సమరన్ రాయ్
2005లో నేను నా ఫ్రెండ్ ఇసనాక మురళీధర్ తో సమరన్ రాయ్ బాగా వయసుమీరి ఉన్నప్పుడు కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని వాళ్ళింటికి అల్పాహార విందుకు ఆహ్వానించడం జరిగింది. మేము ఆయనతో ఫోటోలు తీసుకున్నాము. సమరన్ నాతో చాలా రోజులు టచ్.లో వుండేవారు. ఆయన ఆమెరికన్ కాన్సల్
ఆఫీసులో పనిచేసి 1950 ప్రాంతాలలో రిటైర్ అయ్యారు. ఆయన ఎమ్.ఎన్.రాయ్ అభిమాని, ఎమ్.ఎన్.రాయ్ యువకుడుగా వున్నప్పుడు ఆయన మీద చాలా పరిశోధనలు చేశారు. రాడికల్.గా ఎమ్.ఎన్.రాయ్, కమ్యూనిస్టుగా ఎమ్.ఎన్.రాయ్ మీద రెండు పుస్తకాలు ముద్రించారు. ఎమ్.ఎన్. రాయ్ భారత దేశపు ప్రథమ కమ్యూనిస్ట్, అంతే కాకుండా భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థాపకుడుగా 1920 ప్రాంతాలలో తాష్కెంట్ నుండి పని చేసారు.
. ఎమ్.ఎన్.రాయ్.ని అవిశ్రాంత బ్రాహ్మణుడుగా సమరన్ వర్ణించారు. నేను ఎమ్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ ట్రెంట్ జీవితచరిత్ర పరిశోధన ముద్రించినపుడు సమరన్ రాయ్ అబ్బురపడి దాని ప్రతిని కావాలని అడిగారు. 1925లో ఆయన యూరోప్ నుంచి తిరిగి వచ్చారు. అప్పటి వరకు ఎవిలిన్ రాయ్ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనికి సమరన్ కూడా అంగీకరించారు. ఎమ్.ఎన్. రాయ్ పుట్టిన తేదీ విషయంలో శిబ్ నారాయణ్ రే, సమరన్ రాయ్.లకు భేదాభిప్రాయాలున్నాయి. సమరన్ రాయ్ తరచు అమెరికాకు వెళ్ళి అక్కడ టెక్సాస్.లో ఉన్న బెంగాలీ సంస్థలతో సంబంధాలు కొనసాగించేవాడు. నాకు ఎమ్.ఎన్.రాయ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు సమరన్ చెప్పారు. ఆయన్ని కలవడం నా అనుభవంగా
భావిస్తున్నాను. 2007లో ఆయన మరణించారు. ఆయనతో ఉన్న ఫోటో నా దగ్గర ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
పని చేసారు.
1 comment:
విలువయిన టపా అందించారు .ధన్యవాదాలు !
Post a Comment