మానవుడువివేచనాత్ముడు కాబట్టి నైతికంగా ఉండగలడు

17 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”

ముగింపు

ప్రతి సమాజం కూడా కొన్ని ప్రమాణాలను అనుసరించి విలువలను పాటిస్తుంది. సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన సమాజాలలో వీటినే నైతిక విలువలు అంటారు. దాతృత్వం, తోటివారి పట్ల దయ, నిజాయితీ, వినయం, ఇత్యాది నైతిక విలువలు పేర్కొన్నదగినవి. అనేకమతాలు కూడా మానవుడి పట్ల గౌరవాన్ని ప్రబోధించాయి. మత విశ్వాసం గలవారు తమ తమ వ్యక్తుల పట్ల ఇటువంటి గౌరవాన్ని చూపాలని పేర్కొన్నాయి. మానవ గౌరవాన్ని ఈ విలువలు అంతగా పట్టించుకోలేదు. కాలం గడిచేకొద్దీ ఈ మతాల పిడివాదం, కర్మకాండలలోని పటుత్వం సడలిపోయింది. మానవజాతి ఐక్యత అనే ప్రబోధం ఒక్కటే నైతిక విషయంగా మిగిలింది. నైతిక పరమైన అన్వేషణ పద్ధతులు లేనప్పుడు ఈ విధానాన్ని వివరించటం ఎలా?. ప్రపంచవ్యాప్తంగా అన్వేషణాపద్ధతులు ఆమోదయోగ్యంగా ఉండేటట్లు ఆవిర్భవించటానికి పూర్వం, విశ్వవ్యాప్తమైన విలువలకు మూలాధారంగా దేన్ని చూపాలి?.
ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించేటప్పుడు నైతిక విలువలు పనిచేసే తీరు, అవి ఏమేరకు సరి అయినవి, అనే వాటికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రస్తుతం విలువ, విశ్వజనీనత, సరైనది, అనే మాటలు నైతిక విలువలకు అన్వయించి చూద్దాం.

నైతిక పదాలకు అర్థం

సమాజంలో వ్యక్తి ఒక వస్తువును పొందడం లేదా, ఒక కార్యకలాపం జరగడం వాంఛనీయమనుకుంటే, విలువ అనే పదానికి అర్థం లభిస్తుంది. మానవుడు ఆశ్రమవాసిగా ఏకాకిగా కాక, సమాజంలో ఒక విశిష్టవ్యక్తిగా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనే ధోరణి ప్రధానం. వ్యక్తిత్వంలోని ప్రతిభకూ, వాంఛలకూ సంబంధం ఉంది. విలువ అనేది కేవలం వ్యక్తిపరం కాదు. వ్యక్తిని తీర్చి దిద్దే సమాజానికీ, వ్యక్తి వల్ల ప్రభావితమయ్యే సమాజానికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి విలువ అనేది కేవలం మేధస్సుకు, రామణీయకతకు సంబంధించింది కాక, వ్యక్తుల మధ్య సంబంధంగా తలెత్తుతుంది. అంటే ఇతర వ్యక్తులతో నిమిత్తం లేకుండా ఏకాకిగా మేధస్సు, లేదా రామణీయకత విలువలను సాధించవచ్చని అర్థం కాదు. తోటి వ్యక్తితో సంబంధం ఉన్నప్పుడే నైతిక విలువలను సాధించటం సంభవం. దీని వల్ల ఇతర విలువలకూ, నైతిక విలువలకూ తేడాలు గమనించవచ్చు. జ్ఞానం అనేది మేధా సంబంధమైన విలువ. సత్యం, స్వేచ్ఛ అనేవి నైతిక విలువలు, సంగీతం రామణీయకతకు చెందిన విలువ. కాని ఒక రాగాన్ని కూర్చడానికి స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన సంగీతాన్ని వినే అవకాశం ఉండటం నైతిక విలువలు. అడవి మృగం ఎదురైనప్పుడు చూపే సాహసం మనుగడకు సంబంధించిన విలువ. అదే యుద్ధరంగంలో అయితే నైతిక విలువ అవుతుంది.

నైతిక విలువల విశ్వజనీనత-బాహ్యసత్యం

నైతిక విలువలకు ఉన్న సామాజిక దృక్పథాన్ని బట్టి, కొంత మేరకు వాటికి బాహ్య సత్య దృష్టి ఏర్పడుతుంది. సృజనాత్మక వ్యక్తిపరమైంది. అప్పుడు బాహ్య సత్యం అనేది అరుదుగా సాధ్యపడుతుంది. నైతికవిలువలు విశ్వవ్యాప్తంగా ఉండా లంటే, బాహ్యసత్యం అనేది అవసరం. ఒక నిర్ణయం గనక వ్యక్తిగతమైందైతే, దానికి లభించే విలువ కూడా నిర్ణయంలోని స్వభావాన్ని బట్టి గాక, యాదృచ్ఛికమైందే అవుతుంది. వ్యక్తిపరమైన అసూయలకు మించిన నిర్ణయమే బాహ్యసత్యంతో కూడింది.

నైతికవిలువలు విశ్వజనీనమైనవి అనగానే, అన్ని కాలాల్లోనూ అన్ని సమాజాలలోనూ ప్రతివారూ వీటిని ఆమోదించారనుకోరాదు. కొన్ని విలువలు విశ్వజనీనమైనవి అంటే, రెండు ప్రతిపాదనలను గట్టిగా చెబుతున్నామన్నమాట. నైతికంగా చైతన్యవంతులైనవారిలో అత్యధిక సంఖ్యాకులు ఆ విలువలను గమనిస్తారు. ఒక వ్యక్తి ఈ విలువల గురించి తీవ్రంగా ఆలోచిస్తే, అవి సరైనవని భావిస్తాడు. తన వ్యక్తిగత ఆసక్తులు, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోడు. ఇప్పుడు ఎవరైనా అలా చేయలేక పోతున్నారంటే అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించలేదని భావించాలి. ఉపనిషత్తు పేర్కొనే అంధకారం నుంచి వెలుగులోకి తీసుకుపో, అనే సూత్రమూ, సోక్రటీస్ సూత్రీకరించిన జ్ఞానమే ధర్మం అనడమూ, ఒకే అర్థాన్ని సూచిస్తాయి.

నైతిక విలువల విశ్వజనీనత గురించి ఇంతవరకూ చేసిన చర్చ అంతా, చుట్టూ తిరుగుతూ ప్రారంభించిన చోటుకే వచ్చినట్లు అనిపించవచ్చు. విశ్వజనీనత అనేది వాస్తవంకానప్పుడు, అన్వేషణా పద్ధతినుంచి వచ్చినప్పుడు, సమస్యను ఇంకొక రంగానికి మళ్ళించినట్లయింది. అటువంటి పద్ధతి ఉంటుందా?. ఉంటే తెలుసుకోవటం ఎలా?. తెలుసుకుంటే అది విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్య మైన పద్దతి అనిహామీ ఏమిటి? మొదలైన ప్రశ్నలు జనిస్తాయి.

ఒక్కక్షణం ఆలోచిస్తే ఈ ప్రశ్నలు నీతిశాస్త్రానికి ప్రత్యేకించినవి కావని స్పష్టపడుతుంది. దేన్ని అన్వేషించినా, ప్రకృతి విజ్ఞానంతో సహా అన్ని రంగాలలోనూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్నలు జనిస్తాయి. విజ్ఞానవేత్తలు ఆచరించే వైజ్ఞానిక పద్దతి ప్రపంచవ్యాప్తంగా సరైందని ఎవరుగట్టిగా చెపుతారు. విజ్ఞానాన్ని అధ్యయనం చేసే విద్యార్థులతో సహా బహు కొద్దిమందికే బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి పై ప్రతిపాదనను ఆమోదించటం, నిరాకరించటం అనేది కష్టం. అయినా ప్రపంచ వ్యాప్తంగా సరైందని ఎందుకంటున్నామంటే, వివేచనాత్మాకంగా సంతృప్తినివ్వడం, ప్రాపంచిక అనుభవంరీత్యా ఫలితాలనివ్వడం గమనిస్తున్నాం గనకనే మూడు వందల సంవత్సరాల నుంచీ క్రమంగా పరిణమిస్తూ, మూలంలో నిమిత్తంలేకుండా, నిర్మాణ క్రమాన్ని విజ్ఞానంచూపుతోంది. వైజ్ఞానిక అన్వేషణా లక్ష్యాన్ని అంగీకరించిన వారు, వైజ్ఞానిక పద్ధతిని కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఆ పద్ధతి ఒక్కటీ లక్ష్యానికి చేర్చగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది సరైంది అంటున్నాం. వైజ్ఞానిక పద్ధతిలో విశ్వజనీనత అనటంలో ఎటువంటి సూచనకూడా చేయడం లేదు. ప్రతివారూ ఒకేరీతిలో అనుసరించాలని అనడం లేదు. విజ్ఞానవేత్తలు సైతం అన్ని సందర్భాల్లోనూ ఒకే మార్గాన పోరు, క్వాంటమ్ సిద్ధాంతం పట్ల ఐన్ స్ట్టీన్ ధోరణి ఇందుకు ఉదాహరణంగా చూపవచ్చు. పదార్థ అస్థిరత్వం ఉందని కనుక్కొన్నప్పటికీ, ఐన్ స్టీన్ ఒక పట్టాన ఇందుకు అంగీకరిం చలేక పోయాడు. క్వాంటమ్ సిద్ధాంతంలో ఉన్న దోషాన్ని ఏనాటికైనా తొలగించ వచ్చునని ఆశించాడు. దేవుడు చదరంగం ఆడతాడని అతడు నమ్మజాలక పోయాడు.
నైతిక అన్వేషణా లక్ష్యం

పైన పరిశీలించిన వాటిని నీతి శాస్త్రానికి అన్వయించి చూద్దాం
.
నైతిక అన్వేషణ లక్ష్యం ఏమిటి?. ఈ అన్వేషణలో అనుసరించే పద్ధతి ఏమిటి?. నైతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని దేన్నిబట్టి చెప్పగలం?.

ఇంతవరకూ జరిగిన చర్చనుబట్టి, నైతిక అన్వేషణాలక్ష్యం అంతాకూడా కొన్ని ప్రమాణాలను కనుక్కోవటమేనని చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య సంబంధా లను ఇవి సూచిస్తాయి. వ్యక్తి జీవిత వికాసానికి సాధ్యమైనంత మేరకు ఇవి ఉపకరిస్తాయి. కాబట్టి ఇతరుల ఆసక్తి చూపని వాటితో నీతిశాస్త్రానికి నిమిత్తంలేదు. ఒక వ్యక్తి మాంసాహారా?. శాఖాహారా?. మద్యపానం సేవిస్తాడా? లేదా అనే విషయాలు వ్యక్తి ఆరోగ్యం పైనా, అతడి ఆర్థిక వ్యవహారాలపైనా ఆధారపడి ఉంటుంది. కాని వాటిని బట్టి నైతిక నిర్ణయం చేయడం కుదిరే పనికాదు. వ్యక్తి ఏమి చేసినా సమాజం పట్టించుకోవచ్చు. సమాజం ఎంత పెత్తందారీతనంతో ఉంటే అంతగా వ్యక్తిని పట్టించుకుంటుంది. ఏం చదువుతున్నాడు, ఎవరితో స్నేహం చెస్తున్నాడు, పిలక పెంచుతున్నాడా లేదా, జంద్యం వేసుకున్నాడా లేదా, ఎటువంటి దుస్తులు ధరించాడు, ఏమి ఆహారం తీసుకున్నాడు. ఎవరిని వివాహమాడాడు అనేవన్నీ మన సమాజానికి సమస్యలుగా తయారయ్యాయి. వ్యక్తికి అట్టే స్వేచ్ఛలేదు. వ్యక్తి స్వేచ్ఛను అదుపు పేట్టే విషయంలో జాగ్రత్త వహించాలని ఈ విషయాలన్నీ సూచిస్తున్నాయి. ఇక్కడ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలనేదిగాక, ఎలా అణచాలనేది ప్రధానమైందిగా ఉంది.

నైతిక అన్వేషణ లక్ష్యాన్ని బట్టి, సంతృప్తికరమైన సాంఘికవ్యవస్థకు కొన్ని ప్రధాన లక్ష్యాలున్నాయి. మానవులలో కనిపిస్తున్న ప్రతిభ ఎన్నో విధాలుగా ఉంది. కాని వ్యక్తివికాసానికి సర్వసాధారణ పరిస్థితులుకొన్ని అవసరం, ఆహారం, వస్త్రాలు, గృహం, మంచి ఆరోగ్యం, అవసరాల కొరతలేని స్వేచ్ఛ, ఇతరులు ఒత్తిడి పెట్టకపోవడం, ప్రభుత్వం జలవంతం చేయకబోవడం, అనేవి కనీస అవసరాలుగా ఉండాలి. ఇతర జంతువులకూ, మానవుడికీ ప్రధాన తేడా ఉంది. మానవుడికి ఆలోచించే శక్తి ఉంది. ఆలోచనలనూ, ఆవేదనలనూ భావం ద్వారా, కళల ద్వారా వెల్లడించగలడు. కాబట్టి మానవుడుగా జీవనాన్ని సాగించటానికి స్వేచ్ఛాయుత ఆలోచన యథేచ్ఛగా వ్యక్తం చేయడం, సంఘాలుగా ఏర్పడటం, ప్రతిభలకు వన్నె తెచ్చే చదువు అవసరమవుతాయి. ప్రతి మానవుడికీ మనుగడ అనేది ముఖ్యమైనప్పటికీ, కేవలం జంతువులలాగ ఉండలేడని అనుభవం చెబుతున్నది. సంతృప్తికరమైన బతుకుతెరువు మానవుడికి అవసరం. ఎంత దయామయ మైన నియంతృత్వం కూడా ఆ వ్యవస్థను నిలుపుకోడానికి క్రూరనియంతృత్వంగా దిగజారిపోతుంది. శారీరక, సాంస్కృతిక విషయాలు మానవుడిలో విడదీయ రానివిగా కలిసిపోయాయి. ఆహారం లేకపోతే మనిషి బతుకును సాగించలేడు. ఇంకా ముఖ్యమైన విషయమేమంటే తనను తాను గుర్తించనిదే మానవుడు ఆహారాన్ని సంపాదించుకోలేడు. అందుకే స్వేచ్ఛకై పోరాడతాడు. కమ్యూనిస్టు విప్లవం దెబ్బతినిపోయింది. రష్యా, పోలండ్, హంగరీలలో ప్రజల తిరుగుబాట్లకూ, తూర్పు జర్మనీనుంచి పారిపోవాలనీ, చైనా నుంచి తప్పించుకు పోవాలనీ భావించడానికి మానవుడిలో ఉన్న స్వేచ్ఛ అనే లక్షణమే కారణం.

సాంఘికభద్రత, మానసిక స్వేచ్ఛ అనేవి వ్యక్తి వికాసానికి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ పరిస్థితులు బాగా సాధించుకోడానికి తోడ్పడే సాంఘిక వ్యవస్థల్ని, మానవలక్షణాలను కనుక్కోవడమనేది నైతిక అన్వేషణలో ఉంటుంది. ఈ అన్వేషణ రెండు విధాలుగా సాగుతుంది. మానవులు బతికుండగానే నైతిక విలువలను సాధించుకోవాలి. కనక చారిత్రక, సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా నైతిక అన్వేషణ జరగటం అనేది తప్పనిసరి అన్నమాట. ఈ విధంగా చూస్తే నైతిక అన్వేషణలోకానికి చెందింది కూడా. మానవుడు తన సహకారాకృషితో పరిసరా లను సరిదిద్దగలడు. ప్రభావితం చేయగలడు. ఈ విధంగా చూస్తే వర్తమాన పరిధికే నీతి పరిమితం కానక్కరలేదు. భవిష్యత్తులోకి తొంగి చూసి, ఆశలనూ, ఆశయాలనూ రూపొందించుకొని మానవుడు నేటి కలలను రేపు నిజం చేసుకో గలడు. ఇందుకు తగిన తెలివితేటలూ, పట్టుదల మానవుడికి ఉన్నాయి. నీతి శాస్త్రం ముందు చూపుగల ప్రమాణశాస్త్రం. వ్యక్తి ఏమి చేయాలి. చేయకూడదు అనేవాటిని సాధారణమయిన నియమాలతో నైతిక శాస్త్రం పేర్కొంటుంది. మానవ ప్రవర్తనకు ఉపకరించే సంస్థలను ఏర్పరచుకోడానికి నైతిక శాస్త్రం తోడ్పడుతుంది.
నైతిక అన్వేషణా క్రమం

వైజ్ఞానిక అన్వేషణ వంటిదే నైతిక అన్వేషణ కూడా, రెండింటిలోనూ ఒకానొక లక్ష్యంతో ప్రారంభిస్తాం. తొలుత దీనిని స్థూలంగానే గమనిస్తాం. అన్వేషణ సాగుతున్న కొద్దీ వివరాలలోకి పోతాం. రెండు రంగాలలోనూ, ప్రపంచపరంగా అన్వేషణ సాగుతుంది. వాస్తవాలతో కూడిన అనుభవం అనేది ఆధారంగా ఉంటుంది. కార్యకారణ సంబంధంతో అవగాహనకు ప్రయత్నిస్తాం. వైజ్ఞానిక అన్వేషణలో కార్యకారణ సంబంధం స్పష్టమే. నైతికరంగంలో మానవవ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఈ రెండు అన్వేషణలూ ప్రాపంచిక అనుభవంతోనూ, విశ్లేషణతోనూ ఉన్నాయి. ప్రతిపాదన చేసి రాబట్టే పద్ధతినే రెండూ అనుసరిస్తాయి.

నైతిక విలువల్లో బాహ్యసత్యం, విశ్వజనీనత అనేవి పైన చెప్పిన పద్దతిని అనుసరించి కనుక్కొన్నవే. కనక వీటికి ఉన్న పరిమితులు కూడా గుర్తించాలి. తాత్కాలికమూ, ఆస్తిరత్వమూ అనేవి నీతిరంగంలోనూ ఉన్నాయి. కాబట్టి నైతిక విలువలు సాపేక్షకాలు, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులననుసరించి ఈ విలువలకు హద్దులేర్పడతాయి. అన్వేషణలో వినియోగించే జ్ఞానం విధానం కూడా ఇందులో జతచేర్చి చూసుకోవాలి. ఆధునిక రవాణా సౌకర్యంవల్ల ప్రపంచ సంస్కృతి ఆవిర్భవించటం సాధ్యమే. అటువంటప్పుడు పరిసరాల పరిమితులు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. విజ్ఞానంలాగే నైతికసిద్ధాంతం కూడా విశ్వజనీనం అవుతోంది. స్థానిక సంప్రదాయం, సాంఘిక వ్యవస్థల్లో తేడా ఉన్నప్పటికీ విశ్వజనీ నత సాధ్యపడుతోంది. వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం అనే విలువలు ప్రజాస్వామిక పాశ్చాత్య ప్రపంచంలోని మానవులనే గాక, నియంతృత్వంలో ఉన్నవారిలో కూడా స్పందన కలిగిస్తున్నాయి. ఏ నైతిక సిద్ధాంతంలోనయినా కొంత మేరకు చారిత్రక, సాంఘిక సాపేక్షతా విధానం తప్పనిసరి అయినప్పటికీ మౌలికమయిన విలువలు విశ్వవ్యాప్తంగా ఉంటున్నాయి.
నైతిక విలువలు తప్పనిసరి

మానవ వ్యక్తిత్వానికీ, పవిత్రతను సమకూర్చటం ఒక్కటేచాలా, లేదా మరికొన్ని విలువలు చేర్చాలా అనేది వివరాలకు సంబంధించిన విషయం. ఇతర సిద్ధాంతాలలాగే నైతిక సిద్ధాంతంలో కూడా అంగీకరించటమనేది తార్కికవాదనకు సంబంధించింది కాదు. అది మనందరి అనుభవ ఫలితమే. మానవ సంపద వల్ల రూపురేఖలు దిద్దుకున్న ధోరణి ఇందులో ఉంది. ప్రారంచిక అనుభవానికీ, మానవ ఆలోచనకూ వారధిగా తర్కం ఉండజాలదు. మానవుడి భావాలను విశ్లేషించి, వాటిలో ఇమిడి ఉన్న అర్థాన్ని మనకు స్పష్టం చేయటమే తర్కంచేయగల పని. మౌలిక విలువల్ని గురించి అంగీకారానికి వస్తే, వాటి నుంచి మిగతా విలువలు రాబట్టి అంచలవారీగా ఏర్పాటు చేసి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తర్కం చూపు తుంది. మౌలిక విలువలు సరైనవి అవునా, కాదా అనేదానికి తార్కికమైన రుజువు ఉండదు. తర్కంలో ఇమిడి ఉన్న ఈ పరిమితిలోని మానవుడిని, ఉద్రేకాల ఆవశ్యకతను గమనించకపోవటంతో నిర్ధారణ కావాలని అన్వేషిస్తుంటాం. తత్వవేత్తలు తరతరాలుగా అలౌకకవాదంతో కూడిన నీతిశాస్త్రాలను, అధిభౌతిక సిద్ధాంతాలను నిర్మించారు. అటువంటి ప్రయత్నాలన్నీ విఫలంగాక, తప్పదని, వైజ్ఞానిక పద్ధతి స్పష్టం చేసింది. మానవుడి జ్ఞానానికి గల పరిమితిని, అవకాశాన్ని ఈ పద్ధతి సూచించింది. అనేక నైతిక సిద్ధాంతాలు ఉండవచ్చుననీ, అసలు ఎటువంటి నైతిక ధోరణీ లేకుండా కొందరు మానవులు ఉండగలరనీ తార్కికంగా చూపవచ్చు. కాని అనుభవరీత్యా మానవులలో కొన్ని సర్వసాధారణ మైన జిజ్ఞాసలు ఉన్నాయని స్పష్టపడింది. ఈ జిజ్ఞాసలు విశ్వజనీనమైన భావాలలో, విలువలలో వ్యక్తమవుతున్నాయి. ఇది, తప్పనిసరిగా పాటించే అవసరమున్నట్లు కొన్ని సమాభిన్న సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులలో నివసిస్తున్న మానవులు అనేక మంది, విశ్వజనీనమైన విలువలను ఆమోదించడంతో సరిపోదు. ఈ విలువలలో నైతికమైన బాధ్యతకూడా ఉంది. మానవులందరూ వీటిని ప్రమాణంగా అంగీకరిస్తారు. విశ్వజనీనమైన నైతికవిలువల విషయమై కొంత వివరణ అవసరం.

ఇక్కడ కూడా విజ్ఞానాన్వేషణతో పోల్చి చూడవచ్చు. సత్యంలో కూడా విధిగా పాటించవలసిన గుణం ఉంది. మానవుల ఆసక్తులు, సహజమైన ధోరణులు భిన్నంగా ఉన్నప్పటికీ ఇది తప్పదు. సత్యంలో నచ్చజెప్పే శక్తి ఉన్నదంటే అందరికీ వెల్లడించి చూపే గుణం ఇందుకు ప్రధానంకాదు. ఎందుకు, ఎలా సంభవిస్తుంది అనే విషయమై మానవుడు చూపే ఆతృతలో దీని అంతటికీ మూలం ఉంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నట్లే ఉత్తమ జీవితమంటే ఏమిటో కనుక్కొనే వరకూ మానవుడు విశ్రాంతి చెందడు. సోక్రటీస్, క్రీస్తు, చార్యాకుడు, గౌతమ బుద్దుడు వంటివారిని చూస్తుంటే ఇది తెలుస్తుంది. జిజ్ఞాస, అందాన్ని ఆరాధించటంలాగా, నైతిక పిపాసకుడా మానవుడిలో అంతర్గతంగా ఉంది. బహుశా ఇందుకు మూలం జీవరాశిలో చూడవచ్చునేమో. వైజ్ఞానిక, రామణీయ కతలాగే నైతికతృష్ణ కూడా మానవజీవితంలో ప్రధానదృక్పథంగా ఉండవచ్చు. ఇదేగనక వాస్తవమైతే నైతిక విలువల్ని పాటించడం జీవితానికి, సామూహిక ధోరణికి బలాన్ని సమకూర్చడమే అవుతుంది.

నైతిక విలువల విశ్వజనీనతను, మానవుడి నైతిక తృష్టలోని అంతర్భాగంగా గ్రహిస్తే వాటికి బలం చేకూరుతుంది. వైజ్ఞానిక పద్ధతిలో చేసే అన్వేషణ వల్ల చాలా విలువలు రాబట్టేవని తేలింది. వాటి తార్కిక వాస్తవికత కూడా మౌలికమైన వాటితో సమానమైనదే ప్రాథమిక విలువలు సహితం ప్రాపంచిక అనుభవరీత్యానే సరైనవి. సమానత్వం, సాంఘిక న్యాయం, పౌరహక్కులనేవి కొన్ని మౌలిక విలువల వల్ల తార్కికంగా వచ్చాయనవచ్చు. విజ్ఞాన సిద్ధాంతంలో ప్రాధమిక పదాలూ, ప్రతిపాదనలలాగే, నైతిక సిద్ధాంతంలో ఈ విలువలను ప్రారంభదశగా స్వీకరించాలి.

మానవ వ్యక్తిత్వానికీ, పవిత్రతను సమకూర్చటం ఒక్కటేచాలా, లేదా మరికొన్ని విలువలు చేర్చాలా అనేది వివరాలకు సంబంధించిన విషయం. ఇతర సిద్ధాంతాలలాగే నైతిక సిద్ధాంతంలో కూడా అంగీకరించటమనేది తార్కికవాదనకు సంబంధించింది కాదు. అది మనందరి అనుభవ ఫలితమే. మానవ సంపద వల్ల రూపురేఖలు దిద్దుకున్న ధోరణి ఇందులో ఉంది. ప్రారంచిక అనుభవానికీ, మానవ ఆలోచనకూ వారధిగా తర్కం ఉండజాలదు. మానవుడి భావాలను విశ్లేషించి, వాటిలో ఇమిడి ఉన్న అర్థాన్ని మనకు స్పష్టం చేయటమే తర్కంచేయగల పని. మౌలిక విలువల్ని గురించి అంగీకారానికి వస్తే, వాటి నుంచి మిగతా విలువలు రాబట్టి అంచలవారీగా ఏర్పాటు చేసి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తర్కం చూపు తుంది. మౌలిక విలువలు సరైనవి అవునా, కాదా అనేదానికి తార్కికమైన రుజువు ఉండదు. తర్కంలో ఇమిడి ఉన్న ఈ పరిమితిలోని మానవుడిని, ఉద్రేకాల ఆవశ్యకతను గమనించకపోవటంతో నిర్ధారణ కావాలని అన్వేషిస్తుంటాం. తత్వవేత్తలు తరతరాలుగా అలౌకకవాదంతో కూడిన నీతిశాస్త్రాలను, అధిభౌతిక సిద్ధాంతాలను నిర్మించారు. అటువంటి ప్రయత్నాలన్నీ విఫలంగాక, తప్పదని, వైజ్ఞానిక పద్ధతి స్పష్టం చేసింది. మానవుడి జ్ఞానానికి గల పరిమితిని, అవకాశాన్ని ఈ పద్ధతి సూచించింది. అనేక నైతిక సిద్ధాంతాలు ఉండవచ్చుననీ, అసలు ఎటువంటి నైతిక ధోరణీ లేకుండా కొందరు మానవులు ఉండగలరనీ తార్కికంగా చూపవచ్చు. కాని అనుభవరీత్యా మానవులలో కొన్ని సర్వసాధారణ మైన జిజ్ఞాసలు ఉన్నాయని స్పష్టపడింది. ఈ జిజ్ఞాసలు విశ్వజనీనమైన భావాలలో, విలువలలో వ్యక్తమవుతున్నాయి. ఇది, తప్పనిసరిగా పాటించే అవసరమున్నట్లు కొన్ని సమాజాలలో వ్యక్తులతో స్వభావం తెలుపుతోంది. చారిత్రకంగా వీటికి గల సాపేక్షతాగుణం, కాలానుగుణంగా పరిణమించిన తీరునుబట్టి ఈ విలువలకు గత విశ్వజనీనత పోదు. వీటిల్లోని పరిణామ స్వభావం మానవ వివేచనా శక్తికి నిదర్శనం. చైతన్య స్థాయిలో పరిణామం అనేది సాంస్కృతిక అభివృద్ధిగా, పరిసరాలలో ఇమిడిపోయేదిగా ఉంటుంది. అంతేగాని ఉదాసీనంగా లొంగిపోవటం జరగదు. మానవుడు తన అనుభవాన్ని ఆధారంగా నేర్పడం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇటువంటి పరిణామానికి అవకాశముంది. మానవుడు వివేచనాత్ముడు కాబట్టి నైతికంగా ఉండగలడు. అంతేగాని అతనిలో మూక స్వభావం ఉన్నందువల్ల ఇలా ప్రవర్తించటం లేదు. తెలిసి ఎంపిక చేసుకునే పద్ధతి వల్ల మానవుడిలో నీతికి విశిష్టత !


రచన తెలుగుసేత
ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్యThe series ended

1 comment:

www.niftysiri.in said...

Good work. Keep it up.
Visit my blog: www.niftysiri.in and http://niftysiri.blogspot.in/.
We are giving calls with contract note proof.
Wish u all the best.
niftysiri

Post a Comment