తానా సజీవ చరిత్ర-part 2-conferences 2 to 19--Innaiah Narisetti

2వ తానా మహాసభ
తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) పేరు ఆధికారికంగా రెండవ మహాపర్వం నుండి వచ్చింది.
రెండవ ‘తానా’ మహాసభ కాకర్ల సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. మహాపర్వం నిర్వహణ కమిటీకి కన్వీనర్ గా మాధవరావు తుమ్మల, సావనీర్ కమిటీలో శ్రీమతి రమాదేవి చెరుకూరి, అచ్యుతరావు రామినేని, చిత్రకళా ఖండాల ప్రదర్శనా కమిటీలో ఎస్.వి.రామారావు, విజయ ఎమ్మాడి, ఆతిథ్య కమిటీలో శ్రీమతి శరణ మండవ, వాణి గుత్తా, పబ్లిసిటీ కమిటీలో డా.జి.ఎం.శాస్త్రి, ప్రసాదరావు కొల్లిపర బాధ్యతలు నిర్వహించారు. మహాపర్వం 1979 మే 26, 27 తేదీలలో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. తానా మహాపర్వాల స్థల నిర్వహణా కమిటీని బి. వెంకటేశ్వరరావు, రామకృష్ణ ఎమ్మాడీ, ఫైనాన్స్ కమిటీని డా. అప్పారావు ముక్కామల, డా. శివరామరెడ్డి, ఎంటర్.టెయిన్.మెంట్ కమిటీని మీనాక్షి యడవల్లి, శ్రీమతి భాస్కరరావు, మణిచారి, చర్చల నిర్వహణా కమిటీలో డా. భాస్కరరావు, డా. జాస్తి వెంకటేశ్వర్లు కలిసి నిర్వహించారు. తానా సంస్థ, నామినేషన్ల కమిటీకి ఛైర్మన్ గా డా. కాకరాల చంద్రశేఖరరావు వ్యవహరించారు.
డెట్రాయిట్ తెలుగు వాసులు మహాసభలో పాల్గొన్న వారందరికీ సదుపాయాలు కల్పించారు. తెలుగు సంప్రదాయం ప్రకారం అతిథులందరినీ ఆహ్వానించారు.
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు, రెండవ తానా మహాసభల కన్వీనర్ డా. మాధవరావు తుమ్మల స్వాగతం చెప్పారు. తానా అధ్యక్షుడు డా. కాకర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ కవి దాశరథి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ మహాపర్వాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డా. అక్కినేని నాగేశ్వరరావు,  ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు, `ఈనాడు` ప్రతిక  సంపాదకులు రామోజీరావు ప్రధాన ఆహుతులలో ఉన్నారు. ఉత్తరోత్తర భారతప్రధానిగా చేసిన పి.వి.నరసింహారావు జ్యోతి వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.  మహాపర్వంలో ఉత్తర అమెరికా లో నివసిస్తున్న తెలుగు వారి సమస్యలు ప్రతిబింబించే విధంగా చర్చలు జరిగాయి.
మహాసభల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆనందింప చేశాయి. ముఖ్యంగా ప్రముఖ హరికథా కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావు ప్రదర్శించిన హరికథ ఆహుతులను ఎంతో రంజింపచేసింది. ఆయన తన స్వంత ఖర్చులతో తానా వచ్చారని తెలిసిన ప్రేక్షకులు అక్కడికక్కడే నిధులు సేకరించి ఆయనకు ఇచ్చారు. నిజానికి కవి దాశరథికి తప్ప మహాసభలకు రాష్ట్రం నుంచి వచ్చిన వారెవరికీ ‘తానా’ ప్రయాణం ఖర్చులు భరించలేదు. తర్వాత జరిగిన మూడు, నాలుగు, అయిదవ మహాపర్వాల్లో కూడా ఇదే విధమైన విధానాన్ని అనుసరించారు.
రెండవ తానా మహాసభలకు  2వేల మంది హాజరయ్యారు. మొదటి తెలుగు మహాసభల నుంచి వచ్చిన వేయి డాలర్లతో మహాసభల్లో ప్రారంభం కాగా రిజిస్ట్రేషన్ ఫీజు, దాతల నుంచి విరాళాల సేకరణ ద్వారా ఇతర నిధులు సమకూరాయి. మొత్తం 11వేల డాలర్లు మేరకు నిధులు జమ కాగా ఇందులో 7వేల డాలర్లు మహాసభల నిర్వహణకు ఖర్చు అయ్యాయి.
రెండవ ‘తానా’ మహాసభల నుంచే సర్వసభ్య సమావేశం ఆధికారికంగా ఆమోదించిన బైలాస్ ప్రకారం ‘తానా’ నిర్వహణ ప్రారంభమైంది. మహాసభల్లో అన్ని సభ్య సంఘాల సభ్యులంతా పాల్గొని వాటిని అధికారికంగా అనుమతించారు. డా.కాకరాల చంద్రశేఖరరావు నేతృత్వంలో డా.జి.ఎం.శాస్త్రి (డెట్రాయిట్ తెలుగు సంఘం), దుగ్గిరాల ప్రేమ్ చంద్ (లాస్ ఏంజిల్స్), డి.వెంకయ్య (టి.ఎల్.సి.ఏ - షికాగో), వాషింగ్టన్ డి.సి. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు, త్రిపిర్నేని తిరుమలరావు (టి.ఎల్.సి., న్యూయార్క్-న్యూజెర్సీ) కలసి సర్వసభ్య సమావేశం ముందు కార్యవర్గ కమిటీ సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. సర్వ సభ్య సమావేశంలో సభ్యులు 1979-81 సంవత్సరానికి కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అధ్యక్షుడుగా డా. మాధవరావు తుమ్మల, ఉపాధ్యక్షులుగా డా. బండారు శివరామరెడ్డి, దుగ్గిరాల ప్రేమ్ చంద్, కార్యదర్శిగా తేళ్ళ తిరుపతయ్య, కోశాధికారిగా శందర్ ఎన్. ప్లాంజెరీ, డైరెక్టర్లుగా డా. కాకరాల చంద్రశేఖర్ రావు, డా. వడ్లమూడి శ్రీకృష్ణ, డా.వి.ఆర్. అనుమోలు, శ్రీమతి వనీత ఎల్గొండ, శ్రీమతి లక్ష్మీ చెరుకూరి, సభ్య సంస్థల అధ్యక్షులందర్నీ ఎన్నుకున్నారు. తానాకు ఎన్నికైన తొలి కార్యవర్గ కమిటీ ఇదే. న్యూయార్క్ తెలుగు మహాసభలను మొదటి తానా మహాపర్వంగా భావిస్తే డా. కాకర్ల సుబ్బారావును ‘తానా’ తొలి అధ్యక్షుడుగా భావించాలి. కార్యవర్గ కమిటీలో ఉత్తర అమెరికా అంతటా తెలుగు వారందరికీ సరైన ప్రాతినిథ్యం లభించేందుకు నామినేషన్స్ కమిటీ కృషి చేసింది. ‘తానా’ కమిటీల మౌలిక నిర్మాణాన్ని కూడా సర్వ సభ్య సమావేశం ఆమోదించింది. ఇదే మహాసభలో తెలుగు ప్రజల ప్రయోజనం రీత్యా సామాజిక సేవా, దాతృత్వ కార్యక్రమాలను చేపట్టడం కోసం తానాలో సమగ్ర భాగంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల ‘తానా ఫౌండేషన్’ అనే సంస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ‘తానా’ డైరెక్టర్స్  బోర్డు ఈ నిర్మాణాన్ని ఆమోదించింది. ఇదే కాలంలో ‘తానా’కు లాభేతర సంస్థగా గుర్తింపు లభించింది.
ఈ మహాసభలో ఆమోదించిన బైలాస్ ప్రకారం ఒక సభ్య సంఘంలో ప్రతి సభ్యుడు సభ్యత్వ రుసుము చెల్లించాలని, ఈ సభ్యత్వ రుసుమును ఆ సభ్య సంస్థలో సభ్యుల సంఖ్యపై ఆధారపడాలని నిర్ణయించారు. సాధారణంగా ప్రతి సభ్యుడు ఒక డాలర్ చొప్పున చెల్లించాలని, సభ్య సంఘాలు ప్రతి 25 మంది సభ్యులకు ఒక్కరి చొప్పున ఒక ప్రతినిధిని ఎంపిక చేయాలని, వారు ‘తానా’ సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ తరఫున ప్రతినిధులుగా పాల్గొనాలని నిర్ణయించారు. తర్వాతి కాలంలో బైలాస్, సభ్యత్వ రుసుం మారుతూ వచ్చాయి.
వాషింగ్టన్ లో దూర్వాసుల శాస్త్రి, యుగంధర్ హనుమార, వడ్లమూడి శ్రీకృష్ణ, జక్కంపూడి సుబ్బారాయుడు తానా సంఘ రిజిస్ట్రేషన్ 1981లో చేయించారు.
రాజ్యాంగాన్ని రాసుకున్న తరవాత బైలాస్ ఏర్పరచారు. వాటి ప్రకారం తానా నడుచుకుంటూ వచ్చింది. అందులో ఇటీవల చేసిన సవరణల ప్రకారం గవర్నింగ్ బోర్డు బదులు 2009లో బోర్డు  ఆఫ్  డైరక్టర్స్ అమలులోకి వచ్చింది.
తెలుగు  పలుకు
మహాసభల ప్రత్యేక సంచికను `ఆంధ్రజ్యోతి` అధినేత కె.ఎల్.ఎన్.ప్రసాద్ ఆంధ్రజ్యోతి ప్రెస్.లో  ముద్రించి అందించారు. సోవనీర్ కమిటీ అధ్యక్షురాలు చెరుకూరి రమాదేవి.  ఆమెకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, నండూరి రామమోహనరావు తోడ్పడ్డారు. సావనీర్ ముఖచిత్రానికి ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామారావు రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సందేశం సావనీర్ లో ప్రచురించారు. దాశరథి, శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, తిరుమల రామచంద్ర, బాలాంత్రపు రజనీకాంతరావు, ఆరుద్ర, గొల్లపూడి మారుతీరావు, బి.ఎస్.ఆర్. కృష్ణ, నండూరి పార్థసారథి, పాతూరి నాగభూషణం, కె.వి.రమణారెడ్డిల రచనలతో సావనీర్ అలరారింది. రెండవ మహాసభల నాటికే తానా ఇంత ప్రామాణికంగా ప్రత్యేక సంచికను వెలువరించగలిగింది.
ఈ సంచికలో: తెలుగు కథ వికాసం (వ్యాసం) - సత్యసాయి, తెలుగు జర్నలిజం (వ్యాసం) బి.ఎస్.ఆర్. కృష్ణ, తెలుగు సినిమాకథ (వ్యాసం) - నండూరి పార్థసారధి, నేను-నాపూజలు (గేయం) - వేణూధర్, విదేశాంధ్రుడు ఓ డాక్టర్ గూటాల కృష్ణమూర్తి - యస్.వి.రామారావు, తెలుగు రచయితవయితే (గేయం) - రమాదేవి గల్లా, తెలుగు నవల వికాసపరిణామాలు (వ్యాసం) - పురాణం పుబ్రహ్మణ్య శర్మ, Nayagara Dance  (Poem) - నోమా ఎస్.ఆర్.శర్మ, ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయ ఉద్యమము - పాతూరి నాగభూషణం, శిష్ట చతుష్టయం - కె.వి.రమణారెడ్డి, Our Indians in the USA - సి. వేణుగోపాలరావు, Telugu Literature - జక్కంపూడి సుబ్బారాయుడు, My Heroes (poem) - బండారు లక్ష్మారెడ్డి, First Telugu Conference of North America - రవీంద్రనాథ్ గుత్తికొండ, Contemporary Art in A.P.  - రమ కాకరాల, Telugu Associations in Chicago, New York, Detroit , San francisco.
3వ తానా మహాసభ
మూడవ తానా మహాసభ చికాగోలో జరిగింది. 1981 మే 23, 24 తేదీల్లో జరిగిన ఈ సభలు ఓక్.పార్క్.లో ఉన్న ఓక్.పార్క్ అండ్ రివర్ ఫారెస్ట్ హైస్కూలులో జరగడం ఒక విశేషం.
విశాల చికాగో తెలుగు సంఘం మహాసభలను నిర్వహించింది. ‘తానా’ అధ్యక్షుడు తుమ్మల మాధవరావు పర్యవేక్షణలో చికాగోలో జరిగిన మహాపర్వాలకు కన్వీనర్.గా తేళ్ల తిరుపతయ్య వ్యవహరించారు. చికాగోలోని తెలుగు కుటుంబాలే వంటకాలను తయారు చేశాయి.  4వేల మంది హాజరయ్యారు.
మహాసభలకు కేంద్ర సమన్వయ కమిటీలో శంకర్ ఎన్. ప్లాంజేరి, అనంత్ ఆర్. వూటుకూరు, అరుణ శ్రీ తణుకు, బాబూరావు జవ్వాజి, సి.ఎల్.నారాయణ, సి.ఉమాపతి రెడ్డి, జనార్దన్ మంథని రెడ్డి  బాధ్యతలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల కమిటీకి ఛైర్మన్.గా రమణమూర్తి వి. యడవల్లి, సహ ఛైర్మన్.గా రామ్ రెడ్డి సామా, చర్చల కమిటీకి ఛైర్మన్ గా నాయుడు ఆర్.గల్లా, సహ ఛైర్మన్.గా రాఘవరావు మండవ, కళా ప్రదర్శనల కమిటీ ఛైర్మన్ గా ఎస్.వి.రామారావు, సహఛైర్మన్ గా అరుణశ్రీ తణుకు, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్.గా ఉపేంద్ర నాథ్ నిమ్మగడ్డ, సహ ఛైర్మన్లుగా హరనాథ్ బి. త్రిపురనేని, కె.ఎస్.చౌదరి గోరంట్ల, సభాస్థలి కమిటీ ఛైర్మన్.గా వై. శ్యామసుందర్ రావు, సహ ఛైర్మన్.గా ఉమాపతి రెడ్డి, మహాసభల అనంతర చర్యల కమిటీ ఛైర్మన్.గా సి.ఎల్. నారాయణ, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్.గా మాధవ బి.ఎం.రెడ్డి, సహ ఛైర్మన్.గా పట్టాభి ఆర్. మిట్టపల్లి, సావనీర్ కమిటీ ఛైర్మన్.గా ఊట్కూరు అనంతరామారావు, సహ ఛైర్మన్లుగా పరిమి శ్రీరంగనాయకులు, దామరాజు సచ్చిదానంద మూర్తి, ఆతిథ్య కమిటీ ఛైర్మన్ గా సుదర్శనరావు అక్కినేని, సహఛైర్ పర్సన్ గా సావిత్రి జి. కొమండూరి వ్యవహరించారు.
చికాగో సమావేశాల్లో చర్చించిన ప్రధానాంశం - ‘మన పిల్లలు, ఉత్తర అమెరికాలో వారి పెంపకం’ ఈ సమావేశాల్లో జరిగిన వివిధ కార్యక్రమాలలో స్థానికంగా బాలబాలికలు విరివిగా పాల్గొని రంజింపజేశారు.
తానా మూడో మహాసభ షికాగోలో జరిగినప్పుడు చరిత్ర మలుపులో ఇదొక కీలక స్థానం వహించిందా అన్నట్లు నిర్వహించారు. ఇందులోతుమ్మల మాధవరావు, తేళ్ళ తిరుపతయ్యగారి కృషి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రారంభమయి, ప్రముఖుల సంక్షిప్తోపన్యాసాలతో అలంకరించింది. ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న ప్రముఖులు - ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుండి పరిశ్రమల శాఖామాత్యులు ఎం బాగారెడ్డి, ఆరోగ్య శాఖామంత్రి ఆవుల మదనమోహన్, పారిశ్రామికాభివృద్ధి సంస్థ అధ్యక్షులు ఎడ్లపాటి వెంకటరావు, సుప్రసిద్ధ  నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కళాప్రపూర్ణ సి. నారాయణరెడ్డి, భారత ప్రభుత్వ ప్రతినిధిగా భట్నాగర్ సందేశాలు అందజేశారు. తొలిసారి అమెరికాకు వచ్చి తానా మహాపర్వాలలో పాల్గొన్న సుప్రసిద్ధ విప్లవ కవి శ్రీశ్రీ మాట్లాడుతూ “జార్జి వాషింగ్టన్, అబ్రహాం లింకన్, కవి ఎడ్గార్ ఎలెన్ పో, ఐన్.స్టెయిన్ ఉన్న దేశానికి తాను వచ్చానని నిజమైన ప్రపంచ మహాసభలు ఇవేనని,  చికాగో తానా మహాసభ మూడు ఖండాలకు ప్రాతినిధ్యం వహించిందని, తెలుగువారి పెళ్ళి ఇంట్లో సందడిగా ఉన్నదని,  పాశ్చాత్య విజ్ఞానానికి, తెలుగు సంస్కృతికి జరిగిన కల్యాణం అని  సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పెళ్ళికి వచ్చినట్లున్నదే కాని ఉపన్యాసాల సభకు వచ్చినట్లు లేదంటూ, ప్రపంచ శాంతి ప్రథమ శిశు సంతానం కావాలని కోరుకుంటున్నట్లు” తెలిపారు.  సి. నారాయణ రెడ్డి పలుకుతూ ‘ఒకప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల’ అని రాసింది తానా మహాసభలలో నిజమేమో అన్నట్లుగా ‘అమెరికా పగలు ఆంధ్రా వెన్నెల’గా ఉన్నదని చమత్కరించారు. చికాగో సమావేశాలకు వచ్చిన గౌరవాతిథులలో డాక్టర్ వెంకటరావు, సి. ఎన్. శాస్త్రి, మహారథి త్రిపురనేని, నాయని కృష్ణకుమారి, ఆనందారామం, ఎస్. రాజేశ్వరరావు, ఎమ్.ఎస్. రెడ్డి, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, యు. వెంకటేశ్వర్లు, వి. రామారావు, జర్నలిస్టు బసవపున్నయ్య, వీరమాచినేని మధుసూదనరావు, వెలివోలు సీతారామయ్య, డాక్టర్ సోమరాజు, వై.వి. రమణ, సుమతీ కౌశల్, అక్కినేని అన్నపూర్ణ ఉన్నారు. ఆ సమావేశాలలో జరిగిన పారిశ్రామిక చర్చలలో నార్ల తాతారావు పాల్గొని   స్థాయిని సమకూర్చారు.
మూడవ ‘తానా’ మహాసభల నుంచి ప్రముఖులకు ‘తానా’ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. మొదటి ‘తానా’ అవార్డును ప్రముఖ గణాంక శాస్త్రవేత్త, ప్రపంచంలోని పదిమంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్ సి.ఆర్.రావుకు ప్రదానం చేశారు. కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ రావు చేసిన పరిశోధనలు ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆయన సమర్పించిన రెండు పరిశోధనా పత్రాలు 20 శతాబ్దంలోనే గణాంక శాస్త్ర రంగం తీరుతెన్నుల్నే మార్చివేశాయనడం అతిశయోక్తి కాదు. ఆయన 17 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలను పొందారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ఆయనకు రాష్ట్రపతి మెడల్ ను లోగడ ప్రదానం చేశారు.
మూడవ ‘తానా’ సమావేశాల్లో 1981-83 సంవత్సరానికి కార్యవర్గ కమిటీ ఎన్నికలు బైలాస్ ప్రకారమే జరిగాయి. ఈ మహాపర్వాలలో తేళ్ళ తిరుపతయ్య అధ్యక్షుడుగా, కాకరాల చంద్రశేఖరరావు మొదటి ఉపాధ్యక్షుడుగా, గోరంట్ల చౌదరి రెండవ ఉపాధ్యక్షుడుగా, యడవల్లి సోమయాజులు కార్యదర్శిగా, మాజీ అధ్యక్షుడు మాధవరావు తుమ్మల, సభ్య సంస్థల అధ్యక్షులందర్నీ డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు.
తెలుగు పలుకు
ప్రత్యేక సంచికకు `తెలుగుపలుకు` అని పేరుపెట్టారు. ఊటుకూరు అనంత రామారావు అధ్యక్షతన  సావనీర్ సంఘం ఏర్పడింది.
ఇందులోని రచయితలు: దాశరథి, సి. నారాయణరెడ్డి, దుర్గాప్రసాద్ వారణాసి, ఉపేంద్ర పుష్క, శిష్ఠా విజయ, యడవల్లి రమణమూర్తి, వి. పద్మావతి, చింతం రాణీ సంయుక్త, బంగారు స్వరూప, సామా రామిరెడ్డి, వి. సుసర్ల, కృష్ణ దేవులపల్లి, అనిల్ కుమార్, ఎ. లక్ష్మీ రమణ, ఎస్.వి. రామారావు, కోట సుందరరామశర్మ, వంగూరి చిట్టెంరాజు, గల్లా అరుణ, మణి ఐస్సోల, శారదాపూర్ణ శొంఠి, కాకర్ల సుబ్బారావు, చెరుకూరి రమాదేవి, లక్ష్మి దామరాజు, ఓబుల నారాయణ శర్మ, చల్లూరి జగన్మోహన రెడ్డి, పచ్చా వాసుదేవరావు, సత్య, వేమూరి వెంకట సూర్యనారాయణ, వేమూరి వెంకటేశ్వరరావు, మూర్తి ఎన్. దామరాజు, పుచ్చా వసంతలక్ష్మి, మొక్కపాటి ఎస్.ప్రసాద్, డాక్టర్ క్రీస్తు రావు, నాయని కృష్ణకుమారి, యార్లగడ్డ ఆంజనేయులు, సూర్యకాంతం పప్పు. కోలవెన్ను వెంకట కృష్ణయ్య, వి.వి.ఎల్. నరసింహారావు, వాడ్రేవు సుబ్బారావు, ఈ సంచికకు చిత్రకారుడు బాలి ముఖచిత్రం వేశారు. ఇంగ్లీషు రచనలు చేసినవారు, పి. వేణుగోపాలరావు, కోటా ఎస్.ఆర్. శర్మ, అన్నపూర్ణ గరిమెళ్ళ, ఉషా అన్నంభట్ల, వై. శ్యామసుందరరావు, పి. రాజగోపాలనాయుడు, నడుమి అదితం, పద్మజా రెడ్డి సామ, బెంగూళురు సురేశ్వర, మాధురీ కాకరాల, గిరిధర్ దేవులపల్లి, కళా అన్నం భొట్ల, శ్యామల యలమంచిలి, వి. వి. మాణిక్యాలరావు. పోషకుల జాబితా వివరంగా ఇచ్చారు.
నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య సందేశం ఇచ్చారు.
4వ తానా మహాసభ
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం సహకారంతో నాలుగవ ‘తానా’ మహాసభ 1983 మే 28, 29 తేదీల్లో మేరీలాండ్ రాష్ట్రంలో  (సిల్వర్ స్ప్రింగ్ సిటీలో నార్త్ వుడ్ హైస్కూల్లో) జరిగింది.  మహాసభలకు 2000 మంది తెలుగువారు హాజరయ్యారు. ‘తానా’ అధ్యక్షుడు తేళ్ళ తిరుపతయ్య పర్యవేక్షణలో జరిగిన మహాసభలకు, కన్వీనర్ గా జక్కంపూడి సుబ్బారాయుడు వ్యవహరించారు. కేంద్ర సమన్వయ కమిటీలో రాజగోపాలరావు కోనేరు, ఎస్.వి.రామారావు, సోమా సుదర్శన్ రెడ్డి  బాధ్యతలు నిర్వహించారు. ఆహార కమిటీకి ఛైర్మన్.గా వడ్లమూడి జమునాబాయి, సహఛైర్ పర్సన్.గా మన్నవ మధుసూదనరావు, సహ.ఛైర్.పర్సన్.గా సదానంద మృణాళిని,  కార్యక్రమాల కమిటీ ఛైర్మన్.గా గుంటకట్ట శ్రీనివాసమూర్తి, ఆతిథ్య కమిటీ ఛైర్మన్.గా కేసరి లక్ష్మీనారాయణ. కళా రంగ కమిటీ ఛైర్.పర్సన్.గా ఎస్.వి.రామారావు వ్యవహరించారు.
మొదటిరోజు జరిగిన స్వాగత సభలలో అమెరికాలో భారత రాయబారి కె.ఆర్.నారాయణన్, ఆచార్య రంగా, ఛార్లెస్ గిల్.క్రిస్ట్, న్యాయమూర్తులు రామారావు, మాజీ ముఖ్యమంత్రి డా. ఎమ్. చెన్నారెడ్డి ప్రసంగించారు. రెండు రోజులు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భువన విజయం నాటకం, నృత్య నాటికలు, బుర్రకథలు, భారతదేశం నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, అమెరికాలోని చిన్నారులు, యువతీయువకులు, సంగీత నృత్య ప్రదర్శనలు తెలుగువారిని ఎంతో ముగ్ధులను చేశాయి. కార్యక్రమాల సందర్భంగా ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, స్మారక తపాలాబిళ్ళల విడుదల జరిగింది. వివిధ రకాల వస్తు విక్రయ శాలలను ఏర్పాటు చేశారు.
భాషా సంస్కృతులను కాపాడుకోవడం, ఆంధ్రప్రదేశ్.లో మరుగున పడుతున్న సంప్రదాయ కళలను పునరుద్ధరించడం, అమెరికాలో పిల్లల విద్యా సమస్యలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, రాష్ట్రంలో ప్రవాసాంధ్రులకు వ్యాపార అవకాశాలు అంశాలపై   రెండు రోజులపాటు చర్చలు జరిగాయి. స్త్రీలు, యువకులు వేర్వేరు సమూహాలుగా ఏర్పడి తమ సమస్యలపై చర్చలు జరిపారు. వైద్యం, ఆరోగ్య సంరక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలు, సాహిత్య, సాంస్కృతిక అంశాలపై సామూహిక చర్చలు జరిగాయి. అమెరికాలో కూడా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలను చేసుకోవడమూ, లేక ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలా అన్న అంశాలపై యువతీయువకులు తమలో తామే చర్చించుకోవడం విశేషం. సాహిత్యం, సంస్కృతి, కళలను ఎలా విస్తరింపచేయాలి అన్న అంశంపై జరిగిన చర్చకు గుత్తి వరప్రసాదరావు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. చెరుకూరి రమాదేవి, వెల్చేరు మాలతి, కాకులవరపు మధుసూదన రెడ్డి, ఆకెళ్ళ మూర్తి, లతారావు, ఎస్.వి.రామారావు, ఆర్.వి.ఎస్.సుందరం ఈ చర్చలో పాల్గొన్నారు.
ఈ సమావేశాల్లో ‘తానా’ అవార్డులను ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు, హైదరాబాద్ లోని ఎల్.వి. ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సంస్థాపకుడు డా. జి.నాగేశ్వరరావు, పిట్స్.బర్గ్ యూనివర్సిటీలో వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సుధాకర్ పెసర రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామారావు, ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్.కు ప్రొఫెసర్ నన్నపనేని నారాయణరావులకు ప్రదానం చేశారు. అవార్డుల కమిటీ ఛైర్మన్.గా డా. కాకరాల సుబ్బారావు వ్యవహరించారు. తానా అధ్యక్షుడు డా. కాకారాల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మొట్టమొదటిసారి సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డులను బహూకరించారు.
తెలుగు పలుకు
‘తేళ్ళ తిరుపతయ్య అధ్యక్షులుగాను, జక్కంపూడి సుబ్బారాయుడు సమావేశకర్తగాను, జరిపిన నాలుగవ తానా మహాసభలకు ప్రచురించిన తెలుగుపలుకుకు  యార్లగడ్డ కిమీర సంపాదకత్వం వహించారు. సావనీర్ ఛైర్.పర్సన్.గా యార్లగడ్డ కిమీరారావు, సంపాదకుడుగా వెల్చేరు నారాయణరావు,
ఈ మహాసభలలో వెలువరించిన ‘తెలుగు పలుకు’ ప్రత్యేక సంచికకు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు జార్జిబుష్ ప్రత్యేక సందేశాన్ని పంపారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి ఎన్టీరామారావు, కేంద్ర నౌకా రవాణా మంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ ఎన్.జి.రంగా  సందేశాలు పంపిన వారిలో ఉన్నారు. స్థానిక రచయితల రచనలతో పాటు ఈ సంచికలో శ్రీశ్రీ రచించిన కవితా, ఓ కవితా ఆంగ్ల ఆనువాదాన్ని కూడా చేర్చారు.
ఇందులో రచయితలు – సామా రామిరెడ్డి, డాక్టర్ రాణీ సంయుక్త చింతం, ప్రభా చిట్యాల, సుధేష్ణ, ఊట్కూరి అనంత్, టి.వి.వి. రామారావు, కొట్రా కృష్ణమూర్తి, జక్కంపూడి సుబ్బారాయుడు సూక్తులు, తంగిరాల లక్ష్మీనారాయణ, పట్టిసపు శకుంతలా గంగాధరం, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఏతుకూచి కృష్ణ, గాంధీజీ యలమంచిలి, వేలూరి వెంకటేశ్వరరావు, దామరాజు సచ్చిదానందమూర్తి, అరుణ గల్లా, దేవులపల్లి కృష్ణ,
ఇంగ్లీషులో రాసినవారు -
రామారావు చెరుకూరి, ఎస్.ఎస్.మూర్తి, పి. వేణుగోపాలరావు, సబల మండవ, ఫణి బంటుమిల్లి, సుగుణ పప్పు, నీరజారావు చెరగొండ్ల, మాధురి కాకరాల, పద్మజ సామ, సుముఖ గుంతకట్ట, పెమ్మరాజు శ్రీ రామారావు. ఈ సంచికలో ప్రత్యేకంగా శ్రీ శ్రీ గేయానికి ఆయనే చేసిన ఇంగ్లీషు అనువాదాన్నిప్రచురించారు.  ముఖచిత్రం బాపు.
5వ తానా మహాసభ
అయిదవ ‘తానా’ మహాసభ 1985 జూలై 5, 6, 7 తేదీల్లో లాస్ ఏంజల్స్ లోని లాంగ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఈ సమావేశాలను నిర్వహించింది. సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి ప్రధానాంశాలపై ఈ మహాసభల్లో చర్చలు జరిగాయి. తానా అధ్యక్షుడు కాకరాల చంద్రశేఖరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ మహాసభలకు కన్వీనర్ : డా. రాఘవేంద్ర ప్రసాద్, సహ కన్వీనర్ : డా. ప్రేమచంద్ దుగ్గిరాల . ఈ మహాసభల కేంద్ర సమన్వయ కమిటీలో లాస్ ఏంజిలస్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు అట్లూరి చంద్రశేఖరరావుతో పాటు నాగేశ్వరరావు గంగుల, రాళ్లబండి శంకరం, చౌదరి డి. వోలేటి, సత్యనారాయణ ఉపాధ్యాయుల, ఎ. నరేంద్రనాథ్ రెడ్డి, విజయ సారథి కొమండూరి, మణి ఐసోల, పి.ఎస్.విజయకుమార్, రామలింగారెడ్డి, దామోదర్ రెడ్డి, జీరెడ్డి ప్రసాద్, వెంకటేశ్వరరావు దాలువాయి, పద్మా ఉపాధ్యాయుల, సుందరీ సముద్రాల, గుమ్మడి ధర్మారావు, రామచంద్రరావు పాలడుగు, బాపయ్య గోగినేని, అరుణా రెడ్డి చిలుముల, సుబ్బారావు బలుసు, వేమూరి వెంకటేశ్వరావు, జె.ఎస్.ఎం.కమల, పి.ఎస్.కమల, కోగంటి మధుసూదన్ రావు, కామేశ్ అయసోలా, జానపాటి హనుమంతరావు, కొమండూరి లక్ష్మి, సీతా వేమూరి బాధ్యతలు నిర్వహించారు.
లోక్ సభలో ప్రతిపక్షనేత పి.ఉపేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎం.ఎస్.కోటేశ్వరరావు, వసంత నాగేశ్వరరావు, ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి, ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.పి.ఐ.డి.సి ఎండి పి.ఎల్.సంజీవరెడ్డి, ఎ.పి.ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వర్లు, ప్రముఖ సాహితీ వేత్త డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.కాసరనేని సదాశివరావు  రాష్ట్రం నుంచి వచ్చి పాల్గొన్నారు. మహాసభలో దూసి కూర్మనాథరావు, బండారు పార్వతీశ్వరరావు, వి.రామారావు, మండపాక శారదల బుర్రకథ, హరికథలతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తానా సాంస్కృతిక కమిటీ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా నిర్వహించిన నృత్యప్రదర్శనల్లో పాల్గొన్న ప్రముఖ నర్తకి శోభానాయుడు తన కూచిపూడి నృత్యప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తానా సాంస్కృతిక కమిటీకి నున్నా నాగభూషణం (పిట్స్ బర్గ్), కె.వి.రావు (న్యూయార్క్) నేతృత్వం వహించారు.
అయిదవ తానా మహాసభలలో అవార్డులు పొందిన ప్రముఖ అమెరికా ప్రవాసాంధ్రుల్లో శ్రీమతి రత్నా అనిల్ కుమార్ (కళలు), వెలగపూడి ప్రభాకర చౌదరి, పి.ఆర్.జె. గంగాధరం, పరుచూరి కృష్ణయ్య, బండారు శివరామరెడ్డి (శాస్త్ర పరిశోధన), వెంకటేశ్వరరావు దుక్కిపాటి, జి.ఆర్. మోహనరావు (ఇంజనీరింగ్), విద్యాసాగర్  ధర్మపురి (మెడిసిన్), కోటేశ్వరరావు బచ్చు, అప్పారావు ముక్కామల, లక్ష్మీ కొమండూరి, టి.రామచంద్రారెడ్డి (కమ్యూనిటీ సర్వీసు) ఉన్నారు. డా. పెమ్మరాజు వేణుగోపాలరావు అవార్డుల కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించారు.
ఈ సమావేశాల్లోనే ‘తానా’ వాణిజ్య, పెట్టుబడుల మండలి సమావేశాలు కూడా జరిగాయి. రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చలు కేంద్రీకృతం అయ్యాయి. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ తరఫున వచ్చిన అధికారులు,  పారిశ్రామిక వేత్తలు, భారత అమెరికా వాణిజ్యమండలి ప్రతినిధులు  ఈ చర్చల్లో పాల్గొన్నారు. విమాన ప్రమాదంలో మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త నాయుడమ్మ మృతికి ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తానా వైద్య నిపుణుల సమావేశం, తానా శాస్త్రవేత్తలు, విద్యావంతుల మండలి సమావేశం కూడా ఈ మహాసభలో జరిగాయి.
ఈ మహాసభల్లో యువజన కమిటీ ఛైర్మన్ లక్ష్మీ కొమండూరి అధ్యక్షతన చర్చల్లో యువతీ యువకులు పాల్గొన్నారు. అమెరికా సంస్కృతి పట్ల తెలుగు యువత స్పందన, తల్లిదండ్రుల అభిప్రాయాలు, వివాహాలు-పెద్దల ఇష్టాయిష్టాలు అంశాలపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. మహిళా ఫోరమ్ సమావేశాల్లో మహిళలు చర్చల్లో పాల్గొన్నారు. జ్యోత్స్న పరుచూరి, భారతీ వాయువేగుల, అరుణ చిలుముల, నేతి సుశీల ప్రసంగించారు.
ప్రత్యేక సంచిక ‘తెలుగు పలుకు
5వ మహాసభ ప్రత్యేక సంచిక ‘తెలుగు పలుకు’ 1985లో లాస్ఏంజెలస్ లో జరిగిన సందర్భంగా వెలువరించారు. దీనికి  ఛైర్మన్.గా వెంకటేశ్వరరావు వేమూరి, సహ ఛైర్ పర్సన్ గా పి.ఎస్.కమల, జె.ఎస్.ఎం.శర్మ, సంపాదక సలహాదారుగా  పురాణం సుబ్రహ్మణ్య శర్మ వ్యవహరించారు.
బాపు ముఖచిత్రంతో వెలువడిన ఈ సావనీర్ విభిన్న రచనలతో విరాజిల్లింది. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రాష్ట్ర గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ, పిసిసి అధ్యక్షుడు జలగం వెంగళరావు  సందేశాలను ఈ సంచికలో ప్రచురించారు. ఇందులో పుచ్చా అన్నపూర్ణ, విశ్వనాథ అచ్యుతరాయలు, చెరుకూరి రమాదేవి, విఠల జానకి రామశాస్త్రి, వంగూరి చిట్టెంరాజు, ఐసోల మణి, జయప్రదా శ్రీనివాసన్, వేమూరి నరసింహ మూర్తి, గిడుగు లక్ష్మీ దత్తు, కె. శకుంతల, వడ్లకొండ రవీంద్ర, పూడిపెద్ది లక్ష్మణమూర్తి, మానేపల్లి సత్యనారాయణ, లల్లాదేవి, ప్రేమా గాయత్రి, పురాణం సీత, వి.వి.సూర్యనారాయణ, పాలడుగు వెంకటేశ్వరరావు, పప్పు వేణుగోపాలరావు, చెరుకుపల్లి నెహ్రూ, ఆకెళ్ళ జగన్నాథం, మాలతీచందూర్, బి.విద్యాసాగర్, గొల్లపూడి మారుతీరావు, వేమూరి వెంకటేశ్వరరావు, పిల్లుట్ల నరసింహ, మహేంద్ర, వేమూరి వెంకటేశ్వరరావు,  బి.ఎస్.ఆర్ కృష్ణ, సామ రామిరెడ్డి, పులిగడ్డ విశ్వనాథరావు, సి.ఎస్. కుమార్, రావి కొండలరావు, పట్టినపు గంగాధరం, వడ్లకొండ స్వరాజ్యలక్ష్మి, కోట సుందరరామశర్మ, పురాణం సుబ్రహ్మణ్యశర్మ రచనలు ఉన్నాయి.  ఇంగ్లీషు విభాగంలో 22 మంది రచనలు చేర్చారు. తానాకు సంబంధించిన సమాచారం, ప్రముఖుల సందేశాలు, ప్రకటనలు, సంచికలో ప్రచురించారు.
6వ తానా మహాసభ
ఆరవ తానా  మహాసభ సెయింట్ లూయీస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సెంట్ లూయీస్ లో 1987 జూలై 11, 12 తేదీల్లో జరిగింది. అధ్యక్షులుగా రాఘవేంద్రప్రసాద్, కన్వీనర్ గా మంతెన నరసరాజు, సహ కన్వీనర్.గా గోపీచంద్ ఎలమంచిలి వ్యవహరించారు. పాటిబండ్ల వి.రావు, సుధా సత్యాసాగర్, రాజ్యలక్ష్మి నాయుడు, వింజమూరి సుజాత, దండు రఘునందన్, కోసూరి సుబ్బయ్య, అనంతనేని ప్రకాశరావు, వల్లూరి ప్రసాద్, గండికోట వి.రావు, కాజా వెంకటేశ్వరరావు  సమావేశాల్లో వివిధ బాధ్యతలు స్వీకరించారు. డా.కాజ రామారావు, డా.దండమూడి రాజేంద్ర ప్రసాద్, సామాల రామయ్య అన్నింటా తామై వ్యవహరించి సమ్మేళనం విజయవంతం కావడానికి కృషిచేశారు.
6వ మహాసభలో ప్రొ.ఎస్.చంద్రశేఖర్ (1918-2001) ప్రధాన అతిథిగా ఉపన్యసించగా కీలకోపన్యాసాన్ని                డా. రామకృష్ణారావు ఇచ్చారు. రాయబార కార్యాలయ అధికారి ఎస్. ముఖర్జీ సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సభలలో స్త్రీ విభాగం, యువత విభాగం చర్చలు చేయగా వైద్య విభాగం సమావేశమై అనేక సుదీర్ఘ విషయాలను పరిశీలించింది.
ఆంధ్రుల సంస్కృతి, కళ, జీవన విధానంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
పారిశ్రామిక రంగం, పెట్టుబడుల విషయమై ప్రత్యేక చర్చ జరగటం మహాపర్వానికి విశిష్టత సమకూరింది. ఇందులో సమన్వయ కర్తగా విజయకుమార్ ఉండగా పెరుగుతున్న అభివృద్ధిని మండవ పాండురంగారావు అంచనా వేశారు. వివిధ ప్రాజెక్టులను కె.ఆర్. రావు సమీక్షించారు. సి.ఎస్. శర్మ కీలకోపన్యాసం ఇచ్చారు. ఉన్నత సాంకేతిక సహాయంతో చిన్న పరిశ్రమ నడపడంలో ఎదురయ్యే సమస్యలను పారిశ్రామికవేత్త భగత్ సింగ్ పరిశీలించారు. రాష్ట్రం నుండి వచ్చిన వివిధ పారిశ్రామిక వేత్తలు చర్చలో పాల్గొన్నారు.
మెడికల్ సెమినార్.లో డా. జి.వి. నాయుడు సమన్వయ కర్తగా వ్యవహరించగా డా. కాకర్ల సుబ్బారావు రాష్ట్రంలోని ఆరోగ్య అంశాలు చర్చించారు. వైద్య సాంకేతిక పరికరాలను అందించటంలో ఉన్న సమస్యలను డా. కె. జగన్మోహన రావు కూలంకషంగా వివరించారు.  భారతదేశంలో వైద్య కోర్సుల విషయమై డా. శంకరం చర్చించారు. రాష్ట్రంలో వైద్య పథకాలను గురించి రాఘవేంద్ర ప్రసాద్, టాక్స్ షెల్టర్స్ విషయమై జి. దామోదర్ రెడ్డి వివరించారు.
అధ్యక్షులు డాక్టర్ రాఘవేంద్ర ఎస్. ప్రసాద్  ఉపన్యాసం:
“సభకు నమస్కారం.
ఉత్తర అమెరికా నలుదిశల నుండి విచ్చేసిన తోటి తెలుగు మిత్రులకు - తెలుగు సీమనుండి విచ్చేసిన ఆహ్వానితులకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, శాస్త్రవేత్తలకు, ఈనాటి ముఖ్యవక్త, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఓనాటి ఉత్తర అమెరికా ప్రవాసాంధ్రులు, ప్రఖ్యాత విద్యావేత్త ఆచార్య రామకృష్ణారావుగారికి; ఎఱ్ఱ త్రికోణం గుర్తును సృష్టించి, పరిమిత సంసార నినాదాన్ని, చారిత్రాత్మకంగా ప్రచారం చేసి, దేశ విదేశాల మన్ననలనందుకున్న మాజీ కేంద్ర వైద్య శాఖామాత్యులు, ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య చంద్రశేఖరుగారికి, ఆమెరికాలోని 20,000 తెలుగు వారి తరఫున ప్రతినిధిగా - స్వాగతం! సుస్వాగతం! గత 15 ఏళ్ళ నుండి బహుళ సంఖ్యతో తెలుగువారు అమెరికాకు వలస రావడం జరిగింది. వలస వచ్చిన తొలుతలో మిగతా వలసీయుల వలె రేయనక పగలనక శ్రమించిన కారణాన అతి త్వరలోనే అత్యున్నత స్థాయిలోనికి చేరటం జరిగింది.
ఉత్తర అమెరికాలోని భారతీయులు సంపాదనలో పై అయిదు శాతంలో ఉండగలగటం మనందరికి గర్వకారణం. దీనికి కారణం మనలో యిమిడిన, మనలో ప్రవహించిన - మనలను నడిపించిన ప్రాక్, పశ్చిమ జీవన విధాన సమ్మేళనా ప్రభావమే!  ఏ జీవన విధానమైతే, ఏ సంస్కృతీ ప్రభావమైతే మనలను సంపూర్ణ ప్రతిభావంతులుగా చేసిందో, ఆ మన సంస్కృతి మనతోటే, మనతరం తోటే అడుగంటి అంతరించకుండా, మన భావితరాలకు, మన యువతరం ద్వారా అందించే ప్రయత్నంలో ఆరవ మెట్టు ఈనాటి ఆరవ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం!
ఆమెరికాలోని మన తెలుగు యువతకు చాల ప్రత్యేకమైన సమస్యలున్నయ్! యిటు యింట్లో ఒక వాతావరణం! అటు బయట వాతావరణం! ఈ విభిన్న ప్రకృతులను సమన్వయ పరచుకొనే శక్తిని మన యువతకు అందించవలసిన బాధ్యత, కర్తవ్యము మనలో ప్రతి ఒకరిలోను వుంది. మనం చెప్పే సూక్తుల కంటే, మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవన విధానం ద్వారానే మన యువత ప్రభావితం అవుతుంది. మన యువతకు ఈ సమన్వయ శక్తి నివ్వాలంటే, మనం, మన జీవన విధానాన్ని సమన్వయపరచుకోగలగాలి.
ప్రాక్ పశ్చిమ జీవన వృక్షానికి మనమే బీజం. ఆనాడు మనం నాటిన ఈ బీజం ఈనాడు మొలకైచిగురులు తొడుక్కుంది. ఇది మన సంఘటిత రక్షణలో ఎదిగి మానై, మహావృక్షమై, మన భావితరాలకు, వారి తరాలకు చల్లని నీడై అండనిస్తుందని ఆశిద్దాం!
మనం మలచిన మన యువతరం అటు మనకు జన్మనిచ్చిన తెలుగు నాటికి, భారతావనికి, యిటు సంరక్షించి, పోషించి, పాలించిన అమెరికా దేశానికి, ఉభయ తారకమై, గర్వకారణమౌతారని ఆశిద్దాం!
ఈనాటి ఈ సమ్మేళనానికి ఇరువది నెలల నుండి శ్రమించి పనిచేసిన డాక్టర్ నరసరాజుగారికి, వారి బృందానికి సెంట్ లూయీస్ తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజ్యలక్ష్మి నాయుడుగారికి, వారి సభ్యులకు - ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున కృతజ్ఞతాభి వందనాలతో! జై హింద్!”
సమావేశాలలో యువతకు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించారు. ఫాషన్ షో జరగటం ప్రత్యేక అంశం అయింది.
సమావేశంలో ప్రత్యేకంగా స్త్రీల విభాగం అనేక అంశాలను చర్చించింది. ఇందులో పరుచూరి జ్యోత్స్న నాష్.పెల్ నుండి వచ్చి ప్రసంగించారు. మీనల్ మంథని, ఉమా ఎచ్చంపాటి, నాయని కృష్ణకుమారి, వింజమూరి సీతాదేవి, శకుంతలా గంగాధరం, నిడదవోలు మాలతి వివిధ ప్రత్యేక అంశాలపై ఆసక్తికరమైన అంశాలను అందజేశారు. సినిమాలలో భారత స్త్రీల కృషి, సంస్కృతి గురించి జ్యోత్స్న పరుచూరి మాట్లాడగా పిల్లల పెంపకంలో తల్లి దృక్పథాన్ని యశోదారెడ్డి చక్కగా వివరించారు.
యువత సమస్యలో కృష్ణ మంతెన, శైలేంద్ర సుంకర, శిరీష సముద్రాల, షెర్లీ వామరాజు, డాక్టర్ వేదవ్యాస్, కృష్ణ ఉష పాల్గొని వివిధ అంశాలు వెలికి తెచ్చారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధుల బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా భారతదేశం నుండి వచ్చిన కళాకారుల బృందం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రదర్శనలు ఏర్పరచారు. ఇందులో శ్రీమతి మధుసూదనరావు, గీత శ్రీ, శోభారాజు, వంశీ బృందం ఉన్నారు.
ఛైర్మన్ కొత్తపల్లి రాయుడు తానా సభ్యులందరి సమక్షంలో ఆఫీస్ బేరర్స్ కు ఎన్నికలు నిర్వహించారు. 1987లో బి.వి.రావు తానా సభ్యులందరిచేత అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.
6వ ‘తానా’ మహాసభలో ఆకునూరి వి.రామయ్య (నూక్లియర్ ఫిజిక్స్), డా.జనార్దన్ కె.రెడ్డి (మెడిసిన్), మటెంపల్లి మధుసూదన్ రావు (మెడిసిన్), డా.కాకరాల సుబ్బారావు (కమ్యూనిటీ సర్వీస్), నర్సింగ్ అడుపారావు (మెడిసిన్), పెమ్మరాజు వేణుగోపాలరావు (కమ్యూనిటీ సర్వీస్), నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ (కమ్యూనిటీ సర్వీస్), పోతు నరసింహారావు (కమ్యూనిటీ సర్వీస్, సంఘసేవ), సీతా గీతా కలపాటపు (శాస్త్రీయ సంగీతం), సింగిరేసు సాంబశివరావు (మెకానికల్ ఇంజనీరింగ్), డా.తేజస్విని (శాస్త్రీయ నృత్యం), తేళ్ల తిరుపతయ్య (కమ్యూనిటీ సర్వీస్), వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్యం, సంస్కృతి), తుమ్మల వి. మాధవరావు (శాస్త్ర పరిశోధన)లకు అవార్డులను ప్రదానం చేశారు.
తెలుగు పలుకు
ప్రముఖ చిత్రకారుడు, సినీదర్శకుడు బాపు చిత్రంతో వెలువడిన తెలుగు పలుకు ప్రత్యేక సంచికకు ఛైర్ పర్సన్ గా గండికోట వెంకటరావు, సహ ఛైర్ పర్సన్ గా బుద్ధిరాజు విజయలక్ష్మి, యువజన విభాగం పర్యవేక్షకురాలిగా అనితా జి.రావు, సభ్యులుగా దండమూడి ప్రసాద్, కాశీనాథుని ఉదయశంకర్, రెడ్నం కృష్ణారావు, వెంట్రప్రగడ మోహన్ వ్యవహరించారు. సి. నారాయణరెడ్డి, వింజమూరి అనసూయాదేవి, విశ్వనాథ అచ్యుత దేవరాయలు, పావని శాస్త్రి, పురాణం సీత, ప్రయాగ రామకృష్ణ, ఆరుద్ర రచనలు ఉన్నాయి.
7వ తానా మహాసభ
7వ తానా  మహాసభ 1989 జూలై 1, 2 తేదీల్లో టెక్సాస్ లోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది.  ప్రధానాంశం “ఐకమత్యమే మహాబలం”.   కన్వీనర్:  వింతా జనార్ధన్ రెడ్డి . బి. వెంకటేశ్వరరావు అధ్యక్షులు. ఈ సమావేశపు ప్రత్యేకత ఏమంటే: సుప్రసిద్ధ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి (హైదరాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్) ప్రత్యేక అతిథిగా శాస్త్రీయ ధోరణిలో భాషా ప్రయోజనాలు, ప్రయోగాలు గురించి విశిష్టమైన ఉపన్యాసం చేశారు. సమావేశంలో పి. సుశీల, రామకృష్ణ సంగీతం ప్రేక్షకులను తనివితీరా ఆనందింపజేసింది.
అధ్యక్షులు బి. వెంకటేశ్వరరావు తానా రిఫరెన్స్ మాన్యువల్,  తానా మెంబర్.షిప్ డైరెక్టరీని ఆవిష్కరించారు.
ప్రప్రథమంగా తానాకు రూపొందించిన లోగోను ఆధికారికంగా సమావేశంలో ఆమోదించారు. జరిగిన అనేక ప్రదర్శనలను ప్రేక్షకుల ఓటు పెట్టి ప్రథమ, ద్వితీయ బహుమతులు నిర్ణయించారు. ఉత్తమ ప్రదర్శనగా పెమ్మరాజు వేణుగోపాలరావు దర్శకత్వాన అట్లాంటా నుండి వచ్చిన బృందం ప్రదర్శించిన కూచిపూడి దృశ్యనాటికకు అర్హత లభించింది. వంగూరి చిట్టెన్ రాజు రాసి నిర్వహించిన అమెరికన్యాశుల్కం ప్రదర్శనకు, రెండవ బహుమతిని ప్రేక్షకులు అందించారు. దీనికి కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. మేడసాని మోహన్ అష్టావధానం తానాలో తొలిసారి  జరిగింది. దీనికి వంగూరి చిట్టెన్ రాజు మార్గం చూపారు. మధురవాణి శీర్షికతో సావనీర్.ను విడుదల చేశారు
నిర్వాహక కమిటీలలో మల్లిక్ ఎస్.పుచ్చా, యారాత రామమోహన్ రెడ్డి, ఎ.వి.ఎన్. రెడ్డి, రాజశేఖర్ ఎలమంచిలి, పాలని జానకీరామ్, రత్నకుమార్, సీతా ముత్యాల, వేణుగోపాల ఆర్, కలపటపు, బళ్ళారీ శ్యామ సుందరం, నాగరాజు ఏలేశ్వరపు, సూర్యారావు తోట, ఎం. జితేందర్ రెడ్డి, ఎ. జనార్దన్ రెడ్డి, వి. కేశవరావు  బాధ్యతలు పంచుకున్నారు. హ్యూస్టన్ లో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘం కార్యవర్గ కమిటీ సభ్యలు జ్యోతిరెడ్డి, వేములపల్లి కేశవరావు, చలసాని మల్లికార్జునరావు, సుభాషిణి గోగినేని, నందగిరి శౌరి, కాకరాల ప్రభాకర్ చౌదరి, డా. రావి రవీందర్ రెడ్డి సమ్మేళన నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ముగింపు రోజున గంధర్వగాయని సుశీల వారి పాటలతో ఆహుతులను అలరించారు.
తానా సభ్యుల డైరెక్టరీని ప్రచురించారు. 7వ మహార్వం కన్వీనర్ డా. వింతా జనార్ధన్ రెడ్డి వారి కార్యవర్గ సభ్యుల సహకారంతో 1988లో ఫండ్.ను ఏర్పాటు చేసి  ఈ రోజు వరకు టెక్సాస్ రాష్ట్రం నుండి  ముగ్గురు ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కాలర్.షిప్.ను అందజేస్తున్నారు. ఇందులో మిగిలిన మొత్తాన్ని తానా కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు.
అధ్యక్షులు నల్లమోతు సత్యనారాయణ, కన్వీనర్ సామాల రామయ్య జూలై 1990లో ఎడ్వర్డ్.విల్ ఇల్లినాయస్.లో మూడవ యువజన సమావేశాన్ని, కుటుంబ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతాప్ రెడ్డి కన్వీనర్ గా, వలుస్వామి రెడ్డి కో-కన్వీనర్ గా, మాధవి కోట యువజన సహకార్యదర్శిగా ప్రథమ తానా ప్రాంతీయ సమావేశాన్ని న్యూ ఆర్లియన్స్ లో నవంబర్ 1990లో ఏర్పాటు చేశారు.  ఈ సమావేశంలో అనేక ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
యువజన సమావేశం మన సంస్కృతిలో, అమెరికా సమాజంలో యువత మంచి గుర్తింపును పొంది వుండాలని ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాకుండా కాలేజీ విద్యార్థులకు, ఉన్నత పాఠశాల మరియు 1 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
అంతేకాకుండా ఈ సమావేశంలో 1. అమెరికాలో యువజనుల గుర్తింపు, 2. రాజకీయ విషయాలు 3. సంప్రదాయం, దాని అవసరాలు. 4. ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయాలు – తల్లితండ్రులు, యువత, 5. భారతదేశం, వారి సంప్రదాయ పద్ధతులపై ప్రశ్నలు – సమాధానాలు. 6. భారతదేశ పండుగలు, భారతీయ సంగీతం, సంగీత వాయిద్యాలు 7. భారతీయ నృత్యరీతులు, వేషధారణలు మొదలైన విషయాలపై చర్చించారు.                                                                                                                                                                                                                                                                                     
7వ తానా మహాపర్వంలో అంబటి జయకృష్ణ, అంబటి బాలమురళీకృష్ణ (కమ్యూనిటీ సేవ) దత్తాత్రేయ నోరి (కాన్సర్ పరిశోధన), రాజు కె. కుచెర్లపల్లి (మాలిక్యులస్ జెనిటిక్స్), డా.పి.శ్యామసుందరరావు (పిడియాట్రిక్ కార్డియాలజీ), శకుంతల పట్టిసము (హిందూ సాహిత్యం, సంస్కృతి), బండారు సుభాషిణీ రెడ్డి (కమ్యూనిటీ సేవ), అవంతి మేడూరి (శాస్త్రీయ సంగీతం), ఉమాభారతి (శాస్త్రీయ నృత్యం), వింజమూరి సీతాదేవి, అవసరాల అనసూయాదేవి (లలిత, జానపద సంగీతం) తానా అవార్డులు అందుకున్నారు.
గుత్తికొండ అరుణ పేరిట స్కాలర్ షిప్పు కూడా ఆ సభలో ఇచ్చారు.  ఈ సభానంతరం నల్లమోతు సత్యనారాయణ అధ్యక్షపదవిని స్వీకరించారు.
తెలుగు పలుకు
మధురవాణి
మధురవాణి పేరుతో వెలువరించిన తెలుగు పలుకు ప్రత్యేక సంచికకు అధ్యక్షులుగా వంగూరి చిట్టెన్ రాజు, గౌరవ సంపాదకులుగా కాలనాథ భట్ట వీరభద్ర శాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వ్యవహరించారు. తెలుగు భాష చరిత్ర, సంగీతం, నాట్యకళ, శిల్పకళ, నాటికలు, సినిమా, రాష్ట్ర రాజకీయాలు, మతం, విద్య  రంగాలపై ప్రత్యేక వ్యాసాలు, గేయాలు, కథలు ఈ సంచికలో ఉన్నాయి. చలసాని ప్రసాదరావు, శ్రీశ్రీ, రావికొండలరావు, ఇంద్రగంటి జానకీబాల, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, పురాణపండ రంగనాథ్, తుర్లపాటి కుటుంబరావు, మాలతీ చందూర్, డా.జి. సమరం, వీరాజీ, గుంటూరు శేషేంద్ర శర్మ, ఉషశ్రీ  రచనలు ఈ సంచికలో ఉన్నాయి. దేవరకొండ బాలగంగాధర తిలక్, శ్రీశ్రీ, సోమసుందర్, సినారె, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రచించిన కవితల ఆంగ్ల అనువాదాలు సంచికలో చోటు చేసుకున్నాయి. ఈ ప్రత్యేక సంచికకు హ్యూస్టన్ మేయర్ విట్.మైర్, అమెరికాలో భారత రాయబారి పి.ఎన్.కౌల్, యుఎస్ సెనేటర్లు ఫిల్ గ్రామ్, లాయిడ్ బెంట్.సెన్ సందేశాలు పంపారు.
8వ తానా మహాసభ
మన సంస్కృతి - మన ప్రగతి
8వ ‘తానా’ మహాసభ అట్లాంటాలో (జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్) 1991 జూలై 5, 6 తేదీల్లో జరిగింది.  సమ్మేళనానికి కన్వీనర్.గా మంగరాజు వనపల్లి, రణకుమార్ నాదెళ్ళ సహాయ కన్వీనర్.గా, నల్లమోతు సత్యనారాయణ ఉన్నారు.  మహాపర్వం  ప్రధానాంశం ‘మన సంస్కృతి-మన ప్రగతి’.
మహాసభ  నిర్వాహక కమిటీలో పి.శేషుశర్మ, అరుణ ప్రసాద్ కంచర్ల, టి.రామచంద్రారెడ్డి, రణకుమార్ నాదెళ్ళ నరేందర్ జి. రెడ్డి, షీలా ఆర్. లింగం,  పి. రవిశర్మ, రామారావు మేక, రాజా రావులపల్లి, బి.కృష్ణమోహన్, సి. బాపురెడ్డి, సర్వేశ్వర్ ఐ. నాయుడు, జయప్రకాశ్ బంగారు, పూర్ణ గింజూపల్లి, సుధాకర్ దేవరాజు, గోపీచంద్ మన్నె, మురహరిరావు పురుగుల్ల, సుజాతా కె. రెడ్డి, కుసుమ ద్రోణవల్లి  బాధ్యతలు నిర్వహించారు. ఈ కమిటీకి సలహాదారుగా పి. వేణుగోపాలరావు వ్యవహరించారు. సమ్మేళనాన్నినిర్వహించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా కార్యవర్గ కమిటీలో రవీందర్ సి. రెడ్డి, పి. ఎన్. లక్ష్మీరావు, నరేంద్ర్ జి.రెడ్డి, సంజీవరావు, సుజాతా గింజుపల్లి  ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా తానా అధ్యక్షుడు సత్యనారాయణ నల్లమోతు, కోశాధికారి సుధాకర్ పావులూరి, ఉపాధ్యక్షుడు రామకిషన్ రావు దామన వ్యవహరించారు.
అధ్యక్షులు నల్లమోతు సత్యనారాయణ ఉత్తర అమెరికా అంతటా పర్యటించి ఆ ప్రాంతాలలో ఉన్న దాదాపు 40 తెలుగు సంఘాలవారిని తానా సభ్యులుగా చేరడానికి ప్రోత్సహించారు.  తానా పత్రికను ముద్రించి ప్రతినెలా వారికి మెయిల్ ద్వార అందేలా ఏర్పాట్లు చేశారు.  30 ప్రాంతాలనుంచి అనేక మంది సాంస్కృతి సంఘాలవారు వచ్చి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు మురళీమోహన్ నిర్వాహకుడుగా వున్నారు.
మహాసభలో భారతదేశం నుంచి 20మంది పాల్గొన్నారు. `ఈనాడు` పత్రికాధిపతి రామోజీరావు, అమెరికాలో భారత రాయబారి అబిద్ హుస్సేన్ సమావేశంలో ప్రసంగించారు. మొదటిసారి మురళీమోహన్ నేతృత్వంలో గుమ్మడి, జానకి, సాక్షి రంగారావు, శరత్ బాబు  కళాకారులు  ప్రదర్శనలు ఇచ్చారు.  సమావేశం సందర్భంగా ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రెండో ప్రచురణ ఆవిష్కరించారు.
ఈ మహాపర్వంలో పరీక్షిత్ శర్మ వోగేటి (అక్షరాస్యత), లక్ష్మీ సరోజా పోరూరి (టెన్నిస్), రంగా ఎన్.బి.గొర్రెపాటి (యాజమాన్యం), చంద్రశేఖర్ రావు కాకరాల (తానా మాజీ అధ్యక్షుడు (1983-85), డా.రాఘవేంద్ర ప్రసాద్ (తానా మాజీ అధ్యక్షుడు 1987-89), బి.వెంకటేశ్వరరావు (తానా మాజీ అధ్యక్షుడు 1987-89), రవీంద్రనాథ్ గుత్తికొండ (కమ్యూనిటీ సర్వీస్), జగన్ మోహన్ రావు కాకరాల (కమ్యూనిటీ సర్వీస్), రాజ్ రెడ్డి, ఆర్.కె.ఎం. జయంతి, వెంకట్ ఎస్.రాం (వృత్తిలో ప్రావీణ్యత), విజయలక్ష్మి ఉన్నవ రామకృష్ణన్ (బోధనలో ప్రావీణ్యత) అవార్డులు అందుకున్నారు.
అమెరికాలో భారత రాయబారి డా. అబిద్ హుస్సేన్, ఐఎఎస్, ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం చేశారు.  రెండవరోజు రామోజీరావు కీలకోపన్యాసం చేశారు.
ప్రధానవక్తగా రామోజీరావు చేసిన ప్రసంగం -
“భరత భూమిలో జన్మించి వలస వచ్చి, ప్రాక్ పశ్చిమ సంస్కృతుల మేలు కలయికగా భాసిస్తున్న తెలుగు బంధువులందరికీ నా హృదయపూర్వక అభినందనాలు. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచీ మీరు చూపిస్తున్న ఆదరణ – ఆప్యాయత నన్ను ముగ్ధుడ్ని చేస్తున్నాయి. వీటిని అందుకోవడానికి నాకుగల అర్హత మీ పుట్టింటి అనుబంధమేనని నాకు తెలుసు.
ప్రవాసమంటే పరకాయ ప్రవేశం లాంటిది. ప్రాణమొకరిది – దేహమొకరిది. వివిధ కారణాలవల్ల ఇక్కడ స్థిరపడి, స్వదేశాభిమానంతో సంఘంగా ఏర్పడి, మాతృభూమి మధురస్మృతులను నెమరు వేసుకుంటున్న మిమ్మల్ని చూస్తే ఎంతో ముచ్చట వేస్తోంది. ఎక్కడి భారతదేశం! ఎక్కడి అమెరికా రాజ్యం!
ఒకటి తూరుపు ఎరుపైతే మరొకటి పశ్చిమాద్రి నీలం, ఒకటి పగటి వెలుగైతే మరొకటి రేయి వెన్నెల, రెండు భిన్న సంస్కృతుల్లోని సంక్షిప్తతల్ని సమన్వయపరచుకుంటూ జీవనగతిని సాగించడం కత్తిమీద సాములాంటిది. ఈ ప్రవాస పరీక్షలో మొక్కవోని సాహసంతో ఘనవిజయం సాధించి, మీరంతా సమున్నత శిఖరాలను అధిరోహించడం అమితానందం కలిగిస్తోంది. అందుకే మీతో కలిసి మాట్లాడి, మనసూ – మనసు విప్పి చెప్పుకునే సదవకాశాన్ని ‘తానా’ పెద్దలు కల్పించినప్పుడు సంతోషంగా సమ్మతించాను.
ఒక సోదరుడిగా నాకు మీమీద ఆత్మీయత – అధికారం రెండూ ఉన్నాయని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను.
నాది – మీది – మనందరిదీ - ‘భారతదేశం’  మాట చెబుతుంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి ఏ దేశమైతే ఈ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిందో, ఏ దేశమైతే ప్రాచీన నాగరికతకి పట్టుగొమ్మగా, అనుపమాన సంస్కృతికి జన్మస్థలిగా ఉందో – ఆ దేశం... ఆ భారత దేశం మనందరి కన్నతల్లి కావడం మన అదృష్టం. మూడు దిశలలోనూ ఎగసిపడే సాగర కెరటాల సమక్షాన, ఉత్తరాన వెలసిన ఉత్తుంగ హిమశిఖరాల సాక్షిగా ఐదు సహస్రాబ్దాల నుంచీ అఖండంగా అలరారుతున్న సజీవ సంస్కృతికి మనమంతా వారసులం. భారతీయ నదీనదాలలో, జనపదాలలో వెల్లివిరిసిన విజ్ఞాన పుంజాలు విశ్వానికే ఒక కొత్త వెలుగును సృష్టించాయి. భారతీయ శిల్ప సంపద, నాట్య – సంగీత రీతులు, చిత్రకళ, సాహితీ సౌరభాలు – అజరామరాలు. వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రాలు మన సొంతం. సత్యాన్ని వ్రతదీక్షగా – ధర్మాన్ని జీవన విధానంగా స్వీకరించిన జాతి మనది. ఆ జాతీయతా స్ఫూర్తిని కలలో సైతం మీ శ్వాస నుంచి దూరం చేయవద్దని మీ అందరినీ అభ్యర్ధిస్తున్నాను.
తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఆలించి, పాలించి పెద్ద చేస్తుంది. రెక్కలొచ్చిన బిడ్డ ఉపాధిని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్తాడు. అయినా, స్తన్యమిచ్చిన మాతృమూర్తి ఒడిలో తలదాచుకోవడంలోని అనుభూతిని మాటల్లో చెప్పగలమా? అలాగే – మాతృభూమి కూడా. స్వీయ సంస్కృతికి తిలోదకాలివ్వడమంటే కన్నతల్లి గుండెలపై తన్నడమే. జనని, జన్మభూమి స్వర్గంకన్నా గొప్పవన్నారు విజ్ఞులు. ఈ సత్యం నిరంతరం మన ఎదలోయలలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ మీ సాంస్కృతిక పునాదుల్ని విస్మరించకండి. షేక్ హాండ్ సంస్కృతి నేర్చుకోండి. ... తప్పులేదు. కానీ రెండు చేతులూ జోడించి చేసే నమస్కారంలోని నమ్రతని మరువకండి మీ భాష మారొచ్చు... వేషధారణ మారొచ్చు... ఏది మారినా ఫర్వాలేదు... కానీ మీ ఆత్మలోని అభినివేశాన్ని మార్చుకోకండి... స్వీయ సంస్కృతిలోని విశిష్టతని మరచిపోకండి... అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది.
పరాయిగడ్డపై జయకేతనాలు
అమెరికాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాల్లో కీలకమైన స్థానాలను ఆక్రమించుకోవడం ఆనందకరం. విద్య, వైద్య, శాస్త్ర సాంకేతిక, వ్యాపార, వాణిజ్య రంగాలతోపాటు క్రీడల్లో సైతం భారతీయులు విజయకేతనాలు ఎగురవేస్తున్నారని విని హర్షంతో పొంగిపోయాను. దేశం కాని దేశంవచ్చి, ఆ దేశస్థుల్ని కూడా అధిగమించి, సాఫల్యాన్ని సొంత చేసుకోవడం మాటలు కాదు. జన్మతః భారతీయుడైన శ్రీ చంద్రశేఖర్ అత్యున్నత నోబెల్ పురస్కారాన్ని అందుకుని దేశఖ్యాతిని నలుచెరగులా చాటారు. డాక్టర్ తుమ్మల మైక్రో ఎలక్ట్రానిక్స్.లో అరుదైన అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వారి సత్కారాన్ని అందుకున్నారని ఈ మధ్యే చదివాను. మాథమెటిక్స్ మాంత్రికుడు కిరణ్ కేడ్ పదహారేళ్ళ ప్రాయంలోనే పందొమ్మిదో యు.ఎస్. మాథమెటికల్ ఒలింపియాడ్.లో అగ్రస్థానాన్ని సంపాదించాడు. సైన్స్ టాలెంట్ సెర్చ్.లో భారతీయ బాలురు నాలుగు స్థానాల్ని వశం చేసుకుని సంచలనం సృష్టించారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీయులు, ప్రత్యేకించి భారతీయులు ఎంతటి ఘనవిజయాలు సాధిస్తున్నారో గమనిస్తూనే ఉన్నాం. ఇక వైద్యులుగా, శాస్త్రజ్ఞులుగా వివిధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.లో, పరిశోధనా సంస్థల్లో భారతీయులు ఉన్నత పదవుల నలంకరిస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనక్కరలేదు.
ఏతావాతా  ఈ ఫలితాలన్నీ మన సోదరుల సామర్ధ్యాన్నే సూచిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఒక్క సందేహం మాత్రం నాలో తలెత్తుతోంది. వీటి సామూహిక పరిణామాలు భవిష్యత్తులో ఎలా పయనిస్తాయన్నదే నా భయమంతా. భారతీయుల విజయాలు స్థానికుల్లో అసూయకు ఆజ్యం పోయవచ్చు. తమ హక్కును పరాయివారు హరిస్తున్నారనే భావానికి ప్రాణం పోయవచ్చు. ఇలా జరగాలని నేను వాంఛించడంలేదు. జరగకూడదని మనసారా కోరుకుంటున్నాను కూడా. కానీ అప్రమత్తత అవసరమని మాత్రం హెచ్చరిస్తున్నాను. ఉగాండాలో భారతీయులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు మన జ్ఞాపకాల్లో ఇంకా భయం భయంగా మెదులుతూనే ఉన్నాయి. ఫిజీలో ప్రవాసులు ఏ విధమైన విచక్షణకు గురయ్యారో, ఇప్పటికీ ఎన్ని దురవస్థల పాలవుతున్నారో మనకు తెలుసు. మలేషియా రబ్బరు తోటల్లో, శ్రీలంక టీ ఎస్టేట్లలో, తూర్పు ఆఫ్రికా రైలు – రోడ్డు మార్గ నిర్మాణంలో, ట్రినిడాడ్ – గయానా చెరకు పరిశ్రమల్లో పనిచేసేందుకు వలస వెళ్ళిన భారతీయులు, ఆ దరిమిలా ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో మన స్మృతిపథంలో కదలాడుతూనే ఉంది. అసలు, ఏ దేశస్థుడైనా పరాయి దేశానికి ఎందుకు ప్రవాసం వెళ్తాడు? ఉదర పోషణ కోసం, వ్యక్తిగత వికాసం కోసం, ఉన్నత పదవికోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం... అంతేగా... ఏ రకంగా చూసినా ఇది కేవలం ఆర్థిక ప్రవాసం మాత్రమే.  అందుకే... ఒక శ్రేయోభిలాషిగా మిమ్మల్ని కోరుతున్నాను... మీరు నా వాదనతో ఏకీభవిస్తే... మీ అంతరంగాలు అంగీకరిస్తే... స్వదేశంతో మీ ఆర్ధిక, సాంస్కృతిక బంధాన్ని పటిష్టం చేసుకోండి. పరిశ్రమ స్థాపించినా, వ్యాపారం ఆరంభించినా, సేవా పథకం ప్రవేశపెట్టినా... ఏ విధంగానైనా సరే మీ ఉనికిని స్వదేశంలోనూ స్థిరం చేసుకోండి.
అమెరికాలో పుట్టి, అమెరికాలోనే పెరిగిన యువతరానికి  ఈ సమయంలో నాదో మాట. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మీ మీద ప్రబలంగా పడి ఉంటుంది. మీ పూర్వీకుల జన్మస్థలి గురించి బహుశా మీకు విపులంగా తెలిసి ఉండకపోవచ్చు. సుసంపన్నమైన భారతీయ సభ్యత, సంస్కృతి గురించి వివరంగా తెలుసుకోమని నా మనవి.
ఈ సందర్భంగా మీకో ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పాలని ఉంది. ఇటీవలి కాలంలో బర్మా, మలేషియాలకు చెందిన కొందరు ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చారు. వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో ఇండియా వదలి వెళ్ళిపోయారట. వాళ్ళ రాకలోని ఆంతర్యం తెలిస్తే మనసు చెమ్మగిల్లుతుంది. తమ పూర్వీకులు ఏ ప్రాంతంలో నివసించేవారో, ఏం చేసేవారో, తమ వంశస్థులు మరెవరైనా ఉన్నారేమోనని అన్వేషిస్తూ దూరతీరాల నుంచి తరలివచ్చారు వాళ్ళు. మెటీరియలిస్టిక్ మనుషులకీ, మనసులకీ వారి తపన, తహతహ అర్ధం కాకపోవచ్చు.... ఆశ్చర్యం కూడా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి నిండు గుండెతో ఆలోచిస్తే అర్థం అవుతుంది.... వారి అన్వేషణలో ఉన్న ఆర్ద్రతేమిటో.. ఈ ఉదంతం ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రవాస భారతీయులందరినీ ప్రభావితం చేస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. మన భారతీయ కుటుంబ వ్యవస్థలోని మాధుర్యం అనిర్వచనీయమైంది. అక్కడ సంఘజీవనం యాంత్రికంకాదు... మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలను మించిన ఆత్మీయతా బంధాలే ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే... మన వ్యవస్థలోని తియ్యదనమేమిటో ఒక్కసారి... ఒక్కసారి రుచిచూడండి.
మరో ముఖ్య విషయాన్ని  ఈ వేదిక మీద నేను ప్రస్తావించదలిచాను.  ఈ మధ్యే నాకు తెలిసింది. అమెరికాలోని తెలుగువారు, తెలుగు సంస్థలు కూడా కులజబ్బుతో బాధపడుతున్నాయని. ఇది విని ముందు నేను నిశ్చేష్టుడనయ్యాను. నిజం కాకపోతే బావుండుననుకున్నాను. పరదేశంలో, పరభాషీయులతో, పరజాతీయులతో కలసి నివసిస్తున్నప్పుడు ఏ ఐక్యతా స్ఫూర్తి మనల్ని ఏకం చేయాలో అది మృగ్యమై, కులాల వారీగా విడిపోవడం నన్ను కలచివేస్తోంది.
అణు యుగంలోనూ అదే విషాదమా
కులమనే రెండక్షరాల పదం మన సమాజాన్ని శతాబ్దాల నుంచీ పట్టిపీడిస్తూ, పీల్చి పిప్పిచేస్తూనే ఉంది. అసలేమిటి కులం – ఎందుకు కులం అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆగత్యం – అవసరం ఈ అణుయుగంలోనూ ఏర్పడడమే అసలైన విషాదం, రాజకీయాల్లో కుల ప్రాతిపదికన ఎంపిక, వివాహాల్లో కులం, వినోదాల్లో కులం, విదేశంలో కులం, స్వదేశంలో కులం, చివరికి స్మశానంలోనూ కులమే...
కులతత్వంతో కళ్లు పొరలు కమ్ముకుంటే మనుషులు కనిపించరు... వారి కులాలే కనిపిస్తాయి. ఎప్పుడో... మానవుడు  సంఘజీవనంలో తొలి పాఠాలు నేర్చుకునే ఆరంభ దశలో శ్రమవిభజన కోసం తాత్కాలికంగా చేసుకున్న కుల ఏర్పాటు, కాలక్రమేణా స్వార్ధపరశక్తుల కుయుక్తుల కారణంగా ఎంతటి వికృత రూపాన్నిసంతరించుకుందో తలచుకుంటే కళ్లు చెమరుస్తాయి. చాతుర్వర్ణాల పేర సమాజం గుండెలమీద నిలువునా గాయాలు చేసుకున్నాం. పంచముల్ని సైతం సృష్టించి మన సోదరుల్ని మనమే శత్రువులుగా మలచుకున్నాం. ఇదేనా మన సభ్యత? ఇదేనా మన నాగరికత.... కాదు... కానేకాదు.... ప్రతి మనిషిలోనూ పరబ్రహ్మ స్వరూపం ఇమిడి ఉందనే మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ‘అహం బ్రహ్మాస్మి’ అన్న సత్య సూక్తంలోని పరమార్ధాన్ని ఆకళింపు చేసుకుంటే మన అజ్ఞానం పటాపంచలవుతుంది. కులం పేర ఇప్పటికే మన జాతిని మనం ఎంత బలహీనపర్చుకున్నామో మనకు తెలుసు – చరిత్రకు తెలుసు... మానవులందరిలోనూ ఉద్వేగాలూ, ఉద్రేకాలూ సమానమే. ఒక మనిషిలో ప్రవహించే రక్తాన్ని నిర్ధారించేందుకైనా పరీక్షలున్నాయేమో కానీ కుల నిర్ధారణకు ఏ పరీక్ష ఉంది? ఈ సభలో ఎంతోమంది డాక్టర్లున్నారు. సైంటిస్టులున్నారు...... మిమ్మల్నందరినీ ఒకే ప్రశ్న సూటిగా వేస్తున్నాను. ఒక మనిషిని పరీక్షించి అతని కులమేమిటో చెప్పగలరా? లేదు... అయినా మనం కులం  అంటూ అగాధాలూ, అడ్డుగోడలూ పెంచుకోవడం ఎంత అజ్ఞానమో, అనాగరీకమో ఆలోచించండి. మన సంప్రదాయం మన పురోభివృద్ధికి పునాదులు వేయాలి తప్ప వినాశనానికి విత్తనాలు కాదు. కుల నినాదాలకి తిలోదకాలివ్వకుండా పెద్ద పీట వేసి మరీ నెత్తిన పెట్టుకోవడం అనాచారమే తప్ప ఆచారం కాదు... దుస్వప్నమే తప్ప సత్సంప్రదాయం కాదు... స్వామి వివేకానంద ఒక సందర్భంలో అన్నారు..... “సాంఘిక జీవనంలో నేనొక బాధ్యత నెరవేర్చగలిగితే, నువ్వొక బాధ్యత నెరవేర్చగలవు. నేను పాత చెప్పుల జతని చక్కగా బాగుచేయగలను. నువ్వు దేశాన్ని చక్కగా పరిపాలించగలవు. నేను నా రంగంలో గొప్పవాణ్ణి. నువ్వు నీ రంగంలో గొప్పవాడివి అంతే” ఆ మహాపురుషుని మాటల్లో ఎంతటి నిగూఢ సత్యం నిబిడీకృతమై ఉందో మనమంతా గమనించాలి. మనం సంఘాన్ని యావత్తూ ఏక క్షణంలో ప్రక్షాళించలేకపోవచ్చు. ఏక కాలంలో సమాజ స్వరూపాన్ని మార్చలేకపోవచ్చు. కానీ కులతత్వపు ఆఖరి ఇటుకలు పగిలే వరకూ మన పోరాటం సాగల్సిందే. మనిషికీ – మానవత్వానికీ నడుమ గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే కుల రక్కసి రూపుమాసిపోవలసిందే.
కనుక స్నేహితులారా! నేను మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. మాతృభూమికి వేలాది మైళ్లు దూరంగా నివసిస్తున్న మీరు మీతోపాటు మీ కులానికీ ప్రవాసం కల్పించకండి. మీ మనోమందిరాలలో కులరహితమైన ధార్మిక జ్యోతి ప్రకాశించాలి తప్ప సంకుచిత భావదీప్తి కాదు... సాటి మనుషుల్ని సమాదరంతో, సహోదరభావంతో చూడాలితప్ప కుల చత్వారపు నేత్రాలతో కాదు.
జాతి సౌభాగ్యానికి సహకరించండి
నేను మీ కోసం స్వదేశం నుంచి తీసుకువచ్చింది తోటి తెలుగు ప్రజల శుభకామనలు, శుభాభినందనలు మాత్రమే. కానీ మిమ్మల్ని మాత్రం చాలా కోరికలే అడుగుతున్నాను. చివరగా మరో కోరిక.... మీరు జీవిస్తున్న ఈ సమాజంతో,  ఈ సమాజంలోని మనుషులతో విభేదించకండి. అదే సమయంలో మీకు జన్మనిచ్చిన భూమి మీకోసం ఎన్ని త్యాగాలు చేసిందో మరువకండి. ఆ నేలన పండిన ధాన్యం మీ ఆకలి తీర్చింది.... ఆ ధరణిలో పారే నీరు మీ దాహం తీర్చింది. అక్కడి గాలి, చెట్లూ – చేమలూ, యావత్ప్రకృతీ మీ కోసం అణువణువూ తపించాయి. మాతృదేశం మీ విద్యార్జన కోసం అణువణువూ తపించింది. మాతృదేశం మీ విద్యార్జన కోసం, మీ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో, ఎంతెంతో ఖర్చు చేసింది. ఆ రుణం తీర్చుకోమని నేను చెప్పడంలేదు. తల్లీ బిడ్డల మధ్య ఉండేది బంధాలే తప్ప బరువులు కాదు. స్వదేశ కళ్యాణం కోసం కృషి చేయడం కుటుంబ సభ్యులుగా మీ కర్తవ్యం. ఈ సభల సందర్భంగా ఆ బాధ్యతను మరొక్కమారు మీ స్ఫురణకు తెస్తున్నాను, రండి! మన జాతి జీవనం హరిత వర్ణంతో శోభించేందుకు సహకరించండి. ఆసుపత్రులు, విద్యాలయాలు, పరిశ్రమలు స్థాపించడమే కాదు భారతీయులకి, ముఖ్యంగా తెలుగు యువతరానికి మార్గదర్శకంగా నిలిచే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టండి. మీరిక్కడ నేర్చుకున్న విజ్ఞానంలో కొంత భాగాన్ని తెలుగు విద్యార్థులకు అందించండి. మీ సాంకేతిక ప్రగతి ఫలాలను తెలుగువారికి పంచండి. స్నేహశీలురు, సహృదయులూ అయిన మీరంతా ఇందుకు సక్రియాత్మకంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.... విశ్వసిస్తున్నాను.
మిత్రులారా.... చల్లని  ఈ అమెరికా, నునువెచ్చని మీ ఆతిథ్యం... నన్ను అణువణువునా కదిలించి వేస్తున్నాయ్. మీతో మనసు పంచుకున్న ఈ మధురమైన అనుభవాలు, అనుభూతులు ఎప్పటికీ నా గుండెల్లో నవ్యాతినవ్యంగా మెదులుతూనే ఉంటాయి. మీరు జీవితంలో మరింత ఉన్నత స్థితికి ఎదగాలని, మరెన్నో అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకోవాలనీ మనసారా అభిలషిస్తున్నాను, అక్కున చేర్చుకున్న అమెరికాతోపాటు మాతృభూమి కూడా గర్వపడేలా మీ కీర్తి చంద్రికలు ప్రకాశించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకోవడానికీ, భారతీయతను కాపాడుకోవడానికీ నా వల్లకానీ, నా సంస్థలవల్లకానీ ఎప్పుడు ఏ సహకారం అవసరమైనా అందించేందుకు సర్వదా, సంతోషంగా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.”
తెలుగు పలుకు
మన సంస్కృతి- మన ప్రగతి పేరుతో 8వ తానా తెలుగు పలుకు సంచికకు సంపాదకుడుగా పూడిపెద్ది రవీంద్రనాథశర్మ, అసోసియేట్ ఎడిటర్లు: పెమ్మరాజు వేణుగోపాలరావు, పూడిపెద్ది శేషుశర్మ. వంగూరి చిట్టెన్ రాజు, గవరసాన సత్యనారాయణ, వెల్చేరు నారాయణరావు, కాశీపట్నం రామారావు సలహాదారులు. దామెర్ల రామారావు ముఖచిత్రం.
ఈ సంచిక తెలుగు విభాగంలో మరువాడ రాజేశ్వరరావు, రాధిక నోరి, మాలెంపాటి ఇందిరా ప్రియదర్శిని, వసుంధర (సిడ్నీ, ఆస్ట్రేలియా) కె. సరోజ- కెనడా, తంగిరాల లక్ష్మీనారాయణ, మాచిరాజు సావిత్రి, ఎ. సుబ్బారావు, ఎస్. వర్ధని మూర్తి, వంగూరి చిట్టెన్ రాజు, రాగిపూడి యోగిశ్వరస్వామి, నెల్లుట్ల రంగారావు, మేకా రామారావ్, పి.వి.జి., ఇందిర, ఉషరాజు, కొండపల్లి కోటీశ్వరమ్మ (విజయవాడ), బి.ఎన్. రెడ్డి, చిత్రకారుడు- పవన్ (హైదరాబాదు), జె. బాపు రెడ్డి (హైదరాబాదు), నరసింహ మల్లాది సిద్ధాంతి, సుంకర మణి రామచంద్రరావు (రాజమండ్రి), కోట సుందర రామశర్మ, శొంఠి శారదాపూర్ణ, కొలుగొట్ల సూర్యప్రకాశరావు, విన్నకోట రవి శంకర్ (హైదరాబాదు), ఏల్చూరి విజయ రాఘవరావు, ఎన్.ఎస్.ఎస్. మూర్తి, కె.వి.యస్.స్వామి (రాజమండ్రి), మేకా రామారావు, తూములూరి శాస్త్రి (సిడ్ని, ఆస్ట్రేలియా), జయప్రభ (హైదరాబాదు), సుశీలా సుబ్బరావు (కెనడా), వేమూరి వెంకటేశ్వరరావు, చాపరాల బాబూరావు (ఇంగ్లాండ్), సులోచన బండారు, సత్య దువ్వూరి, రాధికా శాస్త్రి, పిల్లలమర్రి రామకృష్ణ, విశ్వనాథ అచ్యుత దేవరాయలు పేమ్మరాజు వేణుగోపాలరావు, కోట సుందరరామశర్మ, విన్నకోట ఫణీంద్రల రచనలున్నాయి
9వ తానా మహాసభ
మహాసభలకు స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడుగా సత్యనారాయణరావు నల్లమోతు - ఛైర్మన్.గా, సమన్వయ కర్తగా గడ్డం దశరథరామిరెడ్డి, సహ సమన్వయకర్తలుగా రాధాకృష్ణమూర్తి, కిడాంబి రఘునాథ్, కార్యదర్శిగా నెహ్రూ చెరుకుపల్లి, సంయుక్త కార్యదర్శిగా మహేష్ సాలాది, కోశాధికారిగా మేకా వెంకటనారాయణ, సంయుక్త కోశాధికారిగా సాంబశివరావు వెనిగళ్ళ. సభ్యులుగా మోహనరావు బథి, మూర్తి ఆర్. భావరాజు, రామకృష్ణ జొన్నాడ, కృష్ణ కొచెర్లకోట, ఆర్.కె.నర్రా, నాగమ్మ దుడ్డెంపూడి, కుసుమాకర్, ఆంకుచకుల్ల, కృష్ణ పోలవరపు, జానకీరావు, రోయపేట శేఖర్ వ్యవహరించారు.
ఐదు రోజులపాటు అత్యధిక సంఖ్యలో అతి వైభోగంగా న్యూయార్క్.లో జరిగిన ఈ మహాసభలు తానా చరిత్ర మలుపులో నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు భాషా ప్రాధాన్యతను ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఎలుగెత్తి చాటిన నటుడు, నాయకుడు, ఎన్.టి.రామారావు ఆ సభలలో కీలకోపన్యాసం చేశారు. కొలీషియమ్.లో ఉన్న అందమైన చిన్న బోటు ఆకారంలోని వాహనాలలో ఆతిథులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వేదికపైకి తీసుకురావటం ఈ సభల ప్రత్యేకత. ఎన్.టి. రామారావు తన సహజ ధోరణిలో ఉద్వేగంగా ఉపన్యసించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సభలకు పెద్ద సంఖ్యలో రాజకీయ వాదులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ మెంబర్లు, కళాకారులు, కవులు, రచయితలు, పాల్గొని రక్తికట్టించారు. ఇందులో కొందరు - ఎం. వెంకయ్య నాయుడు, వావిలాల గోపాలకృష్ణయ్య, హనుమంతరావు, వి.ఎల్.ఎన్. దత్తు, జమున, సుశీల, శోభారాజు, ఛాయాదేవి, ఘంటశాల విజయకుమార్ బృందం, హరికథకులు, విజయనగరం నుండి సంపత్కుమార్ ఆధ్వర్యంలో బాలికల నృత్య బృందం, హైదరాబాదు నుండి లంబాడీ నృత్య ప్రదర్శకులు, అష్టావధాన విద్వాంసులు ఉన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు సమన్వయీకరించటంలో దుక్కిపాటి రామస్వామి ప్రత్యేక శ్రద్ధ వహించారు.
చెరుకుపల్లి నెహ్రూ కార్యక్రమాల సమన్వయకర్తగా అన్నివిషయాలూ అజమాయిషీ చేశారు. పి.ఎస్. రావు కార్యక్రమాలన్నిటికీ తన చేయూత నిచ్చారు. డాక్టర్ చలసాని ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వాణిజ్య చర్చల సమావేశం విషయాలను లోతుగా చర్చించింది. అతిథి సౌకర్యాలు పర్యవేక్షించి జానకిరావు అందరి మెప్పు పొందారు. డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఆర్థికపరమైన విషయాలను జాగ్రత్తగా అమలుపరిచారు. స్త్రీల సమావేశం ప్రత్యేకంగానూ, డాక్టర్ల సమావేశం విడిగానూ జరిగింది. యువతకు బాగా సమయం కేటాయించి వారికి ఇష్టమైన కార్యక్రమాలు ఏర్పరచటంలో రామ్ వారిబృందం జాగ్రత్తవహించారు. వాణిజ్యసమావేశంలో ఇండియా నుండి అమెరికా నుండి బ్యాంక్ ప్రతినిధులు పాల్గొనగా వి.ఎల్.దత్తు వాటి నిర్వహణ సమర్ధవంతంగా చేశారు.
ప్రతిభను గుర్తిస్తూ సమావేశం చివరలో అవార్డులు ఇవ్వగా అందులో మెగాస్టార్.గా పేరొందిన చిరంజీవికి ప్రత్యేక అవార్డును నందమూరి తారకరామారావుతో బహూకరింపచేశారు.
తొమ్మిదవ ‘తానా’ మహాసభ 1993 జులై 1-5 వరకు అయిదు రోజుల పాటు న్యూయార్క్.లో (లాంగ్ ఐలండ్ లో నాసా కాలిసయమ్)  జరిగింది. న్యూయార్క్  తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం, ప్రపంచ తెలుగు ఫెడరేషన్, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ కలిసి సంయుక్తంగా ఈ మహాసభల్ని నిర్వహించారు. ప్రముఖ చిత్రకారుడు, రచయిత సూర్యదేవర సంజీవదేవ్ కళాఖండాలని ప్రదర్శించారు. ఈ మహాసభల్ని ‘ప్రపంచ తెలుగు సదస్సు’ పేరుతో నిర్వహించారు. ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ఉపరాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్, నేపాల్ రాజు  సమావేశాలకు సందేశాలను పంపారు.  ప్రముఖ చలన చిత్ర నటులు చిరంజీవి గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు సదస్సులో వివిధ విభాగాల బాధ్యతలు నిర్వర్తించినవారిలో దత్తాత్రేయ నోరి, కృష్ణ వేమూరి, రాఘవరావు పోలవరపు, ప్రసాద్ చలసాని, స్వామి దుక్కిపాటి, రామకృష్ణ చలికొండ, నిర్మలా శాస్త్రి, విజయ దుక్కిపాటి, పద్మావతి ఎర్రమిల్లి, డా.పి.ఎస్.రావు, సుభద్రా నోరి, శివనారాయణ పాటూరి, మణి పాటూరి, రామారావు ఉన్నారు.
ఈ మహాసభలో తానా ప్రచురించిన, తానా తెలుగు కథ (సంపాదకుడు – ఏ.ఎస్.మూర్తి), మంచుతునకలు (సంపాదకుడు – పెమ్మరాజు వేణుగోపాలరావు) కవితాసంకలనాలు చాలా ప్రశంసలు పొందాయి. అప్పుడే తానా ప్రత్యేకంగా ప్రచురించిన కాళీపట్నం రామారావు `యజ్ఞం` తొమ్మిది కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు రావడం తానాకు గర్వకారణం.
తెలుగు పలుకు                
సమ్మేళనం సందర్భంగా ‘నవయుగ తెలుగు వెలుగు’ పేరుతో ప్రత్యేక సంచికను వెలువరించింది. తెలుగు అమెరికన్ల  రచనలున్న సంచికకు నెహ్రూ చెరుకుపల్లి, పరిణం శ్రీనివాసరావు, కలశపూడి శ్రీనివాసరావు, శ్రీమతి డా. జెమ్మీ సుధా రత్నాంజలి నిట్టల సంపాదకులు.
నవయుగ తెలుగు పలుకు
జూలై 1 నుండి 5 వరకు 1993  న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో
9వ తానా మహాసభ, ప్రపంచ తెలుగు సమ్మేళనం సంయుక్తంగా జరిగింది
చెరుకుపల్లి నెహ్రూ అధ్యక్షతన సావనీర్ సంచికలో పి.ఎస్. రావు, శ్రీనివాసరావు, జె. సుధారత్నాంజలి, సభ్యులుగా కృషి చేశారు. దీనిని ప్రవాసాంధ్రులకు అంకితమిచ్చారు. తోలుబొమ్మలాటలు ప్రతిబింబించే ముఖచిత్రంతో, ఈ సంచిక అనేక విశేషాలను వెలువరించింది. నేపాల్ రాజు, ప్రధాని పి.వి. నరసింహారావు, ఉపాధ్యక్షులు కె.ఆర్.నారాయణ సందేశాలను అందజేశారు. అప్పట్లో తానా అధ్యక్షులుగా నల్లమోతు సత్యనారాయణ ఉన్నారు. ప్రవాసాంధ్రుల ప్రపంచం అనే విభాగంలో ఉత్తర అమెరికాలోని తెలుగువారి స్థితిని 1977 నుండి వివరించారు. తానాకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, ఆస్ట్రేలియాలో తెలుగుదనం, దక్షిణాఫ్రికాలో తెలుగువారు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని తెలుగువారి విషయాలు ప్రత్యేకించి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ సాంస్కృతిక భాషా సాహిత్యపరమైన అంశాలను అందించారు. తెలుగు అమెరికన్ల ఆణిముత్యాల పేరుతో వివిధ రచనలు ఆకట్టుకునేటట్లు, ఉండటం ఈ సంచిక ప్రత్యేకత. చెరుకూరి రమాదేవి, కమల చిమట, వంగూరి చిట్టెంరాజు, పి. వేణుగోపాలరావు, యార్లగడ్డ కిమీర, వెంకటేశ్వరరావు వేలూరి, పిల్లలమర్రి శివారామకృష్ణ, చెరుకుపల్లి నెహ్రూ, శిష్టా శ్రీరామచంద్రమూర్తి, పార్వతీ పొన్నలూరి, పిప్పిళ్ళ సూర్యప్రకాశరావు, ప్రసాదు వారణాసి, ఉపద్రష్ట సత్యనారాయణ, కోలగొట్ల సూర్యప్రకాశరావు, కొమరవోలు సరోజ, కోట సుందరరామశర్మ, దామరాజు, కిడాంబి రఘనాథ్, శ్రీనివాస్, పి.ఎస్. మురళి, ఎన్.ఆర్.నంది, ఎస్.ఎస్.మూర్తి, బ్రహ్మం కంచిబొట్ల, పురాణం సీత, కనక ప్రసాద్, శ్యామలా జయరామన్, అనామిక, రామ్ కొల్లూరి, బాబూరావు సముద్రాల, ఎస్.వి. రామారావు, కృష్ణ వేమూరి, పి. వేణుగోపాలరావు, శంకరంబాడి, సముద్రాల విజయలక్ష్మి, పమ్మర శేషగిరిరావు, ఆరుద్ర, వేమూరి వెంకటరామనాథం, శ్రీ నగేష్, కొవ్వలి జ్యోతి, మేకా రామారావు, భోజ్, తిరుమల శేషాచార్యులు, ఎ.వి. మురళీ కృష్ణ, సాధనాల వెంకటస్వామి నాయుడు, కోలగొట్ల సూర్యప్రకాశరావు, అపర్ణ గునుపూడి, సామ రామిరెడ్డి, శ్రీరామమూర్తి దగ్గుపాటి, కె. సరోజ, సుదర్శన్ రాజ్, మాచిరాజు సావిత్రి, గంగపల్లి జగన్నాథరావు, సముద్రాల బాబూరావు, సి.హెచ్. రాములు, సునీత వంకాయలపాటి, ప్రణతి కొండలనేని, జి. రాజేశ్వరరావు, రామిరెడ్డి సామ, కోటపాటి సాంబశివరావు, ఆరి సీతారామయ్య, చిత్రపు ప్రభాకర్, రాయలి రాజగోపాల్, నారాయణ రావు, ఎ.వీర ప్రసాద్, మురళీ మోహన్ రెడ్డి, మేకా రామారావు, రత్న కుమార్, విశ్వనాథ అచ్యుతరాయలు, మోహన్, కమల, యడవల్లి రామకృష్ణ, శోభా, ప్రాతిమ జి ఎన్ రావు, కృష్ణ, డా. జ్యోతి, తోటకూర అప్పారావు, శొంఠి శారదా పూర్ణ, ప్రవాసాంధ్ర భవిష్యత్తు శీర్షికన, ఇంగ్లీషులో రాసినవారిలో పి.వేణుగోపాలరావు, భావరాజు, రజిత భావరాజు, పి. నర్సింగరావు, రామారావు,  పి. శ్రీనివాసరావు ఉషాదేవి ఉన్నారు.
ఈ సంచికలో ప్రవాసాంధ్రుల పేర్లు, సంక్షిప్త వివరాలు,  సేకరించినవి ప్రచురించారు. అమెరికాలో లోగడ వచ్చి స్థిరపడినవారి ఫోటోలు, ప్రచురించారు. ఈ సంచికలో   తెలుగు ఇంగ్లీషు రచనలు కలిపే వేశారు.  సంచిక చాలా సమాచారంతో ఉపయోగకరమైన వివరాలతోనూ ఉండడం గమనార్హం.
ఎన్టీఆర్ ప్రసంగం:
తొమ్మిదవ తానా సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తన సహజ శైలిలో ప్రసంగించారు. కొన్ని ప్రధాన అంశాలు:
ఏదేశమేగినా - ఎందుకాలిడినా,
ఏ పీఠమెక్కినా - ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి - భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
భారతీయ విశిష్ట సంస్కృతీ నాగరికతా సంప్రదాయాల వారసత్వాన్ని ఖండఖండాల విస్తరింపచేస్తున్న విజ్ఞులకు, తెలుగు మాగాణపు వెలుగు నిగారింపులను సుదూరాలకు వ్యాపింపజేస్తున్న ప్రాజ్ఞులకు, తరతరాల ఆంధ్రవైభవ స్ఫూర్తిని దిశాంతాలకు అంకితం చేస్తున్న కళాభిజ్ఞులకు, తెలుగు ఖ్యాతిని సమున్నత శిఖరాలకు చేరుస్తున్న కార్యదక్షులకు, జాతి గౌరవ పరిరక్షకులకు సభాధ్యక్షులకు మా సాదర శుభాభివందనం, సోదర వాత్యల్యాభినందనం.. ప్రాంగణాన్ని రంగవల్లులతో సింగారించి తెలుగింటి పేరంటపు కళను సంతరింపజేసిన నా సోదరీమణులకు మా శుభాశ్శీచందనం… చిట్టి చిట్టి దేవుళ్ళు, చిన్నారి చిరంజీవులకు మా హార్దిక శుభాశ్శీసంప్రోక్షణం.. తెలుగు జాతి సంఘీభావం పట్ల మీకున్న మమకారానికి దర్పణంగా భావిస్తున్న ఈ సదస్సుకు దరిదాపు ముప్ఫయి దేశాల నుండి తమ అందమైన అనుభవాల్ని, అనుభూతుల్ని తమ వారితో పంచుకోవటానికి ఇంతదూరం తరలి వచ్చిన నా సోదరులకు సర్వశుభమంగళాశంస. ప్రపంచమంతా పరుచుకున్న తెలుగుదనం ఒక్కచోట ప్రోవుపడినట్లు స్మరణాతీత కాలం నుంచి ప్రాతఃస్మరణీయంగా వెలుగొందుతున్న తెలుగు మూర్తిత్వం సమున్నత వేదికపై నిలిచినట్లు సకల తెలుగు కళా ప్రాభవవైభవాలు మిరుమిట్లు గొలుపుతున్నట్లు సమస్త శాస్త్ర సాంకేతిక రంగా సర్వోతృష్టత వెల్లివిరిసినట్లు సంపూర్ణ తెలుగు విజ్ఞాన వికాస భాండాగారమే ఆవిష్కరింపబడినట్లున్న ఈ మహా సజస్సుకు మా గౌరవాభినందనం.
తెలుగు గడ్డపై పుట్టి ఆ నేలవాయువుల్ని పీల్చి, ఆ తల్లి అమృత ధారల్ని గ్రోలి ఆయమ్మ కమ్మదనాన్ని పుణికి పుచ్చుకుని, ఆ మాతృదేవి ఒడిలో ఓనమాలు దిద్దుకుని, వివిధ రంగాలలో నిష్ణాతులై ఈనాడు మెట్టిన గడ్డ అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆర్థిక సాంకేతిక విద్యా వైజ్ఞానిక రాజకీయ సామాజిక కళారంగాలను ప్రభావితం చేస్తున్న నా తెలుగు సోదరుల ఈ అపూర్వ సమ్మేళనంలో ప్రధాన ఆహ్వానితునిగా మాకు విశిష్ట గౌరవాన్ని ఆపాదించిన సర్వులకు మా కృతజ్ఞతాభివందనం శుభాభివందనం… మూర్తీభవించిన సమగ్ర విజ్ఞాన శేముషీ దురంధరులు, ఉత్కృష్ట కళాసాహితీ స్రష్టలు, శిష్ట వ్యాపార శ్రేష్టులు, సకల రంగాలలో నిష్ణాతులు, పరివేష్టించిన పవిత్ర ప్రాంగణం ఇది.
ప్రాదేశిక పరిధులకతీతంగా సమున్నత ప్రాతిపదికల నేపథ్యంలో మీరు సాగిస్తున్న ఈ కృషి దేశదేశాలకు మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను.
మిమ్ము సమాదరించిన ఈ గడ్డ ప్రగతికి, చైతన్యానికి, వైజ్ఞానిక వెల్లువకు మీరు చేస్తున్న కృషిని తల్లి భారతి గమనిస్తూనే ఉంది. మీ వల్ల తన అస్తిత్వం ద్విగుణీకృతం కావాలని సదా కాంక్షిస్తోంది. కనికరిస్తోంది. కరుణామృతఝరిని చిలకరిస్తోంది. మాతృభూమిని విడిచి  మనుగడకోసమో, తెలివిడి పెంపుకోసమో తరలివచ్చినా మెట్టిన గడ్డ కూడా జన్మభూమి కన్న తక్కువేమీ కాదు. కన్నప్రేమకు, పెంచిన మమకారానికి తారతమ్యం చూపగలమా.. ఆ సమాదరణే, ఆ అవగాహనే, వసుధైక కుటుంబ భావస్ఫూర్తిని రంగవల్లిగా సింగారిస్తోంది. అప్పుడే సంకుచితత్వపు పొరలు చీలి ప్రపంచ పౌరులంగా మనకు గుర్తింపు లభిస్తుంది. స్నేహ సౌజన్యాలు, సుహృద్భావ సౌభ్రాతృత్వాలు, మన ఆదర్శం కావాలి. విశ్వమానవ శ్రేయస్సే మనకు పరమార్ధం కావాలి. ఆచరణకు ఆరాధ్యమై నిలవాలి…..
ఈనాడు శాస్త్ర సాంకేతిక ప్రక్రియలు దూరాల్ని చేరువ చేశాయి. భూమండలం కుదించబడింది. ఒకనాడు భారతీయ ఆధ్యాత్మిక అమృతత్వాన్ని ప్రపంచానికి పంచి పెట్టిన పరివ్రాజకుడు, సత్కర్మ ధర్మనిరతుడు, స్వామి వివేకానందుడు, ఈ ఖండం నుంచే తన వాణిని తొలిసారి వినిపించటానికి ఎంతో శ్రమ, సాహసం, సుదూర గమనం చేయవలసి వచ్చింది. మరి ఈనాడు ప్రపంచపుటంచుల్నుంచి ఇన్నివేలమంది ఈ చోటుకు చేరి ఈ మహాసభలో పాలుపంచుకోవటానికి పట్టుమని పదిగంటలు కూడా పట్టని అమిత వేగాన్ని సాధించాం. దూరాల్ని తగ్గించాం.
తల్లి గర్భాన్ని రూపదాల్చవలసిన బిడ్డను శోధన నాళిక నుండి సజీవంగా వెలికి తీస్తున్నఈ నాటి మానవ మేధస్సును, ఆగిన గుండెను తిరిగి స్పందింపచేసే అత్యున్నత వైద్య పరిజ్ఞానం కైవసం చేసుకున్న మనిషి జిజ్ఞాసకు అంతరిక్షంలో అంతస్తుల్ని నిర్మించి గ్రహాంతరాల్ని విజయవంతంగా శోధిస్తున్న అద్భుత సాంకేతిక జ్ఞానాన్ని ఆకళింపుచేసుకున్నబుద్ధిజీవుల ప్రజ్ఞకు సర్వమానవాళి నివాళులర్పిస్తున్నది. అదే సమయంలో లిప్తపాటులో సర్వప్రపంచాన్ని నిర్ధూమధామం చేయగల మారణాయుధాల్ని తయారించి ఈ గ్రహరాశికే అణువుల చితి పేర్చుతున్న వినాశకర జ్ఞాన వెల్లువకు మానవాళి గుండె తల్లడిల్లుతున్నది.
మానవవికాసానికి తోడ్పడవలసిన విజ్ఞానం వెర్రితలలు వేసి వినాశనానికి విరుచుకుపడడమే విషాదకరం.
శాస్త్ర పరిశోధనల ఫలితంగా, కొన్ని అతి చిన్న దేశాలు, అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తుంటే, మరి కొన్ని దేశాలు వర్ణకార్పణ్యాలతో మతోన్మాద వికారంతో మానవ మారణకాండకు యధేచ్చగా బాటలు వేస్తున్నాయి. ఇంకెన్నో దేశాలు అవిద్యతో, అజ్ఞానంతో, ఆకలితో, రోగాలతో, అంతులేని దైన్యంతో మగ్గుతున్నాయి.
ఎందుకీ వ్యత్యాసం?
ఎందుకీ వైపరీత్యం?
ఒక వంక మహోన్నత ఆదర్శ నినాదాలు,
మరోవంక నికృష్ట ఉగ్రవాద విషదంష్ట్రలు…
ఒక పక్క మానవతా మమతానురాగాల వెల్లువ
వేరొక పక్క జుగుప్సాకర మానవ మారణ హేల
ఇంకొక పక్క చీకటి, ఆకలి, రోగాల మృత్యుపీడ
ఎందుకీ తేడా? దీనికి పరిష్కారం లేదా ?
ఇందుకు మన మేధాసంపత్తి, నిష్కృతి కనుగొనలేదా?
ప్రపంచదేశాల్లో రాజకీయంగా చోటు చేసుకుంటున్న పెనుమార్పులు, కొన్ని అగ్రరాజ్యాల రూపురేఖల్ని కబళిస్తున్న ఈ తరుణంలో, సామాన్య మానవాళి కనీసావసరాల పట్ల కనికరంతో, కార్యక్రమాలను రూపొందించాల్సిన బాధ్యత ఆర్ధిక పుష్టి సాధించిన దేశాలకు లేదా?
రొట్టెకోసం ఆరుమైళ్ళు క్యూలో నిల్చునే పరిస్థితి ఒక దేశంలో…
గుక్కెడు నీళ్ళకోసం మండుటెండలో బండనెత్తిన పెట్టుకుని మైళ్ళ కొద్దీ నడుస్తున్న ఆడపడుచుల దయనీయ దృశ్యం మరొకదేశంలో…
నోరు తెరుచుకుని ముసిరే ఈగల్ని తోలుకునే శక్తి లేక అంతర్జాతీయ సంస్థలందించే అన్నపు పొట్లాలకోసం ఆకాశంవైపు చూస్తూ ఆశతో అలమటించే దీనస్థితి మరొకదేశంలో…
ఏమిటీ గ్రహస్థితి?
ఎంతకాలం ఈ దుస్థితి?
దీనికి తరుణోపాయం లేదా?
ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు.. అందరిదీ… మనందరిదీ… మేధావులూ, ఎన్నో విజయాలు సాధించిన మీ మీ ఆలోచనల్ని ఈ తీవ్రమైన సమస్యపై అభిముఖం చేయండి. ఆచరణకు ఉపక్రమించండి.
పుణ్యభూమి మనది. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అని నిత్యం స్మరించే జాతి మనది. తోటి మానవాళిని ఆదుకునే సత్సంకల్పానికి నాంది పలుకుదాం.
బుద్ధుడు పుట్టిన గడ్డ నుంచి వచ్చారు. విశ్వశాంతికి గమ్యాన్ని సుగమం చేయండి. గాంధీ పుట్టిన దేశం నుంచి వచ్చారు. భారతదేశ ప్రగతికి మీ వంతు ప్రణాళికలు రూపొందించండి. అంబేద్కర్ కళ్ళు తెరిచిన నేల మీ మాతృదేశం. నిరుపేదల ఆక్రందనకు, అధోజగత్సహోదరుల ఆవేదనకు స్పందించే మమతానురాగాలు మీ గుండెల నిండుగా పండించండి.
‘నా దేశంలో ఒక కుక్క నిరాహారంగా ఉన్నా నా హృదయం క్షోభిస్తుంది’ అని చాటిన స్వామి వివేకానందుల ఆధ్యాత్మిక వారసులు మీరు. తాడిత పీడిత మానవాళికి స్వస్థ్యం చేకూర్చే పథకాలు రచించండి…
అవిద్యతో, ఆకలితో అలమంటించే అట్టడుగు బడుగు వర్గాలకు సేద తీర్చండి… కులాల అంతరాలు, వర్గాల వైషమ్యాలు, వర్ణాల కార్పణ్యాలు అంతరించి మమతా మానవతలు మనలో వెల్లువెత్తాలి. తరతమ భేదం లేని సమదృష్టితో తోటి మానవుడ్ని గౌరవించమన్న ఆదిశంకరుల ప్రవచనం మనకు సర్వదా శిరోధార్యం.
ఆరుకోట్ల ఆంధ్రుల ఆత్మీయతా ప్రతినిధులే కాదు మీరు. 86 కోట్ల భారతీయుల అనుంగు సోదరులు కూడా. సర్వ ప్రపంచానికీ, భారతీయాత్మను, తెలుగుదేశపుటౌన్నత్యాన్ని సమున్నతంగా తెలిపే సాంస్కృతిక వారధులు మీరు. భవిష్యత్తరాలకు సారధులు మీరు. మిమ్ము అక్కున చేర్చుకుని ఆదరించి పెంచిన భూమిలో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్న మీరు ఈ దేశ ప్రగతీగమనంలో భాగస్వాములైన మీరు మాతృభూమి అభివృద్ధికి మీ వంతు కృషి నిరంతరం సాగిస్తారనే ఆశిస్తాను. మీ వైజ్ఞానిక పరిజ్ఞానం, రాజకీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యం, మేధో నైశిత్యం, సేవా నిరతి, సాధన సంపత్తి తల్లినేల ప్రగతికి కూడా తోడ్పడాలి. ఆ తల్లి పచ్చదనాల పరీమళంతో యంత్రచక్రాల నిరంతర పరిభ్రమణంతో పరిఢవిల్లాలి. దేశదేశాలకు మకుటాయమానంగా వెలుగొందాలి. ఆ ప్రయత్నంలో మీ వంతు సహాయ సహకారాలు, ఉత్సాహప్రోత్సాహకాలు ఏనాడూ కొరవడవని మీ వాడిగా ఆశిస్తాను.
అంతే కాదు, ఈ దేశపు సామాజిక స్రవంతిలో భాగస్థులు మీరు. మీ వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లని రీతిలో సహజీవనం సాగించాల్సి ఉంటుంది. ఈ దేశ గౌరవం ప్రతిష్ఠ మీ వల్ల ఇనుమడించాలి. భారతదేశానికి, మీరు నివసిస్తున్న దేశానికి కూడా ప్రతినిధులు మీరు. ఉభయ దేశాల మధ్య సదవగాహన, సహకార భావం పెంపొందిచవలసిన సాంస్కృతిక రాయబారులు మీరు.
మనుషులు రెండు రకాలు. సత్యాన్ని, సంప్రదాయాల్ని ఆదర్శంగా తీసుకునేవారు సామాన్యులైతే, ఆదర్శాల్ని సత్యాలుగా, సంప్రదాయాలుగా మలచేవారు అసామాన్యులు. నడిచేవారు, నడిపేవారు ఎందరో మహానుభావులు… అందులో కొందరే చిరస్మరణీయులు. ఆ సహృదయుల కోవలో నిల్వటానికి ప్రయత్నించడమే మనకు ధ్యేయం కావాలి. ప్రపంచంలో విభిన్న ప్రాంతాల తెలుగు పౌరుల స్నేహ సుహృద్భావ సహకార సౌజన్య  సౌభ్రాతృత్వాల విశిష్ట సమ్మేళనం ఇది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రపంచ తెలుగు సమాఖ్యల ఉమ్మడి ఆధ్వర్యంలో జరగడం తెలుగు జాతికే గర్వకారణం.
తమ దేశ ఆర్ధిక పరిపుష్టికి, విజ్ఞాన సంపత్తికి, సామాజిక అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతున్న అమెరికా భారతీయుల్ని, తెలుగు సోదరుల్ని సగౌరవంగా సమాదరిస్తున్న అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అరమరికలు లేకుండా సోదరభావంతో ఆదరించే ఈ సత్సంప్రదాయం ముందుతరాలకు సైతం ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తాను.
అలాగే ఈ గడ్డపై పుట్టిన చిన్నారులు మన సంస్కృతిని, సంప్రదాయాలను మరువకుండా తెలుగు ఆచార వ్యవహారాల్ని, సదా వారికి అందజేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాను. మీ విద్యా విజ్ఞానాల్ని, ఆధునిక సాధనాలను, ఆరోగ్యకరమైన ఆలోచనలను, ఆర్ధిక ప్రణాళికల్ని, మీ వంతు సొంత రాష్ట్రాభివృద్ధికి అందించి మనుషులు దూరంగా ఉన్నా, మమతలు చేరువేనన్న సత్యాన్ని చాటగలరని భావిస్తాను.
ఆకాశ భవనాల అపురూప నగరంగా భాసిస్తూ, సర్వదేశాలలో అగ్రరాజ్యంగా పరిగణింపబడుతూ, ప్రపంచరాజ్యాల కూటమికి కేంద్రంగా ఉన్న అమెరికా దేశానికి తలమానికమైన న్యూయార్క్ లోని లాంగ్ ఐలండ్ లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తొమ్మిదవ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి, మీ ఆదరాభిమానాలతో, సాదర సత్కారాలతో అమలిన మమతానురాగాలతో గౌరవించి మీ సహృదయతకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను”.
10వ తానా మహాసభలు
కొత్త తరాలు - సరికొత్త తీరాలు
పదవ తానా మహాసభలు 1995 జులై 1-3 తేదీలలో చికాగోలోని రోస్.మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి.  ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్, చికాగో తోడ్పాటునందించింది. కన్వీనర్ గా యుగంధర్ యడ్లపాటి, అధ్యక్షుడుగా నరసరాజు మంతెన వ్యవహరించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, ఉపరాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్, ప్రధాని పి.వి.నరసింహారావు, ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సందేశాలు పంపారు. అమెరికాలో భారత రాయబారి సిద్దార్ధ శంకర్ రే ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్ర మంత్రి రంగయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, మంత్రులు మాధవరెడ్డి, ప్రతిభాభారతి, దేవినేని నెహ్రూ అతిథులుగా వచ్చారు.
ప్రముఖ సినీ దర్శకుడు బాపు, సినీరచయిత ముళ్లపూడి వెంకటరమణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లకు  సన్మానాలు చేశారు. జి.వి.ఆర్.కె.శర్మ (వైద్యం),  వనపల్లి మంగరాజు (వైద్యం), జంపాల చౌదరి (వైద్యం), గుంతక వి.రామారెడ్డి (సైన్స్), చెరుకుపల్లి నెహ్రూ (సైన్స్), కె. వాణీనాథరావు (ఎలెక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్), శిఖా సత్యనారాయణమూర్తి (సాహిత్యం),  వింజమూరి కృష్ణమాచారి (సాహిత్యం),  తిరుమల కృష్ణదేశికాచారి (సాహిత్యం), చిట్టూరి వెంకటరత్నం (సంఘసేవ), ఘంటికోట మూర్తి (సంఘసేవ), డా. రావు ఎ.ఎన్.వి. (సంఘసేవ) తుమ్మల శోభ (యువ సంఘ సేవ), పోతు సంధ్యారావు (విద్యారంగంలో), మాస్టర్ అయ్యగారి శ్రీనివాస్ (విద్యారంగంలో ప్రతిభ)లకు తానా అవార్డులు ప్రదానం చేశారు.
బాపు-రమణల స్వర్ణోత్సవం జరిపిన సందర్భంలో వారిద్దరి మొదటి ప్రచురణల గుర్తుగా ‘బొమ్మా-బొరుసు’ అనే పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. ఆ సమావేశానికి కీలకోపాన్యాసకుడుగా వచ్చిన శ్రీ కొంగర జగ్గయ్య తన గీతాంజలి అనువాదాన్ని ఆవిష్కరిస్తే,  గౌరవ అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.  భమిడిపాటి రామగోపాలం బాపురమణలకు నూటపదహార్లు అంటూ ప్రచురించిన సరదా కథలు, స్మైల్ ఖాళీ సీసాలు కథాసంకలనం, కె. సదాశివరావు క్రాస్‌ రోడ్స్ కథాసంకలనం ప్రచురించారు.
ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్య సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రముఖ సినీనటులు కోట శ్రీనివాసరావు, శారద, బ్రహ్మానంద, ఎవిఎస్, నేపథ్య గాయనీగాయకులు సుశీల, రామకృష్ణ, జిక్కి, ఎం.రాజా జూనియర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంపటి చినసత్యం బృందం కూచిపూడి నృత్యాలు, సురభి కళాకారుల సంప్రదాయ పద్యనాటకాలు, హరికథ, బుర్రకథలు ప్రత్యేక ఆకర్షణలు.
ఈ మహాసభలలో యువత ప్రత్యేక ప్రతిభను చూపించి ఒకరోజు సాయంత్రం మొత్తం వారి కార్యక్రమాలకి కేటాయించారు. సరస్సులో క్రూజ్ తో సహా చక్కని హాస్యరసభరితమైన కార్యక్రమాలని నిర్వహించారు.  మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ఈ మహాసభలలో ముఖ్యమైన విషయం.
అధ్యక్షులు నరసరాజు మంతెన మొదటి తానా యంగ్ ఎడల్ట్ కాన్ఫరెన్స్ ని ప్రోత్సహించారు. ఇది సిన్సినాటి మియామి యూనివర్సిటీలో 1994 మేలో జరిగింది. యంగ్ ఎడల్ట్ స్టీరింగ్ కమిటీకి కన్వీనర్ గా శోభా తుమ్మల, మెంటర్స్ గా నలినీ దొనపర్తి, నవీన్ కాకరాల, సుధీర్ రావి, మల్లికార్జున రావు చలసాని ఉన్నారు. వీరు ఎటువంటి డొనేషన్లు లేకుండా చక్కని కార్యనిర్వహణతో 9,200 డాలర్లు మిగులును చూపించి ఉత్తర అమెరికాలో మంచి అభినందనలు పొందారు.
తెలుగు పలుకు
నాడు వెలువరించిన ప్రత్యేక సంచికకు ముఖ్య సంపాదకుడుగా జంపాల చౌదరి, సంపాదకవర్గం ఛైర్.పర్సన్.గా వెంకట సుబ్బారావు ఉప్పులూరి, సహ ఛైర్.పర్సన్.గా రామరాజ బి.యలవర్తి, సభ్యులుగా ద్రోణంరాజు శివరామకృష్ణ, రాఘవేంద్రరావు పాతూరి, భాస్కర్ రావి, కృష్ణయ్య రేవులూరి, వెంకటరామారావు సి.రామదాసు, శారదా పూర్ణ శొంఠి, యువజన విభాగం సభ్యురాలుగా దీపికా రెడ్డి వ్యవహరించారు. ఈ సంచికలో ముళ్ళపూడి వెంకటరమణ, ఎన్టీరామారావు, కొంగర జగ్గయ్య, మాలతీ చందూర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వెంపటి చినసత్యం, నండూరి రామమోహనరావు, భరాగోల  రచనలు ఉన్నాయి.
11వ తానా మహాసభ
మారుతున్న పరిసరాలు - మారని విలువలు
11వ తానా మహాసభ 1997 జూలై 3-5 తేదీల్లో లాస్ ఏంజిలస్ లోని యానహైం కన్వెన్షన్ సెంటర్.లో జరిగాయి. కొత్తపల్లి కొండలరావు ఛైర్మన్, ప్రధాన సమన్వయకర్తగా, రామమోహనరావు వడ్లమూడి అధ్యక్షుడుగా, కన్వీనర్.గా కార్యక్రమాన్ని నిర్వహించారు.  సమ్మేళనం విజయవంతం కావడానికి  రాధా జె.శర్మ, ధర్మారెడ్డి గుమ్మడి, రావిపూడి సుబ్బారావు, నాగేశ్వరరావు గంగుల, సతీశ్ చిలుకూరి, వెంకటాద్రి బొబ్బా, దివాకర్ రెడ్డి కృష్ణారెడ్డి ఎం., కన్య శొంఠి, సుందరి సి.గంటి, జె.ఎస్.శర్మ, ముక్కామల అప్పారావు, పేరయ్య సుదనాగుంట, ప్రేమచంద్ దుగ్గిరాల, రాజేశ్వరరావు గుడిపాటి, రామకృష్ణారెడ్డి తాడి, రవి కోనేరు, శేఖర్ రెడ్డి కల్లం, విశ్వనాథ అచ్యుతరాయలు బాధ్యతాయుతంగా నిర్వహించారు. రాష్ట్రగవర్నర్ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సందేశాలు పంపారు.
అక్కినేని నాగేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. ఈ సమ్మేళనంలో ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి నటరత్న నందమూరి తారక రామారావు తరఫున అవార్డును స్వీకరించారు.
సాంస్కృతిక, సారస్వత, నృత్య ప్రదర్శనలకు  ప్రాముఖ్యత ఇచ్చారు. మొల్ల రామాయణం పై చర్చ చేశారు. శిరీష్, భారతి, పూజ, చేసిన `నా జన్మభూమి` అనే నృత్య ప్రదర్శన కొత్తరీతిలో ఉంది. జూనియర్ ఎన్.టి.ఆర్. డాన్స్ విశేషంగా ఆకర్షించింది. దామరాజు మూర్తి ఏకపాత్రాభినయం మయసభలో దుర్యోధనుడు అందర్నీ ఆశ్చర్యపరచింది. సాయికుమార్ కర్ణ ఏకపాత్రాభినయం, మురళీ మోహన్ బృందం దేశభక్తి గేయ ప్రదర్శన మెప్పు పొందింది. సుప్రసిద్ధ నటి శ్రీదేవిని సత్కరించారు. బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాటకచేరి చేశారు. జనరేషన్ అనేపేరిట కొత్త ఫక్కీలో ఫ్యాషన్ షో నిర్వహించారు. యువజన సమావేశం, మహిళల సమస్యల చర్చలు, ఎక్కుమంది పాల్గొనేటట్లు చేశాయి.  ఎల్.ఆర్. ఈశ్వరి, ప్రణయ్ కుమార్ పాటలు బాగా ఆకట్టుకున్నాయి. యువతలో సృజనాత్మకతను వెల్లడించే పోటీలు నిర్వహించారు. కంప్యూటర్ సాంకేతికతలో శిక్షణ ఇచ్చి, యువతను ప్రోత్సహించటం వేమూరి వెంకటేశ్వరరావు నాయకత్వాన ప్రత్యేక అంశంగా ఉన్నది.
అవార్డులు అందుకున్న ప్రముఖుల్లో శ్రీరామమూర్తి అంకెం (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), జె.లియోనార్డ్ బెల్ (ప్రత్యేక మానవతావాది అవార్డు), మాకినేని సుబ్బారావు (ప్రముఖ తెలుగు సంఘసేవకులు), పోలవరపు తులసీదేవి (సమాజసేవ), వృద్దుల కృష్ణమూర్తి (విద్యారంగంలో ప్రతిభ), శ్రీనివాసరావు జమ్మలమడక (విద్యారంగంలో ప్రతిభ), లీలవతి నల్లమోతు (సాహిత్యం), నరిశెట్టి ఇన్నయ్య (జర్నలిస్టు, రచయిత), ప్రేమ్ ఎన్.రెడ్డి (యాజమాన్యం), అక్కరాజు శర్మ, రాధాకృష్ణ బండారు, రామరాజభూషణుడు యలవర్తి, యుగంధర్ యడ్లపాటి (కమ్యూనిటీ సేవ) వున్నారు. అవార్డుల కమిటీలో మోహన్ గాంధీ, వెంకటేశ్వరరావు కాటా, కృష్ణ పోలవరపు, రామమోహనరావు వడ్లమూడి, విద్యాసాగర్ నూతేరి  వున్నారు.
తెలుగు పలుకు
‘తెలుగుపలుకు’ ప్రత్యేక సంచికకు మురళీ చుందూరి, సతీష్ చిలుకూరి, భోగేశ్వరరావు ప్రత్తిపాటి, జెఎస్ఎం శర్మ, ఉపాధ్యాయుల వెంకట సత్యనారాయణ సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు.
బాపు ముఖచిత్రంతో వెలువడిన ఈ సంచిక అంతటా చక్కని కార్టూన్లు అలరించాయి. ఈ సంచికలో ఇంగ్లీషు విభాగం, తెలుగు విభాగం వివిధ వ్యాసాలు ఉన్నాయి. ఇందులో కనక ప్రసాద్, రాధికా నోరి, కోవర్తి రామారావు,  పుచ్ఛా అన్నపూర్ణ,  సత్యం మందపాటి, సుధేష్ణ, కె. బోస్, వేమూరి వెంకటేశ్వర రావు, దామరాజు లక్ష్మి, దామరాజు సచ్చిదానందమూర్తి, జి.వి.ఆర్.కె. శర్మ, భావన, ఉపాధ్యాయుల లక్ష్మీ గౌరంగారావు, కాట్రగడ్డ వెంకటేశ్వర్లు, పుచ్ఛా అన్నపూర్ణ, నాగ్, కబురు, ఉదయం, నిశ్చలత్వం, తిరుపతి రెడ్డి చంద్రుపట్ల, సునీత, విశ్వనాథ అచ్యుత దేవరాయలు, గాదె వెంకట మధుసూదనరావు, శేషం సుప్రసన్నాచార్యులు, జక్కంపూడి సుబ్బారాయుడు, పెనుగొండ శ్రీనివాసులు, బాపూ, కర్ణాకర్ణి, లింగాయత్తులు, శంకు, వింజమూరి అనసూయాదేవి, వింజమూరి ప్రభాకర్, జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి, కలశపూడి శ్రీనివాసరావు, వేదుల చిన వేంకట చయినులు, వంగూరి చిట్టెంరాజు, ముదిగొండ శ్రీరామ ఆర్య, పారనంది లక్ష్మీ నరసింహం, గవరసాని సత్యవారాయణ, శిఖా సత్యనారాయణ మూర్తిల రచనలు ఉన్నాయి.
12వ తానా మహాసభ
సాంప్రదాయాల కలిమి, విద్యల బలిమి, నవ్యతతో చెలిమి
12వ తానా మహాసభలు సిన్సినాటీ కన్వెన్షన్ సెంటర్.లో 1999 జూలై 3-5 తేదీల్లో జరిగాయి. చలసాని మల్లికార్జునరావు అధ్యక్షతన బిజినెస్ సెమినార్  ప్రారంభించారు.  ఈ సమావేశ ప్రధాన ఉద్దేశ్యం ‘హైటెక్ ఆపర్ట్యూనిటీస్ ఇన్ న్యూ మిలేనియం’.  సి.కె.ప్రహ్లాద్ 21వ శతాబ్దంలో ఇండియా వాణిజ్యం గురించి ఉపన్యసించారు.   రంగనాథబాబు గొర్రెపాటి కన్వీనర్ గా వ్యవహరించారు. మహాపర్వాలకు నిధుల సమీకరణ సమన్వయకర్తగా చౌదరి బొబ్బా, కోశాధికారిగా పటేల్ వి.మన్నవ, కార్యక్రమాల సమన్వయకర్తగా జంపాల చౌదరి వ్యవహరించారు. నన్నయ్య జంపాల, కవితా లక్కరాజు, అజయ్ ఘంటా, వేమన జంపాల, టి.వి.రెడ్డి, సావిత్రి చింతా, లక్ష్మీ ఏలేశ్వరపు రాజ్యలక్ష్మి, అన్నంరాజు, పద్మజా శొంఠి, రఘురాం ఈమని, టి.వి.రెడ్డి, సీతారామయ్య మన్నవ, సత్యనారాయణ మాజేటి, చౌదరి జంపాల, సావిత్రి చిందు, శారదా నాగిశెట్టి, అనిల్ నలగట్ల, శారదా పూర్ణ శొంఠి, ప్రసాద రాజు, హరి కె. మద్దాలి, ఆనంద్ రాజు, రఘు తాడేపల్లి, అనిల్ మద్దాలి, స్వర్ణ కాకాని, ఇందిరా గొర్రెపాటి, కృష్ణారావు కాకాని, రంగనాథబాబు గొర్రెపాటి, గోపీకృష్ణ వుడతల, పటేల్ వి. మన్నవ, రవి పోణంగి, బలరామరాజు, దేవిప్రసాద్ ఆలపాటి, రాజశేఖర్ లక్కరాజు, ప్రసాద్ చండ్ర, గిరీశ్ నాగిశెట్టి, పప్పు రామారావు, మాధవరావు దాసరి, వసుంధర దాసరి, రాణి బొబ్బా, మాధవి కొల్లి, అరుణా చౌదరి, అన్నపూర్ణ చండ్ర మల్లేశ్వరి రెడ్డి, ఈ మహాసభలలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.
“సాంప్రదాయాల కలిమి, విద్యల బలిమి, నవ్యతతో చెలిమి” ఈ సభలలో ప్రధానాంశం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, గవర్నర్ సి.రంగరాజన్ ఈ మహాసభలకు ప్రత్యేక సందేశాలు పంపారు. పార్లమెంట్ సభ్యుడు, బిజెపినేత ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఓహయో విదేశాంగ మంత్రి కెన్ బ్లాక్.వెల్, భారతీయ రాయబార కార్యాలయం డిప్యూటీ ఛీఫ్ టి.పి.శ్రీనివాసన్, యుఎస్ ప్రతినిధి షెర్రాడ్ బ్రౌన్, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్, విస్కాన్సిన్ యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ విభాగం అధిపతి కిరిన్ నారాయణ్ ఈ సమ్మేళనంలో ప్రసంగించారు. ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు, సంఘసేవకుడు బి.వి.పరమేశ్వరరావు, స్వాతి సంపాదకుడు వేమూరి బలరామ్, శాంతాబయోటెక్ ఎండి వరప్రసాద్ రెడ్డి, నేపథ్య గాయని పి.సుశీల, ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ అధినేత హనుమంతరావు, ప్రముఖ సినీ దర్శకుడు బాపు, ఈనాడు పత్రిక  సంపాదకవర్గ సభ్యుడు చలసాని ప్రసాదరావు, ఎపి సినిమా అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ మురళీ మోహన్.లకు గౌరవ అతిథులుగా సన్మానం చేశారు. ప్రముఖ సినీనటులు నాగార్జున, బ్రహ్మానందం, టాబూ, రమ్యకృష్ణ, సుమంత్, రాజేంద్ర ప్రసాద్, ఆలి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, మిస్ వరల్డ్ డయానా హేడెన్, అవధాని మాడుగుల నాగఫణిశర్మ, రచయిత్రి జయప్రభ ఆచార్యులు వెల్చేరు నారాయణరావు, చేకూరి రామారావు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
స్త్రీలపట్ల అత్యాచారాలు, మానసిక క్షోభలు, డిప్రెషన్ పై ప్రత్యేక ప్రసంగాన్ని వీడియో.పై చూపుతూ డాక్టర్ నవీన హేమంత్ ప్రసంగించారు.  వివిధ డాక్టర్లు పాల్గొన్న ఈ మహాపర్వానికి డాక్టర్ జంపాల చౌదరి నిర్వాహకులుగా ఉన్నారు. “కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్” (CME) సమావేశంగా దీనికి ప్రత్యేకత సమకూరింది.
డా.  శర్మ చల్లా వివిధ రంగాలలో ప్రతిభావంతులకి అవార్డులను అందజేశారు.  కృష్ణచంద్ అక్కినేని (ఎంటర్ ప్రెన్యూర్), సూర్యకుమారి మహీంద్ర (కమ్యూనిటీ సర్వీసెస్), రావు వి. చలసాని (ఫైనాన్స్), వినోద్ కె. దాసరి (బిజినెస్), మన్నవ సీతారామయ్య (సైన్స్ అండ్ టెక్నాలజీ), డా. నల్లమోతు సత్యనారాయణ (కమ్యూనిటీ సర్వీస్ అండ్ పబ్లికేషన్ స్కిల్స్), నారాయణరావు నన్నపనేని (ఎడ్యుకేషన్), డా. కృష్ణారావు పోతరాజు (సైన్స్), డా. చిట్టెన్ రాజు వంగూరి (లిటరేటర్), కృష్ణ ఎస్.వావిలాల (కమ్యూనిటీ సర్వీస్).
కన్వీనర్ రంగనాథబాబు గొర్రెపాటి, కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి సమావేశ ఖర్చులు నిధులను మించకుండా చూశారు.
తెలుగు పలుకు
సంపాదకులు చంద్రశేఖరరావు కన్నెగంటి, కంట్రిబ్యూటింగ్ ఎడిటర్  జంపాల చౌదరి, సహాయ సంపాదకులు ఉదయభాస్కర్ నందివాడ, మాధవరావు కూరటిల ఆధ్వర్యంలో ఈ సంచిక వచ్చింది. కమిటీ ఛైర్.పర్సన్.గా గోపాల్ అన్నంరాజు, సహ ఛైర్.పర్సన్.గా ప్రసాద్ తోటకూర ఉన్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర ముఖచిత్రం రూపొందించారు.  ‘సాంప్రదాయాల కలిమి - విద్యల బలిమి - నవ్యతతో చెలిమి’  అనే శీర్షిక ఈ సంచిక విషయ పరిచయం చేసింది.
సంఘ సంస్కరణ పండితుడు, బహుముఖ సాహితీ ప్రక్రియా పండితుడు శ్రీ కందుకూరి వీరేశలింగం చిత్రంతో ఆహ్వానం పేరిట  మొదటి భాగం ప్రారంభమైంది. ప్రథమాంధ్ర మహాపాలకుడు, నవీన శక సృష్టి కారకుడు శాలివాహనుని చిత్రం, కాకతీయ మహా సామ్రాజ్య భారధారణి, శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి చిత్రం ఈ విభాగానికి నిండుదనాన్నిచ్చాయి. ఇందులో స్వతంత్ర భారతం - అర్థశతాబ్ధలబ్ధి - శ్రీ పి.వి. నరసింహారావుగారు, అవధానం - సంప్రదాయం - ఆధునికత - మహా సహ్రసావధాని డా. గరికపాటి నరసింహారావు, మైదానానికి చెలియలికట్ట - జయప్రభ, ఇండియా క్రైసిస్ ఆపర్ ట్యూనిటీ - జయప్రకాశ్ నారాయణ్, బిసిటి రూరల్ డెవలప్ మెంట్ అండ్ లిటరసి మూవ్ మెంట్  - వి.ఆర్. వేలూరి, గానకోకిల - పరుచూరి శ్రీనివాస్, గెస్ట్స్ ఆఫ్ ఆనర్, షెర్రాడ్ బ్రౌన్ మొదలైన శీర్షికలు ఉన్నాయి.
రెండవభాగానికి ఆధునికాంధ్ర కవితా వైతాళికుడు గురజాడ అప్పారావు ముఖచిత్రంగా వేసి తెలుగు తనాన్ని చాటారు. త్రివర్ణ పతాక రూపకర్త, జాతీయ స్వాతంత్ర్య సమరవేత్త పింగళి వెంకయ్య, మన్యసీమ గాండ్రించిన మగటిమి గల మొనగాడు, తెల్లదొరలు ఆదరించిన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు చిత్రాలు దీటులేనివిగా ఉన్నయి.   ఈ భాగంలో ఎస్.ఎస్.మూర్తి, రవి, సావిత్రి, దీప్తి చింతా, శోభన్.బాబు అట్లూరి,  పి. వేణుగోపాలరావు,  స్వరూప్ మద్దూరి,  మాచిరాజు సావిత్రి,  చోడవరపు ప్రసాద్ ల రచనలు వచ్చాయి.
మూడవ భాగానికి అపార హేతువాద కృపాణ ధీరుడు - త్రిపురనేని రామస్వామి చౌదరి చిత్రపటాన్ని ముఖచిత్రంగా వేసి పాఠకులకి పరిచయం చేశారు. కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు సిద్ధేంద్రయోగి (తెలుగు నాట్యజగతికి ఆరాధ్యుడు), ఆంధ్రనాటకరంగ ప్రభాకరుడు, సముదాత్త నటనా ప్రదీపకుడు బళ్ళారి రాఘవల చిత్రాలతో పరిచయంచేసి తెలుగుజాతి గొప్పదనాన్ని వెల్లడించారు. ఈ విభాగంలో తురిమెళ్ళ మాధవకుమార్, పప్పు సూర్యకాంతం,  ఊటుకూరి గోపాల్రావు, డా. కె.వి.ఎస్.రామారావు, ఆచార్య పిప్పళ్ళ సూర్య ప్రకాశరావు, యల్లాప్రగడ జానకీరాణి, సాయిలక్ష్మి, శంకరగిరి నారాయణస్వామి, నోరి రాధికల రచనలు ఈ సంచికకి నిండుదనాన్నిచ్చాయి.
‘కలగూరగంప’ శీర్షికతో నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గ జ్వలన్మూర్తి - గుర్రంజాషువా గారి చిత్రపటంతో ఈ విభాగం అలరించింది. అంతేకాకుండా సంపాదకీయ రచనా ప్రబోధశీలి, ఆంధ్ర సముజ్జీవన చైతన్యశాలి - ముట్నూరి కృష్ణారావు, తెలుగు సీమలో బ్రహ్మ సమాజ కులపతి - రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి చిత్రపటాలతో తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖులని పరిచయం చేశారు.
కనక ప్రసాద్, ఆరి సీతారామయ్య,  గురజాడ సూర్యకుమారి,  కొల్లి ఇందిర,  విక్రమ్, పాలన, డొక్కా రామభద్ర, కన్నెగంటి చంద్రశేఖరరావు, మధుకీల, విన్నకోట రవిశంకర్, మాచిరాజు సావిత్రి, డా. అవసరాల అనసూయాదేవి (వింజమూరి),  విశ్వనాథ అచ్యుత దేవరాయలు, ముత్యాల సీత, అరవింద, రాచకొండ నరసింహశర్మ, డొక్కా శ్రీనివాస ఫణికుమార్, ఉదయ భాస్కర్, వాసుల రచనలు ఈవిభాగంలో పొందుపరిచారు.
నూరువసంతాలు శీర్షికతో ఆధునిక ఉర్దూ మహాకవి, అభ్యుదయ భావ సముజ్జ్వల రవి   మఖ్దుమ్ మొహియుద్దీన్ గారి ముఖచిత్రాన్ని వేసి, మువ్వగోపాల పదమోహన గాయకుడు, మధురభక్తిభావ రాగ రంజకుడు క్షేత్రయ్య, అగ్రేసర దక్షిణాత్య వాగ్గేయకారుడు, అక్షరనాదోపాసనైక జీవనుడు త్యాగయ్యగార్ల ప్రతిభలని వెల్లడించారు.  ఈ విభాగానికి డాక్టర్ పాపినేని శివశంకర్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, నరిసెట్టి ఇన్నయ్య, కొత్తూరు ఎస్. రత్న, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కోటపాటి సాంబశివరావు, జంపాల చౌదరిల వ్యాసాలు, కథలు నిండుదనాన్నిచ్చాయి.
నవల, కథల పోటీ అని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత సురవరం ప్రతాపరెడ్డి చిత్రంతో మొదలు పెట్టి ఆంధ్ర మహాభాగవత భవ్యఫల ప్రదాత మందార మకరంద మాధురీ సముపేత శబ్ద విధాత మహాకవిపోతన, అశేష ఆగమ శాస్త్ర తత్వనిపుణుడు, ఆంధ్ర మహాభారత పూరణ దక్షుడు ఎర్రాప్రెగడలతో చిత్రాలతో తెలుగు కవులని మరోసారి గుర్తుచేసారు. ఇందులో తానా నవల-కథల పోటీ 1999 ఫలితాలు, డా. జంపాల చౌదరి నవలలపై పరిశీలన, డా. కె.వి.ఎస్. రామారావు - పోటీలో ఎంపికైన కథలు - ఒక చిన్న పరిశీలన, పల్లేటి బాలాజీ అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్?, కృష్ణప్రేమ - జొన్నలగడ్డ రామలక్ష్మి, ఎ.ఎస్.మణి- జీవితానికి ఎన్ని రంగులో, డా. వి. చంద్రశేఖరరావు,  వేదప్రభాస్ - రెండు ఆకాశాలు, అర్నాద్ - 1998 ల రచనల్ని పెట్టారు.
అభ్యుదయ కవితా యుగ ప్రయోక్త, సమసమాజ సంస్థాపన ప్రవక్త శ్రీశ్రీ చిత్రంతో ఈ విభాగానికి నివాళి అని పేరు పెట్టారు. పలనాటి సీమ పండించుకొన్న ధర్మవేది, చాపకూటితో సమతను నేర్పిన సామ్యవాది బ్రహ్మనాయుడు చిత్రం, సాహితీ సమరాంగణ చక్రవర్తి, కర్ణాటాంధ్ర సమన్వయ నిత్యవిస్ఫూర్తి శ్రీకృష్ణదేవరాలయ చిత్రాలతో తెలుగు వెలుగును చాటారు. అసఫ్ జాహీ వంశ పాలకుడు, ఆర్తజన నిత్య పోషకుడు, మెహబూబ్ అలీఖాన్, గోలకొండనేలిన కుతుబ్ షాహి పాదుషా, రామదాసు భక్తికి చలించిన మనీషా తానీషా, ఆటవెలదిని ఈటెగా విసిరిన దిట్ట, ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట వేమన, కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణి, రామాయణ కావ్యరచనా రసధుని మొల్ల, అగామి కాలజ్ఞాన కర్త, పురోగామి సమాజ సంస్కర్త వీరబ్రహ్మేంద్రస్వామి, గోదావరీ జలాలను పొలాలకు తరలించిన భగీరథుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు సర్ ఆర్ధర్ కాటన్ చిత్రాలను ప్రచురించి తెలుగు జాతికి మరోసారి వీరిని జ్ఞప్తికి తెచ్చారు.
ఈ విభాగంలో ఆరుద్ర, కె.వి.రమణా రెడ్డి, అజంతా, మధురాంతకం రాజారాం, వాకాటి పాండురంగారావుల రచనలు ఉన్నాయి.
13వ తానా మహాసభ
13వ తానా తెలుగు మహాసభ 2001 జూన్ 29, 30, జూలై 1 తేదీలలో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో నాదెండ్ల గంగాధర్ అధ్యక్షతన జరిగాయి. కన్వీనర్లు అల్లాడ జనార్ధనరావు, విజయ సారథి కొసరాజు.
మహాసభలో ప్రదర్శన కోసమే ప్రత్యేకంగా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ‘ఆగతానికి స్వాగతం’ అనే ప్రత్యేక సాహితీ చరిత్రాత్మక రూపకాన్ని రచించారు.
నాదెళ్ళ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలకు శ్రీ రామోజీరావు, రామానాయుడు, నాగేశ్వరరావు, సి.నారాయణరెడ్డి, వెంకయ్యనాయుడు హాజరవడం  విశేషం.
గంగాధర్ నాదెళ్ళ అధ్యక్షతన, ప్రసాద్ తోటకూర కన్వీనర్ గా 3వ ప్రాంతీయ సమావేశం సెప్టెంబర్ 2000లో జరిగింది.  గవర్నర్ వి.ఎస్.రమాదేవి, ముఖ్య అతిథి లోక్ సభ స్పీకర్ జి.ఎమ్.సి. బాలయోగి ప్రధానోపన్యాసకుడుగా, మంత్రి ఎర్రం నాయుడు, అమెరికా కాంగ్రెస్ నుండి మార్టిన్ ఫోరెస్ట్ సమావేశానికి హాజరయ్యారు. డా. వెంపటి చినసత్యం శిష్యబృందం నాట్యం, ఇతర సంగీత కార్యక్రమాలు భారతీయ కళల గొప్పదనాన్ని చాటిచెప్పాయి.
మహాసభలో అవార్డులు అందుకున్న అమెరికాలోని తెలుగు ప్రముఖుల్లో మురళి అట్లూరి (వ్యాపారం), మూర్తి వి.ఎ.బొందాడ (సివిల్ ఇంజనీరింగ్), మాళవికా రావు కలపటపు, ఆదినారాయణ మూర్తి కౌతా, అచ్యుత్ పరుచూరి, సాయిరాణి రవి, ప్రసాద్ తోటకూర, మహాలక్ష్మి తిమ్మన (కమ్యూనిటీ సర్వీస్), ఎస్.ఎస్. రామారావు పప్పు (ఫిలాసఫీ), జె.ఎన్.రెడ్డి (విద్య, పరిశోధన), శారదా పూర్ణ సొంటి (కళ, సాహిత్యం), యుగంధర రావు వల్లభనేని (సామాజిక సేవ), వెంకట రామనాథం వేమూరి (తెలుగు సాహిత్యం) ఉన్నారు.
తెలుగు పలుకు
డా. కిడాంబి రఘునాథ్ నేతృత్వంలో ‘సురభి’ పేరుతో తెలుగు పలుకు ప్రత్యేక సంచికను వెలువరించారు. ఈ సంచికలో ఆంధ్ర సంస్కృతి - నిన్న, నేడు, రేపు  శీర్షికతో వచ్చిన ముఖచిత్రం తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలియజేస్తోంది. ఈ విషయం ప్రధానాంశంగా ప్రముఖుల రచనలను ప్రచురించారు. దీనిని తెలుగుల కీరితిగా వర్ణించారు. దీనికి ఆర్ట్ డిజైన్ కృష్ణ యస్. వేమూరి, కలరింగ్ తరుణ ప్రభల, నిర్వహణ భారతీ భావరాజులు చేసి వారి ప్రతిభని కనబరిచారు.  “గంట చీలియు స్వాతంత్ర గర్జనమ్ము, చేయు చారిత్రకోన్నతి సీమ యందు, కలిసికొను తెల్గుకీరితి వెలుగుక్రమ్మి” అని తెలుగు జాతి కీర్తిని వర్ణించారు.
దీనిలో రచనలు  అయిదు భాగాలుగా ముద్రించారు.
నాలుగవ భాగం యువజన భాగంగా రూపొందింది. దీనిలో అవర్ బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, డిఫరెన్సెస్ ఇన్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బిట్వీన్ ఇండియా అండ్ యు.ఎస్., రేటింగ్ ఇండియా వెర్సెస్ ది యు.ఎస్., అమర చిత్రకథ క్రాస్ వర్డ్ పజిల్, వై హిందూస్ వర్షిప్ డెయిటీస్, మై థాట్స్ ఎక్సాక్ట్లీ, వై యు షుడ్ నో తెలుగు, వర్డ్ స్క్రాంబుల్, తెలుగూస్ సర్ఫింగ్ ది నెట్, ఈజీ కుకింగ్ టిప్స్, వేమనాస్ విజ్ డమ్, ఆన్సర్స్ టు పజిల్ ఉన్నాయి.
