S.Ramanathan Veteran in Rationalist movement

రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు

మద్రాసులో హేతువాద వుద్యమం ఆరంభించి భారతస్థాయికి తీసుకెళ్లారు. రాజాజీ మంత్రివర్గంలో 1938లో వున్నారు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక నిర్వహించారు. మంచి హేతువాద లైబ్రరీ సమకూర్చారు. దేశమంతటా పర్యటించి ఉద్యమానికి ప్రోత్సాహం యిచ్చారు.


హైదరాబాద్.కు ఆహ్వానించాం. అప్పటికే బాగా వృద్ధులైపోయారు. 1976 నాటి మాట. వై.ఎమ్.ఐ.ఎస్. హాలులో అతి నెమ్మదిగా ప్రసంగించారు. అబ్బూరి, ఎ. ఎల్. నరసింహారావు వున్నారు.మద్రాసులో ఆయన యింట్లోకి వెళ్ళాం. చనిపోయిన తరువాత ఆయన భార్య ఆసక్తి చూపనందుకు లైబ్రరీని, పత్రికను తరలించారు. సూర్యనారాయణ, జయ గోపాల్ స్వీకరించారు. జయగోపాల్ అమెరికా వెళ్ళి పెళ్ళి చేసుకొని అట్లాంటాలో వెబ్.సైట్ నడిపారు. 2000 ప్రాంతాలలో చనిపోయారు. సూర్యనారాయణ కేరళ వెళ్ళిపోయారు. పత్రికను హైద్రాబాద్ తెచ్చి నడిపినప్పుడు జయగోపాల్ రాశారు. ఆవుల సాంబశివరావు సంపాదకుడుగా ఎన్.కె.ఆచార్య, జాస్తి జవహర్ లాల్, నేను పత్రిక నిర్వహణకు పూనుకున్నాము. ఇది 1970 తరువాతి మాట. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సూర్యనారాయణ పత్రికను మద్రాసు తీసుకువెళ్ళారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు నడవలేదు.

రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు. రష్యా కూడా పర్యటించారు. ఎంతో శ్రమకు ఓర్చి ఉద్యమాన్ని నడిపారు. ఆయనతో సన్నిహిత సంబంధం ఉండటం గర్వకారణం.

No comments:

Post a Comment