తానా సజీవ చరిత్ర-part 3- by Innaiah Narisetti

తానా  జనసేవ  (ఫౌండేషన్)
తానా మహాసభలు రెండేళ్ళకోసారి జరుగుతూంటే, తానా ఫౌండేషన్ కార్యక్రమాలు నిరంతరంగా సాగుతూ ఉంటాయి. ఇవి వివిధ రంగాలలో జనసేవ కార్యక్రమాలుగా జరుగుతున్నాయి. ఇందులో పెద్దలకు, పిల్లలకు సేవలందించే విశేషాలున్నాయి.
ఫౌండేషన్.కు ఎన్నికైన   ట్రస్టీల బోర్డునేతృత్వంలో ఈ సంస్థ వివిధ కార్యక్రమాలని చేపడుతుంది.  ట్రస్టీలలో 72మందిని ‘తానా’ సర్వసభ్య సమావేశం నాలుగేళ్ళ పదవీకాలానికి ఎన్నుకుంటారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వీరిలో సగంమంది పదవీ విరమణ చేస్తారు. ఛైర్మన్, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కోశాధికారి ఫౌండేషన్ దైనందిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇవి సజావుగా సాగేందుకు ఈ ఫౌండేషన్ ఫైనాన్స్, ప్రాజెక్టులు, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్, సామాజిక ఆర్ధిక పరిశోధన పేరుతో నాలుగు కమిటీలను ఏర్పర్చింది. మొత్తం పని స్వచ్ఛంద ప్రాతిపదికన జరుగుతుంది. ఎవరికీ ప్రయాణ ఖర్చులు కానీ, టెలీఫోన్ ఖర్చులు కాని చెల్లించరు. దీనివల్ల ఈ ఫౌండేషన్ ఖర్చులు కేవలం 2.5 శాతం లోపే ఉంటాయి. ఇది కేవలం ఛారిటబుల్ అంటే దాతృత్వ సంస్థ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. వ్యక్తులు తాము కోరుకున్న ఏ ప్రాజెక్టుకైనా  నిధులు సమకూర్చడానికి ముందుకు వస్తే ‘తానా’ వాటిని అమలు జరిగేలా చూస్తుంది.  అందులో  2.5 శాతం మినహాయించి ఈ మొత్తాన్ని సాధారణ ప్రాజెక్టులకు కేటాయిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మినహాయింపు కూడా ఉండదు. పన్ను మినహాయింపు పొందిన లాభేతర సంస్థకు వర్తించే మార్గదర్శక సూత్రాలు వీటికి వర్తిస్తాయి.
ఉత్తర అమెరికాలో తెలుగు వారి కోసం స్థాపించిన తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్‌ అమెరికా) తెలుగువారు గర్వపడేలా తానా ఫౌండేషన్‌ ప్రారంభించి 37 సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.350 కోట్ల వ్యయంతో పాఠశాల, రోడ్లు, దేవాలయాలు, పారిశుధ్యం, గోదావరి వరదల్లో చిక్కుకున్న వారికి ఆర్థిక సహాయం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 300 గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టారు. సేవా, సంస్కృతి, సమైఖ్యతే లక్ష్యంగా పని చేస్తున్నారు.
తానా ప్రజాసేవా కార్యక్రమాలు ఆర్భాటం లేకుండా అవసరమైనవారికి అందించే రీతిలో జరుగుతున్నాయి. రెండేళ్ళకోమారు జరిగే సభల ప్రచారం ఫౌండేషన్ కార్యక్రమాలకు ఉండదు గాని వాటి ఉపయోగం ఆదర్శం చాలా విలువైనది. తానా ఫౌండేషన్ ఇందులో పూర్తిగా నిమగ్నమై దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరుస్తున్నది.
రెండవ తెలుగు సమ్మేళనంలో తెలుగు ప్రజల ప్రయోజనం రీత్యా సామాజిక సేవా, దాతృత్వ కార్యక్రమాలను చేపట్టాలనుకున్నారు. దానికోసం ‘తానా’లో సమగ్ర భాగంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల ‘తానా ఫౌండేషన్’  (తెలుగు ఫౌండేషన్ ఆఫ్ తానా) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థ అమలు చేసే విషయంలో మూడవ తెలుగు మహాసభల కాలం నాటికి తానా ఒక కొలిక్కి వచ్చింది. తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వారి విద్యా, సాంస్కృతిక, సాహిత్య, ఆరోగ్య, జీవన ప్రమాణాలను పెంపొందించడం, కొత్తగా ఉత్తర అమెరికా వచ్చిన తెలుగు మాట్లాడే ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడం, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు సహాయ సహకారాలను అందించడం లక్ష్యాలుగా పెట్టుకుని ఫౌండేషన్ అమలు ప్రారంభించింది. తొలుత చిన్న బొడ్లపాటి, బి. వెంకటేశ్వరరావు, చలసాని విద్యాధరరావు  ఫౌండేషన్ కు తాత్కాలిక కమిటీగా ఏర్పడి వివిధ ప్రాజెక్టు ప్రతిపాదనలను అమలు చేశారు. అమెరికాలో తెలుగు పిల్లలకు వేసవి శిబిరం చేపట్టి రాష్ట్ర సంస్కృతి, భాషా సాహిత్యాలను పరిచయం చేయడం, రాష్ట్రం నుంచి తెలుగు పుస్తకాలను తెప్పించి తానా సభ్య సంఘాలకు విరాళంగా ఇవ్వడం, హైదరాబాద్ లోని రామకృష్ణ మఠం ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు పాఠశాల, త్రాగునీరు, రహదారి సౌకర్యాలకోసం నిధులు సమకూర్చడం ఫౌండేషన్ చేపట్టిన తొలి కార్యక్రమాలు.
తానా ఫౌండేషన్ నిర్వాహక బాధ్యతలు స్వీకరించిన వారిలో లింగమనేని జగన్మోహనరావు, రాం నున్నా, రామారావు కాజ, పోలవరపు జగన్మోహనరావు, రవీంద్రనాథ్ గుత్తికొండ, రాఘవరావు పోలవరపు, సుదర్శనరావు పరుచూరి, వెంకయ్య దామ, ప్రసాద్ చౌదరి కాకరాల, యుగంధర్ ఆర్. వల్లభనేని, తిరుమలరావు తిపిర్నేని ఉన్నారు.
1981లోనే ‘తానా’ ఫౌండేషన్ శాశ్వత ధర్మనిధి, స్కాలర్ షిప్పులను ప్రవేశపెట్టింది. వీటికి అమెరికానుంచి, రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చారు. ఇదే ఏడాది నుంచి ప్రతి తానా సదస్సులలో పాల్గొన్న కళాకారుల్లో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వారికి గుత్తికొండ (అరుణ్) స్మారక అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తానా యువత, తానా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు 2 వేలడాలర్ల చొప్పున ఫౌండేషన్ నిధులను ప్రకటించింది. స్థానిక విద్యార్థులకు వేసవి శిబిరాలు, చిన్మయ మిషన్ ద్వారా తెలుగు పిల్లలకు కరస్పాండెన్స్ కోర్సులకు కూడా నిధులు అందించింది.
1998లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, నాందీఫౌండేషన్ తో కలసి  తానా ఫౌండేషన్ బహిరంగ మురికి ప్రక్షాళన చేయడానికి 10 గ్రామాలలో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 100 ఇళ్ళకు సెప్టిక్ టాంక్ మరుగుదొడ్లు నిర్మించే ప్రణాళిక చేపట్టి. ఒక్కొక్క దాత వాటా రు.1000, ప్రభుత్వ గ్రాంటు రు.2000లు. 2000 మరుగుదొడ్ల నిర్మాణం 20 గ్రామాలలో పూర్తి చేసింది. నాందీ ఫౌండేషన్, తానాతో కలిసి ముందుగా ఎంపిక చేసుకున్న 40 గ్రామాలలో నిర్మాణం జరిపింది.
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే తానా సభల్లో కళాకారులకు అవార్డు ప్రదానం చేస్తారు. దానికి సమకూర్చిన నిధులు :
1981లో గుత్తికొండ (అరుణ్) మెమోరియల్ అవార్డ్ $ 10000 లతో ప్రారంభించారు. దీనిపై వచ్చే వడ్డీని  ప్రదర్శనలో నైపుణ్యం చూపించిన కళాకారులకు (ఇండియా, ఉత్తర అమెరికా) పారితోషికంగా తానా సమావేశాలలో ఇస్తారు.
స్పాన్సర్స్ - శ్రీమతి పద్మావతి, రవీంద్రనాథ్ గుత్తికొండ
వార్షిక స్పెల్లింగ్ బీ (నిధి)
ఉత్తర అమెరికాలోని ఇండియా యువతకు అవార్డ్సు ప్రదానం
రాశి లేబరేటరీస్ ఎండోమెంట్ $ 5000 నిధి. ఉత్తర అమెరికాలోని  ఉత్తర, దక్షిణ ఫౌండేషన్ వార్షిక స్పెల్లింగ్ బీ పోటీలను నిర్వహించి వాటి పారితోషికాలకు దీని మీద వడ్డీగా వచ్చిన దానిని మాత్రమే వినియోగించింది.
అవార్డు దాతలు
రాశి లేబరేటరీస్
శ్రీమతి సత్యవతి, యుగంధరరావు వల్లభనేని
పట్టభద్రుల ఉపకారవేతన నిధి (ఆంధ్రప్రదేశ్, ఇండియా నుండి)
2000-2001లో ఫౌండేషన్ కి దాతలు ఏర్పరచిన నిధి $ 15,000. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంపు చేశారు.
తానా ఫౌండేషన్ ప్రాజెక్టులు
1999 జూలై, జూన్ 2001 మధ్య కాలంలో లబ్ధిదారులకు జీవనప్రమాణాన్ని పెంచడానికి తానా ఫౌండేషన్ కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల్ని ప్రారంభించింది. ప్రతి ప్రాజెక్టు కూడా, ఉత్తర అమెరికా తెలుగు వారి  సహకారంతో సమర్ధవంతంగా నిర్వహించింది.
తానా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ లో  చేసిన మానవతా కార్యక్రమాలు
వికలాంగుల సంక్షేమ శిబిరాల నిర్మాణ సహాయార్థం
వేగేశ్న ఫౌండేషన్ హైద్రాబాద్ లో వికలాంగుల కొరకు నిర్మించిన వైద్య పరీక్షా కేంద్రానికి స్కానర్, పల్స్ ఆక్సిమీటర్ కొనుగోలు నిమిత్తం $ 16,400 సహాయం.
ఉత్తర అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి కృషి
గౌరవ డాక్టరేట్ సభ్యులు క్రిస్టోఫర్ చేకూరి, అరవింద పిల్లలమర్రి, రాజగోపాల్ వకుళాభరణం లకు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినందుకు (యూనివర్సిటీ ఆఫ్ విస్ కాన్సిన్, మాడిసన్) $ 4500 ప్రదానం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు విద్యార్థులకు ఉపకారవేతనంతో ఆహ్వానం
2000-2001 విద్యా సంవత్సరానికి తానా ఫౌండేషన్ ఇద్దరు విద్యార్థులకు $ 2000 ఉపకార వేతనంగా లావణ్య వల్లభనేని హైద్రాబాద్, గుంటూరుకు చెందిన పి.వంశీ జ్ఞానకన్ లకు ఉన్నత చదువులకై యూనివర్సిటీ ఆఫ్ మాసచుసెట్స్ లో  ఇలినాయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లకు చెల్లించినది.
2001-2002 విద్యా సంవత్సరంలో తానా ఫౌండేషన్ ఉపకారవేతనాలను, రెండు అదనపు ఉపకార వేతనాలను అందించింది.
ప్రతిభావంతులైన తెలుగు యువతకు ఉపకారవేతనాలతో సత్కారం
2000-2001 సంవత్సరంలో తానా ఫౌండేషన్ 5 ఉపకార వేతనాలను ఒక్కొక్కరికి $750, $300 వంతున తెలుగు ఉత్తర అమెరికా హైస్కూల్ సీనియర్ విద్యార్థులకు అందించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో తానా ఫౌండేషన్ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం
1999 జూలై 2001 జూన్ మధ్య కాలంలో తానా ఫౌండేషన్ ఉత్తర అమెరికాలో ఎంతోమంది దయార్థులైన దాతలను ప్రోత్సహిస్తూ, వారిని అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటట్లు చేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు సహాయపడింది.
నాలుగు ఆదర్శ  గ్రామాలు
1. కారంచేడు - ప్రకాశంజిల్లా, ఆంధ్రప్రదేశ్ - పూర్ణచంద్ర తాల్లూరి
దాతలు - తాళ్ళూరి పూర్ణచంద్రరావు, యార్లగడ్డ కృష్ణప్రసాద్, నాగేశ్వరి, సుబ్బారావు, గుంటుపల్లి, నాగన్న పోతిని, సి.అంజన, అన్నపూర్ణ ప్రసాద్, కారంచేడుకు చెందిన స్థానికులు.
భాగస్వామ్యం - సుమారు $20,000 కొత్త తాగునీటి ట్యాంక్ కు, $11,000 వయోజనుల వసతి గృహం కోసం భూమి కొనుగోలు, అదనంగా $2200 ప్రతి సంవత్సరం జరిగే సాధారణ కార్యక్రమాలు.
2. మోపర్రు
మోపర్రు (మోడల్) నమూనా గ్రామము. తెనాలి తాలూకా గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
గుత్తికొండ రవీంద్రనాథ్
అభివృద్ధి చెందిన దేశంలో సాధారణ జీవన ప్రమాణాలకంటే మెరుగైన జీవన ప్రమాణాన్ని మోపర్రు మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసింది.
దాతలు - గుత్తికొండ గోపాలకృష్ణ, వసుమతి వారి కుటుంబ సభ్యులు (ఆస్టిన్, టెక్సస్) ($6000) గుత్తికొండ సుధీర్ బాబు, స్వరాజ్యలక్ష్మి (ఫుల్టన్, న్యూయార్క్) ($6000 + $2000), కొడాలి భవానీ శంకర్, శోభ (వెస్ట్ వుడ్, మెసాచుసెట్స్ ($6000 + $2000), కొడాలి హరిబాబు, కవిత (బెస్టెర్ ఫీల్డ్, మిస్సోరి) ($2000) కొడాలి ఝాన్సీరాణి (ఎడిసన్, ఎన్.జె.) ($1000), కొడాలి రఘుబాబు, పద్మజ (ఎడిసన్ న్యూజెర్సీ) ($16000), కొడాలి శ్రీనివాస్, శ్రీలక్ష్మి (హిల్స్ బోరో, న్యూజెర్సీ), ($6000), కొడాలి స్వతంత్ర బాబు, రాణి ($2000), కొత్తపల్లి వీరబ్రహ్మ ప్రసాద్ (కాలిఫోర్నియా) ($6000), వడ్లమూడి బాబు
3. రామాపురం
నమూనా గ్రామం, గుడివాడ తాలూకా, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్, సి. కాకరాల
ప్రాజెక్టు వివరాలు - నివాస గృహం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించుట, ప్రభుత్వ అనుసరణల ప్రకారం ఆ యింటిని వేరొక నమూనాలో నిర్మించుట.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 ఎకరాల స్థలము దాతలు ఇచ్చారు. ఆంధ్ర హోం శాఖామాత్యులు (కీ.శే. మాధవరెడ్డి) చే కాకరాల భాస్కర రావుగారి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. దాదాపు 70 నుండి 100 మంది రోగులను ప్రతిరోజు పరీక్షించడం జరుగుతోంది. ప్రసవాలు, సి సెక్షన్స్, తేలికపాటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. కంటి పరీక్షా శిబిరము, హిస్టిరెక్టమీ శిబిరం, దంత రక్షణా శిబిరాలు నిర్వహించారు, ఏలూరులోని ఆస్తమా, అలెర్జీ సంస్థ వారిచ్చిన విరాళాలకు వారికి కృతజ్ఞతలు, ఇకెజి పరికరాలు ఈ మధ్య కాలంలో బేబీ కోమలి హార్ట్ సెంటర్ వారిచే బహూకరించారు. ప్రస్తుతము వీలయినన్ని ఎక్కువ పడకలను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అలాగే, అదనంగా మరొక డాక్టరును, ప్రసూతి, పీడియాట్రిక్ శాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చడమైనది. విద్యాసౌకర్యాలకు కొత్తగదుల నిర్మాణంతో మెరుగుపరచబడినది.
4. జంపని
నమూనా గ్రామం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ శ్రీ యుగంధరరావు వల్లభనేని
దాతలు - వల్లభనేని యుగంధరావు, సత్యవతి (ఫెమింగ్టన్, న్యూజెర్సీ) ($30000) పాములపాటి రామనాథరావు మీరా బాయి (మౌంట్ వెర్నాన్, ఒహియో) ($6000), కొడాలి సత్యనారాయణ, లక్ష్మి (ట్రాయ్, మెసాచుసెట్స్) ($4000), దుర్గాప్రసాద్ మన్నె (పరిసిప్పని) జెజె ($2200), శ్రీ కొడాలి రాజ బాపయ్య (రు.2.5 లక్షలు) శ్రీ గవిని రామకృష్ణ ప్రసాద్ (రూ. 40,000), శ్రీ మండవ బాల గంగాధర రావు (రూ.20000) అందరూ జంపని వాసులే.
భాగస్వామ్యం
$ 42,200 డాలర్లు, రూ.3.1 లక్షలు
గౌ. ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎం.ఎల్.ఎ., సాంకేతిక విద్యాశాఖామాత్యులు ఆంధ్రప్రదేశ్,, అదనపు గ్రాంటుల సమీకరణ 75,000 రూపాయలు.
శ్రీమతి తాడిపత్రి శారద మాజీ. ఎం.పి. (లోక్ సభ సభ్యురాలు) (రూ.75,000)
శ్రీ యడ్లపాటి వెంకటరావు లోక్ సభ సభ్యులు (5.83 లక్షల రూపాయలు)
శ్రీ పాతూరి నాగభూషణం, జిల్లాపరిషత్ ఛైర్మన్, గుంటూరు (13.6 లక్షల రూపాయలు)
విజయవాడలోని బాల కార్మికులను బ్రిడ్జి స్కూల్‌లో చేర్పించి వారికి పునరావాసం కల్పించేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు 250 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే అమెరికాలో కూడా పేద తెలుగు విద్యార్థులకు ప్రతి అగస్టు నెలలో వారికి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు అందిస్తున్నారు. తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో కళలను, కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో జానపద కళలను పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది ఖమ్మం పట్టణంలో జానపద కళ ఉత్సవాలను నిర్వహించారు. తానా సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో 2008 అక్టోబర్‌లో తానా అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో 350 కేసులను పరిష్కరించారు. ఉత్తర అమెరికాలో ఇబ్బందుల్లో చిక్కుకున్న వారికి తానా అండగా ఉంటుంది. అమెరికాలోని ప్రవాసాంధ్రులు ప్రతి ఏటా రాష్ట్రానికి రూ.1.50 లక్షల కోట్లు పంపిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు. అయినప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవాస భారతీయులకు ఎటువంటి సహాయ, సహకారాలు అందించడం లేదు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా తానా కృషి చేస్తోంది.
ఫౌండేషన్ పథకాలు
1. విజయవాడలో లయోలా కాలేజీ ఆడిటోరియమ్ నిర్మాణం, కరీంనగర్ జిల్లాలోని కంచెర్లలో బస్సు స్టాఫ్, ఎలిమెంటరీ పాఠశాల మరమ్మతులు, ఆటమైదానం నిర్మాణం.
2. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు గ్రామ ఆరోగ్యం ప్రాజెక్టుకు బి.వి. పరమేశ్వరరావు ఆధ్వర్వంలోని భాగవతుల  ఛారిటబుల్ ట్రస్ట్ చేయూతనిచ్చింది.
3. నెల్లూరు జిల్లాలోని సోమవరపు పాడులో ఉన్నత పాఠశాల నిర్మాణానికి, కావలిలో జవహర్ భారతి కాలేజీ, అళ్లూరులోని రామకృష్ణ ఉన్నత విద్యాపాఠశాల విద్యార్థులకోసం శాశ్వత ప్రాతిపదికన స్కాలర్ షిప్ నిధులు ఏర్పాటు చేయడం కోసం బోస్టన్  సమీపంలో ఉన్న డా. నున్నా రామయ్య అత్యధిక మొత్తంలో విరాళాలను ఇచ్చారు.
4. ఆంధ్రప్రదేశ్ లో తుఫాను, ఇతర ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి నిధులు అందించారు.
5. లక్షా 20వేల డాలర్లతో మహబూబ్ నగర్ జిల్లాలోని తెలకపల్లి గ్రామంలో స్వచ్ఛంద జూనియర్ కళాశాల నిర్మాణం చేపట్టారు.
6. విజయవాడలోని మాంటిస్సోరీ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్, ప్రకాశం జిల్లా పొదిలిలోని వీరిసెట్టి జూనియర్ కాలేజీ, గుంటూరు జిల్లా నడింపల్లిలో నాయుడమ్మ ఫౌండేషన్, మద్రాస్ లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ, మోటూరు భూమి ప్రసాద్ స్మారక నిధి, కారుమంచి రత్తమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ, వెలువోలు సూర్యనారాయణ, వెంకటసుబ్బమ్మ స్మారక నిధి, ఐనంపూడిలోని మిత్రవింద దివ్య జీవన కేంద్రం, క్షత్రియ అన్నదాన సంఘం, చిరుమామిళ్ళ శేషయ్య, రంగమ్మ విద్యాభివృద్ధి సేవా సంఘం, తూర్పుగోదావరి జిల్లాలోని పట్టకడియంలో వెంకటేశ్వర కల్యాణ మండపం, పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లిలో ఆర్యవైశ్య సమాజం, వేమూరి చంద్రావతి రామనాథం ట్రస్టు, తెనాలిలో శాశ్వత నిత్య అన్నదాన పథకం, వాసిరెడ్డి పిచ్చయ్య ఐడియల్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ లో అనాథ బాలలకు చెరుకుపల్లి ట్రస్టు, కానూరు ఆరోగ్య విద్యా ట్రస్టు, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కాలేజీ, నెల్లూరు జిల్లా ఆల్లూరులోని స్వచ్ఛంద పాఠశాల ప్రాజెక్టులు చేపట్టారు.
7. గుంటూరు జిల్లా ఖాజీపాలెంలో అరబిందో ఆశ్రమం, వరగని గ్రామంలో హరిజన కాలనీ, సిరిపురం జూనియర్ కాలేజి, భ్రమరాంబ దేవాలయం, స్వాలోస్ ఆఫ్ ఇండియా, మస్క్యులర్ డిస్ట్రాఫీ అసోసియేషన్, నున్నా విద్యా అకాడమీ, అమృతలూరు లైబ్రరీ, బుద్ధవరం రామాలయం, పిఎస్ఎస్ మూర్తి స్మారక నిధి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ప్లానింగ్ , కాజిపాలెం మంతెన వి.ఆర్.సమితి, వివేకానంద సంఘం, విజయవాడలోని విక్సా విద్యాట్రస్టు ప్రాజెక్టులు
8. గుంటూరు జిల్లాలో పెదపులిపర్రులో ఉన్నత పాఠశాల భవనం నిర్మాణం.
9. కృష్ణా జిల్లా వెన్ననపూడిలో జిల్లా పరిషద్ హైస్కూల్ భవనం మరమ్మతులు
10. ప్రకాశం జిల్లా కందుకూరులో సమాచార కేంద్రం
11. వింజనపాడులో మిడిల్ స్కూలు
12. గుంటూరు జిల్లా కంటమరాజు కొండూరులో ఉన్నత పాఠశాల
13. అనంతపురం జిల్లా పెనుకొండలో లైబ్రరీ
14. ఎం.వి.ఆర్. ఎడ్యుకేషన్ సొసైటీ, గొర్రెపాటి విద్యాట్రస్టు, పోతూరు చలపతిరావు, కృపావరమ్మ చారిటబుల్ ట్రస్టులకు, మైలనవరంలోని ఆర్యవైశ్య సమాజంకు నిధులు
15. నెల్లూరులోని గోల్డెన్ జూబిలీ ఆసుపత్రి, నిజామాబాద్ లోని ప్రగతి ఆసుపత్రి, హైదరాబాద్ లోని ఇండో అమెరికన్ ఆసుపత్రి, విశాఖలోని లయన్స్ క్లబ్ కాన్సర్ చికిత్సాకేంద్రానికి నిధులు.
16. ఫిలడెల్ఫియాకు చెందిన పైడిపాటి సబిత, తూర్పుగోదావరికి చెందిన మురళీకృష్ణం రాజుకు వైద్య సహాయం. హైదరాబాద్ లోని 480 వీధి బాలలకు హెపటైటిస్ బి వాక్సినేషన్.
17. తానా సమ్మేళనంలో పాల్గొన్న ఉత్తమ కళాకారులకు గుత్తికొండ స్మారక అవార్డులు
18. గుత్తికొండ మెమోరియల్ స్కాలర్ షిప్ ట్రస్టు ద్వారా విద్యార్థినీ విద్యార్తులకు స్కాలర్ షిప్పులు
19. విశాఖపట్టణంలోని విక్టోరియా ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరాల సరఫరా
20. హైదరాబాద్ లోని వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వికలాంగ బాలలకు సహాయం.
21. రాష్ట్లంలోని 40 గ్రామాల్లో 4వేల మరుగుదొడ్ల నిర్మాణం
22. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో త్రాగునీటి పథకాలకు మాచింగ్ గ్రాంట్లు
23. ఉత్తర అమెరికాలో పేదలకు, ఇళ్ళు లేనివారికి సహాయం (ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, టిఫ్ఫిన్, ఎడిసన్)
24. ప్రకాశం జిల్లా కారంచేడు, తెనాలిలోని మోపర్రు, గుడివాడలోని రామాపురం, తెనాలిలోని జంపన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది వివిధ సౌకర్యాలను సమకూర్చారు.
25. 2001-03 సంవత్సరాల మధ్య రాష్ట్రంలో 20 వేల మంది పిల్లలకు హెపటైటిస్ బి. టీకాలు.
26. 30 వేల మందికి కంటి పరీక్ష, 6వేల మందికి కాటరాక్ట్ సర్జరీలు, వుయ్యూరులో రోటరీ ఆసుపత్రి, ధర్మవరంలోని లయన్స్ కంటి ఆసుపత్రి, విశాఖలోని శంకర్ ఫౌండేషన్, కరీంనగర్ లోని లయన్స్ కంటి ఆసుపత్రి సహకారం
27. 28 వేల మంది విద్యార్థులకు కంటి పరీక్ష, 3060 మందికి ఉచిత కంటి అద్దాలు.
28. కళాశాల విద్యార్థులకు కంటి పరీక్ష, 3060 మందికి ఉచిత కంటి అద్దాలు.
29. విజయవాడలో వీధి బాలలకు 56వేల డాలర్లతో ఆశ్రయం
30. రాష్ట్రంలోని 170 ఏరియా ఆసుపత్రులు, 25 జిల్లా ఆసుపత్రులు, 10 ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు, 30 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో ఆస్తమా నివారణ ప్రాజెక్టు, నెబ్యులైజర్ల సరఫరా మొదలైనవి.
తానా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లో సహాయ కార్యక్రమాలనెన్నింటినో అమెరికా నుండి చేపడుతోంది. ఇంచుమించు సంవత్సరానికి మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను చేపడుతోంది. దాతలు చేసిన సహాయాన్ని పురస్కరించుకుని కొన్ని ప్రాజెక్టులు ఫౌండేషన్ ద్వారానే చేపడుతున్నారు.
సేవా కార్యక్రమాలు
తానా ఫౌండేషన్ మూడు ప్రముఖ సంస్థల ద్వారా వారి సేవా కార్యక్రమాల్ని అమెరికా నుండి ఇండియాలో నిర్వహిస్తోంది. ఇంచుమించు 1 మిలియన్ డాలర్లు ఈ కార్యక్రమ నిర్వహణకి కేటాయించింది. కొన్ని ప్రాజెక్టులని మాత్రం ఫౌండేషన్ తానే స్వయంగా చేపడుతోంది.
అనాథాశ్రమాలు
నిధుల కొరత వలన సరైన వసతులు కల్పించ లేని కొన్ని ఆశ్రమాలని తానా ఫౌండేషన్ గుర్తించింది. మొదటగా వెయ్యిమంది పిల్లలున్న పది ఆశ్రమాలని తీసుకుని వాటిని సరైన రీతిలో నిర్వహించడానికి తానా పూనుకుంది. దీనికి ఒక నెలకి ఒక పిల్ల/పిల్లవాడికి వెయ్యి రూపాయలు అవుతుందని అంచనా వేసింది. దాతలు  పిల్లలతో ఆనందంగా గడిపి అది గుర్తుండిపోయేలా అనుభవం పొందుతారు. చేసుకుంటారు.  
స్కాలర్ షిప్పులు
చాలామంది పిల్లలు చదువులో చాలా తెలివిగా వుండి వారి ఉన్నత చదువులకి డబ్బు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనం వారికి సరిపోయేదిగా ఉండదు.  దానికి తానా పెట్టే ఖర్చు ఒక విద్యార్థికి 250 డాలర్లు ఉంటుంది.
నేత్ర పరీక్షా శిబిరాలు
తానా చేపట్టి విజయవంతం చేసిన ముఖ్యమైన కార్యక్రమం నేత్ర పరిక్షా శిబిరాలు. 500 నేత్ర శిబిరాల్ని ఆంధ్ర ప్రదేశ్.లో  నిర్వహించి సుమారు 35,000 మంది దీని ద్వారా లబ్ధి పొంది చక్కటి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. కాటరాక్ట్ ఆపరేషరేషన్ వారి జీవితాన్ని మార్చేసింది. నేత్రదానాలు ప్రోత్సహించారు.
కాన్సర్ శిబిరాలు
తానా ఫౌండేషన్ చేపట్టిన కాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ సహకారంతో జరిపారు. దీనికి దాతల సహకారం విశేషంగా లభించింది. మొదటి క్యాంప్ కృష్ణాజిల్లా పెనమలూరులో 2013 డిసెంబర్ 14, 15 తేదీలలో నిర్వహించారు. అందులో 650 మందికి స్క్రీనింగ్ చేయగా 14 మందికి క్యాన్సర్ అని నిర్ధారించారు. ఈ క్యాంపుని దిలీప్ కూచిపూడి వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం చేశారు. 2014 జనవరి 23, 24 తేదీలలో డా. టి.వి.రామ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఖమ్మం జిల్లా, పాల్వంచలో నిర్వహించిన క్యాంప్ లో 750మందిని పరీక్షించారు. అందులో 15 మందికి క్యాన్సర్ ఉందని గుర్తించారు. జనవరి 25, 26 తేదీలలో ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో లయన్స్ క్లబ్, శ్రీనగర్, కొత్తగూడెం వారి ద్వారా నిర్వహించిన క్యాంప్ లో అత్యధికంగా 1150 మంది హాజరయ్యారు. వారిలో 22 మందికి క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. ఈ క్యాంప్ ను లయన్స్ క్లబ్, తానా సంయుక్తంగా నిర్వహించాయి. ఫిబ్రవరి 1, 2 తేదీలలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిపిన క్యాంపుకు డా. రాజేంద్రప్రసాద్ సూదనగుంట దాతగా ఉన్నారు. దానికి 450మంది హాజరయ్యారు. 9 మందికి కేన్సర్ నిర్ధారణయ్యింది. ఈ క్యాన్సర్ క్యాంపులలో అతి ఖరీదైన Pap Smear, Mammogram, Ultrasound, X-Ray పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. .
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద, బలహీన వర్గాలవారికి ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయంలో చేపట్టిన కార్యక్రమాలలో కేన్సర్ అవగాహనా కార్యక్రమం ముఖ్యమైంది. ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ సహకారంతో కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాములు, ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్, సెర్విక్స్ కాన్సర్సల మీద దృష్టి కేంద్రీకరించింది.
8 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి కేన్సర్.కి సంబంధించిన ఒక లక్ష కొత్త కేసులు వస్తున్నాయి. వీటిలో 30 నుండి 60 సంవత్సరాల వయసున్న స్త్రీలలో వచ్చే బ్రెస్ట్, సెర్విక్స్ కాన్సర్ లు. పురుషులలో నోరు, నాలుక, స్వరపేటిక, ఎసోఫాగస్, కడుపు, పెద్దపేగుకు వచ్చేవి ఎక్కువున్నాయి.
ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి జంటనగరాలలో, చుట్టుపక్కల గ్రామాలలో కాన్సర్ అవగాహనా శిబిరాలు, కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాములు ఎన్.జి.వో.లు, స్థానిక పెద్దల, సాంఘిక సంస్థల సహకారంతో నిర్వహిస్తోంది.
వీరికి మొబైల్ కాన్సర్ స్క్రీనింగ్ లో యూనిట్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, ఎక్స్ రే యూనిట్స్ తో వెంటనే వారికి రోగనిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.  దీనివల్ల 45-50 సంవత్సరాల మధ్య వచ్చే బ్రెస్ట్ కాన్సర్ ముందుగానే నిర్ధారణ చేసి, వారి కుటుంబంలో వంశపారంపర్యంగా వ్యాధి నిర్ధారణ చెయ్యడానికి మామోగ్రఫీ ఉపయోగపడుతోంది. వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి.
పెదిమలకు, గొంతులకి  లోపాలు (గ్రహణం మొర్రి)
తానా ఫౌండేన్ మారుమూల ప్రాంతాలలో పేద ప్రజల పెదిమ లేదా గొంతులకి వికృతమైన ఎదుగుదల వచ్చిన వారిని అది పోషకాహార లోపంగా గుర్తించింది. దీనిని సరిదిద్దడానికి ఒక వ్యక్తి 300 డాలర్లు ఖర్చు పెట్టి, వారికి ఆరోగ్యకరమైన జీవితాన్నివ్వడానికి 10 ఆపరేషన్లు నిర్వహించింది. ఈ ఆపరేషన్.కి అయ్యే ఖర్చుల విషయంలో తల్లితండ్రులు భయపడకుండా హాస్పిటల్ సిబ్బంది వారికి సరైన అవగాహన కల్పించి ఆపరేషన్లు చేపట్టింది.
గ్రంథాలయాలు
తానా ఫౌండేషన్ బ్రెడ్ సొసైటీ సహాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల్ని ఏర్పాటు చేసింది. 75 శాతం దాంట్లో విజయం సాధించింది. వీటి నిర్వహణ విషయంలో బ్రెడ్ సొసైటీ చక్కని పాత్ర నిర్వహిస్తోంది. ఈ గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివిన విద్యార్థులకి వారు చదివిన పుస్తకం మీద సమీక్ష రాయమని వారికి బహుమతులను ఇస్తున్నారు.
శ్మశానవాటికలలో ఆశ్రయాలు
ఇండియాలో శ్మశానాలు దహనం/ఖననాలకు మాత్రమే కాకుండా దానికి సంబంధించిన వేరే కార్యక్రమాలకి కూడా ఉపయోగిస్తుంటారు. అలాంటప్పుడు దహన, ఖనన కార్యక్రమాలు అయిన తరవాత అక్కడ ఉండే చెత్తనంతా శుభ్రం చేయాలి. వర్షం నుంచి కాని, ఎండ నుంచి కాని ఇబ్బంది లేకుండా ఉండాలంటే అక్కడ ఒక షెడ్డు ఏర్పాటు చేయవలిసి ఉంటుంది.  ఇది ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలి.  దీనికి సహాయం కావలసిన కార్యక్రమం.
ఇండియాలో ప్రతిఫలాన్ని ఆశించని ఆరు సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ ఉన్నాయి. ఆర్ధికంగా వెనుకబడి అర్హులైనవారికి ఉపకారవేతనాన్ని సహాయం చేస్తున్నాయి. ఈ సంస్థలు ఆమెరికాలోని దాతల సహాయాన్ని పొందడానికి అర్హమైనవి.
ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఒక మిలియన్ డాలర్ విలువున్న కార్యక్రమాలని చేపడుతున్నారు.
ఎయిడ్స్ అవగాహనా సంస్థ  
మూడు పద్ధతులలో ఎయిడ్స్ తో బతుకుతున్న ప్రజలకి అవగాహనని కలిగిస్తారు.
1. శ్రేయస్సు
2. ఉన్నతమైన ఆరోగ్యకరమైన కార్యక్రమం
3. వెనుకబడిన ప్రాంతాలలో సంచార ఆరోగ్య సంస్థలు
హెచ్.ఐ.వి., ఎయిడ్స్
శ్రేయస్సు పథకం ద్వారా హెచ్ ఐ.వి., ఎయిడ్స్ తో బాధపడుతున్నవారికి మంచిజీవితాన్నిఇవ్వడానికి  (పిఎస్ హెచ్ ఎ)  27 గ్రామాల్లో 200 మందికి జగ్గయ్య పేట మండలం కృష్ణా జిల్లాలో సేవ చేశారు. వారికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వైద్యం, ఈ రోగం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలలో ఎయిడ్స్ రోగులకి అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా సహాయం చేసే సంఘాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఫౌండేషన్  పూర్తి చేసిన కార్యక్రమాలు
తానా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని ఉన్నాయి. హెపెటైటిస్ బి వేక్సిన్స్, ఛైల్డ్ రెస్క్యూ షెల్టర్స్, ఐ సైట్ రిస్టొరేషన్, ఆస్తమా పేషెంట్స్ కి నెబ్యులైజర్స్ విద్యలో నైపుణ్యం ఉన్న పిల్లలని దత్తత తీసుకుని వారికి ఉన్నత విద్య ఉచితంగా చెప్పిస్తున్నారు. ఇది ఎడాప్ట్ ఎ ఛైల్డ్ టు ఎడ్యుకేట్ (ఎసిఇ) బ్రెడ్ సొసైటీ, హైదరాబాద్ అండ్ రూరల్ సొసైటీ  వాళ్ళ సహకారంతో తానా ఫౌండేషన్ విజయవంతంగా నిర్వహిస్తోంది.
ఉబ్బసం (ఆస్తమా) రోగులకి నెబ్యులైజర్లు
కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉబ్బసం వ్యాధి వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఇండియాలో సరైన వైద్య సౌకర్యాలు లేక మానవ జీవితం క్లిష్టమైపోతోంది. రోటరీ ఇంటర్నేషనల్ తానా ఫౌండేషన్ ద్వారా నిధులు అభివృద్ధి చేస్తోంది. రోటరీ క్లబ్ వీటికి $12000లు విరాళంగా ఇచ్చింది.
214 నెబ్యులైజర్లు స్థానిక ఆసుపత్రులు 170, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో 30, టీచింగ్ ఆసుపత్రులలో 14 పంచిపెట్టారు.  ఇదేకాకుండా ఆసుపత్రి సిబ్బందిలో నర్సులకి వీటిపై శిక్షణ ఇచ్చారు. డాక్టర్ లోకేశ్వరరావు ఈదర దీనికి అధికారిగా ఉన్నారు.
దృష్టిదోష నివారణ పథకాలు
తానా ఫౌండేషన్ దాతల సహకారంతో నిరుపేదలకి దృష్టి దోషనివారణ పథకాలు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో చేపడుతోంది.
1.         రోటరీ లైన్స్ ఆసుపత్రి, పాలకొల్లు, ప.గో.జిల్లా.
2.         రోటరీ కంటి ఆసుపత్రి, ఉయ్యూరు, కృష్ణా జిల్లా.
3.         శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి, విశాఖపట్టణం
4.         లయన్స్ కంటి ఆసుపత్రి, కరీంనగర్
5.         లయన్స్ కంటి ఆసుపత్రి, ధర్మవరం అనంతపూర్ జిల్లా.
శంకర కంటి ఆసుపత్రి తానా ఫౌండేషన్ సహకారంతో $30,000 లతో గుంటూరులో ప్రారంభించింది. చుట్టు పక్కల ఉన్న గ్రామాలలో శంకర కంటి ఆసుపత్రితో శిబిరాలు ప్రారంభించారు. 2005లో నెల్లూరులో మరొక కంటి ఆసుపత్రి ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు.
శంకర కంటి ఆసుపత్రి, పరకాల గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం 2009లో నిర్వహించారు. దీనికి స్పందన బాగావచ్చింది . ఆ వూరి వాళ్ళు కళ్ళు చూపించుకుని వారి అంధత్వాన్ని దారితీసే విషయాలు తెలుసుకున్నారు. హనుమాన్ పేటలో జరిగిన నేత్రశిబిరానికి కూడా విశేష స్పందన వచ్చింది.
డాక్టర్ రావు జన్మస్థలం జమ్ముల పాలెం గ్రామం. ఆ గ్రామంలో 3088 మంది జనాభా, వారిలో 90 శాతం మంది పేద వాళ్లు. ఆ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎథికన్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇండియా దాతల సహకారంతో ఆధునీకరణ చెయ్యాలనుకున్నారు. సెప్టెంబర్ 26, 2003లో దృష్టి దోష నివారణ పొందారు.
నేత్ర శిబిరాన్ని సెప్టెంబర్ 26, 2003లో జమ్ములపాలెం గ్రామంలో ప్రారంభించారు. ఇది విజయవంతమైంది. 410 మంది ఉచితంగా కంటి చూపును డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకున్నారు. వీరు అసలు ముందెప్పుడూ కంటి డాక్టరును చూడలేదు. 54 మంది కేటరేక్ట్ ఆపరేషన్, 92 మంది ఉచితంగా కళ్ళద్దాలు పొందారు.
మీనాక్షి పరుచూరి, డాక్టర్ ఆంజనేయులు పరుచూరి వారి స్వగ్రామంలో నేత్ర శిబిరాలు నిర్వహించి, 1,756 మందికి జీవితంలో చీకటి లేకుండా చేశారు.
పేద విద్యార్థులకి ఉచిత నేత్ర వైద్యం చేసి 50 జతల కళ్ళద్దాలు అందజేశారు.
ఎల్. వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ భాగస్వామ్యంగా సుధాకర్ అండ్ శ్రీకాంత్ రావి ఛారిటబుల్ ట్రస్ట్ 6,000 మంది గ్రామస్తులకోసం నేత్ర శిబిరాన్ని కుంకలమర్రులో నిర్వహించారు.
రావి ఛారిటబుల్ ట్రస్ట్ చీరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థిర నివాసుల సహకారంతో తానా ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు చేపట్టింది -
-   అక్కడ పాఠశాలలో 350 మంది ఆ వూరి విద్యార్థులతో 1-6 తరగతులవరకు ఉండేది. ఈ పాఠశాల 1981లో రావి సోదరుల తల్లితండ్రులు కట్టించారు. ఇప్పుడు ఈ పాఠశాలలో ఉన్నత తరగతులు, రెండంతస్తుల భవనం, ఆధునిక సదుపాయాలున్న తరగతి గదులు, 10 కంప్యూటర్లతో కంప్యూటర్ లాబ్, ఇంటర్నెట్ కనెక్షన్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగశాలలు, 2000లకు పైగా పుస్తకాలతో పాఠశాల ఇంగ్లీష్ పుస్తకాలు, వివిధ రకాల సబ్జక్టులకు సంబంధించిన పుస్తకాలు, ఆటలకు సంబంధించిన సదుపాయాలతో ఆటస్థలం ఉన్నాయి.
కాంక్రీట్ రోడ్లు దాదాపు 3 కిలోమీటర్ల కాంక్రీట్ రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రజలకి, వాహనదారులకి రోడ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉన్నాయి.  ఇంతకు ముందున్న మట్టి, కంకర రోడ్లు చాలా ఇబ్బందికరంగా, ముఖ్యంగా వర్షాకాలంలో మరింత అసౌకర్యంగా ఉండేవి.
పశువుల ఆసుపత్రి ఇక్కడ చాలా మంది రైతులు ఉండటంవలన పొలం దున్నే ఎద్దులు జబ్బుపడినప్పుడు రైతుకి చాలా మానసిక ఆందోళన ఉండేది. ఇక్కడ పశు సంరక్షణ చాలా అవసరంగా భావించి వారికి పశువుల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది.
దేవాలయ నిర్మాణం - 80 సంవత్సరాల నాటి దేవాలయాన్ని శిథిల స్థితిలో వుండగా 2-17-2005లో కొత్త దేవాలయాన్ని నిర్మించారు. కొత్త నిర్మాణం ఆగ్రామానికి గర్వించదగినదిగా ఉంది.
తానా ఛైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్
పిల్లలకి తానా ఛైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ అనేది చక్కగా ఉపకరించి, అనేక విజయాల్ని సాధించింది.
-       సిఎఎఫ్ సాంఘిక సేవలకి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
-    ఇక్కడ సిఎఎఫ్ సంఘంలో ఉన్న అనాధ పిల్లలకి అవసరమైన చక్కటి గృహాల్ని నియమించింది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన అనేక  కార్యక్రమాల్ని 1993 నుంచి చేపడుతోంది.
-    కొద్దిమంది పిల్లలతో ప్రారంభించిన ఈ సంస్థ నేడు సంస్థ గృహాల్లో ఉన్న వారు, బయట ఉన్నవారి సంఖ్యతో బాగా పెరిగింది.
- ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న వేరే సంస్థలకి కూడా తానా ఛైల్డ్ ఫౌండేషన్ పిల్లల్ని (రిఫర్) పంపిస్తోంది.
అడపిల్లలు , మగపిల్లలు , వాళ్లు ఎక్కడి వాళ్ళయినా అన్ని రకాల వయసుల వాళ్ళకి సహాయ పడుతోంది.
ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేస్తూ ఆశ్రయ చిల్ట్రన్స్ హోమ్, సి.ఎ.ఎఫ్. ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, స్వగృహ గర్ల్స్ డివిజన్ అనేవి చేపడుతోంది.
సిఎఎఫ్ కి ప్రారంభంలో వచ్చిన పిల్లల వెనుక చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండేవి. అవి హృదయాన్ని కలిచివేసేవిగా ఉండేవి. కాని దాతలు చేసే సహాయం వల్ల వాళ్లు ఈ రోజు సిఎఎఫ్ ఒడిలో ఆనందాన్ని పొందుతున్నారు.  దీనికి దాతలు చేసే సహాయంతో అనేకమంది పిల్లల జీవితాలు చక్కటి మార్గంలో పయనిస్తున్నాయి.
తానా ఫౌండేషన్ భవన్
తానా ఫౌండేషన్ ఛైల్డ్ రెస్క్యూ షెల్టర్ విజయవాడలో 2003లో భవన నిర్మాణం చేసింది. దీనికి మునిసిపల్ కార్పొరేషన్ స్థలాన్ని ఇచ్చింది. నార్త్ అమెరికా నుంచి దాతలు విరాళాన్ని ఇచ్చారు. దీనికి ‘తానా ఫౌండేషన్ భవన్’ అని పేరు పెట్టారు. తానా ఫౌండేషన్ రోటరీ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆసుపత్రులకి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి నెబ్యులైజర్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ప్రసాద్ కాకర్ల సహకారంతో విజయవంతం చేశారు. దీనికి ఫౌండేషన్ అమెరికా దాతలనుంచి $5000 లు విరాళాలు సేకరించింది.
ఛైల్డ్ ఫౌండేషన్ రెస్క్యూ షెల్టర్ లో పిల్లకి ఎలక్ట్రికల్ పని, కుట్టుపని, ప్రింటింగ్, ఆటోమొబైల్ మొదలైన వాటిలో శిక్షణ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకి బాట వేస్తున్నారు.
బ్రెడ్ సొసైటీ ద్వారా స్కాలర్ షిప్పులు
తానా ఫౌండేషన్ బ్రెడ్ (బేసిక్ రీసర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్ మెంట్) సొసైటీ భాగస్వామ్యంతో 2002లో ఎసిఇ (ఎడాప్ట్ ఎ ఛైల్డ్ ఎడ్యుకేట్) స్కాలర్ షిప్స్ విద్యలో నైపుణ్యం కలిగి, చదువుకోవడానికి తగిన సౌకర్యాలు లేని విద్యార్థులకి ఉన్నత విద్యనందించడం.
జాస్తి వెంకటేశ్వర్లుగారు స్థాపించిన కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ, గుంటూరుకి  తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2008 నుంచి $70,000 లతో స్టూడెంట్స్ కి  334 స్కాలర్ షిప్ లు ఇచ్చారు.
రంగరాయ మెడికల్ కాలేజీ లైబ్రరీకి $ 200,000 లతో స్టూడెంట్స్ కి తానా ఫౌండేషన్ చక్కటి లైబ్రరీ ఏర్పటు చేసింది. ఇది ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం  విద్యార్థులకి చాలా సౌకర్యంగా ఉంది. ఈ లైబ్రరీ జూన్ 2009 నుంచి సహాయపడుతోంది.  దీనికి తానా సభ్యులు ఎంతో సహకరిస్తున్నారు.
స్కాలర్ షిప్స్ ఫర్ యూత్ ఫథకం ద్వారా నార్త్ అమెరికాలో $2000 లతో ఆర్థికంగా వెనుకబడి, విద్యలో నైపుణ్యత, వారి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకువచ్చిన విద్యార్థుల ఉన్నత విద్యకి 3 స్కాలర్ షిప్పులు ఇచ్చారు.
స్కాలర్ షిప్స్ ఫర్ పూర్ స్టూడెంట్స్ పథకం ద్వారా 234 కొత్త స్కాలర్ షిప్పులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు.
150 స్కాలర్ షిప్పులు చదువు పూర్తి చేస్తున్న విద్యార్థులకి ఇవ్వడం కొనసాగిస్తున్నారు. BREAD (Basic Research Education and Development) society ద్వారా కొనసాగిస్తున్నారు.  ఈ స్కాలర్ షిప్పులు బి.ఎస్.సి., బి.కాం., బి.ఎడ్., నర్సింగ్ పాలిటెక్నిక్, బి.టెక్., ఎం.బి.బి.యస్., డి.ఎడ్., డి.ఫార్మసీ విద్యార్థులకి ఇస్తున్నారు.
విశ్వహిత పథకం ద్వారా 2003 నుంచి  $100,000 మొత్తం స్కాలర్ షిప్పులు ఇస్తున్నారు.  30 మంది విద్యలో నైపుణ్యం ఉన్న పేద విద్యార్థులకి 2007-2008 సంవత్సరాలలో 15,000-30,000 వరకు సహాయం చేశారు.
వి.ఆర్. సిద్ధార్ధా స్కాలర్ షిప్ పథకం ద్వారా వి.ఆర్. సిద్ధార్ధా ఇంజనీరింగ్ కాలేజి 2008-2009 సంవత్సరానికి $ 90,000 లు విద్యార్థులకి సహాయం చేస్తున్నారు.
ఇయర్లీ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్స్ పథకం ద్వారా 7 గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పులు $2000లతో ఏర్పాటు చేశారు. పద్మావతి, రవీంద్రనాథ్ గుత్తికొండ; స్వరాజ్య లక్ష్మి, సుధీర్ బాబు గుత్తికొండ; సత్యవతి, యుగంధర రావు వల్లభనేని దాతలుగా ఫౌండేషన్ కి ఇచ్చారు.
నన్నపనేని మోహన్ జడ్. పి. హెచ్ స్కూల్, భద్రాచలం  విద్యార్థులకి చక్కని విద్యనందిస్తోంది.
ఏకాల్ విద్యాలయ ఫౌండేషన్
ఏకాల్ విద్యాలయ ఫౌండేషన్ గిరిజన ప్రదేశాలలో నిరక్షరాస్యత పూర్తిగా 2015 నాటికి తొలగించడానికి చేపట్టిన కార్యక్రమం.  దీనికి తానా ఫౌండేషన్ సహకరిస్తూ మద్దతు ఇస్తున్నది. ఏకాల్ విద్యాలయ ఫౌండేషన్ లో 20,000 మంది ఉపాధ్యాయులు, 5,000 మంది వాలంటీర్లు, 20 భారత రాష్ట్రాలలో 20 కార్యనిర్వహణా సంస్థలు, 8 సహకార సంస్థలు ఉన్నాయి. వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలో మల్టీగ్రేడ్ ఉపాధ్యాయులతో శక్తివంతమైన విద్యార్థులని తయారు చేయడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం.  ఇది ప్రాథమిక విద్య, గ్రామీణ నిర్వహణా వ్యవస్థ, సాంఘిక సంస్కరణలు, సాంఘిక సమన్వయం అనే నాలుగు ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తుంది.
వృద్ధాశ్రమాలు
వృద్ధులకి కూడా తానా ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. కాజ సీతాలక్ష్మమ్మ మెమోరియల్ వృద్ధాశ్రమ భవనం నిర్మించింది. ఈ ఆశ్రమంలో అనేమంది వృద్ధులకి ఆశ్రయం కల్పించి వారిపట్ల శుభ్రత విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వాటర్ ప్లాంట్స్
అబ్బినేని గుంటపాలెం వాటర్ ప్లాంట్ కి కంతేటి బాలకృష్ణ, అవంతి. కొంజేడు వాటర్ ప్లాంట్స్ కి దాత అబ్బయ్య చెన్నారెడ్డి ప్రకాశం జిల్లా. అడవికొలను ప్లాంట్ కి సీతారాముడు కొలను, పెదపాడు ప్లాంట్ కి జె.ఆర్. కాకర్ల, కౌతరం ప్లాంట్ కి రామ్మోహన్ వడ్లము దాతలుగా ఉండి ఫౌండేషన్ కి సహకరించారు.
తానా ఫౌండేషన్ ద్వారా ఏర్పరచిన ప్లాంట్స్ కి మణి పాతూరి ఉంగుటూరు, డాక్టర్ లోకేశ్వర రావు ఈదార కొల్లూరు గ్రామం, గుంటూర జిల్లా, రామ్మోహనరావు పెంటేల,  పాలపర్రు దాతలుగా ఉన్నారు.
రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ కి 3 నుంచి 4 లక్షలు, సివిల్ ఫ్రాజెక్ట్ 2 లక్షలు స్థలం, నంది ఫౌండేషన్ దాతగా ఇచ్చారు.
వాటర్ ప్లాంట్ ట్రాన్స్ పోర్టేషన్ వేన్ లని కూడా తానా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు.
తానా ఫౌండేషన్ కొల్లూరు గ్రామపంచాయితీ లో సామాజిక మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసింది.
డాక్టర్ సాయిరాం అట్లూరి, డాక్టర్ ప్రతాప్ అట్లూరి ఉదారంగా $1,00,000లు సాయి ఓరల్ హెల్త్  ఫౌండేషన్  కి దాతలుగా ఇచ్చారు. తానా ఫౌండేషన్ వీరి సహకారంతో గ్రామాలలో దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది.
తానా ఫౌండేషన్ కమ్యూనిటీ డిఫ్లోరిటేషన్ సిస్టమ్ ద్వారా గ్రామాలలో మంచినీటి పథకాలని, అనేక స్కెలెటల్ ఫ్లోరిసిస్ రోగికి ఆపరేషను చేసి నడవగలిగేటట్లు చేశారు.
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టులలో కొన్ని ముఖ్యమైనవి – హెపటైటిస్ బి వాక్సిన్, ఛైల్డ్ రెస్క్యూ షెల్టర్స్, దృష్టి దోష నివారణ చర్యలు, ఆస్తమా రోగులకి నెబ్యులైజర్లు, విద్యలో నైపుణ్యం కలిగిన విద్యార్థులని దత్తత తీసుకుని వారి ఉన్నత విద్య ‘ఎడాప్ట్ ఎ ఛైల్డ్  టు ఎడ్యుకేట్’ పథకానికి బ్రెడ్ సొసైటీ, హైదరాబాద్, రూరల్ శానిటేషన్ దాతృత్వం వహిస్తున్నాయి. తానా ఫౌండేషన్ స్థిరనివాసం కలిగి ప్రతిఫలాన్ని ఆశించని సేవా సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కార్యక్రమాలు -
బోడిపాలెంలో శ్మశానవాటికని పునరుద్ధరించారు. కమ్యూనిటీ హాలు, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 19, 2005లో స్త్రీలకు ఆరోగ్య శిబిరాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇండియా ఆధ్వర్యంలో నిర్విహించారు. 280 స్త్రీలు పరీక్షలు చేయించుకుని ఉచితంగా పోషకాహారం, మందులు తీసుకున్నారు.
నిరుపేదల సంక్షేమ పథకం ద్వారా రు. 150-250 నిరుపేదలకి విలువగల మందుల్ని, పోషకాహారాన్ని అందించారు.
ఎథిక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నాలుగు రోడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఒక రోడ్డుకి ఎథిక్ రోడ్డ్డు అని పేరు పెట్టారు.
అమృతలూరు
డాక్టర్ ఆంజనేయులు పరుచూరి వారి స్వగ్రామమైన  గుంటూరు జిల్లాలో ఉన్న అమృతలూరుని తానా ఫౌండేషన్ సహకారంతో గ్రామాన్ని ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు.
విజయవంతంగా వివిధ సాంఘిక సంఘాల, దాతల సహకారంతో పూర్తిచేసిన  కార్యక్రమాలు
జిల్లా పరిషత్ స్కూలు, కాలిగొట్ల - పాఠశాల విద్య - దాత వర్రే సత్యనారాయణ
నల్లూరు పాలెం విలేజ్ - రోడ్లు, నీటి సమస్యలు - దాత రమేష్ ఎలవర్తి
నవజీవన్ బ్లైండ్ - పేద, దిక్కులేని, వృద్ధులైన వారికి ఆహారం అందించడం - రామమూర్తి సుందర్
అన్నదాన్ ట్రస్ట్ - పేదలకు భోజన సదుపాయం - లోకేశ్వరరావు ఏడార,
తాతపూడి విలేజ్ - రోడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం - రమణ గడగొట్టు
నవ్యభారత విద్యా సంఘం - ఎలిమెంటరీ స్కూలు - గోరంట్ల సుబ్బారావు
అర్షా తపస్యాలయం - లైబ్రరీ, లెక్చర్ హాలు - సింహాచలం రాగుతు
పెసర్లంక హైస్కూలు - హైస్కూలు బిల్డింగ్ - మహాలక్ష్మి గుళ్ళపల్లి
బైర్రాజు ఫౌండేషన్ - డ్రింకింగ్ వాటర్ - పెన్మత్స నర్సింహ వర్మ
ఫౌండేషన్ వివరాలకోసం ఈ లింకులు.
తానా ఫౌండేషన్ ఛైర్ పర్సన్స్
1. 1981-1983 బొడ్డుపల్లి చినబాబు
2. 1983-85 లింగమనేని జగన్మోహనరావు
3. 1986-87 చలసాని విద్యాధరరావు
4. 1987-89 అక్కినేని సుదర్శనరావు
5. 1989-93 రామ్ నున్న
6. 1993-94 కాజ రామారావు
7. 1994-95 పొలవరపు జగన్మోహనరావు
8. 1995-97 పోలవరపు రాఘవరావు
9. 1997-99 దామా వెంకయ్య
10. 1999-2001 గుత్తికొండ రవీంద్రనాథ్
11. 2001-2003 కాకరాల ప్రసాద్ చౌదరి
12. 2003-2005 వల్లభనేని యుగంధర రావు
13. 2005-2007 త్రిపిరనేని తిరుమలరావు
14. 2007-2009 చలసాని మల్లికార్జున రావు (డెట్రాయిట్)
15. 2009-2011 ఈదర లోకేశ్వరరావు
16. 2011-2013 దిలీప్ కూచిపూడి
17. 2013-2014  జయశేఖర్   తాళ్లూరి
ఫౌండేషన్  ట్రస్టీస్
1. దిలీప్ కూచిపూడి (2011-2013) - ఛైర్మన్
2. జయశేఖర్ తాళ్లూరి - సెక్రటరీ
3. శ్రీనివాస గోగినేని - ట్రెజరర్
4. హరీష్ కోయ - జాయింట్ సెక్రటరీ
5. డా. గంగా చౌదరి - ట్రస్టీ
6. ప్రకాశరావు వెలగపూడి
7. డా. ప్రసాద్ కాకరాల
8. డా. ప్రసాద్ నల్లూరి
9. పూర్ణ వీరపనేని
10. శ్రీనివాస్ జరుగుల
11. సుబ్బారావు కోల
12. వెంకట ఆర్. యార్లగడ్డ
13. లోకేశ్వర రావు ఈదర
14. ప్రసాద్ తోటకూర
ఎసిఇ (ఎడాప్ట్ ఎ ఛైల్డ్ ఎడ్యుకేట్) స్కాలర్ షిప్స్ పొందిన విద్యార్థులు
తానా పత్రిక
తానా పత్రిక తొలి సంచిక
తానా పత్రిక నెలనెలా అమెరికాలో తెలుగువారిని పలకరించే సాహిత్య సారస్వత చిహ్నంగా వెలువడుతున్నది.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక ఇది.  ఈ పేరు పెట్టింది అప్పటి సంపాదకులు  కిడాంబి రఘునాథ్. 1989 వరకు పత్రిక అప్పుడప్పుడూ వచ్చేది.
కిడాంబి రఘునాథ్
1983-85లో కిడాంబి రఘునాథ్ సంపాదకత్వంలో ‘తానా’ పత్రిక  ప్రారంభమయింది. పుస్తకం సైజులో (8.5” x 11” కొలతలతో), చేతి రాతతో మొదటి తానా పత్రిక వెలువడింది.
కిడాంబి రఘునాథ్ తొలి సంపాదకీయం:  “ఉత్తర అమెరికాలో ప్రప్రథమంగా ‘కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు’ మన తెలుగు తల్లి శోభను, ఆయమ్మ అనుంగు బిడ్డలమై మన తెలుగు జాతిని, రీతిని వ్యక్తపరచుకోవటానికి వీలైన విధంగా ఈ తానా పత్రిక వెలువడుతోంది. శరవేగంతో పరుగులిడే యీ అనంత కాలవాహినికి అడ్డుకట్ట వేసి, గట్టు కట్టి, కొంతసేపు ఆపి, మనల్ని మనం నిశితంగా పరిశీలించుకోవడానికి, మనం నివసిస్తున్న పరిస్థితులను మనకనుకూలంగా మలచుకోవడానికి, మనలాంటి ఇతరులకు సౌహార్ద్ర హృదయాలతో సహాయం చేయడానికి, మొదటి నుంచి సహజమై, సజీవమై, నిర్మలమై మహోన్నతాదర్శాలతో ప్రభవిల్లే మన తెలుగుజాతి ఔన్నత్యాన్ని నలుదిశలా చాటి చెప్పడానికి, అనుసరించడానికి వీలుగా  మన ఉత్తర అమెరికా తెలుగు సంఘం స్థాపించబడింది. ఆ సంఘపు ఉద్దేశాలను, అభివృద్ధి పథకాలను అందరికీ తెలియచెప్పడానికి ఈ తానా పత్రిక వెలువడుతోంది. ఉత్తర అమెరికాలో ఉన్న  తెలుగువారందరూ ఈ పత్రికని ప్రోత్సహించి, చేయూతనిచ్చి పలువురికి ఉపయోగపడే విధంగా మలచగలరని ఆశిస్తున్నాను.
మనకు సంఘం ఎందుకు? ఈ పత్రిక ఎందుకు… అని ప్రశ్నించుకునే బదులు సంఘం మనకెంతవరకు అవసరం… మన పత్రిక మనకెంతవరకు సహాయం చేయగలదోనని ఆలోచిస్తే ఎన్నో లాభాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్య పరిపాలనలో సంఘానికి, సంఘీయులకు ఎంరూపొందించి సామూహికంగా నేతలకు అందజేయగలిగితే ఫలితాలు త్వరలో కనిపిస్తాయి. అంతేగాక, మన మందరం సహాయం చేసుకోవచ్చు. మన కళలని, సంస్కృతుల్ని అభిపరచుకోవడానికి సంఘం అవసరం. మన జాతి పురోగమనాన్ని, సారస్వత వికాసాలను ముందు తరాలవారికి తెలియజెప్పడానికి సంఘం అవసరం. ఈ అవసరాలను వెలికితెచ్చే సాధనమే ఈ పత్రిక.
తానా పత్రిక సంవత్సరానికి నాలుగుసార్లు వెలువరించగలమని అనుకుంటున్నాము. మొదటిది మార్చి - ఏప్రిల్ లో ఉగాది సంచిక, రెండవది జూన్-జూలైలో వేసవి సంచిక, మూడవది సెప్టెంబర్-అక్టోబర్ లో దీపావళి సంచిక, నాలుగవది డిసెంబరు-జనవరిలో సంక్రాంతి సంచిక. ఈ పత్రిక మన తెలుగు సంఘపు సభ్యులందరికీ పంపిస్తారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో చేరిన సభ్య సంఘాలలో ఉన్న సభ్యులందరూ తమ సంఘాల ద్వారా చిరునామాలను మన సంఘ కార్యాలయానికి తెలియపరిచిన వారికి పత్రిక అందిస్తారు.
ఏ ఏ విశేషాలుంటాయి…?
సంఘ ఉద్దేశాలు, ప్రణాళికలు, పతకాలు, రూపొందించిన విధానాలు, సాగుతున్న రీతులు, సభ్యుల ఊహలు, సలహాలు, కథలు, గేయాలు, వార్తలు, నాటికలు, సమీక్షలు, వ్యంగ్యోక్తులు, వ్యంగ్య చిత్రాలు,  వుంటాయి  రెండు సంవత్సరాలకొకసారి సంఘం నిర్వహించే సమావేశ విశేషాలు, విషయాలు అన్నీ యిందులో వుంటాయి.  . ”
తానా పత్రికకు రఘునాధ్ తరవాత ప్రథాన సంపాదకులుగా పరిణం శ్రీనివాసరావు. చెరుకుపల్లి నెహ్రూ కొన్ని సంవత్సరాలు  వ్యవహరించారు. యలవర్తి రామరాజభూషణుడు  పత్రిక ప్రచురణలో సహాయపడ్డారు. తరువాత చాలా సంవత్సరాలపాటు డా. జంపాల చౌదరి సంపాదకత్వంలో ‘తానా’ పత్రిక వెలువడింది.  పత్రిక ప్రధాన సంపాదకులుగా వంగూరి చిట్టెన్ రాజు కొన్నేళ్ళు పనిచేశారు.
నల్లమోతు సత్యనారాయణ  తానా అధ్యక్షులుగా ఉన్నప్పుడు పత్రికను చెరుకుపల్లి నెహ్రూ సంపాదకత్వంలో ప్రతి నెలా ప్రచురించటం మొదలుబెట్టి సంస్థను సభ్యులకు దగ్గరగా తెచ్చారు. ప్రతి నెలా 25వ తేదీనాటికి సభ్యులకు అందేటట్లు ఏర్పాటు చేశారు.  1993లో యలవర్తి రామరాజభూషణుడు,  సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి, పత్రికను అందంగా తయారుచేయడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది. 1993 నుంచి 2004 వరకూ (కొద్ది విరామంతో) పత్రికకు సంపాదకులుగా జంపాల చౌదరి ఉన్నారు. సాంకేతిక వనరులు ఆరోజుల్లో అంతగా లేకపోయినా, అందంగా, ఆకర్షణీయంగా పత్రికను తీర్చిదిద్దటంలో, పాఠకులకు ఆసక్తి కలిగించడంలో కృతకృత్యులయ్యారు. వంగూరి చిట్టెన్‌రాజు, కన్నెగంటి చంద్రశేఖర్‌ వివిధ దశలలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు.  కిరణ్‌ప్రభ సంపాదకులుగా 5 సంవత్సరాలు పనిచేశారు.
2009 నుంచి ఎక్కువగా వెబ్ వెర్షన్ లోనూ, అప్పుడప్పుడు ప్రింట్ పత్రికగానూ తానా పత్రిక వెలువడుతున్నది. అన్ని పత్రికల్లోనూ తానా సంస్థాగతమైన విషయాలతో బాటు చక్కటి సాహితీ విలువలున్న కథలూ, కవితలూ, వ్యాసాలూ ఉన్నవి. కవర్ పేజీ డిజైన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు.
కొన్ని తానా పత్రికల ఖర్చులని తానా కుటుంబాల వారు భరించారు. ప్రస్తుతం స్వంత ఖర్చులమీదే పత్రికని ముద్రిస్తున్నారు.
తానా పత్రికకి నేడు ప్రధాన సంపాదకులు - డా. చౌదరి జంపాల, నిర్వాహక సంపాదకులు - నారాయణస్వామి శంకగిరి, సహాయ సంపాదకులు - శ్రీనివాసులు బసాబత్తిన, తనూజ గుడిసేవ, నవీన్ వాసిరెడ్డి ఉన్నారు.
తానాపత్రిక ముఖచిత్రాలు.
                              
0

No comments:

Post a Comment