మహమ్మద్ పై తుది అంచనా-part 16-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
16వ అధ్యాయం
మహమ్మద్
హమ్మద్ చరిత్రలో నిస్సందేహంగా గొప్ప వ్యక్తి. అతడే లేకుంటే చరిత్ర మరోరకంగా ఉండేది. కార్లపాపర్ ఇలా అన్నాడు. (ది ఓపెన్ సొసైటీ అండ్ ఇట్స్ ఎనిమీస్ 1వ సంపుటి పీఠిక) నాగరికత ఉండాలంటే పెద్దవాళ్ళపట్ల ఉదాసీనత  వహించే ధోరణి పోవాలి. పెద్దవాళ్ళు పెద్దతప్పులు చేస్తారు.
    ఇస్లాం పిడివాదం మహమ్మద్ ను ఎలాంటి పాప పంకిలం లేనివాడుగా చిత్రించినా, తాను సంపూర్ణుడననీ, నిర్దోషిననీ అతడెన్నడూ అనలేదు. అతనిలో ఇది చాలా ప్రీతిపాత్రమైన లక్షణంగా తోర్ ఎండ్రీ పేర్కొన్నాడు. తన లోపాలను తెలుసుకోవటం, తనను తాను విమర్శించుకోవటం అతనిలో గమనించవచ్చు.
      మహమ్మద్ ఆకర్షణీయమైనవ్యక్తి ఆహ్లాదంగా  నవ్వుతాడనీ, అనుచరుల విధేయత, ప్రేమను తన సమ్మోహనంతో చూరగొంటాడనీ ఆధారాలు తెలుపుతున్నాయి. ఇతడు మేథా సంపన్నతగల సైనిక నాయకుడు. లౌక్యం నచ్చ చెప్పే  శక్తిగల రాజనీతిజ్ఞుడు. అతడు సాధించిందేమిటి.... ఇంచుమించు ఆరాధించే వరకూ పోయే కొద్దిమంది పాశ్చాత్య పండితులలో ఒకరైన మాంట్ గోమరీ వార్ట్ మహమ్మద్ సాధించిన వాటిని ఇలా వ్యాఖ్యానించాడు. (కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇస్లాం, 1వ సంపుటి, పుటః55) అతడికి రుషి లక్షణాలున్నాయి. మక్కాలోని రుగ్మతలూ, సాంఘిక సంబంధాలూ బాగా తెలుసు.  అనేక భావాలు అతను రూపొందించాడు. మక్కా కలహాలను విశాల పరిధిలో పరిష్కరించడానికి కృషి చేశాడు.
    ఆనాడు మక్కాలో ఆధ్యాత్మిక సంక్షోభం ఉందనే విషయాన్ని బాస్క్వే, క్రోన్ నిరాకరించారు. మార్గోలియత్ కూడా వాట్ చేసిన వాదనలను ముందే ఊహించి కాబోలు నిరాకరించాడు. (మహమ్మద్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, లండన్, 1905, పుటః 24, 25) ఇస్లాంకు ముందున్న అరబ్బులు చూపిన నమ్మకాల దృష్ట్యా సాంఘిక రుగ్మతలున్న ఆధారాలేవీ లేవన్నాడు. ప్రొ. వాట్ ఇలా రాశాడు.
      మహమ్మద్ కు మతపరంగానే నాయకత్వం లభించింది. అతని స్థితి పెత్తనాన్ని బట్టి వివిధ తెగలు జాతులూ కూడా అతని నాయకత్వాన్ని అంగీకరించారు. అందువలన సమాజం శాంతియుతంగా కొనసాగింది.
      మహమ్మద్ ను గురించి వాట్ చెప్పింది సబబుగా లేదు.  సిద్ధాంతానికీ, ఆచరణకూ తేడా ఉన్నది. అది గ్రహించలేదు. గోల్డ్ జిహర్ ఇలా అన్నాడు.  (ముస్లిం స్టడీస్ 1వ సంపుటి, పుటః25) మక్కా ప్రజలకూ అరేబియాలోని వారికి మహమ్మద్ చెప్చిందాన్నిబట్టి క్షమించటం బలహీనతకు నిదర్శనం కాదు. తనకు చేసిన అన్యాయాన్ని క్షమించటం అత్యున్నత ధర్మం. అల్లా బాటలో నడుస్తున్నట్లు.
    మహమ్మద్ ఇలా క్షమించడాన్ని బట్టి తెగలూ,  జాతులూ అతడు చెప్పింది విని సమాజైక్యతకు ఇస్లాం దారితీస్తుందని ఒప్పుకున్నారు.  అంతకుముందు శతాబ్దలుగా తెగలవారు కొట్టుకుంటూ, చంపుకుంటూ పగ ద్వేషాలతో గడిపారు. అల్లా ముందు అందరూ సమానమే అని మహమ్మద్ బోధించాడు. సిద్ధాంతం ఆచరణ వేరుగా నడిచాయి. తాను చెప్పింది మహమ్మదే ఆచరించలేదు. యూదులూ మక్కావాసులూ ప్రత్యర్ధులపట్ల క్షమాపణ లేకుండా మహమ్మద్ ఘోరమైన ధోరణి అనుసరించాడు. మహమ్మద్ క్రూరత్వానికి ఉదాహరణలు బుఖారీ చూపాడు. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం పుట. 63, 64)
      ఉకుల్ జాతివారు ప్రవక్త వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరించారు. వారికి మదీనా వాతావరణం నచ్చలేదు. వెళ్ళిపోవాలనుకున్నారు. ఒంటెలను బహుమానంగా ఇచ్చిన చోటకు వెళ్ళమని ఉత్తరువులిచ్చాడు. ఒంటె పాలు తాగమన్నాడు. వారు జబ్బునుండి కోలుకుంటారన్నాడు. ఇదంతా జరిగిన తరవాత ఆ తెగవారు ఇస్లాంను వదిలేసి ఒంటెలను తీసుకుపోయారు. ప్రవక్త తన మనుషులను పంపి వారిని బంధించి మదీనాకు తెచ్చాడు. దొంగతనానికి వారి కాళ్ళూ, చేతులూ నరికి, కళ్ళు పీకించాడు. వారంతా మరణించారు.
      విలియం మూర్ మరికొన్ని దారుణాలను వివరించారు.  (ది లైఫ్ ఆఫ్ మహమ్మద్ పుటః 497-98.
      మహమ్మద్ ప్రవర్తనలో ఔదార్యం శత్రువుల పట్ల ఎక్కడా కనిపించదు. బదర్ యుద్ధంలో తెగిపడిన ఖురేష్ శవాలను ఆయన సంతృప్తిగా చూశాడు. అనేకమంది ఖైదీలను రాజకీయ వ్యతిరేకతకూ సందేహం వాదం వ్యక్తం చేసినందుకూ చంపించాడు. ఖైబర్ యువరాజు కనుగొన్నసంపదను దాచిపెట్టాడని  క్రూరంగా అతన్ని చంపేశాడు. అతని భార్యను బందీగా తీసుకెళ్ళాడు. యూదు తెగలపై తీవ్రమైన శిక్షల్ని విధించి వారిని అల్ మదీనా నుండి ప్రవాసం పంపించాడు. స్త్రీలను పిల్లలనూ బందీలుగా అమ్మేశాడు. పురుషులను తన కళ్ళెదుటే చంపించాడు.
    వాట్ రచనలో మహమ్మద్ నాయకత్వాన తెగల మధ్య సమన్వయమున్నట్లు చూపాడు. అన్ని తెగలూ అతని నాయకత్వాన్ని ఆమోదించలేదు. ఇస్లాం ఖండించిన తరువాత కూడా తెగల మధ్య స్పర్థలు కొనసాగినట్లు గోల్డ్ జిహర్ రాశాడు. మహమ్మద్ చనిపోయే నాటికి జాతి ఐక్యంగా లేదు. వారసత్వ యుద్ధాలు జరిగాయి. రెండు మూడు నాలుగు ఖలీఫాలు హత్యకు గురయ్యారు. 656లో ఉత్మన్ హత్యతో గందరగోళం, అంతర్యుద్ధం ప్రబలింది.
      ప్రవక్త ముస్లిం జీవితాన్ని పవిత్రమైనదిగా రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆటవిక విధానంలో కూడా లోగడ అలాంటి ప్రయత్నలు సాగాయి. కాని మహమ్మద్ విఫలుడయ్యాడు. అతని అనుచరులే అంతర్యుద్ధాలు సాగించారు. ఇస్లాం చరిత్రలో ముస్లిం సుల్తానులే ప్రవక్త వారసుల్ని, ముస్లిం సమాజాలనూ హతమార్చారు. (మార్గోలియత్, మహమ్మద్ 8వ సంపుటి, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ పుట. 877)
      వాట్ ఇలా రాశాడు. (కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం, 1వ సంపుటి పుటః 55) ముస్లింలలో యుద్ధ శక్తిని నిరోధించి విధ్వంసానికి దారితీయకుండా ముస్లిమేతరుల పైకి పవిత్ర యుద్ధం పేరిట పురికొల్చారు.
    అరబ్బు విస్తరణ, ఇస్లాం సామ్రాజ్యాన్ని ఆభినందించిన వాళ్ళలో వాట్ ఏకాకి కాదు. నేడు సామ్రాజ్యవాదం అహ్వానించదగింది కాదు. కాని ఇస్లాం సామ్రాజ్యవాదాన్ని, ఫలితంగా జరిగిన విధ్వంసం, మరణాలను ఎవరూ విమర్శించటం లేదు. పవిత్రయుద్ధం పేరిట వేగన్లను చంపటం, కాఫిర్లను జయించటం, ఇతరుల భూభాగాలను అక్రమించటం వాట్ వంటివారు ఎలా హర్షిస్తరో అర్థం కాకుండా ఉన్నది.
మహమ్మద్ చిత్తశుద్ధి
    మహమ్మద్ చిత్తశుద్ధిని గురించి చాలా సిరాను చిందించారు. అతడు తెలిసి మోసగించాడా, లేక దేవుడు స్వయంగా కొరాన్ రూపేణా తనకు అందించినట్లు నమ్మాడా.... మహమ్మద్ చిత్తశుద్ధిని ఒప్పుకున్నా, అతని శీలంలో నైతిక నిర్ణయం ఎలా ఆమోదించాలో  అర్థం కాని విషయం. అప్పుడు నమ్మకాలను చిత్తశుద్ధిగా విశ్వసించేవారు ఉండవచ్చు. అవినీతికరమైన, గౌరవ ప్రదం కాని నమ్మకాలను చిత్తశుద్ధిగా అనుసరించేవారు ఉండవచ్చు. యూదుల్ని తుడిచిపెట్టాలని కొందరు జాతివాదులు చిత్తశుద్ధిగా నమ్ముతున్నారు. ఇందులో చిత్తశుద్ధి అనేది న్యాయస్థానాలలో ముద్దాయిని తప్పించటానికి పిచ్చివారని న్యాయవాదులు ముద్రవేసిన పద్ధతులే ఇందులో ఉన్నాయి. మహమ్మద్ ఈ విషయంలో అనుసరించిన ధోరణిని  వాట్ సహితం గుర్తించాడు. (మహమ్మద్ ఎట్ మదీనా, పుటః 325) మహమ్మద్ తన కోరికల కనుగుణంగా దైవ ప్రేరణలు ఉన్నట్లు, తన స్వార్థ ఆనందాలకు అనుకూలంగా వీటిని మలచుకున్నట్లు స్చష్టపడుతున్నది. బహుశ తనను తాను మోసగించుకునే ధోరణి కావచ్చు. అంటే చిత్తశుద్ధి ఉన్నా భ్రమపూరితంగా బ్రతికాడన్నమాట. మహమ్మద్ ను గొప్చ రాజనీతిజ్ఞుడనీ, చురుకైన రాజకీయవాది అనీ, వాస్తవవాది అనీ, న్యాయచట్టాలను అందించినవాడనీ, మూర్ఛరోగులకు లోను కాలేదనీ చెప్పిన వారు హఠాత్తుగా మహమ్మద్ తనను తానే మోసగించుకున్నాడనీ చెప్పజాలరు కదా. ఉత్తరోత్తరా తన జీవితంలో మహమ్మద్ కావాలనీ, గృహసమస్యలు తప్పించుకోవడానికి, దైవ ప్రేరణల కథ అల్లాడు. మక్కాలో అతడు చిత్తశుద్ధిగా ప్రవర్తించాడనీ, దైవంతో సంభాషించినట్లు నమ్మాడనీ చెప్పవచ్చు.
      మదీనాలో అతని ప్రవర్తన మారిందనటంలో సందేహం లేదు. మూర్ ఈ విషయాలను ఇలా రాశాడు. (లైఫ్ ఆఫ్ మహమ్మద్, ఎడింబరో, 1923, పుటః660)
      స్వర్గం నుండి సందేశాలు వచ్చాయని తన రాజకీయ ప్రవర్తనను సమర్ధించుకోటానికి చెప్పాడు. దేవునిపేరిట యుద్ధాలు చేసి, ఉరిశిక్షలు విధించి, భూభాగాలను దత్తం చేసుకున్నాడు. వ్యక్తిగత విలాసాలకు కూడా దైవానుమతి చూపాడు. అనేకమంది భార్యలకు ప్రత్యేకానుమతి ఉన్నట్లు పేర్కొన్నాడు. మేరీ అనే సేవకురాలితో సంబంధం సమర్థించుకోవడానికి ఒక సురను రాశాడు. తానగ దత్తత చేసుకున్న కుమారుడి భార్యనే స్వీకరించిన ప్రవక్తను దేవుడు మందలించినట్లూ, ఐతే ఆమెను చేసుకోవటానికి దంపతుల మధ్య విడాకులకు అనుమతించినట్లూ, ఇదంతా దైవ ప్రేరణగా జరిగినట్లు చూపాడు. అలాంటివన్నీ మహమ్మద్ నమ్మినా అందుకు అతడే బాధ్యతకూడా వహించాలి.  అతడు చేసిన పనులలో అన్ని సూత్రాలకూ విరుద్ధంగా ప్రవర్తించిన తీరు ఉన్నది.
      మహమ్మద్ ఉత్తరోత్తరా చూపిన దైవ ప్రేరణలు ఆషామాషీగా తెచ్చిపెట్టినట్లు కనిపిస్తున్నది. రెండవ ఖలీఫా ఉమర్ ప్రవక్త వద్దకు వెళ్ళి  తన శత్రువు అబ్దల్లా ఇబన్ ఉబే కోసం ప్రార్థించినందుకు నిరసన తెలుపుతాడు. అలా తెలపటం మంచిదేనా అని అనుమానిస్తాడు. కాని ప్రవక్త తన ప్రవర్తనకూ అనుకూలంగా దైవ ప్రేరణ వచ్చినట్లు చెపుతాడు. (మార్గోలియత్ మహమ్మద్ అండ్ ది లైజ్ ఆఫ్ ఇస్లాం, పుట 218, 219)
      తాము ప్రత్యేక దైవ దూతలమనీ, వ్యక్తులుగానీ, దేశాలుగానీ ఊహించుకుంటే అది చాలా ప్రమాదకరమైన భ్రాంతికి దారితీస్తుందనీ రసెల్ అన్నాడు. (అన్ పాప్యులర్ ఎస్సేస్, పుట 161) మహమ్మద్, ముస్లిములూ ఇలాంటి భ్రాంతితో బాధపడ్డారు. ముస్లింలకు మాత్రమే విమోచన ఉన్నది. ఇస్లాం వెలుపల ముక్తి అని అనుమానిస్తాడు. కాని ప్రవక్త తన ప్రవర్తనకు అనుకూలంగా దైవ ప్రేరణ వచ్చినట్లు చెపుతాడు. (మార్గోలియత్, మహమ్మద్ అండ్ ది లైజ్ ఆఫ్ ఇస్లాం, పుటః 218, 219)
      తాము ప్రత్యేక దైవదూతలమనీ, వ్యక్తులు గానీ, దేశాలు గానీ ఊహించుకుంటే అది చాలా ప్రమాదకరమైన భ్రాంతికి దారితీస్తుందని రసెల్ అన్నాడు. (అన్ పాప్యులర్ ఎస్సేస్, పుట 161) మహమ్మద్, ముస్లింలూ అలాంటి భ్రాంతితో బాధపడ్డారు. ముస్లింలకు మాత్రమే విమోచన ఉన్నది. ఇస్లాం వెలుపల ముక్తి అనూహ్యం. దైవ సందేశాన్ని వ్యాపింపజేయటానికి ముస్లింలను దేవుడు ఎంపిక చేశాడు.
నైతిక సంస్కరణలు
            మహమ్మద్ ఆడపిల్లలు పసివారుగా ఉన్నప్పుడు సజీవంగా పాతిపెట్టే ప్రాచీన సాంప్రదాయాన్ని రద్దు పరిచాడు. ఇస్లాంకు ముందు స్త్రీల పరిలస్థితి మనకు తెలియదు గనుక మహమ్మద్ వారి క్షేమానికి ఏమేరకు కృషి చేశాడో చెప్పజాలం. ఇస్లాంలో స్త్రీల పరిస్థితి  అంతకు ముందుకంటే అధ్వాన్నంగా ఉందని పెరాన్ రాశాడు. (Femmes Arabes Avant ET Depuis L’Islamisme) స్త్రీలు తమ నైతిక స్థితిని, మేథా స్థాయిని కోల్పోయారని కూడా రాశాడు.
      స్త్రీలకున్న సహజ హక్కులను ఇస్లాం కొన్ని రద్దు చేసింది. పేగన్ అరబ్బు స్త్రీకి వివాహ విషయంలో  స్వేచ్ఛ ఉండేది. తన స్థాయికి తగ్గట్టు భర్త కోసం అన్వేషించటం, వేచి ఉండటం ఆనవాయితీగా ఉండేది. (పెరాన్  Perron) పుటః 105).
    బాస్క్వే వంటివారు స్త్రీ ఉద్ధరణలో మహమ్మద్ కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఆస్తి విషయంలో ఇస్లాంలో పురుషుడికి సమానంగా స్త్రీ ఉన్నది. మిగిలిన అన్ని విషయాలలో అమె తక్కువే. మహమ్మద్ ఇంకా బాగాచేసి ఉండవచ్చునని లేన్ పూలే అన్నారు.
      9యేళ్ళ ఆయేషాను పెళ్ళాడటంలో దారుణ ఉదాహరణ చూపాడని బాస్క్వే చెప్పాడు.
      ప్రమాణాల నిమిత్తం నష్టపరిహారం చెల్లించే ఒక విధానాన్ని మహమ్మద్ ప్రవేశపెట్టి తీవ్రమైన దోషాలను అలవాటు చేశాడు.
      సుర 16.93 ప్రమాణాలు కాపాడాలి.
    సుర 5.91 ఈ సూత్రాన్ని నష్టపరిహారం చెల్లించటం ద్వారా సవరించుకోవచ్చు. ప్రమాణాల్ని అధిగమించినప్పుడు మరొక రీతిలో వాటిని సరిపుచ్చుకోవచ్చు. మరొక సుర సూత్రం ద్వారా ఈ సూత్రాన్ని నిర్ధారించి ప్రవక్త తనకు అన్వయించుకున్నాడు. మహమ్మద్ చట్టంలో ప్రమాణం విధిగా పాటించాలని కట్టుబాటు లేదు. కురాన్ ప్రకారం కొన్ని దాతృత్వాలు చేసి చూపితే ప్రమాణాల బదులు సరిపోతాయన్నాడు. ప్రమాణం చేసిన వ్యక్తి దానికి బదులుగా మరొక చర్యను చేయటం మంచిదని భానిస్తే నష్టపరిహారంగా అలాగే చేయవచ్చు. (మార్గోలియత్ ది ఎర్లీ డెవలప్ మెంట్ ఆఫ్ మహమ్మదానిజం, పుటః 48, 49, లండన్ 1914)
      మహమ్మద్ జీవితంలో పరస్పర విరుద్ధాలున్నాయి. తరచు రాజకీయాధికారం కోసం అతడు రాజీపడే అవకాశం కనబరిచాడు. ఒక ధృవపత్రం నుండి దైవదూత అనే మాటను తొలగించడానికి అంగీకరించాడు. ఒక ఒడంబడికను ఆమోదించటం కోసం ఆ పని చేశాడు. విగ్రహారాధనకు వ్యతిరేకి. కాని పేగన్ అరబ్బుల విగ్రహారాధన అచారాలన్నీ నల్లరాతిని ముద్దుపెట్టుకోటం వంటివి ఆమోదిస్తూ ప్రవేశ పెట్టాడు. బాణం విసిరే మూఢాచారాన్ని రద్దు చేసిన మహమ్మద్, తన పూర్వీకుల గుర్తులనూ, చిహ్నాలనూ, ముఖ్యంగా పేర్లకు సంబంధించిన వాటిని అట్టిపెట్టాడు. దృష్టి దోషం నమ్మాడు. సురాలలో తొలుత తల్లిదండ్రులకు గౌరవం చూపాడు. తల్లిదండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా మహమ్మద్ పక్షాన చేరుతున్న యువతను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులను సమర్థించటం మానేశాడు. తల్లిదండ్రులను పూజించాలనే ఆచారాన్ని నిషేధించాడు. బంధువుల మధ్య రక్త సంబంధాన్ని వదిలేయాలని మహమ్మద్ చెప్పటం కూడా దారుణ ఫలితాలకు దారి తీసింది. కొరాన్ రాను రాను అసహనం పెంచుకుంది. మహమ్మద్ శత్రువులను హత్య చేయటం ఉదాహరణగా చూపుతూ కొమినీ వంటివారు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. మార్గోలియత్ ఇలా అన్నాడు. (పై పుస్తకం, పుటః 56-60)
      మహమ్మద్ జీవితానుభవాలు, మదీనాలో అతడు చిందించిన రక్తం, స్వర్గానికి పోవటానికి సన్మార్గాలని అతని అనుచరులు నమ్మారు  ముస్లిం గవర్నర్లూ, ఖలీఫాలూ, మంత్రులూ, హజాజ్, గజనీ మహమ్మద్ వంటివారు మహమ్మద్ ను ఆదర్శంగా చూపి చంపటం, దోచటం, విధ్వంసం సమర్ధించుకున్నారు. ఇస్లాంలో రక్తాన్ని చిందించటం, శత్రువులను ప్రవక్త సంహరించటం, కొరాన్లో విపరీతంగా రక్తపాతం చాలా బాధాకరమైన లక్షణాలని మార్గోలియత్ అన్నాడు. రసెల్ వంటి పాశ్చాత్య స్వేచ్ఛా ఆలోచనాపరులు సోక్రటీసు, బుద్దుడుకంటే జీసస్ క్రైస్ట్ అంత అభినందించ దగినవాడు కాదన్నాడు. మహమ్మద్ హత్యల్ని, పాశ్చాత్యులూ, ముస్లింలూ, ఇస్లాంను సమర్ధించేవారూ క్షమిస్తున్నారు. సోక్రటీస్, బుద్ధ, కన్ ఫ్యూషియస్, జీసస్ క్రైస్ట్ స్థాయిలో మహమ్మద్ ను చూడజాలం.
      ఖురాన్ దైవ వాక్యంగా నమ్మమనీ, అది శాశ్వతమనీ, సత్యమనీ, మహమ్మద్ చెప్పి నూతన భావాలనూ, స్వేచ్ఛాలోచననూ అరికట్టాడు. 21వ శతాబ్దంలోకి పురోగమించాలంటే స్వేచ్ఛా, నూతన భావాలు అవసరం.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment