరు చెప్పేది నిజమైతే వస్తువుల పేర్లన్నీ చెప్పమని అడిగాడు. వారు దేవుని స్తుతిస్తూ తమకు, తెలియదనీ, దేవుడు వివేచనాత్ముడనీ, సర్వజ్ఞుడనీ అన్నాడు. ఆదామును పేర్లన్నీ చెప్పమని దేవుడు ఆజ్ఞాపించగా, అతడు అన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు భూమి ఆకాశాలలో రహస్యాలన్నీ నాకు తెలుసనీ, మీరేది దాచిపెడతారో, ఏది వెల్లడిస్తారో నాకు తెలుసు అని దేవుడు వారితో అన్నారు.
      పై కథకు ఆధారాలెక్కడో చూద్దాం. మానవుని సృష్టించాలని దేవుడు ఉద్దేశించి దేవతలకు సలహాలిస్తూ మన రూపంలో మనిషిని సృష్టిద్దామన్నాడు. (జెనెసిస్ 1.26) అంతటవారు దేవుణ్ణి ఉద్దేశించి దేవతలకు సలహాలిస్తూ మన రూపంలో మనిషిని సృష్టిద్దామన్నాడు. (జెనెసిస్ 1.26) అంతట వారు దేవుణ్ణి ఉద్దేశించి మానవుడు ఎవరు, అతడి ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. (కీర్తనలు 8.5) అందుకు సమాధానమిస్తూ మీకంటే అతని వివేచన అధికమైనది అన్నాడు. అప్పుడు వారి ముందుకు పశువుల్నీ, పక్షుల్నీ తెచ్చి పేర్లు చెప్పమనగా చెప్పలేకపోయాడు. మనిషిని సృష్టించిన తరువాత  అతడిని అడిగితే వాటి పేర్లన్నీ చెపుతూ ఎద్దు, గాడిద, గుర్రం, ఒంటె అంటూ వరుసగా పేర్కొన్నాడు. నీ పేరేమిటి అని అతడిని అడిగినప్పుడు భూమిలో నుంచి పుట్టాను అని చెప్పగలిగాడు.  (లెవెటికస్,  పరాష 19, జెనెసిస్ పరాష 8, సానెడ్రిస్ 38)
      వివిధ సురలు ఆదామును దేవతలు పూజించాలని భగవంతుడు ఆదేశించినట్లు పేర్కొన్నాయి.  (7.10-26, 15-29-44, 18.48, 20.115, 37.71-86) సైతాను తప్ప మిగిలిన వారంతా ఈ ఉత్తరువులు పాటించారు. రాబై మోజెస్ మిద్రాస్ లూ పేర్కొన్న దానితో ఇది సరిపోతుంది.
దేవుడు పంపిన కాకి
    మహమ్మద్ ప్రవచించిన ధోరణిని తోరే విమర్శించగా, ముఖ్యమైన కథావస్తువులు వదిలివేసిందానికి ఉదాహరణగా కెయిన్, ఏబెల్ ఉదంతాన్ని గైగర్ ఇచ్చాడు. ఖురాన్ లో (సుర 5.35) పొందికగా ఈ విషయాన్ని పేర్కొనలేదంటూ మిష్న సన్ హెడ్రిస్  4.5లో గమనిస్తేగాని స్పష్టత రాలేదని గైగర్ చూపాడు. ఖురాన్ లో ఏబెల్ హత్యను బైబుల్ నుండి స్వీకరించారు. కెయిన్ చంపకముందు ఏబెల్ సంభాషణను జెరూసలేంకు చెందిన టార్గమ్ నుండి స్వీకరించారు. ఖురాన్ లో ఈ హత్యానంతరం ఎబెల్ ను పాతిపెట్టడానికి కెయిన్ కు తోడ్పడే నిమిత్తం దేవుడు ఒక కాకిని పంపిస్తాడు.
      దేవుడు పంపిన కాకి భూమిని తవ్వి సోదరుడి దేహాన్ని ఎలా పాతి పెట్టాలో కెయిన్ కు చూపింది. అప్పుడు పశ్చాత్తాపం చెందిన వారిలో ఒకడుగా అతడు రూపొందాడు. అత్మను చంపినవారు మానవాళిని చంపినట్లే, ఈ విషయం ఇజ్రాయిల్ సంతతికి తెలియజెప్పడమైంది. ఆత్మను సజీవంగా సంరక్షించినవారు మానవాళిని రక్షించినట్లే. (సుర 5.30-35).
      ఈ మాటలకూ ఇంతకు ముందు చెప్పిన దానికీ సంబంధం లేదు. దీనిలో స్పష్టత చూడాలంటే మిష్న సాన్వెడ్రిస్ పరిశీలించాలి. 4.5.
      కెయిన్ తన సోదరుణ్ణి చంపాడు. సోదరుడు రక్తం చిందించి ఎలుగెత్తి పలికింది. ఇక్కడ రక్తాన్ని ఏకవచనంతో కాక బహువచనంతో ప్రయోగించారు. మానవుణ్ణి వ్యక్తిగా సృష్టించిన అతణ్ణి చంపినప్పుడు మొత్తం జాతిని చంపినట్లుగా  భావించాలని పేర్కొన్నారు. వ్యక్తి జీవితాన్ని కాపాడిన వారు జాతి యావత్తునూ కాపాడినట్లే అన్నారు.
      ఈ వదిలేసిన భాగాన్ని ఖురాన్ లో చేర్చి చూస్తే విషయం బోధపడుతుంది.
నోవా
      ఖురాన్ లో నోవా కథ కొంతవరకు జెనెసిస్ నుండి రాగా, అతడి శీలాన్ని గురించిన విషయం రాబైల ఆధారంగా రాబట్టారు. (సుర 7.57, 10.72, 22.43) నౌకను నిర్మిస్తున్నప్పుడు తన వారితో నోవా మాట్లాడిన మాటలు సాన్ హెడ్రిస్ లో ఉన్నాయి. (108) కొరాన్ , రాబై గ్రంథాలు కూడా వరదలలో జనించిన తరంవారికి మసిలే నీటిలో శిక్షించారని రాసాయి. (రోష్ హష్న 16.2 , సాన్ హెడ్రిస్ 108, సుర 11.42, 33.27)
      నిందాడ్ ఆగ్ని ప్రమాదం నుండి అబ్రహాంకు (ఇబ్రహాం) కథ ఖురాన్ అంతటా ప్రస్తావించారు. సుర 2.260, 6.74-84, 21.52.72, 19.42-50, 26.69-79, 29.15, 16, 37.81-95, 43.25-27, 60.4, గైగర్ తిష్ డాల్ ప్రకారం ఖురాన్ మూలాధారాలు, సంప్రదాయాలు యూదు మిద్రాష్ రాబా నుండి స్వీకరించినవే. బైబిల్ విషయాల గురించి మిద్రాష్ ముస్లిం మూలంలో భిన్నత్వం ఉంది. హామ్ మనుమడుగా నిమ్ గాడ్ ను జెనెసిస్ పేర్కొని, అతడు సామ్రాజ్యాన్ని స్థాపించాడన్నది. ముస్లిం, మిద్రాష్ కథనం ప్రకారం, నిమ్ రాడ్ ప్రజలు పూజించే విగ్రహాలు ధ్వంసం చేసినందుకు అతన్ని శిక్షించారు. అతన్ని నిప్పుల్లో పడేస్తే హాని లేకుండా బయటపడ్డాడు. తిష్ డాల్ ప్రకారం జనెసిస్ 15.7ను అవగాహన చేసుకోనందున ఇలాంటి కథ వచ్చింది. నేను ఉర్ నుండి మిమ్మల్ని బయటకు తెచ్చిన ప్రభువును  ఉర్ బాబిలోనియా నగరం. చాల్డియన్ ఉర్ అనేది అబ్రహాం నగరం. మాటల్లో ఉర్  శబ్దం ఓర్ వలె వినిపించవచ్చు. ఓర్ అంటే నిప్పు వెలుగు. కొన్నాళ్ళకు యూదు వ్యాఖ్యాత జొనాథన్ బెన్ ఉజల్ జనిసిస్ నుండి అనువదిస్తూ చాల్డియన్ అగ్ని గుండం నుండి రక్షించిన ప్రభువును  అన్నాడు. విగ్రహారాధన చేయని అబ్రహాంను అగ్నిగుండంలోని నిమ్ రాడ్ పడేసినట్లు రాసి, దోషాల్ని ఇంకా పెంచేశాడు. వ్యాఖ్యాత. జెనెసిస్ ను ఒప్పుకున్నా, నిమ్ రాడ్ ఒక వేళ వుంటే, అతడు అబ్రహాం సమకాలీనుడు కాదు.
జోసెఫ్
      బైబిల్ నుండి ప్రధాన కథ స్వీకరించినా, ఖురాన్ పేర్కొన్న దానిలో జోసెఫ్ గురించి పొందిక లేదని టోరే చూపాడు. (టోరే పుట 108) సుర 12 అంతా అతడిని గురించి ఉంది. ఇందులో పోయిన కొన్ని భాగాలను మిద్రాసి నుండి తెచ్చి నింపితే అర్థమౌతుంది.  (మిద్రాష్ యల్ కుత్ 146)
      పోతిఫర్ భార్య జోసెఫ్ ను ఆకర్షించ ప్రయత్నిస్తుంది. తొలుత అతడు నిరాకరించి, వెలుగు తన నుండి వెళ్ళిపోతుండగా, అంగీకరిస్తాడు.
      ఎలాంటి వెలుగో ఖురాన్ చెప్పదు. ఖురాన్ ఈ విషయాన్ని సోటా నుండి 36.2 స్వీకరించింది. రాబి జొకాసన్ ఇలా చెపుతూ, ఇరూవురూ పాపం చేశారు. అమె తనతో రమ్మని అతడిని అడిగింది. అప్పుడు అతడికి తండ్రి స్వరూపం కనిపించి జోసెఫ్, నీ సోదరుల పేర్లు నీతోపాటు యఫాడ్ రాళ్ళపై చెక్కుతారు. అవి చెరిపేటట్లు చూస్తావా ?
