Great Leader in Indian Humanist movement V M Tarkunde

తార్కుండే



Sib Narayan Ray, V M Tarkunde ( middle) Ms Indumati Parekh


1940 ప్రాంతాల నుండీ ఆంధ్ర రాడికల్స్.కు చిరపరిచితుడు తార్కుండే. తమ పూర్వీకులు ఆంధ్ర నుండి వలస వచ్చారనీ, యింటిపేరు తాడికొండ అనీ, మరాఠీలో తార్కుండే అయిందని చెబుతుండేవారు. పూర్తి పేరు విఠల్ మహదేవ్ తార్కుండే (03.07.1909 – 22.03.2004).



ఎం.ఎన్.రాయ్.కు అటు పార్టీలోనూ యిటు ఉద్యమంలోనూ అత్యంత సన్నిహిత మిత్రుడు, అనుచరుడు సహచరుడుగా ఆయన వున్నాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, చదువుకొని అడ్వొకేట్.గా ప్రాక్టీసు చేస్తూ బొంబాయి హైకోర్టు జడ్జి అయ్యాడు. పాస్ పోర్టు పొందే హక్కు పై చరిత్రాత్మక తీర్పు యిచ్చి, సంచలనం సృష్టించారు. పౌరులందరికీ పాస్ పోర్టు పొందే హక్కు ఉన్నదని చెప్పారు. ఎం.ఎన్.రాయ్ తో ఆయనకు సెంటిమెంటల్ అనుబంధం వుంది. రాయ్ సంస్మరణ సభలలో, డెహ్రాడూన్ రాయ్ నివాసంలో గతస్మృతులు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టేవాడు. జడ్జిగా తన స్వేచ్ఛకు పరిమితులు వున్నాయని వుద్యమానికి ఏమీ చేయలేకపోతున్నానని రాజీనామా యిచ్చి, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు పెట్టాడు పూర్తిగా ఉద్యమంలో నిమగ్నుడయాడు. రాడికల్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్, సెక్యులరిస్ట్, రినైజాన్స్ ఉద్యమాలతోబాటు పౌరహక్కుల ఉద్యమం సాగించాడు.



ఎమర్జన్సీలో ఇందిరా గాంధీని వ్యతిరేకించి, జయప్రకాశ్ నారాయణ్.ను సమర్ధించాడు. ముస్లింలలో తీవ్రవాదులను దూరం చేసి, మితవాదులను కలుపుకోవాలనేవాడు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక నడపడానికి, రాయ్ సాహిత్య ప్రచురణకూ చాలా సహాయపడ్డాడు.



దేశవ్యాప్తంగా పర్యటించి సభలు సమావేశాలు, అధ్యయన తరగతులలో ఎందరికో పాఠాలు చెప్పారు. నేను ఆయన్ను బొంబాయిలో డెహ్రాడూన్.లో, ఆంధ్రలో, ఢిల్లీలో అనేక పర్యాయాలు కలిశాను. ఉద్యమంలో పనిచేశాం. ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాం. అనేక వ్యాసాలు, ప్రచురణలు చేసిన తార్కుండేకు ఆయన భార్య గౌరి చేయూత నిచ్చేది.



V M Tarkunde with N.Innaiah

Tarkunde at left bottom, Justice Gopalarao Ekbote middle, Justice A.sambasivarao right

No comments:

Post a Comment