ఇస్లాంలో స్త్రీ అతీ గతి --నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ? part 14-


ఇబన్ వారక్
14వ అధ్యాయం
స్త్రీలు-ఇస్లాం
స్లాంలో స్త్రీల చట్టబద్ధమైన స్థాయి చాలా ఉన్నతంగా ఉన్నదని రిచర్డ్ బర్టన్ రాశాడు. పాశ్చాత్యుల విమర్శకు సమాధానంగా ఇస్లాంను సమర్థిస్తూ అలా వాదించాడు.  (ది బుక్ ఆఫ్ ది థౌజండ్ నైట్స్ అండ్ ఎ నైట్, 10వ సంపుటి, పుట 195) క్రైస్తవుల స్త్రీలతో పోల్చితే ముస్లింల భార్యలకు చాలా అవకాశాలున్నాయన్నాడు. లైంగిక విషయాలలో ఇస్లాం ప్రత్యక్ష విధానాన్ని అనుసరిస్తుందన్నాడు.  స్త్రీని సంతృప్తి పరచటంలో గల కళనూ, మార్మికతనూ ముస్లింలు అధ్యయనం చేశారన్నాడు. కొన్ని గ్రంథాలలో గల శృంగార సాహిత్యాన్ని అందుకు ఆధారంగా చూపారు. (బుక్ ఆఫ్ కార్నల్ కాప్యులేషన్, ది ఇన్సియేషన్ ఇన్ టు ది మోడ్స్ ఆఫ్ కోయిషన్ అండ్ ఇట్స్ ఇన్ స్ట్రుమెన్టేషన్) ఈ రచనలు పురుషుల కోసం పురుషులు చేసిన పని.  బర్టన్ కు తెలిసి ఉండాలి. ఆ విషయ ప్రాధాన్యత ఎందుకోగాని అతని దృష్టినుండి తప్పించుకున్నది. స్త్రీలను పురుషుల తృప్తికోసం దేవుడు సృష్టించాడని అర్థం వచ్చే పుస్తకాలున్నాయి. బర్టన్ వాటిని ఉదహరించాడు. (ది బుక్ ఆఫ్ ఎక్స్పోజిషన్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ కోయిషన్)
      16వ శతాబ్దంలో షేక్ నెఫ్సావీ రాసిన సుప్రసిద్ధ గ్రంథం ది పర్ ఫ్యూమ్ గార్డెన్ స్త్రీల పట్ల వారి కామం పట్ల ఇస్లాం ధోరణి వెల్లడిస్తున్నది. దీనిని  బర్టన్ అనువదించారు. (ది గ్లోరీ ఆఫ్ ది పర్ ఫ్యూమ్ గార్డెన్, లండన్, 1978, పుటః 203-204) స్త్రీల కామ దృష్టిని కాదనకుండా అదొక ప్రమాదకర ధోరణిగా పరిగణించారు. స్త్రీల మతం వారి మర్మావయంలో ఉన్నది తెలుసా అని షేక్ అడుగుతాడు. వారి మర్మావయవాల కామతృప్తి  సమకూర్చేవారు నీగ్రో అయినా, బఫూన్ అయినా, జుగుప్సాకరమైన వ్యక్తి అయినా ఫరవాలేదనుకుంటారు. భగం నుండి స్రవించే విధానాన్ని సైతాను ఏర్పరచాడు. అబూనువాన్ గేయాన్ని అంగీకారాభిప్రాయంతో షేక్ ఉదహరిస్తాడు. స్త్రీలు నరకానికి ముఖ ద్వారాలనీ, విపరీత కామ వాంఛగలవారనీ, కృతజ్ఞత లేని వారనీ, మోసపూరితులనీ ముస్లిం పురుషులు భావిస్తున్నట్లు రాశారు. బర్టన్ తన అనువాద గ్రంథానికి పీఠిక రాస్తూ ముస్లిం స్త్రీల పట్ల జుగుప్సను వెల్లడించిన విషయాన్ని బయటపెట్టారు.
      క్రైస్తవులతో పోల్చితే ఇస్లాం లైంగిక విధానం పట్ల ప్రత్యేక విధానాన్ని అవలంబించినట్లు బులాఫ్, బాస్క్వే, బోధిబా పరిగణించారు. కామం పేరిట క్రైస్తవులు మలిన దృష్టి అవలంబించారని నీషే అన్నాడు. ఇస్లాంలో స్త్రీలకు హీనస్థితిని కల్పించారని బులాఫ్ రాశాడు. ఇస్లాంలో స్త్రీలను చిన్న చూపు చూసాడనటం అతిశయోక్తితో కూడిన నిర్ణయంగా లేన్ పూల్ అభిప్రాయపడ్డాడు.
      క్రైస్తవాన్ని, ఇస్లాంనూ పోల్చిన బాస్క్వే, లైంగిక విషయంపట్ల క్రైస్తవులలో ఉన్న వ్యతిరేకత ఇస్లాంలో లేదనీ శారీరక సుఖాలకు అరమరికలు లేకుండా అనుకూలత చూపారనీ రాశాడు. ఐతే, ఇస్లాం చట్టంలో లైంగిక రీత్యా స్త్రీలకు హీన స్థితి కల్పించారనీ అతడు ఒప్పుకోక తప్పలేదు. (జి.హెచ్.బాస్క్వే L,ethique sexuelle de l’ Islam, పారిస్, 1966, పేజి 49)
      లైంగిక విషయాలలో ఇస్లాం ఆధిక్యతను ఆనందించిన బోధిబా ఇస్లాంలో రతి పరాకాష్ట ఊహాపోహలను పేర్కొన్నాడు.
      ఇస్లాం  సెక్స్ పట్ల ప్రత్యేక ధోరణి చూపిందనటం ముస్లిం స్త్రీలను అవమానపరచటమే. పురుషుల దృష్టిలోనే లైంగిక విషయాన్ని పరిశీలించారు. స్త్రీలకు కామదృష్టి లేదన్నారు. పెర్ ఫ్యూమ్డ్ గార్డన్ రచన ప్రకారం స్త్రీల లైంగిక దృష్టి అపవిత్రం, సైతాన్ పని, భయపడదగిందీ, అణచివేయదగిందీ అన్నారు. స్లిమేన్ జగిదోర్ దృష్టిలో ఇస్లాం సిద్ధాంతమంతా లైంగిక దృష్టి మౌలికంగానే ఉన్నది. మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఉన్న తీరువంటిదే ఇది. పరిశుభ్రతపట్ల దృష్టిపెట్టి ఇస్లాం లైంగిక చర్యకూ, లైంగికావయవాలకూ అసహ్యత చూపుతూ స్త్రీలపట్ల జుగుప్సను వ్యక్తం చేశారు.
      ముస్లిం చట్టంలో స్త్రీల స్థితి ఏమాత్రం తృప్తికరంగా లేకపోయినా అరేబియాలోని స్త్రీల స్థితిని మహమ్మద్ చాలా మెరుగుపరిచాడనీ డిక్షనరీ ఆఫ్ ఇస్లాం పేర్కొన్నది. (స్త్రీలపై వ్యాసం) ఈ విషయాన్ని బాస్క్వే కూడా అంగీకరించాడు. స్త్రీలపట్ల మహమ్మద్ చూపిన సంస్కరణలు అతడిని ఆనాడు స్త్రీ ఉద్ధారకుడుగా భావించటానికి దోహదం చేసింది. ఆడపిల్లల్ని సజీవంగా పూడ్చిపెట్టరాదని, స్త్రీలకు ఆస్తి సంక్రమణ హక్కులుండాలనీ ఆనాటి సంస్కరణలు తెలుపుతున్నాయి. (వివాహిత స్త్రీ ఆస్తి చట్టం 1882కు గానీ ఇంగ్లండులో రాలేదని బర్టన్ రాశాడు.
      బహుశ అవాంఛిత ఆడపిల్లల్ని పూడ్చి పెట్టటం మతపరంగా వచ్చినా చాలా అరుదుగా జరిగినట్లు అహమ్మద్ అల్ అలీ రాశాడు. (Organisations Sociales Chez les bedouins)
      ఇస్లాం ఆధిక్యతను చూపటానికీ ముస్లిం రచయితలు ఈ ఆచారాన్ని అతిశయోక్తిగా చెప్పారు. ఆస్తి సంక్రమణ విషయంలో పురుషుడి భాగంలో సగం స్త్రీకి ఉన్నా అది అమ్ముకోటానికి పూర్తి అధికారాలు ఆమెకు లేవు. ఈ విషయాలలో మహమ్మద్ ఆట్టే దూరం పోలేదు. స్త్రీలు ఆకర్షణీయమైన ఆటవస్తువులని పురుషుల్ని దారి తప్పించగలరనీ ఆనాడు అందరూ భావించినట్లే మహమ్మద్ కూడా ఆభిప్రాయపడ్డాడు.
      షాట్ అంచనా ప్రకారం ఇస్లాంలో స్త్రీల స్థితి దారుణమైనదే. ఖురాన్ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహించింది. ఇస్లాం వివాహచట్టంలో ఇదొక ప్రధాన లక్షణంగా ఉన్నది. ఇస్లాంకు ముందున్న అరేబియాలో స్త్రీలతో పోల్చితే తరువాత వివాహిత స్త్రీల స్థితి దిగజారింది. ఇస్లాం ప్రకారం గౌరప్రదమైన లైంగిక సంబంధాలు చట్టబద్దం కాకుండా పోయాయి. (షాట్. ది ఆరిజన్ ఆఫ్ మహమ్మదన్ జూరిస్ ఫ్రూడెన్స్, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి, హిస్టరీ ఆఫ్ ఇస్లాం, పేజి 545)
      భర్తలతోపాటు పనిచేసే స్త్రీలకు వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్రాలు బెడోయిన్ స్త్రీలకు ఉండేవి. వారు ముసుగు కప్పుకునే వారు కాదు. పశువుల కాపలా చేసేవారు. సమాజంలో వారికి గౌరవం ఉండేది. వేర్పాటు లేదు. భర్తలు అవమానిస్తే పొరుగు తెగలోకి వెళ్ళిపోయేవారు. 19వ శతాబ్దంలో కూడా బోడేయిన్ల స్త్రీలు సాహసోపేతమైన సైనికాధిపతులుగా ఉన్నారు. (స్త్రీలపై వ్యాసం, డిక్షనరీ ఆఫ్ ఇస్లాం)
      ఇస్లాం రాకముందు ఉన్నత వంశ స్త్రీల స్వాతంత్రాన్ని గురించి 10వ శతాబ్దపు అరబ్బు చరిత్రకారుడు అల్ తబారీ విపులంగా రాశాడు. అబూ సూఫియాన్ భార్య హింద్ బిస్త్ ఓత్సా మక్కాలో ఉన్నత వంశ కుటుంబాధిపతిగా ఉండేది. మహమ్మద్ తో సహితం సంప్రదింపులలో స్త్రీలు పాల్గొనేవారు. కొత్త మతానికి వ్యతిరేకత చూపారు. మహమ్మద్ క్రీ.త. 630లో 10వేల సైన్యంతో మక్కా వచ్చినప్పుడు అబూ సూఫియాన్ లొంగిపోవడానికి ప్రతినిధి వర్గాన్ని పంపాడు. చాలా అయిష్టంగా హింద్ ఆధ్వర్యాన స్త్రీలు లొంగిపోయారు. పురుషులపై లేని ఆంక్షలు స్త్రీలపై విధించినందుకు మహమ్మద్ ను నిరసిస్తూ హింద్ మాట్లాడింది. వారి పిల్లలను చంపబోమని మహమ్మద్ చెప్పినప్పుడు, హింద్ దెప్పిపొడుస్తూ బదర్ యుద్ధంలో 70 మందిని చంపి, ఎంతో మంది బందీలను ఉరితీసిన మహ్మమ్మద్ నుండి అలాంటి హామీ రావటం బాగున్నదన్నది.
      ముస్లిం మేధావులలో ఆధునిక స్త్రీ పురుష సంస్కారవాదులూ స్త్రీల వెనుకబడిన  స్థితిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఇస్లాం తొలిరోజులలో స్వర్ణయుగం ఉన్నదనుకుంటారు. స్త్రీలు సమానహక్కులు అనుభవించారని చెపుతుంటారు. ఈజిప్టు స్త్రీలు హక్కులకై పోరాడిన నవల్ సాదవీ ఈ విషయమై రాస్తూ ఇస్లాం తత్వం, సంస్కృతిలో అరబ్బు స్త్రీల అణచివేతను పేర్కొని మహమ్మద్ కాలంలో ఇస్లాం ధోరణిలో స్త్రీలు మెరుగుగా ఉన్నారని రాసింది.  (Ghassan Asche, Dustautet inferiur de femme en Islam, పారిస్, 1989, పుటః 13లో ఉదహరించాడు)
      అలాగే అల్జీరియాకు చెందిన రాబిద్ మోమియనీ రాస్తూ అల్లా మతాన్ని తప్పు పట్టరాదనీ, దానిని వ్యాఖ్యానించటంలో మహమ్మద్ సందేశాన్ని అపఖ్యాతి పాలుచేస్తున్నారనీ, అన్నారు. (De labarbarie en general et de linte grisme en particulier, పారిస్, 1992, పుటః 156) స్త్రీలను దిగజార్చటానికి ఇస్లాంను నిందించరాదనేది సారాంశం. ఇస్లాం సారాంశం అనటమే ఒక మిధ్యావాదాన్ని ప్రచారంలో పెట్టటం వంటిది. ముస్లిం ఆలోచనాపరులు ఇస్లాంకు సంబంధించిన లైంగిక విషయాలను స్త్రీలపట్ల ద్వేషాన్నీ చూపినప్పుడు కలవరపడి చింతిస్తుంటారు. వాస్తవాన్ని వ్యతిరేకతను తగ్గించి చూపుతూ ఇస్లాంను మినహాయించే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు తప్పుడు ముస్లింలు దురుద్దేశంతో దుస్సంప్రదాయాలను కొనసాగిస్తుంటారు.
      సనాతనులతో, ఛాందసులతో, ముల్లాలతో గ్రంథ భాష్యంపై తలపడటం అంటే వారికి లొంగిపోవడమే. మనం చూసే ప్రతి గ్రంథానికీ, ఖండన మండనలు చూపుతూ డజన్ల కొద్దీ గ్రంథాలు వారు ప్రదర్శిస్తారు. సంస్కరణ వాదులు ఎన్ని తలక్రిందులు చేసి చూసినా, ఇస్లాం స్త్రీ వ్యతిరేకమనే విషయం తప్పించుకోలేరు. ముస్లిం స్త్రీల నణచటానికి మూలకారణం ఇస్లామే. వారి స్థితి పరిణమించకుండా అడ్డుపడేది కూడా ఇస్లామే. (Ascha, P.11) అన్ని విధాల ఇస్లాంలో స్త్రీలు తక్కువవారే. శారీరకంగా, నైతికంగా మేధస్సులో తక్కువవారుగా పరిగణించారు. కొరాన్ ఈ పరోక్షధోరణిని దైవికంగా అనుమతిస్తున్నది. హడిత్ లు దీనిని బలపరుస్తున్నవి. మతవాదుల భాష్యాలు ఇందుకు మద్దతునిస్తున్నవి. వారే ముస్లిం మొండివాదనలకూ, ఆజ్ఞానానికీ వారసులు.
      మేధావులు ఈ మతపరమైన వాదనలను వదిలేసి పవిత్ర గ్రంథాలను నిరాకరించి, హేతువును అనుసరించాలి. మానవహక్కులను పాటించాలి. విశ్వవ్యాప్తంగా ఆమోదించిన మానవహక్కులలో మతపరమైన వాదన లేదు. (1948, డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం పారిస్ లో దీనిని ఆమోదించగా, చాలా ముస్లిం దేశాలు అంగీకరించాయి.) ఈ హక్కులు సహజమైనవి. వయోజనులందరూ పాటించగలరు. మానవులు గనుకనే ఈ మానవ హక్కులు లభించాయి. మానవ వివేచన, మానవహక్కులను, స్త్రీల హక్కులనూ తీర్చిదిద్దగలవు.
      దురదృష్టవశాత్తు ముస్లిం దేశాలూ, మతవాదుల సంకుచిత పాక్షిక దృష్టికి వదిలేసి ఊరుకున్నాయి. అలేమాలు ముస్లిం చట్ట పండితులుగా ఫత్వాలు జారీ చేస్తూ ప్రజల వ్యక్తిగత, బహిరంగ విషయాలను క్రమబద్ధం చేస్తూ ముస్లిం సమాజాన్ని అదుపులో పెడుతున్నారు. అనేక చర్యలలో వారి ఆంక్షలూ, ఆమోదాలూ చెలామణి అవుతున్నాయి. ముల్లాల పెత్తనం ఎందుకు కొనసాగాలి ?
      ముస్లింలందరికీ ఖురాన్ వర్తిస్తుంది. కేవలం మౌలిక వాదులకు మాత్రమే కాదు. అది సృష్టి రహిత దైవవాక్యం. అన్ని కాలాలకూ, ప్రదేశాలకూ వర్తిస్తుంది. అందలి భావాలు కేవలం సత్యాలు. విమర్శకు అతీతాలు. వాటిని ప్రశ్నించటం దైవాన్ని ప్రశ్నించటమే. కనుక పాపం, ముస్లింలు వాటిని నమ్మి దైవ ఆజ్ఞలను సిరసావహించారు.