    ఖురాన్ లో ఈ కథ అర్థం కాదు. మిద్రాష్ యాల్ కుట్ 146 చూస్తే గానీ అసలు విషయం తెలియదు. పోటిఫర్ భార్య మోహం చూసి నవ్విన స్త్రీలందరినీ ఒక విందుక పిలువగా అక్కడ జోసెఫ్ అందం చూసి ఒళ్ళు మరిచి కత్తులతో వేళ్ళు కోసుకున్నారు. అలా కత్తులెందుకున్నాయో కొరాన్ వివరించదు. పండ్లు కోసి తినడానికి ఆ కత్తులు ఉద్దేశించినట్లు మిద్రాష్ యార్ కుట్ పేర్కొన్నది.
      ఖురాన్ లో జేకబ్ తన కుమారులను భిన్న ద్వారాల నుండి ప్రవేశించమంటాడు. జెనెసిస్ పరీష 91 ప్రకారం జేకబ్ వారితో ఒకే గేటు ద్వారా ప్రవేశించవద్దని అంటాడు. తోరే ఈ కథను ఇలా వివరించాడు.
      బెంజమిన్ వద్ద కప్పు ఒకటి కనిపించగా అతడిని దొంగ అన్నారు. అతడు దొంగతనం చేసి ఉంటే అంతకు ముందే అతని సోదరుడు కూడా చేసి ఉంటాడని అక్కడివారన్నారు. జోసెఫ్ ను దొంగగా చిత్రించటం గురించి వ్యాఖ్యాతలు విఫలమయ్యారు. బెంజమన్ తల్లి అంతకు ముందు ఇది కాజేసినట్లు మిద్రాష్ లో వివరణ ఉన్నది. రేచల్ ఆమె తండ్రి ఇంట్లో దైవ విగ్రహాలను తీసుకు వెళ్ళిపోయిన కాలానికి ఈ సందర్భం వర్తిస్తుంది.  (జెనిసిస్ 31, 19-35)
      ఖురాన్ ప్రకారం జేకబ్ కు అతని కుమారుడు జోసెఫ్ బ్రతికి ఉన్నట్లు దివ్యదర్శనం ద్వారా తెలుసు. (సుర 12.86) ఈ సమాచారాన్ని ఎప్పుడు రాబట్టిందీ మిద్రాష్ యాల్ కుబ్ వివరిస్తుంది. (సి ఎక్స్ ఎల్ 111) నమ్మకం లేనివారు తన యజమానిని, చనిపోయినవారు జీవితాన్ని కొనసాగిస్తారా అని అడిగాడు. అలాగైతే జేకబ్ విషయంలో ఊరడించటం సాధ్యమయ్యేది. ఇందుకతడు సమాధానమిస్తూ అతడింకా బతికే ఉన్నాడనీ, కనుక ఓదార్చవలసిన సమస్యే లేదనీ అన్నాడు.
హుద్, మోజెస్, ఇతరులు
      బైబుల్లోని ఎబర్ ను హుద్ గా  పేర్కొన్న వివరాలన్నీ  రాబై రచనల నుండి స్వీకరించారు. (సుర 11.63 ను మిష్నాసాస్ హెడ్రిన్ 10.3తో పోల్చవచ్చు.). ఖురాన్ లో ఇలాంటివే మోజెస్, ఫెరోని గురించి కూడా ఉన్నాయి.  ఎక్సోడస్ లో 15.27 యూదు వ్యాఖ్యాతలు వివరిస్తూ ఎలిమ్ వద్ద 12 నీటి బుగ్గలు కనుగొన్నారని, ప్రతి తెగకూ ఒక బావి ఉండేదని రాశారు. దీనినే మహమ్మద్ మార్చేసి మోజెస్ తాకిన కొండ శిఖరం నుండి 12 నీటిబుగ్గలు వచ్చాయన్నాడు. అబోదసార 2.2లో దేవుడు నియమాలను ఇస్తున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలని సీనాయి పర్వతంతో కప్పిపుచ్చాడన్నారు. దీనినే ఖురాన్ సుర 7.170లో ఇలా పేర్కొన్నది. పర్వతాన్ని కుదిపేయగా  అది ప్రజల్ని ఆవరించటం  వలన తమపై పడుతున్నట్లు వారు భయపడ్డారు. భక్తితో మేము తెచ్చిన నియమాలను స్వీకరించమని చెప్పాం.
