నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?

నేను ముస్లింగా ఉండ
ఇబన్ వారక్
9వ అధ్యాయం
అరబ్బు దండయాత్రలు
ముస్లిమేతరుల స్థితి
ముస్లిమేతరులకు తమ రాజ్యంలో సమానత్వం ఉన్నదని ఇస్లాం వాదులు ఒక మిథ్యను వ్యాపింపజేస్తున్నారు. ఇస్లాం రాజ్యంలో వివిధ మతాలవారు సామరస్యంగా ఉన్నట్లు చూపుతున్నారు. పెట్టిన చిత్రహింసలు చూపిన విచక్షణలూ, నిర్బంధ మత మార్పిడులూ, మూకుమ్మడి హత్యలూ, దేవాలయాల ధ్వంసం వాటిని తగులబెట్టడం మొదలైనవన్నీ చెప్పటం లేదు. ఇస్లాంను గురించి ఆకర్షణీయంగా, తప్పుడుగా ప్రచారం చేశారు. 1. అరబ్బుల దండయాత్రలు సందర్భంగా జరిగిన విధ్వంసాన్నీ, మూకుమ్మడి హత్యలనూ పట్టించుకోలేదు. 2. యూదుల క్రైస్తవుల గతిని గురించి దృష్టిపెట్టి, హిందువులూ, బౌద్ధలూ, జొరాస్ట్రియన్ వంటివారి గతిని గాలికి వదిలేశారు. 3. వీటన్నింటికీ ముస్లింల ఆధారాలపై నిలబడ్డారు. 4. ప్రవక్త యూదులపట్ల గౌరవంగా ప్రవర్తించిన తీరును పెడచెవిన పెట్టారు. 5. ఖురాన్ లో పేగన్ వ్యతిరేక యూదు, క్రైస్తవ వ్యతిరేక అసహన ధోరణులు పట్టించుకోలేదు. ఇస్లాం చరిత్రలో ముస్లిమేతరులపట్ల అసహనానికి అవే మూలాధారాలు.
తొలి ధోరణులుః మహమ్మద్- కొరాన్
ఖురాన్ లో పూర్వార్థ, ఉత్తరార్థ సురలు వరుసగా మక్కా, మదీనాకు చెందినవి. మహమ్మద్ సహన ధోరణి మక్కా సురాలలో వ్యక్తమయింది.
      109 : నమ్మకంలేనివారా, మీరు ప్రార్థించేవాటిని నేను ప్రార్థించను. నేను ఆరాధించేవాటిని మీరు ఆరాధించరు. మీది మీ మతం, నాది నా మతం.
      50.45 కాఫిర్లు చెప్పేదేమిటో మనకు తెలుసు. వారిని వత్తిడి చేయనక్కరలేదు.
      43.88, 89 :  ఓ దేవా వీరు నమ్మకంలేని వారు. వారిని సహించి వారికి శాంతి చేకూరాలని కోరండి. చివరిలో వారి తప్పు తెలుసుకుంటారు.
      సుర 2 లో ఉన్న మినహాయింపులు మదీనా కాలానికి చెందినవి.
      2.256 :  మతంలో వత్తిడి లేదు.
      2.62  :  ముస్లింలను నమ్మేవారూ, యూదు గ్రంథాలు అనుసరించేవారూ, దేవుడిలో నమ్మకం ఉన్న క్రైస్తవులూ, సెబియనులు దేవుని వద్ద ప్రతిఫలం పొందుతారు. వారు భయపడనక్కరలేదు. దుఃఖించనక్కరలేదు.
      రాజకీయ సైనిక శక్తి పెంపొందేకొద్దీ మహమ్మద్ నచ్చచెప్చే స్థితి నుండి నిర్దేశించే స్థాయికి మారారు. సుర 2, 4, 5, 8, 9, 22, 47 మహమ్మద్ మదీనా కాలపు అసహనాన్నీ, మొండి వాదనను సూచిస్తాయి.
      మహమ్మద్ కాలంలో అరేబియాలో ఇతర విగ్రహారాధకులకు ఎలాంటి సహనమూ చూపలేదని ముస్లిం మతవాదులు ఏకగ్రీవంగా పేర్కొన్నారు. ఇస్లాంను ఒప్పుకోవాలి. లేదా, చావుకు సిద్ధపడాలి. ఇస్లాంను గురించి ఉదాసీనంగా మాట్లాడేవారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం మీద కొరాన్ లో నమ్మకంలేని వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలూ చూపలేదు.
      22.9  :  నమ్మకంలేని వారి బట్టలు కాల్చి వారి మీద వేసి, సలసల కాగే నీరు వారితలలపై పోసి పేగులూ, చర్మం కరిగించి, ఇనుపచువ్వలతో శిక్షిస్తారు.
      ముస్లింలు నమ్మకం లేనివారితో పోరాడి చంపాలని ఖురాన్ చెపుతున్నది.
      47.9  :   నమ్మకంలేనివారిని కలిసినప్పుడు తలలు తీసేయి. తగినంతమంది హతమార్చిన తరువాత మిగిలిన వారిని బందీలు చేయి.
ఖురాన్ లో క్రైస్తవులూ, యూదులూ
    యూదులకంటే క్రైస్తవులు కొంత మెరుగుగా చూచినా, పవిత్రగ్రంథాలను తప్పుడు త్రోవ పట్టించారని కొరాన్ వారిని గర్హించింది.
      5.75  :  ముగ్గురిలో దేవుడు ఒకడు అని కాఫిర్లు చెపుతారు. కాని దేవుడొక్కడే. వారు చెపుతున్నది మానకపోతే తీవ్రశిక్ష అనుభవిస్తారు.
      జీసస్ ను దేవుడు కుమారుడుగా ప్రార్థించటం గర్హనీయం. యూదులవలె వీరూ ప్రక్కత్రోవను పట్టారు. నిజమైన మతం ఇస్లాంలోకి వారిని తిరిగి తీసుకురావాలి.
      ఖురాన్ ప్రకారం యూదులు నిజమైన ముస్లింలందరినీ ద్వేషిస్తారు. వారి పాపాలకు శిక్షగా గతంలో కొందరు యూదుల్ని పందులుగా, కోతులుగా మార్చారు. (సుర. 5.63) మిగిలినవారిని పెడరెక్కలు విరిచి మెడకు కట్టి తీర్పునాడు నిప్పుల్లోకి తోస్తారు. యూదులపట్ల ముస్లింల ధోరణి అవగాహనకూ, సహనానికీ, సహజీవనానికీ దారితీసేదిగా లేదు.
      5.51  :  యూదులనూ, క్రైస్తవులుగా స్వీకరించవద్దు. వారు పరస్పరం స్నేహితులే. మీరెవరైనా వారిని స్నేహితులుగా స్వీకరిస్తే వారిలో చేరిపోయినట్లే. దేవుడు దోషులకు మార్గగామి కాడు.
      5.56-64ః కాఫిర్లను స్నేహితులుగా స్వీకరించవద్దు. యూదులూ, క్రైస్తవులను, ముఖ్యంగా మీ మతాన్ని వెక్కిరించేవారిని స్వీకరించవద్దు. నమ్మకం ఉంటె నీ దేవుడికి భయపడు. ప్రార్థన చేసేటప్పుడు ఆనందించే ఇతరులను దగ్గరగా చేరనీయవద్దు. అలాంటి వారికి అవగాహన లేదు. వారితో ఇలా చెప్పు. మేము దేవుణ్ణి నమ్ముతున్నందుకే మమ్మల్ని దూషిస్తున్నారు. మీరంతా పాపాత్ములు కాదా  ?
      వారి చట్టాలు పాపపు మాటలు ఎందుకు అనుమతిస్తారు ?  అక్రమ ఆహారాన్ని ఎందుకు తింటారు ? వారి పనులన్నీ చెడ్డవే. యూదులు దేవుని హస్తాలు బంధించి శాపానికి గురిచేస్తారు. కొరాన్ లో యూదులను పవిత్ర గ్రంథానికి అడ్డువచ్చిన వారుగా నిందించారు.
      9.26.30. దేవుణ్ణి, తుది రోజూనూ నమ్మనివారిపై యుద్ధం ప్రకటించు. దేవుడూ, అతని దూతలూ నిషేధించిన వాటిని పాటించకపోతే వాటిని వెలివేయి. ఇస్లాంను నిజమైన మతంగా గుర్తించినంతవరకూ పోల్ పన్ను వేసి పూర్తిగా లొంగదీసుకో.
      ఎజ్ర దేవుని కుమారుడుగా యూదులు, దివ్యదూత దేవుని కుమారుడని క్రైస్తవులూ అంటారు. అలాంటి భ్రాంతిలో ఉన్నవారిపై యుద్దం జరుపు.
      వారికి  ఏ శిక్ష ఇచ్చినా సరిపోతుంది.
      2.61 : యూదులపై నీచత్వాన్నీ, దారుణ విషయాలనూ ఆపాదించారు. వారు దైవాగ్రహానికి గురయ్యారు. వారు దైవచిహ్నాలను నమ్మలేదు. తిరగబడిహద్దులు దాటారు.
      4.160, 161  : కొందరు యూదులు కుటిలత్వంగా ఉండటం, దైవచింతనకు దూరంగా ఉండటం వలన వారికి సంపూర్ణ ఆహారాన్ని అనుమతించరాదు. నిషేధించినా వినకుండా, వడ్డీలు తీసుకునే యూదులు తీవ్రశిక్షలకు సిద్దపడాలి.
      ఖురాన్ లో యూదులపట్ల అలాంటి భావాలు వెల్లడి కావటం, ముస్లింలందరూ దానిని దైవవాక్యంగా నమ్మటం, సర్వకాల సర్వావస్థలయందు అవి నిజమని చెప్పటం విమర్శకు అతీతమైనదని భావించటం జరుగుతున్నది.
      యూదులపట్ల మహమ్మద్ ప్రవర్తన మర్శకతీతమైంది కాదు. 900 వరకూ బాను ఖొరాయిజాలను హతమార్చటం, నాదిర్ లను బహిష్కరించి, చంపటం హుందాతనమూ కాదు. దయామయమూ కాదు. ఖేబర్ వయాసిస్ ప్రాంత యూదులను మహమ్మద్ చూచిన తీరు ఇతర అరబ్బులకు అనుసరణీయమైంది. 628లో వయాసిస్ పై దాడిచేసిన మహమ్మద్ అక్కడి తెగవారి సంపదను కనుగొనటానికి  వారి నాయకులను చిత్రహింసలు పెట్టారు. లొంగిపోయిన యూదులు పంటలో సగం ఇవ్వటానికి ఒప్పుకుంటేనే సాగుకు అనుమతిస్తామన్నారు.  ఆ ఒడంబడికను రద్దు చేసి యూదులను బహిష్కరించే హక్కు మహమ్మద్ అట్టిపెట్టుకున్నాడు. దీన్ని ధిమ్మిస్ అంటారు. అది అంగీకరించినవారిని ధిమ్మీలు అంటారు. ముస్లింల ఆధిపత్యాన్ని ఒప్పుకొని, ముస్లింల రక్షణలో కప్పం చెల్లించే ముస్లిమేతరులను ధిమ్మీలన్నారు.
      640లో రెండవ ఖలీఫా ఉమర్ యూదులనూ క్రైస్తవులనూ మక్కా, మదీనా ప్రాంతాలనుండి బహిష్కరించారు. ఇందుకు ప్రవక్తను ఉదాహరణగా చూపాడు. నేటికీ సౌదీ అరేబియాలో ఇస్లాంకాని మరొకమతం నిషిద్ధం.
జిహాద్
      డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, జీహాద్ పై వ్యాసం, పుటః 243.
    ఇస్లాం నియంతృత్వ స్వభావం పవిత్రయుద్ధం భావనలో కనిపించినంతగా మరెందులోనూ ఉండదు. ప్రపంచం యావత్తూ జయించి, అల్లాకు లొంగిఉండేటట్లు చేయాలని దీని ఉద్దేశం, ఇస్లాంలో మాత్రమే సత్యం సాధ్యం. వెలుపల విమోచన లేదు. కొరాన్ లో, సంప్రదాయాలలో చెప్పిన మత విధి ప్రకారం మానవులందరినీ ఇస్లాంలోకి తీసుకరావటం పవిత్ర కర్తవ్యం. జిహాద్ దైవసంస్థ, ఇస్లాంకోసం దీనిని ఉద్దేశించినారు. ముస్లిములు దేవుడి పేరుతో పోరాడాలి. చంపాలి.
      9.5-6 :  దేవుడితో ఇతర దేవుళ్ళను చేర్చినవారిని ఎక్కడ కనిపించినా చంపివేయి.
    4.76 :   నమ్మేవారు దైవ కార్యానికై పోరాడతారు.
    8.12  :   కాఫిర్ల గుండెలలో భయం ప్రజ్వరిల్లింపజేసి, తలలు నరికి ముక్కలు చేస్తాం.
    8.39-42  : కాఫిర్లు వారి అపనమ్మకాన్ని వదులుకుంటే, వారి గతం క్షమించబడుతుంది. లేదా, వారి పూర్వీకులగతే వారికీ పడుతుంది. వారిపై పోరాడి దైవమతాన్ని నిలబెట్టాలి.
    2.256 : నమ్మేవారూ, దేవుడికోసం పోరాడేవారూ దేవుని దయకు పాత్రులవుతారు. అపనమ్మకస్తులపై పోరాడటానికి ముస్లింలు వెనుకంజ వేయటం పాపం. అలాంటివారు నరకంలో మాడిపోతారు.
8.15, 16  : నమ్మకం లేని వారిని కలిసినప్పుడు వెనుకంజ వేయవద్దు. అలాచేస్తే దైవావికి ఆగ్రహం వస్తుంది. వారిల్లు నరకమవుతుంది
9.39    :    పోరాడకపోతే దేవుడు నిన్ను శిక్షించి నీ స్థానంలో ఇతరులనుంచుతాడు.
        ఇస్లాంకోసం పోరాడేవారికి స్వర్గసుఖాలున్నాయి.
4.74 :   ఈ జీవితాన్ని తాకట్టు పెట్టి రానున్న సుఖాలకోసం పోరాడాలి. దేవునికోసం పోరాడేవారు మరణించినా, జయించినా, ఫలితాలు అత్యున్నతంగా ఉంటాయి.
      ఖురాన్ నైతిక పోరాటాలను, సూత్రప్రాయంగా యుద్ధాలను చెప్పటంలేదు. నిజమైన రణరంగాలను పేర్కొంటున్నది. పవిత్రగ్రంథంలో అలాంటి రక్తపాతాన్ని కోరడం దిగ్భ్రమ కలిగించే విషయం.
      మానవులంతా ముస్లింలు, ముస్లిమేతరులు మాత్రమే. ముస్లింలు ఇస్లాం సమాజానికి చెందినవారు. అందులో ఇస్లాం సూత్రాలు పుర్తిగా ఆచరణలోకి వస్తాయి. వారిని ఉమ్మా అంటారు. వారి ప్రాంతాన్ని దారుల్ ఇస్లాం అంటారు. ముస్లిమేతరులను హర్బీ అంటారు.  వారి ప్రాంతాన్ని దారుల్ హర్బ్ అంటారు. కాఫిర్లకు చెందిన భూములూ, ఇస్లాంలోకి మార్పు వలనగానీ, యుద్ధం వలనగానీ తీసుకురావచ్చు. దారుల్ హర్బ్ ఈ చర్యలను అనుమతిస్తుంది.
      హర్బీ యుద్ధఖైదీ అవుతాడు. అతడిని పరిస్థితులనుబట్టి ఇమామ్ ఎలాగైనా వాడుకోవచ్చు. ఇస్లాం సైన్యాన్ని నిరోధించే నగరానికి కష్టాలు తప్పవు. ఆ నగరవాసులకు ఎలాంటి హక్కులూ ఉండవు. (ది ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ లో సర్ స్టీవెన్ రూంచిమన్) ఇలా రాశాడు.
      దండెత్తిన సైన్యం 3 రోజులపాటు పూర్తి దోపిడీ చేసింది. ప్రార్థనామందిరాలు నాయకుడి వశమయ్యాయి. వాటిని ఎలాగైనా వినియోగించవచ్చు. 1953లో కాన్ స్టాంటినోపుల్ పతనమయిన తరువాత సుల్తాన్ మహమ్మద్ అతని సైనికులూ నగరంలో విచక్షణా రహితంగా, స్త్రీ, పురుషులనూ, పిల్లల్ని చంపేశారు. రక్తం ఏరులైపారింది. కాని ఆక్రమించుకున్న తరువాత బందీలు, విలువైన వస్తువులూ చాలా లాభాలను చేకూరుస్తాయని సైనికులు గ్రహించారు. (ఎస్. రూంచిమన్, ది ఫాల్ ఆఫ్ కాన్ స్టాంటినోపుల్, 1953, కేంబ్రిడ్జి, 1990,  పుటః 145)
      కొన్ని సందర్భాలలో యుద్ధానంతరం కొందరిని బానిసలుగా అమ్మేయటం, లేదా తక్కువ స్థాయి పౌరులుగా చూస్తూ వారినుండి కప్పం గట్టించుకోటం సాధారణమైపోయింది.
ఇస్లాం దండయాత్రలు
ఆర్థిక శాస్త్రవేత్త బోసెఫ్ షుమ్ పీటర్ (1883-950) ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బాస్క్వే ఫ్రెంచినుండి అనువదించాడు.
షుమ్ పీటర్ అరబ్బులను దోపిడీచేసే సైనిక జాతిగా స్థిరపడిన జనాన్ని దోపిడీ చేసే సైనికులుగా వర్ణించాడు. ఇస్లాం ఒక యుద్ధయంత్రాంగం వంటిది. అది ఆగకుండా సాగిపోతుంది. సైనిక మతవాదంలో యుద్ధం సాధారణ కార్యక్రమంగా ఉన్నది. యుద్ధానికి ఎలాంటి కారణం అరబ్బులకు అవసరం లేదు. వారి సాంఘిక వ్యవస్థకు యుద్ధం కావాలి. జయాలు లేకుంటే ఇస్లాం పతనమవుతుంది. గతంలో అవసరాన్నిబట్టి పుట్టిన ఒక సిద్ధాంతం ఎలాంటి లక్ష్యమూ లేకుండా విస్తరిస్తూ పోతున్నది. ఇస్లాం లేకుండా కూడా అరబ్బు దండయాత్రలుండవచ్చు. అరబ్బు సామ్రాజ్యవాదాన్ని ప్రవక్త మాటలతో వివరించవచ్చు. వినయం, నమ్రత ఉంటే మహమ్మద్ జయించేవాడు కాదు. అరబ్బు సైనికులకు జయించిందంతా వాస్తవం. అపజయాలన్నీ అబద్దాలు. కనుక మతం అనేది యుద్ధాలకు కారణం కాదు. అదోక పోరాట స్వభావం.
      ఇస్లాం నాయకులు తొలుత మతం పట్ల ఆసక్తి చూపలేదు. బైజాంటియన్లపై జయించిన సైనికాధిపతి ఖాలిద్ యుద్దం తప్ప మరేదీ కోరలేదు. ఈజిప్టును జయించిన అమర్బ్ అలస్, ఉస్మాన్ తల్లా దండయాత్రల వలన విపరీతంగా అర్థించారు. మక్కా నివాసులు ప్రవక్త మహమ్మద్ మదీనాను పట్టుకోలేనప్పుడు ఈ విషయాన్ని బాగా గ్రహించాడు. మక్కాను వశపరచుకోకముందు ఖలీద్ బల్ వాలిద్ ఓత్మన్ తల్వా, అమర్ బ్ అలస్ ఇస్లాంలో చేరిపోయారు. వీరు చేరటానికి ప్రాధాన్యత ఇవ్వరాదు.
తొలి దండయాత్రలు
      జెరూసలేంకు చెందిన సోఫ్రోనియస్ దండెత్తివచ్చినవారిని ఆటవికులుగా పేర్కొన్నారు. వారు మందిరాలు తగులబెట్టారు. శిలువలను నాశనం చేశారు.  క్రీస్తుకు వ్యతిరేకంగా దారుణంగా ప్రవర్తించారు. 639లో కరువు వలన, ప్లేగ్ వలన వేలాదిమంది చనిపోయారు. అందుకు కారణం సైనికుల దోపిడీ, విధ్వంసమే.
      ప్రవక్త మరణానంతరం సిరియాపై అబూబకర్ దండయాత్ర చేశాడు. 634లో గాబ, సిసారియా మధ్య ఉన్న ప్రాంతాన్ని నాశనం  చేశారు. క్రైస్తవులూ, యూదులూ, సమరిటనులను చంపేశారు. 635-642 మధ్య మెసపుటేమియాలో మఠాలను నాశనం చేసి, స్వాములను చంపేసి మోనోపిసైట్ అరబ్బులను హతమార్చారు. లేదా మతం మార్చారు. ఎలామ్ లో జనాన్ని కత్తికి బలిచేశారు. సుసాలో పేరుపొందిన వారందరికీ ఆగతేపట్టింది.
      ఈజిప్టు దండయాత్ర చేసిన అమర్ అలస్ విషయమై 693-700 మధ్య బిషప్ నికుయూ రాశాడు. ముస్లింల భారం మోయరానిదైంది. ఈజిప్టులో ప్రవేశించిన అమర్ బెనీసాను ఆక్రమించుకొని నివాసులను చంపేశాడు. వృద్ధలనూ, స్త్రీలనూ, పిల్లలనూ కూడా వదిలిపెట్టలేదు. (బాత్ యార్, Les Christientes D’orient Entre Jihad dt Dhimmistude, 7-20 Siecie Paris, 1991, పుటః 317-18)
      ఫాయుమ్, అబోయత్ లకు అదేగతి పట్టింది. నికుయూలో జనాభా అంతటినీ నరికేశారు. సిలీసియావాసులను బందీలుగా పట్టుకొన్నారు. అర్మీనియాలో యుకైటా జనాభాను తుడిచిపెట్టారు. అరబ్బులు ఇస్లాంను ఆమోదింపచేయటానికి అసీరియా వాసులను పెట్టిన బాధల్ని 7వ శతాబ్దం చరిత్రలు వివరించాయి. దరాన్ జిల్లాలో ఘోరాలు చేశారు. 642లో డ్విన్ నగరాన్ని నాశనం చేశారు. 643లో మళ్ళీ వచ్చి బానిసత్వాన్ని ప్రవేశపెట్టారు. మువియ ఏహ్యంగా సైప్రిస్ ను దోపిడీ చేసి చాలామందిని చంపేసి తన పెత్తనాన్ని స్థాపించాడో, మైకేల్ వివరించాడు. అతడు సిరియాకు చెందినవాడు.
      ఉత్తర ఆఫ్రికాలో ఇలాంటి మారణకాండ సాగింది. 643లో ట్రిపోలీని దోపిడీ చేశారు.  కార్తేజ్పై దాడిచేసి నివాసుల్ని చంపారు. అనటోలియా, మెసపటోమియా, సిరియా, ఇరాక్, ఇరాన్ లలో అలాంటి ఘట్టాలే జరిగాయి.
ఇండియా
      బలాధురి రాసిన దానిని బట్టి సింధుపై దండయాత్ర జరిపినప్పుడు అరబ్బులు మూకుమ్మడిగా హత్యలు చేశారు.
      (సి.యి.బాస్వర్త్,ది కాన్ సెప్ట్ ఆఫ్ ధిమ్మీ ఇన్ ఎర్లీ ఇస్లాం, ఎడిటెడ్, బెంజమిన్ బ్రాడే అండ్ బి.లి.వీస్. క్రిస్టియన్స్  అండ్ జ్యూస్ ఇన్ అలోమన్ ఎంపైర్, 2. సంపుటాలు, న్యూయార్క్, 10982, పుటః 43)
      ఇరాక్ గవర్నర్ హజాజ్ ఆలోచనతో ముస్లింలు సింధును జయించారు. క్రీ.త. 712లో మహమ్మద్ కాసిం సైన్యాధిపతిగా ఈ చర్య జరిపారు. కాసిం ఉత్తరువులు ప్రకారం కాఫిర్లను నాశనం చేస్తూ ఇస్లాంకు లొంగిపోయి చేరిపోయేవరకూ చిత్రహింసలు పెట్టాలన్నారు.
      (చచనామా, ఏన్ ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ సింధీ, కరాచీ, 1900, పుటః 155 పర్ష్యా నుండి మీర్జా ఖాలీక్ బేగ ఫ్రేడుల్ బేగ్ అనువాదం)
      డేబాల్ కోటను వశపరుచుకున్న తరువాత 3 రోజుల్లో నివాసులందరిని చంపేశారు. పిమ్మట కాశిం సహనం చూపి తమ తమ వృత్తులూ, మతం పాటించుకోమన్నాడు. కాశిం గెలుపు నివేదిక అందిన తరువాత అతడి సహనంపై హజాజ్ ఇలా స్పందించాడు.
      నీ ఉత్తరం చూచి నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నీ ఖ్యాతి అత్యున్నత దశకు పోయింది. చట్టబద్దంగా, ఖచ్చితంగా నిబంధనలు అమలు పరుస్తున్నట్లు నీ ఉత్తరం తెలుపుతున్నది. కాని శత్రువులకూ, మిత్రులకూ విచక్షణలేకుండా నీవు క్షమాభిక్ష పెడుతున్నావు. కొరాన్ లో దేవుడు ఇలా అన్నాడు. 47.4 నమ్మకం లేనివారితో తారసిల్లినప్పుడు, వారితలలు నరికివేయి. దేవుడు ఉత్తరువును గౌరవించి పాటించాలి. శత్రువులను క్షమించవద్దు. నిన్ను బలహీనుడనుకొంటారు. (93 సంవత్సరంలో నపియా లేఖ)
      హజాజ్ ఇదే విషయాన్ని మళ్ళీ రాశాడు. నా ఉత్తరువుల ప్రకారం ఎదురు పోరాడేవారినందరినీ చంపి, వారి పిల్లల్ని బందీలుగా పట్టుకోవాలి. కాశిం విధేయుడుగా బ్రామ్మినాబాద్ కు చేరుకోగానే 6 వేలమందిని నరికిచంపాడు. కొందరు ఈ సంఖ్యను 16 వేలుగా చెపుతున్నారు. మిగిలినవారిని క్షమించాడు.
మహమ్మద్ ఘజనీ (971-1030)
    11వ శతాబ్దం తొలి దశలో ఇండియాపై ముస్లింల దండయాత్ర ప్రారంభమైంది. టర్కో ఆఫ్ఘన్ సామ్రాజ్యనేత ఘజనీ మహమ్మద్ తొలుత సుడిగాలిలా ఇండియాకు వచ్చి దోపిడీలు మూకుమ్మడి హత్యలూ, విధ్వంసం సాగించారు. ఇందుకు కొరాన్ ను  అడ్డం పెట్టుకున్నాడు. ఏటా అలాగే చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విన్ సెంట్ స్మిత్ ప్రకారం ఘజనీ శత్రువులను చంపటంలో, సంపదను దోచుకొని తీసుకెళ్ళటంలో తృప్తిపొందేవాడు. అతని వెంట వచ్చిన అల్బరూనీ పండితుడు 17 దండయాత్రలను గురించి చెపుతూ, సంపదను దోచుకొని, దేశసౌభాగ్యాన్ని నాశనం చేసి, హిందువులను చిన్నాభిన్నం చేశాడు. ఆ చర్యలు చూచినప్పుడు ముస్లింల పట్ల వారికి ఏవగింపు మిగిలింది. (అల్బరూనీ, ఇండియా, అనువాదం, నచావ్, లండన్ 1914, పుటః 22)
      మహమ్మద్ గజనీ పంజాబ్ లోని జయపాల్ రాజును లోబరచుకొని క్రీ.శ. 1,004లో ముల్తాన్పై దాడి చేశాడు. ఘుర్ జిల్లాలో నివాసుల్ని ఇస్లాంలోకి మార్చాడు. కాంగ్రా అని పిలిచే దోపిడీ సొమ్మును హిందూ దేవాలయాల నుండి మహమ్మద్ దోచుకుపోయారు.
      మధురానగరంలో వర్ణనాతీతమైన పెద్ద దేవాలయం ఉన్నది. దానిని నిర్మించటానికి 200 ఏళ్లు పడుతుందని సుల్తాన్ మహ్మద్ అన్నాడు. అందులోని విగ్రహాలు బంగారం ఇతర విలువైన ఆభరణాలతో ఉన్నాయి. ఆ దేవాలయాలన్నింటినీ తగులబెట్టి, నేలమట్టం చేసి చూపాలని సుల్తాన్ ఉత్తరువులిచ్చాడు. ప్రాచీన భారతంలో అత్యున్నతమైన శిల్పసంపదంతా ఇలా నాశనమైంది. (వి.ఎ., స్మిత్, ది ఆక్స్ ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ, 1985 పుట 207)
      సోమనాథ్ యుద్ధంలో 50 వేలమందిని చంపి మహమ్మద్ గజనీ సంపదను దోచాడు. ముల్తాన్ దావూద్ ను చాలా కర్కశంగా చూచాడు. అతని రాజ్యాన్ని జయించి, 1010లో చాలామందిని చంపేశాడు. ఇస్లాం గొప్పతనాలలో ఇతన్ని ముస్లిం చరిత్రకారులు చేర్చినా వాస్తవానికి మహమ్మద్ ఎలాంటి అభినందనలకూ అర్హత లేని దోపిడీదారుడు.
ఫెరూజ్ షా
    1351లో సింహాసనాన్ని అధీష్టించిన ఫెరూజ్ షా ఉత్తర భారత దేశాన్ని పరిపాలించాడు. ఇతడు వికాసవంతుడైనా మత విషయాలలో ప్రవక్త నియమాలను ఆదర్శంగా పెట్టుకున్నాడు. 1 లక్ష 80 వేలమంది బానిసలను ముస్లింలుగా మార్చి పెట్టుకున్నాడు. మతపరంగా ఇతడు క్రూరుడని విన్సెంట్ స్మిత్ రాశాడు. (పై పుస్తకం, పుట 258, 59) షియాలను బంధిచాడు. కొంతమందిని చంపాడు. వారి పుస్తకాలు తగలేశాడు. మహదీగా చప్పుకుంటున్న అతనిని ఒక ఉలేమాతో చంపించాడు. హిందువుల మత ఉత్సవంలో పాల్గొన్న ముసల్మానులను ఫెరూజ్ షా చూచి వారి నాయకులను చంపించాడు. హిందూ దేవాలయాలను పడగొట్టి అక్కడ మసీదులు కట్టాడు.
      క్రతువులు జరుపుతున్న ఒక బ్రాహ్మణున్ని బహిరంగంగా తగలబెట్టించాడు.
      ఫెరూజ్ షా ఇతర ముస్లిం దండయాత్రీకుల సంప్రదాయాలను పాటించాడు. హిందువుల మతాచారాలన్నీ బహిరంగంగా పాటించడం ఉరిశిక్షకు అర్హమైన నేరాలుగా పేర్కొన్నాడు.
      అనేకమంది హిందువులను ఫెరూజ్ షా ఇస్లాంలోకి ఆకర్షించాడు. అలా మారిన వారికి జిజియా పోల్ పన్నులు మినహాయించాడు. బ్రాహ్మణులతో సహా మిగిలిన అందరిపై పన్నులు విధించాడు.
      ఫెరూజ్ షాను గురించి విన్ సెంట్ స్మిత్ ఇలా రాశాడు. ఫెరూజ్ షా పరిసరాలు విద్యాసంబంధమైనవిగా  ఉన్నా, మతపరంగా అసహనం చూపాడు. హిందూస్థాన్ లో పాలకుడుగా, హిందువులనూ, ముస్లింలనూ సమానంగా చూచి స్వేచ్ఛ ఇవ్వాలనే ధోరణి అక్బర్ ప్రదర్శించినా ఇతడు అందుకు విరుద్ధంగానే ఉన్నాడు. 14వ శతాబ్దంలో ముస్లింలు విగ్రహారాధకులను క్షమించటం నేరంగా భావించాడు.
అక్బర్ (1542-1605)
    భారత చరిత్రలో ముస్లిం పాలకులలో ఎక్కువ సహనం చూపినవాడు. సనాతన ఇస్లాంకు దూరంగా పోయి తన సొంత మతాన్ని స్థాపించినవాడు అక్బర్. మధుర వద్ద హిందూ యాత్రికులపై పన్నులు రద్దు చేశాడు. ముస్లిమేతరులపై జిజియా, పోల్ టాక్స్ విధించాడు.
      ఇస్లాంకు భిన్నంగా మిగిలిన మతాల్లో ఆసక్తి చూపాడు. అతని కొలువులో అబుల్ ఫజిల్ వంటి స్వేచ్ఛాపరులు హిందూ, ముస్లిం మార్మిక వాదులూ ఉన్నందున వారి ప్రభావంతో మత చర్చలు జరపటానికి ప్రత్యేక మందిరం నిర్మించాడు. తొలుత ముస్లింలకి పరిమితం చేసిన ఈ చర్చలు వారి అసహ్యకర ప్రవర్తన వలన అక్బర్ కు జుగుప్స కలిగింది. హిందువులూ, జైనులూ, జొరాస్ట్రియన్లూ, యూదులూ, పోర్చుగీసు వలన ప్రాంతం గోవా నుండి జెసూట్ ఫాదరీలు మత చర్చలో పాల్గొన్నారు. వారిని గౌరవంగా అక్బర్ పరిగణించాడు. అక్బర్ కుమారునికి జెసూట్ ఫాదర్ ఉపాధ్యాయుడుగా ఉన్నాడు. బైబుల్ ను చుంబించి క్రైస్తవ విగ్రహాలను అక్బర్ ముద్దు పెట్టుకోటం సనాతన ముస్లింలకు ఘోరమనిపించింది.
      ముస్లింలకు ఆగ్రహం తెప్పించిన మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ముస్లిం మతంలో కొరాన్ననుసరించి ఏది నిర్ణయించాలో చక్రవర్తి చెపుతాడు. అది విధిగా పాటించాలి. మసీదులో ముల్లాస్తానే అక్బర్ స్వయంగా ఉంటూ, పైజీ చరణాలను చదివాడు. అతడు అబుల్ ఫజల్ సోదరుడు. ఇదంతా ముస్లింలకు ఆగ్రహం కలిగించింది బెంగాల్ ముస్లింలు అక్బర్ కెదురుతిరగగా వారిని అణచి వేశారు. అక్బర్ తాను చేయదలుచుకొన్నది యథేచ్ఛగా చేయవచ్చుననుకొన్నాడు. ముస్లిం మతం పట్ల తన అయిష్టతను ప్రకటించాడని వి.స్మిత్ పేర్కొన్నాడు. (పై పుస్తకం, వుట 349) తన సొంత మతాన్ని స్థాపించిన అక్బర్ ఇస్లాంను వదిలివేశాడు. ముస్లిం తేదీలు కూడా నిరాకరించాడు. తాను సింహాసనం చేపట్టినప్పటినుంచీ కొత్త తేదీలు ప్రారంభించాడు. నాణాలపై అల్లా హో అక్బర్ అని చెక్కించాడు. దీనికి దేవుడు గొప్పవాడు అనే అర్థంతోపాటు, అక్బరే దేవుడనే అర్థం కూడా వస్తుంది. హిందువులపట్ల వ్యతిరేకత చూపకుండా తాను ప్రజలందరికి ప్రతినిధినని అక్బర్ ప్రదర్శించాడు. క్రైస్తవులూ, హిందువులూ, జైనులూ, పార్శీలూ తమలోని వ్యక్తిగా అక్బర్ ను భావించారు. అతను హిందూ రాకుమారిని పెళ్ళి చేసుకున్నాడు. యాత్రీకుల అప్పుల్ని రద్దుచేశాడు. ఉన్నత స్థానాలలో హిందువులను నియమించాడు. హిందూ యువరాణులు అంతఃపురంలో వారి మతాచారాలను పాటించుకోవచ్చు అన్నాడు. అంబర్, మార్వార్, బికనీర్ రాజుల్ని ఇస్లాంలోకి మారమని వత్తిడి చేయలేదు. సైనికాధిపతులుగా, పాలనాధికారులుగా వారికి ఉన్నత స్థానాలు ఇచ్చాడు. ఈ విధంగా అక్బర్ కొత్తదారులు తొక్కాడు.
ఔరంగజేబు (1618-1707)
    అక్బర్ ముదిమనవడు ఔరంగజేబు తన సామ్రాజ్యాన్ని సనాతన సున్నీ, ఇస్లాం రాజ్యంగా మార్చదలిచాడు. తొలి ఖలీఫాలకనుగుణంగా పరిపాలన సాగించాడు. ఇస్లాం అసహనం మళ్ళీ ప్రవేశించింది. 1679-80 మధ్య దండయాత్రలలో ఉదయ్ పూర్ లో 123, చిత్తోడ్ లో 63, జయపూర్ లో 66 దేవాలయాలను ధ్వంసం చేశాడు. తమ దేశంలో హిందువులు ద్వితీయ పౌరులయ్యారు. ముస్లిం సనాతనవాది మళ్ళీ అందరూ ద్వేషించే జిజియాను, పోల్ట్ టాక్స్ ను హిందువులపైన విధించాడు. (స్మిత్, పుటః317) నమ్మకంలేని వారికీ, ఇస్లాం అనుసరించేవారికీ తేడా చూపటం, ఔరంగజేబు ఉద్దేశ్యం. హిందువుల దృష్టిలో అక్బర్ గొప్పవాడు. ఔరంగజేబు అధమాధముడు. ముస్లింలు ఇందుకు వ్యతిరేకంగా భావించారు. బయట వారి దృష్టిలో అక్బర్ దే సరైన పంథా. ఇండియా ఇస్లామిక్ దేశంకాదని అక్బర్ గుర్తించాడు. ఇండియాను ఇస్లాందేశంగా భావించిన ఔరంగజేబు, చిన్నాభిన్నం చేశాడు. (గాస్ కోయినీ బేంబర్, ది గ్రేట్ మొఘల్స్, లండన్, 1976, పుటః 225)
బుద్ధిజం, బౌద్ధులు
    1000-1200 మధ్య ఇండియాలో బౌద్దం అదృశ్యమయింది. ఇందుకు కారణాలు, బౌద్ధంలో బలహీనత, హిందూవాదం తిరగదోడడం, ముస్లింల హింస (ఇ.కోంజె, బుద్దింజం, ఇట్స్ ఎస్సెస్స్ అండ్ డెవలప్ మెంట్, న్యూయార్క్, 1975, పుటః117)
      క్రీ.త. 712లో ముస్లింలు సింధుపై దండయాత్ర చేయటంలో ఇండియాలో బౌద్దపతనం ఆరంభమై క్రీ.త. 1200లలో ముస్లింల హింసతో అణగారిపోయింది. (సి.హంఫ్రీ. ఎ పాప్యులర్ డిక్షనరీ ఆఫ్ బుద్ధింజం, లండన్, 1984, పుటః95)
      గుప్తుల అనంతరం ఇస్లాం తీవ్రవాదం వలన బీహారులో కొద్దిమందికే బౌద్ధం పరిమితమయింది. (జె.సి.హార్లే, ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ సబ్కాంటినెంట్, 1986, వుటః 199)
      మూర్ఖుడుగా, దాక్షిణ్య రహితుడుగా భావించబడే కుతుబుద్దీన్ ఐబక్ తన సైన్యాధిపతి మహమ్మద్ ఖిల్జీని, బీహార్ రాష్ట్రానికి దండయాత్రకు పంపించాడు. బౌద్ధం బీహారులో ప్రధానమతంగా ఉండేది. 1193లో ముస్లి సైన్యాధిపతి చాలామంది బౌద్దు భిక్షువులను చంపేసి వారి గ్రంథాలయం తగులబెట్టాడు.
      కాశీవద్ద సారనాథ్ బౌద్ధ అవశేషాలు విధ్వంసకాండకు చిహ్వాలుగా మిగిలాయి. ముస్లిం దండయాత్రలలో ప్రాచీన, నాగరికతా కళాఖండాలన్నీ నాశనమయ్యాయి. ఉత్తర భారతదేశంలో బౌద్ధం హతమయింది. తప్పించుకున్న బౌద్ధ భిక్షువులు నేపాల్, టిబెట్ దక్షిణాది పారిపోయారు (వి.ఎ.స్మిత్, పుటః 235-36)
      మధ్య ఆసియాలో బౌద్ధకళ రూపుమాసిపోవటానికి ముస్లిందండయాత్రలేకారణం. బెంజమిన్ రోలండ్ చెప్పినట్లు కిజిల్ బౌద్ద ఆరామాలు 8వ శతాబ్దంలోనే ముస్లిం పాలకుడు కష్ గర్ పాలిటపడ్డాయి. 10వ శతాబ్దంనాటికి కేవలం టర్కిస్తాన్ ప్రాంతమే మహమ్మదీయుల దండయాత్రలు తప్పించుకోగలిగాయి. (రోలండ్, పుటః 196) మంగోలుల దాడులు, ఇస్లాం కబంధహస్తం చాలా సంస్కృతులను తుడిచిపెట్టాయి. కళ, మతం, సంపన్నంగా విలసిల్లుతున్న ప్రాంతాలలో జీవితాలు స్థంభించిపోయాయి.
పండితులు, చరిత్రకారులూ, ధిమ్మీలు
    బాత్ మోర్ 20 సం.లుగా ధిమ్మీల సమస్యను పరిశీలించారు. ఈజిప్టులో యూదుల చరిత్రను 1971లో రాశాడు. ధిమ్మీ, యూదులు, క్రైస్తవులూ ఇస్లాంకింద ఎలా ఉన్నారో 1980 నుండి రాస్తున్నారు.
      బాత్ యోర్ గ్రంథానికి జాక్ ఎలూల్ పీఠిక రాస్తూ ఆసక్తికరమైన కథను చెప్పారు. (ధిమ్మీ, జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ అండర్ ఇస్లాం 1985)
      పుస్తకానికి సమీక్ష రాయగా నా సహచరుడూ, ప్రాచ్యవాదీ స్పందిస్తూ, తన గ్రంథాన్ని పట్టించుకోనక్కరలేదన్నాడు. ఆయన విమర్శలు చూస్తే పుస్తకం చదవలేదనిపిస్తున్నది. ఆ గ్రంథంలోని వాదోపవాదాలు చాలా తీవ్రమైనవి. ముస్లింలపట్ల ప్రత్యక్షధోరణిని, ముస్లింమేతరపట్ల సహనాన్నీ చూపుతూ రాసిన ప్రొ. ఎన్.డి.గోయిటిన్, బి.లెవీస్, ఎన్.స్టిల్ మన్ లను అతడు సిఫారసు చేశాడు.
      ఫ్రెంచి దినపత్రిక లమాండ్ లో జాక్ ఎలూల్ రాసిన సమీక్షకు అతని స్నేహితుడు స్పందించటం సహజం. ముస్లిం దండయాత్రలలో మూకుమ్మడి హత్యలను నిదర్శనపూర్వకంగా బాత్ యోర్ చూపింది. ధిమ్మీలను కించపరచరాదు. ఆర్థిక విధానం ప్రజలను అణచివేసింది. ఇళ్ళూ, గుళ్ళూ దోచారు. బలవంతంగా మతమార్పిడి చేయించారు.
      ఇస్లాంను ఉదాసీనంగా చూడదలిచిన వారికి ఎలూల్ చూపే గ్రంథాలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. నార్మన్ స్టిల్ మన్ పుస్తకంలో, 7వ శతాబ్దంనుండి 19వ శతాబ్దం వరకూ చారిత్రక సర్వేచేసి తగిన ఆధారపత్రాలను అందించాడు. అతడి వుస్తకాన్ని సి.యి.బాన్వర్త్ సమీక్షిస్తూ ఇలా రాశాడు. ఈ గ్రంథంలో రాసిన విషయం మానవ అసహనానికీ, ఛాందస వాదానికీ గూడకట్టుకున్న రీతులు ఎన్నో పేర్కొన్నారు. వాస్తవాలు ఎన్నో నిజాలు చెప్పేటట్లు రచయిత చూపారు. అవన్నీ ఇస్లాంకు శ్లాఘనీయంగా లేవు
    అరబ్బులు మధ్య ప్రాచ్యాన్ని జయించటం విమోచనకు దారితీయలేదు. విధ్వంసం, చావులు విపరీతంగా ఉన్నాయి. హఠాత్తుగా దాడిచేసి చంపటం, బందీలను చేయటం. ఆస్తులను స్వాధీనపరచుకోటం పరిపాటి అయింది. (ఎన్.ఎ.స్టిల్ మన్, ది జ్యూస్ ఆఫ్ అరబ్ లాండ్, ఫిలడెల్ఫియా, 1979, పుటః 24)
    ముస్లిమేతర రైతులపై జిజియా, ఖరజ్ పన్నులు చాలా భారంగా పరిణమించాయి. బ్రతుకుతెరువు బొటాబొటీగా ఉండేది.  (స్టిల్ మన్, సంపుటి. 28)
      ముస్లిం పాలకులు పన్ను చెల్లింపునే పట్టించుకునేవారు. ధిమ్మీలను తరతమ భేదాలతో చూసేవారు. ముస్లిమేతరులు ఒడంబడిక ఉంటే స్వయం పాలనకు అనుమతించేవారు. ప్రభుత్వ అజమాయిషీ, జోక్యం తప్పేవి కావు. (స్టిల్ మన్ పుట. 38)
      ముస్లిమేతరులకు ధిమ్మీస్థాయి తొలిగిపోయేది కాదు. పరస్చర మతాలమధ్య సత్సంబంధం సందేహాస్పదంగానే ఉండేది  (స్టిల్ మన్ పుటః 62)
      కరువు కాటకాలు ఉప్పెనలూ వచ్చినప్పుడు యూదులు ఇబ్బందిలో పడేవారు. మత విజృంభణ జరిగేది. ఇస్లాం చట్టం వారిని నిర్దేశిస్తుండేది. యూదులను ద్వేషించటం అరబ్బులకు సర్వసాధారణంగా ఉండేది. ఎప్పుడేమి చేస్తారో తెలియకుండా అరబ్బుల సహనం సాగేది. కొన్నిసార్లు చట్టాలను గట్టిగా అమలు పరచేవారు. ధిమ్మీలకు వాళ్ళ అంతస్తును గుర్తుచేస్తుండేవారు (స్టిల్ మన్, పుటః 63)
      స్టిల్ మన్ చెప్పే దానిలో ఒక విషయాన్ని బాత్ యోర్ నిరాకరించాడు. 13 శతాబ్దాలలో బలవంతంగా 6 మందికిమించి యూదులను మార్చలేదని స్టిల్ మన్ రాశాడు. (పుటః 76) అల్మోహద్ ఖలీఫా (1165లో చనిపోయాడు) ఆబూ యాకూబ్ (1184లో మరణం), అల్ మన్ సూర్ (1199లో మరణం) కాలంలో  నిర్బంధ మతమార్పిడులున్నాయని స్టిల్ మన్ అంగీకరించాడు.  1165-1678 మధ్య ఎమెనో యూదులను ఇస్లాంలోకి మారమనీ, లేకుంటే చంపేస్తామనీ అన్నారు. 1198లో ఎడెన్ లో అలాగే జరిగింది. బాత్ యోర్ ఇలా రాశాడు. (పై పుస్తకం, పుటః 61) ట్రిపోలిటానా, తదితర చోట్ల వివిధ కాలాల్లో బలవంతంగా యూదులను ముస్లింలుగా మార్చారు. తబ్రిజ్ లో యూదులను 1291, 1318 మతం మార్చించారు. బాగ్దాద్ లో 1333, 1944లో మతమార్పిడి చేయించారు. పర్ష్యాలో 16వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకూ, క్రైస్తవులనూ, యూదులనూ మతమార్పిడి చేయించారు.
      బాత్ యోర్ ఇలా రాశారు. 617లో, 1622లో పర్ష్యన్ యూదులను బాధించి, మతమార్పిడి చేయించారు. రెండవ షా అబ్బాస్ కాలంలో (1642-1666) యూదులందరినీ (1653-1666) నిర్బంధంగా మతం మార్పించారు. 1839లో మోషద్ లో అలాగే చేశారు. (బాత్ యోర్ [Batyeor] Lex Chreticentes D’Orient Pentre Jihad dt Dhimmitude 7-20 Siecle, Paris 1991, పుటః 95)                                                      
      ఇదంతా కలిపిచూస్తే చాలామంది యూదులను మతం మార్పిడి చేయించారు. ఇంతవరకూ                                          యూదులకే పరిమితమయ్యాం. నిర్బంధ మతమార్పిడిలో క్రైస్తవులూ, హిందువులూ, జొరాస్ట్రియన్లూ మరెందరో ఉన్నారు.
      ఇస్లాంలో యూదులూ, ధిమ్మీల గురించి బెర్నార్డ్ లెవిస్ చాలా రాశాడు. ముస్లింలకూ, ఇతరులకూ మధ్య సమానత్వం  ఎన్నడూ లేదన్నారు. (ది జ్యూస్ ఆఫ్ ఇస్లాం, పుటః 4-9, ప్రిన్ స్టన్, 1984)
      సంప్రదాయ ఇస్లాం సమాజాలు సమానత్వం ఇవ్వలేదు. ఇస్తున్నట్లు నటించనూ లేదు. అలా చేస్తే తమ విధిని పాటించనట్లు భావించారు. నిజమైన మతాన్ని అనుసరించేవారూ, దానిని తృణీకరించేవారూ ఒకే గాటిన ఉండడం అసాధ్యమన్నారు. మతపరంగానూ, తార్కికంగానూ అది అసంభవమన్నారు. సంస్థాగతమైన చట్టంలో, ఆచరణలో విచక్షణ శాశ్వతమూ, అవసరమూ అన్నారు. సమాజంలో పూర్తి అర్హస్థానం ముస్లిం పురుషులకే ఉండేది. బానిస, స్త్రీ నమ్మకంలేనివారు సమానత్వానికి అర్హులు కారు. యజమాని, బానిస, స్త్రీ, పురుషులూ, విశ్వాసం ఉన్నవారూ, లేనివారూ అనే తేడాలు పవిత్ర చట్టం ద్వారా వచ్చాయన్నారు.
    సహనం అనేది పరోక్షంగా వాడిన పదం. సహనానికీ, హక్కులకూ తేడాను బాత్ యోర్ చూపారు. హక్కులు తొలగించడానికి వీలులేనివి. సహనం మార్చవచ్చు. అదే విషయాన్ని బెర్నార్డ్ లెవీస్ కూడా చెప్పాడు. సహనానికీ, సహజీవనానికీ తేడా చూపాడు. సహనంలో ఆధిక్యత గలవారు ఇతరులపట్ల వారి ఆచారాలపట్ల చూపే ధోరణి ఉంటుంది. సహజీవనం అంటే ఒకే స్థాయిలో  ఉన్న భిన్న, ముఠాలకు రాజకీయంగా, ప్రతిభరీత్యా చూపే వ్యత్యాసాలు ఉంటాయి. (లెవీస్, రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్, పుట 179)
      లెవీస్ ది జ్యూస్ ఆఫ్ ఇస్లాంలో రాస్తూ, అణచివేత, హింస అరుదుగా ఉండేవన్నాడు. (పుట 8) కాని లెవీస్ తనను తానే ఖండించుకుంటూ సఫానిద్ షాల పాలన కింద యూదులూ, క్రైస్తవూలూ, జొరాస్ట్రియన్లు హింసకు గురై మత మార్పిడికి లోనయ్యారన్నాడు. (పుట 52) పుస్తకం చివరలో లెవీస్ రాస్తూ యూదులు అనేక అవమానాలకూ, చిత్రహింసలకూ గురయ్యారని పేర్కొన్నాడు (పుట 183)
      ముస్లిమేతరులు పడిన బాధల్ని లెవీస్ తగ్గించి చెప్పాడు. 1033లో మొరాకోలోని ఫెజ్ లో 6వేలమంది యూదుల్ని చంపారు. స్పెయిన్ లో కోర్డోబాలో 1010-13 మధ్య వందలాది యూదుల్ని చంపారు. 1066లో గ్రనడాలో యావత్తు యూదు సమాజాన్ని హతమార్చారు. లెవీస్ ఈ విషయాలను గమనించలేదు. రాబర్ట్ విస్ట్రిచ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మత యుద్ధాలలో యూదుల బాధల్ని పండితులు పట్టించుకోలేదన్నారు. బాత్ యోర్ పరిశోధనను శ్రద్ధగా స్వీకరించిన విస్ట్రిచ్ ఇలా రాశాడు. ట్యునీసియాలో కైరాన్ వద్ద 1016లో యూదులను హింసించి తరిమేశారు. 145లో ట్యునిస్ లో బలవంతంగా మారకపోతే వెళ్ళిపొమ్మన్నారు. 1232లో మరకేష్ లో యూదులను హత్య చేశారు. స్చెయిన్ నుండి అరేబియీ ద్వీపకల్పం వరకూ యూదులను దోచటం, చంపటం, పన్నులు విధించటం,  ఘెటోలకు పరిమితం చేయటం, ప్రత్యేక దుస్తులు ధరించటట్టు చేయటం, అవమానాలపాలు చేయటం సర్వసాధారణమైంది. (పుట 196)
విచక్షణతో పన్నులు
ఖరజ్
    ఖరజ్ అనేది భూమిపన్ను.  ఈ విధానంలో రైతు భూమికి యజమానికాడు. కౌలుదారు మాత్రమే. ఖరజ్ పద్దతిలో జయించిన వారికి దేవుడు హక్కులను ప్రసాదించి పాలితుల (కాఫిర్లు) పై యాజమాన్యం వహిస్తారు. సిద్దాంతరీత్యా రైతుల్ని కాపాడతామంటారు. కాని వారే అలజడితో ఎక్కువ. బాధలకు గురవుతారు.
జిజియా
    ఖురాన్  9.29 ప్రకారం జిజియా పన్ను వ్యక్తులు బహిరంగ సమావేశంలో అవమానకర పరిస్థితిలో చెల్లించాలి. ముస్లింలకంటే వారు తక్కువనీ, ధిమ్మీలనీ గుర్తుచేసే పద్దతి అది. అలజమాక్షరీ (1075-1144)  ఖురాన్ ను వ్యాఖ్యానిస్తూ సుర 9.29 ప్రకారం ధిమ్మీ స్వయంగా నడుచుకుంటూ వచ్చి జిజియా పన్ను చెల్లించాలి. వసూలుదారు కూర్చొని ఉండగా ఇతడు నిలుచుని ఉండాలి. మెడపట్టుకొని ఊపుతూ వసూలుదారు జిజియా చెల్లించు అంటాడు. చెల్లించిన తరువాత మెడపై ఒకటి చరుస్తాడు.
ఇతర పన్నులు
 ముస్లింలకు చెల్లించ వలసిన వాణిజ్య, ప్రయాణపు పన్నులేకాక ధిమ్మీలు ఇంకా ఆర్థిక అణచివేతకు లోనవుతున్నారు. నిరంకుశంగా మరికొన్ని పన్నులు విధిస్తుంటారు. మత నాయకులను బంధించి, పెద్దమొత్తాలు చెల్లించే వరకూ బాధలు పెడతారు. ఈ పన్నుల భారాన్నితప్పించుకోవటానికి గ్రామాలు వదిలి కొండల్లోకి పారిపోతుంటారు. నగరాలలో దాక్కుంటుంటారు. దిగువ ఈజిప్టులో కోప్టులు పన్నులతో కుంగిపోయి 832లో  తిరుగుబాటు చేశారు. అరబ్బు గవర్నర్ తిరుగుబాటు నణచివేశారు. గ్రామం తగులబెట్టారు. తోటలు పాడు చేశారు. దేవాలయాలు ధ్వంసం చేశారు. చంపకుండా మిగిలినవారు వేరే చోట్లకు నెట్టేయబడ్డారు.
పదవులు
      ముస్లింపై ధిమ్మీకి ఎలాంటి అధికారం లేదని హడిత్ చెపుతున్నది. 3.28 సూత్రం ప్రకారం ధిమ్మీలు  పదవుల్లో ఉండరాదని కొరాన్ చెప్పింది. ఐనా ధిమ్మీలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. మధ్యయుగాలలో ధిమ్మీని ఉన్నతపదవుల్లో ఉంచినప్పుడు నిరసన హింస ప్రజ్వరిల్లింది. 1066లో ఈజిప్టులో ఇలాంటి సంఘటనలు జరిగాయి. పదవులకోసం ధిమ్మీలు కొందరు ఇస్లాంలోకి మారారు.
చట్టరీత్యా అసమానత్వం
    ముస్లింకూ, ధిమ్మీకి కలహం వస్తే ధిమ్మీ ప్రమాణంగానీ, సాక్ష్యంగానీ గుర్తించరు. కనుక ముస్లింలకు స్వేచ్ఛ లభిస్తుంది. నిందలు తప్పించుకోటానికి ధిమ్మీ లంచాలు పెట్టవలసి వచ్చేది. ముస్లిమేతరులకంటే ముస్లింలు అధికులమని చట్టంలోనే చూపారు. ధిమ్మీకి సంబంధించిన నేరమైతే అందులో ముస్లింకు విధించే జరిమానా సగానికి తగ్గిస్తారు. ధిమ్మీల ద్రోహానికి ఉరిశిక్షలు సహజంగా ఉంటాయి. అందుకే ధిమ్మీలు ప్రాణం దక్కించుకోటానికి మతం మార్చుకుంటారు. ముస్లింకు  వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం ఐనా ధిమ్మీ ఎదురుతిరిగితే అతనికి ఉరిశిక్ష పడుతుంది. (బాత్ యోర్, ధిమ్మీ, పుటః 57, లండన్, 1985)
      ముస్లిం క్రైస్తవ, యూదు స్త్రీని పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిమేతరులు ముస్లిం స్త్రీని పెళ్ళి చేసుకోరాదు. అలాంటి పెళ్ళికి, లైంగిక సంబంధానికీ  శిక్ష మరణమే.
ఉమర్ ఒడంబడిక
    715-20 మధ్య పరిపాలించిన ఉమర్ అద్.అల్ అజీజ్ చేసిన ఒడంబడిక ధిమ్మీల ఇబ్బందులను తెలుపుతున్నాయి.
      నగరాలలో, చుట్టుపక్కల కొత్తమఠాలు, ఆశ్రమాలు, గురుకులాలు, దేవాలయాలు నిర్మించము ముస్లింల ఇళ్ళ మధ్య విధ్వంసానికి గురైన అలాంటివాటిని పునరుద్ధరించే ప్రయత్నం చేయము.
      మా గేట్లు ప్రయాణీకుల నిమిత్తం తెరిచి ఉంచుతాము. త్రోవన వెళ్ళే ముస్లిం కోసం 3 రోజులకు సరిపడే ఆహారం, వసతి ఏర్పాట్లు చేస్తాము.
      మా దేవాలయాలలో, ఇళ్ళలో గూఢచారులకు రక్షణ ఇవ్వము. ముస్లింలనుండి వారిని కాపాడము.
      మా పిల్లలకు ఖురాన్ బోధించము.
      మా ఉత్సవాలు బహిరంగంగా జరపము. మా మతంలోకి మార్చడానికి ప్రయత్నించము. ఎవరైనా మాలో ఇస్లాలోకి మారదలిస్తే అడ్డుపెట్టము.
      ముస్లింలు కూర్చోదలిస్తే లేచివారికి స్థానం ఇస్తాము.
      ముస్లింను పోలి ఉండటానికి ప్రయత్నించము.
      గుర్రాలపై జీనులేని ప్రయాణం చేయము.
      కత్తులూ, ఆయుధాలూ ధరించము.
      జుట్టు నొసలపై పడకుండా కత్తిరించుకుంటాము.
      శిలువలూ, గ్రంథాలూ ముస్లింల రహదారుల్లో, వాణిజ్య స్థలాలలో పెట్టము. దేవాలయాల్లో శబ్దాలు చేయకుండా ప్రార్థనలు జరుపుతాము. శవ ఊరేగింపులలో నినాదాలివ్వము. ముస్లింలకంటె ఎత్తైన ఇళ్ళను నిర్మించము.
      ముస్లింను కావాలని ఎవరైనా కొడితే అలాంటి వారికి ఒడంబడికల ద్వారా రక్షణ ఉండదు.
      మత వ్యవహారాలలో ధిమ్మీలకు స్వేచ్ఛలేదు.
      ముస్లింలు వారిని మత నాయకులుగా నియమించకుండా అడ్డుపడుతూ వచ్చారు.
      ధిమ్మీలు భద్రంగా, స్థిరంగా ఉన్నారనీ, రక్షణలో సంతోషంగా, సురక్షితంగా ఉన్నారనటం సత్యదూరం. ధిమ్మీలు నిరంతర భయానక వాతావరణంలో బ్రతికారు. బానిసలయ్యే ప్రమాదం పొంచి చూస్తుండేది. 643లో అమర్ ట్రిపోలీని జయించినప్పుడు యూదులూ, క్రైస్తవులూ మత స్త్రీలనూ, పిల్లలనూ బానిసలుగా అరబ్బు సైన్యానికి అప్పగించమన్నాడు. అందుకు ప్రతిఫలంగా జిజియా, పోల్ పన్నుల నుండి కొంత తగ్గించుకోమన్నాడు. 652-1276 మధ్య బానిసలను కైరోకు పంపించాలని వత్తిడి చేస్తూ వచ్చారు. ఉమాయద్దులు, అబ్బాసిద్దులూ నైరుతీ ఆఫ్రికాలో ట్రాన్సోక్జినియా, సిజిస్తాన్, ఆర్మీనియా, ఫెజన్ నగరాలలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం స్త్రీ పురుషులను బానిసలుగా ఏటా కప్పంకింద పంపించమన్నారు. బానిసలకోసం గ్రామాలపై దాడిచేసి నగరాలలో నమ్మకంలేనివారిని చేర్చి బానిసలుగా పంపేవారు. 781లో 7 వేల గ్రీకులను పట్టుకొని పంపించారు. 838లో ఆమోరియంను వశపరచుకొన్నతరువాత బందీలు ఎక్కువగా ఉన్నందున 5, 10 మందిని జట్లుగా చేసి, వేలంవేయమని ఖలీఫా అల్ ముతాసిమ్ ఉత్తరువులిచ్చాడు. టెసాలోనికను 903లో అణచివేసిన తరువాత 22 వేలమంది క్రైస్తవులను అరబ్బు నాయకులు పంచుకొని బానిసలుగా అమ్ముకున్నారు. 1064లో సెల్జుక్ సుల్తాన్ అల్పో అర్సలన్ జార్జియా, ఆర్మీనియాలను నేలమట్టం చేశాడు. ఖైదీలు కానివారిని ఉరితీశాడు. పాలస్తీనా, ఈజిప్టు, మెసపటోమియా, ఆర్మీనియా, అనటోనియా, సఫివిద్ పర్ష్యాలకు సంబంధించిన ఆధారాలను పరికిస్తే పన్నులు చెల్లించలేనివారు పిల్లలను అప్పగించవలసివచ్చింది. అందుకు జజియాపన్నులో కొంత మినహాయింపు ఇచ్చారు.
      3 వందల ఏళ్ళపాటు క్రైస్తవులు దేవ్ షిమ్ అనే విధానానికి గురయ్యారు. ఈ ఆవమానకర పద్ధతిని చాలాకాలం ఎవరూ ప్రస్తావించలేదు. ఆటోమన్ సుల్తాన్ అర్ఖాన్ (1326-1359 ఈ పద్ధతిని ప్రవేశపెట్టి, జయించినచోట క్రైస్తవుల పిల్లలలో 5వ వంతుమందిని స్వాధీన పరుచుకునేటట్లు చేశాడు. వారిని ఇస్లాంలోకి మార్చి కాలిబలంకింద శిక్షణ ఇచ్చారు. ఇది ఏటా ఆనవాయితీగా మారింది. గ్రీక్ ఉన్నతవంశాలు, సెర్చ్, బల్గేరియా, ఆర్మీనియా, అల్బేనియా మతగురువుల పిల్లలు  ఈ విధంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు. ఒక నిర్ణీత తేదీన తమ పిల్లలతో ఒక బహిరంగ స్థలానికి తండ్రులను రమ్మనేవారు. ముస్లిం న్యాయమూర్తి సమక్షంలో అందంగా, పుష్టిగా ఉన్నవారిని స్వీకరించేవారు. అప్పగించటానికి వెనుకాడిన తండ్రులను శిక్షించేవారు.
      ఈ విధానములో దుర్వినియోగం కూడా ఉండేది. అవసరమైన దానికంటే ఎక్కువ మందిని తీసుకొని అదనపు పిల్లల్ని మళ్ళీ వారి తండ్రులకు అమ్మేవారు. కొనలేని తండ్రులు బానిసలుగా అమ్ముకోవలసి వచ్చేది. 1656లో ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. ఐతే పిల్లలను 6-10 సం.ల మధ్య తీసుకొని శిక్షణ ఇచ్చే విధానం 18వ శతాబ్దం వరకూ శరాగ్లియోలో కొనసాగించారు.
      ఎంతమంది పిల్లల్ని ఏటా తీసుకురమ్మనటంలో తేడాలున్నాయి. 12 వేల నుండి 8 వేల వరకూ ఈ సంఖ్య ఉన్నది. సాలీనా వేయి మాత్రం తప్పనిసరిగా ఉండేవి. ధిమ్మీల హక్కులలో దేవ్ షిమ్ విధానం గండికొట్టిందనటానికీ, వారి హక్కులకు రక్షణ లేదనటానికీ ఈ ఉదాహరణ చాలు.
     
మత విషయాలు
ప్రార్థన స్థలాలు
    కొత్త గుడులూ, సినగాగ్ లు నిర్మించే విషయమై నాలుగు సున్నీ శాఖల అభిప్రాయాలను 19వ శతాబ్దంలో అల్ షరానీ ఇలా పేర్కొన్నాడు. (ఎ.ఎస్. త్రిటన్, ది ఖలీఫ్స్ అండ్ ది నాన్ ముస్లిం సబ్జెక్ట్స్, లండన్, 1970, పుటః 36)
      ఇస్లాం నగరాలలో గుడులూ, సినగాగ్ లు కట్టటానికి అనుమతించరాదని అన్ని శాఖలూ అంగీరించాయి. ఇరుగూ పొరుగూ ప్రాంతాలలో అనుమతించవచ్చా అని  కూడా అభిప్రాయభేదాలకు దారితీసింది. మాలిక్, సఫే అహమ్మదులు అనుమతించరాదన్నారు. నగరానికి ఒక మైలు దూరంలో ఐతే అనుమతించగూడదని అబూహనీఫా చెప్పాడు. అంతకంటే దూరంలో ఐతే ఒప్పుకోవచ్చన్నాడు. ఇస్లాం దేశాలలో విధ్వంసం చేసిన చోట మళ్ళీ ప్రార్థనా మందిరాలు కట్టవచ్చా అనేది చర్చనీయాంశమైంది. హనీఫా, మాలిక్ సఫేలు అనుమతించవచ్చన్నారు. శాంతియుతంగా లొంగిపోయినచోట చర్చికి అనుమతించవచ్చనీ, బలవంతంగా లొంగదీసిన చోట అనుమతించరాదనీ అబు హనీఫా అన్నాడు. ఏ విధంగానూ అనుమతించరాదని అహమ్మద్ అభిప్రాయం క్రైస్తవులూ, యూదులవలె వారి ప్రార్థనామందిరాల గతి కూడా దేశాన్నిబట్టి పాలకులనుబట్టి మారాయి. ముస్లిం పాలకులలో కొందరు సహనం చూపారు. మరికొందరు సహించలేదు. క్రీ.త. 122లో ఈజిప్టు పన్ను వసూలుదారు ఉసామాజైద్ చర్చీలను కాన్వెంటులను ధ్వంసం చేశారు. క్రైస్తవులను శాంతియుతంగా బ్రతకనివ్వమని ఖలీఫా హిషాం చెప్పాడు. కొందరు ఖలీఫాలు ముస్లిమేతరుల హక్కులను గౌరవించి జనం ధ్వంసం చేసిన చర్చీల మరమ్మత్తుకు ఉదారంగా ధనం ఇచ్చారు. స్పెయిన్  ఉదారణను త్రిటన్ చూపారు. ముస్లింలు స్పెయిన్ వాడిలో సహనం చూపలేదు. ఒక దాడిలో మూసా ప్రతి చర్చిని నాశనం చేశాడు. మరీదా లొంగి పోయినా ముస్లింలు ఆస్తులన్నిటినీ స్వీకరించి గలీషియా పారిపోయిన వారి ఆభరణాలను తీసుకుపోయారు. (పై పుస్తకం, పుటః 45)
      ఖలీఫా మర్వాన్ (744-750) తన పాలనలో ఈజిప్టు మఠాలను దోచి నాశనం చేశాడు. తానాలో ఒకటి మినహా చర్చీలన్నింటినీ నాశనం చేశాడు. ఒదిలేసిన ఒక్కదానికీ 3 వేల దీనార్లివ్వమన్నాడు.
    క్రీ.త. 853లో ఖలీఫా ముతాపక్కిల్ అన్ని కొత్త చర్చీలను నాశనం చేయమన్నాడు. బాగ్దాద్ లోని కలీల్షు కాన్వెంటును 884లో నాశనం చేసి బంగారం, వెండి పాత్రలను దొంగిలించి, కట్టెలను అమ్ముకున్నారు. డమాస్కస్ లో మేరీ చర్చి కాన్వెంటును 924లో దోపిడీ చేసి  తగులబెట్టారు. అసదుద్దీన్ షుర్కు ఈజిప్టులో చేసిన దాడులూ, రమ్లే, అస్కలాం, టిన్నిస్ లో అలాగే నాశనం చేస్తూ పోయారు.  త్రిటన్ ఇలా రాశాడు. అల్ హకీం ఉత్తరువులిస్తూ తన రాజ్యంలో చర్చీలన్నింటినీ నాశనం చేయమన్నాడు. బంగారం, వెండిని మార్కెట్లో అమ్మారు. చర్చి భూముల్ని స్వాధీన పరచుకొని అడిగిన వారికి దానం చేశారు. ఈజిప్టు, సిరియాలలో గ్రీకులు నిర్మించిన 30 వేల చర్చీలను నాశనం చేసినట్టు ముస్లిం చరిత్రకారుడు పేర్కొన్నాడు. బర్ హబ్రోస్ వేలసంఖ్యలోనే నాశనం చేసినట్లు, ఉదారంగా ప్రవర్తించినట్లు చెప్పారు. (పై పుస్తకం. పుటః 54)
      1921లో కైరోలో కొట్లాటల సందర్భంగా అనేక చర్చీలు నాశనం చేయటం. దీనిప్రతిచర్యగా ఈజిప్టు అంతటా 50 చర్చీల వరకూ ధ్వంసం కావటం జరిగింది.
      మొత్తం మీద ముస్లింలు ఇతరుల బహిరంగ ప్రార్థనలను మెచ్చరు. రెండవ ఉమర్, ముతావక్కిల్ ఉభయులూ క్రైస్తవుల ప్రార్ధనలు ఆపటానికి వృధాప్రయత్నం చేశారు. గంటలు కొట్టటం, బూర ఊదటం, బహిరంగంగా శిలువ చూపటం మొదలైన వాటిని నిషేధించారు.
నిర్బంధ, మార్పిడులు, హింసలు
    ఇస్లాం చరిత్రలో క్రైస్తవునూ, జొరాస్ట్రియన్లనూ, పేగన్లనూ బలవంతంగా మార్చిన సందర్బాలున్నాయి. 9వ శతాబ్దంలో అల్-మామున్ ఆధ్వర్యాన ఇస్లాం-మరణం మధ్య తేల్చుకోమని హరాన్ పేగన్లను హెచ్చరించారు. అలటోలియాలో గ్రీకులనేకమందిని టర్కులుగా మార్చినట్లు 17వ శతాబ్దపు ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ రాశాడు.
      ఆర్మీనియన్ క్రైస్తవులు ముస్లిం హింసకు గురయ్యారు. 704-705లో ఖలీఫా వాలిద్, ఆర్మీనియా ఉన్నత వంశీకులను గ్రెగరీ, జరాం చర్చీలలో చేర్చి తగులబెట్టించాడు. కొందరిని శిలువ వేయించాడు. వారి స్త్రీలనూ, పిల్లలనూ బానిసలుగా  చేపట్టారు. 852-855 మధ్య అర్మీనియన్లు చాలా బాధలకు గురయ్యారు.
      ధిమ్మీలు ఈ పరిస్థితి అంతా తప్పించుకోటానికి మతం మారారు. అందులో బలవంతం చాలా ఉన్నది.
      ప్రతి శతాబ్దంలోనూ దారుణాల చరిత్ర ఉన్నది. 8వ శతాబ్దంలో సింధ్ మూకుమ్మడి హత్యలున్నాయి. 9వ శతాబ్దంలో స్పానిష్ క్రైస్తవుల ఊచకోత ఉన్నది. 10వ శతాబ్దంలో ఖలీఫా అల్ హకింకింద ముస్లిమేతరులు పడిన బాధలు సుప్రసిద్ధమే. 11వ శతాబ్దంలో ఫెజ్, గ్రెనడా యూదులు పడిన బాధలతోపాటు, అదే కాలంలో మహమ్మద్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. 12వ శతాబ్దంలో అల్మొహద్దులు ఉత్తరాఫ్రికా అంతటా భయానక వాతావరణాన్ని విస్తరించారు. 13వ శతాబ్దంలో డమాస్కస్ క్రైస్తవులు హతమయ్యారు. లేదా బానిసలుగా అమ్మేశారు. సుల్తాన్ బైబార్స్ పాపాత్ముడని, సర్ స్టీవెన్ రూంచిమన్ అన్నాడు. తానిచ్చిన హామీలే అతడు నిలబెట్టుకోలేదు. (రూంచిమన్, ఎ హిస్టరీ ఆఫ్ ది క్రూసేడ్స్, 3వ సంపుటి, పుటః 321, కేంబ్రిడ్జి, 1951)
      1268లో ఏంటియోక్ ను ముస్లింలు వశపరుచుకున్నప్పుడు జరిగిన దారుణాలన చూసి, ముస్లిం చరిత్రకారులే దిగ్భ్రమ చెందారని రూంచిమన్ రాశాడు.
      14, 15 శతాబ్దాలలో తామర్లేన్ లేదా తైమూర్ జరిపిన భయానక హింసాకాండ చరిత్రకెక్కింది. తరచు కొరాన్ను ఉదహరించిన తమర్లేన్ తోటి ముస్లింలతో పోరాడుతూ  కూడా తన యుద్ధాలన్నింటినీ పవిత్రయుద్ధాలన్నాడు. బార్జీయాలో తన దాడికి జిహాద్ అని పేరు పెట్టాడు. 1400లలో టిఫ్నిస్ ను తామర్లేన్ నాశనం చేశాడు. 1403లో మళ్ళీ అదే ప్రాంతాలకు వచ్చి టిఫ్నిస్ క్రైస్తవ దేవాలయాలను నేలమట్టం చేసి నివాసులను ఊచకోతకోశాడు. రెనెగ్రోసే రాస్తూ తామర్లేన్ స్వభావాన్ని గమనిస్తే ఖురాన్ పవిత్రత పేరిట ఇదంతా జరిపినట్లు గమనించవచ్చన్నాడు. మంగోలుల ముఠా, సంచార దళాలుగా చేసిన పనికి తామర్ లేన్ ఆ పేరు పెట్టాడన్నారు.  (ఆర్ గ్రోసే [R. Grousset] L’EMPIREDES STEPPES, పారిస్, 1941, పుట 486-546) మంగోలుల క్రూరత్వానకి తామర్లేన్ మతహత్యలను జోడించాడన్నారు. ఒక పవిత్ర కర్తవ్యం పేరిట అతడు ఊచకోతను జరిపించాడు.
      ముస్లిమేతర  నగరం తానాను తామర్లేన్ ధ్వంసం చేశాడు. అక్కడి క్రైస్తవులను బానిసలు గావించి వారి షాపులనూ, చర్చీలను నేలమట్టం చేశాడు. 15వ శతాబ్ది ఆరంభంలో జఫర్ నామా వెలువడగా తామర్లేన్ దాడులను గురించి అందులో చాలా ఆధారాలున్నాయి. ఇండియాపై దాడిచేసి ముస్లిం వ్యతిరేక శక్తులను నాశనం చేయాలని తామర్లేన్ తలపెట్టాడు. ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలకులు హిందువులపట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారన్నారు. శత్రువులపై స్వయంగా యుద్ధం చేస్తే అత్యున్నత స్థాయి లభిస్తుందని ఖురాన్ చెపుతున్నది. తామర్ లేన్ అదే పాటించాడు.
      ఢిల్లీలో హిందూ బందీలను తామర్లేన్ చంపించి వారంతా తన సైన్యానికి ముప్పుగా ఉన్నారని పేర్కొన్నాడు. వేలాదిమందిని చంపించి విజయ ధ్వజస్తంభాలు నిర్మించాడు.  ఇండియానుంచి వెళ్ళిపోతూ అనేక నిర్మాణాలను నాశనం చేసి హిందువులను చంపి పవిత్ర యుద్ధం పేరిట తన మాటను నిలబెట్టుకున్నాడు. సంకుచిత మనస్తత్వంతో , సాంస్కృతిక విలువలను నాశనం చేశాడనీ,  ఇస్లాం సంరక్షకుడుగా చెప్పుకున్నాడనీ గ్రోసే రాశాడు.
      క్రైస్తవులను క్రమబద్ధంగా తామర్లేన్ చంపేశాడు.  మెసపటెమియాలోని నెస్టోరియన్లు, జాలోబైట్లు తిరిగి కోలకోలేకపోయారు. నాలుగువేలమంది క్రైస్తవులను శివాస్ లో చంపేశాడు. టస్ లో 10వేలమంది బలయ్యారు. చరిత్రకారుల అంచనాను బట్టి సారేలో లక్షమంది, బాగ్దాద్ లో 90 వేలమంది, ఇస్ఫహాన్ లో 70 వేలమంది హతమయ్యారు.
జొరాస్ట్రియన్లు
బుఖారా చరిత్ర తారిఖ్
      బుఖారాలో  క్రీ.త. 944లో రాసిన ప్రకారం ఇస్లాంను బుఖారా వాసులపై బలవంతంగా రుద్దారు. 4 పర్యాయాలు బుఖారావాసులు మళ్ళీ తమ సొంత నమ్మకాలలోకి మరలారు. బుఖారా వాసులు ముస్లింలయ్యారు. అరబ్బులు వెళ్ళిపోగానే ఇస్లాంను వదిలేస్తుండేవారు. కుతాయబా వారిని 3 సార్లు ముస్లింలుగా మార్చారు. ఐతే వారు ఇస్లాంను వదిలేసి తమ సొంతమతంలోకి పోయారు.  4వ సారి కుతాబా యుద్ధం చేసి నగరాన్ని వశపరచుకొని ఇస్లాంను స్థాపించాడు. ఐతే, పైకి వారు ఇస్లాంను అవలంబించినా రహస్యంగా తమ మతాన్నే పాటించారు. (జెమ్ షీడ్ చోస్కీ, కాన్ ఫ్లిక్ట్, కో ఎక్జిస్టెన్స్ అండ్ కో ఆపరేషన్, ముస్లిమ్స్ అండ్ జొరాస్ట్రియన్స్ ఇన్ ఈస్టర్న్ ఇరాన్ డ్యూరింగ్ ది మిడివల్ పీరియడ్. ముస్లిం వరల్డ్, 80వ సంపుటి, 1990, పుటః 213-33)
      చాలామంది జొరాస్ట్రియన్లకు లంచాలు పెట్టి మతం మార్చించారు. ఆర్థిక అవసరం వలన ఇలా చేశారు. ఆర్థికంగా మతమార్పిడి చేసిన తరువాత వారందరినీ ఉరితీశారు. పోల్ టాక్స్, భూమిపన్ను తప్పించుకోటానికే వారు ఇస్లాంలోకి మారారు.
      ఖొరాసన్ బుఖారాలో జొరాస్ట్రియన్ గుడులను ధ్వంసం చేసి అక్కడ మసీదులు కట్టారు. దీనికి చాలా ప్రతిఘటన వచ్చిందని ఇస్లాం వ్యాప్తిని నిరోధించటానికి ప్రయత్నం జరిగిందని తారిఖ్ బుఖారాలో రాశారు. ఒక పండితుడు ఈ పరిస్థితిని ఇలా వివరించాడు. ముస్లింలు, జొరాస్ట్రియన్ల మధ్య శాంతి వాతావరణం అరుదుగా ఉండేది. సహకారం అంతంతమాత్రాన ఉండేది. ట్రాన్సోక్జీనియాను అరబ్బులు జయించినప్పటినుండి 13వ శతాబ్దం వరకూ సంఘర్షణ సాగుతూనే వచ్చింది. ఖురాసన్ అలాంటి పరిస్థితే ఉండేది. అరబ్బు సైనికాధిపతి అద్ అల్లా అమీర్ కు, స్థానిక ఇరానియన్ ప్రభువులకూ తీవ్రపోరాటాలుండేవి. ముస్లింలకూ, జొరాస్ట్రియన్లకూ శతృత్వం ఖురాసన్ లో శాశ్వతంగా ఉన్నది. జొరాస్ట్రియన్ మతసంస్థలను వీరు నాశనం చేశారు.
      ఇరాన్ లో తొలుత జొరాస్ట్రియన్లపై దాడి చేసినప్పుడు రెయిలో ఊచకోత కోశారు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాంలో మజూస్ వ్యాసం).
      ముస్లింలను ప్రతిఘటించినా చివరకు రేయిలో కొద్దిమందే మిగిలారు. సారక్ లో వందమందికి మాత్రమే దయాభిక్షపెట్టి స్త్రీలను బందీలను చేసి పిల్లలను ముస్లింలుగా పెంచారు. సుస్ లో వందమందిని క్షమించి  మిగిలినవారిని చంపేశారు. మనాధిర్ లో పురుషులను చంపేసి, స్త్రీలనూ, పిల్లలనూ బానిసలు చేశారు. ఇన్తకార్ లో 40వేలమంది ఇరానియన్లు చంపారు. జొరాస్ట్రియన్ల దేవాలయాలను నాశనం చేసి వారి పురోహితుల్ని చంపారు. అందులో కారియన్, కుమ్, ఇదాజ్ ప్రాంతాలు విధ్వంసానికి గురయ్యాయి. జొరాస్టర్ స్వయంగా నాటిన చెట్టును ఖలీఫా అల్ ముతావక్కిల్ నరికేసి వారిని రెచ్చగొట్టాడు. వారి దేవాలయాలను మసీదులుగా మార్చారు. 8వ శతాబ్దంలో జొరాస్ట్రియన్లు  అనేక పర్యాయాలు ముస్లింలపై ఎదురు తిరిగి ఆర్థికంగా తమ అణచివేతను ప్రతిఘటించారు. 755లో సిస్ బాద్, 746-748లో బీహాఫరీద్ తిరుగుబాటులు ఇందుకు ఉదాహరణలు. షిరాజ్ లో 979లో జరిగినట్లే నిర్బంధ మతమార్పిడులూ, వాటివలన కలహాలు తరచూ సంభవించాయి. ఈ నిర్బంధాలు తప్పించుకొవడానికి ఇండియా వలస వెళ్ళిన జొరాస్ట్రియన్లు పారసీలుగా అల్పసంఖ్యాక గౌరవం  పొందుతున్నారు.  జొరాస్ట్రియన్ల స్థితి 17వ శతాబ్దం నుండి మరీ ఆసన్నమయింది. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం ప్రకారం 18వ శతాబ్దం నుండి  మరీ అధ్వాన్నమయింది. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం ప్రకారం 18వ శతాబ్దంలో వారి సంఖ్య విపరీతంగా పడిపోయింది.  (మజూస్ వ్యాసం) 19వ శతాబ్దంలో భద్రతలేకుండా విచక్షణ వలన పేదరికంతో వారు గడిపారు. జొరాస్ట్రియన్ వ్యాపారస్తులకు అదనపు పన్నులుండేవి. వారి ఇళ్ళను దోపిడీ చేస్తుండేవారు.  వారు ప్రత్యేక దుస్తులు వేసుకోవాలి. కొత్త ఇళ్ళు నిర్మిచరాదు. పాతవి మరమ్మత్తు చేయరాదు.
స్వర్ణయుగం ?
    ధిమ్మీల స్థితి క్రమేణ అధ్వాన్నమయిందని, ఇస్లాంను  బలపరిచే పండితులతో సహా అందరూ అంగీకరించారు. ముస్లింలు బలహీనపడిన చోట, ధిమ్మీల స్థితి కూడా అధ్వాన్నమయింది. మత యుద్ధాలనుండే ఈ పరిస్థితి ప్రారంభమైనట్లు చెపుతున్నారు. ముస్లిం పాలన కింద స్పెయిన్ లో వివిధ మతాలమధ్య సామరస్యం ఉన్నదనీ, అదంతా స్వర్ణయుగమనీ చెపుతున్నారు. ఫ్లెచర్ ఇలా రాశాడు. బర్బర్ దండయాత్రలు, అల్మోరావిద్ దాడులు పరిశీలించినవారికి స్వర్ణయుగం అబద్దమని తెలుస్తుంది. స్పెయిన్ లో ప్రశాంతతకంటే గందరగోళమే ఎక్కువగా ఉన్నది. పోనీ సహనం ఉందా... గ్రెనడా యూదులు 1066లో మూకుమ్మడి హత్యకు గురయ్యారు. 1126లో క్రైస్తవులు మొరాకోకు నెట్టేయబడ్డారు. స్వర్ణయుగం ఉండేదనీ, 19వ శతాబ్దంలో ఒక భ్రమ వ్యాపింపజేశారు. ఇస్లాంను శ్లాఘించే ప్రయత్న చేశారు. రిచర్డ్ ఫ్లెచర్ ఇలా రాశాడు.
      19వ శతాబ్దంలో ముఘిరీ బీ రచయితలు తమ మధుర స్మృతులను ఎంతో ఉత్సాహంగా పేర్కొన్నారు. 20వ శతాబ్దం చివరలో ఇదే విషయాలను మళ్ళీ చెపుతున్నారు. క్రైస్తవ దండయాత్రలు మారిస్కోస్ ల బాధలు పేర్కొంటున్నారు. అబద్ధాలను అల్లి నిజాన్ని కప్పేస్తున్నారు. స్పెయిన్ లో మూరిష్ కాలం సహనంతో కూడింది కాదు  (ఫ్లెచర్, పుటః 173).
8, 19, 20 శతాబ్దాలు
    18, 19, 20 శతాబ్దాలలో ముస్లిమేతర్ల స్థితి చాలా దారుణంగా పరిణమించటానికి చిరకాలంగా వారనుభవించిన అవమానాలూ, చిత్రహింసలే కారణం. యూదుల పరిస్థితులు లెనిన్ ఇలా రాశాడు.
      18వ శతాబ్దం నుండి మొదలై 19వ శతాబ్దం అంతటా బహిష్కరణలు, హత్యలూ సాగాయి. 1770-1786లో జెద్దా నుండి  యూదులను బహిష్కరించగా ఎమెన్ పారిపోయారు. 1790లో మొరాకోలోని టెటాన్ వద్ద, 1828లో బాగ్దాద్లో, 1834లో సఫేద్ లో, 1839లో ఇరాన్ లోని మెషద్ లో, 1867లో బారాపురిష్ లో యూదులను దోపిడీ చేయటం, చంపటం, మతమార్చిడి చేయించటం జరిగింది. 1840లో డమాస్కస్ లోని యూదులను చంపేశారు. అరబ్బు దేశాలలో, ముఖ్యంగా మొరాకే, అల్జీరియా, టునీషియా, లిబియాలలో ఈ హత్యాకాండ జరిగింది. (బర్నార్డ్ లెనిన్, ది జ్యూస్ ఆఫ్ ఇస్లాం, పుటః 168)
      20వ శతాబ్దంలో యూదుల వ్యతిరేక సాహిత్యం ఇస్లాంలోకంలో విపరీతంగా వెలువడింది. హిట్లర్ మెయిన్ క్యాంప్ అనువాదం వంటిని చాలా వ్యాప్తిలోకి తెచ్చారు. యూరోప్ నుండి అరువు తెచ్చుకున్న యూదు వ్యతిరేక ప్రచారాన్ని తమ సాంస్కృతిక సంప్రదాయాలతో మిళితం చేసి చూపారు. (విస్ట్రిచ్. పుటః 222)
అర్మీనియన్ల ఊచకోత
    శతాబ్దాలుగా అర్మీనియన్ క్రైస్తవులను ముస్లింలు బాధ పెడుతూ వచ్చారు. రష్యా-టర్కీల మధ్య వ్యతిరేకతవలన అర్మీనియన్లు, రష్యా అండ కోరారు. 2 లక్షల 50 వేలమంది అర్మీనియన్లను ససూన్, ట్రాపేజుంట్, ఎడెస్సా, బిరెడిజిక్, కార్పూట్, నిక్సర్, వాన్ ప్రాంతాలలో చంపేశారు. వారి గ్రామాలు, చర్చీలు తగులబెట్టారు. అడానాలో 1904, 1909లో 30 వేలమంది అర్మీనియన్లను చంపారు. 1894-96 మధ్య అర్మీనియన్లను ఒక క్రమపద్ధతిలో చంపారు.
      టర్కీలో మరొకజాతి వారిని సహించలేమంటూ అర్మీనియన్లను 1915లో మూకుమ్మడిగా టర్కులు చంపేశారు. 20వ శతాబ్దంలో సామూహిక హత్యలకది నాంది. అది పథకం ప్రకారం జరిగింది కాదని లెనిన్ వంటివారు చెప్పి, విచారణకు నిలబడవలసి వచ్చింది. 10 లక్షలమంది అర్మీనియన్లను చంపగా, మిగిలినవారిని బానిసలుగా మార్చారు. హిట్లర్ కు బాగా నచ్చిన సంఘటన ఇది. అది అనుకరించే అతడు యూదులపైకి పోయాడు.
      ముస్లిమేతరులవల్ల దైవేచ్ఛ ప్రకారం సామూహిక హత్యలు సహజంగా జరిపినట్లు అర్మీనియన్ హింసాకాండ తెలుపుతున్నది. ఇది ఇంచుమించు జిహాద్ వంటిది. ధిమ్మీలలో జాతీయవాదం రూపుమాపటానికి తలపెట్టిన విధానం. జయించిన ప్రాంతాలను ఇస్లాం అదుపులో ఉంచటానికి చేసిన ప్రయత్నం. బాత్ యోర్ ఇలా రాశాడు. జిహాద్ తర్కాన్ని బట్టి వేరే మత విమోచన సహించరాదు. శాశ్వతయుద్ధం చేసి విస్తృతపరుస్తూ ఉమ్మ రాజకీయ ఆధిపత్యాన్ని అట్టిపెట్టటం దార్ అల్ హర్స్ పద్ధతిలో ముఖ్యమైన విషయం (ధిమ్మీ, లండన్, 1985, పుటః 99)
మూడు నిర్ణయాలు
    ఎ.ఎన్.త్రిటన్ ఇలా నిర్ణయానికి వచ్చాడు.
      ఖలీఫా ముతాసిమ్ సమారలో క్రైస్తవమఠాన్ని కొని తన మందిరాన్ని నిర్మించదలిచాడు. ఇతర ఖలీఫాలు తమ భవనాల నిమిత్తం చర్చీలను ధ్వంసం చేశారు. అలా ధ్వంసం చేయటానికి వారి జనం ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ధిమ్మీలకు సంపదున్నా పాలకుల బారినపడి జనం వేధిస్తుండగా ఎప్పుడూ, అవసరాలు తీరక కటకటలాడుతుండేవారు.  అల్ హకీమ్ ఉదంతం ఉన్మాదుడి చర్యగా భావించాలి. అది ఇస్లాంకు ఉదాహరణకాదు. ధిమ్మీల పరిస్థితి తరువాత ఇంకా మారిపోయింది. జనక్రౌర్యానికీ, మూర్ఖవాదానికీ బలిఅయ్యారు. ఇస్లాం అధ్యాత్మిక ధోరణి వారిని వేరుచేసింది. ఇస్లాంను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకు కొద్ది మినహాయింపులున్నాయి. ధిమ్మీ మతానికి సహాయం చేసిన ముస్లింను పిలిచి మూడుసార్లు పశ్చాత్తాప పడేటట్లు చేసి చంపేశేవారు  (త్రిటన్, పుటః 232, ది ఖలీఫ్స్ అండ్ దెయిర్ నాన్ ముస్లిం సబ్ జెక్ట్స్, లండన్, 1970)
      సి.యి. బాస్వర్త్ ధిమ్మీల స్థితిని గురించి ఇలా రాశాడు. ఒడంబడిక ప్రకారం ధిమ్మీలకు రక్షణ ఉన్నా ఇస్లాం సామాజిక విధానంలో వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూశారు. వైద్యులూ, ఆర్థిక, నిపుణులూ, కార్యదర్శులు వంటివారిని సహించేవారు. డబ్బు మార్పిడి, సారాయి తయారుచేయటం, బానిసల మర్మాంగాలను చితకగొట్టుట, తోళ్ళకు సంబంధించిన పనులు ముస్లింలు అసహ్యంగా భావించేవి ధిమ్మీలు చేసేవారు. ధిమ్మీ భార్యను ముస్లిం పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిం భార్యను ధిమ్మీ చేసుకోటానికి వీలులేదు. అలా చేసుకుంటే ఆమె నమ్మకంలేని వారితో చేరిపోయినట్లు అవుతుంది. ధిమ్మీ బానిసను ముస్లిం స్వీకరించవచ్చు. కాని ముస్లిం బానిసను ధిమ్మీ చేసుకోరాదు. న్యాయస్థానంలో ముస్లింకు వ్యతిరేకంగా ధిమ్మీ సాక్ష్యం చెల్లదు. హనాఫీ న్యాయమూర్తిగా చెపుతూ చిత్తశుద్దిగల ధిమ్మీకంటే చిత్తశుద్ధి లేని ముస్లిం మాట విలువైనదన్నాడు. (1090లో మరణించాడు) ధిమ్మీకి వ్యతిరేకంగా ముస్లిం సాక్ష్యం చెల్లుతుంది. ఇస్లాం చట్టంలో ధిమ్మీని చంపితే 2...3 వంతు డబ్బు చెల్లించాలని అన్ని ఇస్లాం శాఖలు అంటున్నవి. (పుటః 49, ది కాన్ సెప్ట్ ఆఫ్ ధిమ్మీ ఇన్ ఎర్లీ ఇస్లాం - బెంజమిన్ బ్రాండే, బి.లేవిస్ పరిష్కరించిన క్రిస్టియన్ అండ్ జ్యూస్ ఇన్ ఆటోమన్ ఎంపైర్, 2 సంపుటాలు, న్యూయార్క్, 1982)
      బాత్ యోర్ ఇలా రాశాడు.
      అణచివేత ఎలా ఉంటుందో చూపటానికి అనేక ఉదాహరణలున్నాయి. ముస్లింలకూ, ధిమ్మీలకూ మధ్య అసమానత్వాన్ని సమర్థించారు. ధిమ్మీలను ద్వేషించదగినవారు చూపారు. బలవంతంగా మతం మార్చటం, బహిష్కరించటం, చంపటం చరిత్ర అంతటా కనిపించింది. కష్టపడి సంపాదించుకున్న ధిమ్మీలను ఓర్వలేకపోయేవారు. వారి సంపదనంతా దోచుకోగా ధిమ్మీలు ప్రవాసం పోతుండేవారు. (వుటః 67, ధిమ్మీ, లండన్, 1985)

No comments:

Post a Comment