సుశీల్ ముఖర్జీ Met Sushil Mukherjea in Kolkata at his residence
కలకత్తాలో ఉన్న మినర్వా అసోసియేట్స్ ప్రచురణ సంస్థ వ్యవస్థాపకుడు సుశీల్ ముఖర్జీ. ఆయన జయప్రకాష్ నారాయణ్, నిరంజన్ , వి.ఆర్.నార్ల వంటి ప్రముఖుల రచనలను ముద్రించేవారు. ఆయన కలకత్తా బుక్ ఫెయిర్.కి సంస్థాపక అధ్యక్షుడు. సుశీల్ ముఖర్జీ ఎమ్.ఎన్.రాయ్ ఆలోచనా స్రవంతికి విశ్వసనీయమైన అనుచరుడు.
1970 ప్రారంభంలో నాకు వారితో పరిచయం కలిగింది. వెంటనే నేను ఆయనను హైదరాబాదుకు రమ్మని ఆహ్వానించాను. నేను ఆయనను శ్రీనార్ల వెంకటేశ్వరరావుగారికి (ఆంధ్రజ్యోతి వ్యవస్థాపక సంపాదకులు) పరిచయం చేశాను. నార్ల వారి ఇంట్లో మేము అనేకసార్లు కలుసుకున్నాము. సుశీల్ నార్లవారి వ్యక్తిత్వానికి, ఆలోచనా సరళికి ఎంత ముగ్ధులయ్యారంటే నార్లవారి పుస్తకం గాడ్స్ గోబ్లిన్స్ అండ్ మెన్ అనే పుస్తకాన్ని వెంటనే ప్రచురించడానికి సంకల్పించారు.
నార్లవారు కొన్ని సందర్భాల్లో వెలిబుచ్చిన హేతువాద ఆలోచనలూ, కొన్ని సూక్తులతో రూపొందించిన పుస్తకం అది. అది బాగా అమ్ముడు పోయి పాఠకులలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన నా పుస్తకం కూడా ప్రచురిస్తానని సుశీల్ అన్నారు. కానీ నేను అప్పటికే వేరే ప్రచురణకర్తల ద్వారా పుస్తకాన్ని వెలువరించాను. అప్పటి నుండి మేము పరస్పరం ఉత్తర ప్రత్యుత్తరాలతో కలుస్తూనే ఉన్నాం.
నిరంజన్.ధర్ వ్రాసిన వేదాంత అండ్ బెంగాల్ రినైసాన్స్ అనే పుస్తకం సుశీల్ ప్రచురణలన్నింటిలో అత్యంత వివాదాస్పద రచనగా పేరుపొంది సంప్రదాయ హిందూ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. నేను ఆ పుస్తకాన్ని వివేకానందుడికి సంబంధించిన ఉచిత సమాచారం కోసం ఉపయోగించాను. ఉదయం దినపత్రికలో ప్రచురించబడ్డ నా రచనలు కూడా వ్యతిరేకతను వివాదాల్ని మూటగట్టుకున్నాయి.
సుశీల్ జయప్రకాశ్ నారాయణ్ రచించిన వికేంద్రీకృత సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు.
హైదరాబాద్.లో నేను సుశీల్.కి అనేకమంది హేతువాద, మానవవాద మిత్రుల్ని పరిచయం చేశాను.
బుక్.లింక్స్ అధినేత సుశీల్.గారి పరిచయానికి ఎంతో సంతోషించి ఆయనతో ఎడతెగని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
చాలాకాలం తర్వాత నేను కలకత్తా వెళ్ళి సుశీల్.గారిని వారియింట్లో కలుసుకున్నాను. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నరు. చక్రాల కుర్చీకి అంకితమై ఉన్నారు. సుశీల్ పొగత్రాగేవారు. చక్కని సంభాషణా చతురుడు.
ఆయన మాకు ఆతిథ్యమిచ్చి తాను కొత్త యింటికి మారుతున్నట్లు చెప్పారు. అప్పుడు ఇసనాక మురళీధర్ నాతో ఉన్నారు. ఆయన మాకు కొన్ని ఫోటోలు తీశారు. సుశీల్ నేను కలవటం అదే చివరిసారి. ఆయన 2007లో మరణించారు.
No comments:
Post a Comment