సైన్స్ ను దూరంగా పెట్టిన ఇస్లాం-11 part-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?



ఇబన్ వారక్
11వ అధ్యాయం
గ్రీకు తత్వం - విజ్ఞానం, ఇస్లాంపై వాటి ప్రభావం
స్లాంలో పునర్వికాసం 8, 10 శతాబ్దాలమధ్య జరిగిందనీ, అప్పుడే ప్రాచీన సాహిత్య సంపద ఇస్లాంలో మిళితమయిందనీ ఎఫ్.ఆర్.రోసెస్ ధాల్ పండితుడు రాశాడు. ఇల్లాం నాగరికత ఎలా అభివృద్ధి అయ్యేదో చెప్పటం అనూహ్యమనీ, ఈ ప్రాచీన సంప్రదాయం వల్లనే అది సాధ్యపడిందని తెలుస్తున్నది. రోసన్ థాల్ అదే విషయాన్ని ఇలా వివరించాడు. (ది క్లాసికల్ హెరిటేజ్ ఆఫ్ ఇస్లాం, లండన్ 1975, పుటః 13, 14)
      ముస్లిం నాగరికత గొప్పతనాన్ని ప్రస్తావించినప్పుడు ఇస్లాంలోని హేతుబద్ధమైన పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. ప్రాచీన ప్రమాణిక సాహిత్యంపై ఇదంతా ఆధారపడింది. శాస్త్రీయ పరిశోధన, పాండిత్య సూత్రాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఇస్లాం మేథస్సు జీవన రంగం, గ్రీకు చింతన ద్వారా వెల్లడయింది. ప్రతి నాగరికతలో వలె ఇస్లాంలో కూడా వ్యక్తిగత లక్షణాలలోగాక సమన్వయీకరించిన జీవన విధానం స్వీకరించాలి. గ్రీక్ సంపదలేకుంటే ఇస్లాం నాగరికత ఉండేదే కాదు.
ఇస్లాం తత్వం
    ఇస్లాంతత్వం అనేది పరస్పర విరుద్ధ పదజాలమని చాలామంది పాశ్చాత్య పండితులు అనేకమంది ముస్లింలు భావిస్తారు. సనాతన సున్నీ ఇస్లాం ఏనాడూ తాత్విక అలోచనను ఆహ్వానించలేదు. తత్వాన్ని కోపంగా చూచిన సంప్రదాయవాదులు. అది ఒక విదేశం విజ్ఞానంగా సందేహానికీ, నమ్మక రాహిత్యానికీ దారితీసేదిగా తలపోశారు. సంప్రదాయవాదుల భయానికి అర్ధం ఉంది. చాలామంది తత్వవేత్తలు సనాతనత్వానికి దూరంగా అభిప్రాయాలు పెంపొందించారు. సున్నీవాదానికి వ్యతిరేకులైనవారు గ్రీకుతత్వంలో అనుసరించిన వివేచనను మార్గదర్శకంగా పెట్టుకున్నారు. అలాంటివారు ఇస్లాం మతానికి లాంఛనగౌరవాన్నే ఇచ్చారు. ఇస్లాం తత్వకథ యావత్తూ వివేచనకూ, దైవ ప్రేరణకూ మధ్య పోరాటంగా సాగింది.
అనువాదాలు
    ఉమాయద్దుల ఆధ్వర్యాన గ్రీక్ శాస్త్రీయ గ్రంథాల అనువాదం ఆరంభమైనప్పటి అబ్బాసిద్ ఖలీఫా అలణ మమూస్ (813-833, పాలన) గ్రీక్ త్తత్వాన్నీ, విజ్ఞానాన్నీ అనువదించే కార్యక్రమాన్ని తలపెట్టి ప్రోత్సహించాడు.  పరిశోధనకూ, అనువాదానికీ ఒక సంస్థను కూడా అల్ మామున్ స్థాపించాడు.
      అనువాదాలకు తొలుత అవసరార్థం ఉత్సాహం చూపినా, అదంతా వైద్య ఖగోళ విధానాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఆ తరువాత ప్రతిష్ఠకూ, జ్ఞానాన్వేషణకూ ఉపక్రమించారు. అల్ మమూన్ అనువాదాల ప్రయత్నానికి ముందే కొందరు ముస్లింలు వాదోపవాదాల నిమిత్తం తాత్విక, తార్కిక ప్రాధాన్యతను గుర్తించారు.
      అనువాదకులు చాలామంది క్రైస్తవులు, ఇందుకు మినహాయింపు తాబిత్ కురా, అతడు స్వేచ్ఛాలోచనగల పేగన్ అతడి ఉదారతాత్విక అభిప్రాయాలు హరాన్ లోని పేగన్లతో సంఘర్షణలకు దారితీసింది. తాబిత్ కురా గణిత, విజ్ఞాన తాత్వికుడు, పునర్వికాసంలో కీలకవ్యక్తి.
      అరిస్టాటిల్, అతని భాష్యకారులు, టిమిస్టినస్, సింప్లికస్, అలెగ్జాండర్, ప్లేటో, ప్లోటినస్, ప్రోక్లస్, ప్రోఫ్రీ, గాలెన్, హిపోక్రిటస్, ఆర్కిమిడిస్, యూక్లిడ్, టొలెమీ, తదితరులు రచనలు అనువదించారు.
ఇస్లాం తత్వంలో తొలిదశ
    అల్ కిందీ, అల్ ఫరాబీ, ఇబన్ సినా (అవిసెన్నా)
      9, 11 శతాబ్దాల మధ్య ఇస్లాంతత్వం తొలిదశ పాశ్చాత్య లోకంలో రూపురేఖలు దిద్దుకున్నది. అల్ కిందీ, అల్ ఫరాబీ, ఇబన్ సినాలతో ఇది ఆరంభమయింది. కొత్త ప్లేటోనిక్ అదిభౌతికవాదం. ప్రకృతి శాస్త్రాలు, మార్మిక వాదం, ప్లోటినస్, గాలెన్, ప్రోక్లస్ తత్వాల సమన్వయమే అందులో ఉన్నదని అర్నాల్డెజ్ రాశాడు. ఆర్.అర్నాల్డెజ్ ఫుల్ సఫా, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, పుటః 769-75)
      గ్రీకు తత్వానికి ఖురాన్ కూ, మౌలికంగా తేడాలు లేవని అల్ కిందీ భావించాడు. రెండింటి తమన్వయానికి కష్టపడి కృషిచేశాడు. ఇస్లాం మౌలిక సూత్రాలను అతడు నమ్మాడు. అంతమాత్రాన ఇస్లాం తాత్విక చరిత్రలో ఇతడి ప్రాధాన్యతను తగ్గించనక్కరలేదు. గ్రీకు విజ్ఞానంలో ముస్లింలను ప్రవేశపెట్టిన కీర్తి అతడికే దక్కుతుంది. ఇస్లాంలో కొత్త ప్లాటోనిక్ భావాలు ప్రవేశపెట్టి వివేచనను సమర్ధించాడు.
అల్ సరక్షి (899లో ఉరితీత)
    తాత్విక చింతనాధోరణి ఇస్లాం మౌలిక సూత్రాలను ప్రశ్నించటట్లు చేసింది. దీనివలన అల్ కిందీ శిష్యుడు అహమ్మద్ అల్ తయీబ్ అల్ సరక్షి చిక్కుల్లో పడ్డాడు. అతను గ్రీకుతత్వంలో ఆసక్తి చూపి ఖలీఫా అల్ ముతాదిద్ కు గురువుగా ఉన్నాడు. ఖలీఫా ఆగ్రహానికి గురయ్యాడు. వినూత్న భావాలు బాహాటంగా చర్చించటం వలన అతడిని ఉరితీయమని ఖలీఫా ఉత్తరువులిచ్చాడు. ప్రవక్తలు వాచాలురు అని అతడు రచనలు చేశాడు. సందేహవాదాన్ని ప్రవేశపెట్టాడు. ముతాజిలైట్ల హేతువాదం ఇందుకు దోహదం చేసింది. ఆ వాదంపట్ల అతడు సానుభూతి చూపాడు.
అల్ ఫరాబీ
    అల్ ఫరాబీ (870-950) సనాతన ఇస్లాం భావాలతో పొసగని కొత్త విషయాలను మనం గమనిస్తాం. చనిపోయిన తరువాత దేహం మళ్ళీ బ్రతికి రావటమనేది అల్ షరాబీ అంగీకరించలేదని అర్బరీ రాశాడు. (ఎ.జె. అర్బరీ, రీజన్ అండ్ రెవలేషన్, పుటః42) ఈ విషయంలో అర్బరీ చెప్పేదానికంటే అల్ ఫరాబీలో పొందిక లేదని తెలుస్తుంది. ఇదే విషయాన్ని పైన్స్ సూచించాడు. స్పినోజా వెల్లడించిన ధోరణిలో అల్ ఫరాబీ కూడా తన ఉద్దేశాలు ముసుగులో దాచి ఉంచి ఆలోచనలు చేశాడు. సహనంతో ఉండే మతవాదులు సహితం అంగీకరించలేదని  భావాలు అతనిలో ఉన్నాయి.
      అల్ ఫరాబీ ఆత్మకు మేధస్సు దృష్ట్యా అమరత్వాన్ని ఆపాదించాడు. ఇది అరిస్టాటిల్ ధోరణి. మేధస్సు అవగాహన, సంపూర్ణత, సాధించిన ఆత్మలు మాత్రమే సంతోషంగా ఉంటాయన్నాడు మరణానంతరం ఈ ఆత్మలకు వ్యక్తిత్వం ఉండదనీ, స్వర్గంలో మేధస్సు రీత్యా ఇవి చురుకుగా ఉంటాయనీ అన్నాడు. మిగిలిన ఆత్మలు శరీరంతోపాటు నశించటమో, లేక పునర్జన్మలు పొందటమో జరుగుతుందన్నాడు. ఏకేశ్వర వాదన బాగా పాటించే వారికి అల్ ఫరాబీ ఆలోచనా ధోరణులు తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టాయి. అల్ ఫరానీ పేర్కొనే చురుకైన మేధస్సు ప్రత్యేక అధిభౌతిక అస్తిత్వం కలది. చంద్రుడికీ, మానవుడికీ మధ్య ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనిస్థానం ఉంటుంది. మనిషికీ, దైవానికీ దీని ద్వారానే సంబంధం ఏర్పడుతుంది. వివేచనను సమర్థించటం, ప్రవక్త చింతనకంటే తత్వం ఆధిక్యమైనదనటంవల్ల అల్ ఫరాబీని సనాతనులు అనుమానించారు. మానవ సంతోషానికి వివేచనా ధోరణి దారితీస్తుందని అల్ ఫరాబీ అంటాడు. విశ్వాన్ని దైవం పాలించినట్లే మానవుడిని వివేచన నడిపించాలంటాడు. వివేచనను మించిన ఉన్నతస్థితి మానవుడిలో అనూహ్యం అంటాడు. (వాల్టర్, గ్రీక్ ఇన్ టు అరబిక్, ఆక్స్ ఫర్డ్ 1962, పుటః 15) తత్వానికి ద్వితీయస్థానం ఇవ్వటం అల్ ఫరాబీకి తృప్తి కలిగించలేదు. తాత్విక సంఘర్షణ వచ్చినప్పుడు దైవ ప్రేరణకంటే వివేచనకే అతడు ప్రాధాన్యత నిచ్చాడు. కాలం కలిసివస్తే విశ్వస్థితి ఒకే రీతిలో ఉంటుందన్నాడు. అలా కానప్పుడు అనేక మతాలు ఉండవచ్చునన్నాడు. అది కూడా సాధ్యం కాకపోతే ఇస్లాం తాత్విక అవసరాల దృష్ట్యా మార్పుకు గురై ఆచరణలోకి వస్తుందన్నాడు (పై పుస్తకం, పుటః 18)
ఇబన్ సినా (980-1037)
    ఇబన్ సినా (అవిసెన్నా తత్వాన్నీ, మతాన్నీ పొందుపరచటానికి అలంకారపూరిత భాష్యం చేశాడు. అల్ సఫారీ వలన ప్రభావితుడయ్యాడు. జీవితానంతరం అతడు చెప్పే విషయాలు సనాతనులకు ఆమోదయోగ్యమా అనేది సందేహాస్పదం, మనుషుల్ని ఎవరన్నా తీసేస్తే అలాంటి శరీరం మళ్ళీ ఎలా వస్తుందని అవిసెన్నా అడిగాడు. దేహం, ఆత్మ కలిసి తిరిగి రావడాన్ని ప్రశ్నించాడు. వ్యక్తిత్వం అంటే శరీరం కాదనీ, ఆత్మ అనీ, మరణానంతరం వ్యక్తిత్వం కొనసాగటం అంటే ఆత్మ ద్వారా సాధ్యమనీ అంటాడు. అవిసెన్నా సిద్ధాంతం అమలుకు వచ్చి ఉంటే ఇస్లాం చరిత్ర ఇంకోరకంగా ఉండేదని ఎ.జే.అర్బరీ భావించాడు.  ఆ సిద్ధాంతంలో అరిస్టాటిల్, నోయో ప్లేటో వాదం కలిసి ఉన్నాయి. గ్రీక్ తత్వం సజీవంగా కొనసాగి ఇస్లాంకు అంధకారయుగం లేకుండా ఉండేదని ఎ.జె.అర్బరీ భావించాడు. (రీజన్ అండ్ రెవలేషన్ పుటః 56)
      సనాతన మతవాదులు అవిసెన్నా అలంకారపూరిత ధోరణిని అంగీకరించలేదు. అందులో ప్రమాదం ఉన్నదని వారనుకొన్నారు. ప్రజలకు ఒక సత్యం, తాత్విక ధోరణిగల వారికి మరొక రీతి ఉండాలనే పద్ధతిని ఏమంత హేమకరం కాదని వారు భావించారు. ఈ రెండు విధాలైన ధోరణులు ఎలా దారితీస్తాయో సనాతనులు ఊహించారు. ఖురాన్ వెళ్ళటమే క్షేమకరంమనుకొన్నారు.
అల్ ఘజాలీ-తాత్వికుల అసంబద్ధత
    మహమ్మద్ తరువాత ముస్లింలలో అల్ ఘజాలీని అత్యున్నతంగా పరిగణిస్తారు. అతడికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. అతడు సాధించిన వాటిలో ఇస్లాం మతవాదానికి తాత్విక పునాదులు సమకూర్చటం, సూఫీవాదాన్ని సనాతన ధోరణులలోకి ఇమడ్చటం పేర్కొనదగినవి. అరిస్టాటిల్ తర్కాన్ని మెచ్చిన అల్ ఘజాలి సున్నీల మొండివాదనలను నియో ప్లాటానిక్ పద్ధతులలో సమర్ధించారు.
      కొందరి దృష్టి అల్ ఘజాలీ అతిరోగమన వాది అని అర్నాల్డెజ్ అన్నాడు. (ఫల్ న పై, పైన ఉదహరించిన ఎన్ సైక్లోపీడియా, పుటః 769-75) ఇస్లాంకు, గ్రీకు తత్వం హేతువాదానికీగల సన్నిహితత్వాన్ని అలఘజాలీ అంతం చేశాడన్నారు. మొండి వాదానికి లొంగిపోయిన మత తత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడన్నాడు. తాత్వికుల అసంబద్ధత అనే సుప్రసిద్ధ రచనలో ఇస్లాంతో పొసగని తాత్వికులు విమర్శించాడు. ఇస్లాంలో తత్వం అదృశ్యం కావడానికి అల్ ఘజాలీ ఒక్కడే కారణం అనటం సందేహాస్పదం. 1095లో అల్ ఘజాలీ రాసేనాటికి తూర్పుదేశాలలో తత్వం పతనదశలో ఉన్నది. మేధారంగంలో  తాత్విక చింతన ఖండించిన అల్ ఘజాలీ చరిత్ర మలుపులో నిలిచాడు. అప్పటికే తూర్పులోకంలో పోరాటం ఆగిపోయింది. ఆ తరువాత అంతా దైవ ప్రేరణకే అంకితమైందని అక్బరీ రాశాడు.
      సోక్రటీస్, హిపోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి పేర్లను వినటంతోనే తాత్వికులు భిన్నాభిప్రాయాలకు వచ్చారని అల్ ఘజాలీ రాశాడు. పవిత్రచట్టాలూ, క్రతువులూ, మతవిశ్వాసాలూ నిరాకరించి అవన్నీ అల్లిన మంత్రతంత్రాల వంటివని భావించినట్లు అల్ ఘజాలీ తాత్వికులను విమర్శించాడు. 17 విషయాలలో తాత్వికులు బేదాభిప్రాయాలూ పేర్కొన్నట్లు, 3 రంగాలలో వారు కాఫిర్లుగా ఉన్నారనీ, అల్ ఘజాలీ అన్నాడు. ఆ తాత్వికుల ఆధారంగా అభిప్రాయాలేర్పరచుకున్నవారిని చంపేయటానికి ఎల్ ఖజాలీ వెనుకాడలేదు. మొదటిది, ప్రపంచ నిత్యం అనటం. అందులోని ద్రవ్యపదార్థం శాశ్వతమనటం, శూన్యం నుండి సృష్టిని తాత్వికులు త్రోసిపుచ్చారు. రెండవది, వ్యక్తులకు జరిగే సంఘటనలు దైవదృష్టిలో ఉండవన్నారు. మూడవది, శరీరం తిరిగి బ్రతికి వస్తుందని ఒప్పుకోలేదు.
      అల్ ఘజాలీకున్న ప్రతిష్ఠవలన అతడిని విమర్శించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ప్రత్యక్షంగా అతడు అందించిన వాటికంటే పరోక్షంగా అతడి ప్రభావం చాలా పనిచేసింది. ఖురాన్ లో తిరుగులేని విశ్వాసాన్ని ముస్లింలు ప్రకటించేటట్లు చేశాడు. దైవ ప్రేరణకు పూర్తిగా లొంగిపోయి ముతాజిలైట్ల హేతుబద్ధ ఆలోచన వలన సమకూడిన ఉపయోగాలను పోగొట్టాడు. ఖురాన్ లోని స్వర్గ నరక వివరాలతో సహా ప్రతిదీ తు.చ. తప్పకుండా వాస్తవమని నమ్మాల్సిందేనన్నాడు. ఇస్లాంలో భయాన్ని తిరిగి ప్రవేశపెట్టటం అల్ ఘజాలీ చేసిన ఘోరాలలో ఒకటి. అలాగే నరక శిక్షలు ఉన్నట్లు కూడా నమ్మించాడు.
      గణితం, తర్కం, పదార్థ శాస్త్రం కొంతవరకు తటస్థమని అల్ ఘజాలీ భావించాడు. కాని వాటి పద్ధతులలో తొందరపడి సాధారణీకం చేసే ధోరణి ఉన్నదని హద్దులు మించే రీతులున్నాయని అన్నాడు. స్వేచ్ఛాయుత అన్వేషణ, మేధస్సుతో జిజ్ఞాస, అల్ ఘజాలీ వ్యతిరేకించాడు. చట్టానికీ, మతానికీ భిన్నంగా ప్రకృతి శాస్త్రాలూ పయనిస్తున్నాయని తన పుస్తకంలో రాశాడు. (ఐ. హెచ్.వై.ఎ.యుల్.యుమ్.ఎల్.ధిన్ 7వ భాగం, రెండవ అధ్యాయం) స్వచ్ఛాలోచన కట్టిపెట్టి ప్రవక్తలు నిర్ణయాలను ఆమోదించమన్నాడు.
      గ్రీకు తత్వంలో కొత్తవి కనుగొనడం, తార్కికంగా అన్వయించటం జరిగాయన్నాడు. వివేచన సత్యానికి దారితీయదనీ, దైవ ప్రేరణే అందుకు మార్గమని అన్నాడు. అల్ ఘజాలీ తాత్వికులను విమర్శించటానికి వివేచన, తార్కిక పద్ధతులనే వాడాడు. ఇతర అభిప్రాయాలు గలవారిని విమర్శించటం, ఖండించటం శరీరం, ఆత్మ శాశ్వతమని ఒప్పుకోనివారిని చంపమనటం అల్ ఘజాలీ రాసిన విషయాలుగా ఉన్నప్పుడు వాటిని అభినందించగలమా ?
అబూబకర్ మహమ్మద్ జకారియా అల్ రజీ (865-925)
    ఇస్లాంలో అల్ రజీ గొప్ప స్వేచ్ఛాలోచనాపరుడు. 17వ శతాబ్దం వరకూ అతని ప్రతిష్ఠ పెత్తనం ఎదురులేకుండా సాగింది. మేయర్ దృష్టిలో అల్ రజీ ఇస్లాం లోకంలో ఒక గొప్ప వైద్యుడు. అన్ని కాలాలకు చెందిన గొప్ప వైద్యుడు. గేబ్రియేలీ దృష్టిలో అల్ రజీ మధ్యకాలాలలోని గొప్ప హేతుబద్ధ ఆగ్నేయవాది. యూరోప్, ప్రాచ్యలోకంలోనూ అతడు గొప్పవాడే. అల్ రజీ టెహరాన్ వద్ద రే ప్రాంతానికి చెందినవాడు. గణితం, తత్వం, ఖగోళం, సాహిత్యం, రసాయనికాలు అధ్యయనం చేశాడు. బహుళ రెరాన్ షాహిరీ ఆధ్వర్యంలో ఇతడు చదివి ఉండవచ్చు. ఆనాటి మతాలలో దేనినీ నమ్మని ఎరాన్ షాహిరీ తాను కనిపెట్టిన మతాన్ని ప్రచారం చేశాడనీ  అల్ బెరూనీ రాశాడు. (ఇండియా, అనువాదం, సఖావ్, లండన్, 1914,  పుటః 627)
      అతడి ప్రభావం అల్ రజీ మీద ఉంటే అన్ని మతాలను నమ్మకుండా పోయినట్లే. బాగ్దాద్ లో వైద్యం చదివి అక్కడి గ్రంథాలయాలకు వెళ్ళి ఒకో ఆస్పత్రిలో పనిచేశాడు కూడా.
      అల్ రజీ అనేక విషయాలపై 200 పుస్తకాలు రాశాడు. గణితం, ఒక్కటే అందులో మినహాయింపు. 15 సంవత్సరాలు కృషిచేసి అల్ హవీ అనే వైద్య విజ్ఞాన సర్వస్వం రాశాడు 1279లో దీనిని లాటిన్ లోకి అనువదించారు. అతడు ప్రాపంచిక అనుభవవాది. పిడివాదం బొత్తిగా లేనివాడు. అతని వైద్య రికార్డులలో రోగి ఎలా ఉన్నదీ, రుగ్మతలు, చికిత్స ఫలితాలు రాసుకున్నాడు. ఆటలమ్మ, పొంగు వంటి అంటురోగాలపై రచనలు చేశాడు. ఇది స్వానుభవంతో పరిశీలించిన విషయాలు. చికిత్సలో గుండె ఊపిరి పీల్చటం వంటి విషయాలను అశ్రద్ధ చేయలేదు. చర్మరోగాలు, పోషక ఆహారం, కీళ్ళ నొప్పులు, జ్వరాలు, విషం మొదలైన వాటిపై రాశాడు.
      అల్ రజీ రసాయనికాన్ని గురించి అనుభవపూర్వక దృష్టి పెట్టాడు. ఈ రంగంలో ఉన్న ఊహాపోహలు  దూరంగా పెట్టి వస్తు వర్గీకరణ చేసి తన పరిశోధనలను కచ్చితంగా వివరించాడు. రసాయనిక మాంత్రికులకు వ్యతిరేకంగా ఇతడు శాస్త్రీయ రసాయనిక పద్ధతులు అవలంబించాడు. విమర్శకేదీ అతీతం కాదనే తాత్విక దృష్టి  పెంపొందించాడు. అతడు దృష్టి పెట్టిన రంగాలలో సంప్రదాయాన్నీ, అధికారతనూ ప్రశ్నించాడు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, హిపోక్రటీస్, గాలెన్ వంటి గొప్ప గ్రీక్ వారిపట్ల గౌరవం, అభినందన ఉన్నప్పటికీ వారి ప్రభావంలో కొట్టుకపోలేదు.
      వారికంటే బాగా తెలుసనుకున్నచోట తాత్విక ఫలితాలను మార్చటానికి అతడు వెనుకాడలేదు. తన పరిశోధన పరిశీలన వలన కనుగొన్న విషయాన్ని వైద్య విజ్ఞానికి చేర్చాడు. ఏదైనా రోగాన్ని చికిత్స చేస్తే గ్రీక్ భారతీయ మూలాధారాలను అరబిక్ వైద్యుల రచనలను ముందు పరిశీలిచేవాడు. తన అభిప్రాయాన్ని జోడించి నిర్ణయం తెలిపేవాడు. పెత్తందారీ తనానికి ఏనాడూ కట్టుబడలేదు. (వాల్టర్, గ్రీక్ ఇన్ టు అరబిక్, పుట 15) మానవతా వాదిగా అల్ రజాకి మాన వివేచనలో అపారనమ్మకమున్నది. స్టిరిట్యూల్ ఫిజిక్ అనే నైతిక గ్రంథంలో ఇలా రాశాడు. (ది స్పరిట్యుఅల్ ఫిజిక్, పుటః 20, 21, అనువాద ఎ.జె.అర్బరీ)
      సృష్టికర్త మనకు వివేచన ఇచ్చాడు. దీని ఆధారంగా ఇహ పరలోకాలలో మనం అనేకం సాధించవచ్చు. దేవుడిచ్చిన ఈ వరానికి మించిన అవకాశం లేదు. నిర్హేతుక పశువుల కంటె హేతుబద్దమైన మనల్ని దైవం ఎంపిక చేసింది. వివేచన ద్వారా జీవితాన్ని సుఖమయంగా, రామణీయకంగా చేసుకోవాలి. కోర్కెల్ని ప్రయోజనాలనూ సాధించుకోవాలి. వివేచనతో ఓడల నిర్మాణాన్ని గ్రహించాం. మనల్ని ఎడం చేస్తున్న సముద్రాల మీదుగా దూర ప్రాంతాలకు వెళుతున్నాం. వైద్యం తెలుసుకొని శరీరానికి ఉపయోగకరంగా మార్చుకుంటున్నాం. కళల్ని సానుకూలంగా చేసుకుంటున్నాం. భూమి ఆకాశాలూ, సూర్యచంద్రులూ, తారలూ, వాటి ఆకారాలూ, దూరాలూ, చలనాలూ తెలుసుకోగలుగుతున్నారు.
    శూన్యం నుండి సృష్టి వచ్చిందనే ఇస్లాం మొండివాదాన్ని అల్ రజీ నిరాకరించాడు. ప్రపంచం ఒక సమయంలో సృష్టి అయింది. శూన్యం నుండి మాత్రం కాదు. సృష్టికర్త, ఆత్మ పదార్థం, కాలం ప్రదేశం అనే ఐదు శాశ్వత సూత్రాలు అల్ రజీ నమ్మాడు. తెలియని ఆత్మ పదార్థాన్నీ దైవాన్నీ కోరి, చింతనలు పోగొట్టుకోవాలనుకున్నాడు. పదార్థంతో కూడిన ప్రపంచాన్ని సృష్టించింది. మేథస్సు ద్వారా బాధల్ని తొలగించుకోటానికి పదార్థం లీనమవుతుంది.  ఈ విషయాన్ని గ్రహించిన ఆత్మకు ప్రపంచం లేకుండా పోతుంది. (కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం, 2వ సంపుటి, పుటః 803) అల్ రజీ దృష్టిలో దైవ ఏకత్వం శాశ్వత ఆత్మలో గానీ పదార్థం, కాల ప్రదేశాలలో గానీ కలియదు.
      నైతిక గ్రంథంలో అల్ రజీ ఖురాన్ ప్రవక్తల ప్రస్తావన తేలేదు. సహనపూరిత ఆగ్నేయవాదం, మేథాపూరిత ఆనందమయవాదం అతడిలో కనిపిస్తున్నాయని అర్బరీ అన్నాడు. సంస్కృతీపరమైన పర్ష్యన్ దృష్టి ఇరాన్ ఆలోచనా, జీవన విధానం పెంపొందించాయని కూడా అన్నాడు. (అల్ రజీకి పరిచయం, పుటః 10) మితవాదం కోరిన అల్ రజీ సన్యసత్వాన్ని ఒప్పుకోలేదు. హేతుబద్ధంగా కోర్కెలను అదుపులో పెట్టకోవాలనుకున్నాడు. కష్టసుఖాలను గురించిన సిద్ధాంతం ప్లేటో ప్రస్తావించిన ఫైలిబస్ పాత్ర ప్రభావం ఇతనిలో కనిపిస్తుంది. సాధారణ స్థితికి రావడమే సుఖమనీ అలా లేక పోవటమే బాధ అనీ అన్నాడు.
      మరణానంతరం జీవనాన్ని గురించి నిర్ణయం చెప్పలేదు. హేతుబద్ధంగా మరణంపట్ల భయం ఉండరాదన్నాడు. ఎపిక్యూరస్ ను పోలిన దృష్టి ఉన్నది. ఈ విషయమై వృద్ధాప్యంలో కవిత రాశాడు. (అల్ రజీకి పరిచయం. పుటః 7)
      అల్ ఘజాలీ పిడివాదాల తరువాత అల్ రజీ రచనలు స్వేచ్చా వాయువులను వ్యాపింపజేసినట్లున్నది. అతడి అభిప్రాయాలను ముస్లింలు ఖండించారు.  హజం నసీర్ ఖుస్రో, అల్ కిర్ మానీ, అల్ బెరూనీ ఈ ఖండనలో చేతులు కలిపారు. తత్వానికీ, మతానికీ సామ్యం ఉండబోదని అల్ రజీ అన్నాడు. దైవ ప్రేరణ మతాలకు వ్యతిరేకత చూపుతూ పుస్తకం రాశాడు. అది యూరోప్ లోని స్వేచ్ఛాలోచనకు దారితీసింది. (D.De Tribus Imposturibus) అతడు రాసిన మరో గ్రంథం ప్రవక్తపై ఉన్నా అది లభించలేదు. తత్వం ద్వారా విమోచన సాధ్యం అని దైవ ప్రేరణ కంటే వివేచన ఆధిక్యమనీ, On prophecy పుస్తకంలో రాశాడు.
      ఇస్మాయిలీ అనే రచయిత ఖండిస్తూ రాసిన దానిని బట్టి అల్ రజీ రెండవ పుస్తకాన్ని గురించి కొంత తెలుస్తూన్నది. క్రాస్, పైన్స్, గేబ్రియలీ పరిశీలన వలన గ్రంథ విషయాలు గమనించవచ్చు. (ఎన్ సైక్లోపీడియీ ఆఫ్ ఇస్లాం, అల్ రజీపై గేబ్రియలీ వ్యాసం)
      మనుషులంతా సహజంగా సమానం వివేచనా శక్తి ఉన్నది. గుడ్డినమ్మకంతో కొట్టుకుపోరాదు. వివేచన వలన శాస్త్రీయ సత్యాలను తెలుసుకోగలుగుతున్నాం. నిడిపాటి గడ్డాలు పెంచి, మేకలవలె ప్రవక్తలున్నారని ఈసడిస్తూ అబద్ధాలు వల్లిస్తూ, గుడ్డిగా జనం అనుకరించేటట్లు వశపరుచుకుంటారని అన్నాడు. వారి అద్భుత చర్యలన్నీ టక్కుటమారాలనీ, వాటికి సంబంధించిన కథలన్నీ అబద్ధాలనీ అన్నాడు. ప్రవక్తల అబద్ధాలన్నీ వారి పరస్పర విరుద్ధ విషయాలనుబట్టి స్పష్టమవుతున్నాయన్నాడు.  తోర గ్రంతాన్ని కొత్త నిబంధనలు వ్యతిరేకిస్తుండగా కొత్త నిబంధనకు వ్యతిరేకంగా ఖురాన్ ఉన్నది. ఖురాన్ అసంబద్ధాల అల్లిక జిగిబిగితో కూడిన కలగాపులగం అన్నాడు. పైగా దానిని అనితల సాధ్యంగా నిర్ణయించాడన్నారు. భాష, శైలి ఎలుగెత్తి చెప్పేవన్నీ దోషరహితాలు కాదన్నాడు. ఆచారం, సంప్రదాయం ఆలోచనలో ఉదాశీనత వలన మత నాయకుల్ని గుడ్డిగా అనుసరిస్తున్నారన్నారు. మానవజాతిని రక్తపాతంలో తడపడానికి మతాలే ఏకైక కారణం అన్నాడు. శాస్త్రీయ పరిశోధనకూ, తాత్విక ఆలోచనకూ మతాలు వ్యతిరేకం. పవిత్ర గ్రంథాలన్నీ విలువలేని, మంచికంటే వాటివలన చెడే ఎక్కువ జరిగింది. ప్లేటో, అరిస్టాటిల్, యూక్లిడ్, హిపోక్రిటస్ వంటి ప్రాచీనుల రచనల వలన మానవులకు ఎక్కువ ఉపయోగం జరిగింది.
      మత నాయకులచుట్టూ చేరినవారు బలహీనులూ, స్త్రీలూ ఉన్నారు. మతం సత్యాన్ని అణచివేస్తుంది. శతృత్వాన్ని పోషిస్తుంది. దైవ ప్రేరణతో ఒక పుస్తకం వచ్చినట్లు పేర్కొంటున్నారు. రేఖాగణితం, ఖగోళ, వైద్యం, తర్కంలో గ్రంథాలు ఖురాన్ కంటే ఎక్కువ ప్రేరేపితాలనవచ్చు. మహమ్మద్ సత్యబోధనలో పారమార్థిక సాయిలీ రామణీయకతలతో ఖురాన్ ఉన్నదని సనాతన ముస్లింలు అంటారు. అల్ రజీ అదంతా ఖండించాడు.
      (కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం 2వ సంపుటి, పుటః 801
      అల్ రజీ తన రాజకీయతత్వంలో, వ్యక్తుల క్రమబద్ధమైన సమాజంలో నివశించవచ్చనీ, ప్రవక్తలు బలవంతంగానీ, మత శాసనాల భీభత్సం గానీ అవసరం లేదన్నాడు. సారా నిషేధం వంటివి ముస్లిం చట్టంలో ఉన్నా అతడు పట్టించుకోలేదు. మానవ జీవితాన్నీ, వివేచన, తత్వాల ద్వారా పెంపొందించుకోవచ్చనీ, మతం అవసరం లేదనీ అన్నాడు. తరతరాలుగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రాల ప్రగతిని అల్ రజీ నమ్మాడు. ప్రాపంచికానుభవాల పరిశీలనను నిరాకరించకుండా, మనం ముందే ఏర్పపచుకున్న అభిప్రాయాలలో అవి ఇమడటం లేదని అనుకోకుండా విశాల దృక్పథం ఉండాలన్నాడు. తాను చెపుతున్న విషయాలు ఉత్తరోత్తరా అనేకంటే గొప్పవారు వచ్చి మెరుగులు దిద్దుతారన్నాడు. మధ్యకాలాలలో యూరోప్ లోనూ, ఇస్లాంలోనూ అల్ రజీ చేసిన తీవ్రవిమర్శలు పేర్కొనదగినవి. అతని రచనలు లభించటంలేది. వాటిని విస్తారంగా చదవలేడు. ఐనా నాటి సంస్కృతి సమాజాల సహనం ఆ రచనల ద్వారా తెలుస్తున్నది. ఇలాంటి సహనం ఇతర కాలాలలోనూ, ఇతర చోట్లా లోపించింది.
ఇస్లాం తత్వంలో రెండవ దశ
    ఇస్లాం రెండవ దశలో అవెంపేస్ (ఇబన్ బజా) ఇబన్ తుఫాయల్, అవరోస్ (ఇబన్ రుష్ట్) వంటివారు పాశ్చాత్య ఇస్లాం లోకంలో తాత్వికులుగా ఉన్నారు.
ఇబన్ బజా (1138లో మరణం)
      ఇబన్ బజా తన కాలంలో భౌతిక ధోరణులను నైతికంగా విమర్శించడానికి తత్వాన్ని అడ్డంపెట్టుకున్నారు. తాత్వికుడు వేరే ఉంటూ ఆలోచనారంగంలో కొనసాగుతూ మేధస్సుతో తాదాత్మ్యం చెందాలన్నాడు. శరీరం తిరిగి వస్తుందనే విషయాన్ని, వ్యక్తి ఆత్మ బతుకుతుందనే మాటల్ని అతడు నిరాకరించాడు. మేథస్సు మాత్రమే ఉంటుందన్నాడు. అందులో వ్యక్తి లక్షణాలు  లేవు. సాధారణ ముస్లింకు అతని తత్వం ఊరటనివ్వలేదు. ఇబన్ బజాను నాస్తికుడుగా, ఖురాన్ నిరాకరించిన వాడుగా ముస్లిం మొండి వాదనలను తృణీకరించిన వాడుగా పరిగణించాలి.
ఇబన్ తుఫాయల్ (1185లో మరణం)
    ఇబన్ తుఫాయల్ సుప్రసిద్ధ తాత్విక కథనం అల్లాడు (Hayy Ibnyaqzan) ఇందులో కథానాయకుడు ఎడారిలో పెరిగి నైపుణ్యతతో కొనసాగుతాడు. ఎలాంటి వివేచన తోడ్పాటు లేకుండానే తాత్విక జ్ఞానాన్ని అర్థిస్తాడు. అసల్ అనే అతను పొరుగు దీవి నుండీ వస్తాడు. అతడు సంప్రదాయ మతంలో పెరిగిన వాడు. మత గ్రంథ వ్యాఖ్యానాలతో అలనంకార ప్రాయమైన వాటిపట్ల ఆకర్షితుడవుతాడు. ఏకాంతంలో దైవ ధ్యానం చేస్తాడు. ఉభయులూ తమ తాత్విక స్థితిని చర్చించి, ఒకే బాటన పోతున్నట్లు తెలుసకుంటారు. హానీ జన నివాసాలలోకి పోయి సంప్రదాయ మతాలు పాటించేవారిని చూస్తాడు. తమ తాత్విక మతాన్ని బోధించే విఫలప్రయత్నం చేస్తాడు. అందరూ అది గ్రహించలేరని గుర్తిస్తాడు. దీనిలో ఉన్న జనం చాలామంది జంతుస్థాయిలో  ఉన్నట్లు చూస్తాడు. ఇబన్ తుషాయల్ తాత్విక స్వతంత్ర ప్రతిపత్తిని సమర్థిస్తాడు. కేవల తత్వానికీ హానీ, తాత్విక మతజ్ఞానానికి అనల్ ప్రాతినిధ్యం వహిస్తారు. మత, తత్వ సామరస్యాన్ని సమర్థిస్తున్నట్లు ఉన్నా అవి రెండూ ఒకేస్థాయిలో లేవని ఇబన్ తుఫాయల్ చూపుతాడు. తాత్విక సత్యం కేవల వివేచనలో సాధించటం వలన కొద్దిమందికే అది పరిమితం అవుతుంది. ఆలోచన చేయని జవాబు మత సత్యాన్నీ, మత నిబంధనలనూ, సంప్రదాయాలను పాటిస్తారు.
అవరోస్ (1126-1198)
    అబు అల్ వాలిద్ మహమ్మద్ రుస్త్ లేదా అవరోధ్ న్యాయనిపుణులు కుటుంబం నుండి వచ్చాడు. సైవైల్, కోల్డోబాలో గొప్ప భాష్యకారుడుగా పేరొందాడు. నిపుణులు అతని తాత్విక భావాలను తీవ్రంగా చర్చించారు. నిపుణులు కానివారు జాగ్రత్తగా అతన్ని పరిశీలించవలని ఉంటుంది. తత్వానికీ, మతానికీ గల సంబంధాన్ని ఇబన్ రుష్ట్ ఇలా చెప్పాడనే విషయం భిన్నాభిప్రాయాలకు దారితీసింది.
      అవరోస్ ఉన్నత హేతువాది అనీ, మత మూర్ఖ వాదాలను నిరాకరించాడనీ ఎర్నస్ట్ రేనాన్ అభిప్రాయపడ్డాడు. అసనంతో కూడిన సనాతన న్యాయచట్టవాదుల దృష్టి తప్పించుకోటానికి తన మత రచనలు అడ్డం పెట్టకున్నాడన్నారు. 20వ శతాబ్దంలో చాలామంది ఈ అభిప్రాయాన్ని నిరాకరించారు. ఇబన్ రుష్ట్ నిజమైన ముస్లిమనీ తత్వ దైవప్రేరణ వాస్తవాలుగా భావించాడన్నారు. చదువుకున్నవారికీ, జనాలకూ రెండు సత్యాలు ఉన్నాయనీ ఇబన్ రుష్ట్ ఒప్పుకోదన్నారు. అవగాహనా, అంతస్తులకు అతీతంగా  అందరికీ ఒకటే సత్యం ఉన్నదన్నాడు. కొరాన్ అర్థాన్ని తు.చ. తప్పకుండా పాటించమే సరైన మార్గమనీ కంపతొడుగులు అక్రమ పద్ధతినీ ఇబన్ రుష్ట్ భావించాడు. మత వాదులు ప్రజల్ని గందరగోళపరుస్తున్నాడన్నారు.
      ఇబన్ రుష్ట్ దృష్టిలో షరియా తత్వాన్ని అధ్యనం చేయమని చెపుతున్నట్లు, అరిస్టాటిల్ పేర్కొన్న నిదర్శనా పూర్వక పద్ధతిని వినియోగించి అవగాహన చేసుకోవాలన్నాడు. కొరాన్ లో కొన్ని విషయాలు వ్యాఖ్యానం చేయవలసి ఉన్నదనీ, పండితులే ఆపని చేయాలని అన్నాడు. కొరాన్ లో మిగిలిన భాగాలు, షరియా యధాతథంగా స్వీకరించాలే తప్ప భాష్యం చెప్పటం నమ్మకం లేకపోవటమే అన్నాడు. ఇబన్ రష్ జ్ తన అభిప్రాయాలను మార్చకున్నందున చనిపోయినవారు మళ్ళీ వస్తారా అన్న విషయంలో అతడి భావాలు జటిలంగానే ఉన్నాయి. పండితులకు ఈ విషయంలో అభిప్రాయ భేదాలున్నాయి. వ్యక్తిగతమైనదంతా నశిస్తుందనీ, కనుక అది శాశ్వతం కాదనీ ఇబన్ రుష్ట్ నమ్మినట్లుగా డిబోర్, ది హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇస్లాం, లండన్, 1933, పుటః 196) మరణంతో శరీరాలు అంతమౌతాయనీ ఇబన్ రుష్డ్ భావించినట్లు జార్జ హొరానీ అన్నారు. (ఎన్ సైక్లోపీడియా అఫ్ రెలిజియన్)
      ఇబన్ రుష్డ్ భావించినట్లు జార్జి హొరానీ అన్నారు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్)
      ఇబన్ రుష్డ్ సాంకేతిర రచనలలో ఆత్మ వ్యక్తిగతంగా శాశ్వతం పొందదని అన్నట్లు మార్ముర భావించాడు. (ఎన్ సైక్లోపీడియా అఫ్ రెలిజియన్) వ్యక్తి శాశ్వతత్వాన్నీ ఇబన్ రుష్డ్ పేర్కొన్నప్పుడు ఆత్మను గురించి అంటున్నాడా, లేక శరీరం పునరుజ్జీవనం ప్రస్తావిస్తున్నాడా అనే సందేహం కలుగుతుంది. మేథస్సు ఒక్కటే కొనసాగ గలదని ఇబన్ రుష్డ్ భావించినట్లు ఫక్రే అన్నారు. (ఎం.జె.ఫక్రే, ఎ హిస్టరీ ఆఫ్ ఇస్లామిక్ ఫిలాసఫీ, లండన్, 1983, పుట 324) ఇబన్ రుష్డ్ సిద్ధాంతాలు సనాతన పురోహిత వర్గానికి నచ్చవని హోరానీ, మార్మురా, డిబోర్ లు భావించారు. నమ్మకం లేనివాడుగా తనపై ఆరోపణలు రాకుండా ఇబన్ రుష్డ్ భిన్న ప్రజలకు విభిన్న రీతులలో వాదాలు అందించాడని మాముర చెప్పాడు.
      ఇస్లాంలో స్త్రీల స్థితిని గురించి అవరోస్ భావాలు సనాతనులకు ఆగ్రహం  కలిగించాయి. స్త్రీలను గృహ జంతువులుగా ఇళ్ళల్లో మొక్కలుగా అట్టిపెట్టి సంపదను పెంపొందించటంలో వినియోగిచకపోవటం పేదరికానికీ, దారుణ పరిస్థితికి దారితీసిందని అవరోస్ అన్నాడు. (డిబోర్, పై పుస్తకం, పుటః 198)
      13వ శతాబ్దంలో శాస్త్రజ్ఞులూ, లాటిన్ తాత్వికులపై అవరోస్ ప్రభావం ఉన్నది. పాడా యూనివర్సిటీలో అవరోస్ పీఠం ఎప్పుడు ఏర్పరచాడు.  అవరోస్ రచన ఆధారంగా ఆగమ విధానాల ప్రాపంచిక, అనుభవ పూర్వక విజ్ఞానాభివృద్ధిలో అవరోస్ ప్రభావం లేదు. ఇతని మరణానంతరం ఇస్లాం లోకంలో అతన్ని మరిచిపోయింది. ఇస్లాంలో తత్వం క్షీణించింది. అషారీవాదం ప్రాముఖ్యతలోకి వచ్చింది. ఈ విషయమై అక్బరీ ఇలా రాశాడు.
        ఇస్లాంలో అవరోస్ ఓర్పుగా, నేర్పుగా పెంపొందించిన వివేచన ఇబన్ లైమియా ధోరణితో అణిగిపోయింది. 1406లో చనిపోయిన ఇబన్ ఖల్ దూన్ వివిధ విజ్ఞానాల పట్టిక రూపొందించేనాటికి తత్వం గొరవాన్ని కోల్పోయింది. తాయత్తులూ, మంత్రాలూ, భూతవైద్యాలూ మొదలైన వాటికి పరిమితమైన చోట తత్వాన్ని కూడా చేర్చారు. అదే వరుసలో జోతిష్యాన్ని కూడా పేర్కొని అన్నింటినీ మూకుమ్మడిగా ఖండించారు. (అర్బరీ, రీజన్ అండ్ రెవలేషన్, పుటః 69)
      ఇస్లాం వునర్వికాసోద్యమంతో అవరోస్ ను హేతువాదిగా, సెక్యులర్ రాజ్యాన్ని కోరినవాడుగా చూపడం కేవలం దారితప్పించే విధానమే. అవరోస్ ను ఇలా వ్యాఖ్యానించటంలో రెనాన్ ప్రభావం ఉన్నది. అవరోస్ మత న్యాయవిధానాలపై చిన్నచూపు సారించి అతడి హేతువాదాన్ని అతిశయోక్తులతో చెప్ప ప్రయత్నం చేశారు.
గ్రీక్ విజ్ఞానం-ఇస్లాం నాగరికత
    విజ్ఞాన పరిధిలో ఇస్లాం నాగరికత గొప్పతనాన్నీ, విశ్వజనీనతనూ గమనించవచ్చు. యూరోప్ విజ్ఞానంపై ఇస్లాం నాగరకతా ప్రభావం చూడాలంటే యూరోప్ భాషలలో అరబ్బు మూలాన్ని గమనిస్తే చాలు. అందుకు ఉదాహరణగా కాఫీ, జాస్మిన్, ఆల్జీబ్రా, జీరో, ఎలిక్సర్, కేంఫర్, షర్బత్, జెనిత్, కాఫ్రాన్, అల్ కాలీ, లాల్క మొదలైనవి చూపవచ్చు. ఇస్లాం సైన్స్, ప్రాచీన గ్రీకులపై ఆధారపడింది. గ్రీక్, హిందూ పాండిత్యాన్ని కాలగర్భంలో కలిసిపోకుండా అట్టిపెట్టి అందించినవారు ముస్లింలు. గ్రీకుల విజ్ఞానంతో ఆట్టే మెరుగులు దిద్దిన తీరు ఇస్లాం శాస్త్రజ్ఞులలో కనిపించదు. కాని గణిత శాస్త్రంలోని కొన్ని విభాగాలలో ఇస్లాం సొంతంగా కృషి అందించింది. కంటి శాస్త్రం కూడా అల్ హైటమ్ (1039లో మరణించాడు), అల్ ఫారిసీ (1320లో మరణం) మూలకృషి చేశారు. యూరోప్ విజ్ఞానంలో ఇస్లాం రసాయనిక, జ్యోతిష, మాత్రిక అధ్యయనాలు కొంత తోడ్పడ్డాయి. ప్రకృతిని లోబరుచుకోవడంలో పరిశోధన, పరిశీలన అవసరమని గ్రహించారు. వైద్యం ఆల్జీబ్రా, గణితం, రేఖాగణితం, ఖగోళం, యాంత్రిక రంగాలలో కృషి జరిగింది.
      ఇస్లాం శాస్త్రీయాభివృద్ధి సొంత కృషి ఎక్కువ లేదని ఇబన్ కాల్దున్ అన్నాడు. అరబ్బులు కానివారే మత, వేధా సంబంధమైన విషయాలలో ఎక్కువ పాటుపడ్డ ముస్లింలుగా ఉన్నారని తెలుస్తున్నది. అరబ్బుల నుండి వచ్చామని చెప్పుకునేవారు కూడా విదేశాలలో వేరే పండితుల ఆధ్వర్యాన కృషిచేసి పెంపొందారు. ఇస్లాం విజ్ఞానంలో అంతర్జాతీయత, వివిధ మతాల కృషి జరగటానికి క్రైస్తవులూ, పర్ష్యన్లూ, యూదులూ కారణమని మార్టిన్ ప్రైస్ నర్ అన్నారు.
      ఇస్లాం సైన్స్ కేవలం ముస్లిం చేతుల్లోనే లేదు. అరబ్బీకరణ జరిగిన తరువాత కూడా పరిస్థితి ఇదే. క్రైస్తవులూ, యూదులూ చాలా కృషి జరిపి తోడ్పడ్డారు. 19వ శతాబ్దం వరకూ ఇబన్ గాబ్రియేల్ (ఆబిసిబ్రాన్) కృషిని ముస్లిం కృషిగా భావించారు. ఎస్.మంక్ వచ్చి అతడు యూదు అని వెల్లడించాడు. అలాగే ఐజక్ ఇస్లామెలీ, మైమోనిడనం వైద్యరంగంలో చేసిన కృషి ఇస్లాం రచయితలకు పోలినదే. క్రైస్తవ బిషప్ బాహ్యబ్రాస్ శాస్త్రీయ రచన కూడా పేర్కొనదగినదే. ఇస్లాం రచయితల గ్రంథాలు ఆట్టే మార్పులు లేకుండా హిబ్రూ, లాటిన్ భాషలలోకి అనువదించారంటే ఇస్లాం సైన్స్ లోని అంతర్జాతీయ లభణం కనుగొనవచ్చు. (మార్టిన్ ప్రెస్ నర్, ది నేచురల్ సైన్సెస్ అండ్ మెడిసిన్ ఇన్ ది లెగసీ ఆఫ్ ఇస్లాం, పుటః 423)
      ఇస్లాం సైన్స్ విషయమై పేర్కొన్న రెండు విషయాలు గమనార్హం.
      ఇస్లామీకరణలో చేరని సాంస్కృతిక రంగం సైన్స్ మాత్రమే సనాతన వాదుల వ్యతిరేకత ఇస్లాంలో ప్రత్యేకాంశంగా కొనసాగింది. దైవప్రేరణపై ఆధారపడని జ్ఞానం సంప్రదాయం అవిత్రాలని భావించారు. (పై గ్రంథం, పుటః 427-28)
      ఇస్లాం సైన్స్ ను ప్రోత్సహించినట్లు ఒక భ్రమ ఉన్నది. ఖురాన్,  హడిత్ లను ఇందుకు ఆధారంగా చూపిస్తారు.
      జ్ఞానం ఉన్నవారూ, లేనివారూ సమానం కాదా ఖురాన్ 39.12
      అవసరమైతే చైనాలోనైనా జ్ఞానాన్ని అన్వేషించు
    ప్రతి ముస్లిం విధిగా జ్ఞానాన్వేషణ చేయాలి  ఇదంతా అర్థంలేనిది. ఇక్కడ జ్ఞానం అంటే మతజ్ఞానం, విజ్ఞానంలో సనాతనులు ఎప్పడూ సందేహిస్తూనే వచ్చారు. పంథాలు లేని మేథాపూరిత అన్వేషణ, నమ్మకానికి ప్రమాదమని భావించారు. ఇస్లాం సైన్స్ కూ, ముస్లింలు తేడా చూపారు. ఇస్లాం సైన్స్ అంటే ఖురాన్, హడిత్, న్యాయశాస్త్రం, మత శాస్త్రం, వ్యాకరణం, నిఘంటువు, సాహిత్యం వంటివి. విదేశీ విజ్ఞానం అంటే ఇస్లాంకు వ్యతిరేకంగా, ప్రజలందరూ అనుసరించే పని భావించారు. వీటిలో భౌతిక, అధిభౌతిక విషయాలు, గణితం, తత్వం, జంతు, వృక్షశాస్త్రం, వైద్యం, ఖగోళం, సంగీతం, మేజిక్, రసాయనికం చేర్చారు.
      గ్రున్ బామ్ దృష్టిలో విదేశీ శాస్త్రాలన్నింటినీ ముస్లింలు అనుమానంతో వ్యతిరేకతో చూస్తున్నారు. ప్రాచీన మూలాధారాలు, ముస్లిమేతరులు కావటం ఒక కారణం. ఈ విదేశీ శాస్త్రాలన్నీ విశ్వాసానికి ప్రమాదరకమైవని భావించారు. (జి.ఇ.వాన్ గ్రున్ బామ్, చికాగో, 1970, పుటః 15 ఇస్లాం)
      విజ్ఞానాలను శ్లాఘనీయమైనవీ, నిందాపూరితమైనవి, తటస్థమైనవవి వర్గీకరించారు. దైవం వైపుకు తీసుకపోనివన్నీ నిందాపూరితాలన్నాడు. నిరుపయోగ జ్ఞానం నుండి కాపాడమని ప్రవక్త ప్రార్థించినట్లు చెప్పారు.
      మతాన్ని అనుసరించటమే ఉపయోగరకమైన జ్ఞానంగా  పేర్కొన్నాడు. మతానికీ, తాత్విక శాస్త్రీయ పంథాకు జరిగిన పోరాటంలో ప్రాచీన శాస్త్రాలకు ప్రాధాన్యత పోయింది. కనుక ముస్లిం పండితులు శాస్త్రజ్ఞులు చేసిన కృషి ఇస్లాం నాగరితలో పాదులు నెలకొనకుండా పోయినవి. దేవుడిని సేవించటమే ప్రధానమని ఇస్లా భావించినందున అమేరకే విజ్ఞానం, చరిత్ర, భౌగోళం పై పడింది. అంతకు మించి ప్రకృతి శాస్త్రాలు కృషి చేస్తే పనికిరావని నిరాకరించారు.
      ఇస్లాం అడ్డువచ్చినా కొంతమేరకు ఇస్లాం విజ్ఞానం పెంపొందిందని గ్రున్  బామ్ రెనాన్ రాశారు. ఇస్లాం గణితం, వైద్యం అభినందనీయంగా పెంపొందినట్లు సనాతనుల ధోరణులకు భిన్నంగా ఇది సాగినట్లు రాశారు. (వాన్ గ్రుమ్ బామ్, ఇస్లాం, పుటః 114)
రెనాన్ ఇసా
    ముస్లిం రాజ్యాలలో మధ్యకాలంలో విజ్ఞానం, తత్వం విలసిల్లాయి. ఇస్లాం అడ్డొచ్చినా ఈ కృషి జరిగింది. అప్పుడు ముస్లిం తాత్వికులూ, పండితులూ హింసకు గురయ్యారు. స్వేచ్ఛాన్వేషణ కంటె శిక్షలకు పాత్రులు కావటమే ఆచారంగా ఉన్నా, హేతుబద్ధ సంప్రదాయం ఆనాడు బ్రతికి బట్టకట్టింది. తరువాత సహనం, ఛాందసం పై చేయి అయ్యాయి. క్రైస్తవ మతం కూడా మధ్య కాలాలలో సైన్స్ కు అడ్డుపడింది. అయితే ముస్లిం మతం వలె వారి గొంతు నులిమి వేయలేదు. అవరోస్, తదితర ఆలోచనాపరులు జీవితంలో చాలా కాలం జైళ్ళలో రహస్య స్థావరాలలో గడిపారు. వారి పుస్తకాలు తగులబెట్టారు. వారి రచనలను మతం అణచివేసింది. శాస్త్రీయాభివృద్ధిని మతం ఆపలేకపోయింది. (రెనాన్ Islamisme et na Scienve Sorbonne లో ఉపన్యాసం, 1883 మార్చి 29 Basel, Bernheim)
    సనాతనులు శాస్త్రీయ పరిశోధనలను అణచివేశారు. ఈ పరిశోధన సమాజానికి ఉపయోగం కాదన్నారు. దీనివలన ఇస్లాం నాగరికత కుంటుబడినట్లు బయటవారు భావిస్తున్నా ముస్లింల దృష్టిలో అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా ఉన్నారు. ముస్లింల జంతు శాస్త్రాన్ని గురించి కార్బన్ ఇలా రాశాడు. ముస్లింలకు శాస్త్రీయ దృక్చథంలో ఆసక్తి లేదు. పరిణామం సహజ శాస్త్రీయాభివృద్ధి పట్టించుకోకుండా సృష్టి విషయాలపై దృష్టిపెట్టారు.  (శాస్త్రజ్ఞులను చిత్రహింసలు పెట్టిన తీరు రెనాన్ పేర్కొన్నాడు. ఇబన్ అల్ హైటమ్ (అలాజన్)ను ద్రోహిగా భావించి చూచిన తీరును ఉదాహరణగా పేర్కొనవచ్చు.
      యూదు తాత్వికుడు, మైమోనిడస్ శిష్యుడు ఒకతను తాను వ్యాపార నిమిత్తం బాగ్దాద్ వెళ్ళినప్పుడు ఒక తాత్వికుడి గ్రంథాలయాన్ని తగులబెట్టారని రాశాడు. ఒక బోధకుడు ఇబన్ హైటమ్ ఖగోళ శాస్త్రాన్ని స్వయంగా తగులబెట్టాడు. భూమి గోశాకారంగా ఉన్నదని రాశాడనీ, అది నాస్తికత్వమనీ పేర్కొన్నాడు. (డిబోర్, ది హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఇస్లాం, పుటః 153)
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య

         

No comments:

Post a Comment