ఐదవ భాగంలో వంగూరి చిట్టెన్ రాజు - స్వదేశాంధ్ర ప్రవాసాంధ్ర, విదేశాంధ్ర పెళ్ళి కథ, సత్యం మందపాటి - హరిచ్చెందర మాత్తర్లు, ఉప్పల అనంత సుధాకర్ - హలో స్వర్ణమా, లలిత పిల్లలమర్రి - ఎబిసిడి ఎదురైతే, దివాకర్ పేరి - వేట, కృష్ణ తాడేపల్లి - అసంతృప్తి, రాధిక నోరి - స్వార్థం, మంగళా కందూర్ - ఎవరికోసం బ్రతకాలి, చల్లా సత్యవతి - కమనీయ కోనసీమ, శ్రీనివాస్ ప్రసాద్ పెద్దు - స్పోక్స్ ఆఫ్ లైఫ్, పట్టిసపు రాధ - అత్తగారూ - అమెరికా రండి ఉన్నాయి.
14వ తానా మహాసభలు
ముత్యాల పద్మశ్రీ అధ్యక్షతన మహిళోన్నతి
తానా చరిత్రలో ముత్యాల పద్మశ్రీని అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం గొప్ప మలుపు. స్త్రీ పురుషుల సమానత్వాన్ని మాటలలో కాక తానా ఆచరణలో చూపెట్టింది. అమెరికాలోని భారతీయ భాషా సంఘాలలో ఇలాంటి ఘనత తొలిసారి తానాకే దక్కింది.
14వ తానా మహాసభలు శాన్ హోజే నగరంలో 2003 జూలై 3, 4, 5 తేదీల్లో జరిగాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ మహాసభల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా పేరయ్య సూదనగుంట, కన్వీనర్ గా కోమటి జయరాం, సమన్వయకర్తగా సతీష్ చిలుకూరి వ్యవహరించారు. మహాసభల నిర్వహణలో బాధ్యతలు పంచుకున్న కమిటీల్లో సుబా గార్లపాటి, సాంబశివరావు బండారుపల్లి, మల్లికార్జున వేదగిరి, శాంతివర్ధన్ అయ్యగారి, దిలీప్ కొండిపర్తి, భాస్కర్ చదలవాడ, సంజీవని బండారు, శిరీష బత్తుల, విజయ అసూరి, కరణ్ వెలిగేటి, నాగేంద్ర శ్రీనివాస్ చీపురుపల్లి, రాయుడు వృద్ధుల, జయరాం కోమటి, కనపర్తి హనుమాన్ కృష్ణ, గూడూరు రవీంద్ర రెడ్డి, బాబు దుగ్గిరాల, రమేశ్ మందలపు, రాధాకృష్ణ హరి, జ్యోతి శర్మ, రజనీరావు, ప్రసాద్ జాలాది, సురేందర్ వంకాయల, వేణుగోపాల్ మన్మె, తిరువీధుల రామకృష్ణ, కూచిభొట్ల ఆనంద్, బాల తంగిరాల, ప్రవీణ్ కుమార్, రాంగోపాల్, శ్రీ జగన్ ఎలిశెట్టి, పినపల శ్రీనివాస్, బొక్కారెడ్డి, ప్రసాద్ దుర్వాసుల, కామేస్ ఈరంకి, అయ్యగారి లలిత, వేదుల స్నేహ, సతీశ్ గూడా, భరత్ కోన, జై వేలూరి, సాంబశివరావు గుళ్ళపల్లి, శంబూరావు, కిరణ్ ప్రభ, రాంప్రసాద్ కోమటి, ఉదయ్ ఆర్ మామిడి, శ్రీనివాస్ మంగిపూడి, యుగంధర్ కరకల రెడ్డి, వీరు వుప్పల,  సతీశ్ అంబటి, శ్రీనివాస్ కుదరపల్లి, శ్యామలా రాజేందర్  ఉన్నారు.
డిసెంబరు 18 2002లో కాకినాడలో తెలుగు జానపద సాంస్కృతిక కళోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ మహాసభలలో తానా అవార్డులు అందుకున్నవారు - ఆంజనేయులు కొత్తపల్లి (ఎయిరోనాటిక్స్), రాధాకృష్ణ చెట్టి పందిపాటి (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఆశారెడ్డి (న్యాయశాస్త్రం), రామ్ నున్నా (సమాజసేవ), అప్పారావు ముక్కామల (మెడిసిన్), శైలజా కిరణ్ (మహిళా యాజమాన్యం), టి. సుబ్బరామిరెడ్డి (వ్యాపారం, రాజకీయం, సాంస్కృతిక రంగాలు), కాకర్ల సుబ్బారావు (ఆరోగ్య సంరక్షణ), లక్ష్మీనారాయణ గిడుతూరి (శిల్పకళ), రమేశ్ బాబు రాయపు (సమాజ సేవ, మెడిసిన్), జాస్తి వెంకట రత్తయ్య (సమాజసేవ), ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ (పరిశ్రమ, సమాజసేవ, విద్య), గుత్తికొండ రవీంద్రనాథ్ (రసాయన శాస్త్రం, సమాజసేవ) ఉన్నారు. తానా రజతోత్సవాల్లో కార్యదర్శిగా అమూల్యమైన సేవలందించిన నల్లమల వెంకటేశ్వరరావుకు తానా ప్రత్యేక అవార్డును ఇచ్చి సత్కరించింది. వీరిలో శైలజా కిరణ్, సుబ్బిరామిరెడ్డిలకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డులు అందజేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజారంజకంగా ఉపన్యసించారు.
తానా రజతోత్సవాల సందర్భంగా తానా ప్రచురణల కమిటీ, కథాసాహితి కలిసి సంయుక్తంగా తెలుగు కథ, నవలల పోటీని నిర్వహించింది. తానా ప్రచురణల కమిటీకి అధ్యక్షులుగా జంపాల చౌదరి వ్యవహరించారు. ఈ కథల పోటీల్లో అక్కిరాజు భట్టిప్రోలు, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, వి. ప్రతిమ మొదటి బహుమతులు, కె. వరలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, జాతశ్రీ రెండవ బహుమతులు పొందారు. నవలల పోటీలో అర్హమయిన నవల ఏదీ రాకపోయినప్పటికీ చంద్రశేఖర్ అజాద్ రచించిన నవలకు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు.
తెలుగు పలుకు
గుండా శివచరణ్, నల్లమోతు ప్రసాద్, తిరువీధుల రామకృష్ణ, జంపని శశిధర్ సంపాదకులుగా కిరణ్ ప్రభ ముఖ్య సంపాదకులుగా తానా రజతోత్సవ సంచిక వచ్చింది. కరుణాకర్, కుంచి చిత్రాలతో ఆర్టిస్ట్ నస్రీమ్ చే ముఖచిత్రం రూపొందించబడింది. ముత్యాల పద్మశ్రీ 14వ తానాసభకు అధ్యక్షురాలుగా ‘ముత్యమంత మాట’ అనే ముందుమాటతో ఈ సంచిక మహిళా పాముఖ్యత గల సంచికగా రూపుదిద్దుకుంది. ఈ ప్రత్యేక సంచికలో ‘మీ ముందున్న సాహితీ సీమలోని వెన్నెలవాడలు’  అనే శీర్షికతో దీనిలో ఉన్న విషయాలను తెలియచేశారు. తానా తెలుగు పలుకు ప్రతి సంవత్సరం నిర్వహించే తానా-కథాసాహితి-2003 కథల, నవలల పోటీలో బహుమతి పొందిన కథలని ఒక భాగంగా పెట్టారు.
రెండవ భాగం కవితా కౌముది. దీనిలో కొన్ని వర్ణ ఋతువులూ, కొన్ని పుప్పొడి రాగాలూ, కొన్ని జీర్ణస్మృతులూ, కొన్ని చేతికందిన స్వర్గాలు అన్నీ కలిసి కురిసిన కవితా కౌముది కాంతులు….  పసునూరు శ్రీధర్ బాబు, ముకుంద రామారావు, శ్రీకాంత్ కొడాలి మంచికంటి, బచ్చోటి శ్రీధరరావు, ఏల్చూరి విజయ రాఘవరావు, ఈరంకి వెంకట కామేశ్వర్, తాటిపాముల మృత్యుంజయుడు, కలశపూడి శ్రీనివాసరావు, నచకి, చంద్ర కన్నెగంటి, శాంతి నేమాని, యస్. మునిసుందరం, విజయలక్ష్మి నడింపల్లి, ఉమ రామానుజం ఇయ్యుణ్ణి, సన్యాసి, విన్నకోట రవిశంకర్, డా. ఎన్. గోపి, మహెజబీన్, డా. బోయిన వెంకటేశ్వరరావు, జయప్రభ, కూచి, సత్యం మందపాటి, సుదేరా, నాదెళ్ళ అనూరాధ, నిశాపతి, డా. సి.నారాయణరెడ్డి, నిడదవోలు మాలతి, కంచి శేషగిరిరావు, ఆర్డియల్, నిఖిలేశ్వర్,  నగ్నముని, డా. వాసా ప్రభావతి, మందరపు హైమవతి, యర్రంశెట్టి పాప, జంధ్యాల వేంకట రామశాస్త్రి.
మూడవ భాగం వ్యాస కౌముది. గత పాతికేళ్ళలోని తెలుగు సాహిత్య పరిణామాల విశ్లేషణా, పాతికేళ్ళ ప్రవాసాంధ్రుల జ్ఞాపకాల చిత్రణా ఇదంతా వ్యాసాల వెన్నెల వెలుగుల ప్రాంగణం… ఇందులో వంగూరి చిట్టెంరాజు, వేమూరి వేంకటేశ్వరరావు, తుషార, అడుసుమల్లి దేవేంద్రరావు, పద్మశ్రీ డా.ఎస్.వి.రామారావు, అపర్ణ మునుకుట్ల గునుపూడి, మారేపల్లి వెంకటశాస్త్రి, శారదాపూర్ణ శొంఠి, యండమూరి వీరేంద్రనాథ్, పోతుకూచి సాంబశివరావు, డా. ముదిగొండ శివప్రసాద్, కోడూరి శ్రీరామమూర్తి, డా.పోరంకి దక్షిణామూర్తి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, డా. కె. రామమోహనరాయ్, గరికపాటి పవన్ కుమార్, కొట్టి రామారావు, సి.ఎస్.నారాయణ, విజయ ఆసూరిల రచనలున్నాయి.
నాలుగవది కథా కౌముది. ఆలోచింపచేసే సంభాషణలూ, మనసుని కదిలించే సంఘటనలూ, వ్యక్తిత్వాలని అద్దంలో చూపించే కథనాలూ, సొంతవూరి జ్ఞాపకాలూ, వయసు మళ్ళిన అమ్మా నాన్నల ఆలోచనలూ, వలపు వాగులో కొట్టుకెళ్ళే యువ జంటల కేరింతలూ, పల్లెపట్టుల జీవితాలూ, అమెరికా అనుభవాలూ …. వెరసి, అన్నీ కలిసి కథా కౌముది తోరణాలు ….  ఇందులో గంథం యాజ్ఞవల్క్య శర్మ, సలీం, కె.వి.గిరిధరరావు, కాంట్రగడ్డ దయానంద్, పాలెపు బుచ్చిరాజు, వంగూరి చిట్టెన్ రాజు, పులికంటి కృష్ణారెడ్డి, యార్లగడ్డ కిమీర, జలంధర, వసుంధర, శైలజారావ్, బోయ జంగయ్య, కె.కె.మీనన్, పట్టిసపు రాధా మహాలక్ష్మి, ముదిగంటి సుజాతారెడ్డి, డి. కామేశ్వరి, లావణ్య మందలపు వేంసాని, పి.యస్. నారాయణ, అవసరాల రామకృష్ణారావు, గొర్తి బ్రహ్మనందం, బీనాదేవి, శ్రీవిరించి, తమ్మినేని యదుకుల భూషణ్, కాశీభట్ల వేణుగోపాల్, సూర్యకుమారి ఉపాధ్యాయుల, ఆరె పద్మజా చౌదరి, అల్లాడి మల్లేశయ్య, నెమలూరి భాస్కరరావు, శ్రీ సుభా, ఘంటికోట బ్రహ్మాజీరావు, సీతాసత్య, తురగా జయశ్యామల రచనలున్నాయి.
15వ తానా మహాసభ
గ్రామీణ వికాసం - తీరాన విన్యాసం
15వ తానా మహాసభ డెట్రాయిట్ లో 2005 జులై 1-3 వరకు జరిగింది. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఈ సమ్మేళనాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి, కేంద్రమంత్రి రేణుకా చౌదరి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు తమ సందేశాలు పంపారు. నవనీత కృష్ణ గొర్రెపాటి తానా అధ్యక్షులుగా, కె.సి. ప్రసాద్ 15వ తానా మహాపర్వాల ఛైర్మన్ గా, కొడాలి శ్రీనివాసరావు సమన్వయకర్తగా, చాపల మడుగు ఉదయకుమార్ సహ సమన్వయకర్తగా, బొప్పన ద్వారకా ప్రసాద్ కార్యదర్శిగా, కాకరాల మహీపాల్ రావు కోశాధికారిగా వ్యవహరించారు. ఈ సమ్మేళనంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో బోడెపూడి శ్యాంబాబు, కోనేరు శ్రీనివాస్, బండ్లహనుమయ్య,  మండవ శరణ్య, విష్ణుభొట్ల  రామన్న, సతి మల్లికార్జున రెడ్డి, బిక్కిన సాయి రమేశ్, గుత్తా రామకృష్ణ ఉన్నారు.
మిచిగన్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక అతిథిగా, హ్యూస్టన్ చిన్మయా మిషన్ సెంటర్ అధికారి శ్రీ గౌరంగా బాహి సమావేశానికి హాజరయిన ఆహుతుల నుద్దేశించి ఉపన్యసించారు.
ఈ మహాసభలో తానా అవార్డులు పొందిన వారు కల్యాంపూడి ఆర్.రావు, వెలగపూడి దత్, బి. రామలింగరాజు, వేమూరి బలరాం (తెలుగు పత్రికా మొగల్), యలమంచిలి చౌదరి (పరిశ్రమ), శ్రీధర్ పోలవరపు, మూర్తి కట్టా (సైన్స్), సి. చెన్నారెడ్డి (శాస్త్రవేత్త), రాఘవరావు పోలవరపు, బోడేపూడి శివకోటేశ్వరరావు, భాస్కరరావు ముత్యాల, వెంకటేశ్వర్లు జాస్తి, కిడాంబి రఘునాథ్, కోటపాటి సాంబశివరావు, హేమలతా లవణం (కమ్యూనిటీ సేవలు), మురళీ గుత్తికొండ, శివకుమార్ కలపాటపు, ముసునూరు కోటేశ్వరరావు, సత్యనారాయణ రాజు కొత్తకూర (మెడిసిన్), శారదా పూర్ణశొంఠి, గుమ్మలూరు శాస్త్రి (సంస్కృతి), తిరుపతి ఆర్. చందుపట్ల, జి.వి.ఎస్.రాజు, వెంకటరావు మూల్పూరు (ఇంజనీరింగ్), నీలా డి. తంగడ, కౌశిక్ కోమరాజు (యువప్రతిభ), సుబ్బారావు కొడాలి, విష్ణు కలవల, బండారు రాధాకృష్ణమూర్తి (ప్రత్యేక గుర్తింపు) ఉన్నారు. వీరిలో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డులు కల్యాంపూడి ఆర్.రావు. వెలగపూడి దత్.కు ప్రదానం చేశారు. బి. సత్యం రామలింగరాజుకు ఈ దశాబ్దపు టెక్నోక్రాట్ అవార్డును ప్రదానం చేశారు.
తెలుగు పలుకు
ఆరి సీతారామయ్య ముఖ్య సంపాదకుడుగా మద్దిపాటి కృష్ణారావు, వాసిరెడ్డి నవీన్, సహసంపాదకులుగా వెలువడిన విశిష్ఠ సంచిక. ఇందులో ఇంగ్లీషు, తెలుగు విభాగాలు ఉన్నాయి. సంపాదకుల కృషి ప్రత్యేకత ఈ సంచికలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు విభాగంలో 21 రచనలు ఉన్నాయి. కార్టూన్లు సంచికకు ప్రత్యేకతను సమకూర్చాయి.  భద్రిరాజు కృష్ణమూర్తి, కె. రంగనాథాచార్యులు, వాసిరెడ్డి సీతాదేవి, అట్లూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, వేమూరి వెంకటేశ్వరరావు, నందివాడ ఉదయభాస్కర్, నవోదయ రామ్మోహనరావు, కాంట్రగడ్డ దయానంద్, ఎదిగంటి సుజాత రెడ్డి, బచ్చోటి శ్రీహరిరావు, వెలగా వెంకటప్పయ్య, విఠల జానకిరామ శాస్త్రి, కందాళ శ్రీనివాసాచార్యులు, అఫ్సర్, జె. కృష్ణమోహనరావు, ఆర్.ఎమ్. ఉమామహేశ్వరరావు, కొచ్చర్లకోట బాపారావు, పప్పు సూర్యకాంతం, కాత్యాయనీ విద్మహే, పారనంది లక్ష్మీ నరసింహం తెలుగు రచనలు ఇందులో వెలువడ్డాయి. చిరునామా శీర్షికన రచయితల వివరాలివ్వడం, ఫోటోతో సహా ప్రచురించటం చాలా ఉపయోగకరంగా ఉన్నది.  తానా సంఘ సభ్యుల ఫోటోలు, చక్కగా ప్రచురించారు.
16వ తానా మహాసభ
తెలుగు మన వెలుగు - మన భావం మన జీవం
16వ తానా మహాసభలు, 2007లో వాషింగ్టన్ డి.సి.లో డా.యడ్ల హేమప్రసాద్ సమన్వయకర్తగాను, బండ్లహనుమయ్య అధ్యక్షులుగా జరిగాయి. 14,000 మంది సమావేశాలకు హాజరయ్యారు. విశిష్టత ఏమంటే అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్  బిజినెస్ సెమినార్ లో సుదీర్ఘ ఉపన్యాసం చేసారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మహాసభల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. యువసమ్మేళనంలో భాగంగా 200 మంది యువత పాల్గొన్నారు. 10 యువ జంటలకు వివాహ సంబంధాలు కుదిరాయి.
16వ తానా మహాసభల  డా. జంపాల చౌదరి స్వాగతంతో ప్రారంభమయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  తన ప్రసంగంలో క్లింటన్ అధ్యక్షత కాలంలోని ప్రాధాన్యతను, ఆయన భారత సందర్శనను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు రాకను ప్రస్తావించి ఒక ప్రత్యేక కోరిక వెలిబుచ్చారు. ప్రపంచంలో మతం అనేది ప్రధానమైన ఇబ్బందికరమైన సమస్యగా పరిణమించిందని ఈ విషయం క్లింటన్ పట్టించుకొని ప్రపంచ శాంతికి కృషి చేయాలని అర్థించారు. మతం అనేది చాలా ఛాందసంగా మారిందని దానిపేరిట ప్రజలు పరస్పరం ద్వేషించుకుంటున్నారని శాంతికి భంగం కలిగించే ఈ సమస్యను చేబట్టి క్లింటన్ మార్గం చూపాలని కోరారు.
బిల్ క్లింటన్ తన సుదీర్ఘోపన్యాసంలో తన ఇండియా సందర్శనను పార్లమెంటులో ప్రసంగించడాన్ని చాలా ఆప్యాయంగా ప్రస్తావించారు. “భారతదేశానికి అమెరికాకు ఉన్న వైషమ్యాలు తొలగించి సుహృద్భావం ఏర్పరచటానికి కృషి జరిగిందన్నారు. తనకంటే ముందే భారతదేశాన్ని సందర్శించిన తన భార్య, కుమార్తె దేశ విశిష్ఠతను గురించి తనకు చెప్పారని వెల్లడించారు.  క్లింటన్ తన ప్రసంగంలో ఎయిడ్స్ వ్యాధికి పరిష్కార కృషిని ప్రధానంగా చెప్పి అది తనకు సంతృప్తి కలిగించిందన్నారు. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం వలన వేడి పెరిగి అనేక సమస్యలు తలయెత్తుతున్నాయని మరొకవైపు పేదరికం పెద్ద తలనొప్పిగా పరిణమించిందని చెప్పారు.  క్లింటన్ ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగువారికి కృతజ్ఞతలు చెబుతూ కళలు, సంస్కృతిలో వారి పాత్ర గణనీయంగా ఉన్నదన్నారు. తన హైదరాబాదు పర్యటన చిరస్మరణీయమైనదని కూడా గుర్తుకు తెచ్చుకున్నారు. గుజరాత్ లో రెండువేల ఒకటిలో సంభవించిన భూకంపం వలన జరిగిన నష్టాన్ని పూడ్చటానికి తగిన కృషి జరిగిందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు జరుగుతున్న కృషి తనకు ప్రత్యేకంగా సంతృప్తినిచ్చిందన్నారు. భారతదేశంలో పెరుగుతున్న పిల్లల ఆరోగ్యం కార్యక్రమాలలో అమెరికా తగినంత చేయూతనివ్వ గలుగుతుందని చెప్పారు.  భారతీయులు అమెరికాలో అనుభవిస్తున్న అభివృద్ధి ప్రపంచ ఆర్థిక విధాన ధోరణులకు నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలలో అసమానత్వం ఆదాయాల వ్యత్యాసం విద్య ఆరోగ్యంలో లోపాలు  ప్రధాన విషయాలుగా పరిణమించాయన్నారు. హింస వలన చాలా చోట్ల భద్రతా రాహిత్యం ఏర్పడిందన్నారు. ఇండియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాల పోషణకు విపరీతంగా ఖర్చు పెట్టకపోతే ఇంకా ఎంతో సంపన్నులయ్యేవారన్నారు. ఆర్థిక రంగాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరుద్యోగం తొలగించుకోవడానికి క్లింటన్ తన ప్రసంగంలో వివిధ సూచనలు చేశారు. మీ భాషని, సంస్కృతిని గురించి గర్వంగా చెప్పుకోవటం అవసరమని అందుకు మీరు సమావేశమయ్యారని అది ఆహ్వానించదగిన విషయం అని చెప్పారు. క్లింటన్ తన ప్రసంగంలో వివిధ ప్రపంచ సమస్యలను సంక్షిప్తంగా ప్రస్తావించారు. 21వ శతాబ్దంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకంటే భారత, చైనా, యూరోపు ఆర్థిక వ్యవస్థలు బాగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. సర్వ మానవ సమానత్వం సాధించటం భవిష్యత్తులో సాధ్యమేనని మన మనుమలు, ముని మనుమలు అలాంటివి చూడగలుగతారని క్లింటన్ ఆశాభావం వ్యక్తపరిచారు.”
యడ్ల హేమ ప్రసాద్ ధన్యవాదాలు చెపుతూ క్లింటన్ తానా సభలో పాల్గొనటం గర్వంగా తెలుగు ప్రజలు చరిత్రలో ప్రస్తావిస్తారన్నారు.  క్లింటన్ గ్రంథం నుంచి ఒక ఆకర్షణీయమైన సన్నివేశాన్ని సభకు చదివి వినిపించి హర్షధ్వానాల మధ్య ముగించారు. కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్, డేవిడ్ ప్రసాద్ ఆ సభలో క్లింటన్ ఫౌండేషన్ కు ఒక మిలియన్ డాలర్లు దానం చేయటం పేర్కొనదగిన అంశం.
తానా వాషింగ్టన్ సమావేశంలో జరిగిన స్త్రీల సమస్యలపై చర్చ ప్రత్యేకంగా పేర్కొనదగినది. గృహిణుల అవగాహనపై వివిధ కోణాల నుండి చర్చ సాగింది. దీనికి డాక్టర్ నవీన హేమంత్ ఆధ్వర్యం వహించారు. ఇందులో సుమిత్రా రెడ్డి, ఆవుల మంజులత, జ్యోతిర్మయి ఆలపాటి, ఆశా సంస్థ నిర్వాహకురాలు పద్మ, సినీనటి లక్ష్మి మంచు చర్చలు చేశారు.
శ్రీమతి జయప్రద తానా సమావేశాల ఏర్పాట్లు, విందు సౌకర్యాలు పర్యవేక్షించి కోగంటి జయరాం సహకారంతో 60,000 మంది సంతృప్తిగా పాల్గొనటానికి సహకరించారు.
సభలకు ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణ, కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరి పాల్గొని ప్రసంగించారు.
ఆ సభలలో సుప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుకు, తెలుగు ఆచార్యులు వెల్చేరు నారాయణరావుకు జీవిత పురస్కారం అందించారు. తెలుగు ప్రాధాన్యతను వివరించే విధంగా అమెరికాలో తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో  మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగు విజయం నాటికను ప్రదర్శించారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో పరుచూరి గోపాల కృష్ణ, మురళీ మోహన్, సుద్దాల అశోక్ తేజ, జొన్న విత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. మణిశర్మ పాటలు రక్తికట్టించగా, వెల్చేరు నారాయణరావు ఇంగ్లీషులోకి అనువదించిన గురజాడ కన్యాశుల్కాన్ని ఆవిష్కరించారు. ఎబికె ప్రసాద్, సి.ధర్మారావు, తెలుగు సంరక్షణకు  చేపట్టవలసిన అంశాలు చర్చించారు. నటీమణులు ఇలియానా, పార్వతి  మెల్చిన ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనలో పాల్గొన్నారు.
తెలుగు పలుకు
జక్కంపూడి సుబ్బారాయుడు సంపాదకుడుగా వెలువడిన సంచిక రెండు విభాగాలుగా ప్రచురించారు. ఇంగ్లీషులో తానా వివిధ సంఘాల గురించి, దాతల గురించి, కార్యకలాపాల గురించి వివరాలు ఇచ్చారు. విశిష్ఠ పురస్కారాలు అందుకున్న వారి సమాచారం చక్కగా పొందుపరిచారు. ఈ సంచికలో ఒక ప్రత్యేకమైన వ్యాసం అందరి దృష్టిని ఆకర్షించేదిగా వెలువడింది. తానాకి పునాదులు వేసిన డా. గుత్తికొండ రవీంద్రనాథ్ ఆ చరిత్రను సంక్షిప్తంగా రాశారు. రెండవ విభాగంలో తెలుగులో వివిధ రచనలు, చక్కగా వెలువరించారు. సందేశాలు ప్రకటనలు యధావిధిగానే ఉన్నాయి. సంచికలో విశిష్టరచనలు అందించిన వారు - చినజీయరు స్వామి, టి. గౌరీశంకర్, జయంతి రామయ్య పంతులు, కె.కె.రంగనాథాచార్యులు, అనసూయా రెడ్డి, బుడ్డిగ సుబ్బరాయన్, కొలిచాల సురేష్, ఆవుల మంజులత, సి. ధర్మారావు, ఎ.బి.కె. ప్రసాద్, రమేష్, చేకూరి రామారావు, తాడికొండ శివకుమార శర్మ, ఇందూరు నిరంజన్, కలలపూడి మంజూష, తిరుమల కృష్ణదేశికాచార్యులు, కె.శివారెడ్డి, శైలజామిత్ర, కందుకూరి శ్రీరాములు, వేమూరి వెంకట రామనాథం, బచ్టోటి శ్రీధరరావు, తమ్మర శేషగిరిరావు, గంటి ఉదయభాస్కర్, మేకా రామారావు, శొంఠి శారదాపూర్ణ, శీమనపల్లి విజయలక్ష్మి, వండ్లూరి సుధాకర్, చాకలకొండ రమాకాంతరావు, కాళ్లూరి శివరాజు, శిఖామణి, విశ్వనాథ శ్రీనివాస్, పెద్దింటి శేషుబాబు, బుచ్చిరెడ్డి, పాపినేని శివశంకర్, నందిని సిద్ధారెడ్డి, కోలగొట్ల సూర్యప్రకాశరావు, పెరుగు రామకృష్ణ, ఆవాల దామోదరరెడ్డి, వేదుల చిన వెంకట చయమలు, సుధీర, నన్నపనేని అంకినీడు, జంధ్యాల జయకృష్ణ బాపూజీ, బత్తుల సుబ్రహ్మణ్యం, తల్లాప్రగడ పూర్ణం, యలమంచిలి గాంధీజీ, కటారి నెహ్రూ, పులిగండ్ల రామకృష్ణ, కొండూరి రామశర్మ, సహవాసి, ఇనగంటి వెంకటరావు, వఝ్జ బాబూరావు త్రిపురనేని వెంకటేశ్వరరావు, యార్లగడ్డ బాలగంగాధరరావు, వడ్డెంగుంట అంకయ్య, కొమ్మినేని వెంకటరామయ్య, ఆచార్య ఎం.జి.రంగా, తుమ్మల సీతారామ మూర్తి చౌదరి, జక్కంపూడి సీతారామారావు, వోల్గా, నాగళ్ళ గురుప్రసాదరావు, పాపినేని శివశంకర్, తోటకూర సత్యనారాయణ రాజు, నరిసెట్టి ఇన్నయ్య, పరిణం శ్రీనివాసరావు, బత్తుల సుబ్రహ్మణ్యం, నాగ్ నాథ్, శొంఠి శారదాపూర్ణ, ముక్కామల అప్పారావు, యం. రామమూర్తి, దామర్ల ప్రియాంక, స్వామీ చిదాత్మానంద, యార్లగడ్డ కిమీర మొదలగువారి రచనలు ఉన్నాయి. చాలా ఎక్కువమంది రచయితలకు ఈ సంచికలో స్థానం లభించింది. రచయితల వివరాలు  చివరలో పొందుపరిచారు. కొన్నిచోట్ల వివిధ ప్రముఖుల ఫోటోలు, తానా వివిధ సంఘాల వారి ఫోటోలు, సంచికకు గౌరవాన్ని ఆపాదించాయి.
17వ తానా మహాసభ
సాంకేతిక వికాసం - సాంస్కృతిక విన్యాసం
17వ తానా మహాసభలు జూలై 2 - 4, 2009, చికాగోలో కాకరాల ప్రభాకర్ అధ్యక్షతన, యడ్లపాటి యుగంధర్ సమన్వయ కర్తగా జరిగాయి. యలవర్తి రామరాజ భూషణుడు తన చతురోక్తులతో కార్యక్రమాలను పరిచయాలు చేశారు. వాడ్రేవు వైజయంతి సంధానకర్తగా ఆకర్షణీయ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో నాటి రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, భారత కాన్సల్ జనరల్ అశోక్ కుమార్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ పాల్గొన్నారు. రిజర్వుబాంకు గవర్నర్ గా ఉన్న డా. వై. వేణుగోపాల రెడ్డి అర్థవంతమైన కీలకోపన్యాసం చేశారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్ ఛైర్మన్  శ్రీమతి జానకి నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభకు వివరించారు. అమెరికా విశ్వవిద్యాలయాలలో తెలుగు భాషాభివృద్ధికి జరుగుతున్న కృషిని కాకరాల ప్రభాకర్ వివరించారు. తానా పక్షాన జరుగుతున్న సేవా కార్యక్రమాలు కూడా సభ ముందుంచారు. తానా అధ్యక్షుడుగా నల్లమోతు సత్యనారాయణ చేసిన కృషికి ఆయనకు నివాళులర్పించారు. వివిధ రంగాలలో నిపుణులకు అవార్డులందించారు. శ్రీశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు, త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి కుటుంబరావు,  రేడియో అక్కయ్య, శతజయంతి సందర్భాలను సభికులకు తెలియజేశారు.
సమావేశ ఆరంభ నృత్యం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకంగా రచించిన సాంకేతిక వికాసం, సాంస్కృతిక విన్యాసం గేయరూపకం అపూర్వమైన ప్రశంసలు పొందింది.
తానా పక్షాన జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను నన్నపనేని మోహన్ వివరించారు. తానా ట్రస్టీలు ఫౌండేషన్ పక్షాన నాటి అధ్యక్షురాలు జానకీరావు సంక్షిప్త వివరణ చేశారు. తానాకు అధ్యక్షులైన కోమటి జయరాం భవిష్యత్తులో తానా తలపెట్టనున్న కార్యక్రమాలు ప్రస్తావించారు. సభలలో జరిగిన  నాటికలు, రూపకాలు ఆటలు నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తానా ఒక ప్రత్యేక సంచికను కూడా వెలువరించింది.
లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు ఎస్. పి. (శ్రీపతి పండితారాధ్యుల) బాలసుబ్రహ్మణ్యం,  తెలుగు తేజం రోల్ మోడల్ అవార్డు  గల్లా రామచంద్ర నాయుడు, డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు (ప్రెసిడెంట్ పక్షాన) - సుదర్శన్ అక్కినేని, డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు (కో ఆర్డినేటర్ పక్షాన) ఎమ్. మురళీ మోహన్,  డి. కిషోర్ , గారపాటి ప్రసాద్, పైలా మల్లారెడ్డి పొందారు.
తెలుగు పలుకు
జంపాల చౌదరి సంపాదకులుగా వాసిరెడ్డి నవీన్ సహాయ సంపాదకులుగా ఉన్న తెలుగు పలుకుకు చిత్రకారుడు చంద్ర ఆర్ట్ సమకూర్చారు. ఎన్. కృష్ణారెడ్డి, 1982లో వేసిన ఫిష్ చిత్రాన్ని ముఖచిత్రంగా వేశారు. ఈ సంచికకు ఉప్పులూరి వెంకట సుబ్బారావు, అధ్యక్షులుగా, రామరాజ భూషణుడు యలవర్తి ఉపాధ్యక్షులుగా  ఏర్పడిన సంఘం కృషిచేసి మంచి రచనలు వెలికి తెచ్చారు. ఇందులో 5 విభాగాలుగా రచనలు సమకూర్చారు. రచయితలలో పాపినేని శివశంకర్, కొంపల్లె రవిచంద్రన్, రస్మి బాలసుబ్రహ్మణ్యం, పొత్తూరి వెంకటేశ్వరరావు, వేమూరి బలరాం, ఎన్. ఇన్నయ్య, ఎస్.వి.రామారావు, ఓల్గా, మహమ్మద్ ఖదీర్ బాబు, మృణాళిని, సాయిచంద్, పప్పు సూర్యకాంతం, వంగూరి చిట్టెంరాజు, కాండ్రేగుల నాగేశ్వరరావు, శివాజి, కందుకూరి రమేశ్ బాబు, వి. శ్రీనివాస్, నరసింహారావు, కె.ఆర్. చౌదరి, చుక్కారామయ్య, రెంటాల జయదేవ, టంకశాల అశోక్, కె. రామచంద్రమూర్తి, ఎ.కె.ప్రభాకర్, రాష్ట్రంలో సమాచార సాంకేతికాలను గురించి డాక్టర్ అనిల్ కె. జంపాల వ్యాసం, నిర్మలాదిత్య, వైదేహీ శశిధర్, నారాయణస్వామి, చంద్ర కన్నెగంటి, మాచిరాజు సావిత్రి, విన్నకోట రవిశంకర్, సత్యం మండపాటి, నారాయణస్వామి, అల, పూడిపెద్ది శేషుశర్మ, యస్విరామారావు,  నచకి, జె.యు.బి.వి. ప్రసాద్, వేమూరి వెంకటేశ్వరరావు, కృష్ణ కొండూరి, రాఘవేంద్ర ఇచ్చాడ, సాయి బ్రహ్మానందం గొర్తి, రాహుల్ పావులూరి, రామకృష్ణ వెలమాటి, శారదా పూర్ణ శొంఠి.
ఈ సంచికలో రచనల సేకరణకు జరిపిన కృషి స్పష్టం.
18వ తానా మహాసభ
తెలుగు యువత - ప్రగతికి ప్రతీక
కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో 2011, జూలై 1, 2, 3 తేదీలలో జరిగిన 18వ తానా మహాసభలకు  8000 మంది తెలుగువారు హాజరయ్యారు. ఆంధ్ర నుండి కళాకారులూ, రాజకీయ ప్రముఖులూ, వ్యాపారవేత్తలూ పాల్గొన్నారు.
జయరాం కోమటి అధ్యక్షులుగా, సతీష్ చిలుకూరి సమన్వయకర్తగా వందలాది కార్యకర్తల సహకారంతో సభలను ఎంతో జయప్రదంగా నిర్వహించారు.  భారత దేశ ఉప రక్షణ మంత్రి పళ్ళంరాజు, మంత్రులు శ్రీమతి గల్లా అరుణ కుమారి, పితాని సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, మధుయాష్కీ గౌడ్, ఎన్. వేణుగోపాలరెడ్డి, కమ్యూనిష్టు పార్టీ ప్రముఖులు రాఘవులు, నారాయణ, ప్రసార మాధ్యమ ప్రముఖులు ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ, టీవీ 9 కార్యక్రమాల నిర్వాహకులు రవి ప్రకాష్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ  ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి తానా ప్రముఖులు జంపాల చౌదరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ముఖ్య అతిధి ఉప రక్షణ మంత్రి  పళ్ళంరాజు – “భారతదేశంలో పల్లె ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని, ప్రవాసాంధ్రులు మాతృదేశానికి తమ సేవలు అందించాలని” కోరారు.  క్రికెట్ లో ప్రపంచ కప్పు సాధించిన విషయం గుర్తు చేస్తూ,  విజయానికి మూల కారణం పల్లె ప్రజలేనని అన్నారు.
మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ – “ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడూ మాతృ దేశానికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కీ తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత వెనక్కి తిరిగివ్వాలని,  ప్రతి ఒక్కరూ తమ తమ తల్లితండ్రుల్ని సంతోషపరిచి ఆదరించాలని” కోరారు.  
తానాలో సాంస్కృతిక కార్యక్రమాలకి శ్రీమతి విజయ ఆసూరి  సారధ్యం వహించి,  కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల కార్యక్రమానికీ దిశానిర్దేశకత్వం వహించిన సతీష్ చిలుకూరి, నాదెండ్ల జయప్రకాష్, 300 మంది పైగా వలంటీర్లు కార్యక్రమాలు పూర్తిచేశారు.
మూడు రోజుల్లో సాహితీ కార్యక్రమాలూ, అష్టావధానమూ, బిజినెస్ సెమినార్లూ, ప్రజా ప్రతినిధుల జనవేదిక, ఫిల్మ్ అండ్ ఫొటోగ్రఫీ సమావేశాలూ, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఎన్.కౌంటర్ విత్ రవిప్రకాష్, వుమెన్స్ ఫోరం, దైవ సంబంధిత కార్యక్రమాలూ, ఆర్థిక సెమినార్లూ, జనరంజకమైన సాంస్కృతిక కార్యక్రామాలూ ఆహుతులను ఆహ్లాదభరితంగా  అలరించాయి.
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, కౌసల్య, ప్రణవి, దీపుల సంగీత విభావరి ప్రేక్షకులని ఉర్రూతలూగించింది.   సభాసదులను సమ్మోహన పరుస్తూ  నందమూరి బాలకృష్ణ "రాజ రాజ నరేంద్రుడిగా" నటించిన చారిత్రాత్మక నాటకంలో పరుచూరి గోపాల కృష్ణ, గుమ్మడి గోపాల కృష్ణ, ఏ.వీ.ఎస్, మురళీమోహన్, సురేఖావాణి, సన, జ్యోతి, జొన్నవిత్తుల. గణేష్ పాల్గొని అలరించారు.  ఏ.వి.ఎస్ బృందం చేసిన “హాస్య వల్లరి” నవ్వులు పండించింది. ఇందులో ప్రదర్శించిన నృత్య నాటికలు, ముఖ్యంగా ప్రవాసాంధ్ర బాలురు నటించిన “కృష్ణా ముకుందా” ప్రదర్శన సభికుల మన్ననలు పొందింది.
మహాసభల్లో వజ్రాల, బంగారు నగల ప్రదర్శన, ఎగ్జిబిట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. తానా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎగ్జిబిట్స్ నిర్వహించినట్లు  రమేష్ మందలపు తెలియపరిచారు.
సమావేశాల విజయానికి మూలకారకులు వాలంటీర్లేనని, వారి శ్రమ, అకుంఠిత దీక్ష కార్యక్రమాలకు బాగా తోడ్పడినట్లు అధ్యక్షులు జయరాం కోమటి, సమన్వయకర్త సతీష్ చిలుకూరి తెలిపారు. ఇదొక అపూర్వ సమావేశంగా - చారిత్రాత్మక విజయంగా అధ్యక్షులు కోమటి జయరాం పేర్కొన్నారు.
18వ మహాసభ తెలుగు సాంస్కృతిక, సాహితీ వైభవాన్నీ ప్రపంచానికి చాటి చెప్పినట్లు సతీష్ చిలుకూరి స్పష్టంచేశారు.
తెలుగు పలుకు
కె.వి. గిరిధరరావు సంపాదకులుగా, నవీన్ వాసిరెడ్డి సహాయ సంపాదకులుగా ఉన్న తెలుగు పలుకుకు చిత్రకారుడు అన్వర్ ముఖచిత్రం సమకూర్చారు.  ‘తెలుగు యువత - ప్రగతికి ప్రతీక’ అనే నినాదాన్ని ప్రకటింపచేసే చిత్రం వేశారు.
ఈ సంచికలో రచనలు చేసిన రచయితలలో కాత్యాయనీ విద్మహే, మృణాళిని, భైరవభట్ల కామేశ్వరరావు, తమ్మినేని యదుకుల భూషణ్, పాలపర్తి ఇంద్రాణి, విన్నకోట రవిశంకర్, డా. వైదేహి శశిధర్, కె. గీత, చంద్ర కన్నెగంటి, పూడిపెద్ది శేషుశర్మ, ఎం.బి.ఎస్. ప్రసాద్, లైలా యెర్నేని, కేతు విశ్వనాథరెడ్డి, వంశీ, మందపాటి సత్యం, అక్కిరాజు భట్టిప్రోలు, తాటిపాముల మృత్యుంజయుడు, డా. నారాయణ గరిమెళ్ళ, జి.కె.అనంత సురేష్, కనకప్రసాద్.
19వ తానా మహాసభ
భాష, సంప్రదాయం, సేవ, అభ్యుదయం
19వ తానా మహాసభ తోటకూర ప్రసాద్ అధ్యక్షతన, మురళీ వెన్నం సమన్వయ కర్తగా 2013 మే 24- 26 తేదీలలో డలాస్ నగరంలో జరిగాయి. మహాసభలలో అమెరికాలో భారత రాయబారి నిరుపమరావు ప్రసంగించగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కీలకోపన్యాసం ఇచ్చారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్గ పర్యాటక శాఖామంత్రి సాధించబూనిన విషయాలు వివరించారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రతినిధులుగా పాల్గొన్నారు. అనేకమంది శాసన సభ్యులు, అలరించిన ప్రధానవేదికలో టి.వి.9 అధినేత రవిప్రకాష్ అనేక సూచన ప్రాయక భావాలు వెల్లడించారు. కెనడాలో భారత సాంస్కృతిక విషయాలను నిర్వహిస్తున్న యార్లగడ్డ లక్ష్మీుప్రసాద్ భాషా ప్రాధాన్యతని వివరించారు. తానా పక్షాన 12 అవార్డులు, తానా అధ్యక్షునిపేరిట 5 అవార్డులు ఇచ్చారు. జొన్నవిత్తుల కూర్చిన ప్రత్యేకమైన పాటలను పాడి సి.డి.గా విడుదల చేశారు.
సాహితీ వేదికను మద్దుకూరి చంద్రహాస్ నిర్వహించారు. అందులో మండలి బుద్ధప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, నరిసెట్టి ఇన్నయ్య, అఫ్సర్, కల్పనా రెంటాల, సత్యనారాయణ ప్రభృతులు పాల్గొన్నారు.  చాగర్లమూడి ఫకీరయ్య నిర్వహించిన వాణిజ్య సదస్సులో స్త్రీల సమస్యలు చర్చించడానికి ఏర్పరచిన సదస్సులో సంక్షిప్తంగా సూచనప్రాయకంగా చర్చలు జరిగాయి. సినీనటి జయసుధ అందులో క్లుప్తంగా ఆకర్షణీయ విషయాలు చెప్పారు.
యువతనుద్దేశించిన చర్చా సమావేశంలో మోహన్ నన్నపనేని తానా చేస్తున్న సేవలు ప్రస్తావించి జాగ్రత్త వహించవలసిన విషయాలు చెప్పారు. విద్యార్థులు, మోసపోకుండా, కోచ్ లు స్వీకరించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసిన ఆవశ్యకతను వెల్లడించారు. సినీ గేయ వైజయంతి అనే ఒక విశిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించి ఆకర్షణీయంగా పాటలు వివరించారు.
మహాసభలలో సినీనటులు చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందం, జయసుధ  ఉపన్యసించారు.  తోటకూర ప్రసాద్ అధ్యక్షుడుగా ముగింపు ప్రసంగాన్ని చేసి, తరవాత ఎంపికైన మోహన్ నన్నపనేనికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తానా మాజీ అధ్యక్షులతో సహా వివిధ ప్రముఖులను పరిచయం చేశారు. బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాటలు, వివిధ నాట్య నృత్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సదస్సు ఈ సమావేశాలలో పేర్కొనదగిన అంశాలు. వేలాదిమంది పాల్గొన్న సభలు ఆనందోత్సాహాల మధ్య ముగిసాయి.
అవార్డులు అందుకున్నవారు  :   రత్నం చిట్టూరి - సంఘసేవకు గుత్తికొండ రవీంద్రనాథ్ అవార్డు,
విశిష్ఠ ప్రతిభా పురస్కారాలు -
అశోక్ బాబు కొల్లా, చౌదరి యలమంచిలి, దాము గేదెల, హరి కొండబోలు, డా. రజని కటిపాముల, రాజు నరిసెట్టి, డా. సాంబరెడ్డి, సుస్మితా కోసూరి, వాసు మాలేపాటి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సహకారంతో 2014 ఉగాది నుండి తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, ఆంధ్ర నాట్యాలలో నాల్గు సంవత్సరాలకోర్సులను ప్రారంభిస్తున్నట్లు తానా ఆధ్యక్షుడు మోహన్ నన్నపనేని, తానా మాజీ అధ్యక్షుడు, "తానా- పొట్టి శ్రీరాములుతెలుగు విశ్వవిద్యాలయ కోర్సుల” కమిటీ చైర్మన్ ప్రసాద్ తోటకూర తెలియచేశారు.
ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నియమ నిబంధనల మేరకు మరియు వారు నిర్దేశించినకోర్సుల ప్రకారం అమెరికాలో వివిధ నగరాలలో వచ్చే ఉగాది నుండికోర్సులను ప్రారంభిస్తున్నట్లు, మొదటి మూడు సంవత్సరాలు తానా సంస్థస్వయంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు, నాల్గవ సంవత్సరం లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ అధికారులు అమెరికా వచ్చి పరీక్షలునిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు విశ్వవిద్యాలయ సర్టిఫికెట్లు ప్రదానంజేస్తారని తెలిపారు. విదేశాలలో తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్యసంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం కోర్సులని నిర్వహిస్తామని” చెప్పారు.
తెలుగు పలుకు
చంద్ర కన్నెగంటి సంపాదకుడుగా, సహసంపాదకుడుగా నవీన్ లతో తెలుగుపలుకు సంచిక వెలువడింది.  ముఖచిత్రం వాసు, చిత్రాలు రాజు ఏపూరి.
మొదటి భాగంలో ఆర్. వి. రామారావు, యార్లగడ్డ బాలగంగాధరరావు, డా. గరికపాటి నరసింహారావు, రెంటాల జయదేవ్, చౌదరి జంపాల, స.వెం. రమేష్, నాగరాజం, వై. సన్నిధానం నరహింహశర్మ, (అమెరికాలో సురక్షిత జీవనం కోసం మార్గదర్శక సూత్రాలు - టీమ్ స్క్వేర్ - రూపకర్తలు,) నన్నపనేని మోహన్, జంపాల చౌదరి, డాక్టర్ రాఘవేంద్ర ఎస్. ప్రసాద్, సుస్మితా కోసూరి, కన్నెగంటి మంజులత, భద్రిరాజు కృష్ణమూర్తి, సి. ధర్మారావుల రచనలున్నాయి.
రెండవ భాగంలో సాయిబ్రహ్మానందం గొర్తి, ఎస్. నారాయణస్వామి, పెద్దింటి అశోక్ కుమార్, లైలా ఎర్నేని, నాని కృష్ణమూర్తి, సత్యం మందపాటి, జి. లక్ష్మి, పొత్తూరి విజయలక్ష్మి, పి. చంద్రశేఖర అజాద్, వి. రాజారామమోహనరావు, మన్నెం  సింధుమాధురి, అక్కిరాజు రమాపతిరావు, శ్రీరమణ, గొల్లపూడి మారుతీరావు, ఎమ్వీయస్ ప్రసాద్, కె.వి.ఎస్. రామారావు, కృష్ణమోహనరావు, మోహన్, హాస్యబ్రహ్మ శంకర నారాయణ, డా. గరికపాటి సత్యనారాయణ, గాయత్రి భోగపల్లి, రాజేష్ వీరపనేని రచనలున్నాయి.
             
యువజన సదస్సులు తానా సభలు జరిపినప్పుడు కాక మరుసటి సంవత్సరం జరిపారు. 2002 తరువాత యువజన సదస్సులు జరగలేదు.  విహారయాత్ర, ఓడయాత్రలు జరిపారు.
2003-2005లో తానా జీవిత సభ్యుల వివరాలతో డైరక్టరీని వెలువరించారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విధులు -
తానా డైరెక్టర్ల బోర్డు తానా రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. నియమ నిబంధనలు అమలు జరిగేటట్టు చూడటం, తానా లక్ష్యాలను సిద్ధపరచి పర్యవేక్షించటం, దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించటం అవరమైనప్పుడు తాత్కాలిక సహాయాన్ని అందించటం దీని విధులలో ఉన్నాయి. తానా నిధులన్నిటిని సక్రమంగా ఖర్చు పెట్టే రీతిలో వీరు దృష్టి పెడతారు.
 
.

No comments:

Post a Comment