మతం ప్రాచీనులు అల్లిన కట్టుకథ-part 13-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
13వ అధ్యాయం  
అల్ మారి
ల్ మారీని ప్రాచ్యలోకపు లూక్రిటస్ అంటారు. అతని పూర్తిపేరు అబులాలా అహమ్మద్ అబ్దుల్లా అల్ మారి (973-1057) ఇస్లాం జిందకీలలో ఇతడు మూడవవాడు. (ఈ అధ్యాయం అంతా నికల్ సన్ రచనలపై ఆధారపడి  రాసినదే) ముస్లింలెవరూ మారి కవిత్వాన్ని హాయిగా ఆహ్వానించలేదు. అతడిది సందేహవాదం కావడం, ఇస్లాంపట్ల ఈ ధోరణి ముస్లింలకు నచ్చలేదు.
      అలెస్పోవద్ద సిరియాలో పుట్టిన అల్ మారి చిన్నతనంలోనే మసూచి వలన దృష్టిని పోగొట్టుకున్నాడు. తన పుట్టినచోటు, మరాకు రాకముందు అలెప్నో, యాంటియోక్ మొదలైన సిరియా నగరాలలో చదివాడు. కవిగా పేరు తెచ్చుకొంటున్న తొలిదశలో బాగ్దాద్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1008లో వెళ్శి 18 మాసాలపాటు బాగ్దాద్ లో ఉన్నాడు.  అతడి ఖ్యాతివలన శిష్యులు మారాకు వచ్చి కవిత్వం, వ్యాకరణంపై అతడి ఉపన్యాసాలు వినేవారు. నిరాశావాదం అతడి కవిత అంతా అలముకొని ఉండేది. సంతానం పాపం అనీ, మరణం అభిలషణీయమనీ అంటుండేవాడు. పునరుజ్జీవనం తృణీకరించాడు.
      తన సమాధిపై రాయవలసిన గేయాన్ని తానే ఎంపిక చేసుకున్నాడు. పుట్టకపోతే బాగుండేదని కవితలో రాశాడు. మతపరంగ తండ్రుల మతాన్ని అలవాటు ప్రకారం అందరూ ప్రశ్నించకుండా ఆమోదిస్తారని అందులో మంచిచెడ్డల విచక్షణ కోల్పోతున్నారనీ అన్నాడు.
      మతం ప్రాచీనులు అల్లిన కట్టుకథ అనీ జనాన్ని దోపిడీ చేయటానికి తప్ప మరెందుకూ అది పనికిరాదని అల్ మారి రాశాడు.
      మతాన్ని విషపూరిత కలుపుమొక్క అన్నాడు.
      ఇతర మతాలస్థాయిలోనే ఇస్లాంను చూచిన అల్ మారీ ఆ మతంలో ఏ ఒక్కమాటనూ నమ్మలేదు.
      భారతీయ సంప్రదాయమైన శనదహనాన్ని అతడు కాంక్షించాడు. మరణం నిద్రపోవటం వంటిదని అన్నాడు. పాతిపెట్టటం కంటె దహనం మంచిదని లుజీనియత్ అనే కవితా సంకలనంలో రాశాడు. తీర్పునాడు ముంకర్. నాకిర్ అనే దేవతలు సమాధులు తెరచి క్రూరంగా అందరినీ పరీక్షిస్తారని ముస్లింల నమ్మకం. లోపం ఉన్నవారిని నరకానికి పంపించే నిమిత్తం మళ్ళీ సమాధుల్లోకి తోసివేస్తారు. అందుకే అల్ మారి దహనమే మంచిదనుకొన్నాడు. ముస్లింల దృష్టిలో దహనం చాలా ఘోరమైన భావన. అల్ మారి కవితల ఆధారంగా మార్గోలియత్ కొన్ని భావాలను సంకలనం చేశాడు. (డి.ఎస్. మార్గోలియత్, మహమ్మదీయ నాస్తికవాదం, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ అండ్ ఎథిక్స్)
      ప్రవక్తల ప్రకటనలు నిజమని భావించవద్దు. అవన్నీ అల్లికలే. అలాంటివారు వచ్చి జీవితాన్ని క్షోభపెట్టేవరకూ మానవులు హాయిగా బ్రతికారు. పవిత్ర గ్రంథాలన్నీ కథల సంపుటాలే. దేవుడు జీవితాన్ని తీసేసుకుని మళ్ళీ ప్రతి మనిషి నిర్ధారించటానికి ఇరువురు, దేవతల్ని పంపటం  ఎంతో అసంబద్ధమైన విషయం. రెండవసారి బ్రతికిరావడం అనే భావనకంటె అత్మభావనతో సరిపెట్టుకుంటే పోయేది.
      అబద్ధాలాడే పురోహిత వర్గానికీ, ప్రవక్తలకూ తేడాలేదని అల్ మారీ అన్నాడు.
      సత్యానికి ఇస్లాం ఒక్కటే గుత్తాధిపత్యం వహించటం లేదన్నాడు. ఉలేమాలపట్ల జుగుప్సతప్ప అల్ మారి మరేదృష్టి ఉంచలేకపోయాడు.
      అల్ మారి హేతువాది సంప్రదాయం, ఆచారం, పెత్తనాలకు భిన్నంగా వివేచనతో కూడిన హక్కులు కావాలన్నాడు.
      గుడ్డిగా నమ్మకం కంటె కొంతైనా సందేహించటం మంచిదన్నాడు.
      యాత్రను పాపాత్ముల ప్రయాణం వర్ణించిన అల్ మారి ఇస్లాం పిడివాదాలను విమర్శించాడు. ఇస్లాంతో సహా అన్ని మతాలూ మానవ సంస్థలే అన్నాడు. ఆ దృష్ట్యా అవన్నీ కుళ్ళిపోయాయన్నాడు. ఈ సంస్థల స్థాపకులు సంపదనూ పెత్తనాన్నీ కూడగట్టుకోవాలనుకున్నారు. ప్రాపంచిక సుఖాలనుభవించాలనుకున్నాడు. దైవ ప్రేరణకు అంటగట్టి కొన్ని తప్పుడు గ్రంథాలను వెనకేసుకు వచ్చారు. వీటిని పాటించేవారు గుడ్డిగా నమ్ముతున్నారు.
      మక్కాలోని కాబాను, ఇస్మాయిల్ సమాధిపై ఉన్న రాతిని అల్ మారి ప్రస్తావించి విమర్శించాడు.
      నల్లరాతిని ముద్దు పెట్టుకోవటం మూఢాచారంగా యాత్రలో క్రతువుగా విమర్శించాడు.
      మతాలన్నీ ఛాందసులతో, కలహాలతో, రక్తపాతంతో, కత్తిని చూసి జనాన్ని భయపెట్టటంతో కొనసాగాయన్నాడు. అన్ని మతాలూ వివేచనకూ, తెలివిగా ప్రవర్తించటానికి వ్యతిరేకం అన్నాడు.
      జ్యోతిషం, శకునాలు, తుమ్మినప్పుడు దేవుని స్తుతించమనటం, దివ్య పురుషులు నీటిపై నడిచారనటం, వందలాది సంవత్సరాలు బ్రతికారనటం, అద్భుతాలు సాధించారనటం వారి ఖండనకు గురి అయ్యాయి.
      ఖురాన్ పై ఒక వ్యంగ్య కవిత కూడా అల్లి ముస్లింలను నొప్పించాడు. నాలుగు శతాబ్దాలలో కూడా దానికి మెరుగులు దిద్దలేకపోయారన్నాడు. సనాతనులు అతని రచనలో దోషాలు చూచారు. నికల్ సన్ 20వ శతాబ్దం ప్రారంభంలో దీనిని ఇంగ్లీషులోకి అనువదించాడు. (Apistle of Forgiveness)
      అల్ మారి జీవులెవరికి హాని తలపెట్టరాదన్నాడు. ఆహారం కోసం, ఆటకోసం జంతువులను చంపరాదన్నాడు. 30 వ ఏట శాఖాహారాన్ని అవలంబించాడు. ఇండియాలో జైనుల ప్రభావం అల్ మారిపై ఉన్నదని వామ్ క్రెమర్ రాశాడు. మాంసం, చేపలూ, పాలూ, గుడ్డు, తేనె వదిలేయమనీ, అవన్నీ జంతువుల బాధను వెల్లడిస్తాయనీ, అనవసరంగా వాటికి హాని చేయటం మంచిది కాదనీ అన్నాడు. జంతు చర్మాలు దుస్తులుగా వాడొద్దన్నాడు. కొలువుల్లో స్త్రీలు ఫరో కోట్లను వాడద్దన్నాడు. కర్ర చెప్పులు వాడమన్నాడు. శతాబ్దాలముందున్నాడని అల్ మారీని గురించి వాన్ క్రెమర్ నికల్ సన్ పేర్కొన్నాడు. అల్ మారి సందేహవాది. ఇస్లాంలో ప్రతి మూఢ వాదాన్నీ అతడు వెక్కిరించేవాడు. అల్ మారి వర్థిల్లుగాక.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment