బసవ ప్రేమానంద్ మాజిక్ ద్వారా

బసవ ప్రేమానంద్ భారత దేశంలోనే గాక ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించారు.


దేశంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.మాజిక్ ద్వారా జరుగుతున్న బాబాల, మాతల మోసాలను గుట్టు విప్పారు.

కోయంబత్తూర్ సమీపంలో పోడనూర్.లో తన భవనంలో సైన్స్ ప్రదర్శన ఏర్పరచారు.

ఆయన వయస్సు 80. కొన్నాళ్ళుగా కేన్సర్.తొ వుంటూ, ఇప్పుడు చివరిదశకు చేరారు.

ముందు తరాల వారికి ఆదర్శంగా విల్లు రాసి, తాను చనిపోగానే తన దేహాన్ని మెడికల్ కాలేజ్.కు ఇవ్వమన్నారు .

సత్యసాయి బాబా మొదలు అనేక మంది మోసాలను, అరాచకాలను బయటపెట్టారు .

సాయిబాబా ఆశ్రమంలో హత్యలు పేరిట డాక్యుమెంటరితో గ్రంథం వెలువరించారు .వివిధ మాజిక్ విషయాలు శాస్త్రీయంగా వివరిస్తూ, అవి ఎలా చెస్తారు అని సోదాహరణగా చూపుతూ మరొక గ్రంథం రాశారు.

ఇండియన్ స్కెప్టిక్ అనే మాసపత్రిక నడిపి, ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలను అందించారు.

డాక్టర్ పి ఎం భార్గవ సైన్స్ ప్రదర్శన పెడితే మత పార్టీలు దానిని నాశనం చేసే ప్రయత్నం తలపెట్టగా, ప్రేమానంద్ ఆదుకొని తన చోట దానిని ధైర్యంగా పెట్టారు . అంత గొప్ప వ్యక్తి. త్వరలో లోగడ అబ్రహాం కోవూర్ వలె ప్రేమానంద్ కూడా మానవ హేతువాద ఉద్యమాలలో సేవ చేసారు. ఆయన ఇప్పుడు మనకు అందించిన సాహిత్యం గొప్ప సంపద.No comments:

Post a Comment