జి. డి. పరేఖ్ - ఇందుమతి Humanist Leaders

జి. డి. పరేఖ్ -


మానవవాద ఉద్యమానికి ఎం ఎన్ రాయ్ భావాల ప్రభావానికి అంకితమైన దంపతులు పరేఖ్ జంట.

జి.డి.పరేఖ్ వున్నన్ని నాళ్ళు ఇందుమతి పరిశీలిస్తూ పోయింది. అప్పట్లో జి.డి.రాడికల్ డెమోక్రటిక్ పార్టీ భాష్యకారుడుగా, సుప్రసిద్ధ వక్తగా పేరొందాడు. వేదిక మీద అనర్గళంగా మాట్లాడుతుంటే పక్కన రాయ్ వుంటే చూస్తూ, జోక్.లు వేస్తూ, ప్రేక్షకుల హర్ష ధ్వానాల మధ్య పరేఖ్ వీనుల విందు చేసేవాడని ఎలవర్తి రోశయ్య, ఆవుల గోపాల కృష్ణ మూర్తి చెప్పారు. ఎప్పుడైనా రాయ్ ముఖం చిట్లిస్తే ఠపీమని పరేఖ్ ఆపేశాడట.

అప్పట్లో నాకు ఆయన తెలియదు. తరువాత డెహ్రాడూన్ స్టడీ కాంపులో 5 రోజులు కలసి వున్నాం. ఆ కాంప్.కు ఢిల్లీ నుండి రైలులో వెడుతుండగా ఒకే కంపార్ట్.మెంట్.లో యాదృచ్ఛికంగా కలిశాం. పక్కనే వి.బి.కర్నిక్ కూడా వున్నారు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. 5 రోజుల స్టడీ కాంప్.లో పరేఖ్ ఎన్నో సందర్భాల్లో చర్చలో పాల్గొన్నారు. ఆరితేరిన ప్రసంగకర్తగా రాయ్ వికేంద్రీకరణ సిద్ధాంతాలను విడమరచి చెప్పాడు. వినడానికి ఎంతో బాగున్నా ఆచరణ సాధ్యం కాదనిపించింది.

ఎం.ఎన్. రాయ్ ఇంట్లో (13 మోహినిరోడ్) చివరి రోజున సోషల్ గెట్ టుగెదర్. అందరికీ కాక్ టైల్స్ కలిపి గౌరి, ఇందుమతి అందిస్తుంటే, వివిధ ప్రాంతాలవారు వారి వారి తీరులో అనుభవాలు జోక్.లు చెప్పారు. పరేఖ్ అందర్నీ నవ్వించాడు. నేను మల్లాది రామమూర్తి గుత్తికొండ నరహరి వున్నాం. రామమూర్తి తాగడు. ఆరోజు మొహమాట పెట్టగా ఆయనా స్వీకరించాడు. సంతోషించాం.

ఆ ఇంట్లో రాయ్.తో తాను గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకొని తార్కుండే కళ్ళంట నీళ్ళు పెట్టాడు.

పరేఖ్.ను తరువాత బొంబాయిలో కలిసేవాడిని. ఆయన యూనివర్సిటీ రెక్టార్.గా పనిచేస్తూ, జనరల్ ఎడ్యుకేషన్ పై పుస్తకం రాశారు.

లక్ష్మణ శాస్త్రి జోషి మరాఠీలో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీషులోకి ది క్రిటిక్ ఆఫ్ హిందూయిజం అని అనువదించారు పరేఖ్. దానిని నేను తెలుగులో రాసి ప్రసారితలో ప్రచురించాను. తిలక్ సిద్ధాంతాలను కొన్నింటిని సమర్ధిస్తూ పరేఖ్ రాసిన వాటిని ఎ.బి.షా హ్యూమనిస్ట్ వేలో వేశారు. రాడికల్ హ్యూమనిస్ట్.లో పరేఖ్ వ్యాసాలు వచ్చేవి.

ఆయన అనంతరం ఇందుమతి పరేఖ్ బొంబాయి పేదల లో సామాజిక సేవ ఆరంభించింది. ఆమె డాక్టర్.

హ్యూమనిస్ట్ వుద్యమంలో దీక్షగా పనిచేసి సంఘసేవ ప్రాధాన్యతను చూపింది. స్త్రీల సమస్యలు ముందుకు తీసుకువచ్చింది. ఆమె సేవల దృష్ట్యా హ్యూమనిస్ట్ హీరోయిన్.గా రూపొందినది.

బొంబాయిలో ఆమె ఇంట్లో జరిగిన చిన్న సమావేశాలలో పాల్గొన్నాం. హైదరాబాద్.లో మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది. కోమల, ఇందుమతి, గౌరి, కలసి పాత హైదరాబాద్.లో షాపింగు చేసేవారు.

ఆంధ్రలో ఇందుమతి అనేక పర్యాయాలు పర్యటించింది. ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర నా తెలుగు అనువాద ఆవిష్కరణ తెలుగు యూనివర్సిటీలో ఆమె చేసింది.

బొంబాయిలో ఇందుమతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవవాద సమావేశాలు జయప్రదంగా జరిపింది.

నేను వాషింగ్టన్.లో వుండగా మహిళా కార్యక్రమాల పథకాలు చర్చకు ఆమె వచ్చింది. అక్కడ కలుసుకొని చర్చించాము. మానవవాద సంఘ నాయకురాలుగా కార్యకర్తల్ని ఉత్సాహపరచింది. ఆమె ఆచరణ వాది. పెద్ద రచయిత్రి కాదు. ఉపన్యాసకురాలు కాదు. కాని అంతర్జాతీయ మానవవాదులు ఆమె కార్యక్రమాలు తిలకించి, మదర్ థెరెసాను కాదు, ఇందుమతిని గుర్తించాలి అన్నారు.

ఎన్.సైక్లోపీడియా అన్ బిలీఫ్.లో ఇందుమతి గురించి నేను రాశాను. ఎడిటర్ టాంప్లిన్ కోరికపై అలా చేశాను.

Dr Indu tai( Indumati)






2 attachments — Download all attachments View all images

No comments:

Post a Comment