జి. డి. పరేఖ్ - ఇందుమతి Humanist Leaders

జి. డి. పరేఖ్ -


మానవవాద ఉద్యమానికి ఎం ఎన్ రాయ్ భావాల ప్రభావానికి అంకితమైన దంపతులు పరేఖ్ జంట.

జి.డి.పరేఖ్ వున్నన్ని నాళ్ళు ఇందుమతి పరిశీలిస్తూ పోయింది. అప్పట్లో జి.డి.రాడికల్ డెమోక్రటిక్ పార్టీ భాష్యకారుడుగా, సుప్రసిద్ధ వక్తగా పేరొందాడు. వేదిక మీద అనర్గళంగా మాట్లాడుతుంటే పక్కన రాయ్ వుంటే చూస్తూ, జోక్.లు వేస్తూ, ప్రేక్షకుల హర్ష ధ్వానాల మధ్య పరేఖ్ వీనుల విందు చేసేవాడని ఎలవర్తి రోశయ్య, ఆవుల గోపాల కృష్ణ మూర్తి చెప్పారు. ఎప్పుడైనా రాయ్ ముఖం చిట్లిస్తే ఠపీమని పరేఖ్ ఆపేశాడట.

అప్పట్లో నాకు ఆయన తెలియదు. తరువాత డెహ్రాడూన్ స్టడీ కాంపులో 5 రోజులు కలసి వున్నాం. ఆ కాంప్.కు ఢిల్లీ నుండి రైలులో వెడుతుండగా ఒకే కంపార్ట్.మెంట్.లో యాదృచ్ఛికంగా కలిశాం. పక్కనే వి.బి.కర్నిక్ కూడా వున్నారు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. 5 రోజుల స్టడీ కాంప్.లో పరేఖ్ ఎన్నో సందర్భాల్లో చర్చలో పాల్గొన్నారు. ఆరితేరిన ప్రసంగకర్తగా రాయ్ వికేంద్రీకరణ సిద్ధాంతాలను విడమరచి చెప్పాడు. వినడానికి ఎంతో బాగున్నా ఆచరణ సాధ్యం కాదనిపించింది.

ఎం.ఎన్. రాయ్ ఇంట్లో (13 మోహినిరోడ్) చివరి రోజున సోషల్ గెట్ టుగెదర్. అందరికీ కాక్ టైల్స్ కలిపి గౌరి, ఇందుమతి అందిస్తుంటే, వివిధ ప్రాంతాలవారు వారి వారి తీరులో అనుభవాలు జోక్.లు చెప్పారు. పరేఖ్ అందర్నీ నవ్వించాడు. నేను మల్లాది రామమూర్తి గుత్తికొండ నరహరి వున్నాం. రామమూర్తి తాగడు. ఆరోజు మొహమాట పెట్టగా ఆయనా స్వీకరించాడు. సంతోషించాం.

ఆ ఇంట్లో రాయ్.తో తాను గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకొని తార్కుండే కళ్ళంట నీళ్ళు పెట్టాడు.

పరేఖ్.ను తరువాత బొంబాయిలో కలిసేవాడిని. ఆయన యూనివర్సిటీ రెక్టార్.గా పనిచేస్తూ, జనరల్ ఎడ్యుకేషన్ పై పుస్తకం రాశారు.

లక్ష్మణ శాస్త్రి జోషి మరాఠీలో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీషులోకి ది క్రిటిక్ ఆఫ్ హిందూయిజం అని అనువదించారు పరేఖ్. దానిని నేను తెలుగులో రాసి ప్రసారితలో ప్రచురించాను. తిలక్ సిద్ధాంతాలను కొన్నింటిని సమర్ధిస్తూ పరేఖ్ రాసిన వాటిని ఎ.బి.షా హ్యూమనిస్ట్ వేలో వేశారు. రాడికల్ హ్యూమనిస్ట్.లో పరేఖ్ వ్యాసాలు వచ్చేవి.

ఆయన అనంతరం ఇందుమతి పరేఖ్ బొంబాయి పేదల లో సామాజిక సేవ ఆరంభించింది. ఆమె డాక్టర్.

హ్యూమనిస్ట్ వుద్యమంలో దీక్షగా పనిచేసి సంఘసేవ ప్రాధాన్యతను చూపింది. స్త్రీల సమస్యలు ముందుకు తీసుకువచ్చింది. ఆమె సేవల దృష్ట్యా హ్యూమనిస్ట్ హీరోయిన్.గా రూపొందినది.

బొంబాయిలో ఆమె ఇంట్లో జరిగిన చిన్న సమావేశాలలో పాల్గొన్నాం. హైదరాబాద్.లో మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది. కోమల, ఇందుమతి, గౌరి, కలసి పాత హైదరాబాద్.లో షాపింగు చేసేవారు.

ఆంధ్రలో ఇందుమతి అనేక పర్యాయాలు పర్యటించింది. ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర నా తెలుగు అనువాద ఆవిష్కరణ తెలుగు యూనివర్సిటీలో ఆమె చేసింది.

బొంబాయిలో ఇందుమతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవవాద సమావేశాలు జయప్రదంగా జరిపింది.

నేను వాషింగ్టన్.లో వుండగా మహిళా కార్యక్రమాల పథకాలు చర్చకు ఆమె వచ్చింది. అక్కడ కలుసుకొని చర్చించాము. మానవవాద సంఘ నాయకురాలుగా కార్యకర్తల్ని ఉత్సాహపరచింది. ఆమె ఆచరణ వాది. పెద్ద రచయిత్రి కాదు. ఉపన్యాసకురాలు కాదు. కాని అంతర్జాతీయ మానవవాదులు ఆమె కార్యక్రమాలు తిలకించి, మదర్ థెరెసాను కాదు, ఇందుమతిని గుర్తించాలి అన్నారు.

ఎన్.సైక్లోపీడియా అన్ బిలీఫ్.లో ఇందుమతి గురించి నేను రాశాను. ఎడిటర్ టాంప్లిన్ కోరికపై అలా చేశాను.

Dr Indu tai( Indumati)






2 attachments — Download all attachments View all images

SAMAREN ROY

సమరన్ రాయ్


Met Samaren in Kolkata 2005
2005లో నేను నా ఫ్రెండ్ ఇసనాక మురళీధర్ తో సమరన్ రాయ్ బాగా వయసుమీరి ఉన్నప్పుడు కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని వాళ్ళింటికి అల్పాహార విందుకు ఆహ్వానించడం జరిగింది. మేము ఆయనతో ఫోటోలు తీసుకున్నాము. సమరన్ నాతో చాలా రోజులు టచ్.లో వుండేవారు. ఆయన ఆమెరికన్ కాన్సల్




 ఆఫీసులో పనిచేసి 1950 ప్రాంతాలలో రిటైర్ అయ్యారు. ఆయన ఎమ్.ఎన్.రాయ్ అభిమాని, ఎమ్.ఎన్.రాయ్ యువకుడుగా వున్నప్పుడు ఆయన మీద చాలా పరిశోధనలు చేశారు. రాడికల్.గా ఎమ్.ఎన్.రాయ్, కమ్యూనిస్టుగా ఎమ్.ఎన్.రాయ్ మీద రెండు పుస్తకాలు ముద్రించారు. ఎమ్.ఎన్. రాయ్ భారత దేశపు ప్రథమ కమ్యూనిస్ట్, అంతే కాకుండా భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థాపకుడుగా 1920 ప్రాంతాలలో తాష్కెంట్ నుండి పని చేసారు.




. ఎమ్.ఎన్.రాయ్.ని అవిశ్రాంత బ్రాహ్మణుడుగా సమరన్ వర్ణించారు. నేను ఎమ్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ ట్రెంట్ జీవితచరిత్ర పరిశోధన ముద్రించినపుడు సమరన్ రాయ్ అబ్బురపడి దాని ప్రతిని కావాలని అడిగారు. 1925లో ఆయన యూరోప్ నుంచి తిరిగి వచ్చారు. అప్పటి వరకు ఎవిలిన్ రాయ్ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనికి సమరన్ కూడా అంగీకరించారు. ఎమ్.ఎన్. రాయ్ పుట్టిన తేదీ విషయంలో శిబ్ నారాయణ్ రే, సమరన్ రాయ్.లకు భేదాభిప్రాయాలున్నాయి. సమరన్ రాయ్ తరచు అమెరికాకు వెళ్ళి అక్కడ టెక్సాస్.లో ఉన్న బెంగాలీ సంస్థలతో సంబంధాలు కొనసాగించేవాడు. నాకు ఎమ్.ఎన్.రాయ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు సమరన్ చెప్పారు. ఆయన్ని కలవడం నా అనుభవంగా


 భావిస్తున్నాను. 2007లో ఆయన మరణించారు. ఆయనతో ఉన్న ఫోటో నా దగ్గర ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

పని చేసారు.

మానవవాదిగామల్లాది రామమూర్తి

మల్లాది రామమూర్తి


భారత రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేసిన మల్లాది రామమూర్తి నాకు అర్థ శతాబ్దం పాటు సన్నిహిత కుటుంబ మిత్రులు. 1960 ప్రాంతాలలో గుంటూరు జిల్లా బాపట్లలో అడ్వ కేటుగా ఆయన ప్రాక్టీసు చేస్తున్నప్పుడు పరిచయమయ్యాడు. అప్పట్లో ఆయన భార్య మల్లాది సుబ్బమ్మ హైస్కూలు మాత్రమే చదువుకున్న గృహిణి. ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టిన దంపతులు, సహృదయులు. ఆ తరువాత సుబ్బమ్మను ఇంటర్, బి.ఎ. ప్రైవేటుగా చదివించి, రాయటం, చదవడం బాగా అలవాటు చేసి ఆమెను మానవవాదిగా తీర్చి దిద్దిన శ్రమ అంతా రామమూర్తిగారిదే.

కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన రామమూర్తి 1940 ప్రాంతాలకే ఎమ్. ఎన్. రాయ్ ప్రభావంతో మానవ వాదిగా మారి జీవితమంతా అలాగే కొనసాగారు. ఒక వైపు ప్రాక్టీసు చూసుకుంటూనే, మానవ వాద ఉద్యమానికి అంకితమయ్యారు. మేమిరువురం అనేక సమావేశాలలో శిక్షణా శిబిరాలలో కలసి పాల్గొన్నాము. ఆయన ఉత్తరోత్తరా పెట్టిన వికాసం అనే మాసపత్రికలో నేను చాలా వ్యాసాలు వ్రాశాను. మేమిరువురం అఖిల భారత మానవ వాద సభలకు కూడా కలసి వెళ్ళి పాల్లొన్నాము. అలాగే హేతువాద ఉద్యమంలో కూడా కలసి పనిచేశాం.

రామమూర్తి పౌరహక్కుల సంఘాలలో మానవ హక్కుల సమితిలో ఎంతో కృషి చేశారు. జయప్రకాష్ నారాయణ్ మొదలుకొని వి.యమ్. తార్కొండే వరకు రామమూర్తికి బాగా పరిచయం. ఎమ్.ఎన్.రాయ్.తో శిక్షణ పొందిన రామమూర్తి తార్కికంగా రాసేవారూ, ఆలోచించేవారు. ఆవుల గోపాలకృష్ణమూర్తితో అతి సన్నిహితంగా ఉండేవారు. అక్కడ కూడా మేము తరచు కలిసేవారం. రామమూర్తి అనేక సెక్యులర్ పెళ్ళిళ్ళు చేయించారు. నాటికలు రాయించి ప్రదర్శింపచేశారు. అనువాదాలు చేశారు. ప్రజాస్వామ్య ప్రచురణలు అనే సంస్థలో కొన్ని పుస్తకాలు వెలువరించారు. విదేశీ పర్యటనలు చేశారు .రాను రాను చివరి దశలో కేవలం సుబ్బమ్మకు తోడ్పడటం ఆమె నాయకత్వాన్ని పెంచడం పనిగా పెట్టుకున్నారు. సొంత ఖర్చు పెట్టుకొని జీవితమంతా మానవ విలువలకోసం ఉద్యమాలలో రాజీపడకుండా పనిచేశారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీలో జైలుపాలయ్యారు. 1999లో చనిపోయారు.

In Mussorie during Radical Democratic study camp 1975(tribal dress)

Great Leader in Indian Humanist movement V M Tarkunde

తార్కుండే



Sib Narayan Ray, V M Tarkunde ( middle) Ms Indumati Parekh


1940 ప్రాంతాల నుండీ ఆంధ్ర రాడికల్స్.కు చిరపరిచితుడు తార్కుండే. తమ పూర్వీకులు ఆంధ్ర నుండి వలస వచ్చారనీ, యింటిపేరు తాడికొండ అనీ, మరాఠీలో తార్కుండే అయిందని చెబుతుండేవారు. పూర్తి పేరు విఠల్ మహదేవ్ తార్కుండే (03.07.1909 – 22.03.2004).



ఎం.ఎన్.రాయ్.కు అటు పార్టీలోనూ యిటు ఉద్యమంలోనూ అత్యంత సన్నిహిత మిత్రుడు, అనుచరుడు సహచరుడుగా ఆయన వున్నాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, చదువుకొని అడ్వొకేట్.గా ప్రాక్టీసు చేస్తూ బొంబాయి హైకోర్టు జడ్జి అయ్యాడు. పాస్ పోర్టు పొందే హక్కు పై చరిత్రాత్మక తీర్పు యిచ్చి, సంచలనం సృష్టించారు. పౌరులందరికీ పాస్ పోర్టు పొందే హక్కు ఉన్నదని చెప్పారు. ఎం.ఎన్.రాయ్ తో ఆయనకు సెంటిమెంటల్ అనుబంధం వుంది. రాయ్ సంస్మరణ సభలలో, డెహ్రాడూన్ రాయ్ నివాసంలో గతస్మృతులు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టేవాడు. జడ్జిగా తన స్వేచ్ఛకు పరిమితులు వున్నాయని వుద్యమానికి ఏమీ చేయలేకపోతున్నానని రాజీనామా యిచ్చి, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు పెట్టాడు పూర్తిగా ఉద్యమంలో నిమగ్నుడయాడు. రాడికల్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్, సెక్యులరిస్ట్, రినైజాన్స్ ఉద్యమాలతోబాటు పౌరహక్కుల ఉద్యమం సాగించాడు.



ఎమర్జన్సీలో ఇందిరా గాంధీని వ్యతిరేకించి, జయప్రకాశ్ నారాయణ్.ను సమర్ధించాడు. ముస్లింలలో తీవ్రవాదులను దూరం చేసి, మితవాదులను కలుపుకోవాలనేవాడు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక నడపడానికి, రాయ్ సాహిత్య ప్రచురణకూ చాలా సహాయపడ్డాడు.



దేశవ్యాప్తంగా పర్యటించి సభలు సమావేశాలు, అధ్యయన తరగతులలో ఎందరికో పాఠాలు చెప్పారు. నేను ఆయన్ను బొంబాయిలో డెహ్రాడూన్.లో, ఆంధ్రలో, ఢిల్లీలో అనేక పర్యాయాలు కలిశాను. ఉద్యమంలో పనిచేశాం. ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాం. అనేక వ్యాసాలు, ప్రచురణలు చేసిన తార్కుండేకు ఆయన భార్య గౌరి చేయూత నిచ్చేది.



V M Tarkunde with N.Innaiah

Tarkunde at left bottom, Justice Gopalarao Ekbote middle, Justice A.sambasivarao right

మణి బెన్ కారా – హ్యూమనిస్ట్ హీరోయిన్

Maniben in Internatinal conference
Maniben with V B Karnik, M N Roy 1930s
మణి బెన్ కారా –




1974లో మణిబెన్ హైదరాబాద్ వచ్చే నాటికి బాగా వృద్ధాప్యం కనిపించింది. అప్పటికే ఆమె మానవ వాద, కార్మిక రంగాలలో ఆరి తేరిన కార్యకర్త, నాయకురాలు. దేశంలోనూ, ప్రపంచంలోనూ పర్యటన చేసి స్త్రీల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన మణిబెన్ 1905లో బొంబాయిలో పుట్టారు. ఆమె మధ్యతరగతి కుటుంబీకురాలు కావటంతో గామడెన్ లోని సెయింట్ కొలబా హైస్కూల్లో చదివింది. ఆ తరువాత ఇంగ్లాండులో సాంఘిక కార్యక్రమాల శిక్షణ అధ్యయనం చేయటానికి బర్మింగ్ హామ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తరువాత కార్మిక రంగంలో దిగిపోయి. నిర్విరామ శ్రమ చేసి, రేవు కార్మికులు, గుడిసెలలో మగ్గుతున్న పేద ప్రజలు, హక్కులు లేకుండా బతుకుతున్న స్త్రీలను పట్టించుకోవటం ప్రారంభించారు. ఆ కృషిలో భాగంగా వివిధ కార్మిక సంఘాలలో బాధ్యతలు స్వీకరించి అఖిలభారత ట్రేడ్ యూనియన్ నాయకురాలిగా ఆవిర్భవించారు. ఆ విధంగా ఆమెకు వి.బి. కర్నిక్, ఎన్.ఎం. జోషి వంటి వారు ఎదురయ్యారు. వారి సహకారంతో కార్మిక రంగంలో ఎనలేని సేవలు చేశారు. గుర్తింపు పొందారు.

బొంబాయిలో ఒక ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి కొంత కాలం నడిపారు. 1930లో ఆమెకు విదేశాల నుండి అప్పుడే తిరిగి వచ్చిన ఎం.ఎన్.రాయ్.తో పరిచయమయింది. అది సన్నిహితమై చివరకు రాయ్ నెలకొల్పిన రాడికల్ డెమెక్రటిక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించేటట్లు చేసింది. ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో ఆమె నిమగ్నురాలైంది. ఈ లోగా జాతీయ రాజకీయాలలో మునిగితేలింది. 1931లో స్విజర్ లాండ్ నుండి ఓడలో వచ్చి బొంబాయిలో దిగిన లూసి గెస్లర్.ను కలిసింది. ఆమె వెంట బ్రిటిష్ గూఢచారులు పడగా మణిబెన్ కాపాడి ఎం.ఎన్. రాయ్ దగ్గరకు రహస్యంగా తీసుకు వెళ్ళింది. కానీ త్వరలోనే పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం లూసీని మళ్ళీ విదేశాలకు పంపించేశారు.

పోరాటాల సందర్భంగా 1932లో మణిబెన్ అరెస్ట్ అయింది. ఎం.ఎన్. రాయ్.కు అండగా నిలిచింది. కేంద్ర శాసన సభకు సభ్యురాలిగా ఎన్నికై కొన్నాళ్ళు పనిచేసింది. అనేక మురికివాడలలో సాహసించి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె కృషికి తొడుగా ఇందుమతి ఫరేక్ నిలిచారు. ప్రభుత్వం నియమించిన వివిధ స్త్రీ సంక్షేమ సంఘాలలో మణిబెన్ కృషి చేశారు.

ఆమె మా ఆహ్వానంపై హైదరాబాద్ పర్యటించారు. అలా వచ్చినప్పుడు నగరం చూడటమే కాక, నాటి ప్రముఖ మానవ వాద నాయకులు, న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు ఇంటికి నేనూ, కోమల కలసి వెళ్ళాము. అప్పుడు సాంబశివరావు హైదరాబాద్.లోని మలక్ పేటలో ఉండేవారు. ఆయన కుమార్తె మంజులత అప్పుడే ఒక కుమారుడుని ప్రసవించింది. మణిబెన్ ఆ పసివాడికి ఒక జ్ఞాపిక బహూకరించింది. అలా ఇవ్వడం మంచి సంప్రదాయమని మాతో చెప్పింది. హైదరాబాద్ పాతబస్తీలో అనేక వస్తువులపై ఆమె ఆసక్తి కనపరచింది. స్త్రీల సంఘాలలో తన కృషి, అనుభవాలు ఎన్నో వివరించింది. ఎమ్.ఎన్.రాయ్ తో సుదీర్ఘ పరిచయాలు, అనుభవాలు ఎంతో ఓపికగా చెప్పారు.

1979లో ఆమె చనిపోయారు. చివరి వరకు మానవ వాద ఉద్యమ నాయకురాలిగా ఆమె చేసిన కృషి గణనీయమైనది. వి.బి. కర్నిక్ ఆమె జీవిత చరిత్రను సంక్షిప్తంగా ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ మహా సభలలో ప్రతినిధిగా మణిబెన్ పాల్గొని తన వ్యక్తిత్వాన్ని చూపారు

S.Ramanathan Veteran in Rationalist movement

రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు

మద్రాసులో హేతువాద వుద్యమం ఆరంభించి భారతస్థాయికి తీసుకెళ్లారు. రాజాజీ మంత్రివర్గంలో 1938లో వున్నారు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక నిర్వహించారు. మంచి హేతువాద లైబ్రరీ సమకూర్చారు. దేశమంతటా పర్యటించి ఉద్యమానికి ప్రోత్సాహం యిచ్చారు.


హైదరాబాద్.కు ఆహ్వానించాం. అప్పటికే బాగా వృద్ధులైపోయారు. 1976 నాటి మాట. వై.ఎమ్.ఐ.ఎస్. హాలులో అతి నెమ్మదిగా ప్రసంగించారు. అబ్బూరి, ఎ. ఎల్. నరసింహారావు వున్నారు.మద్రాసులో ఆయన యింట్లోకి వెళ్ళాం. చనిపోయిన తరువాత ఆయన భార్య ఆసక్తి చూపనందుకు లైబ్రరీని, పత్రికను తరలించారు. సూర్యనారాయణ, జయ గోపాల్ స్వీకరించారు. జయగోపాల్ అమెరికా వెళ్ళి పెళ్ళి చేసుకొని అట్లాంటాలో వెబ్.సైట్ నడిపారు. 2000 ప్రాంతాలలో చనిపోయారు. సూర్యనారాయణ కేరళ వెళ్ళిపోయారు. పత్రికను హైద్రాబాద్ తెచ్చి నడిపినప్పుడు జయగోపాల్ రాశారు. ఆవుల సాంబశివరావు సంపాదకుడుగా ఎన్.కె.ఆచార్య, జాస్తి జవహర్ లాల్, నేను పత్రిక నిర్వహణకు పూనుకున్నాము. ఇది 1970 తరువాతి మాట. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సూర్యనారాయణ పత్రికను మద్రాసు తీసుకువెళ్ళారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు నడవలేదు.

రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు. రష్యా కూడా పర్యటించారు. ఎంతో శ్రమకు ఓర్చి ఉద్యమాన్ని నడిపారు. ఆయనతో సన్నిహిత సంబంధం ఉండటం గర్వకారణం.

బసవ ప్రేమానంద్ మాజిక్ ద్వారా

బసవ ప్రేమానంద్ భారత దేశంలోనే గాక ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించారు.


దేశంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.



మాజిక్ ద్వారా జరుగుతున్న బాబాల, మాతల మోసాలను గుట్టు విప్పారు.

కోయంబత్తూర్ సమీపంలో పోడనూర్.లో తన భవనంలో సైన్స్ ప్రదర్శన ఏర్పరచారు.

ఆయన వయస్సు 80. కొన్నాళ్ళుగా కేన్సర్.తొ వుంటూ, ఇప్పుడు చివరిదశకు చేరారు.

ముందు తరాల వారికి ఆదర్శంగా విల్లు రాసి, తాను చనిపోగానే తన దేహాన్ని మెడికల్ కాలేజ్.కు ఇవ్వమన్నారు .

సత్యసాయి బాబా మొదలు అనేక మంది మోసాలను, అరాచకాలను బయటపెట్టారు .

సాయిబాబా ఆశ్రమంలో హత్యలు పేరిట డాక్యుమెంటరితో గ్రంథం వెలువరించారు .



వివిధ మాజిక్ విషయాలు శాస్త్రీయంగా వివరిస్తూ, అవి ఎలా చెస్తారు అని సోదాహరణగా చూపుతూ మరొక గ్రంథం రాశారు.

ఇండియన్ స్కెప్టిక్ అనే మాసపత్రిక నడిపి, ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలను అందించారు.

డాక్టర్ పి ఎం భార్గవ సైన్స్ ప్రదర్శన పెడితే మత పార్టీలు దానిని నాశనం చేసే ప్రయత్నం తలపెట్టగా, ప్రేమానంద్ ఆదుకొని తన చోట దానిని ధైర్యంగా పెట్టారు . అంత గొప్ప వ్యక్తి. త్వరలో లోగడ అబ్రహాం కోవూర్ వలె ప్రేమానంద్ కూడా మానవ హేతువాద ఉద్యమాలలో సేవ చేసారు. ఆయన ఇప్పుడు మనకు అందించిన సాహిత్యం గొప్ప సంపద.