స్వాతంత్ర పోరాట రైతు యోధుడు
కన్నెగంటి జగ్గయ్య (1900-1970)
చొక్కా ధరించకుండా తెనాలి లో కర్ర పట్టుకొని తిరుగుతూ కనిపించె కన్నెగంటి జగ్గయ్య రైతులకొరకు జీవితమంతా పోరాడాడు. పిచ్చయ్య ,హనుమాయమ్మ సంతానంగా ఇతానగర్ లో 1900 లో పుట్టాడు .1920లో సీతారామమ్మను వివాహమాడాడు.
1926లో తెనాలిలో త్రిపురనేని రామస్వామితో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా వున్నాడు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ కాగా రాయవెల్లూరులొ జైల్ జీవిథం గడిపి ,అహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు.
1932లో కరాచిలో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెల్లాడు.
1943లో రామస్వామి చనిపోగా, ఆయన సూతాస్రమం కాపాదుతూ వున్నాడు.
ఆవుల గోపాల క్రిష్న మూర్తి అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు.
శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేశాడు. ఢైర్యశాలిగా బ్రతికాడు.
Innaiah Narisetti
కొద్దిపాటి రచనలు కూడా చేశాడు.
1 comment:
Good to know about him. Thanks
Post a Comment