సోలమన్ శక్తులు
      సోలమన్ కథను షీబారాణితో గల సంబంధాన్ని ఖురాన్ పేర్కొన్నది. సోలమన్ పక్షులతో మాట్లాడగలడని కొరాన్ చెపుతుంది. యూదు వ్యాఖ్యాతలు అదే అభిప్రాయం వెల్లడించారు. వివిధ సురల ప్రకారం గాలి, శక్తులు సోలమన్ కి లొంగాయి. పక్షులు, పశువులూ, భూతాలూ అతడి సైన్యంగా ఉన్నాయి. (సుర 21.81, 27.15, 34.11, 38.35) ఎస్తర్ లో వివిధ భూతాలూ, దయ్యాలూ అతడికి లొంగి ఉండేవి అని ఉండేది. ఈ భూతాలు దేవాలయ నిర్మాణంలో తోడ్పడిన కథను మహమ్మద్ చెప్పాడు. అతడి మరణానంతరం కూడా నిర్మాణం కొనసాగించారని అన్నాడు. సుర 34. ఇది యూదుల గిటిన్ 68 నుండి స్వీకరించారు.
అలెగ్జాండర్
      పాత నిబంధన రాబై సాహిత్యం,  అరేబియన్ కథల ఆధారంతో కాక భిన్నంగా ఖురాన్ లోని సుర 18 కొన్ని గాథల్ని పేర్కొన్నది. వీటికి ఆధారాలు చూపే ముందు రెండు నదుల సంగమం కోసం మోజెస్, అతని సేవకుడి అన్వేషణతో అరంభిద్దాం. మధ్యమ అల్ బహరాయ్ 59.81.
     
మోజెస్
      అక్కడికి చేరేటప్పటికి సైతాన్ ప్రభావం వలన తనతో తెచ్చుకున్న చేపల సంగతి మరచిపోయారు. అవి నీటిలోకి దూసుకెళ్ళిపోయాయి. చేపల కోసం వెతుకుతుండగా దైవ సేవకుడు కనిపించాడు. సరైన మార్గం చూపిస్తే అతన్ని అనుసరిస్తానని మోజెస్ (మూసా) అంటాడు. వారొక ఒప్పందానికి వచ్చిన తరువాత అతడు మోజెస్ ను ఉద్దేశించి నా చర్యలు నీకు తొలుత అర్థం కావనీ, వివరణ అడగవద్దనీ, కొన్నిసార్లు భరించటం కష్టమవుతుందనీ అన్నాడు. వారలా పోతుండగా  దైవసేవకుడు చేస్తున్న కొన్ని ఘోరకృత్యాలను చూసి సహనం కోల్చోయిన మోజెస్ ను సంజాయిషీ అడుగుతాడు.  నేను ముందే చెప్పాను కదా నీకు ఓపిక ఉండదని అంటూ మోజెస్ ను  (మూసా) వదిలి వెళ్ళిపోతూ తన చర్యలకు కారణాలు చెప్పగా అన్నిటికీ తగిన వివరణ ఉన్నట్లు తెలిసింది.
    ఈ కథకు 3 ఆధారాలను నోల్డెక్ తదితరులు చూపారు.
1. గిల్ గామిష్ గాథ క్రీస్తు పూర్వం 18వ శతాబ్దంలో ఈ బేబిలోనియన్ కవిత ఇంకిడు, గిల్ గామిష్  ల వీరోచిత గాథకు ఇంకిడు చనిపోయినప్పుడు తాను చనిపోతాననుకొని అమరత్వం కోసం గిల్ గామిష్ అన్వేషిస్తాడు. తన పూర్వీకులు ఉత్నాపిస్టిమ్ అనే అతను రెండు నదుల ముఖ ద్వారం వద్ద ఉంటున్న ఏకైక శాశ్వత జీవి అని తెలుసుకున్నాడు. వృద్ధులకు మళ్ళీ శక్తినిచ్చే మొక్కను గురించి చెప్పి అది సముద్ర గర్భంలో ఉంటుందన్నాడు. గిల్ గామిష్  అమొక్కను తెస్తుండగా చివరిలో ఒక సర్పం దాన్ని కాజేస్తుంది.
2. అలెగ్జాండర్ ప్రేమ. సిరియా సాహిత్యంలో అలెగ్జాండర్ ప్రేమ గాథకు ఆధారాలున్నాయి. క్రీస్తు పూర్వం వంద సంవత్సరాలలో కేలిస్తిన్స్ సాహిత్యంలో దీనికి ఆధారాలున్నాయి. అలెగ్జాండర్. అతడి వంటవాడు ఆండ్రియాస్ జీవన ధార కోసం అన్వేషిస్తారు. ఒకచోట ఆండ్రియాస్ ఉప్పు చేపలను నీటిలో కడుగుతుండగా అవి బ్రతికి ఈదుకుంటూ వెళ్ళి పోతాయి. వాటిని పట్టుకోవటానికి దూకిన ఆండ్రియాస్ అమరుడవుతాడు.  ఈ కథ తెలిసిన ఆండ్రియాస్ తాను అన్వేషిచలేక పోయానని అనుకుంటాడు. మళ్ళీ అతనికి ఆ నీరు కనిపించలేదు.
3. ఎలిజా, రాబిజాషువా బెన్ లెవీ. యూదు గాథ ప్రకారం రాబి జాషువా బెస్ లెవీ ఎలిజాతో కలిసి పయనమవుతాడు. కొరాన్ లో  దైవ సేవకుని వలె ఎలిజా కూడా అనేక నిబంధనలు పెడుతుంది. అతడివలె ఎలిజా కూడా ఘోర కృత్యాలు చేయగా రాబి కూడా మోజెస్ వలె చలిస్తాడు.
      ఈ మూలాధారాలను పోల్చడాన్ని వెన్ సింక్ ఇలా వివరించాడు. జాషువా బెన్ లెవీని గురించి యూదుల ద్వారా తొలుత మహమ్మద్ గ్రహించాడు. తరువాత ముస్లిం గాథలలో ఇది కనిపించదు. మూసా (మోజెస్) ఖురాన్ కథలోని మొదటి భాగంలో గిల్ గామిష్ అలెగ్జాండర్ గానూ, రెండవ భాగంలో ఎలిజాగానూ ప్రాతినిధ్యం వహిస్తుంది. (వెన్ సిక్, అల్ కదిర్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం తొలి ప్రచురణ)
      అలెగ్జాండర్ ఎట్టకేలకు 82.96 సూత్రాలలో కనిపిస్తాడు. అక్కడ ధుల్ కార్నియన్ గా అవతరించాడు. దైవం వలన ఇతడికి రెండు కొమ్ములున్నట్లు సైరిక్ సూత్రం చెబుతున్నది. కొరాన్ ప్రకారం గాగ్ కథను, మగాబ్ తో కలిపేసి అలెగ్జాండర్ గా పేర్కొన్నారు. (జెనెసిస్ 10.2, ఎ జెక్ 38).
ఇతర విషయాలు
    దేవుణ్ణి రబ్ అనీ, కొన్నిసార్లు రబ్ అల్ అలామిన్ అనీ మహమ్మద్ ప్రస్తావించాడు. (ఓబర్ మన్ పుట. 100.ది అరబ్ హెరిటేజ్ ప్రిన్ స్టన్ 1934 సుర 56.79, 82.29, 83.6) యూదు, అగధా ప్రస్తావనలలో రిబన్ హా ఓలామిన్ అని దైవాన్ని పిలవటం కనిపిస్తుంది. దేవుణ్ణి అల్ రహమాన్ అని కూడా మహమ్మద్ సంబోధిస్తాడు. 55.1, 78.3 ప్రతి సుర శీర్షికలోనూ, కొరాన్ లో ఇతర చోట్లా దైవం పేరు 50 చోట్ల ప్రస్తావనకు వస్తుంది. ఇస్లాంకు పూర్వం అరేబియాలో దీన్ని వాడారు. దక్షిణ అరేబియా  సుర శిలా ఫలకాలలో ఇది కనిపిస్తుంది. దీనిని సూటిగా యూదుల నుండి మహమ్మద్ స్వీకరించాడనేది బెల్ సందేహించాడు. హరహమాన్ అనే యూదు సాహిత్యంలో తరచు ఉన్నట్లు ఓబర్ మన్ పేర్కొన్నాడు. జరఫ్రీ ఇలా అంటాడు. ప్రాచీన కవితలో ఈ పదం ప్రస్తావనకు రావటం, మహమ్మద్ ప్రత్యర్ధులైన ప్రవక్తలు ఈ పదాన్ని వాడటం  మసైలామ అల్ అసవాద్ దీన్ని ప్రయోగించటం వలన బహుశ యూదుల బదులు దీని మూలం క్రైస్తవులలో ఉండొచ్చని తెలుస్తున్నది. నిర్థారణగా చెప్పలేము.  (జఫ్రీ పుట 141, బరోడా, 1938)
క్రైస్తవం
    క్రైస్తవ బోధలూ, క్రైస్తవ మతాన్ని గురించి ఏమంత  అవగాహన లేదు. వాటిపట్ల లోతుపాతులు తెలియవు. క్రైస్తవ మతాచారాలను గురించి అంత మూర్ఖంగా చెప్పటాన్ని బట్టి ఇలా భావించవచ్చు. నోల్డెక్ ఈ విషయాలను సూచించాడు. (సుర 5.111) కొరాన్ లో చివరి భాగాల్లోనూ క్రైస్తవ మతాన్ని గురించి  తెలిసినట్లుగా ప్రస్తావన లేదు. (రిచర్డ్ బెల్ పుట 136, లండన్ 1926, ది ఆరిజన్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇట్స్ క్రిస్టియన్ ఎన్విరాన్ మెంట్) అరేబియాలో మహమ్మదు పుట్టిన కాలంలో క్రైస్తవం వ్యాపించి ఉన్నది. అది బహుశ సిరియస్ క్రైస్తవం కావచ్చు.  అల్ హిరాలో చాలా క్రైస్తవ కుటుంబాలు మోనుపిసైట్ కి చెందినవి. ఖురాన్ లో కనిపించిన ఆధారాలు సిరియాక్ భాషకు చెందినవి. కనుక అరబ్బుపై సిరియా ప్రభావం అల్ హిరాలోని క్రైస్తవుల ద్వారా వచ్చి ఉండవచ్చు. దక్షిణ అరేబియాలోని నజరాన్ లో కూడా క్రైస్తవ సమాజం  ఉన్నది. చాలామంది నెస్టోరియన్లు, కొందరు అబిసీనియా మోనోపిసైట్ కు చెందినవారు కూడా. ముస్లిం సంప్రదాయాల ప్రకారం సిరియన్ క్రైస్తవులతో మహమ్మదుకు  వ్యక్తిగత సంబంధం ఉన్నది. యువకుడుగా మహమ్మద్ సిరియాకు వ్యాపార ప్రయాణాలు చేసినట్లు ముస్లిం ఆధారాలు తెలుపుతున్నాయి. నజరన్ బిషప్ బోధనలను మక్కా వద్ద ఉకాజ్ ఉత్సవ సందర్భంగా మహమ్మద్ విన్నాడంటారు.
      వ్యాపార రీత్యా అబిసీనియాకు  సన్నిహిత సంబంధాలు ఉండేవి. మహమ్మదుకు ముందు దక్షిణ అరేబియా కొంతకాలం అబిసీనియా పాలనలో ఉన్నది. మక్కాలో కొందరు ఇస్లాంలోకి మారి చిత్రహింసలు తప్పించుకోటానికి అబిసీనియా పారిపోయినట్లు కథలున్నాయి. క్రైస్తవం పట్ల అప్పుడే మహమ్మదుకు కొత్త ఆసక్తి కలిగిందని తోరే రాసాడు.
      ఐనప్పటికీ త్రిమూర్తి సిద్ధాంతాన్ని మహమ్ముద్ అర్థం చేసుకోలేదు. ఖురాన్ లో క్రైస్తవులను గురించి ఉన్నదంతా స్థానిక ముఠాల నుండి స్వీకరించినదే.
నిద్రించే ఏడుగురు
    ఎఫీసన్ కు చెందిన ఏడుమంది నిద్ర గురించి గాథలు 5వ శతాబ్దం చివరిలో మొదలై పశ్చిమాసియా, యూరోప్ లకు  వ్యాపించింది. తొలుత సిరియన్ బిషప్ జేమ్స్ (452-521) ప్రస్తావించగా టోర్స్ కు చెందిన గ్రిగరీ దీన్ని లాటిన్ లోకి అనువదించాడు. (540-90) గిబ్బన్ ఇలా రాశాడు. సుప్రసిద్ధమైన ఈ కథ మహమ్మదు సిరియాకు ఒంటెలను తీసుకు పోతుండగా తెలుసుకొని ఇది దైవదత్తంగా ఖురాన్ లో ప్రవేశపెట్టాడు. (సుర 18.8-26) ఖురాన్ ఇలా పేర్కొంటున్నది.
    గుహలోని అనుచరులనూ, అల్ రకీమ్ ను అద్భుతమైన చిహ్నాలుగా గుర్తించారా.... ఒక కథ ప్రకారం డెసియన్ చక్రవర్తి శిక్షలను తప్పించుకోవడానికి  క్రైస్తవ యువత కొండ గుహల్లోకి పారిపోయారు. వారిని వెంటతరిమినవారు దాగిన చోటు తెలుసుకుని గుహను మూసివేశారు. 200 ఏళ్ళ తరువాత వారంతా అద్భుతంగా బతికి బయటపడ్డారు. అల్ రకీమ్ అనే పదాన్ని గురించి వ్యాఖ్యాతలు సంవత్సరాల తరబడి చర్చించారు. అరామిక్ ప్రతిలో ఉన్న డెసియన్ అనే పేరును తప్పుగా చదవటంతో ఇది వచ్చి ఉంటుందని తోరే సూచించాడు. (తోరే. న్యూయార్క్ 1933, పుట 46. 47 ఎ జ్యూయిష్ ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం)
మేరి, త్రిమూర్తి సిద్ధాంత దురవగాహన
    సుర 19.28, 29 ప్రకారం జీసస్ జననాంతరం జనం మేరీ దగ్గరకు వచ్చి మేరీ నీవు అద్భుతమైన పని చేశావు. అరన్ సోదరీ, నీ తండ్రి చెడ్డవాడు కాదు. నీ తల్లి వ్యభిచారిణీ కాదు. మరొక చోట ఇమ్రాన్ ప్రవక్తగా పేర్కొన్నారు. (సుర 66.12, 3.31) ఇంకొక చోట మోజెస్ కు పవిత్ర గ్రంథాన్నిచ్చి అతడి సోదరుడు అరన్ ను మంత్రిగా  నియమించాడు. జీసస్ తల్లి మేరీని మోజెస్ సోదరి మిరియంగా మహమ్మద్ అనుకొన్నట్లు స్పష్టపడుతుంది. ఈ విషయాన్ని విడమరచి చెప్పటానికి భాష్యకారులు ముప్పుతిప్పులు పడ్డారు.
మేరీ చరిత్ర
      సుర 19లో జీసస్ తల్లి మేరీ వద్దకు దేవదూత వచ్చి అమె కన్య అయినప్పటికీ దైవేచ్ఛ ప్రకారం కుమారుణ్ణి కంటుందని చెప్పారు.
      ఈ విధంగా అమె గర్భం ధరించి ఒక మారు మూల ప్రాంతానికి వెళుతుంది. త్రోవలో ఈత చెట్టు వద్ద ఆమెకు నొప్పులు వస్తాయి. ఆ బాధలో చనిపోతే బాగుండేది అనుకున్నది.  అప్పుడు లోనుండి ఒక స్వరం ఇలా పలికింది. బాధపడకు, భగవంతుడు నీ పాదాల చెంత నీటి ప్రవాహాన్ని ఏర్చరచాడు. నీకు అందేటట్లు ఖర్జూర ఫలాలు అందిస్తున్నాడు.  అవి తిని, నీరు త్రాగి నీకెవరైనా కనిపిస్తే ఇలా చెప్పు. నేను దయామయుడైన దేవుని వద్ద ప్రతిన పూనాను. నేను నేడు మానవులతో మాట్లాడను.
    మేరీ చరిత్రలో రక్షకుని బాల్యదశ గాథలు ఈ కథకు ఆధారాలున్నాయి. పసివాడుగా జీసస్ చెట్టును ఉద్దేశించి నీ కొమ్మలు కిందకు వాలేటట్లు చేయి. అప్పుడు నా తల్లి పండ్లు ఆరగిస్తుంది, అనగానే కొమ్మలు కిందకు వంగగా మేరీ పండ్లు కోసుకొని తింటుంది. తరువాత చెట్ల కొమ్మలు మామూలుగా పైకి వెళ్ళిపోతాయి. జీసస్ అడిగిన ప్రకారం చెట్టు వేళ్ళ నుండి మంచినీరు పైకి ఉబకగా వాటిని ఆమె సేవిస్తుంది.
      ఖురాన్ లో ఇతర కథా భాగాలు హెలెనిక్ గ్రీసు నుండి, కోప్టిక్ చరిత్ర నుంచి స్వీకరించారు.
జీసస్
    సుర 4.155, 156 ప్రకారం జీసస్ ను శిలువ వేయలేదు. అతడిని చంపలేదు, శిలువ వేయలేదు.  అని మహమ్మదు కల్పితంగా కొందరు భావించారు. కాని బాసిలిడియన్లవంటి తెగలు శిలువ వేయటాన్ని అంగీకరించక, క్రీస్తు స్థానంలో సైమన్ అనే అతన్ని శిలువ వేశారని చెప్పారు.
      ఉయ్యాల తొట్టి నుండి జీసస్ మాట్లాడాటం. మట్టితో చేసిన పక్షి బొమ్మలలో ప్రాణం పోయటం వంటి కథలున్నాయి. (సుర 5.121) వీటిని కోప్టిక్ రచనల నుండి స్వీకరించారు. సుర 5లో స్వర్గం నుండి ఫలకాలు రావడం ప్రస్తావించారు. జీసస్ చనిపోయేముందు శిష్యులతో విందారగించిన విషయం దీనికి ఆధారం.
త్రిమూర్తిత్వం
    క్రైస్తవ త్రిమూర్తి సిద్ధాంతం మూడు సురలలో ప్రస్తావించారు.
      దేవుణ్ణి, అతని దేవతల్ని నమ్ము. ముగ్గురు అనకు సుర 4.169
    ముగ్గురిలో దేవుడొకడు అనేవారు నమ్మకం లేనివారు. మేరీ కుమారుడు ప్రవక్త మాత్రమే. అతని తల్లి ప్రమాణం చేసింది. వారిరువురూ భుజించారు. (సుర 5.77)
      దేవుడు అంటాడు. మేరీ కుమారుడు జీసస్, మానవులకు ఇలా చెప్పావా... దేవుడు గాక నన్ను నా తల్లిని దేవుళ్ళుగా స్వీకరించండి  (సుర 5.116)
తులనాత్మకత
      తుది తీర్పునాడు మంచీచెడు తులనాత్మకంగా నిర్ణయించే రీతి ఇస్లాంలోకి పర్ష్యా నుండి  వచ్చింది. ఇతర లక్షణాలు  అబ్రహాం టెస్టమెంట్ నుండి రాబట్టారు. బహుశ ఈజిప్టులోని బుక్ ఆఫ్ డెడ్ నుండి అంతా స్వీకరించవచ్చు.
      పహ్వలి గ్రంథం నుండి ప్రవక్త ఆరోహణ స్వీకరించారు. అందులో చాలా భాగం అబ్రహాం టెస్టమెంట్ నుండి తీసుకున్నారు. దేవదూత మైకెల్ స్వర్గానికి పేట్రియార్ ను తీసుకెళ్ళాడు. ఒకటి స్వర్గానికి మరొకటి నరకానికి వెళ్ళే రహదార్లు ప్రస్తావించారు.
      అబ్రహాం ఒక విశాల మార్గాన్ని, ఒక ఇరుకు దారిని చూచాడు. గేటు వెలుపల (ఆదాం)ను బంగారపు సింహాసనంపై కూర్చుండడం చూస్తారు. అతడు గంభీరంగా ఉంటాడు. దేవతలు తీసుకెడుతున్న అనేక ఆత్మలు విశాల ద్వారం గుండా పోతాయి. కొన్ని అత్మలు ఇరుకు ద్వారం గుండా పోతాయి. ఆదాం జుట్టు పట్టుకుని, ఏడుస్తూ, మూలుగుతూ ఉంటాడు. ఇరుకు దారిలో అనేకు స్వర్గానికి పోవడం చూసి మళ్ళీ సంతోషంగా సింహాసనంపై ఉంటాడు.
    మహమ్మద్ స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆదాంను చూస్తాడు. మిష్కతల్  మసాబి అనే ముస్లిం గ్రంథంలో ఆ విషయం ఉంది. చూడు అధిష్టించిన వ్యక్తి కుడివైపు నల్లని స్వరూపులు, ఎడమవైపు నల్లని ఆకారంలో ఉంటారు. కుడి వైపు చూసి నవ్వుతాడు. ఎడమవైపు చూసి విలపిస్తాడు. ధర్మజ్ఞుడైన ప్రవక్తకు  స్వాగతం పలుకుతాడు.  నేను ఆదాంను, కుడివైపు వారు స్వర్గవాసులు, ఎడమవైపు వారు అగ్నిలో మాడే నరకవాసులు. కుడివైపు వారితో నవ్వడం, ఎడమవైవు వారిని చూచి విలపించడం అందుకే.
సూది బెజ్జం
      సుర 7.38 ఇలా చెబుతుంది. మన సంజ్ఞల్ని తప్పుడుగా భావించేవారు. నిరాకరించేవారు. స్వర్గంలో ప్రవేశించాలంటే ముందుగా సూదిబెజ్జం నుండి ఒంటె ప్రవేశించాలి. వారికి స్వర్గద్వారాలు తెరిచి ఉండవు. మాచ్యూ 19.24లో ఉన్నదానికి ఇది ప్రతిధ్వని. సంపన్నుడు దైవ రాజ్యంలో ప్రవేశించడం కంటే, ఒంటె సూది బెజ్జంలోకి వెళ్ళడం సులభం. (మార్క్ 10.25, లూక్ 18.25)
శాబియన్లు
      7వ శతాబ్దంలో మధ్య అరేబియా శాబియన్ల ప్రభావానికి మహమ్మదు, అతని సమకాలీనులు గురి అయి ఉండవచ్చునని మూర్ వంటి పండితులు భావించారు. ఇది రెండు తెగలకు చెందినది. గనుక కొంత గందరగోళం ఉంది. ఎన్ సైక్లోపీడియా ఇస్లాంలో కారాడివాక్స్ (1వ ముద్రణ) ప్రకారం ఖురాన్ లో గ్రంథ సంబంధిత ప్రజలు  అనేది శాబియన్లు, యూదులు, క్రైస్తవులకు చెందిందన్నారు. అంటే మాండియన్లను ఉద్దేశించారన్నమాట. ఈ మాండియన్లు బాప్తిజాన్ని పాటించిన యూదు-క్రైస్తవ జాతులు. ఒకటి రెండు శతాబ్దాలలో జొర్డాన్ కు తూర్పున వీరు ఆవిర్భవించారు. బెల్, టోరే ప్రకారం శాబియన్ అనేది మాడియన్లకు చెందకపోవచ్చని, మహమ్మద్ అలా ఉద్దేశించలేదని వారన్నారు.
      హర్రస్ కు చెందిన శాబియన్లు మరో ముఠా తారల్ని పూజించి, ఆకాశ శక్తుల్ని ఆమోదించారు.  వారిని ఉద్దేశించి అని ఉండొచ్చు. ఏడు గ్రహాల్ని వారి దేవాలయాలుగా భావించారు వీరు. అల్ శరస్తాని ప్రకారం ఒక తెగ శాబియన్లు తారల్ని ప్రత్యక్షంగా ఆరాధించారు. మరొక తెగవారు తారల్ని పోలిన విగ్రహాలు చేసి ఆరాధించారు. మహమ్మద్ ను ప్రభావితం చేసిన శాబియన్లు ప్రమాణాలు చేస్తూ తారలు, గ్రహాలను ఆరాధించారు. (సుర 56.75)
      పడిపోతున్న తారల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. (సుర 53)
పేగన్ మక్కా వాసుల ఆచార వ్యవహారాలను, క్రతువులను శాబియన్లు ప్రభావితం చేసి ఉండొచ్చు. కాబాలో మక్కా వాసులు 360 విగ్రహాలుంచారు. ఏడు గ్రహాల చుట్టూ ప్రదక్షిణకు సూచనగా కాబాలో ఏడుసార్లు తిరగడం ఉండేదని మూర్ సూచించాడు.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment