పిల్లి చెప్పిన కథ - 3 పిల్లుల దేవుడు




మనిషి తన చుట్టూ వైజ్ఞానికంగా ఒక గిరిగీసుకున్నాడు. ఏదైనా తన భాషలో చెపితేగాని అర్థం చేసుకోలేడు. తన జ్ఞానం, భావ ప్రకటన శక్తి పరిమితమైందని తెలుసుకుని గూడా సిగ్గుపడకపోగా గర్విస్తాడు. తను మాట్లాడగలడు కనుక తన దేవుని సృష్టిలో తానే మిన్న అనుకుంటాడు. అతని దేవుడు మానవ దేవుడు. ఆ దేవునికి మానవులు కానివారిని అర్థం చేసుకోవటం చేతగాదు. అలాంటి దేవుడు మాకు పనికి రాడు. మా దేవుడు మాలాగానే వుండాలి. నాలాంటి అందగత్తె పూజలందుకోవాలంటే మా దేవుడు ఠీవైన చక్కని గండుపిల్లిలా వుండాలి. (అన్నట్లు, నేను ఆడో మగో చెప్పానా?) భారత దేశానికి చెందిన ఆడ పిల్లిని అవటం చేత పురాణ స్త్రీల సాంప్రదాయాలు నాకూ అంటుకున్నాయి. స్త్రీకి భర్తే దైవం. ఇది ప్రత్యేకించి ఒక్క భారత స్త్రీల ఆదర్శమే కాదు. అది అందరి స్త్రీల ఆదర్శం – పురుషుని ఆరాధించే ఈ స్త్రీ ఆచారాన్ని నేనూ పాటిస్తున్నాను. ఇది జీవపరిణామ సహజ లక్షణం. ఇది కాదనలేను.

ఈ మూర్ఖ లక్షణాన్ని గురించి ముందు సందర్భం వచ్చినప్పుడు విపులంగా చెపుతాను.
మనిషి మాట్లాడగలగటం గురించి చర్చిద్దాం. కొన్ని జీవులు నాలుగు కాళ్ళున్నా రెండు కాళ్ళమీదే నడవాలనుకున్నాయి. ఉన్నత స్థాయి జీవులన్నిటికీ సృష్టికర్త నాలుగు కాళ్ళిచ్చి చనిపోయేదాకా   ఈ శరీరాన్ని మోయమన్నాడు. కాని కొందరు విధి నిర్ణయానికి ఎదురీతగా రెండు కాళ్ళమీద నడవదలిచారు. ఇలా అనుకోవటంలో కొంత స్వార్థం లేకపోలేదు. చెట్లు చేమలు పాకి రసభరితమైన పండ్లన్నీ తామే తినాలని వీరి కోరిక. దేవుని నిర్ణయాన్ని ధిక్కరించిన ఆది మానవుడు తన సాహసానికి తానే బెదిరిపోయాడు. దేవుని తృప్తిపరచే ఉద్దేశ్యంతో మనిషి తనలాగే రెండు కాళ్ళతో చేశాడు.

                                                          

  
మూ
లం:
  
ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ 
కోమల

తెలుగు సేత

No comments:

Post a Comment