మత సమస్యగా ఉలేమా ప్రభావం
      ఉలేమా ప్రభావం సాగటానికి అనేక కారణాలున్నాయి. ఆలోచనా రహితంగా పూర్తి విధేయతను కోరే మతం స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిశితంగా ఆలోచించేవారిని సృష్టించలేదు. అటువంటి వాతావరణంలోనే శక్తివంతమైన పురోహితవర్గం జనిస్తుంది. వారే శతాబ్దాలుగా, సాంస్కృతిక, ఆర్థిక మేధస్సు రంగాలను స్తంభింపచేస్తున్నారు. ముస్లిం దేశాలలో నిరక్షరాస్యత ఎక్కువ. చారిత్రకంగా రాజ్యానికీ, మతానికీ తేడా లేనందున ఒకదాన్ని విమర్శిస్తే, రెండవదాన్ని కూడా విమర్శించినట్లేనని భావించారు. ముస్లిం దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్రం పొందిన తరువాత ఇస్లాంను జాతీయవాదులతో ముడిపెట్టారు. ఇస్లాంను విమర్శిస్తే కొత్తగా స్వాతంత్రం పొందిన దేశానికి ద్రోహం చేసినట్లే అన్నారు. వలసవాదం సామ్రాజ్య వాదాన్ని ప్రోత్సహించినట్లే అన్నారు.  ఏ ముస్లిం దేశంలోనూ, ప్రజాస్వామ్యం నిలకడగా పెంపొందలేదు. ముస్లింలు అన్ని విధాల అణచివేతకు గురయ్యారు. సరైన విమర్శ సాధ్యం కాలేదు. స్వేచ్ఛా నిశిత విమర్శ కలిసే పయనిస్తాయి. వీటన్నిటి కారణంగా ఇస్లాం, స్త్రీల స్థితిని చర్చించలేదు. విమర్శించలేదు. శాస్త్రీయ పరిశీలనకు గురిచేయలేదు. ఇస్లాంలో పరికల్పనలన్నీ నిరుత్సాహ పరిచాయి. ప్రతి సమస్యనూ, సాంఘిక, ఆర్థిక సమస్యగాకాక మత సమస్యగా చూచారు.
ఆదాం, ఈవ్
    పాత నిబంధన నుండి ఆదాం-ఈవ్ గాథను ఇస్లాం స్వీకరించి తనకనుకూలంగా మార్చుకున్నది. మానవుల సృష్టి ఒకే వ్యక్తి ద్వారా జరిగిన తీరును  సురల్లో ప్రస్తావించారు.
      4.1 మానవులారా దేవునిపట్ల మీ విధి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకే వ్యక్తి నుండి మిమ్మల్ని సృష్టించాడు. అందులో నుండే సహజీవిని, తరువాత జంటలను సృష్టించగా వారంతా స్త్రీ పురుషులుగా పెంపొందారు.
      39.6 ఒకే వ్యక్తి నుండి దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. అందులో నుండే  తోటి ఆమెను సృష్టించాడు.
      7.189 దేవుడు ఒకే వ్యక్తి నుండి మిమ్మల్ని సృష్టించగా అందులో నుండే తోటి జీవిని పుట్టించాడు. ఆమెనుండీ మిగిలిన వారంతా వచ్చారు.
      ముస్లిం మతవాదులు ఈ స్వల్ప ఆధారాలను బట్టే పురుషుడు తొలుత సృష్టి అయ్యాడనీ, అతడి ఆనందంకోసం స్త్రీలు సృష్టి అయ్యారనీ నిర్ధారించారు. స్త్రీలు తక్కువ వారని ఈ గాథ నాధారంగా పేర్కొన్నారు. ఈ గాథకు పవిత్రత నాపాదించి దాన్ని విమర్శిస్తే దైవాన్ని విమర్శించినట్లేనని దైవవాక్యం తిరుగులేనిదని అన్నారు. మహమ్మద్ స్త్రీలను గురించి ఇలా చెప్పాడు. స్త్రీల పట్ల స్నేహపూరితంగా ఉండు. వారు పక్క ఎముక నుండి సృష్టి అయ్యారు. వంగిన ఎముకను నిటారుగా చేయదలిస్తే అది విరిగిపోతుంది. ఎమీ చేయకుంటే ఆమె ఒంగి ఉంటుంది.
    ఆదాం. ఈవ్ కథ ఇంకా ఇలా వివరించారు.
      2.35-36 ఓ ఆదాం, నీవూ, నీ భార్యా ఉద్యానవనంలో ఉండి స్వేచ్ఛగా పండ్లు తినండి. ఒక్క చెట్టు దగ్గరకు మాత్రం రావద్దు అలా వస్తే దోషులవుతారు.
      సైతాను వారిని వక్రమార్గంలో పట్టించి ఆనందమార్గం తప్పించాడు. పతనమైపొండి. మీరిరువురూ పరస్పరం శత్రువులు. కొంతకాలంపాటు భూమిమీద ఉండండి.
      7.19-20 ఓ ఆదాం, నీవూ నీ భార్య వనంలో ఉండి స్వేచ్ఛగా తింటూ ఉండండి. ఒక చెట్టు దగ్గరకు వస్తే మాత్రం దోషులవుతారు.
సైతాను వారి చెవిలో ఊది వారి నుండి దాచిపెట్టినదంతా బయటపెడతానన్నాడు. మీ దేవుడు ఈ చెట్టు ద్వారా మీకు నిషేధాన్ని విధించి మిమ్మల్ని దేవతలుగా, అమరులుగా చేయకుండా అడ్డుపడ్డాడు.
      20.120-121 ఓ ఆదాం, అమరత్వ వృక్షాన్నీ, అధికారాన్నీ నీకు చూపిస్తాను. అని సైతాన్ రహస్యంగా చెప్పాడు. ఆ జంట చెట్టు ఫలాలు తినగా, వారి సిగ్గు బయటపడి తోటలోని ఆకులు కప్పుకోవలసి వచ్చింది. దేవునికి అవిధేయత చూపిన ఆదాం దారితప్పాడు.
      దేవుని అతిక్రమించినందుకు ఆదాం, ఈవ్ లను దేవుడు శిక్షించాడు. గాని పాత నిబంధన వలె అలా దారితప్పటానికి ఈవ్ కారణమని  ఈ చరణాలలో లేదు. ముస్లిం పండితులు ఈవ్ ను మాయలాడిగా చిత్రించి ముస్లిం సంప్రదాయంలో అంతర్భాగం చేశారు. ఈవ్ దారిచూపకుంటే ఏ స్త్రీ కూడా భర్తకు అవిశ్వాసపరురాలుగా ఉండదని మహమ్మద్ అన్నాడు.
      ఇస్లాం సంప్రదాయాలలో స్త్రీని వంచితురాలిగా చిత్రించి ఖురాన్ ఆధారంగా సమర్ధించుకున్నారు.
      12.22-34 ఈ చరణాలలో స్త్రీ స్వభావంలోని మోసపూరిత వ్యవహారం ఉన్నదని ఆధునిక ముస్లిం భాష్యకారులు చెపుతుంటారు. స్త్రీ మార్పుకు ఇష్టపడదనీ, స్వతహాగా మారేశక్తి ఆమెకు లేదనీ అన్నారు. (ఆస్చా. పై పుస్తకం, పుటః29) స్త్రీ దేవతలను విమర్శించటంలో కొరాన్ స్త్రీ లైంగిక విషయాన్ని కూడా దుయ్యపట్టింది. 4.117, 43.15-19, 52.39, 37.149-50, 53.21-22, 53.27 సుర చరణాలు గమనించండి. బోదిబా వంటివారు కొరాన్ లో స్త్రీ ద్వేషాన్ని గ్రహించాలంటే 2.178, 2.228, 2.282, 4.3, 4.11, 4.34, 4.43, 5.6, 33.32-33, 33.53, 33.59 గమనించాలి.
      అనేక హాదిత్ లలో స్త్రీల పాత్రను ప్రస్తావించారు. ఇస్లాం చట్టాలు వాటిపైన ఆధారపడినవి. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలనీ, పురుషులు పిలవగానే పలకాలనీ, పురుషులకు  లొంగి ఉండాలనీ, పురుషుడి ప్రశాంతతకు తోడ్పడాలనీ రాశారు.
      స్త్రీలు తమ భర్తల వద్ద సాష్టాంగపడి ఉండాలనీ ఉత్తరువులిస్తారు. భర్తకు సేవ చేయకుండా స్త్రీ దైవసేవకు అర్హురాలు కాదు. ఏ స్త్రీ వలన ఆమె భర్త సంతృప్తి చెందాడో ఆ స్త్రీ చనిపోతే స్వర్గానికి పోతుంది.
      ఒంటె జీను మీదనైనాసరే భర్త అడిగితే భార్య పొందును నిరాకరించరాదు.
      కలలో నాకు నరకజ్వాలలు కనిపించాయి. విశ్వాసంలేని స్త్రీలు అందులో కనిపించారు. దేవునిపట్ల వారికి విశ్వాసం లేదా అని అడిగాను. భర్తలపట్ల కృతజ్ఞతగాలేరని సమాధానం వచ్చింది. జీవితం అంతా స్త్రీని ఆదరించినా, ఏదో కుంటిసాకుతో నాకేమీ చేయలేదంటుంది.
      దుశ్శకునాలలో ఇల్లు, స్త్రీ, గుర్రం ఉన్నాయి. స్త్రీకి వివరాలు చెపితే ఏ పనిలోనూ జయం సాధించలేం. పైన ఉదహరించినవన్నీ సంప్రదాయాలలో పేర్కొన్నారు. ఇస్లాం సంస్కృతి, నాగరికత స్త్రీ వ్యతిరేకమైనది. ఖలీఫాలూ, మంత్రులూ, తాత్వికులూ, మతజ్ఞానులూ అన్ని కాలాలలోనూ ఇలా చెపుతూవచ్చారు.
      రెండవ ఖలీఫా ఉమర్ (581-644) ఇలా అన్నాడు. స్త్రీలను రాయడం నేర్చుకోకుండా ఆపివేశాయి. వారి విధానాలకు అనుమతించబోరు. స్త్రీలకు వ్యతిరేకంగా నీ స్థితిని అనుసరించు. స్త్రీ నగ్నంగా ఉండేటట్లు చూడు. వస్త్రధారులైతే ఇల్లు  వదలి పెళ్ళిళ్ళకూ, క్రతువులకూ, ఉత్సవాలకూ వెళతారు. స్త్రీలు తరచు బయటికి వెళితే పర పురుషుల్ని కలవటం, భర్తకంటె తక్కువ ఆకర్షితులైనా, పర పురుషుల వ్యామోహంలో పడటం జరుగుతుంది.
      ప్రవక్త బంధువు 4వ ఖలీఫా అలీ ఇలా అన్నాడు. (Ascha, పుటః 38)
      స్త్రీలందరూ పాపాత్ములే.
      స్త్రీని ఎప్పుడూ సలహా అడగకు. వారి సలహా నిరుపయోగం పర పురుషుల్ని చూడకుండా దాచిపెట్టు. ఎక్కువసేపు వాళ్ళతో గడిపితే నీ పతనానికి దారితీస్తారు.
      స్త్రీలకు ఎన్నడు లొంగవద్దు. నిత్యజీవితంలో నీకు సలహాలను చెప్పనివ్వద్దు. అలా అనుమతి ఇస్తే నీ ఉత్తరువులు, కోర్కెలనీ నిరాకరిస్తారు. ఏకాంతంలో వారు మతాన్ని మరిచిపోయి వారిని గురించే ఆలోచిస్తారు. తమ వాంఛల ముందు  వారికి దయాధర్మాలు లేవు. వారి నుండి ఆనందం పొందినా తలనొప్పి కొనితెచ్చుకున్నట్లే, వ్యభిచారిణులు అవినీతిపరులు, వృద్ధాప్యం వారి పాపాలకు అడ్డురాదు. ఇతరులను అణచివేస్తూ తమని అణచివేశారని అంటుంటారు. ప్రమాణాలు చేసి అబద్ధాలాడతారు. పురుషుల్ని కోరుకుంటూనే నిరాకరిస్తున్నట్లు నటిస్తారు. వారి మాయ బంధాలనుండి తప్పించుకోటానికి దేవుని సహాయం కోరాలి.
      స్త్రీలకు వ్రాత నేర్చేవారి నుద్దేశించి ఇలా అన్నాడు. అసంతృప్తికి పాపాన్ని కూడా జోడించవద్దు. మహమ్మద్ తరువాత గొప్ప ముస్లిం అని మాంట్ గోవరీవాట్ పేర్కొన్నాడు. తాత్వికుడు అల్ ఘజాలీ చెప్పిన మాటల్ని పరిశీలించాలి. (అశ్చా. పుటః41)
      మతజ్ఞానాలు తిరగదోడుట అనే రచనలో స్త్రీ పాత్రను గురించి ఘజాలీ నిర్వచనాలు.
      స్త్రీ ఇంటివద్దనే ఉండాలి. తరచు బయటకు పోరాదు. ఇరుగు పొరుగువారితో మాట్లాడనివ్వరాదు. తప్పనిసరి ఐతేనే పోనివ్వాలి. భర్తసేవజేస్తూ అతన్ని అన్ని విధాలా తృప్తిపరచాలి. అతన్ని మోసం చేయరాదు. డబ్బు గుంజుకోరాదు. భర్తకు చెప్పకుండా ఇల్లు వదలరాదు. అనుమతించినప్పటికీ పాతబట్టలు ధరించి జనసంచారం లేని సందుగొందుల్లో వెళ్ళాలి. భర్త స్నేహితులతో మాట్లాడకూడదు. ఆమె గృహ ప్రార్థనలు, ఉపవాసాలే పట్టించుకోవాలి. భర్త స్నేహితులు వచ్చినా భర్త లేనప్పుడు తలుపు తీయరాదు. తన, తన భర్త గౌరవార్థం సమాధానం ఇవ్వరాదు. భర్తను లైంగికంగా తృప్తి పరచాలి.
      అల్ ఘజాలీ స్త్రీలపట్ల హెచ్చరికలు చేస్తూ స్త్రీలనుండే పురుషులకు అన్ని కష్టాలూ వస్తాయన్నాడు.
      బుక్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ కింగ్స్ అనే పుస్తకంలో అల్ ఘజాలీ రాస్తూ ఈడెన్ తోటలో ఈవ్ దుష్టపరివర్తన వలన స్త్రీలందరూ కష్టాలనుభవించాల్సిందేనని చెప్పాడు.
      (తన్నాహిల్ ఉదహరించిన తీరు, పేజి, 233-34)
      ఇస్లాం స్త్రీలపట్ల స్వర్ణయుగాన్ని చూపించటానికి కొందరు ప్రయత్నిస్తున్న సందర్భంగా  పై ఉదహరించిన వారిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇస్లాం మూల రచనలు వదిలేసినందువలన ముస్లిం సమాజాలు వెనుకబడి నేటి పతనావస్థకు వచ్చాయని కొందరంటారు. ఇస్లాంలో అలాంటి ఆదర్శరాజ్యం ఏనాడూ లేదు. స్వర్ణయుగాన్ని గురించి మాట్లాడటం అంటే ముల్లాల ప్రభావాన్ని అట్టిపెట్టటమే. అంతేగాక ముస్లిం స్త్రీల విమోచనను జరగకుండా ప్రయత్నించటమే.
స్త్రీల హీనస్థితి
    స్త్రీలనూ, బానిసలనూ దయగా చూడమని మహమ్మద్ తన వారితో చెప్పాడట. నైతికంగా, శారీరకంగా, మేథస్సులో స్త్రీలు తక్కువవారని ఇస్లాం పరిగణిస్తుంది. ముందు పురుషుడు వచ్చాడు. తరువాత జంతువులూ, వృక్షాలూ వచ్చాయి. ఆ తరువాతనే స్త్రీ వచ్చింది. సనాతన ముసుగును ఆలోచనాపరుడు స్త్రీలకు పురుషునికంటే తక్కువ శక్తి ఉన్నదని చెపుతూ వస్తున్నారు. ఒక హడిత్ సూత్రం ప్రకారం స్త్రీలకు వివేచనా, విశ్వాసం కూడా తక్కువే. బహిస్టు సందర్భంలో స్త్రీ అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ, అది బహిస్టు కాలానికే వారు పరిమితం చేయలేదు. తనకు చెందని స్త్రీని మహమ్మద్ ముట్టలేదని చెపుతారు. స్త్రీలతో కరచాలనం కూడా చేయనని అతనన్నాడు.  (Ascha పుటః 49) ఈ విషయమై హడిత్తులు ఇలా చెపుతున్నాయి.
      తనను కామానికి అనుమతించని స్త్రీ కన్నా,  పురుషుడుపై పంది బురద జల్లటం  మేలు. తాను అనుమతించని స్త్రీకంటే తలమీద ఇనుపచువ్వను గుచ్చటం మంచిది.
      చట్టబద్ధంగా తనకు సంబంధించని స్త్రీ చేయి పట్టుకోవటం వలన తీర్పునాడు కాలే ఇనుపకడ్డీలు అతడు పట్టుకోవలసి వస్తుంది. ప్రార్థించేటప్పుడు నల్లకుక్క, స్త్రీ, గాడిద వస్తే ప్రార్థనలు ఆపవచ్చు.
      ఈ హడిత్తులు నిజమైనవి కావని కొందరు ఉదార ముస్లింలు కొట్టిపారేస్తున్నారు. ఐతే ఖురాన్ లో చెప్పిన ఈ కింది విషయాలను గురించి వారేమంటారు.
      తాగినప్పుడు ప్రార్థనల దగ్గరకు రావద్దు. స్నానం చేసేవరకూ, మురికి పోగొట్టుకోనంతవరకూ ప్రార్థనలు చేయవద్దు. జబ్బుగా ఉన్నప్పుడు, ప్రయాణంలో, స్త్రీని తాకినప్పుడూ, నీరు లభించనప్పుడూ శుభ్రమైన మట్టిని తీసుకొని మొఖమూ, చేతులూ ప్రక్షాళనం చేసుకో  (సుర 4.43, 5.6)
      మతవాదులు కొరాన్ ఆధారంగా స్త్రీలు తక్కువవారని చెపుతూ, ఎలాంటి వాదాలనూ అంగీకరించకుండా, అలా వాదించటం దైవ వాక్యానికి వ్యతిరేకంగా చేయటమేనంటున్నారు. అసంబద్ధమైన తమ అశాస్త్రీయమైన భావాలకు దైవ నిర్ణయాలు  మద్దతుగా ఉన్నాయంటున్నారు.
      3.36 ఆమె ప్రసవించిన తరువాత ఇలా అన్నది. ఓ దేవా ! నేను ఆడపిల్లను కన్నాను  ఆమె ఎవరిని కన్నదీ దేవునికి తెలుసు. స్త్రీ ఎలాగూ పురుషుని వలె ఉండజాలదు. ఆమెకు మేరీ అని పేరు పెట్టాం. ఆమెని మాత్రం మీ శరణు వేడుతున్నాను. ఆమె సంతానానికి కూడా సైతాను నుండి రక్షణ కోరుతున్నాను.
      43.18 ఏమిటి ? దేవుని సంతానంగా స్త్రీ ఉంటుందా ?  హేతువులేని జీవి వస్తుందా ?
      4.122. దేవునికంటే నిర్థారణ ఎవరి వాక్యం ఉంటుంది ? స్త్రీలు స్వతహాగా తక్కువవారు. పగిలిన సీసాను ఎలా అతకలేమో వారిని అలాగే పోల్చవచ్చు. సీసాలను (స్త్రీలను) జాగ్రత్తగా చూడాలని మహమ్మద్ చెప్పాడు.
లైంగిక విషయాలలో అసమానత్వం
    పురుషాధిక్యతతో కూడిన తమ దృష్టిని బులాఫ్, బర్టన్, బాస్క్వే, బోధిబా నొక్కి చెపుతున్నారనటానికి, లైంగిక విషయాలలో ఇస్లాం ప్రత్యేక దృష్టితో ఉన్నది అంటున్నారు. ఇస్లాంలో స్త్రీ లైంగిక అవసరాలుగానీ, లైంగిక విషయంగానీ దృష్టిలో పెట్టుకోవటంలేదు. ముస్లిం న్యాయవేత్తల దృష్టిలో వివాహం, పురుషుడు స్త్రీతో చట్టబద్ధంగా ఉండటానికీ, ఒక విధానం అంటున్నరు. బానిస స్త్రీతో ఉంపుడుకత్తెగా సంబంధం పెట్టుకోవటం మరొకరీతిగా ఉన్నది. ఒక ముస్లిం న్యాయవేత్త దృష్టిలో ముస్లిం పురుషుడు వివాహం ద్వారా స్త్రీ జననేంద్రియాలను పొందటం, అనుభవించటం              హక్కుగా ఉందన్నాడు. (బాస్క్వే LEthique Sexuelle de L’Islam, పారిస్, 1966, పుటః 118) ఐతే భర్త జననేంద్రియాలు స్త్రీకి సొత్తు కాదు. ఖురాన్ పురుషుడికి ఎందరి స్త్రీలనైనా అనుమతిస్తున్నది.                (సుర 4.3)
      విశ్వాసపరులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రార్థనలో వినయంగా ఉన్నారు. వృధా సంభాషణలు చేయటంలేదు. పేదవారిని పట్టించుకుంటున్నారు. భార్యలూ, బానిసలతో తమ తృష్ణ తీర్చుకుంటున్నారు. అందువలన వారికి నింద లేదు. (సుర 23.1, 5, 6)
      నిస్పాక్షికత పురుషుడికి అసాధ్యమని కొరాన్ కు తెలుసు. మీ భార్యలను మీరెంతగా కోరుకున్నా సమానంగా చూడటం కుదిరేది కాదు. (సుర 4.129) - ఐనప్పటికీ బహు భార్యత్వాన్ని అనుమతిస్తున్నది. (స్త్రీకి ఒక భర్తకంటే అనుమతి లేదు. క్రైస్తవ, ముస్లిం వివాహాలలో సాధారణమైన విషయం లేదని జి.హెచ్. బాస్క్వే రాశాడు. సహభాగచారిణి, అనుబంధం, స్నేహం వివాహ జంటలో ఇస్లాం ప్రకారం లేదు. అరబ్బు మాట నిఖా అంటే సంభోగం అని కూడా అర్థం ఉన్నది.  అదే అర్థం గురించి బాస్క్వే ఇలా రాశాడు. ముస్లిం వివాహంలో సంప్రదించకుండా కూడా స్త్రీని భర్త అనుభవించటానికి ఆమోదిస్తారు. అవసరమైతే మరో ముగ్గురు భార్యలకూ, అపరిమితంగా ఉంపుడుకత్తెలకు కూడా ఇలాంటి అవకాశమే పురుషుడి పరంగా ఇస్తారు. ఇందులో వైవాహిక భాగస్వామ్యం లేదు. (బాస్క్వే. పుట 156)
      భార్యలపట్ల భర్తలు న్యాయంగా ఉండాలని చెప్పటంలో ప్రేమ, లైంగిక సంబంధాలను దృష్టిలో పెట్టుకోలేదనీ, ఖర్చులూ, కట్నాలూ దృష్టిలో పెట్టుకున్నారనీ ముస్లిం న్యాయవేత్తలు చెప్పారు. ప్రవక్తకు కొరాన్ ద్వారా ప్రత్యేక అవకాశాలు లభించాయి. అతడికి నలుగురికి మించి భార్యలుండవచ్చు. రాత్రుళ్ళు వారి మధ్య సమానంగా గడపాలనేదేమీ లేదు.
      ఓ ప్రవక్తా ! నీవు నీ భార్యలతోనూ, దేవుడు నీకు కానుకగా ఇచ్చిన బానిసలతోనూ, నీ మామకుమార్తెలతోనూ, నీతోపాటు మదీనాకు పారిపోయివచ్చిన అత్తలతోనూ, నిన్ను నమ్మి చెంతచేరిన స్త్రీలతోనూ, నీవు కోరితే వివాహం చేసుకునే అవకాశం నీకున్నది. నీవు కోరినవారితో శయనించవచ్చు. ఈ విషయాలలో నీకు నేరం అంటబోదు (33.49-51)
      ప్రవక్త భార్య ఆయేషా ఇలా అన్నది.  నీ కోర్కెలు తీర్చటానికి అవసరమైనప్పుడల్లా నీకు దేవుడు సహాయపడుతుంటాడు.  ప్రవక్తకు 9మంది భార్యలున్నారు. వారందరినీ ఒకనాడు ఉదయం లైంగికంగా తృప్తిపరచగలడనీ అల్ ఘజాలీ పేర్కొన్నాడు. ఇక్కడ ప్రధానాంశం ఏమంటే స్త్రీలను వస్తువులుగా పరిగణించటం, పురుషుడు ఇష్టాఇష్టాలను బట్టి స్వీకరించటం, వదిలేయటం, అల్ ఘజాలీ సలహా ప్రకారం, ఒక భార్య చాలకపోతే 4గురు వరకూ స్వీకరించవచ్చు. అప్పటికీ తృప్తి లేకపోతే మార్చవచ్చు. ఇంతకంటే అనుకూలం ఏముంటుంది ?
      తనను లైంగికంగా తృప్తి పరచమని భార్య అడగకూడదు. అన్నం పెట్టమనీ, వస్త్రాలివ్వమనీ, గృహవసతి కావాలనీ  అడగవచ్చు. లైంగికంగా భర్తే యజమాని, భార్యకాదు. లైంగిక విషయమై భర్త నిరాకరిస్తే అది అతడి హక్కుగా భావిస్తున్నాడు.
      భర్త మర్మాంగం దెబ్బతింటే లైంగిక సంబంధాలకు  పనికిరాకుంటే భార్య విడాకులడగవచ్చు. నపుంసకత్వం వంటివాటివలన వెంటనే విడాకులివ్వరు. భర్తకు ఒక ఏడాది అనుమతిస్తున్నారు.
      విడాకులు కోరే స్త్రీ కన్యగా ఉండాలి. పెళ్ళి అయిన తరువాత స్త్రీ లైంగికహక్కులు కోల్పోతుంది. సున్నీ శాఖలోని షఫీమైట్ల ప్రకారం పురుషాంగం పనిచేయకపోతేనే విడాకులడగవచ్చు. మారెకైట్లు, హేనిఫైట్లు, ప్రకారం, పెళ్ళి అయిన తరువాత స్త్రీకు లైంగికంగా ఎలాంటి హక్కులూ లేవు. పురుషుల హక్కులను మాత్రమే ఇస్లాం కాపాడుతుంది. సెక్స్ పట్ల ముస్లిం ధోరణి గమనించటానికి పురుషాయితంపై చర్చకూడా గమనించవచ్చు.  మహమ్మద్ బృందంలో కొందరు పురుషులు తమ స్త్రీలను ముందు, వెనుకనుంచి అనుభవించారు. మహమ్మదును ఈ విషయమై కొందరు స్త్రీలు అడిగారు. మహమ్మద్ ఇచ్చిన సమాధానాన్ని కొరాన్లో సుర. 2.223 గా నమోదు చేశారు. స్త్రీలను పురుషులు వారిష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. అస్పష్టమైన ఈ పదజాలం  భిన్న వ్యాఖ్యలకు దారితీసింది. స్త్రీలను సంప్రదించే ఆలోచన ఎవరూ చేయలేదు. చర్చల్లో వారిని దూరంగా పెట్టారు. వురుషుడు  తన భార్యను వెనుకా, ముందు భాగాలనుండి ఎలాగైనా వాడుకోవచ్చనీ,  అతని రేతస్సు భోగరంధ్రంలో మాత్రం పడాలని ముస్లిం మతవేత్తలు చెప్పారు. అంటే, పురుషుడు క్షేత్రాన్ని ఎలాగైనా వాడుకొని బీజాన్ని నాటవచ్చు.
      సంభోగానికి వృష్ఠభాగాన్ని వాడటం పెద్దపాపంగా పరిగణించారు. దీనికి మరణశిక్ష విధించాలా, లేదా అనే విషయమై అభిప్రాయభేదాలున్నాయి. మొహమ్మద్ ఇలా అన్నాడు. గుర్రం జీనుమీదైనాసరే భార్య ఏనాడు భర్తను నిరాకరించరాదు. (మరొక ఆధారం ప్రకారం మండే పెనం మీదనైనా సరే).  సంభోగానికి తప్పించుకునే స్త్రీలను, తరువాత అనేవారిని  ప్రవక్త నిందించాడు. హడిత్ ఇలా పేర్కొన్నది. తప్పించుకునే బానిస, రాత్రిళ్ళు భర్తను ఇబ్బంది పెట్టే భార్య ప్రార్థనలు స్వర్గానికి చేరవు.
      భర్తను నిరాకరించే భార్యను శిక్షించే హక్కు భర్తకున్నది. ఈ విషయమై కొరాన్ సమర్థిస్తున్నది. (సుర 4.34)
      భార్యకు రక్షణ, పోషణ హక్కు కోల్పోయే అవకాశం ఉన్నది. ఈజిప్టు చట్టప్రకారం భార్య తగిన కారణం లేకుండా భర్తను నిరాకరిస్తే ఆమె పోషింపబడే హక్కు కోల్పోతుంది.  (ఆర్టికల్ 67)
      స్త్రీకి ఆమె మర్మాంగాలపై ఎలాంటి హక్కు లేదు. పెళ్ళి అయిన తరువాత భర్తకు ఆ హక్కు లభిస్తుంది. మహమ్మద్ కోసం సుప్రసిద్ధ ముస్లిం రచయిత. అతను ఇలా రాశాడు. (.ఆశ్చా పుటః 58)
      సంరక్షకుడు తనకు చెందని దానిని తీసుకెళ్ళమని ఇతరులను ఆహ్వనించే హక్కు లేదు. అలాగే యువతి తన మర్మాంగాన్ని వాడుకోమని ఎవరినైనా ఆహ్వానించే హక్కు లేదు.  ఆమె తల్లిదండ్రుల, కుటుంబ, సమాజ, మానవాళి గౌరవం అందులో ఇమిడి ఉన్నది.
సున్తీ
      సున్తీ గురించి కొంత చెప్పవలసి ఉన్నది. ఈ విషయమై సిద్ధాంతానికీ, ఆచరణకూ తేడా ఉన్నది. ఇస్లాం చట్టం కంటే ముస్లిం ఆచారానికి ఎక్కువ వత్తిడి ఉన్నది. ముస్లింలలో అధికసంఖ్యాకులు ఇస్లాంలో సభ్యులుగా సున్తీని పాటిస్తారు. జావాలో సున్తీ చేయించుకోవటం ఇస్లాంకు సన్నిహితం కావటమే. ఇది క్రైస్తవుల జ్ఞానస్నానం వంటిది. ముస్లిం అంటే సున్తీ చేయించుకునేవాడని క్రైస్తవులు భావిస్తారు. సున్తీ శునకం అని ఒథెల్లో లో అలెప్పో టర్కను షేక్స్ పియర్ వర్ణిస్తాడు. ఇస్లాం చట్టంలో ఇది లేదు. ప్రవక్త ఆధారాలలో ఉన్నదంటారు. తొలి ముస్లింలు దీనిని తీవ్రంగా పరిగణించలేదు. ఖలీఫా ఒమర్ ఈ విషయమై చెపుతూ, మహమ్మద్ సున్తీ చేయించటానికి రాలేదని, ఇస్లామీకరణకు వచ్చాడనీ అన్నారు.
      ఆధునిక ముస్లిం సమాజంలో స్వేచ్ఛాపరులనుకొన్నవారు సహితం సున్తీని పాటిస్తున్నారు. వివాహాలతో దీటుగా సున్తీ ఉత్సవాన్ని చేస్తున్నారు. సున్తీ అవసరమా, ఇస్లాం ముందునుండీ వస్తున్న మొరటు ఆచారమా ? బోదిబా ఈ వ్యవహారాన్ని ఇలా రాశాడు. (అబ్దుల్ వాహబ్ బోదిలా,  La Sexsalite en Islam, పేరిస్, 1975 పుటః 217-218)
      సున్తీలో పిల్లలు చేయగలిగిందల్లా పెద్దగా ఏడవటం మాత్రమే. ఇస్లాంలో శుభప్రదమైన సందర్భంగా సున్తీ చేయించుకున్నవారిని అభినందించటానికి స్త్రీ, పురుషులు రావడం మాత్రమే పిల్లలకు తెలుసు. చిత్రహింసకు గురై వారి శరీరంలో కొంత భాగం కత్తికి బలై బాధతో అరుస్తున్న పిల్లల్ని పట్టించుకోరు. అది నయం కావటానికి చాలా కాలం పడుతుంది. కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. పురుషాంగంలో నరాలు తెగటం, అంటురోగాలు రావటం కూడా జరగవచ్చు. పిల్లలకు శారీరకంగా, మానసికంగా జరిగే బాధ సున్తీలో ఏమాత్రం సమర్థనీయం కాదు. అది భయానకమైన అటవీ ఆచారం.
ఆడపిల్లలు సున్తీ
ఇస్లాం నిఘంటువులో 19వ శతాబ్దంలో రాసిన ప్రకారం వృద్ధనారీలు స్త్రీ మర్మాంగంలో పై భాగాన్ని (గొల్లి) కత్తిరించటం చట్టపరమైన వృత్తిగా భావించారు. ఇది ఇస్లాం దేశాలలో, ముఖ్యంగా అరేబియాలో ఆచరించారు. బర్టన్ కూడా  ఈ విషయం ప్రస్తావించాడు. ఉత్తరాఫ్రికాలో ఇది అరుదు అని బాస్క్వే అన్నాడు. మొరాకో, టునీషియా, అల్జీరియా, టర్కీ, ఇరాన్ లో ఇది అరుదు అనీ, మిగిలిన చోట్ల అచరిస్తున్నారనీ 1978లో బోధిబా రాశాడు. స్త్రీల మర్మాంగం సున్తీ మార్పులకై ప్రతిపాదన అనే విషయాన్ని అల్పవర్గాల హక్కుల సంఘం 1992లో ఒక నివేదిక  ప్రకటిస్తూ,  ఈ సున్తీ ఆచారం పశ్చిమ, సహారా, తూర్పు ఆఫ్రికా, ఎమెన్, ఓమన్ లలో ముస్లింలూ, క్రైస్తవులూ, యూదులూ, పాటిస్తున్నారని పేర్కొన్నాడు. లక్షలాది ఆడపిల్లలు ఈ బాధలకు లోనవుతున్నారు. అబ్బాయిలు సున్తీ వలె బాహాటంగా కాక ఆడపిల్లల సున్తీ లోపాయికారిగా చేస్తున్నారు.
      పెళ్ళినాటి రాత్రి ఆమె కన్యత్వాన్ని తొలగించటం కూడా ఒక ఆచారంగా చూపుతున్నారు.
      ఖురాన్ లో స్త్రీల సున్తీ ప్రస్తావన లేదు. ముస్లిం పండితులు ఈ విషయమై దృష్టి పెట్టలేదు.  దీనిని పవిత్ర చర్యగా మాత్రం ప్రస్తావించారు. సున్తీలో ఆడపిల్లలకు ఏమి చేస్తారు ? (బార్టన్, ది బుక్ ఆఫ్ ది థౌజండ్ నైట్స్ అండ్ ఎ నైట్, 5వ సంపుటి, పుటః 279) భగం పై భాగం పొడుచుకొని వచ్చిన చోట కోయడాన్ని ఆడపిల్లల సున్తీ అంటున్నారు. నైలు ఎగువ భాగాన, నీగ్రోయిడ్లలో, సోమర్, తదితర తెగలలో ఈ సున్తీ చేస్తున్నారు. ఒక వృద్ధ స్త్రీ కత్తి లేదా బ్లేడుతో గొల్లిని కత్తిరించటం జరుగుతున్నది. తరువాత సూదితో కుడుతున్నారు. మూత్రం చేయటానికి వీలుగా ఒక గొట్టాన్ని జొప్పిస్తున్నారు. పెళ్ళికి ముందు నెలరోజులపాటు పెళ్ళి కుమారుడికి మాంసం, తేనె, పాలు, పెడతారు. అతడు పెళ్ళి కుమార్తెతో సంభోగంలో సహజంగా చేయగలిగితే  తెగలో మరే స్త్రీ కూడా  అతడిని నిరాకరించదు. పురుషాంగం తొలినాడు సంభోగంలో విఫలమైతే భగ రంధ్రంలో వేళ్ళు జొప్పించి ప్రవేశం ఏర్పరుస్తారు. ఇదంతా పెళ్ళి కుమార్తెకు బాధాకరమైన విషయం.
    ఆధునిక కాలాలలోనూ పెద్ద మార్పులొచ్చినట్లు లేదు. 1992లో ఎకానమిస్టు పత్రిక ఇలా రాసింది.  ఈ విధానంలో గొల్లిని కత్తితో తొలగించటం అప్పుడు మత్తు ఇవ్వకపోవటం సాధారణంగా జరుగుతున్నది. దీనివలన బహిస్టులో, సంభోగంలో, ప్రసవంలో మానసిక గందరగోళం ఏర్పడి మరణాలకు కూడా దారితీస్తుంది. కన్నెపొరను తొలగించే విషయంలో ముస్లిం పురుషులు స్త్రీల లైంగికంపట్ల భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. పురుషుల సున్తీ వంటిదే స్త్రీల సున్తీ అంటారు.  ఉభయుల లైంగిక సమానత్వాన్ని ప్రస్తావిస్తుంటారు. సున్తీ చేయని స్త్రీ త్వరగా, తరచుగా సున్తీ చేసిన పురుషుడికంటే రేతస్సును విడుదల చేస్తుందనీ, తరచు సంభోగం ఆమె ఆరోగ్యానికి హానికరమనీ పేర్కొన్నాడు. బర్టన్ అలాంటి విషయాలు రాశాడు. స్త్రీని సంతృప్తి పరచటానికి, ముఖ్యంగా ఆమె గొల్లిని పూర్తిగా తొలగించినప్పుడు సంభోగంలో తృప్తి పరచటం పురుషునికి అసాధ్యం అవుతున్నది. అరబ్బు పురుషులలో మానసిక, లైంగిక గందరగోళాలకు దారితీస్తున్నది. ఫ్రాయిడ్ చెప్పినట్లు అంగ నిర్మాణం, విధి నిర్ణయమైతే, లోపాలతో కూడిన అంగ నిర్మాణం లోపభూయిష్టమైన గతికి దారితీస్తుంది.
    భార్యతో సంభోగించినప్పుడు దేవతలు భూమినుండి స్వర్గం వరకూ వారిని ఆవరించి సుఖసంతోషాలను ఇనుమడింపేచేస్తుంటారు. సంభోగించినప్పుడల్లా దైవానికి సమర్పించుకోవటమేనని  మహమ్మద్ భక్తులతో చెప్పాడు. ఖురాన్ ఈ దృష్టిని సమర్థిస్తుంది. సుర 5.89 దేవుడిచ్చిన న్యాయ సమ్మతమైన సుఖాలను కాదనవద్దు. సుర 24.32 ఏకాకిగా ఉన్నవారిని చూసి పెళ్ళి చేసుకో మహమ్మదిలా అన్నాడు.  నేను ఎన్నోసార్లు పెళ్ళి చేసుకున్నాను. నన్ను అనుసరించనివారు నాతో లేనట్లే. గృహాన్ని నెలకొల్పగలవారే పెళ్ళి చేసుకోవాలి. తన అనుచరులలో ఒకరిని బ్రలహ్మచారిగా ఉండే ప్రతిజ్ఞ తీసుకోకుండా మహమ్మద్ నిషేధించాడు. మహమ్మద్ లైంగికంగా ఎక్కువ శృంగార జీవితం గడిపాడు. క్రైస్తవ చరిత్రకారుల దృష్టిలో ఇది అతిపోకడే.
      ఇస్లాం పురుషుల దృష్ట్యా స్వర్గంలో శారీరక సుఖాలను ప్రోత్సహించింది. కార్ల్ పాపర్ వంటివారు ఇవి సహించరానివన్నారు. మరికొందరు ఇస్లాం స్వర్గం నోరూరించేదిగా ఉన్నదన్నారు. స్వర్గం నిండా పురుష లైంగిక ఆనందాలున్నాయి. దేవుడు ముస్లిం భక్తులకోసం, అంటె పురుషుల నిమిత్తం అందమైన స్త్రీలను సష్టించాడు.
      78.31-33 దేవుని భక్తితో ఉండేవారు ఆనందంగా గడపటానికి ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ, పెద్ద స్తనాలతో కూడిన అమ్మాయిలు ఉంటారు.
      55.54-58 సుఖాశీనులై, తోటల్లో ఫలాలు అందుబాటులో ఉండగా అమ్మాయిల ఓరచూపులూ, అంతకుముందూ అనాఘ్రాత పుష్పాలుగా ఉన్న స్త్రీలు ముత్యాలవలె ప్రకాశిస్తుంటారు.
      45.70-74 ఈ తోటలలో అందమైన కన్యలుంటారు. గుడారాలలో యువతులు లోగడ ఎవరూ తాకనివారు కనిపిస్తారు.
      46.10-22 ఆభరణాలతో అలంకరించిన పడకలపై ముఖాముఖీ అమర యువతులు కప్పులలో ద్రాక్షసారాయి పట్టుకొని దగ్గరకు చేరతారు. పండ్లు, మాంసాదులు ఉంటాయి.
      56.35-38 కన్యలూ, సహచారుణులూ, కుడివైపున ఉన్న వారికోసం సృష్టించబడ్డారు.
      52.19-20 నీవు సాధించిన దాని ఫలితంగా తిను, తాగు వరుసగా పడకలమీద విశ్రాంతి తీసుకుంటుంటే వారికి యువతుల్ని భార్యలుగా సమకూరుస్తారు.
      37.48-49 సిగ్గుపడే యువతులు విశాలమైన కన్నులతో దాగిన ముత్యాలవలె ఉంటారు.
      44.51-55 పవిత్రులు శాంతి మందిరాలలో, తోటలలో ఉంటారు. విశాల నయనాలు గలవారిని వారు వివాహమాడతారు. ప్రశాంతంగా వారికి అన్ని ఫలాలు అందుతాయి.
      33.49-53 పవిత్రులకు తిరిగి రావటానికి చక్కని స్థలం ఉన్నది. ఈడెన్ తోటలలో ద్వారాలు తెరచి ఉండగా సమృద్ధిగా, ఫలాలు పానీయాలు లభిస్తాయి. వారి పక్కనే కన్యలు తోడుగా ఉంటారు. తీర్పునాడు వారికిచ్చిన హామీ ఇదే.
      2.25 ఈ తోటలలో వారికి పవిత్రమైన భార్యలు సమకూడగా శాశ్వతంగా ఉంటారు.
      స్వర్గంలో బ్రహ్మచారులు ఉండరని మహమ్మద్ అన్నాడు. ఇలాంటి బాల్య చేష్టలతో ఇంద్రియ సుఖాలకు సంబంధించిన విషయాలతో మళ్ళీ పురుషుడి సేవల నిమిత్తం స్త్రీని సృష్టించి అట్టిపెడతారు. ముస్లిం వ్యాఖ్యాతలు కొరాన్ స్వర్గాన్ని విస్తారంగా, వర్ణించారు. సుయూతీ ఇలా రాశాడు. (బోదిబా. పుటః95-96 పై పుస్తకం) ప్రతిసారీ ఒక యువతితో సంభోగించినప్పుడు ఆమెను కన్యగా కనుగొంటాం. ఎంపికైన వ్యక్తి లేపన శక్తి శాశ్వతంగా ఉంటుంది. ప్రతిసారీ సంభోగం ఆనందమయంగా ఉంటుంది. 70 మందిని ఈ ఎంపికైనవారు ఒక్కక్కరూ చేసుకుంటారు. భూమ్మీద చేసుకున్న వారుగాక వీరు అదనంగా ఉంటారు. వీరందరి మర్మావయవాలు ఆకలి తీర్చేవిగా ఉంటాయి.
    ఇస్లాం ప్రత్యక్ష లైంగికంగా ఉంటుందనేది జాగ్రత్తగా గమనించాలి. ఇదంతా పురుషపరంగానే ఉంటుంది. నైతిక న్యాయ విధానం ఉలేమాలు విస్తృతపరచిన రీతిలో పురుషమయంగానే ఉన్నది. ఇస్లాంలో లైంగిక హద్దులు దాటితే మరణశిక్ష కూడా ఉన్నది. పవిత్రత, అపవిత్రత ధోరణులు మాత్రం పూర్తిగా పరోక్ష భయాలతో నిండి ఉన్నాయి.
      ఖురాన్ 5.9, నీవు అపవిత్రుడవైతే పవిత్రం చేసుకో పురుషాంగాన్ని తాకినందువలన కలిగిన అపవిత్రత ప్రక్షాళనంతో పోతుంది. వూర్తి అపవిత్రతవలన దేహమంతా ప్రక్షాళనం చేసుకోవాలి. ప్రవక్త ఇలా అన్నాడు. దేహంలో ఒక వెంట్రుక శుభ్రం చేసుకోకపోయినా ఆ మేరకు నరకంలో శిక్ష ఉంటుంది.  ప్రధాన పవిత్రత లైంగిక సంబంధం వల్ల వస్తుంది. రేతస్సు సంభోగ సందర్భంగా రావడం,  పుష్ఠ సంభోగం, పశువులతో సంభోగం, బహిస్టు ఇత్యాదులన్నీ అపవిత్రాలే. ఇందులో నీతి భావన లేదు. సంభోగం వలన అపవిత్రత సమకూరుతుంది. సంభోగం అనుమతించారా లేదా అనేది ఇస్లాం చట్టానికి సంబంధం లేదు. మతవాదులు ఈ విధంగా ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒక యువకుడితో లేదా వేరే స్త్రీతో సంభోగం సరైనదేనా ? రేతస్సు రాకపోతే అప్పుడు చేస్తున్న ఉపవాసం సరైనదే అందులో పాప ప్రసక్తి లేదు. పరిశుభ్రత ప్రశ్నలేదు. స్వల్ప అపవిత్రత అంటే అపవిత్రుడైన వ్యక్తి ప్రార్ధించరాదు. కాబా ప్రదక్షిణ చేయరాదు. కొరాన్ తాకరాదు.  పూర్తి అపవిత్రత అంటే పై వాటితోపాటు కొరాన్ పఠించరాదు.  మసీదులో ప్రవేశించరాదు. సహజంగా శరీరం చేసే పనులన్నీ ఏదో రకమైన అపవిత్రంగా భావించారు. ఇస్లాం చట్టంలో ఇలాంటివి చాలా విపరీతంగా ఉన్నాయి. బోదిబా ప్రకారం ముస్లిం సమాజం పరిశుభ్రత పేరిట స్త్రీ పురుషులను మానసిక  అనారోగ్యకారులుగా, ప్రుష్ఠధోరణి గల సమాజంగా మార్చివేసింది. లైంగికం పట్ల అపవిత్రతతో కూడిన ఇలాంటి ధోరణి పరోక్షమయింది. ఈ చట్టాలన్నీ వ్యక్తిని సమాజంలో భాగస్వామిని చేయటానికి ప్రధానపాత్ర వహించాయి. (బోదిబా, పుటః 59-74, పై పుస్తకం)
      స్త్రీ బహిస్టు అయితే అపవిత్రమనీ, ఆ సమయంలో ప్రార్థనా, ఉపవాసం, కాబా ప్రదక్షిణ, కొరాన్ తాకటం, చదవటం, మసీదు ప్రవేశం, భర్తతో సంభోగం నిషిద్ధాలు. సున్నిత స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్పారని కొందరు ఆధునికులు ప్రస్తావించటం సరికాదు. కేవలం ఆమె అపవిత్రురాలనే దృష్టితో ఈ నిషేధాలు పాటించాలన్నారు.
      ఖురాన్ లో తరచు స్త్రీలు దేవునికీ, భర్తలకూ లొంగి ఉండాలని రాశాడు. సుర 4.34 వుణ్యస్త్రీలు విధేయులుగా ఉంటారు. పురుషులు వ్యాఖ్యానించి, విస్తరించి పేర్కొన్న మతానికీ, దేవుడికీ స్త్రీలు లొంగి ఉండాలి. మత క్రతువులలో స్త్రీలను దూరంగా  పెట్టారు. సుర 16.43. కేవలం పురుషులను మాత్రమే పంపిస్తున్నాము. వారికే దైవ ప్రేరణ వెల్లడయింది. అది తెలియకపోతే పవిత్ర గ్రంథాన్నడిగి తెలుసుకో.
      ప్రవక్త భార్యలు మత ప్రచారంలోనిర్వహించిన పాత్ర గురించి కొందరు ఆధునిక ముస్లింలు అతిశయోక్తి పలుకుతున్నారు. వాస్తవానికి వారిపాత్ర పరిమితం. లేదా, అసలు వారి పాత్రే లేదు.  ఖురాన్ ప్రకారం ప్రవక్త భార్యలు ఇంటిపట్టునే ఉండాలి. మహమ్మదు ఇంటిని సందర్శించినవారు ఆయన భార్యలతో సూటిగా మాట్లాడరాదు. సుర 33.32-33. ప్రవక్త భార్యలారా, సంభాషణలకు ఆకర్షితులు కావద్దు. దుర్మార్గపు ఆలోచన గలవారు మిమ్మల్ని కోరవచ్చు. ఆచార నియమాలతో గూడిన మాటలకే పరిమితం కండి. ఇళ్ళళ్ళో ఉండండి. అజ్ఞాన స్త్రీలు ధరించిన దుస్తులను అనుకరించవద్దు. ప్రార్థనలు చేయండి. దానాలివ్వండి. దైవానికీ, అతని దూతకూ లొంగి ఉండండి.
    33. 53. భక్తులారా, ప్రవక్త ఇళ్ళల్లో భోజనానికి అనుమతిచ్చేవరకూ ప్రవేశించకండి. నిర్ణీత సమయానికి ముందు రావద్దు. పిలిచినప్పుడే రండి. భోజనానంతరం మాట్లాడకుండా వెళ్లిపొండి. మాట్లాడితే ప్రవక్త నొచ్చుకొని మిమ్మల్ని చూసి అవమాన భరితుడవితాడు. దేవునికి సత్యం పట్ల అవమానం లేదు. అతని భార్యల్ని అడగదలుచుకున్నప్పుడు తెరవెనుక ఉండి అడగండి. ఇది నీకూ వారికీ మంచిది. దేవును దూతను నొప్పించటం మంచిది కాదు. అతని అనంతరం అతని విధవలను పెండ్లాడరాదు. దేవుని దృష్టిలో అది పెద్దపాపం.
      అలాంటి పరిస్థితులలో అతని భార్యలు ఎలా బోధించగలరు.... ఖురాన్ లో దీని ప్రస్తావన లేదు. కేవలం వారిని లొంగి ఉండమని, లేకుంటే వచ్చే పరిణామాల పట్ల బెదిరింపు మాత్రమే ఉన్నది.
      33.30-31 ప్రవక్త భార్యలారా, మీలో ఎవరైనా చేసిన పాపం రుజువైతే రెట్టింపు శిక్ష పొందుతారు. దేవునికది సులభం. మీలో దేవునీ, దేవదూతనూ, ఒడంబడి, సత్కార్యాలు చేసిన వారికి రెట్టింపు బహుమతి లభిస్తుంది. అందుకు తగిన ఏర్పాటు చేశాము.
ముస్లిం వాదనలో స్త్రీల పాత్ర ఏమీ లేదని చెప్పటం క్షేమకరం
      స్త్రీ పురుషుల మధ్య సాక్ష్యానికి సంబంధించి అసమానత్వం ఉన్నది. (అశ్చా, పుటః63 పై పుస్తకం) ఖురాన్ లో సాక్షిని గురించి ఇలా ఉన్నది. (సుర 2.282).
      ముస్లిం ప్రచారకులు పై విషయాలను ఎలా సమర్థిస్తారు ? స్త్రీ పురుషుల మధ్య మానసిక తేడాలు గురించి ముస్లిం స్త్రీ పురుష రచయితలు ప్రస్తావిస్తున్నారు. ఖురాన్ (అంటే, దేవుడు) తన వివేచనా దృష్టిలో స్త్రీలు సున్నితమైన వారనీ, ఉద్వేగ పూరితులనీ, సులభంగా చలిస్తారనీ, నిర్ణయాలు తీసుకోలేరనీ, శారీరకంగా రుతువుల ప్రభావానికి లోనౌతారనీ తెలుసు. వారి జ్ఞాపకాలు కూడా అస్థిరంగా ఉంటాయి. మానసికంగా తక్కువ స్థాయిలో ఉంటారు. ముస్లిం మేథావులలో పురుషులు ఇలాంటి వాదనలు చేశారు. ఆశ్చర్యమేమంటే అహమద్ జమాల్, జాహ్యా, ఖద్దోరా, గదాఅల్ ఖర్సా, మదీహా ఖామిస్ వంటి స్త్రీ మేథావులు కూడా ఇలానే వాదించారు. ఈ వాదనలలో అసంబద్ధతలు స్పష్టమేనని ఘనన్ ఆషా అన్నారు. సాక్ష్యం విషయంలో ఇద్దరు వ్యక్తుల వివేచనా శక్తి దోషపూరితమైతే అందులో పూర్తి వివేచనతో పనిచేసే ఒక వ్యక్తి సాక్ష్యాన్ని మాత్రమే స్వీకరించాలి. అది ఇస్లాం గణితం, ఈ తర్కం ప్రకారం ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడితో సమానం ఐనప్పుడు నలుగురు స్త్రీల సాక్ష్యం ఇద్దరు పురుషులతో సమానమన్నమాట. అలాంటప్పుడు పురుషుల సాక్ష్యాన్ని లేకుండా చేయవచ్చు. కాని అలా జరగటం లేదు. పురుషులకు కూడా అవకాశం ఉన్నప్పుడు అలాంటి విషయాలలో స్త్రీల సాక్ష్యానికే పరిమితం కావటం లేదు. ప్రవక్త వివాహం, విడాకులూ, శిక్షలలో స్త్రీల సాక్ష్యాన్ని ఆమోదించలేదు. ఖురాన్ లో మహమ్మద్ విధించిన శిక్షలను, హడిత్ ప్రకారం ఉన్న శిక్షలను హుదూద్ అంటారు. ఇందులో వ్యభిచారానికి వంద దెబ్బులు కొట్టాలి. వివాహిత వ్యక్తికి వ్యతిరేకంగా తప్పుడు వ్యభిచారం దోషం మోపితే 80 దెబ్బలు కొట్టాలి. మత దూషణకు మరణశిక్ష, తాగుడుకు 80 దెబ్బలు, దొంగతనానికి కుడిచేయి నరికివేయుట, దారిదోపిడికి చేతులూ, కాళ్ళూ తొలగించుట, దోపిడీ చేసి చంపితే సిలువ వేయుట, లేదా కత్తితో చంపుట.
వ్యభిచారం
      ఖురాన్ 24.4 వ్యభిచారంపై ఇలా చెబుతున్నది. గౌరవప్రదమైన స్త్రీలపై అపఖ్యాతి తెచ్చి నలుగురు సాక్షులను చూపలేని వారికి 8-కొరడా దెబ్బలు కొట్టాలి.  ముస్లిం శాస్త్రవేత్తలు నలుగురు పురుష సాక్షులనే ఆమోదిస్తారు. ఈ సాక్షులు సంభోగం జరుగుతుండగా చూసినట్లు చెప్పాలి.  వ్యభిచార దోషాన్ని ఆరోపించినప్పుడు చట్టబద్ధమైన సాక్ష్యాలను ఇవ్వలేకపోతే శిక్షలు అనుభవించటానికి సిద్ధపడాలి.  పురుషుడు స్త్రీల అంతఃపురంలో జొరబడి 6గురు స్త్రీలను చెరిస్తే అతనికి ఏమీ హాని జరగదు. పురుష సాక్ష్యం లేకపోవటమే ఇందుకు కారణం. చట్ట ప్రకారం స్త్రీ తనను చెరిచినట్లు చెప్ప సాహసించదు. న్యాయం పొందే అవకాశం ఆమెకు లేదు. అలాంటి సందర్భాలలో స్త్రీల మాటలు చాలు అనుకుంటే ఏ పురుషుడూ క్షేమంగా ఉండడు అని పాకిస్తాన్లో న్యాయమూర్తి జరూర్ ఉల్ హక్ అన్నాడు. ముస్లిం చట్టంలో లైంగిక సంబంధమైన నిషిద్ధాలలో సామాజికంగా పురుషులు తప్పించుకునే ధోరణి ఇందులో ఉన్నది. వ్యభిచార నేరంలో స్త్రీలను కనుగొంటే వారు మరణించేవరకూ ఇంట్లో బంధిచమని ఖురాన్ 4.15 చెపుతున్నది. తరువాత దీనిని దాచిపెట్టి వంద కొరడా దెబ్బలు ప్రవేశపెట్టారు. పురుషుడిని రాళ్ళతో కొట్టి చంపవలసి వస్తే ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి ముందు సాక్షులూ, తరువాత న్యాయమూర్తీ. ఆ తరువాత జనం రాళ్ళు రువ్వి చంపుతారు. స్త్రీని రాళ్ళతో చంపవలసివస్తే గుండెలవరకూ పాతిపెట్టి ఉంచాలని ప్రవక్త చెప్పాడు. తన భార్యనూ, అమె ప్రేమికుడిని లైంగిక చర్యలో కళ్లారా చూచిన భర్త చట్టబద్ధంగా వారిని చంపవచ్చు.
      పురుషుడు తన భార్యను వ్యభిచారంలో అనుమానిస్తే లేక సంతాన చట్టబద్ధతను నిరాకరిస్తే అతడి సాక్ష్యం నలుగురి పురుషులతో సమానం. సుర 24.6 ఒక పురుషుడు తన భార్యపై ఆరోపణ వేస్తే అతను తప్ప సాక్షులు లేకుంటే, తాను చెప్పేది నిజమని నాలుగుసార్లు దైవసాక్షిగా ప్రమాణం చేయాలి. అబద్ధమాడితే తనను శపించమని దైవాన్ని కోరాలి. కాని అతని భార్య నాలుగుసార్లు దైవసాక్షిగా అతను చెప్పేది అబద్ధమనీ, అది నిజమైతే తనను శపించమనీ అంటే ఆమెకు శిక్ష ఉండదు. ఇందుకు భిన్నంగా ఖురాన్ న్యాయంలో స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లు చెప్పటానికి వీలులేదు. స్త్రీ రాళ్ళు కొట్టి చంపే శిక్షలు తప్పించుకున్నా నిరాకరింపబడి పోషణ, కట్నం హక్కు కోల్పోతుంది. విచారణ ఫలితం ఎలా ఉన్నా ఆమె గతి అంతే. భర్తను ఆమె అలాంటి నేరారోపణతో నిందించటానికి వీలులేదు. ముస్లిం వివాహం చట్టబద్ధం కావటానికి  చాలామంది సాక్షులుండాలి. ముస్లిం న్యాయవేత్తలు ఇద్దరు పురుషులు చాలామందితో సమానమని ఒప్పుకుంటారు. అదే స్త్రీల పరంగా ఎంత సంఖ్య ఉన్నా ఒప్పుకోరు.
      ఖురాన్ ప్రకారం అబ్బాయిలకు ఆస్తి ఆడపిల్లలకంటే రెండు రెట్లు సంక్రమించాలి. (4.11-12)
      అసమానత్వాన్ని సమర్థించుకోటానికి, స్త్రీలకు కట్నం లభిస్తుందనీ, భర్త నుండీ, పోషణ హక్కు ఉంటుందనీ చెపుతారు. ముస్లిం చట్టప్రకారం పిల్లలకు ఇవ్వవలసిన బాధ్యత తల్లికి లేదు. పిల్లలపై ఆమె ఖర్చుపెడితే భర్త నుండి అది రాబట్టుకోవచ్చు. కనుక భార్యభర్తలు గృహ ఖర్చుల బాధ్యతలు పంచుకోవడంలో అర్థం లేదు. భర్తకే బాధ్యత అంతా ఉంటుంది. (బాస్క్వే, పుటః 120, పై పుస్తకం)
      ముస్లిం వివాహంలో పరోక్ష ధోరణులు మాత్రమే బాస్క్వే ప్రస్తావిస్తున్నాడు. క్రైస్తవులలో వలె దంపతుల అన్యోన్య సంబంధం లేదు. కట్నంలో స్త్రీ పై పురుషునికి లైంగిక, విడాకుల సంబంధంగా హక్కుల విషయం మరచిపోకూడదు. కట్నాన్ని స్త్రీ తనకే వాడుకోకూడదు. కొత్తగా దంపతులు ఏర్పరచుకున్న గృహాన్ని ఉపయోగ పెట్టుకోటానికి లేక తన తండ్రికి కట్నాన్ని ఖర్చు పెట్టవచ్చు.  మాలికైట్ల ప్రకారం గృహ పరికరాలకు కట్నాన్ని ఖర్చుపెట్టాలి. ముస్లిం చట్టం ప్రకారం వివాహాన్ని రద్దు చేసే హక్కు సంరక్షకులకున్నది. కట్నం చాలలేదనుకుంటే ఈ పని చేయవచ్చు. కనుక కట్నం స్త్రీ స్వాతంత్రానికి బదులు బానిసత్వానికి చిహ్నంగా ఉన్నది.
      స్త్రీ నిర్వహణ హక్కు కేవలం ఆమె భర్త పై పూర్తిగా ఆధారపడటాన్ని భద్రతా రాహిత్యాన్ని  సూచిస్తున్నది. ముస్లిం న్యాయవేత్తల ప్రకారం స్త్రీకి జబ్బు చేస్తే భర్త ఖర్చు పెట్టనక్కరలేదని ఇస్లాం చట్టం చెపుతున్నదన్నారు. ముస్లిం స్త్రీ విమోచన పొందటానికి ఆర్ధిక స్వాతంత్రం తొలిమెట్టు. కనుకనే పురుషాధిక్యతకు అది ప్రమాదమనుకోటం కూడా ఆశ్చర్యం లేదు. తల్లిదండ్రుల బాధ్యత కూడా ముస్లిం స్త్రీలకున్నది. సిరియన్ చట్టం (ఆర్టికల్ 158) లో పిల్లలు తమ తల్లిదండ్రుల పేదరికానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇస్లాం సమాజంలో అమ్మాయి పుట్టుక ఉపద్రవంగానే భావిస్తున్నారు. ఆస్తి సంక్రమణ విధానం ఆమె దీన స్థితికి జోడవుతున్నది. ఒకే ఆడపిల్ల అయితే  తండ్రి ఆస్తిలో సగం సంక్రమిస్తుంది. మిగిలిన సగం తండ్రి కుటుంబంలో మిగిలిన పురుషులకు చెందుతుంది. ఇద్దరూ, అంతకు మించి ఆడపిల్లలుంటే వారికి మూడవవంతు చొప్పున వస్తుంది. అందుకని మగసంతానం కావాలని దంపతులు కోరుకుంటారు. అప్పుడు యావదాస్తీ సంతానానికే సంక్రమిస్తుంది. అమ్మాయి పుట్టినప్పుడు తండ్రి విచారగ్రస్తుడవుతాడు.  సుర 43.15 స్త్రీ భర్తను కోల్పోతే ఆమెకు నాలుగోవంతు ఆస్తి మాత్రమే లభిస్తుంది. చనిపోయిన వ్యక్తికి ఒకరికి మించి భార్యలుంటే ఆ నాలుగో వంతులోనే వారంతా పంచుకోవాలి. ఇస్లాంను రక్తపాతంలో గూడిన పగసాధించే ధోరణికి మద్దతు ఉన్నది. (అశ్చా.పుట.76) సుర 2.178 భక్తులారా, రక్తం చిందించైనా తిప్పికొట్టండి. స్వేచ్ఛాపరుడికి స్వేచ్ఛాపరుడు, బానిసకు బానిస, స్త్రీకి, స్త్రీ  స్వేచ్ఛాపరుడికీ, స్త్రీకి చట్టబద్ధంగా ఒకే స్థాయిలేదని స్పష్టపడుతున్నది. మనుషుల్ని హతమార్చినప్పుడు నష్టపరిహారంగా స్త్రీ పరంగా ఐతే పురుషునిలో సగం మాత్రమే  లభిస్తుందని ముస్లిం న్యాయవేత్తలు నిర్ణయించారు. ఈ నష్టపరిహారాన్ని దియా అంటారు. మాల్ కైట్ల దృష్టిలో స్త్రీకి పురుషుల్లో సగమే లభిస్తుంది. పిండాన్ని పోగొట్టుకున్నప్పుడు నష్టపరిహారం చెల్లించాలని పిండం మగబిడ్డ ఐతే, స్త్రీకంటే రెట్టింపు చెల్లించాలనీ అన్నారు.
      స్త్రీ  పై పురుషుల పెత్తనం, పురుషులకు విధేయతగల స్త్రీ ఉండటం ఖురాన్ లో దివ్యత్వంగా పేర్కొన్నారు.  (సుర 4.34, 2.228)
      పురుషులు వారి వివేచన శక్తివలన, జ్ఞానం వలన, పర్యవేక్షణాధికారాల వలన స్త్రీకంటే అధికులని ముస్లిం న్యాయవేత్తలు నిర్ణయించారు. (అశ్చా. పుటః89) కుటుంబానికి సంబంధించిన ఆర్థిక బాధ్యతలు పురుషుడు నిర్వహిస్తాడు. గనుక స్త్రీపై అతడికి సంపూర్ణాధికారం ఉండటం సహజం అన్నారు. స్త్రీ తన కుటుంబ పోషణకు తన జీతాన్ని ఇస్తున్నా స్త్రీ పై పెత్తనం మాత్రం దైవికంగా లభించిందని చెపుతూ, ఈ న్యాయవేత్తలు సామాజిక స్థితిగతులను విస్మరిస్తున్నారు. ముస్లిం స్త్రీలు ఇంటిపట్టున ఉండాలనీ, బయటికి పోవటం దైవేచ్ఛకు, ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకమనీ అన్నారు. ఒకవైపున ఇళ్ళకు పరిమితం చేస్తూ, బయట ప్రపంచానుభవం స్త్రీలకు లేదని నెపం వేస్తున్నారు. అది ఇస్లాం తర్కం చూడండి.
      ఇల్లు వదలి వెళ్ళిన స్త్రీ ప్రమాదాలను ఎదుర్కొంటుంది. స్త్రీత్వానికి అవి విరుద్దం. స్త్రీ లక్షణాలు జీవతంలో అత్యుత్తమ ధర్మాలు. ఇల్లు వదలి వెళ్ళటం ఇస్లాం నిరసిస్తుంది. దైవానికి ఇది విరుద్ధం. గృహపనులు పరిమితం. అందువలన ఆమె అనుభవం కూడా పరిమితమే. గృహం వెలుపల పనిచేసే పురుషుడు విస్తృతలోకంలో అనుభవాలనూ, విభిన్న సంబంధాలనూ పెంపొందించుకుంటాడు.
      స్త్రీల హక్కులు సుర 2.228లో ప్రస్తావించారు. పురుషాధిక్యత మాత్రం ఎన్నడూ విస్మరించలేదు. ఆహారం, వసతి, వస్త్రాలు, పోషకహక్కులుగా స్త్రీకి ఉండాలి. ఖలీస్ ప్రకారం అవి స్త్రీకి చాలు. అంతకంటే ఏంకావాలి...... హక్కులతో పోల్చితే స్త్రీ విధులు వేరే ఉన్నాయి. ముస్లిం స్త్రీ గృహపనులకు పరిమితం కావాలంటూ కొందరు న్యాయవేత్తలు ప్రవక్తను ఉదాహరణగా హడిత్ ద్వారా ప్రస్తావిస్తుంటారు. ప్రవక్త తన కుమార్తె ఫాతిమాను ఇంటిపట్టున ఉండి గృహ నిర్వహణ చేస్తూ, బయటిపనులు తన భర్త అలీకి అప్పగించనట్లు చెపుతారు. మిగిలిన న్యాయవేత్తల దృష్టిలో కేవలం గృహపనులకే పరిమితం కాక భర్తకు లైంగిక తృప్తి నివ్వటం ఆమె ప్రధాన కర్తవ్యం అన్నారు. ఇస్లాం సాక్ష్యంలో అలఘజాలీ ఈ సంప్రదాయ దృష్టిని వివరించారు.
      పురుషుడు పెళ్ళాడి గృహ కార్యక్రమాలు తనకు చికాకు కలిగించకుండా ఉండాలనుకొంటాడు. వంట, పరిశుభ్రత, పడక ఇందుకు సంబంధించినవి లైంగిక పనిలో నిమగ్నం కాలేని వ్యక్తి ఒంటరిగా ఇంట్లో ఉండలేడు.  ఇంటి పనులు చేస్తే మేథా సంబంధమైన పనులకు సమయాన్ని ఇవ్వజాలడు. గృహపనులు చూసిపెట్టే భార్య, భర్తకు తోడ్పడుతూ, లైంగిక తృప్తిని సమకూరుస్తుంది  (అశ్చా, పుటః 95, 96)
      ధర్మచారిణిగా భార్య దైవానికి కూడా లొంగి ఉండాలి. ఆమె ఐదుసార్లు ప్రార్థన చేయటం, నిరాహార దీక్ష పాటించటం, శీలాన్ని కాపాడుకోటం, భర్తకు లొంగి ఉండటంవలన స్వర్గానికి పోతుందని  హడిత్ పేర్కొంటుంది. ముస్లిం న్యాయవేత్తల ప్రకారం విధేయురాలైన స్త్రీ ఇస్లాం కోసం పోరాడే పురుషులతో దీటుగా ప్రతిఫలాన్ని అందుకుంటుంది.  సంప్రదాయాలలో భార్యల విధేయత ప్రస్తావించారు.
      భర్తను సంతృప్తి పరచి మరణించిన స్త్రీ స్వర్గానికి పోతుంది.
      దైవం కాక, మరొకరిముందు సాష్టాంగపడవలసి వస్తే భర్తలముందు అలా చేయమని స్త్రీలకు ఉత్తరువులిస్తాను. భర్తకు సేవచేయని స్త్రీ దైవానికి తన విధి నిర్వహణ చేయజాలదు.
      భర్తను చూచినప్పుడల్లా సంతృప్తినిచ్చే స్త్రీ ధర్మచారిణి తన శీలాన్ని కాపాడుకుంటూ భర్త పరోక్షంలో అతని ఆస్తిపాస్తులను కాపాడుతూ అతడు కోరినప్పుడు అంగీకరించే స్త్రీ ధర్మచారిణి. గృహకృత్యాలు చేయడానికి నిరాకరించే హక్కు భార్యకున్నది.
      అందువలన ఆమె భర్తనూ, దైవాన్నీ నిరాకరిస్తున్నట్లు అవుతుంది. సైమన్ డిబోర్ ఈ విషయమై ఇలా వ్యాఖ్యానించారు. (ది సెకండ్ సెక్స్, లండన్, 1988, పుటః 632)
      పురుషుడు రాసిన ధర్మచట్టాలకు దైవానుమతి ఉన్నదంటూ అతడు ఎన్నో అవకాశాలనుభవిస్తాడు. స్త్రీపై సార్వభౌమత్వాన్ని చూపుతాడు. అదంతా దైవం తనకిచ్చిన పెత్తనం అంటాడు. యూదులూ, క్రైస్తవులూ, పురుషాధిపత్యాన్ని దైవహక్కుగా చూపారు. అణగారిన స్త్రీ ఏ మాత్రం తిరుగుబాటు చేసినా, అది దైవానికి వ్యతిరేకంగా ప్రస్తావిస్తారు. పురుషాధిక్యత గల ప్రపంచంలో స్త్రీ గౌరవ విశ్వాసాలను చూపుతున్నది.
    భర్తను నిరాకరించే స్త్రీ పై న్యాయమూర్తివద్ద భర్త ఫిర్యాదు చేస్తే ఆమెదే తప్పనీ, విధేయతతో ఉండమనీ న్యాయమూర్తి ఉత్తరువులిస్తాడు. ఉత్తరువులను ఆమె నిరాకరిస్తే బలవంతంగా వాటిని అమలు పరచవచ్చనీ ఈజిప్టు, లిబియా శిక్షాస్మృతులలో ఉన్నది. (ఆ.పుటః100, 101) ఇస్లాంలో స్త్రీని ఇల్లువదలి వెళ్ళగూడదనే ఆంక్ష ఆధారంగా చట్టాలు చేశారు. ఇస్లాం అవిధేయురాలైన భార్యను శిక్షించమంటుంది. (సుర 4.34) ఆలాంటి హక్కు ఆమెకు లేదు. స్త్రీ మాటలు వినవద్దని హెచ్చరికలున్నాయి. ఒక హడిత్ ప్రకారం స్త్రీకి లొంగితే అది విచారానికి దారి తీస్తుందన్నారు. స్త్రీని వ్యతిరేకించటంలోనే వివేచన ఉన్నదన్నారు. స్త్రీకి లొంగిన పురుషుడిని నరకానికి పంపిస్తారని అన్నారు. మతవాదుల ప్రకారం భార్యకు శిక్షలు విధించే హక్కు వివిధ సందర్భాలలో భర్తకున్నది.
1.      భర్తకు అందంగా కనిపించటానికి నిరాకరించినప్పుడు
2.      లైంగిక ఆవసరాలు నిరాకరించినప్పుడు
3.      అనుమతి లేకుండా ఇల్లు వదలటం, లేదా చట్టవిరుద్ధంగా, కారణం లేకుండా ఇల్లు వదలటం
4.      మత విధులను అశ్రద్ధ చేయటం
       
        ప్రవక్త ప్రకారం భార్యను కొట్టవచ్చునని చెప్పినట్లు హడిత్ పేర్కొంటున్నది. మరి కొన్నిచోట్ల భార్యలను కొట్టరాదని మహమ్మద్ చెప్పినట్లున్నది. అలాగైతే ప్రవక్త కొరాన్ కు వ్యతిరేకంగా, దైవనియమానికి విరుద్ధంగా పోయినట్లవుతుంది.
        భర్త ఘోరంగా ప్రవర్తించినప్పుడు భార్యకు గతేమిటి ? పరస్పర అంగీకారాన్ని కొరాన్ అస్పష్టంగా చెపుతుంది. (సుర 4.128) ఆధునిక మతవిజ్ఞానుల ప్రకారం భర్త ఎలా ఉన్నా అతని ఇష్టప్రకారం భార్య ఉండాలి.
ముసుగు (పరదా-బురఖా)
      పరదాను అరబిక్ లో హిజాబ్ అంటారు. (ఆశ్చాః పుట. 123) తెర, పరదా, గోడ, కన్నెపొరలాంటివన్నీ చూడటానికి అడ్డుపడేవాటిని హిజాబ్ అన్నారు. వేరుచేసేది, హద్దులేర్పపరచేది అని కూడా చెప్పవచ్చు. జిల్బా, ఖిబర్ అనే మాటల్ని కూడా ఖురాన్ లో ప్రయోగించారు. ఇస్లాం లోకంలో  ముస్లిం స్త్రీల దుస్తుల్ని గురించి చాలా ప్రస్తావనలున్నాయి. ఇవన్నీ స్త్రీలు పూర్తిగానూ, లేక కొంతవరకూ శరీరాన్ని కప్పేవాటికి సంబంధించినవి.
        ముస్లిం స్త్రీలు విమోచనా పోరాటాలలో ఈ బురఖాను బానిసత్వ చిహ్నంగా భావించారు. 1923లో ఈజిప్టు స్త్రీ విమోచనోద్యమ అధ్యక్షురాలు హోడా చెరోయి, ఆమె సహచరులు తమ బురఖాలను సముద్రంలో పారవేశారు. 1927లో కమ్యూనిస్టు టర్కిస్తాన్లో బురఖా వ్యతిరేకోద్యమం సాగింది. 87 వేలమంది ఉజ్ బెక్ స్త్రీలు తమ నల్ల ముసుగులను తృణీకరించారు.  ఇస్లాంకు ద్రోహం చేసినందుకు అప్పటికే 300 మంది స్త్రీలను చంపేశారు.  1928లో స్వాతంత్రోత్సవ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ షా ముసుగు తొలగించమని తన భార్యను ఆజ్ఞాపించాడు. స్త్రీ విమోచన కార్యక్రమాన్ని విమర్శల దృష్ట్యా విరమించుకోవలసి వచ్చింది. తరువాత అతడు పారిపోయాడు కూడా. 1936లో ఇరాన్ షారెజా ప్రత్యేక ఉత్తరువులిచ్చి సంప్రదాయాలను ఛేదించినా, ప్రజలు సంసిద్ధులు కానందుకు 1941లో ఉత్తరువులను ఉపసంహరించుకోవలసి వచ్చింది.
        ఖురాన్ సుర 33.53, 33.59, 33.32-33 ముసుగు గురించి పేర్కొన్నది.
        24.30-31 స్త్రీలు తమ శీలాన్ని కాపాడుకుంటూ ఆకర్షణీయాల నుండి తప్పుకోవాలి. తమ ముసుగులను ధరించి భర్తలకు తప్ప తమ సున్నితమైన, అందమైన శరీరాన్ని ఎవరికీ కనిపించనీయరాదు.
        ఇస్లాంలో బురఖా, స్త్రీలపై ఆంక్షలు ఉన్నాయి. బెడోయిన్ స్త్రీలు స్వేచ్ఛను అనుభవించారు. భర్తలతోపాటు యాత్రలలో పాల్గొని తప్పనిసరి అనిపించుకున్నారు. ఇస్లాం నగరీకరణ చెందేకొద్దీ ఇదంతా మారిపోయింది. ముస్లింలు అభివృద్ధి చెందిన నాగరికతలను అనుసరించారు. పర్ష్యన్ ల నుండి ముసుగును స్వీకరించారు. బైజాంటైన్లనుండి స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలనేది అవలంబించారు. ఇది ప్రాచీన గ్రీకు ఆచారం. బురఖాను అవలంబించటానికి కేవలం దేవుడు ఉమర్ ఇబన్ అల్ ఖలీబ్ తృప్తికోసం ఉత్తరువులిచ్చాడని ముస్లింలు చెపుతారు. ఒకనాడు ప్రవక్తతో ఉమర్ ఇలా అన్నాడట. నీ ఇంటికి నీ భార్యలవద్దకు భక్తులు సులభంగా వచ్చేస్తున్నారు. భక్తులు తల్లులందరినీ ముసుగు వేసుకోమని  ఎందుకాజ్ఞాపించవు ? అప్పుడు మహమ్మద్ కు దైవ సందేశం వచ్చిందట. మరొక కథనంలో, ఆయేషా చెప్పినట్లు పేర్కొన్నారు. అదేమంటే ఉమర్ ఆమె చేతిని అనుకోకుండా పట్టుకొన్నాడట. క్షమించమని అడిగి నాకే శక్తి ఉంటే నీపై ఎవరూ కన్ను వేయకుండా చూస్తానన్నాడట. చరిత్రకారుడు అల్ తబారి వేరే కథను పేర్కొన్నాడు. ముసుగు అసలు ఉద్దేశ్యం శరీరంలో సిగ్గుభాగాలను కప్పిపుచ్చటం. స్త్రీల విషయంలో శరీరమంతా అలాంటి సిగ్గుతో కూడినదని అన్నాడు. (జఘిదోర్ La Voile et la banniere పారిస్ 1990, పుట 34)
        ముస్లిం న్యాయవేత్తలు పురుషులకు ముసుగు అంటే మోకాళ్ళ నుండీ బొడ్డువరకూ అని పేర్కొన్నారు. భార్యలకూ, ఉంపుడుకత్తెలకూ తప్ప ఆ భాగాన్ని మరెవరికీ చూపరు అన్నారు. స్త్రీల ముసుగును గురించి అభిప్రాయభేదాలున్నాయి. హనీఫైట్ల ప్రకారం స్త్రీ ముఖమూ, చేతులూ మాత్రమే కప్పుకోరాదనీ, అది కూడా ఇతరులను ఆకర్షించనంతవరకూ అనుమతించవచ్చన్నాడు. మిగిలిన    న్నీ వర్గాల దృష్టిలో వైద్య ఆవసరాల నిమిత్తం తప్ప మొఖమూ, చేతులూ కూడా కప్పుకోవలసిందేనన్నారు. హనీఫైట్ల ఉదార ధోరణి వాస్తవమైనది కాదు. (ఆశ్చా. పుటః 126) వృద్ధ స్త్రీలు కూడా ముసుగు వేసుకోవల్సిందే. కొరాన్ 24.60 వృద్ధులు సహితం ముసుగును తొలగించకుండా ఉంటే మంచిది. ప్రోఫెట్ భార్య ఆయేషా చెప్పినట్లు ఒక హడిత్ ను ఉదహరించి మొఖమూ, చేతులూ కప్పుకోకుండా ఉండదలిచినవారు సమర్థించుకుంటారు. ఒకనాడు ఆయేషా సోదరి అబూబకర్ కుమార్తె ఆస్మా ముసుగు లేకుండా ప్రవక్త ముందు ఉన్నది. పెద్దవాళ్ళే ఇలా ఉండాలి అని ఆమెను ఉద్దేశించి అన్నాడు.
        ముస్లిం నిపుణులు ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్త్రీలు చీలమండలం కూడా కప్పుకోవాలని హడిత్ ఆధారంగా  అంటన్నారు. స్త్రీల బానిసత్వానికి ఇది గుర్తు. తండ్రి, సోదరుడు, భర్త ఆమెపట్ల విశ్వాసం చూపకపోవటానికి ఈ ముసుగు ఒక చిహ్నం.. తండ్రి, సోదరుడు వ్యాపార వస్తువుగా పరిగణిస్తున్నారు. కనుక చెక్కు చెదరకుండా అట్టిపెట్టాలను కుంటున్నారు. భర్త దృష్టిలో ఆమెను గృహంలో వినియోగించుకునే వస్తువుగా అలాగే భద్రత కావలసిన సరుకుగా ఉంటున్నది. ఈ ముసుగు విషయం ప్రధాన చర్చనీయాంశమైంది. ఇరాన్ లో స్థితిని గురించి 1992 ఏప్రిల్ లో న్యూయార్క్ టైమ్స్ ఇలా రాసింది.
        13 సంవత్సరాల పోరాటంలో ముసుగు విషయమై జరిగిన చర్చ మరేవిషయంలోనూ జరగలేదు.
      స్త్రీల జుట్టు పురుషులకు ఆకర్షణీయమనీ ఇరాన్ తొలి అధ్యక్షుడు అబోల్ హసన్ బనీ సదరం తొలి రోజుల్లో చెప్పాడు. ముసుగును సరిగా ధరించనందుకు స్త్రీలను అవమానించటం, నిర్బంధించటం, కొట్టటం పరిపాటయింది. దేహమంతా ముసుగు కప్పుకోటం, మెడకు ఒక పట్టీని ధరించటం తప్పనిసరి అయింది.
        స్త్రీలు ఇల్లు వదలి వెళ్ళవచ్చా ? (ఆశ్చా, పుటః 126) ఇళ్ళల్లో ఉన్న స్త్రీలకు గూడా ముసుగు అన్వయిస్తున్నారు. సుర 33.33 ప్రకారం కొరాన్ ఈ విషయమై స్పష్టంగా పేర్కొంటున్నది. ప్రవక్త భార్యలు ఇళ్ళకే పరిమితం కావాలంటున్నది. సంస్కరణవాదులు ఇది ప్రవక్త భార్యలకే పరిమితం కావాలంటున్నారు. మితవాదులు ముస్లిం స్త్రీలందరికి అన్వయించాలంటున్నారు. ఖురాన్, హదిత్ ల ఆధారంగా స్త్రీలు ఇంటిపట్టున ఉండవలసిన విషయాన్ని ఘాజీ అనే మితవాది ప్రస్తావించాడు.
1.            నిజంగా అవసరమైతేనే ఆమె వెళ్ళాలి.
2.            భర్తగానీ, సంరక్షుడు గానీ అందుకు అనుమతించాలి.
3.            చుట్టుపట్ల ఉన్న పురుషులను ఆకర్షించకుండా ముఖంతోసహా అంతా కప్పుకోవాలి. తల వంచుకొని కుడి ఎడమలు చూడకుండా వెళ్ళాలి.
4.            పరిమళ ద్రవ్యాలు వాడకూడదు.
ప్రవక్త ఇలా అన్నాడు. పరిమళగంధం పూసుకొని పురషుల ముందుకు వచ్చిన స్త్రీ వ్యభిచారిణి.
5.            పురుషుల మధ్య రోడ్డుపై నడవకూడదు. ప్రార్థనానంతరం మసీదు వదలి వెళ్ళేటప్పుడు గందరగోళాన్ని చూసి, పురుషుల మధ్య నడిచే హక్కు స్త్రీలకు లేదని ఒక పక్కగా నడవమని ప్రవక్త చెప్పాడు.
6.            వినయంగా ఆమె నడవాలి.
7.            కొత్త వ్యక్తితో మాట్లాడేటప్పుడు సాధారణ ధోరణి అవలంబించాలి.
8.            ఆఫీసులో, షాపులో ఒంటరిగా ఉండరాదు. స్త్రీ, పురుషుల మధ్య ముఖాముఖి మరెవరూ లేనప్పుడు దుర్మార్గపు ఆలోచనలు వస్తాయని ప్రవక్త అన్నాడు.
9.            పురుషులతో కరచాలనం చేయరాదు.
10.        స్త్రీలతో ఉన్నప్పుడు సహితం ఇంట్లో పురుషుడు ఎక్కడైనా ఉంటె ఆమె ముసుగు తొలగించరాదు. సొంత ఇంట్లోనూ, భర్త గృహంలోనూ తప్ప స్త్రీ తన ముసుగును తొలగిస్తే ఆమెకు రక్షణ ఉండదు. అని ప్రవక్త అన్నాడు.
11.        భర్త, బంధువూ వెంటరాకుండా 30 కిలోమీటర్లకు మించి ఆమె ఒకర్తే వెళ్ళరాదు.
12.        పురుషుడిని అనుకరించరాదు.
న్యాయవేత్త ఇల్లు వదలిన స్త్రీ ధరించాల్సిన ముసుగును వర్ణించారు.
1.      మొఖమూ,  చేతులూ తప్ప శరీరమంతా కప్పుకోవాలి.
2.   దుస్తులు సున్నితమైనవీ, అలంకారప్రాయమైనవీ ఉండరాదు.
3.   శరీరం కనిపించే పలుచని వస్త్రాలుగాక దళసరివి ధరించాలి.
4.   శరీరాన్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉండని దుస్తులు ధరించాలి.
5.   సుగంధ పరిమళాలు పూనుకోరాదు.
6.   పురుషుల దుస్తులకు అనుకరణ కారాదు.
7.   కాఫిర్ల దుస్తులను పోలి ఉండరాదు.
8.   విలాసవంతమైన, ఖరీదైన ఆకర్షణీయమైన దుస్తులు కారాదు.
        హరిత్ ల ప్రకారం ప్రకృతికీ విరుద్ధంగా దుస్తులు ఉండరాదని న్యాయవేత్తలు పేర్కొన్నారు. అలాంటివారి ఆడపిల్లల సున్తీని ఖండించటంలేదు. స్త్రీలను వివస్త్రలుగా  అట్టిపెడితే ఇంట్లోనే ఉంటారని ఒక హడిత్ చెపుతున్నది.
        కొందరు సంస్కరణవాదులు సాహసోపేత ప్రయత్నాలు చేసినందువలన స్త్రీలకు విద్యాహక్కులు లభించాయి. స్త్రీలకు విద్యాహక్కులు ఏనాడూ కాదనలేదని మితవాదులు ఇప్పుడు చెపుతున్నారు. ప్రతి ముస్లిం చదువుకోవాలంటున్నారు. పురుషుల ఆధిక్యతకు పెట్టని కోటగా ఉన్న అల్ అజర్ యూనివర్సిటీ 1961లో స్త్రీలను అనుమతించింది. ఇస్లాం పక్షాన వీరు చెప్పేవన్నీ అబద్ధాలే. (ఆశ్చా. పుటః 146) స్త్రీల చదువును నిరుత్సాహపరుస్తూ నిషేధిస్తూ అనేక సంప్రదాయాలున్నాయి. వారిని రాయనివ్వద్దనీ, అసంతృప్తికి పాపాన్ని జోడించవద్దనీ చెప్పారు. స్త్రీల విద్యను ఇస్లాం సమర్ధిస్తే శతాబ్దాలపాటు వారిలా చదువుకోకుండా అజ్ఞానంలో  మగ్గేవారు కాదు. ఇంట్లోనే ఉంటే పరాయి పురుషులతో మాట్లాడటం నిషిద్ధమైతే స్త్రీలు ఎలా నేర్చుకుంటారు ? ముస్లిం మేథావులు ఆమెకు మత విద్య బోధించాలనీ, కుట్లు అల్లిక, గృహపనులూ నేర్పాలంటున్నారు. ఈ విషయంలో ప్రవక్త ఆధారంగా వీరు హడిత్ ను ఉదహరిస్తున్నారు. స్త్రీలకు రాయటం కంటె వడకటం నేర్పమన్నారు. ఇల్లుదాటి పోరాదన్నారు. భార్యగా, తల్లిగా ఉండాలని దైవనిర్ణయం అన్నారు. రసాయన, ఖగోళ శాస్త్రాలకు పోయి స్త్రీ నేర్చుకోటం అమెకూ, ఆమె కుటుంబానికీ వ్యతిరేకం అన్నారు.
        ముస్లిం స్త్రీలు పనిచేస్తే ఇస్లాం చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. (ఆశ్చా, పుటః 16) పురుషులు మాత్రమే పనిచేసి సంపాదించాలి. ఖర్చుపెట్టాలి. భార్యల పోషణ వారి బాధ్యత గనుక  వారిపై సర్వహక్కులూ కూడా భర్తలకే ఉన్నాయి. కొందరు సంస్కరణవాదులు ముస్లిం స్త్రీలకు పనిచేసే హక్కున్నదన్నారు. వీరు చెప్పేపని పరిమితమైనది. ఉపాధ్యాయులూ, నర్సులూ, డాక్టర్లు పనులకే పరిమితమవుతున్నారు. కొందరు డాక్టర్ల ప్రకారం స్త్రీలు తమ మత విశ్వాసానికి అనుకూలంగా ఉన్నంతవరకూ వారి వృత్తిని స్వీకరించవచ్చు. మరికొందరు ఆలోనాపరులు స్త్రీలకు నటన, అమ్మకాలు, విమానాల్లో హోస్టెస్ గా పనిచేయటం నిషిద్ధమంటున్నారు. స్త్రీల పనిని పరిమితం చేయటానికి కొన్ని వాదనలు  ముందు పెడుతున్నారు.  స్వాభావిక రీత్యా తిరిగి ఇంటిపట్టున ఉండి భర్త లైంగిక అవసరాలు తీరుస్తూ పిల్లల్ని పెంచాలంటున్నారు. స్త్రీకి పరిమిత వివేచనాశక్తి ఉన్నదంటున్నారు. బహిష్టు గర్భధారణ, ప్రసవం వలన మానసిక బలహీనత ఉన్నదంటున్నారు.
        స్త్రీ గృహాన్ని వదిలితే పాపంలో పడుతుందని ఈ ఆలోచనాపరుల భయం. స్త్రీ పురుషుల సంబంధాలన్నీ లైంగికానికే వీరు పరిమితం చేస్తున్నారు. స్త్రీ వ్యక్తిగా, హుందాగ, స్వేచ్ఛగా కొనసాగటం ముస్లిం ఆలోచనాపరుల దృష్టిలో దిగజారిపోవటమే.
        ముస్లిం స్త్రీలు అవరోధాలను అధిగమించి గృహపనులు వదిలి చదువుకొని తమ వృత్తులను చేపట్టగలుగుతున్నారు. సమాజంలో కొత్త స్థానాన్ని అర్హమైన రీతిలో పొందగలుగుతున్నారు. 1952లో ఈజిప్టు స్త్రీలు తమ బలాన్ని సమీకరించి ఓటుహక్కు పొంది పార్లమెంటు సభ్యులుగా అయ్యేహక్కును చేబట్టారు. 1952 జూన్ లో అల్అజర్ యూనివర్సిటీ ఉలేమాలు స్త్రీలకు వ్యతిరేకంగా కొరాన్ హడిత్ లను ప్రస్తావించి పార్లమెంటు సభ్యులు కావటాన్ని ఇస్లాం ఖండిస్తున్నదన్నారు. వారింకా ఇలా వాదించారు. (ఆశ్చా, పుటః 174)
1.      స్త్రీలకు తగినంత  మేథాశక్తి లేదు.
2.      స్త్రీత్వం వలన వారు వివేచనా, విజ్ఞత  కోల్పోయే ప్రమాదం ఉన్నది.
3.      ఆబూబకర్ చెప్పిన ప్రకారం పర్ష్యన్లు కోర్సురోన్ కుమార్తెను రాణిగా చేసినప్పుడు స్త్రీకి వ్యవహారాలప్పగించిన ప్రజలు సఫలం కాలేరని ప్రవక్త అన్నాడట.
4.      పదవిలో స్త్రీని నియమించినప్పుడు వైఫల్యం తప్పదు.
5.      ఇస్లాం చట్టం స్త్రీ సాక్ష్యాన్ని పురుషులో సగంగానే భావిస్తుంది.
6.      దైవ నిర్ణయం ప్రకారం స్త్రీ పక్షాన కూడా పురుషులే నిర్ణయించాలని ఖురాన్ చెపుతున్నది.
7.      శుక్రవారాలలో ప్రార్థనలు చేయటానికి పురుషులే మసీదుల్లోకి రావాలనీ, పవిత్ర యుద్ధాలు వారే చేయాలనీ, స్త్రీలు కాదనీ దైవాజ్ఞ చెపుతున్నది.
8.      ఇస్లామిక్ చట్టం ప్రకారం పురుషులు కొన్ని పరిమితులకు లోబడి పదవులు నిర్వహించాలి.
        వీటన్నిటి కారణంగా స్త్రీలను పదవులు చేపట్టటానికీ, పార్లమెంటు సభ్యులు కావటానికి నిషేధిస్తున్నదని పండితులు పేర్కొన్నారు. ఉలేమాల ప్రయత్నాలకు విరుద్ధంగా 1956లో ఈజిప్టు స్త్రీలకు ఓటుహక్కు వచ్చింది. అలాగే ఉలేమాలకు  వ్యతిరేకంగా 1949లో సిరియాలో స్త్రీలు ఓటుహక్కు పొందారు. రాజ్యాధిపతి, సైన్యాధిపతి, ఇమామ్, న్యాయమూర్తి పదవులను స్త్రీలకివ్వరాదని ఇస్లాం చెపుతున్నది.
        ఇస్లాం సంరక్షణ కూడా స్త్రీల హక్కులను పరిమితం చేస్తున్నది. మాలెకైట్లు, షిఫీయైట్లు, హన్ బలెట్లు ప్రకారం చట్టబద్ధంగా యుక్తవయస్సులో ఉన్న స్త్రీ తన వివాహాన్ని తానే నిర్ణయించరాదు. ఆమె సంరక్షకుడే  ఆపని చేయాలి. స్త్రీ తమ సంరక్షకుడి అనుమతితో తన వివాహాన్ని నిర్ణయించవచ్చునని హాన్ ఫైట్లు అంటున్నారు. సంరక్షకుడు ముస్లిం పురుషుడే కావాలి. స్త్రీ కన్నె అయితే వయసుతో నిమిత్తం లేకుండా అమె సంరక్షకుడు తన ఇష్టప్రకారం ఆమెకు పెళ్ళి చేయవచ్చు. హన్ ఫైట్లు ఆమెకిచ్చిన వివాహహక్కు భ్రమపూరితమే. చాలామంది యువతులు ముందే బలవంతంగా వివాహితులయిపోతున్నందున వారే నిర్ణయించుకునే హక్కు కథగానే మిగిలిపోతున్నది. సంరక్షకుడు నిర్ణయించిన వ్యక్తిని అవునూ, కాదూ అని మాత్రమే ఆమె చెప్పవచ్చునని హన్ ఫైట్లు అంటున్నారు. ఆమె స్వయంగా భర్తను ఎంపిక చేసుకునే అవకాశం లేదు. చట్టబద్ధమైన సంరక్షకుడు ఆమెకు భర్తను ఎంపిక చేయటంలో పరిమిత లక్షణాలను పాటిస్తారు. కాని తగిన భార్య కావాలని చెప్పినప్పుడు అందుకు 12 రెట్లు కోర్కెలు కోరతాడు.
        ఇస్లాం విధిస్తున్న నిషేధాల వలన ముస్లిం స్త్రీ  బయటపడి భర్తను ఎంపిక చేసుకునే అవకాశం లేదు. బాల్య వివాహాలు కొనసాగుతున్నవి. ప్రవక్త 53 ఏళ్ళ వయసులో 9 యేళ్ళ ఆయేషాను  చేసుకున్నందున ముస్లిం సమాజం అదే ఆచారాన్ని పాటిస్తున్నది. ఫ్రెంచివారు ఒక శతాబ్దంపాటు పరిపాలించిన అనంతరం కూడా అల్జీరియా ఉత్తరాఫ్రికాలలో బాల్య వివాహాలు జరగటం, తీవ్ర సంఘటనలూ,  మరణాలూ జరుగుతుండడాన్ని 1950లో బాస్క్వే రాశాడు.
        ముస్లిం స్త్రీ ముస్లిమేతరులను పెళ్ళి చేసుకోరాదు. ముస్లింలు తమ భార్యల నుండి వేరుపడవచ్చు. ఎలాంటి  లాంఛనాలూ లేకుండా, వివరణ ఇవ్వకుండా. నష్టపరిహారం చెల్లించకుండా భార్యలను తృణీకరించవచ్చు. తలాఖ్ అని అంటే చాలు. విడాకులిచ్చినట్లే 3సార్లు ఆ మాట అంటే ఖచ్చితంగా విడాకులు  జరిగినట్లే. అలా జరిగినప్పుడు ఆమె తన భర్తవద్దకు రావటానికి వీలులేదు. మరొక భర్త ఆమెను వదిలివేసిన తరువాతనే తిరిగి రావచ్చు. భర్త ఇష్టం వచ్చినట్లు విడాకులివ్వవచ్చు. ఇందుకు కారణాలు చెప్పనక్కరలేదు. ఆమె చెడుగా ప్రవర్తించనక్కరలేదు. తల్లి తన సంతానాన్ని సంరక్షణలో అట్టిపెట్టుకోవచ్చు. కాని ఆమె మళ్ళీ పెళ్లాడదలిస్తే మొదటి సంతానంపై హక్కును కోల్పోతుంది. భర్తకు పిల్లల సంరక్షణ అధికారం ఉన్నచోట, అతడు మళ్ళీ పెళ్ళాడినా లోగడ సంతానంపై హక్కు కోల్పోతాడు. ఇలాంటి పరిస్థితులలో స్త్రీకి భద్రత లేదు. అరబ్బు దేశాలలో  విడాకులు తరచు జరుగుతుంటాయి.  4 స్త్రీలను ఒకేసారి అట్టిపెట్టుకోవటం ఖర్చుతోకూడిన పని గనుక అల్ ఘజాలీ సూచించినరీతిలో తరచూ భార్యలను మారుస్తుంటారు. స్త్రీ విడాకులడిగితే నష్టపరిహారం స్వీకరించి ఒప్పుకుంటాడు. అప్పుడు ఆమెకు కట్నం ఇవ్వనక్కరలేదు. కొరాన్ ఇందుకు అనుమతిస్తున్నది. 2.229.
        వివాహం రద్దుకావటమంటే స్త్రీ కట్నంపై హక్కు కోల్పోయి, తాను స్వీకరించింది తిరిగి ఇచ్చేయాలి. విడాకులు పొందిన స్త్రీ తిరిగి పెళ్ళి చేసుకోవాలంటే 3 సార్లు బహిస్టు అయ్యేవరకూ ఆగాలి. 2.228.
        ఇస్లాంలో స్త్రీ బాధలు ఈడెన్  ఉద్యానవన దురదృష్టకర చర్యలనుండి సంక్రమించాయి. 17 విషయాలలో ఆమెకు ప్రతిబంధకాలున్నాయి.
        సమాజ నాగరికస్థాయిని అందులో స్త్రీ అంతస్తును బట్టి నిర్ణయించవచ్చు. ఇస్లాంకు చాలా స్వల్పస్థాయే ఉన్నది.
      పాకిస్తాన్ లో స్త్రీగా ఉండటం ఘోరం 1990లో ఒక హూటల్లో పురుషుడితో కరచాలనం చేసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్న పాకిస్తానీ స్త్రీ  కర్ట్ షార్క్,,  (గార్డియన్ వీక్లీ సెప్టెంబరు 23, 1990)
        ఈ దేశం మతంతో కలుషితమవుతున్నది.
        పాకిస్తానీ వ్యాపారి, మాజీ విమాన దళాధికారి, (హనీఫ్ ఖురేషీ.  My beautigul Lanndrette and the Rainbow sign,  లండన్, 1986, పుటః 18)
        స్త్రీలకు హెచ్చరిక, వాళ్ళను ముక్కలుగా నరికేస్తాం. భవిష్యత్తులో ఇస్లాంకు వ్యతిరేకంగా నోరెత్తకుండా ఉండేటట్లు ఘోరమైన శిక్ష విధిస్తాం.
        రావల్ పిండిలో నిరసన చూపిన స్త్రీలనుద్దేశించి పాకిస్తానీ ముల్లా (ఖురేషీ, పుటః 22)
        నేడు పాకిస్తాన్ లో స్త్రీలకు గౌరవం లేదు. వారిపట్ల అత్యాచారలు పెరిగిపోయాయి. స్త్రీలను ఇస్లామీకరణ చేశామంటున్నారు. ముస్లింలను ఇస్లామికీకరణ చేయటమేమిటి ? ముల్లాలకు జియా హక్కులిచ్చినప్పటినుండి ఏ స్త్రీనైనా చీల్చి చండాడవచ్చుననుకుంటున్నారు.
        పాకిస్తాన్ లో డెప్యూటీ పోలీస్ సూపరిన్ డెంట్ ఫర్ కందర్ ఇక్ బాల్ (జాక్ గుడ్ విన్ ప్రైస్ ఆఫ్ ఆనర్, బోస్టన్ 1995 పుటః 72)
        1947లో భారతదేశంలో ముస్లింలకు సొంతదేశం కావాలని పాకిస్తాన్ సృష్టించారు. దీని స్థాపకుడు మహమ్మదాలీజిన్నా మతపరమైన వ్యక్తి కాకపోవటం విశేషం. నేటి పాకిస్తాన్ లో ఐతే జిన్నాను కొరడా దెబ్బలు కొట్టేవారే. ఇంగ్లండులో ఉన్న రోజులలో జిన్నా ఇస్లాంకు విరుద్ధంగా  విస్కీ పంది  మాంసం పట్ల ఆసక్తి అలవాటు చేసుకున్నాడు.  సెక్యులర్ రాజ్యం కావాలని తన చివరి ఉపన్యాసంలో   చెప్పాడు.
        మీకిప్పుడు స్వేచ్ఛ ఉన్నది. గుడికీ, మసీదుకూ మీ ఇష్టం వచ్చిన ప్రార్థనా స్థలానికి పాకిస్తాన్ లో పోవచ్చు. మీ మతం, కులం, జాతి ఏదైనప్పటికీ ప్రభుత్వానికి సంబంధంలేదు. అందరం సమాన హక్కుగల పౌరులుగా  ఉంటున్నాం. హిందువులూ, ముస్లింలూ భవిష్యత్తులో హిందువులు, ముస్లింలూ కాకుండా పోవాలని, మతాన్ని వ్యక్తిగతంగా అట్టిపెట్టి పౌరులుగా ఉండాలని అభిలషించాలి.  (ఓల్ పర్ట్ స్టాన్లీ, జిన్నా ఆఫ్ పాకిస్తాన్, ఆక్స్ ఫర్డ్ 1984 పుట 339-40)
        1947 జులైలో ఒక పత్రికా రచయిత జిన్నా నుద్దేశించి పాకిస్తాన్ మత రాజ్యమైతే ఏమవుతుందని అడిగాడు. అందుకు  జిన్నా సమాధానమిస్తూ మత రాజ్యం అంటే ఏమిటో నాకు తెలియదు. నీవు అర్థం లేని ప్రశ్నవేశావన్నాడు. అలాంటప్పుడు పాకిస్తాన్ అవసరం ఎందుకొచ్చింది... భారతదేశంలో ముస్లింలు పాకిస్తాన్ కోరలేదనీ, ముల్లాలూ, భూస్వాములూ చేతులు కలిపి దీనిని సృష్టించారనీ ఎం.జె. అక్బర్ రాశాడు.
        పాకిస్తాన్ ను మత రాజ్యంగా మార్చటానికి భూస్వాములూ, పెట్టుబడిదారులూ కలిసి ముల్లాలకు పెత్తనం ఇచ్చారు. భూస్వాములు తమ ఆస్తి హక్కును పెట్టుబడిదారులు ఆర్థికరంగ ఆదుపునూ అట్టిపెట్టుకోవడానికి ముల్లాలు అనుమతించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో భూస్వామ్యవాదం పెట్టుబడిదారీ వాదం మత రాజ్యం మూలస్తంభాలుగా  నిలిచాయి.  (ఎం.జె. అక్బర్, ఇండియా, ఎ. సీజ్ విథిన్, లండన్, 1985 పుట 31) 1948లో జిన్నా మరణానంతరం ప్రధాని లియాఖత్ అలీఖాన్ సెక్యులర్ రాజ్యాంగాన్ని తయారు చేశాడు. అందులో ప్రజాస్వామ్యం అనే మాటకు ముల్లాలు అడ్డుతగులుతూ వచ్చారు. వారి వత్తిడి వలన ఆ రాజ్యాంగాన్ని ఉపసంహరించారు. 1951లో లియాఖత్ అలీఖాన్ ను కాల్చివేశారు.  ఇందుకు ముల్లాలు మద్దత్తు ఇచ్చినట్లు చెప్పుకున్నారు.
        1971లో అనేక సంవత్సరాల సైనిక పాలన అనంతరం మార్షల్ చట్టపాలకుడుగా జుల్ ఫికర్ అలీ భుట్టో వచ్చి 1972లో ప్రధాని అయ్యాడు. సెక్యులర్ మనస్తత్వం గల భుట్టో ప్రజాస్వామికుడు కాదు. ఆయనకు విస్కీ అంటే ఇష్టం ఉన్నా ముల్లాల వత్తిడి వలన జూదం తాగుడూ నిషేధించి  అహమ్మదీయులను ముస్లిమేతరులుగా ప్రకటించాడు.  1977లో సైనిక కుట్రతో రాజ్యానికి వచ్చిన జియావుల్ హక్ తగినంత ఇస్లామీకరణ జరగటం లేదన్నాడు. ముల్లాలకు తగిన వ్యక్తి లభించాడు.
        జియా మార్షల్ లా విధించి, పత్రికలపై ఆంక్షలు పెట్టి మతరాజ్యాన్ని సృష్టించనారంభించాడు. పాకిస్తాన్ ఇస్లాం ధోరణిలో పోవాలన్నారు. స్త్రీలకు ఆటల పోటీలు నిషేధించాడు. రంజాన్ లో అందరూ ఉపవాసం ఉండాలనీ, తుపాకి చూపి బెదిరించాడు. ప్రజాస్వామ్యానికీ, ఇస్లాంకూ వైవిధ్యం ఉన్నదని ఒప్పుకున్నాడు.  స్త్రీలకు విచక్షణ చూపే ఇస్లాం చట్టాలను ప్రవేశపెట్టాడు. చేతులు నరకటం, వ్యభిచారానికి రాళ్ళతో కొట్టి చంపటం వంటి శిక్షలు  ప్రవేశపెట్టాడు. కొరడా దెబ్బలు కూడా విధించాడు.
        స్త్రీలను చెరిచిన వారిని కాపాడే చట్టాలు అమలులోకి వచ్చాయి. వ్యభిచారంలో నలుగురు ముస్లిం పురుషులు సంభోగం చూచినట్లు సాక్ష్యం చెప్పాలి. స్త్రీలకంటే పురుషుని సాక్ష్యానికే విలువ ఉంటుంది.  కనుక తనను చెరచినప్పటికీ స్త్రీ సాక్ష్యాన్ని తేలేక పోతున్నది. పైగా ఆమెకు గర్భం వస్తే వ్యభిచారం చేసినట్లు ఆమెనే నిందించి,  చెరచిన వ్యక్తి తప్పించుకుంటున్నాడు.
        కొన్ని ఉదాహరణలు (షోర్క్, పైన ఉదహరించినట్లు) పంజాబు రాష్ట్రంలో ఒక నగరంలో ఒక స్త్రీనీ, ఆమె ఇరువురు కుమార్తెలను బట్టలు విప్పి, కొట్టి బాహాటంగా, మూకుమ్మడిగా చెరిస్తే పోలీసులు చర్య తీసుకోలేదు.
        13ఏళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్ళి కుటుంబ స్నేహితుడే చెరిచాడు. అతడిపై ఆమె తండ్రి కేసు పెట్టగా ఆక్రమ సంబంధానికి ఆమెనే జైలుపాలు చేశారు.
        పోలీసులకు లంచం ఇచ్చి బిడ్డను విడిపించుకున్నాడు. కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసినందుకు  ఆమెను చితకబాదాడు.
        లాహోరులో 50 సంవత్సరాల విధవ అహమ్మదీ బేగం ఇరువురు పరదా యువతులను తన ఇంట్లో గదులు అద్దెకిచ్చింది. (గుడ్ విన్, పుటః 49-50) వారికి గదులు చూపిస్తుండగా పోలీసు వచ్చి ఇద్దరు అమ్మాయిలను అక్కడ నుంచొని  ఉన్న అహమ్మదీ బేగం మేనల్లుడినీ అరెస్టు చేశాడు. తరువాత అల్లుడిని వెంట బెట్టుకొని అహమ్మదీ బేగం ఏమి జరిగిందో తెలుసుకోవటానికి పోలీసు స్టేషనుకు వెళ్ళగా, ఆమెనూ అరెస్టు చేసి ఒక గదిలో నిర్బంధించారు. ఆమె నగలను తీసుకున్నారు. ఇద్దరు ఆమ్మాయిలనూ నగ్నంగా రక్తం కారుతుండగా తీసుకవచ్చి విధవరాలి సమక్షంలో చెరిచారు. ఆమె కళ్ళు మూసుకోగా బలవంతంగా చేతులు లాగేసి  ఆ దృశ్యం చూడమన్నారు. తరువాత అహమ్మదీని కూడా బట్టలు విప్పి వరుసగా చెరిచారు. బయటకు లాగి కొట్టారు. ఆమె ముడ్డిలో కారప్పొడి పెట్టారు. భయంతో అరిచి స్పృహ తప్పిన అహమ్మదీ లేచి చూచినప్పటికీ ఇంకా జైలులోనే జినా నేరారోపణతో ఉన్నది. మానవహక్కుల న్యాయవాది ఆమె కేసును చేపట్టగా మూడు మాసాల అనంతరం బెయిలు ఇచ్చారు. మూడేళ్ళ తరువాతగానీ విడుదల చేయలేదు. ఈ లోగా ఆమె కుమార్తెకు అల్లుడు విడాకులిచ్చాడు.
        ఇది కేవలం ఒకే నిదర్శనం కాదు. పాకిస్తాన్ లో మానవహక్కుల కమిషన్ ప్రతి 3 గంటలకు ఒక స్త్రీని చెరుస్తున్నారనీ, ఇరువురిలో ఒకరు పిల్లలు అనీ నివేదిక సమర్పించారు. స్త్రీ కార్యాచరణ సమితి పాకిస్తాన్ లో పోలీసు కస్టడీలో ఉన్న స్త్రీలలో 72 శాతం లైంగికంగా దురవస్థలపాలవుతున్నారని పేర్కొన్నాడు. జైలులో ఉన్న స్త్రీలలో 75 శాతం పై జినా నేరారోపణలున్నాయి. సంవత్సరాల కొద్దీ విచారణ నిమిత్తం వీరు వేచి ఉన్నారు.
        తన భార్యను వదిలించుకోటానికి జినా ఆరోపణ చేస్తే వెంటనే అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నారు. ఈ చట్టాలు రాకముందు జైళ్ళలో ఉన్న స్త్రీల సంఖ్య 70. ప్రస్తుతం 3వేల మంది ఉన్నారు. ఇందులో చాలామంది స్త్రీలు జినా నేరారోపితులే. (షోర్క్)
        సఫియా బీబీ 16 ఏళ్ళ గృహ అంధ సేవకురాలు. ఆమె యజమానీ, అతని కొడుకూ చెరచగా గర్భం ధరించి బిడ్డను కన్నది. ఆమె తండ్రి కేసు పెట్టినా, తగినంతమంది పురుష సాక్షులు లేనందున వారిని వదిలేశారు. సఫియా గర్భం వలన ఆమెపై వ్యభిచార నేరారోపణ చేసి 3ఏళ్ళ జైలుశిక్ష 15 కొరడా దెబ్బలు వేశారు. జరిమానా విధించారు. ఆమె వయసు, గుడ్డితనం వలన తేలిక శిక్ష ఇచ్చానని న్యాయమూర్తి అన్నాడు.  జనం వత్తిడి వలన శిక్ష తొలగించారు. జియా ఇస్లామీకరణ కార్యక్రమంలో స్త్రీలపై దాడులు పెరిగాయి. 1991లో షరియా బిల్లు ఆమోదించటంతో ఇంకా ఆధ్వాన్న స్థితి వచ్చింది. దీనివలన స్త్రీలపై అదుపు పెరిగి న్యాయ విధానం నశించిందని స్త్రీ వాదులు చెప్పారు. దేశంలో అవినీతిని అశ్రద్ధ చేసి, స్త్రీలపై దాడి మాత్రం ఎక్కువ చేశారన్నారు. (గుడ్ విన్, పుట 61)
        బెనజీర్ భుట్టో 1988 నవంబరులో పాకిస్తాన్ ప్రధాని గావటంతో పాకిస్తాన్ లోనేగాక ఇస్లాం ప్రపంచంలో స్త్రీల పాత్ర విప్లవాత్మకంగా మారబోతున్నదని పాశ్చాత్య పత్రికలు నమ్మాయి. ఇస్లాం చట్టం ప్రకారం స్త్రీ రాజ్యాధిపతిగా ఉండటానికి వీలులేదు. 1956లో పాకిస్తాన్ ఇస్లాం రిపబ్లిక్ అయింది. ముల్లాలను కాదని బెనజీర్ భుట్టో నెగ్గుకొచ్చింది. ఆమె ప్రభుత్వం కొద్ది మాసాలే ఉన్నది. 1990లో నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉంటూ స్త్రీకి వ్యతిరేకంగా ముల్లాలను రెచ్చగొట్టాడు.  బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేసి 1990లో ఆమె భర్తను అరెస్టు చేశారు.
        బెనజీర్ భుట్టో ఎన్నికకు ముందు దారుణంగా ఉన్న స్త్రీల స్థితి తరువాత కూడా మారలేదు. ప్రధానిగా ఆమె తనను వ్యతిరేకించిన ముల్లాలను దువ్వి స్త్రీల స్థితికి అనుకూలంగా చర్య తీసుకోలేదు.  పదవిలో ఉండటం తప్ప మరేదీ చేపట్టలేదని బెనజీర్ గురించి నేషనల్ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష స్త్రీ వ్యాఖ్యానించింది. (షోర్క్) పాశ్చాత్య పత్రికలు  ఆశించినట్లు బెనజీర్ భుట్టో  రాడికల్ గా ప్రవర్తించలేదు. ఆమె సంప్రదాయబద్దంగా తలపై కప్పుకున్నది. 1994 సెప్టెంబరులో కైరోలోజరిగిన జనాభా సమావేశంలో  ముస్లిం మితవాదుల పక్షాన మాట్లాడింది. నిరుత్సాహపడ్డ జాతీయసభ సభ్యులు నిరసనగా వ్యాఖ్యానించారు. (షోర్క్)
        పాకిస్తాన్ లో స్త్రీ జీవన ప్రమాణం 51 సంవత్సరాలు కాగా పురుషుల జీవనకాల పరిమితి 52 సంవత్సరాలు. పేద దేశాల్లో సహితం సగటు స్త్రీ జీవితం 61 సంవత్సరాలు. పాకిస్తాన్ లో గర్భకాలంలోనూ, ప్రసవించినప్పుడూ, వేయిలో 6 మంది చనిపోతుంటారు. గర్భనిరోధక పరికరాలను సనాతన ఇస్లాం నిషేధించలేదు.  అయినప్పటికీ పాకిస్తాన్ లో కుటుంబ నియంత్రణ ఇస్లాం వ్యతిరేకమని ప్రకటించాడు. ఇస్లాం తగ్గించటానికి పాశ్చాత్యులు కుటుంబనియంత్రణ ద్వారా కుట్ర పన్నుతున్నారని ముల్లాలన్నారు. పాకిస్తాన్ లో సగటున 6.9 మందిని స్త్రీ కంటున్నది. ప్రాథమిక పాఠశాలల్లో పాకిస్తాన్ లో ఆడపిల్లల సంఖ్య ప్రపంచస్థాయిలో పదో స్థానంలో ఉన్నది. ఆడపిల్లల అక్షరాస్యత రెండు శాతం  మాత్రమే. (ఇకానమిస్ట్, 1994 మార్చి 5) ఇదంతా అధ్యక్షుడు  జియావుల్ హక్ చేసిన ఇస్లాం రిపబ్లికన్ ప్రయత్నాల ఫలితమే. ఇతడు చక్రాన్ని వెనక్కి తిప్పాడు. 1984 చట్టం ప్రకారం స్త్రీ సాక్ష్యం పురుషులలో సగం వంతే ఉంటుంది. (ఎకానమిస్ట్ 1990 జనవరి 13).
        యావత్తు దృష్టి కూడా పురుషుని కంటే స్త్రీని తక్కువగా చూచే ఇస్లాంను బట్టే వచ్చింది. ఆడపిల్ల పుడితే విచారిస్తున్నారు. వందలాది ఆడపిల్లలను మురికి కాలవల్లో చెత్త కుండీలలో, రోడ్ల పక్కన పుట్టగానే పారేస్తున్నారు. ఏడాదికి  5 వందలమంది ఒక్క కరాచీలోనే ఇలా ఉంటున్నారని ఒక సంస్థ తెలిపింది. (గుడ్ విన్, పుట 64)
        పెళ్ళి సందర్భంగా వధువు కట్నం ఏర్పరుస్తాడు. చాలా కుటుంబాలపై ఎక్కువ కట్నం ఇవ్వాలనే ఒత్తిడి వస్తుంది. దీనివలన కుటుంబాలు చితికిపోతున్నాయి. శోభనానికి ముందు కట్నాల ఒప్పందాలు చేసుకుంటారు. ఐనా ఇంకా ఎక్కువ తెమ్మని ఆడపిల్లల్ని కొట్టి ఒత్తిడి చేస్తుంటారు. అప్పటికీ రాకపోతే వధువును తగులబెడుతుంటారు. 1991 లో 200 మందిని కట్నాల చావుకు బలిచేశారు. ఇది బయటకు పొక్కకుండా చూస్తారు. వంటింట్లో సంఘటనలుగా పేర్కొంటారు. పోలీసులు విచారణ జరపరు.
        ఇద్దరు సోదరీమణులను ఆస్పత్రికి తీసుకురాగా వారికి సూర్యరశ్మి తగలక ఎముకలకు వ్యాధి సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. (షోర్క్) పిల్లల తండ్రి వారిని ఇల్లు వదలకుండా నిషేధించాడు. కొన్ని సందర్భాలలో ఖురాన్ ను పెళ్లి చేసుకోటం కుటుంబ వత్తిడివలన జరుగుతున్న సంప్రదాయంగా ఉంటున్నది. సింధురాష్ట్రంలో చాలా కుటుంబాలలో ఆస్తిని బయటకు పోకుండా ఉంచేందుకు కుటుంబ సభ్యులనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందుకు తగినవారు లేనప్పుడు ఖురాన్ ను పెళ్ళి చేసుకునే సంప్రదాయం ప్రవేశపెట్టారు.  వధువును అలంకరించి, విందుచేసి అర్భాటాలు చూపుతారు. కొరాన్ పై చేయి పెట్టి పెళ్ళి చేసుకున్నట్లు ప్రమాణం చేయాలి. జీవితమంతా ఏకాంతంగా గడపాలి. టెలివిజన్ కూడా చూడటానికి వీలులేదు. ఖురాన్ చదువుతూ, చేతిపనులు చేసుకుంటూ ఉండాలి. అలాంటివారు మానసిక రోగులవుతున్నారు. సింధు రాష్ట్రంలో 3 వేలమంది ఖురాన్ పెళ్ళికుమార్తెలు ఉన్నారు. ఈ చిత్రహింసకంటే అరబ్బులు వారి కుమార్తెలను సజీవంగా తగలేసినప్పుడు పుట్టి ఉంటే బాగుండేదని అంటుంటారు.
        1994లో జిన్నా మాట్లాడినప్పుడు తన మాటల అర్థాన్ని గుర్తించలేదు. స్త్రీలు చెంతలేకుంటే ఏ జాతీ పైకి రాదన్నాడు. స్త్రీలను ఇళ్ళల్లో అట్టిపెట్టి దోషాచారాలకు బలి చేస్తున్నామన్నాడు. (ఆర్.అహమ్మద్, సేయింగ్స్ ఆఫ్ ఖెయిదీ ఆజాం జిన్నా. కరాచీ 1986, పుట 98)
        జిన్నా సెక్యులర్ స్థాపకుడైన మత రాజ్యంగా మారింది. ముల్లాల వత్తిడికి పాకిస్తాన్ రాజకీయ వాదులు లొంగిపోయారు. మత మౌలికవాదులు విజృంభించారు. జనంపై వీరి ప్రభావం పాశ్చాత్యులు గుర్తించలేదు. దేవుని పేరిట వీరు జుగుప్సాకర చర్యలను అమలు పెడుతున్నారు. కరాచీలో ముల్లా ప్రేరణతో ఒక వదిలేసిన పసివాడిని జనం రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆక్రమంగా పుట్టాడన్నారు.  కనుక సహించరాదన్నారు. మరొక వ్యక్తిని దొంగ అని ముల్లా చెప్పినందుకు అతని చేతులు నరికివేశారు. సాక్ష్యం లేదు. విచారణలేదు. ముల్లా మాటపైనే ఇదంతా జరిగింది. బెనజీర్ భుట్టో మతస్తులను దువ్వసాగింది. ఆమె అధికారంలో ఉండగా 1992లో చెప్పిన మాటలను గుర్తుచేయవచ్చు.
        పాకిస్తాన్ మానవహక్కులను గౌరవించే ప్రజాస్వామ్యంగా ఉండాలా ? ఇస్లాం వికాస దృష్టి అధిగమించాలా ? లేక మౌలిక మతవాదుల ఆధిపత్యం కొనసాగాలా ? పార్లమెంటు శాసనం చేయాలా ? లేక షరియా చట్టాన్ని ఫెడరల్ కోర్టు అమలు పరచాలా ? వీటికి సమాధానం లేనప్పుడు గందరగోళ స్థితి ఎర్పడి అరాచకం ప్రబలుతుంది.  (Le Monde March 4. 1992)
      పాకిస్తాన్ స్త్రీలు సాహసోపేతంగా తమ హక్కులకోసం పోరాడుతున్నారు. 1981లో ఏర్పడిన స్త్రీల కార్యాచరణ సమితి ఉదూద్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా వీధులలో నిరసనలు తెలిపి వ్యభిచారానికి రాళ్ళతో కొట్టి చంపాలని నిర్ణయానికి విరుద్ధంగా నిలిచారు. మార్షల్ చట్టానికి వ్యతిరేకంగా 1983లో స్త్రీలు ప్రదర్శనలు జరిపారు.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment