Sam Harris-దివ్యవాణిలో ఎంత శక్తి ఉన్నది ?-Letter to Christian nation

8వ భాగం

బైబులు దైవ వాక్యం అని కొత్త నిబంధనలో పేర్కొన్న సంఘటనలను పూర్వ నిబంధనలో చెప్పిన వాటిని ధ్రువపరచిందని నమ్మారు.  ఈ దివ్య వాక్యాలు రాసినవారు జీసస్ జీవితాన్ని చెప్పడానికి పూర్వ నిబంధనలో దివ్యవాక్కులకు అనుగుణంగా దానిని రూపొందించడానికి ఎంత కష్టమో ఆలోచించండి. గతంలో రాసిన పుస్తకంలో సూచించిన వాటికి అనుగుణంగా ఎవరైనా పుస్తకం రాయలేరా? బైబుల్ రచయితలను గమనిస్తే జరిగిందిదే.
లుక్, మాథ్యూ రాసిన దాని ప్రకారం మేరి కన్యగా ప్రసవించింది. గ్రీకులు పేర్కొన్న ప్రవచనం ప్రవక్త ఈసయ్య 7:14 పై ఆధారపడి ఇలా రాశారు. ఈసయ్య రాసిన హిబ్రూ వచనాలలో ఆల్మ అనే మాటకు యువతి అని అర్థం ఉన్నది తప్ప, కన్య అనే అర్థం లేదు. కన్యకు పుట్టడం అనే మూఢ వాదన క్రైస్తవులకు లైంగికత పట్ల ఉన్న ఆందోళనే కారణం. హిబ్రూ మాటల అనువాదంలో దొర్లిన పొరపాట్లే ఇందుకు దారి తీశాయి. కన్య ప్రసవించడం అనేది ఇతర సువార్త రచయితలు ప్రస్తావించలేదు. జీసస్ అక్రమ సంతానంగా జన్మించాడనడం మార్క్, జాన్ లకు ఇష్టం లేదు. వారు జీసస్ అద్భుత పుట్టుకను ప్రస్తావించలేదు. పాల్ ఆనాడు డేవిడ్, మరొక స్త్రీకి జీసస్ పుట్టాడని రాస్తూ మేరీ కన్యత్వాన్ని ప్రస్తావించలేదు. ఇతర దైవ ప్రచారకులు అనేక దోషాలు చేశారు. మేథ్యూ 27:9 – 10 ప్రకారం జెరీమియా చెప్పినట్లు జరిగిందన్నాడు. వాస్తవానికి జెఖారియా  11:12-13 ఈ విషయాలను రాశాడు. సువార్తలలో పరస్పర విరుద్ధ విషయాలున్నాయి. జాన్ ప్రకారం పాస్ వోవర్ ముందు రోజున జీసస్ ను శిలువపై కొట్టారన్నాడు. మార్క్  ఈ సంఘటన మర్నాడు జరిగిందన్నాడు. ఇలాంటి తేడాలున్న బైబుల్ నిర్దిష్టమైనది ఎలా అవుతుంది. ముస్లింలు, మోర్మోనులు, సిక్కులు అలాంటి పరస్పర వైరుధ్యాలను తమ పవిత్ర గ్రంథాలలో విస్మరించినప్పుడు వారిని గురించి ఏమనుకుంటారు. పవిత్ర ఆత్మకు దృగ్గోచరంగా ఉన్న కన్ను మాటలకు కట్టుబడేది కాదన్నారు (లూథర్),  ఈ మాటలవలన అటువంటి పవిత్ర గ్రంథాలు సృష్టికర్త సంపూర్ణ వాక్యాలు అవుతాయా?
క్రైస్తవుడు భవిష్యత్తు సంఘటనలను బైబుల్ అంచనా వేసిందంటారు. ద్వితీయోపదేశ కాండలో 28:64 దేవుడు నిన్ను అందరి మధ్య భూమికి ఒకవైపు నుండి మరో వైపుకు విసిరేస్తాడు అని ఉన్నది. ల్యూక్ 19..43-44 ప్రకారం జీసస్ చెబుతూ ఈ శత్రువును చుట్టుముట్టి నేలకేసి కొట్టి మీ పిల్లలు కూడా అలాగే చేసి ఏదీ వదలకుండా వెడతారు. వారు వస్తున్నట్లు నీకు తెలియకోవడమే ఇందుకు కారణం. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు యూదుల చరిత్రను అంచనా వేసినట్లు నమ్మమంటారు. ఇది అలౌకిక వివరణ తప్ప మరేది కాదు.
సర్వజ్ఞుడైన దేవుడు భవిష్యత్తు చెబితే ఎంత నిర్దిష్టంగా ఉండి ఉండాలి. బైబుల్ అలాంటి గ్రంథం అయితే మానవ సంఘటనలను కచ్చితంగా చెప్పగలగాలి. 20వ శతాబ్దం ఉత్తరార్ధంలో కంప్యూటర్ల ద్వారా మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని ఇది ఇంటర్నెట్ అంటారని దీనిని లెవిటికస్ ప్రకరణలో ముందే చెప్పామని దేవుడు ప్రస్తావించి ఉండాలి. కాని బైబిలులో అలాంటివేవీ కనిపించవు. వాస్తవానికి మొదటి శతాబ్దంలో నివసించిన స్త్రీ పురుషులు రాయలేనిది ఏదీ బైబిలులో లేదు. అది చూచైనా మీకు కలవరపాటు వచ్చి ఉండాల్సింది.
సర్వశక్తివంతుడైన దేవుడు రాసి ఉంటే అందులో గణితంపై ఒక అధ్యాయం అయినా ఉండి ఉండాలి. అలా అయితే 2000 సంవత్సరాల తరువాత గణిత లోతుపాతులు తెలుసుకోవడానికి మానవాళికి ఎంతో ఉపయోగపడేది. బైబిలులో గణితం లాంఛనంగా నైనా చర్చించకపోగా కొన్ని స్పష్టమైన గణిత దోషాలు మాత్రం ఉన్నాయి. బైబిల్ ప్రకారం మొత్తం చుట్టు కొలత నిష్పత్తి దాని డయామీటరుతో పోల్చితే 3:1 ఉంటుంది. (ఒకటి కింగ్స్ 7:23-26, రెండు క్రానికల్స్ 4:2-5) ఇది మెచ్చదగిన అంశం కాదు. ఆధునిక కంప్యూటర్లు నిర్దిష్టంగా అంచనాలు వేస్తాయి. ఈజిప్షియన్, బాబిలోనియన్లు బైబిల్ ను పూర్వ గణిత అంచనాలు ఇంచుమించు సరిగానే వేశారు. ఇది (గణితంలో పై) పైకి సంబంధించిన విషయం. ప్రాచీన ప్రపంచపు ప్రమాణాలను బట్టి చూసినా బైబిల్ లో ఉజ్జాయింపుగా చెప్పినవి దారుణమైన అంశాలే. భక్తులు మాత్రం  వాటన్నిటినీ హేతుబద్ధం చేసే తీరు ఉన్నది. అయితే లోపాలు బైబిల్ కప్పిపుచ్చలేకపోయిందని గణితం విషయాలు స్పష్టంగా తేల్చి చెబుతున్నాయి. బైబుల్ లో 1. కింగ్స్, 2. క్రానికల్స్ ప్రకరణలు గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు ఆర్కిమెడిస్ రాసి ఉంటే సర్వజ్ఞుడికంటే ఎక్కువ సాక్ష్యాధారాలు ప్రస్తావించి సేకరించి ఉండేవాడు.
బైబుల్ లో విద్యుత్ ను గురించి, జీవాణువు (జిఎన్ఎ) గురించి విశ్వం పరిమాణం, వయస్సు గురించి విశ్వం వయస్సు పరిమాణం ఎందుకు చెప్పలేకపోయింది. కాన్సర్ కు చికిత్సమాటేమిటి? కాన్సర్ ను గురించి జీవశాస్త్రం పూర్తిగా అవగాహన చేసుకుంటే కొని పుటలలో సంక్షిప్తంగా వివరించగలరు. అలాంటిది బైబుల్ లో ఎందుకు లేదు. మంచివారు పవిత్రులు కాన్సర్ తో బాధపడుతూ చనిపోతున్నారు. వారిలో పిల్లలున్నారు. బైబుల్ మంచి గ్రంథం. దేవుడు బానిసలను అట్టిపెట్టుకోవడానికి జంతువులను బలి ఇవ్వడానికి సూచనలు ఇచ్చాడు. క్రైస్తవంపై నమ్మకం లేనివారు అలాంటి పుస్తకాన్ని చూస్తే సర్వజ్ఞుడు అదెలా రాశాడని ఆశ్చర్యపోతారు.

   మూలం అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

శాస్త్రదాస్యం పుస్తక పరిచయం


కొప్పరపు సుబ్బారావు అద్వితీయ రచన శాస్త్ర దాస్యం కు త్రిపురనేని గోపిచంద్ 1944 లో రాసిన పరిచయం

ఈ గ్రంథకర్త కొప్పరపు సుబ్బారావుగారు నాటక కర్తలుగా, మ్యూజిక్ డైరెక్టరుగా, ఆంధ్రలోకానికి చిరపరిచితులూ, ప్రఖ్యాతులున్నూ, కాని, వీరి శాస్త్రజ్ఞానం, విమర్శనా పటిమా మాత్రం, ఆంధ్రలోకానికి క్రొత్తే అనుకుంటాను.
నేనీ గ్రంథం చదవటం పూర్తిచెయ్యగానే, వీరు ఇంత పాండిత్యం ఆవేశం, ఇన్నాళ్లూ తమలో ఎట్లా ఇముడ్చుకొని, దాచుకోగలిగారా, అని ఆశ్చర్యపడ్డాను. ఈ గ్రంథంవల్ల వీరు నిశ్చయంగా ఆంధ్రలోకానికి అపారమైన సేవ చేశారని నేను తలుస్తున్నాను. సహృదయంతో ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరూ, నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. ధర్మాచరణ మానుకొని, ఇతరులకు దాస్యం ప్రతిపాదించటమే ఆదర్శంగా పెట్టుకొని, చీటికీ, మాటికీ పూర్వధర్మాలను మంత్రాలకుమల్లే పునఃశ్చరణ చేస్తూ కూర్చునే, ఆకారవాదులకు, శుష్కవాదప్రియులకు, బహు చక్కని జవాబు, యుక్తియుక్తంగా చెప్పి,  సుబ్బారావుగారు హిందూ సంఘానికి, అత్యంత మేలు చేశారని, అంగీకరించక తప్పదు.
మానవ సంఘానికి, స్తిరత్వం అనేది లేదు. ఆదికాలం నుంచీ, పరిణామం పొందుతూనే వొచ్చింది. కల్పాంతంవరకూ, పరిణామం చెందుతూనే ఉంటుంది. అది నిత్య నూతనం. ధర్మశాస్త్రం అట్లా కాకపోవటం వల్ల, ఒక కాలానికి ఉపయోగకరంగా ఉన్నది, మరొక కాలానికి నిరుపయోగంగానో, హానికరంగానో తయారవటం కద్దు.  ఎప్పటికప్పుడు, సంఘంలో, మానవ ఆదర్శంలో, జరిగే ఈ మార్పునే, అరవిందులు తమ గీతావాక్యంలో ఇట్లా చెప్పారు -
“మానవుడు ఆదిలో వ్యక్తి సుఖమే, పరమావధిగా పెట్టుకున్నాడు. అందుకు అనుకూలమైన ధర్మాలు, బయలుదేరినవి. తరువాతి మెట్టు కుటుంబం, అప్పుడు కుటుంబంకోసం, స్వసుఖాన్ని పరిత్యజించటం, ప్రశంసనీయమైంది. తరువాతి మెట్టు వంశం. అప్పుడు వంశంకోసం, స్వసుఖాన్నీ, కుటుంబశ్రేయస్సునీ కూడా, లెక్కచెయ్యకపోవటం, ప్రశంసనీయమైంది. తరువాతి మెట్టు జాతి. దాని తరువాత దేశం. దాని తరువాత ప్రపంచం”
ఒక మెట్టులోనుంచి, రెండవ మెట్టులోకి, వొచ్చేటప్పుడు సంఘర్షణ, యుద్ధం, జననష్టం తప్పదు.
ఈ విధంగా మానవసంఘం పరిణామం, జరిగేటప్పుడు, ఒక దశకు ఉపయోగపడిన ధర్మాలు, మరొక దశకు పనికి రాకపోవటం సహజమే! ఇందులో ప్రకృతి విరుద్ధంగానీ, వైపరీత్యంగానీ ఏమీలేదు.
నేడు మన పండితుల్లో ఎక్కువమంది, ఈ సత్యాన్ని గ్రహించటంలేదు. ధర్మశాస్త్రాలూ, నీతిశాస్త్రాలూ ఎందుకు పుట్టినయ్యో, వాటి ప్రయోజనం ఏమిటో మరిచిపోయి, తమ స్వార్ధానికీ, పరపీడనకూ ఉపయోగిస్తున్నారు. దీన్నే సుబ్బారావుగారు, ఈ గ్రంథంలో అళీకపాండిత్యం, అనీ ఆత్మౌపమ్య రాహిత్యం అనీ ఉదహరించారు.
అసలు ధర్మం ఎందుకు పుట్టింది? సంఘకళ్యాణం కోసం గదా? నలుగురు కలిసి ‘మనం కొన్ని ధర్మాలను పాటిస్తేగాని, సుఖంగా, ఒడుదుడుకుల్లేకుండా బ్రతకలేం’ అని నిర్ణయించుకొని, తమ సుఖజీవనం కోసం, ధర్మాలను ఏర్పరచుకుంటారు. సంఘం పరిణామం చెంది, ఈ ధర్మాలను ఏర్పరచుకున్న స్తితిని దాటినప్పుడు, ఈ ధర్మాలే - ఒకప్పుడు సంఘానికి శ్రేయస్సును కూర్చిన ఈ ధర్మాలే - అహితాన్ని కలుగజేస్తయ్. అంటే ఈ ధర్మాలన్నీ అధర్మాలవుతాయన్నమాట! అప్పుడు నూతన ధర్మాల అవసరం, సంఘానికి కలుగుతుంది.
ఇప్పుడు ‘అబద్ధం ఆడగూడదు’ అనే ధర్మం ఉందనుకోండి. ఇది చాలా మంచి ధర్మం. సత్యం చెప్పటం చాలా మంచిది. ప్రతివాడూ అబద్ధం ఆడుతూ ఉంటే మానవుల్లో ఒకరిమీద ఒకరికి నమ్మకమే ఉండదు. సుహృద్భావమే నశిస్తుంది. సంఘం అల్లకల్లోలమైపోతుంది. నిజమే! కాని సత్యం చెప్పటం వల్ల ఒక నిరపరాధికి అపకారం మాత్రమే, జరిగేటట్టయితే మాత్రం అసత్యం చెప్పటమే మానవధర్మం అవుతుంది. ఇట్లాగే, అహింస పరమధర్మం. కాని ఒక దుర్మార్గుడు మనలను హింసించటానికి పూనుకున్నప్పుడు మాత్రం. సామదానభేద దండోపాయాల్తో, మనలను కాపాడుకోవటమే పరమధర్మం. “సమచిత హింసన మరయ నహింస” అని కూడా భారతం చెపుతూ ఉంది. ఇంతేకాదు “పరహితము సేయబూనిన పురుషుడు, పాపంబుసేసి పొందడుకీడు” అని కూడా చెపుతూ వుంది.
ఈ అపవాదాలను బట్టి, ధర్మశాస్త్రాలు సంఘ క్షేమం కోసం ఏర్పడ్డవిగాని, పీడనకోసం కాదని మనకు సులభంగా గ్రాహ్యమౌతుంది. మనం ధర్మశాస్త్రాల కోసం పుట్టలేదు. మన కోసం ధర్మ శాస్త్రాలు పుట్టి పై ధర్మానికి దానంతటదానికి విలువలేదు - ఫలితాన్ని బట్టి కలుగుతుంది. ఈ సంగతే ఈ గ్రంథంలో సుబ్బారావుగారు, మిక్కిలి ప్రతిభావంతంగా వ్రాశారు. ఇదెవ్వరూ - సంఘక్షేమం కోరేవారు - కాదనలేని ధర్మం. ఈ ధర్మానికి అపవాదం కూడా లేదు.
“ముందు ఆకలి, తర్వాత ధర్మం" అంటున్నారు సుబ్బారావుగారు. ఇది మహావాక్యం, మానవుడు కొన్నాళ్ళు జీవించి ఉంటేనే ఏదైనా, జీవించటం ముఖ్యం. దీనికి మించిన ధర్మం లేదు. విశ్వామిత్ర మహర్షి కరువులో తిండి దొరక్క మాలపల్లిలో కుక్కమాంసం దొంగిలించి తిని, జీవించాడు. ఇది అధర్మం కాదా అని ప్రశ్నించిన మాలవానికి, “జీవితం మరణా ఛ్రేయో జీవన్ ధర్మమవాప్నుయాత్” అని జవాబు చెప్పాడు. “మరణించటం కంటే, జీవించటం మేలు. జీవించివుంటే, ధర్మం - చెయ్యగలంగాని, మరణించి చేసేదేముంది” అని.
ఇందులో తప్పులేదు - “ప్రాణరక్షణం పరమధర్మం”  కనుక “ముందు మానవులు సలక్షణంగా జీవించే ఏర్పాటు చెయ్యండి. తర్వాత జీవించి ఏంచెయ్యాలో, దేన్ని సాధించాలో, చెప్పండి..” అంటున్నారు సుబ్బారావుగారు. ఆర్థిక సమానత్వం ముందు, ఆధ్యాత్మిక చింతన తర్వాత. అంతేగాని శాస్త్రాల వంకతో మొదలుకే, మోసం తేకండి!. ఈ అభిప్రాయంతోనే వివేకానంద స్వాములు కూడా, “నా దేశంలో ఆకలితో మూలిగే ఒక కుక్కవున్నా, దాని కడుపుచిచ్చు  చల్లార్చటమే నా మతం...” అన్నారు. ఇది గ్రహించక, సంఘానికి ఆర్థిక సౌష్ఠవం ఏర్పడకముందే, ప్రజలందరికీ ఆహారం దొరికే సదుపాయం కలగక ముందే, ఆధ్యాత్మిక చింతనలో, పడటం వల్లే మన దేశానికి ఈ దుర్గతి పట్టిందని నా విశ్వాసం.
ఈ గ్రంథంలో సుబ్బారావుగారు, సాంఘిక ఆర్థిక దృష్టి లోపించటం వల్ల వొచ్చే, శాస్త్ర దాస్యాన్నీ, దానివల్ల కలిగే అగచాట్లనూ, కన్నులకు కట్టినట్లు వర్ణించారు. దీనివల్ల  శాస్త్ర దాస్యాన్ని ప్రచారం చేసే వారిలో, ఏ కొద్దిమందికైనా అనుభవించేవారిలో, ఏ కొద్దిమందికైనా, కనువిప్పు కలిగితే వారు కృతార్థులైనట్లే.
వారు చెప్పినట్లు. ఈ గ్రంథం వ్రాయటానికి కారణం, పెద్దలను తిరస్కరించటం కాదు. పండితులను దూషించటమూ కాదు. సంఘశ్రేయస్సు మాత్రమే....
సంఘహితమే ఆదర్శంగా పెట్టుకున్న, ఈ గ్రంథం ఉత్తమ గ్రంథం - ప్రజల ఆదరాభిమానాలను తప్పక చూరగొంటుంది. వివిధ శాస్త్రావలోకనం చేసి ధర్మాధర్మాలు కుశలాకుశలాలను బట్టి నిర్ణయింపబడతవని, నిరూపించిన సుబ్బారావుగారు ధన్యులు.
శాస్త్రదాస్యం, ఆంధ్రదేశాన్నేకాక, యావద్భారతదేశాన్నీ, పీడిస్తున్న జాడ్యం అవటంవల్ల, ఈ గ్రంథం త్వరలో, ఇతర భాషల్లోకి తర్జుమా కాగలదని ఆశిస్తున్నాను. సంఘ సంస్కర్తలు, ఇందుకు పూనుకోవాలని నా మనవి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే కాలాతీతమైంది. సుబ్బారావుగారి మాటలు వినాలని మీరు చాలా కుతూహలంతో ఉండి ఉంటారు. ఇక నేను నిష్క్రమిస్తున్నాను. అరుగో సుబ్బారావుగారు ప్రవేశిస్తున్నారు.

సూతాశ్రమం
తెనాలి గోపీచంద్

దేవుని మంచితనం--7వ భాగం-Sam Harris




ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఒకమ్మాయిని ఒకతను ఎత్తుకు పోతాడు,  చెరుస్తాడు, చిత్రహింస చేస్తాడు. చంపేస్తాడు. ఈ క్షణంలో కాకపోతే మరికొన్ని గంటలలో, రోజులలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆరు మిలియన్ల మానవుల మధ్య ఇలాంటివి జరుగుతుండటం చూస్తున్నాం. అదే లెక్కల ప్రకారం ఆ అమ్మాయి తల్లిదండ్రులు – నువ్వు నమ్మినట్టే -  సర్వజ్ఞుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు, వారిని వారి కుటుంబాన్ని చూస్తూ వుంటాడు. అలా అని వారు నమ్మటం సరైనదేనా? అలా నమ్మటం మంచిదేనా?
కాదు.
దీనికి స్పందించడంలోనే నాస్తికవాదం ఉన్నది. నాస్తిక వాదం తప్పని కాదు. అదొక ప్రపంచ దృష్టీ కాదు. స్పష్టమైన దానిని అంగీకరించడమే నాస్తికవాదం. నాస్తిక వాదం అనే మాట వాస్తవానికి ఉండరాదు. ఎల్లరూ తామొక నమ్మకం లేని జ్యోతిష్యులమని, నమ్మకం లేని మాంత్రికులమని అనుకోరాదు. సుప్రసిద్ధ గాయకుడు ఎల్విన్ ఇంకా బతికున్నాడని, లోకాతీత వ్యక్తులు ఖండాంతరాలలో పయనించి పట్టుబడిన వారిని చిత్రహింసలు చేస్తారని, నమ్మేవారిని గురించి ఏమనాలో తెలియదు. నాస్తిక వాదం అంటే సమర్థనీయం కాని మత విశ్వాసాలను ముందుకు తెచ్చేవారి పట్ల అభ్యంతరాలను తెలపడమే. నాస్తికుడు అమెరికాలో నమ్ముతున్న 57 శాతం జనాభాను, దేవుడున్నాడనే విషయాన్ని సందేహించేవారిని ప్రశిస్తూ సాక్ష్యం చూపమని కోరతాడు. ప్రపంచంలో రోజూ అమాయకులను నాశనం చేస్తున్న తీరును చూస్తూ దయామయుడైన దేవుని ప్రశ్నించడమే నాస్తికత. లక్షలాది సంవత్సరాలలో ఒక్కసారైనా సరే ఒక చిన్న పిల్లను చంపేస్తే దయామయుడైన దేవుడనే భావాన్ని సందేహించడమే నాస్తికుడి ఉద్దేశ్యం.
ప్రతి చోటా మానవులను రక్షించడంలో దేవుడు విఫలమవుతున్నట్లు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇటీవల అమెరికాలో న్యూ అర్లియన్స్ నగరం తుఫాను తాకిడికి విధ్వంసం అయింది. వెయ్యిమంది చనిపోయారు. వేలమంది ఆస్తులను పోగొట్టుకున్నారు. పదిలక్షలమంది నిరాశ్రయులయ్యారు. న్యూ అర్లియన్స్ లో కత్రినా తుఫానుకు గురయినవారంతా దేవుడు సర్వజ్ఞుడని సర్వాంతర్యామి అని దయామయుడని నీవు నమ్మినట్లే నమ్మారు. కత్రినా తుఫాను నగరాన్ని ఎడారి చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నట్లు. ఇళ్లల్లో, అటకల మీద ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రార్థించిన వృద్ధుల, స్త్రీల ప్రార్థనలు దేవుడు విని వారిని క్రమేణ నీట ముంచాడు. వారంతా నమ్మకాలున్న విశ్వాసపాత్రులే. జీవితమంతా ప్రార్థనలు చేసినవారే. ఇది స్పష్టమేనని ఒప్పుకునే ధైర్యం ఉందా? వారంతా ఊహించిన దైవంతో సంభాషిస్తూ చనిపోయారు.
న్యూ అర్లియన్స్ రాష్ట్రాన్ని, బైబిల్ ప్రస్తావించిన తీరులో, తుఫాను ముంచెత్తబోతున్నట్లు హెచ్చరికలు వచ్చాయి. అందుకు మానవులు సరిగా సంసిద్ధులు కాలేదు. వైజ్ఞానికంగా చూస్తే మరొక తీరుగా వుంటుంది. మతపరంగా ఈ ప్రమాదానికి ఎలాంటి ఆధారమూ లేదు. వాతావరణ శాస్త్రం శాటిలైట్ ప్రకృతిని పరిశీలించి కత్రినా దారిని సరిగా చెప్పడంలో విఫలమయ్యాయి. దేవుడు తన పథకాన్ని ఎవరికీ వెల్లడించలేదు. న్యూ అర్లియన్స్ పౌరులు దేవుని దయపై ఆధారపడ్డారు. కత్రినా మృత్యువాతకు గురికాబోతున్నామని అక్కడి పౌరులు తీవ్ర గాలులు తాకిడి సోకేవరకు అనుమానించలేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం కత్రినా తుఫాను తాకిడి నుండి బయటపడినవారిలో 80 శాతం దేవుని మీద నమ్మకం బలపడిందని చెప్పారు.
ఒకవైపు కత్రినా తుపాను న్యూ అర్లియన్స్ ను నేలమట్టం చేస్తుండగా, ఇరాక్ లో బ్రిడ్జిపై షియా భక్తులు మృత్యువుకు గురయ్యారు. ఈ యాత్రికులు కురాన్ దేవుని శక్తిలో నమ్మకం ఉన్నవారు. అతడి ఉనికి తిరుగు లేనిదని వారు తమ జీవితాలను రూపొందించుకున్నారు. వారి స్త్రీలు ముసుగును ధరించి దేవుని ఎదుట ఉండేవారు. దైవవాక్యాన్ని గురించి పరస్పర వ్యతిరేక భాష్యాలతో వారిలో వారు చంపుకుంటున్నారు. ఆ విషాద సంఘటనలో బతికినవాడు ఒక్కడైనా విశ్వాసాన్ని కోల్పోతే విశేషంగా చెప్పుకోవచ్చు. కాని అలా బతికి బయటపడడం దేవుని దయవలనేనని భావించారు.
బతికిన వాళ్ళలో స్వయంగా ఆత్మవంచన, స్వీయ ప్రేమ అనంతంగా ఉన్నది. అలాంటి సంఘటనలలో బతికిన వారు దయామయుడైన దేవుని వలన బతికామనుకోవడం, అదే దేవుడు పసివారిని పొట్టన పెట్టుకోవడం, గమనార్హమైన నమ్మకం. బాధలతో సతమతమవుతుంటే వాస్తవాన్ని మరచి మత భ్రమణంలో మునిగి తేలడం వివేచనా రహితం. కోట్లాది ప్రజలు తమ ఆనందాన్ని కుచింపచేసుకుని అందుకు తగిన కారణాలు లేకుండానే జీవించడం దారుణమైన అంశం.
ప్రపంచంలో విశ్వాసాన్ని కుదిపేయాలంటే ఎంత పెద్ద ప్రమాదం జరగాలో ఊహించుకోవల్సిందే. యూదుల సామూహిక హత్య అందుకు దారితీయలేదు. రవాణాలో తుడిచిపెట్టుకుపోయిన జనాన్ని చూసి అక్కడ కత్తులు దూసిన పురోహిత వర్గాలను గమనించి కూడా విశ్వాసం సడలలేదు. మశూచి వ్యాధివలన లక్షలాది మంది అందులో పసివారు 20వ శతాబ్దంలో చనిపోయారు. కనుక దేవుడు ఎలా చేస్తాడో తెలుసుకోజాలం అన్నారు. మత విశ్వాసాలకి ఏదీ పొందికగా లేదు.
అన్ని వర్గాలవారు ఒకరికొకరు అభయం ఇచ్చుకుంటూ మానవ బాధలకు దేవుడు బాధ్యుడు కాదని గట్టిగా చెప్పారు. అయినప్పుడు దేవుడు సర్వజ్ఞుడు, సర్వ శక్తివంతుడు ఎలా అవుతాడు. ఇది మత జ్ఞాన సమస్య. దేవుడు ఉంటే సామూహిక ప్రమాదాలను ఆపడానికి అతడు చేయగలిగింది ఏదీ లేదు. లేదా వాటిని పట్టించుకోడు. దేవుడు శక్తి లేనివాడయినా కావాలి. పాపాత్ముడయినా కావాలి. దేవుణ్ణి మానవ నైతిక ప్రమాణాలతో నిర్ధారించడానికి వీలులేదని అంటారు. అయితే దేవుడి నైతిక ప్రమాణాలను చూపడానికి దేవుడు మంచితనాన్ని నిర్ధారించడానికి మానవ ప్రమాణాలు వినియోగిస్తున్నారు. స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళి, అతనికి చేసే ప్రార్థనలు దేవుడు పట్టించుకుంటే అతడిని అర్థం చేసుకోవడం కష్టం కాదు.
బైబిలులో చెప్పిన దేవుడు కట్టుకథ. గ్రీకుల దేవుడు జ్యూస్ తదితర వేలాది మతప్రాయమైన దేవుళ్ళ వలె ఈ దేవుళ్ళను కూడా వివేక మానవులు అశ్రద్ధ చేయాలి. జ్యూస్ అనే దేవుడు లేడని రుజువు చేయగలవా? లేదు. అయితే ఇలాంటి సన్నివేశాన్ని ఊహించలేం. మనం ప్రాచీన గ్రీకుల కాలంలో ఉన్నామనుకోండి. ప్రజలు తమ ఆదాయంలో ఎంతో భాగాన్ని ఒలింపస్ పర్వతాలపై ఉన్న దేవుళ్లను సంతృప్తి పరచడానికి వెచ్చించారనుకోండి. ఆ దేవుళ్ళ పేరిట నెలకొన్న సమస్యల ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందనుకోండి. లెక్కలేని ధనాన్ని, దేవాలయాలకు ఇచ్చారనుకోండి. ఇలియడ్, ఒడెస్సీల వరకు ఖర్చు పెడుతూ వైద్య పరిశోధనను నిలిపేశారనుకోండి. ప్రభుత్వ విధానాన్ని చర్చించకుండా ప్రాచీన రచయితలను సమర్ధించారనుకోండి. అటువంటి స్థితి వుంటే మన భౌతిక, నైతిక, మేథస్సు వనరులను దుర్వినియోగం చేసినట్లే. సరిగ్గా అలాంటి స్థితిలోనే నేడు మనం ఉన్నాము. విచారకరమైన నిర్హేతుకమైన ప్రపంచంలో మీరు మీ తోటి క్రైస్తవులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
మనందరం చనిపోతాం. మనం ప్రేమించిందంతా కోల్పోతాం. బతికుండగానే ఎందరో బాధలకు లోనవుతారు. బాధలకు కారణం మతం అని సూటిగా చెప్పవచ్చు. మత ద్వేషాలు, మత యుద్ధాలు, మత నిషిద్ధాలు, మతం పేరిట వనరులను మళ్ళించటం జరుగుతూనే ఉన్నది. మత విశ్వాసాలు చిత్తశుద్ధితో విమర్శించడం నేడు నైతికంగా మేథస్సుతో అవసరమని భావించాలి. అలాంటి విమర్శలు నమ్మకం లేనివారిని సమాజానికి పణంగా అట్టిపెడుతున్నారు. వాస్తవానికి దగ్గరలో ఉన్నవారిని నేల విడిచి సాము చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు.

   మూలం                                   అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు?--Sam Harris -6-Letter to Christian Nation



దేవుడిమీద నమ్మకంవల్ల మానవ ప్రవర్తనలో ప్రభావం పిస్తుందని అన్నప్పటికీ, దేవుణ్ణి నమ్మడానికి అదే కారణం అనలేం. దేవుడున్నాడని భావిస్తే దేవుణ్ణి నమ్మవచ్చు. నాస్తికవాదం నైతిక అరాచకాలకి దారితీస్తుందని అనుకున్నా, దానివలన క్రైస్తవ సిద్ధాంతం నిజంకాబోదు. అలాంటప్పుడు ఇస్లాం కూడా నిజం కావచ్చు. మతాలన్నీ ఫ్లాసిబో చక్కెర మాత్రలవలె పనిచేయవచ్చు. విశ్వాన్ని చిత్రించడంలో మతాలన్నీ తప్పు చేస్తున్నా, అవి ఉపయోగపడనూ వచ్చు. సాక్ష్యాధారాలనుబట్టి మతాలన్నీ తప్పుడువే కాక ప్రమాదకరం కూడా.
నమ్మకాలు మానవ నీతికి దారితీస్తున్నాయని అన్నప్పుడు మత ఉదార వాదులు, మత మితవాదులు చెప్పే ధోరణి అనుసరిస్తున్నారన్నమాట. ప్రమాణ గ్రంథం చెప్పే అద్భుతాలను బట్టి, బైబుల్ దోషజాలను బట్టి దేవుని నమ్ముతున్నామని అనకుండా, ఉదారవాదులు మితవాదులు సత్ఫలితాలను బట్టి నమ్ముతున్నామంటారు. అలాంటి నమ్మకస్తులు తమకు దేవుడు అర్థాన్ని కల్పించాడని అందుకే నమ్ముతున్నామంటారు. సునామీ 2004లో క్రిస్మస్ రోజున లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటే దేవుడి ఆగ్రహానికి అదే సాక్ష్యమని మితవాద క్రైస్తవులు భావించారు. గర్భస్రావం, విగ్రహారాధన, స్వలింగ సంపర్కాలలో దోషాలను హెచ్చరిస్తూ దేవుడు సంకేతాలను పంపిస్తున్నాడని అంటారు. ఇలాంటి భాష్యాలు జుగుప్సాకరమైనవి. కానీ కొన్ని అంచనాలను గమనిస్తే వీటిలో కొద్దిగా హేతుబద్ధత కనిపిస్తుంది. ఉదారవాదులు, మితవాదులు దైవాన్ని గురించి ఇలాంటి నిర్ణయాలు ఏవీ రాబట్టరు. వారికి దేవుడు సంపూర్ణంగా కేవలం ఓదార్పు ఇచ్చేవాడు. దారుణమైన పాపానికి ఇలాంటి ధోరణులు సరిపోతాయి. ఆసియాలో జరిగిన సునామీపట్ల ఉదారవాదులు మితవాదులు పరస్పరం దూషించుకున్నారు. ఆ భారీ తరంగాలను తన శక్తితో దేవుడు మీదకు తెచ్చాడని వారు అనలేదు. అలాంటి తరంగాల ప్రజ్వలనను చూచి మానవుడు ఎలా స్పందించాడని వారు ఆలోచించారు. కళేబరాలు కొట్టుకు వస్తుంటే అందులో మానవుడు కారుణ్యము బయటపడిందా? లేక దైవశక్తి వెల్లడయిందా? లక్షమంది పిల్లలు తల్లి ఒడికి దూరమై నీటికి ఆహుతైపోతే ఉదార మతవాదులు కళ్ళు తెరిచి చూడవలసి ఉంది. నైతికంగా నటించడం మానేయవలసి ఉంది. మత జ్ఞానం మేథస్సు ప్రదర్శించేటప్పుడు ఒక అంశాన్ని గమనించాలి. దేవుడు ఉంటే, మానవుడి వ్యవహారాలలో ఆసక్తి కనబరిస్తే దైవేచ్ఛను విడమర్చి చూడవచ్చు. చూడలేనిది ఏమంటే  ఈ దారుణ సంఘటనల వెనుక దైవం నైతిక వివేచన కనబరిచిందని అనడమే.
చాలామంది క్రైస్తవులవలె, సాధారణ వ్యక్తులు దైవం రీతులను   కాదనలేరు అని వ్యాఖ్యానిస్తారు. దేవుడు ఆదికాండంలో జలప్రళయం తెచ్చి మానవాళిని ముంచేయడం తప్పు అని అనజాలరు అంటారు. మన పరిమితి దృష్టిలో అది అలాగే కనిపిస్తుంది. కాని జీసస్ దేవుని కుమారుడని, స్వర్ణ పాలన నైతిక వివేచనకు పరాకాష్ట అని, బైబిలులో అసత్యాలు లేవని నిర్ధారణగా చెబుతాడు. బైబుల్ వివేచనను ఘంటాపథంగా చెప్పడానికి మానవుని తన నైతిక ప్రేరణను ఆధారం చేసుకుంటున్నాడు. మరుక్షణమే అలాంటి నైతిక ప్రేరణ సరైన మార్గదర్శి కాదంటున్నారు. బైబుల్ లో చెప్పిన వాటిపై ఆధారపడాలంటున్నారు. నైతిక ప్రేరణలకు బైబులే హామీ అంటున్నారు, ఒకవైపున ఇలాంటి ప్రేరణలు ప్రాథమిక స్థాయిలో ఉండగా, హేతు వివేచనలో గిరిగీసుకుని చుట్టూ తిరుగుతున్నారు.
మంచి గ్రంథంలో ఏది ఉత్తమమో మనమే నిర్ణయిస్తాము. స్వర్ణ నియమాలను చదివి అదే అత్యుత్తమ, నైతిక ప్రేరణగా తీర్పు చెబుతాము. నీతి విషయమై దేవుని బోధనలు ప్రస్తావనకొస్తాయి. పెళ్ళినాడు పెళ్ళి పెళ్ళి కుమార్తె కన్యకాదని కనుగొంటే ఆమెను తండ్రి ఇంటి ముఖ ద్వారం వద్ద రాళ్ళతో కొట్టి చంపాలి. (ద్వితీయోపదేశ కాండం 22..11-21) మనం నాగరికులమైతే ఇది మన ఉన్మత్త చర్యకు పరాకాష్ఠ అని దానిని నిరాకరించాలి. మన నైతిక నిర్ణయాలను వినియోగించాలి. అక్కడ బైబుల్ దైవ వాక్యంగా నమ్మడం మనకేవిధంగానూ తోడ్పడదు.
ఇక్కడ నిర్ణయం చాలా సులభం 21వ శతాబ్దంలో నీతిని గురించి, మానవ సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి. అందులో శాస్త్రీయ దృక్పథం తాత్విక వాదనలు 2000 సంవత్సరాల నుండి వస్తున్న వాటిని అంచనా వేయాలి. లేదా బైబుల్ లో మొదటి శతాబ్దంలో ఉన్న మాటల్ని అట్టిపెట్టుకోవాలి. ఎవరైనా బైబుల్ పంథాను ఎందుకు స్వీకరించాలి?
            మూలం                                   అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

నాస్తికులు పాపాత్ములా?--ఐదవ భాగం-Letter to Christian Nation by Sam Harris




నీతికి మత విశ్వాసం ఒక్కటే ఆధారం అయితే, నమ్మేవారికంటే నాస్తికులు నీతిలో తక్కువ వారన్నమాట. వాస్తవానికి నీతి లేని వారన్నమాట. అవునా? అమెరికాలో నాస్తిక సంఘాలవారు నేరాలలో భాగం పంచుకుంటున్నారా? సైన్స్ జాతీయ అకాడమీ సభ్యులలో 93 శాతం దేవుడనే భావాన్ని నిరాకరిస్తుండగా వారంతా అబద్ధాలాడుతూ మోసం చేస్తూ దొంగతనాలు చేస్తున్నారా? సాధారణ జనాభాలా వీళ్ళంతా సత్ప్రవర్తన కలిగిన వారేనని గట్టిగా చెప్పవచ్చు. అయినా అమెరికాలో నాస్తికులను అల్ప సంఖ్యాకులుగా చిన్న చూపు చూస్తున్నారు. నాస్తికుడిగా ఉండటం దేశంలో పెద్ద పదవులకు పోటీ చేసే దానికి పెద్ద ఆటంకం అయిపోయింది. అటువంటి ఆటంకాలు నల్లవారికి, ముస్లింలకు, స్వలింగ సంపర్కులకు కూడా లేవు. ఇటీవల ఒక డేనిష్ వార్తాపత్రిక మహమ్మద్ ప్రవక్తను అపహాస్యం చేస్తూ 12 కార్టూన్లు వేయగా ముస్లిం ప్రపంచం వేలాదిగా యూరోపులో రాయబార కార్యాలయాలను తగలబెట్టి, బెదిరించి, కొందరిని చంపి, మరికొందరిని ఎత్తుకుపోయారు. అలాంటిది నాస్తికుల పేరిట ఎప్పుడు కొట్లాటలు జరిగాయో చెప్పమనండి. ప్రపంచంలో ఎక్కడయినా ఏ వార్తాపత్రికయినా నాస్తికత్వాన్ని గురించి వ్యంగ్య చిత్రాలు వేయడానికి సందేహిస్తారా? అలాంటి సంపాదకులను ఎత్తుకు పోతారని, చంపేస్తారని భయం ఉన్నదా?
అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, మావో సేటుంగ్, పోల్ పాట్, రెండవ కిం సుంగ్ వంటి దుర్మార్గులు నాస్తికత్వం నుండి వచ్చారని అంటారు. వారిలో కొందరు మతానికి వ్యతిరేకులైనా, వారేమీ హేతువాదులు కాదు.
(హిట్లర్ నాస్తిక వాదాన్ని చాలా అతిశయోక్తులతో చిత్రించారు :
“క్రైస్తవుడుగా నేను దేవుణ్ణి చూస్తూ రక్షకుడుగా నన్ను కాపాడమని కోరతాను, ఏకాంతంగా ఉన్న నన్ను భగవంతుడు యూదులపై పోరాడమని ఆదేశించాడు. క్రైస్తవుడిగా నేను యూదులను గుర్తించి భగవంతుడు ఇచ్చిన శక్తిని వినియోగించుకుంటాను. యూదులపై పోరాటానికి భగవంతుడు అపార శక్తివంతుడు. క్రైస్తవుడుగా నాకు నా ప్రజలను సేవించాల్సిన కర్తవ్యం ఉన్నది.”)
బహిరంగంగా ఈ నాయకులు చేసే ప్రకటనలు భావపూరితమైనవి. జాతి, ఆర్థిక విధానం, జాతీయత, చరిత్ర గమనం, మేధావుల వల్ల నైతిక ప్రమాదాలు అనే అంశాలపై వీరి ప్రకటనలు భ్రమల్ని కలిగిస్తాయి. నిరంకుశులైన ఈ నాయకులు మతాన్ని నిరాకరించే బదులు, జీవితాలను విధ్వంసం చేసే ధోరణులు అవలంబిస్తారు. చాలామంది ఒక రకమైన మతపరంగా వ్యక్తిత్వ ఆరాధనను తమచుట్టూ పెంపొందించుకుంటారు. అది అట్టిపెట్టుకోవడానికి ప్రచారసాధనాలు వాడుకుంటారు. ప్రచారానికి,  చిత్తశుద్ధితో సమాచారన్ని అందించడానికి తేడా ఉన్నది. ఉదార ప్రజాస్వామ్యంలో సాధారణంగా మనం సమాచారాన్ని అందించాలని కోరుకుంటాం. నిరంకుశులు సామూహికంగా జనాన్ని తుడిచిపెట్టే విధానాలను క్రమబద్ధంగా పాటిస్తారు. తమ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఆ స్థితికి వారే అగ్రనాయకత్వం వహిస్తారు. వారు హేతుబద్ధంగా ఉండకపోగా వెర్రిమొర్రి భావనలతో పాలిస్తారు. రెండవ కిం సుంగ్ తన నివాసంలో పడకలు సముద్రమట్టానికి 500 మీటర్ల పైకి ఉండాలన్నాడు. కప్పుకునే దుప్పట్లు సుతిమెత్తగా ఉండాలన్నాడు. అంతటి మెత్తని పదార్థం పిచుకల ముక్కు వెనుక భాగానికి ఉంటుంది. కనుక అతడు పడకల కోసం 7 లక్షల పిచుకలను చంపేసి ఆ పదార్థం స్వీకరించాడు. రెండవ కిం సుంగ్ ఉత్తర కొరియాలో ఎంత హేతుబద్ధమైన వ్యక్తో దీనిని బట్టి తెలుసుకోవచ్చు.
యూదులపై జరిగిన దారుణ హత్యాకాండ చూద్దాం. మధ్యకాలపు క్రైస్తవుల నుండి యూదుల వ్యతిరేకత పుణికి పుచ్చుకున్న నాజీ మరణ కూపాలు పేర్కొనవచ్చు. శతాబ్దాలుగా యూరోపులో క్రైస్తవులు ప్రతి సామాజిక దోషానికి యూదులే కారణం అంటూ వారు ఉండటమే విశ్వాసానికి ప్రతీఘాతం అన్నాడు. జర్మనీలో యూదులపట్ల ద్వేషం సెక్యులర్ ధోరణిలో వ్యాపించింది. ఇందుకు మూలం మతమే. యూరోపులో యూదులను మతపరంగా భూతాలుగా పరిగణించి చిత్రించారు. 1914లో యూదులను ఘోరమైన జాతిగా వాటికన్ ముద్రవేసింది. (యూదులు మత క్రతువులలో రక్తం వాడే నిమిత్తం యూదులు కాని వారిని చంపుతారని తప్పుడు ప్రచారం చేశారు. ముస్లిం ప్రంపంచంలో ఇప్పటికీ ఈ నమ్మకం వ్యాప్తిలో ఉంది.) కాథలిక్, ప్రొటస్టెంట్ మతాలవారు నాజీలు చేసిన భారీ సామూహిక హత్యలపట్ల ఉదాశీనత వహించడం అవమానకరం.
జర్మనీలో, సోవియట్ గులాగ్స్ లో, కంబోడియా పొలాలలో జరిగిన హత్యలు హేతుబద్ధంగా ఉండేవారు చేసే పనులు కాదు. రాజకీయంగా, జాతి మూర్ఖత్వంతో ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఈ సంఘటనలో తెలియజేస్తారు. మీవంటి క్రైస్తవులు విశ్వాసాన్ని హేతుబద్ధంగా నిరాకరిస్తే, గుడ్డిగా నాస్తికత్వాన్ని స్వీకరించినట్లు ఉందనుకోవడం దారుణమైన భావన, మతం, నాజీయిజం, స్టాలిన్ వాదం, నియంతృత్వ మిథ్య అన్నీ పిడివాదంలో నుండి జనించినవే. మానవ చరిత్రలో ఏ సమాజంలో కూడా ప్రజలు సాక్ష్యాధారాలు చూపుతూ విశ్వాసాలను నమ్మకాలను పెంపొందించుకున్న ఉదాహరణ కనపడదు.
మతాన్ని అంతం చేయడం అనుభవమైన లక్ష్యంగా భావిస్తారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో  ఈ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. నార్వే, ఐస్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జపాన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఇంగ్లండ్ దేశాలు ఏమంతగా మతాన్ని పాటించడం లేదు. 2005లో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధిని బట్టి  దేశాలు జీవనప్రమాణాన్ని, వయోజన విద్యను, తలసరి ఆదాయాన్ని, విద్యాస్థాయిని, స్త్రీ పురుష సమానత్వాన్ని, ఆరోగ్యాన్ని సాధించుకుంటూండగా బాల్య మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పశ్చిమ యూరోప్ లో నేరాలు చాలావరకు ప్రవాసం వచ్చిన వారివలన సంభవిస్తున్నాయి. ఫ్రాన్స్ లో జైళ్ళలో ఉన్నవారు 70 శాతం ముస్లింలే. పశ్చిమ యూరోప్ లో ఉన్న ముస్లింలు నాస్తికులు కారు. మానవాభివృద్ధి సూచికలో 50 దేశాల నుండి వచ్చిన లెక్కల ప్రకారం వారంతా మత నమ్మకస్తులే.
అమెరికా సంపన్న ప్రజాస్వామిక దేశమైనా మతాన్ని అంటిపెట్టుకున్నది. అందులో గర్భస్రావాలు, యువతులలో గర్భధారణలు, లైంగికంగా వస్తున్న జబ్బులు, చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో మత ఉదారవాదం ఎక్కువగా ఉన్న దక్షిణాది మధ్య రాష్ట్రాలు పై లక్షణాలను స్పష్టంగా కనబరుస్తున్నాయి. అమెరికాలో ఉత్తర తూర్పు ప్రాంతాలలో సెక్యులర్ ధోరణులతో యూరోప్ ప్రమాణాలను చేరుకుంటున్నారు. అమెరికాలో పార్టీ అనుబంధాన్ని బట్టి మతాన్ని అంచనావేయలేం. అమెరికాలో మితవాద క్రైస్తవ రాజకీయ ప్రభావం వున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు. కానీ అలా చూడం. తీవ్ర నేరాలు జరుగుతున్న నగరాలను గమనిద్దాం. ఇందులో 25 నగరాలు పరిశీలిస్తే ఎక్కువ నేరాలు రెడ్ స్టేట్స్ లోను, తక్కువ నేరాలు బ్లూ స్టేట్స్ లో ఉన్నాయి. అతి ప్రమాదకరమైన నగరాలుగా పరిగణించిన వాటిలో 76 శాతం రెడ్ స్టేట్స్ లోను, 24 శాతం బ్లూస్టేట్స్ లోనూ ఉన్నాయి. ఆమాటకొస్తే అమెరికాలో అతి ప్రమాదకరమైన ఐదు నగరాలలో మూడు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇళ్ల దోపిడీ ఎక్కువగా జరిగే పన్నెండు రాష్ట్రాలు క్రైస్తవానికి చెందిన రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 24 దొంగతనాలకు పేరుమోయగా అవి రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. హత్యలకు మారుపేరయిన 28 రాష్ట్రాలలో 17 క్రైస్తవ రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి.
అయితే ఇలాంటి పరస్పర సంబంధం సమాచారం కార్యకారణతను వివరించదు. దేవుళ్ళ నమ్మకం వలన సమాజం నిర్వీర్యం కావచ్చు. సమాజంలో చైతన్యత లేకపోవడం దేవుడి పట్ల నమ్మకానికి దారితీయవచ్చు.  ఈ రెండు ఇతరత్రా తప్పుడు భావనల వలన జనించవచ్చు. ఈ కార్యకారణ సంబంధాన్ని అలా ఉంచి గణాంక వివరాలు చూస్తే సభ్య సమాజం కోరుకునే వాటికి పొందికగా నాస్తికత్వం ఉన్నది. దేవుడి మీద నమ్మకం వలన సమాజం ఆరోగ్యకరంగా రూపొందుతున్నట్లు దాఖలాలు లేవు.
నాస్తికత  ఎక్కువగా ఉన్న దేశాలలో దాతృత్వం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చెందవలసిన దేశాలకు సహాయం చేసే తీరు బాగా కనిపిస్తున్నాయి. క్రైస్తవ ఉదారవాదం, క్రైస్తవ విలువలు పరస్పరం సంబంధం కలిగి ఉండడం అబద్ధమని అక్కడ సాంఘిక అసమానతలు ఎక్కువ ఉన్నాయని స్పష్టపడుతున్నారు. కొన్ని సంస్థలలో ప్రధాన అధికారికి సాధారణ ఉద్యోగులకు మధ్య వేతనాల నిష్పత్తి గమనించవచ్చు. గతంలో ఇది 24:1, ఫ్రాన్స్ లో 15:1, స్వీడన్ 13:1, అమెరికాలో 475:1, అలాంటి అమెరికాలో తుది తీర్పునాడు దేవుడి ముందుకు అందరినీ హాజరు పెట్టాలని జనం నమ్ముతారు. అంటే ఒంటె సూది బెజ్జంలో నుండి సులభంగా దాటిపోతుందన్నమాట. (బైబుల్ కథనం అలా ఉంది).
       మూలం                                   అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య
Please see the latest ebook with articles covering humanism, rationalism, skepticism, criticism of superstions, blind beliefs, fradulent alternative medicines in the website at:
http://www.saarangabooks.com/magazine/?p=2002

These articles are in Telugu language
comments are welcome

దేవునికోసం మంచి చెయ్యడం


నాలుగవ భాగం


దేవుడి పేరుతో ప్రజలు చేసిన మంచి పనుల మాటేమిటి? మానవుల బాధలు నివారించడానికి చాలా మంది విశ్వాసపాత్రులు వీరోచిత త్యాగాలు చేసినమాట వాస్తవం. ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటో తగిన సాక్ష్యాధారాలు లేకుండా నమ్మడం అవసరమా?  దయచూపడం అనేది మత మూర్ఖత్వంపై ఆధారపడి ఉంటే యుద్ధ భీభత్స ప్రాంతాలలో సెక్యులర్ డాక్టర్లు చేస్తున్న పనిని ఎలా అర్ధం చేసుకోవాలి. చాలామంది డాక్టర్లు మానవ బాధలను నివృత్తి చేయడానికి దేవుని ఆలోచనలతో నిమిత్తం లేకుండానే కృషి చేస్తుంటారు. క్రైస్తవ మిషనరీలు బాధా నివృత్తికి పని చేస్తున్నప్పటికీ వారు ప్రమాదకరమైన, చీలికలు తెచ్చిపెట్టే గాధల ప్రచారానికి పూనుకుంటున్నారు. అవసరాలున్న ప్రజల్ని మతం మార్పిడి చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మిషనరీలు చాలా డబ్బు ఖర్చు పెడుతూ చాలా కాలాన్ని వృధా చేస్తున్నారు. వారు కుటుంబ నియంత్రణ గురించి, లైంగికంగా అంటుకుంటున్న వ్యాధుల గురించి, తప్పుడు సమాచారాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. సరైన సమాచారాన్ని దాచి పెడుతున్నారు. మిషనరీలు చిక్కుల నెదుర్కొంటూ గొప్ప పనులు చేస్తున్నా వారి మూర్ఖ విశ్వాసాలవల్ల అజ్ఞానం ప్రబలుతున్నది. ఇందుకు భిన్నంగా సెక్యులర్ సంస్థలు, సరిహద్దులు పాటించని డాక్టర్లు జీసస్  కన్యకు పుట్టాడంటూ కాలం వృధా చేయరు. ఆఫ్రికా ఎడారులలో 40 లక్షల ప్రజలు ఏటా ఎయిడ్స్ వ్యాధితో చనిపోతున్నారు. అయినా సరే కండోములు వాడటం పాపమని వారు చెబుతున్నారు. క్రైస్తవ మిషనరీలు పల్లె ప్రజలకు కండోములు గురించి ఎలాంటి సమాచారం లేని చోట అవి వాడితే పాపం అంటూ చెబుతుంటారు. సామూహికంగా జనాన్ని చంపే పవిత్ర కార్యం ఇది. (వాటికన్ కండోములను వ్యతిరేకిస్తున్నది. పెళ్ళయినవారి మధ్య హెచ్.ఐ.వి. వ్యాధి వ్యాపించకుండా కండోములు వాడటానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఈ విధానాన్ని మళ్ళీ పరిశీలిస్తున్నట్లు పోప్ ఆలోచన గురించి వదంతులున్నాయి. ఈ సమస్యను శాస్త్రీయంగా, సాంకేతికంగా, నైతికంగా అధ్యయనం చేస్తున్నట్లు వాటికన్ రేడియో ప్రకటించింది. మతపరమైన సలహా సంఘ అధ్యక్షులు కార్డినల్ జేవియర్ లొజానో బారగన్ అటువంటి ప్రకటన చేశాడు. మూఢ విశ్వాసాలను నిలబడవు అనడానికి క్రైస్తవమతంలో వస్తున్న మార్పు సూచన కావచ్చు. విశ్వాసంలో వివేచన ఉన్నదనడానికి ఆధారాలు లేవు.) ప్రజలు బాధపడుతుంటే వారికి సహాయపడడం మంచిదా లేదా అలా సహాయ పడితే సృష్టికర్త బహూకరిస్తాడని భావించడం మంచిదా?
మత మూఢ విశ్వాసం వలన నైతిక భావనలు ఎలా దెబ్బతింటాయో, ఈ విషయంలో ఇతరులకు సహాయపడే నిమిత్తం మంచి వ్యక్తి కూడా ఏవిధంగా దారి తప్పుతాడో, మదర్ తెరీసా నిర్దుష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. క్రిస్టొఫర్ హిచిన్స్ ఆవిడ స్వభావాన్ని అరమరికలు లేకుండా ఇలా చెప్పాడు :
‘మదర్ తెరీసా పేదల స్నేహితురాలు కాదు. ఆమె పేదరికానికి మిత్రురాలు. బాధలు పడడం దేవుడి వరం అని ఆమె చెప్పింది. పేదరికాన్ని పోగొట్టడానికి స్త్రీలను శక్తివంతం చేయడం, తప్పనిసరిగా పిల్లల్ని కనడం నుండి విమోచన చేయడం అనేవాటిని ఆమె జీవితాంతం వ్యతిరేకించింది.’
హిచిన్స్ చెప్పేదాంతో నేను చాలా వరకు అంగీకరిస్తున్నాను. మదర్ తెరీసా దయ చూపడంలో గొప్ప శక్తివంతురాలు. తోటివారు బాధపడుతుంటే ఆమె చలించిపోయి ఆ బాధను గురించి పట్టించుకునేటట్లు చేసింది. ఆమె దయ అంతా కూడా మత మూఢవిశ్వాసాలలో చిక్కుకు పోయింది. నోబెల్ ప్రైజ్ బహుమానాన్ని ఆమోదిస్తూ ఆమె చెప్పిన మాటలివి :
‘శాంతిని నాశనం చేసేది గర్భస్రావం. చాలామంది భారతదేశంలో, ఆఫ్రికాలో పిల్లలు చనిపోతున్నారని, తగిన ఆహారం లేక ఆకలి బాధతో అస్తమిస్తున్నారని అనుకుంటున్నారు. కాని లక్షలాది మంది చనిపోవడానికి తల్లులు ప్రసవించే ధోరణే కారణం. శాంతిని నశింపచేసే విషయం అది. తల్లి తన బిడ్డను చంపుకుంటే – నిన్ను నేను, నన్ను నీవు చంపడానికి తేడా ఏముంది?’
ఈ మాటలు తప్పుద్రోవన పట్టాయని చెప్పక తప్పదు. నీతికి సంబంధించిన విషయంగానూ ఇందులో చెప్పుకోదగింది లేదు. భూమి మీద జరుగుతున్న ఎన్నో బాధల్ని కష్టాల్ని పక్కన పెట్టి, తల్లి తొలిదశలోని పిండాన్ని అంతం చేయడం ఆమె దయకు గురి అవుతున్నది. గర్భస్రావం వాస్తవ విషయం. ఇది తగ్గించటానికి కండోములు వాడటం చక్కని మార్గం. గర్భస్రావం అంతం అవుతున్న పిండాలు ఏ స్థాయిలో బాధపడుతున్నాయో తెలుసుకుంటే మంచిది. యుద్ధంలో, కరువులో, రాజకీయ చిత్రహింసలలో మానసిక రుగ్మతలతో బాధపడే కోట్లాదిమంది ప్రజల గురించి పట్టించుకోవడం అవసరం. లక్షలాది మంది ఊహించడానికి  వీలులేనంతగా భౌతిక, మానసిక చిత్రహింసలకు గురవుతున్నారు. అలాంటిచోట దేవుడిదయ కానరాదు. పైగా మానవుల పట్ల దయచూపుతున్నామనేవారు పాపాన్ని, ముక్తిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మానవ బాధల్ని పట్టించుకోదలిస్తే అందులో గర్భస్రావం అనేది ఏమంతగా చింతించాల్సిన అంశం కాదు.
అమెరికాలో గర్భస్రావ సమస్య చాలామందిని విడదీస్తున్నది. క్రైస్తవ మతం ఎల్ సాల్వడార్ అనే దేశంలో  ఈ సమస్యపట్ల అవలంబించిన నైతిక దృష్టి దారుణంగా బయటపడింది. అక్కడ గర్భస్రావం ఏ పరిస్థితులలోనైనా చట్ట విరుద్ధమే. చెరచటం, చిన్నపిల్లలతో లైంగిక సంబంధం కూడా మినహాయింపులకు గురి కాలేదు. గర్భస్రావం జరిగినట్లు ఏ ఆసుపత్రిలోనైనా తెలిస్తే ఆ స్త్రీని నేరస్థురాలిగా చిత్రహింసలు చేస్తున్నారు. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తున్నారు. గర్భం తొలగించుకున్నందుకు 30 ఏళ్ల నుండి అనుభవిస్తున్నవారున్నారు. కండోములు వాడటం దైవం పట్ల పాపం చేసినట్లేనని చెబుతున్న దేశంలో పరిస్థితి ఇది. మదర్ తెరీసా ప్రపంచంలో బాధలను గురించి చెబుతున్న విషయాలను అంగీకరిస్తే ఎల్ సాల్వడార్ ఆర్చిబిషప్ గర్భస్రావ వ్యతిరేక ప్రచారం చేశాడు. 1999లో మెక్సికో సిటీని సందర్శించిన రెండవ పోప్ జాన్ పాల్ అటువంటి చర్యను సమర్థించాడు. క్రైస్తవ మతం మరణ సంస్కృతికి విరుద్ధంగా జీవిత అనుకూలతను చాటాలన్నాడు.
క్రైస్తవ మతం గర్భస్రావాన్ని గురించి జీవశాస్త్రం చెబుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకోదు. మానవుడి బాధల గురించి కూడా వాస్తవ విషయాలను స్వీకరించదు.
గర్భస్రావాన్ని గురించి క్రైస్తవ మతం జీవశాస్త్రం చెప్పే అంశాలను పట్టించుకోవడంలేదు. గర్భస్రావంలో 80 శాతం వాటంతట అవే జరుగుతున్నాయి. గర్భం దాల్చిన స్త్రీకి తెలియకుండా కూడా ఇవి జరుగుతున్నాయి. గర్భధారణ 20 శాతం నిలబడక పోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడు గనక ఉంటే అందరికంటే ఎక్కువగా గర్భస్రావాలను చేయిస్తున్నది అతడే అనవచ్చు.
         మూలం                                     అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

మత మూర్ఖవాదం నైతిక వివేచనను కప్పిపుచ్చుతున్నది. -శామ్ హారిస్ -3




బైబుల్ ను దైవ వాక్యంగా పరిగణిస్తే తప్ప విశ్వ వ్యాప్తమైన నీతిప్రమాణాలు ఉండడానికి వీలులేదంటారు. కాని నియమాలు ఇచ్చే దేవుడు లేకుండానే నిష్పాక్షికంగా నీతి విధానాలను ఆలోచించవచ్చు. బాహ్యమైన నీతి సూత్రాలు తెలుసుకోదగినవి ఉంటే ప్రపంచంలో సంతోషాన్ని పంచుకోవటానికి ఉత్తమ అధమ మార్గాలు వెలువడతాయి. మానవులను నిర్దేశించే మానసిక నియమాలు ఉంటే బాహ్య నీతికి తగిన ఆధారం కూడా లభిస్తుంది. మానవ నీతికి శాస్త్రీయ అవగాహనలో తుది అంశం అంటూ ఏదీ లేదు. చంపడం, చెరచడం, పొరుగువారిపట్ల అలాంటి ప్రవర్తన కూడదనడం సర్వ సాధారణంగా వస్తున్నదే. ప్రేమ సంతోషానికి దారితీస్తుందని ద్వేషం అలాంటి సంతోషం ఇవ్వదని స్పష్టంగా తెలుస్తున్నది. సామాజిక సంబంధాలలో బాహ్యరీతులు ఈ విధంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎలాంటి పవిత్ర గ్రంథాలు ప్రస్తావించకుండానే హిట్లర్ తప్పు చేస్తున్నాడని, నైతికంగా దోషి అని చెప్పవచ్చు.
ఇతరుల పట్ల ప్రేమ చూపటం సంతోషానికి దారితీసే అంశమైనా, మనము ప్రేమించిన వారిని పట్టించుకోవడంలో సుఖదుఃఖాలు స్పష్టంగా ఉంటాయి. సుఖాన్ని కోరుకోవడంలో త్యాగం, మనకి కావాలనుకునేవాటిని త్యజించడం కూడా కొన్నిసార్లు హేతుబద్ధంగానే కనిపిస్తుంది.  అనేక సందర్భాలలో ఇతరుల కోసం త్యాగం చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడం కూడా గొప్ప లక్షణంగానే ఉన్నది. ఇందులో తగిన ఆధారాలు లేకుండా అనుబంధాలు పెంచుకోలేము. బైబుల్ లో జీసస్ చెప్పినదాన్ని బట్టి మానవజీవితాన్ని మార్చగలిగేది ప్రేమ. అటువంటి క్రీస్తు ప్రవచనాలను స్వీకరించడానికి అతడు కన్యకు పుట్టాడని, మరోసారి భూమి మీదకు తిరిగి వస్తాడని నమ్మనక్కరలేదు.
మతంలో దుర్మార్గపు ప్రభావం ఏమంటే వాస్తవంగా మానవులు జంతువులు బాధపడే చోట నీతికి ఎలాంటి సంబంధం అందులో లేదని చెప్పడమే. నీతితో నిమిత్తం లేనప్పుడు అది ఉన్నట్లు ఊహించడం మతం చేస్తున్న పని, బాధలు నివారించడం అనే అంశంలో నీతి వుందా లేదా అనేది మతం పట్టించుకోదు. చాలా అవినీతికరమైన విషయాలలో నీతిని ఊహించుకోమనడం మతం చేస్తున్నపని. అలాంటి సందర్భాలలో అమాయక ప్రజలు అనవసర బాధలకు గురి అవుతున్నారు. మీ వంటి క్రైస్తవులు గర్భస్రావాన్ని వ్యతిరేకించనప్పుడు ఇలాంటి ఫలితమే వస్తుంది. దీనికి బదులు సామాజిక హత్యలను వ్యతిరేకిస్తే బాగుంటుంది. మానవ పిండాలు గురించి పట్టించుకునేదానికంటే జీవకణాలపై పరిశోధన చేసి జీవితాన్ని కాపాడే రీతులు కనిపెట్టాలి అనే అంశాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది. లక్షలాది మంది ఏటా ఎయిడ్స్ వ్యాధితో చనిపోతూ ఉంటే ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలో కండోములు వాడకూడదని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కాదు.  
మతపరంగా సెక్స్ ను నీతికి ముడిపెట్టి తప్పుగా చూడటం సాధారణంగా గమనిస్తున్నాం. ఇద్దరు స్త్రీ పురుషులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకున్నా అది అదుపులో పెట్టాలని భావిస్తే ఏమేరకు మానవుడి బాధల్ని నివారించగలమో అర్థం కాదు. బాధల నుండి విమోచన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. నగ్నంగా ప్రజలు చేసే పనుల పట్ల సృష్టికర్త నొచ్చుకుంటున్నట్లుగా వీళ్లు చెబుతారు. మానవుడి బాధలకు ఇది అదనంగా జతచేసే విషయం కూడా.
లైంగిక సంబంధం ద్వారా అమెరికాలో వస్తున్న ప్రమాదకరమైన రోగాలలో హ్యూమన్ పాపిలోమా వైరస్ ఉన్నది. అమెరికాలో సగం జనాభాకు ఈ వైరస్ అంటుకుంటున్నది. ఏటా ఐదువేలమంది స్త్రీలు సర్వికల్ కాన్సర్ ద్వారా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధివల్ల చనిపోయేవారు రెండు లక్షలకు పైగా ఉన్నారని రోగ నిరోధక కేంద్రాలు లెక్కలు చెబుతున్నాయి.  ఈ వైరస్ కు నేడు వేక్సిన్ లభిస్తున్నది. అది సమర్థవంతంగా సురక్షితంగా పనిచేస్తున్నది. చికిత్సలో ముందుగా పరీక్షచేసి చూచినప్పుడు  ఈ వాక్సిన్ ఆరువేలమంది స్త్రీలలో నూటికి నూరుశాతం రోగ నిరోధక శక్తి పెంపొందినట్లు తెలిసింది. ప్రభుత్వంలో క్రైస్తవ మితవాదులు దీనికి అడ్డుచెబుతూ పెళ్ళి కాకముందు లైంగిక సంబంధానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. లైంగిక సంబంధం ఆపడానికి సర్వికల్ క్యాన్సర్ ను అట్టిపెట్టుకోవడం పవిత్రత పేరుతో చేస్తున్న పని. దానివలన వేలాది స్త్రీలు ఆహుతయిపోతున్నారు.
యువతులను లైంగిక విధానాల నుండి నిగ్రహంగా ప్రవర్తించమని చెప్పడంలో తప్పులేదు. అలా చెప్పినందువలన యువతులలో గర్భం ధరించడం, లైంగికంగా వచ్చే వ్యాధుల్ని ఆపడం కుదరలేదు.  నిగ్రహించుకోమని పిల్లలకు బోధిస్తే లైంగిక చర్యలో వారు చాలా వరకు కండోములు వాడుతున్నారు. యువతులుగా ఉన్న కన్నెలు ప్రమాణాలు చేసి సగటున 18 మాసాలపాటు లైంగిక సంబంధాన్ని నిలపగలుగుతున్నారు. ఆ సమయంలో లైంగికంగా ఇతర చర్యలకు నిమగ్నులవుతున్నారు. అమెరికా యువతీ యువకులు మిగిలిన అభివృద్ధి చెందిన ప్రపంచంలోవలె లైంగిక సంబంధాలను అట్టిపెడుతున్నారు. కానీ అమెరికాలో అమ్మాయిలు గర్భం ధరించడం, పిల్లల్ని కనడం, గర్భస్రావానికి తలపెట్టడం మిగిలిన చోట్ల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా జరుగుతున్నది. అమెరికాలో యువతరానికి లైంగిక వ్యాధులు, హెచ్ ఐ వి రోగాలు ఉంటున్నాయి. అమెరికా యువతరంలో గనేరియా వ్యాధి, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ కంటే 70 రెట్లు అధికంగా ఉంటోంది. సెక్స్ విద్యా కార్యక్రమాలు, కేవలం నిగ్రహాన్ని పాటించమంటూ సాలీనా 200 మిలియన్ డాలర్లు అలా విద్యా కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఉండటం వలన ప్రయోజనం చేకూరడంలేదు.
మీ వంటి క్రైస్తవులు యువతరంలో వస్తున్న గర్భధారణ గురించి వ్యాధుల వ్యాప్తి గురించి  ప్రధానంగా పట్టించుకోరు. లైంగిక సంబంధాల వలన పడే బాధల్ని గమనించట్లేదు. వీరు చింతించేదల్లా లైంగిక చర్యలు గురించే. రెజినాల్డ్ ఫింగర్ అనే మత బోధకుడు ఇటీవల హెచ్.ఐ.వి. వ్యాక్సిన్ గురించి ప్రతిఘటన ఉద్యమం చేస్తానని ప్రకటించాడు. తద్వారా కోట్లాదిమంది స్త్రీ పురుషులు ఏటా ఎయిడ్స్ వ్యాధితో చనిపోవడం సంభవిస్తుంది. అయితే అతడి దృష్టిలో వ్యాక్సిన్ తీసుకుంటే పెళ్శికి ముందే లైంగిక సంబంధాలు ప్రోత్సహించినట్లవుతుందని అతని ఉద్దేశ్యం. మీ మత నమ్మకాలు ఈ విషయంలో ఘోర విపత్తులు తెచ్చిపెడుతున్నాయి. ఈ అభిప్రాయాలు వెల్లడించిన వ్యక్తి రోగ నిరోధక చర్యల సంఘం సలహాదారుగా ఉన్నాడు.
పిండం స్థాయిలో కణాల పరిశోధనపై మీ ధోరణి అసహ్యకరంగా ఉన్నది. గత శతాబ్దంలో వైద్యరంగంలో కణ పరిశోధనలు చాలా ఆశాభావాన్ని కలిగించిన విషయం, మానవులు బాధపడుతున్న అనేక జబ్బులకు విరుగుడుగా ఈ పరిశోధన తోడ్పడే అవకాశం ఉంది. పిండంలో కణాలు తొలి దశలోనే మానవ శరీరంలో టిష్యూగా మారే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. క్యాన్సర్ ను గురించి మన అవగాహనకు, అనేక రోగాల విషయంలో విషయ పరిజ్ఞానానికి  ఈ పరిశోధనలు తోడ్పడతాయి. కనుక కణ పరిశోధన ప్రాధాన్యత ఎంత విశేషమో చెప్పనక్కరలేదు. పిండం మూడు రోజుల స్థాయిలో కణాలు అంతం కావచ్చు. అదే మిమ్మల్ని కలవర పెడుతుంది.
వివరాలు చూద్దాం. మూడు రోజుల మానవ పిండంలో 150 కణాలుంటాయి. వాటిని బ్లాస్టోసిస్ట్ అంటారు. పోల్చి చెప్పాలంటే ఒక ఈగ మెదడులో లక్ష కణాలుంటాయి. మానవుడి పిండంలో కణ పరిశోధన వలన నశించిపోతోంది అనే స్థాయిలో మెదడు లేదని గ్రహించాలి. కనీసం నరాలు కూడా ఉండవు. అందువలన అవి విధ్వంసం అవుతుంటే అక్కడ బాధపడేవాళ్లు ఎవరూ లేరు. వ్యక్తి మెదడు చనిపోయినప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణ మానవుడుగా గుర్తింపబడడు. అలాగే బ్లాస్టోసిస్ట్  కూడా. బాధపడడం అనేది పట్టించుకోవలసిన విషయం అయితే మానవులలో బ్లాస్టోసిస్ట్ ను అంతం చేయడం కంటే ఈగను చంపడం నైతికంగా ఎక్కువగా బాధాకరం కావాలి.
ఈగకు మానవ బ్లాస్టోసిస్ట్ కు ప్రధానమైన తేడా ఉన్నదని, బ్లాస్టోసిస్ట్ ఉత్తరోత్తర సంపూర్ణ మానవుడయ్యే అవకాశం ఉన్నదని అనవచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ దృష్ట్యా శరీరంలో ప్రతి కణం కూడా మానవ స్థాయి ఉన్నటువంటిదే. ముక్కు చీదినప్పుడల్లా ఎన్నో కణాలను చంపేస్తుంది. అది వాస్తవం. ఈ విధంగా చూస్తే కణాల శక్తి విషయంలో మనం ఏమాత్రం ముందుకు సాగలేం.
మానవ పిండంలో మూడురోజుల వయస్సుగల స్థాయిలో ఆత్మ ఉంటుందని అందుకని నైతికంగా పట్టించుకోవాలని అనవచ్చు. ఆ దశలో పిండాలు చీలిపోయి కవలలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఆత్మ రెండుగా చీలిపోతుందనా. మరికొన్ని సందర్భాలలో రెండు పిండాలు కలిసిపోయి ఒక వ్యక్తిగా మారితే దానిని చిమేరా అంటున్నాం. ఆ విధంగా పెంపొందిన మానవులు ఉన్నారు. మతవాదులు ఇలాంటి సందర్భాలలో అదనపు ఆత్మ ఎలా నిర్ధారించాలో తెలియక సతమతమవుతున్నారు.
ఇలాంటి ఆత్మ లెక్కల గురించి చెప్పడం అర్థం పర్థం లేనిదని అనిపించడం లేదా, మేథస్సు దృష్ట్యా ఆత్మల భావాన్ని సమర్థించలేం. నైతికంగానూ సమర్థించలేం. వైద్య చరిత్రలో గొప్ప అవకాశాలను సాగనివ్వకుండా ఈ వాదనలు అడ్డుపడుతున్నాయి. పైగా  ఈ నమ్మకాలు  ఆత్మలపరంగా చూస్తే కోట్లాది మానవుల బాధల్ని ఇంకా పొడిగించే అవకాశం వుంది.
బ్రతుకు అంటే గర్భం ధరించినప్పుడు ఆరంభం అవుతుందని అంటారు. ప్రతి బ్లాస్టోసిస్ట్ లో ఆత్మలున్నాయని ఒక ఆత్మ మరొక ఆత్మ అవసరాలను తీర్చలేదని చెబుతారు. విశ్వాసం ఆధారంగా హేతుబద్ధం కాని విషయాలను చెబితే కణ పరిశోధన సాగదు. అలాంటి వాదనలో నైతికత లేదు. విషయం తెలియక పిండస్థ స్థాయిలో కణ పరిశోధనలు అడ్డుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ పరిశోధనలకు ఆర్థిక సహాయాన్ని చేయకపోవడంలో నైతిక కారణాలేమీ లేవు. కణ పరిశోధనకు విపరీతంగా వనరులు సమకూర్చి తక్షణమే దానిని ముందుకు సాగనివ్వాలి. క్రైస్తవుడు ఆత్మల గురించి నమ్మినందువలన ఇలా చేయమనడం లేదు.
అనేక రాష్ట్రాలు కణ పరిశోధనను చట్ట విరుద్ధం చేశాయి. సౌత్ డకోటాలో బ్లాస్టోసిస్ట్ పై పరిశోధన చేస్తే జైలుపాలు కావచ్చు కూడా. ఇక్కడ నైతిక సత్యం స్పష్టం. బ్లాస్టోసిస్ట్ పట్ల ఆసక్తిని మతపరంగా గమనించకపోతే అటువంటి వారి నైతిక దృష్టి విఫలమైనట్లే, మతానికి, నీతికి ఉన్న సంబంధాన్ని తక్కువ ధోరణిలో చెబుతున్నారు. మత మూర్ఖవాదం నైతిక వివేచనను కప్పిపుచ్చుతున్నది.

  మూలం           అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

క్రైస్తవుల నుద్దేశించి శామ్ హారిస్ రాసిన లేఖ--2




ద్వితీయ భాగం
అసత్య బోధనలు

ఈ విషయములను నీవు తప్పక బోధించుచు, హెచ్చరించవలెను.
‘మన ప్రభువగు ఏసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తియైనను జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టి వానికి వాగ్వివాదములయందును, వాగ్యుద్ధముల యందును అభిలాష మెండు. వీని మూలముగ అసూయలు కలహములు, దుషణలు, దుష్ట సందేహములు.’
-- తిమోతి 6..1 – 4
19వ శతాబ్దంలో బానిసత్వం పోవాలనేవారు సరిగానే ఆలోచించినప్పటికీ మత రీత్యా వారి వాదన బలహీనంగా ఉన్నది. 1845లో రిచర్డ్ ఫుల్లర్ చెప్పినట్లు బైబుల్ లోని పాత కొత్త నిబంధనలలో దేవుడు చూపిన మార్గాలు పాపాలు కావడానికి వీలులేదు. రిచర్డ్  ఈ విషయంలో గట్టి ఆధారాలతో ఉన్నారు. క్రైస్తవ మత శాస్త్రం బైబుల్ లోని లోపాలను దిద్దగలిగిన స్థితిలో లేదు.
బానిసత్వం పోవాలనేవారు బైబుల్ నుండే ప్రేరణ పొందారని అనవచ్చు. ఆ మాట నిజమే. బైబుల్ నుండి నైతిక, ప్రేరణాత్మక విషయాలను సమర్థించుకోవడానికి అక్కడక్కడ ఉదహరించిన విషయాలను చూపుతున్నారు. దీనిని బట్టి బైబుల్ ను దైవవాక్యంగా ఆమోదిస్తే కోట్లాది అమాయక స్త్రీ పురుషులను, పిల్లలను బానిసత్వం వైపు దింపడం వారి దృష్టిలో తప్పు కాదు. బైబుల్ బానిసత్వానికి మించి చేసిన సమర్థన అలాంటిది. కొంతమంది బానిసత్వం పోవాలనేవారు బైబుల్ లో కొన్ని భాగాలను ఉదహరిస్తూ మిగిలిన భాగాలు తృణీకరిస్తే బైబుల్ మంచి నీతివంతమైన మార్గదర్శి కాబోదు. మానవుడు నైతిక సమస్యలు పరిష్కరించుకోవడానికి బైబుల్ ను సంప్రదించాలనడం ఉచితం కాదు. బానిసలు కూడా మనవలె మానవులే. వారికీ సుఖదుఃఖాలు ఉంటాయని గ్రహిస్తే, పొలంలో వాడుకునే పనిముట్లువలె వారిని చూడటం మంచిది కాదు.  ఈ నిర్ణయానికి రావడం సులభమే అయినప్పటికీ అమెరికాలో పవిత్ర క్రైస్తవులుగా భావించబడుతున్న దక్షిణాది ప్రాంతపు సమాఖ్యవారు తుపాకీలు పట్టుకొని బైబుల్ వాక్యాలను ప్రచారం చేస్తున్నారు.
బైబుల్ పేర్కొన్న పది ఆజ్ఞలు గురించి ఆలోచించాలి. అమెరికాలో చాలామంది వాటిని నైతికంగా, చట్టబద్ధంగా తప్పనిసరి అంటున్నారు. అమెరికా రాజ్యాంగంలో దేవుడు ప్రస్తావన లేదు. రాజ్యాంగం ఏర్పడినప్పుడు అది మతేతర ప్రమాణ పవిత్రంగా భావించారు. కాని క్రైస్తవులు అమెరికాలో యూదు-క్రైస్తవ సూత్రాలపై స్థాపించినట్లు భావిస్తున్నారు. అందుకు మద్దతుగా పది ఆజ్ఞలను చూపుతున్నారు. వాటికి అమెరికా చరిత్రకు పొందిక ఏమిటని పరిశీలించవచ్చు. పది ఆజ్ఞల పట్ల మన గౌరవం యాదృచ్ఛికమైనది కాదని భావించాలి. బైబులులో పది ఆజ్ఞలను సృష్టికర్త స్వయంగా రాసినందున అవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. అలాంటి వాక్యాలు తిరుగులేనివని ఏ భాషలోనైనా ఏ విషయంలోనైనా వాటికి సాటి లేదని అంటున్నారు. అవేమిటంటే –
1.                మేము తప్ప మరొక దేవుడు లేడు.
2.                దేవుడి పేరిట రూపాలు చిత్రించరాదు.
3.                దేవుని పేరును దుర్వినియోగ పరచరాదు.
4.                విశ్రాంతి రోజున పవిత్రంగా గడపడం అవసరం.
5.                తల్లిదండ్రులను గౌరవించాలి.
6.                హత్య చేయరాదు.
7.                దొంగతనము చేయరాదు.
8.                వ్యభిచరించరాదు.
9.                పొరుగువారికి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యం చెప్పరాదు.
10.           పొరుగువాని ఇంటిని, అతని భార్యను, అతని సేవకులను, అతని పశువులను ఆశించకూడదు.
     ఇందులో మొదటి నాలుగు ఆజ్ఞలు నీతికి సంబంధించినవి కావు. యూదులకు, క్రైస్తవులకు సంబంధం లేనివి. హిందుమతం, తదితర మతాల కళలు స్వీకరించి పాటించరాదు. ‘దేవుడు శపించు’గాక అనే మాటలు వాడరాదు. సాబత్ వంటి విశ్రాంతి రోజున పనిచేస్తే మరణ శిక్షకు పాత్రులవుతారు. నాగరికత నిలబెట్టుకోవడానికి ఈ ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యత చెందినవో గమనించండి.
     5 నుండి 9 ఆజ్ఞల వరకు నీతికి సంబంధించినవి ఉన్నాయి. ఎంతమంది తమ తల్లిదండ్రులను గౌరవించారో, హత్యలు, వ్యభిచారం, దొంగతనం చేయకుండా ఉన్నారు అనేది ప్రశ్నించదగిన అంశం. చరిత్రలో ఇలాంటి వాటిని అన్ని సమాజ సంస్కృతులు ఖండించాయి. బైబిల్ లో వాటి ప్రస్తావనకు ప్రత్యేకత ఏమీ లేదు. తల్లిదండ్రులను బాగా చూడడం అనేది జీవ సంబంధమైన కారణాలుగా పరిణమించింది. హత్య చేసిన వారిని, వ్యభిచారులను, దొంగలను, అబద్ధాలాడేవారిని ఈసడించుకోవడం సర్వసాధారణం. పవిత్ర గ్రంథాలు రాకముందు నుండి క్రూరత్వాన్ని ఈసడించడం న్యాయబద్ధంగా ఉండాలనడం, నైతిక ఉద్వేగ రీతులుగా వచ్చాయి. మానవులకు ముందు నుండి ఇలాంటి ఉద్వేగాలు ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆదిమ మానవులు కూడా పూర్వం తమ సన్నిహితులకు ఆదరణ చూపుతూ హత్యల్ని, దొంగతనాల్ని సహించకుండా గడిపిన సందర్భాలున్నాయి. మోసాన్ని, లైంగిక ద్రోహాన్ని కూడా ఇష్టపడని రీతులున్నాయి. చింపాంజీలలో ఎన్నో క్లిష్టమయిన సామాజిక రీతులున్నాయి. మన బంధువులలో ఎలాంటి ప్రవర్తన కావాలనుకుంటామో అటువంటివి చింపాజీలలో కనిపిస్తాయి. కనుక నీతి సూత్రాలు పాలరాతిపైన చెక్కి చూపినంత మాత్రాన అవన్నీ పవిత్ర గ్రంథాల నుండి వచ్చినట్లు కాదు. ఈ విషయం అమెరికా వారు గ్రహించాలి. సృష్టికర్త పశువులను, సేవకులను పట్టించుకోకుండా పవిత్రగ్రంథాలు ప్రవచించాడనుకుందామా?
బైబుల్ దేవుణ్ణి వాస్తవంగా స్వీకరిస్తే అతడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించడానికి అశ్రద్ధ చేయడానికి మానవులకు స్వేచ్ఛ లేదు. శిక్షలు వేసే విషయంలోనూ చూసీ చూడనట్లుగా పోవడం కూడా దేవుడు ఒప్పుకోడు. పది ఆజ్ఞలను ఉల్లంఘిస్తే శిక్షలు తప్పనిసరి అన్నాడు.
పది ఆజ్ఞల నుంచి నీతి విషయంలో మెరుగైనవి మరేవీ లేవనుకుంటే ఇతర పవిత్ర గ్రంథాలలో అలాంటివి ఎన్నో ఉన్నాయి. జైనులలో వీటిని చూడవచ్చు. బైబుల్ వీటిని మించిపోయిన సూత్రాలను జైన మహావీరుడు చెప్పాడు. ‘హాని చేయవద్దు, దూషించవద్దు, అణచివేయవద్దు, అవమానించవద్దు, చిత్రహింసలు పెట్టవద్దు. బానిసలుగా బంధించవద్దు. జీవులను చంపవద్దు.’ బైబిలులో ఈ సూత్రం ఉంటే ప్రపంచం మరో తీరుగా ఉండేదేమో. శతాబ్దాలుగా దేవుళ్ళ పేరుతో క్రైస్తవులు అణచివేశారు. బానిసలను చేశారు, అవమానించారు. చిత్రహింసలు చేశారు. చంపారు. ఇదంతా బైబుల్ చదివి తదనుగుణంగా మతాన్ని కాపాడుతున్నామనుకుని చేసిన పనే. జైన సూత్రాలను పాటిస్తే ఇలాంటివి చేయడం అసంభవం. అటువంటప్పుడు నీతిని గురించి ఎవరూ చెప్పనంతగా బైబుల్ స్పష్టంగా చెప్పిందని ఎవరం అనగలం.
            మూలం                                   అనువాదం
        శామ్ హారిస్                           ఎన్. ఇన్నయ్య

క్రైస్తవుల నుద్దేశించి శామ్ హారిస్ రాసిన లేఖ


ప్రథమ భాగం(Letter to Christian Nation)


బైబుల్ దైవవాణిగా మీరు నమ్ముతున్నారు. జీసస్ ను దేవుని కుమారుడుగా విశ్వసిస్తున్నారు. జీసస్ లో నమ్మకం ఉంచిన వారికే మరణానంతరం ముక్తి ఉందంటున్నారు. క్రైస్తవుడుగా ఇవన్నీ నిజమని నమ్ముతున్నారు. అంతేగాని మీకు  వాటివల్ల బాగా ఉందని అనిపించడం ప్రధానం కాదు.  ఈ నమ్మకం వలన వచ్చే సమస్యలు చూపే ముందు మీరు, నేను అంగీకరించే విషయాలు కొన్ని ఉన్నాయి. మనలో ఎవరో ఒకరు చెప్పింది సరయినది కావాలి. మరొకరిది తప్పు కావాలి. ఇక్కడ బైబుల్ దైవవాక్యం కావాలి. లేదా దైవ వాక్యం కాదు అనేది సరయిన నిర్ణయం కావాలి. మానవుడికి జీసస్ ఒకే ఒక సరయిన ముక్తి మార్గాన్ని చూపారు. (యోహాను 14:6) లేదా అతడు చెప్పినది సరయిన మార్గం కాదనుకోవాలి. సరయిన క్రైస్తవుడు మిగిలిన అన్ని మత విశ్వాసాలలో తప్పు అనుకోవాలి. వారి దృష్ట్యా అది మంచిదే. క్రైస్తవం మనకి సరయినదయితే నావంటి నమ్మకం లేనివారు నరకంలో యమ యాతనలు పడటానికి సంసిద్ధులు కావాలి. నేను నా సన్నిహితులకు నచ్చచెప్పి దైవ భావాన్ని తృణీకరించమంటాను. అలాంటి వారంతా శాశ్వత నరకంలో కాలుతూ ఉండాల్సిందే (మత్తయి 25:41). క్రైస్తవ మూల సిద్ధాంతం సరయినదయితే నా జీవితాన్ని పరమ ఛండాలంగా గడిపానన్నమాట. అరమరికలు లేకుండా ఇందుకు నేనంగీకరించాలి. క్రైస్తవాన్ని బహిరంగంగా నిరంతరం నిరాకరించిన నాకు ఎలాంటి చీకు చింతా లేవు. క్రైస్తవునిగా ఉండడానికి నీకెలాంటి అసంబద్ధమైన నమ్మకాలున్నాయో నాకు తెలుసు.
కొందరు క్రైస్తవులు ఈ రెండు వాదనలతో అంగీకరించరు. ఇతర మత విశ్వాసాలు ముక్తికి తోడ్పడతాయని నమ్మే క్రైస్తవులున్నారు. నరకం అంటే భయపడనివారు, జీసస్ తిరిగి వస్తాడని నమ్మనివారు కొందరు క్రైస్తవులలో ఉన్నారు. అలాంటివారు మతపరంగా ఉదారవాదులు, మితవాదులు అని చెప్పుకుంటారు. నాకు, మీకు విశ్వాసం రావాలంటే వారి దృష్టిలో ఏదో తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆలోచనాపరమైన క్రైస్తవులు ఎందరో  నాస్తిక వాదానికి, మత మౌఢ్యానికి మధ్య ఎంతో విశాలమైన, రమణీయమైన దృక్పథాలు ఉన్నాయని చెబుతూ వచ్చారని అంటున్నాం. వారి ప్రకారం విశ్వాసం అంటే మార్మికత, విడమర్చి చెప్పడం. ప్రజల నమ్మకాల నుండి కాక వారి జీవితాల పడుగు పేకల నుండి మతాన్ని రూపొందించుకుంటారన్నారు. మతపరమై ఉదారత్వం, మితవాదాన్ని గురించి వచ్చే సమస్యల్ని నేను వేరే చోట్ల ప్రస్తావించాను. ఇక్కడ వారనుకునే వాటికంటే సాధారణమైన, అత్యవసరమైన విషయాలను పరిశీలించాలి. బైబుల్ కేవలం మామూలు గ్రంథం, మామూలు మనుషులు రాసింది అయివుండాలి. లేదా అందుకు భిన్నమైనదైనా అయివుండాలి. క్రీస్తు దివ్య వ్యక్తి అయి ఉండాలి. లేదా కాదనుకోవాలి. బైబుల్ గనక మామూలు గ్రంథం అయితే, క్రీస్తు మామూలు మనిషి అయితే క్రైస్తవ మూల సిద్ధాంతం తప్పు. అలాంటప్పుడు క్రైస్తవ మత శాస్త్ర చరిత్ర సామూహిక భ్రమలతో కూడిన కథలని అనుకోవాలి. క్రైస్తవ మూల సూత్రాలు సరయినవి అనుకుంటే, నమ్మకాలు లేనివారు ఆశ్చర్యపడాల్సిన అంశాలున్నాయి. అది మీరు గ్రహించవలసి వుంది. అమెరికాలో సగం జనాభాకు ఈ విషయం తెలుసు. అందువలన చిత్త శుద్ధిగా మాట్లాడుకుందాం. ఈ వాదోపవాదాల్లో ఒక పక్షం నెగ్గుతుంది. మరో పక్షం ఓడిపోతుంది.
గమనించండి
ప్రతి ముస్లిం భక్తులు ముస్లింగా ఉండడానికి చెప్పే కారణాలు, క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉండడానికి చెప్పేకారణాలు ఒకలాంటివే అయినా ముస్లింలు చెప్పే కారణాలను సరయినవిగా నేను భావించను. కొరాన్ ‘సృష్టికర్త వెల్లడించిన దివ్య వాక్కు’ అన్నారు. బైబుల్ గురించి మీరెలా నమ్ముతున్నారో, ముస్లింలు కురాన్ గురించి అలాగే నమ్ముతున్నారు. మహమ్మద్ జీవితాన్ని చిత్రిస్తూ చాలా సాహిత్యం వచ్చింది. ఇస్లాం దృష్ట్యా అతడు దైవ ప్రవక్తగా ఇటీవల ఆవిర్భవించినవాడు. మహ్మదు స్పష్టంగా చెబుతూ జీసస్ ను దివ్యత్వం కలవాడు కాదన్నాడు (కురాన్ 5:71-75; 19:30-38). అన్యథా నమ్మేవారు శాశ్వతంగా నరకంలో మగ్గుతారన్నారు.  ఈ విషయంలో మహమ్మద్ అభిప్రాయం తిరుగులేనిదని ముస్లింల ఉద్దేశ్యం.
ఇస్లాంలోకి మారడంలో మీరు కలవరపడాల్సిన అంశం ఏది? అల్లా నిజమైన దేవుడు కాదా? కొండ గుహలలో గాబ్రియెల్ అనే దేవత మహమ్మదును కలుసుకోలేదని రుజువు పరచగలవా? లేదు. ముస్లింల నమ్మకాలు అర్థం లేనివని తృణీకరించడానికి ఇవేమి రుజువు చేయనక్కరలేదు. మహమ్మదు వారి దేవుడు నిజమని నిరూపించే భారం ముస్లింలపైన పడింది. కాని వారలా రుజువు చేయలేరు కూడా. వాస్తవాన్ని గురించి సాక్ష్యాధారాలు ఉండాలని ముస్లింలు జడవలేదు. ఇస్లాం పిడివాదం మత్తులో ఉన్నవారు తప్ప మిగిలిన వారికి  ఈ విషయం అర్థం అవుతుంది.
ముస్లింలకు సంబంధించిన నమ్మకాలు ఎలాంటివో నాస్తికుడిగా ఉండటం కూడా అలాంటిదే. ముస్లింలు వారిని వారు మోసం చేసుకోవడం లేదా? ‘కురాన్ సృష్టికర్త సంపూర్ణ వాక్కు’గా భావిస్తే ఆ పుస్తకాన్ని వారు నిశితంగా చదవలేదని తెలియడంలేదా? విశ్వం సిద్ధాంతాలు చిత్తశుద్ధితో పరిశీలించడానికి పనికిరావని స్పష్టం కావడంలేదా? అవును స్పష్టమే. నీవు ముస్లిం గురించి ఎలా అనుకుంటున్నావో నిన్ను గురించి ముస్లిం భక్తులు కూడా అలాగే అనుకుంటున్నారు. అన్ని మతాల గురించి నా ధోరణి అదే.
బైబుల్ ఎంత అత్యుత్తమమైనది ?
మానవ మంచితనానికి తిరుగులేని ఆధారం క్రైస్తవమేనని నీవనుకుంటున్నావు. జీసస్ ప్రేమను, దయను, స్వార్థ రాహిత్యాన్ని చూపాడని నమ్ముతున్నావు. ఇంతవరకు వచ్చిన గ్రంథాలలో బైబుల్ అత్యుత్తమమైనదని, కాల పరీక్షకు నిలచిందని, అది దైవ ప్రేరితమని నమ్ముతున్నావు. ఈ నమ్మకాలన్నీ తప్పుడువే.
నీతికి సంబంధించిన అంశాలు ఆనందానికి, బాధలకు చెందినవే. అందుకనే మనకు శిలల పట్ల నైతిక బాధ్యత లేదు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇతరులకు నీతి అంశాలు అన్వయిస్తే మన చర్యల ద్వారా ప్రభావితం అయితే అప్పుడు నీతి సమస్య వస్తుంది. బైబుల్ నీతికి సంపూర్ణ మార్గదర్శకమని అనడం దిగ్భ్రమ కలిగిస్తుంది. ఆ పుస్తకంలో అంశాలు చదివిన తరువాత అలా అనిపిస్తుంది. తల్లిదండ్రులకు దేవుడిచ్చిన సలహాలు సూటిగా ఉన్నాయి : పిల్లలు దారి తప్పితే బడిత పూజ చేయండి. (సామెతలు 13:24, 20:30, 23:13-14). సిగ్గు ఒగ్గు లేకుండా మాట్లాడితే చంపేయండి. (నిర్గమకాండం 21:15, లెవీయ కాండం 20:9, ద్వితీయోపదేశం కాండం 21.:18-21, మార్క్ 7:9-13, మాథ్యూ 15:4-7) నమ్మనందుకు, వ్యభిచారానికి, స్వలింగ సంపర్కానికి, విశ్రాంతి రోజున పనిచేసినందుకు, విగ్రహారాధన చేసినందుకు, భూతవైద్యానికి తదితర ఊహాజనిత నేరాలకు రాళ్ళేసి కొట్టి చంపాలి. దేవుడికి కాలాతీత వివేచన ఎంత ఉందో ఒక ఉదాహరణ చూడండి.
‘నీ సోదరుడు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భార్య, నీ స్నేహితుడు రహస్యంగా వచ్చి ఇతర దేవుళ్ళను ఆరాధించడానికి రమ్మంటే లొంగిపోవద్దు, వినద్దు, వారిపట్ల దయ చూపవద్దు, వదిలిపెట్టద్దు. దాచిపెట్టద్దు:వారిని చంపేయండి, అలాంటి వారిని హతమార్చండి, రాళ్ళతో కొట్టి చంపండి, నీ దేవుని నుండి నిన్ను తప్పించడానికి వారు ప్రయత్నం చేశారు. దేవుడిచ్చిన భూమి నుండి వైదొలగమని, ఇతర దేవుళ్ళ దగ్గరకు పోదామని ఎవరైనా పురికొల్పితే వారిని కత్తికి బలి చేయండి. వారి పశువులను కూడా చంపేయండి.’
-         ద్వితీయోపదేశ కాండం 13:6, 8-17
-          
చాలామంది క్రైస్తవులు జీసస్ గురించి నమ్ముతూ అతడు క్రూరత్వాన్నుండి వైదొలగి ప్రేమ, సహనం బోధించాడని నమ్ముతారు. కాని జీసస్ అలా చేయలేదు. నూతన ప్రకరణలో జీసస్ పూర్వ నిబంధన నియమాలను యథాతథంగా ఆమోదించాడు.
‘పరలోకము గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించు చున్నాను.’
కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాసనమును ఆచరించి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును.
మాథ్యూ 5:18-19
దేవదూతలు  ఈ విషయాన్ని చాలా చోట్ల ప్రతిధ్వనించారు. (తిమోతి 3:16-17) జీసస్ ప్రేమను గురించి దాతృత్వాన్ని గురించి కొన్ని ఉన్నతమైన విషయాలు ప్రవచించాడు. అవి నైతికంగా గొప్ప అంశాలు. జీసస్ కు ముందే అలాంటి అంశాలు జొరాస్టర్, బుద్ధ, కన్ఫ్యూషియస్, ఎపిక్టిటస్ వంటి వారు చెప్పారు. బైబుల్ కంటే ఇంకా నిర్దిష్టంగా స్వీయ ప్రాధాన్యతను అధిగమించి ఎలా సాగిపోవాలో అనేక గ్రంథాలు ఉదహరించాయి. పాత కొత్త బైబుల్ నిబంధనలలో అసహ్యకరంగా హింసను మెచ్చుకుంటున్న సందర్భాలు అనేకం కనిపిస్తాయి. క్రైస్తవం గనక ప్రేమకు దయకు ప్రాతినిధ్యంగా నిలిచిందంటే ప్రపంచంలో ఇతర మతాల గురించి తెలుసుకోలేదన్నమాట.
జైనమతాన్ని గురించి చూడండి. జైనులు కేవల అహింసావాదాన్ని బోధించారు. విశ్వాన్ని గురించి వారు చెప్పిన విషయాలలో సంభవం కానివి చాలా ఉన్నా మత చిత్రహింసల పేరిట జరిగిన క్రూరత్వాన్ని వారు నమ్మలేదు. క్రైస్తవుల మత హింసాకాండ తప్పుత్రోవను పెట్టిన చర్యగా వీరు భావించవచ్చు. బైబుల్ బోధనలు పరస్పర విరుద్ధంగా గందరగోళంగా ఉన్నందున క్రైస్తవులు ఐదు శతాబ్దాలపాటు వారంటే నమ్మకం లేనివారిని సంతోషంగా తగలపెట్టారు. క్రైస్తవులు ఆరాధించి గౌరవించే సెయింట్ అగస్టిన్, థామస్ అక్వినాస్ లు విశ్వాస రహితులను చిత్రహింస చేయాలని (అగస్టిన్), చంపేయాలని (అక్వినాస్) చెప్పారు.
క్రైస్తవ మతానికి చెందని వారిని, నమ్మకం లేనివారిని, యూదులను, దయ్యం పట్టిన వారిని మూకుమ్మడిగా చంపేయాలని మార్టిన్ లూథర్,  జాన్ కాల్విన్ ప్రచారం చేశారు. బైబుల్ ను మరోవిధంగా మీరు వ్యాఖ్యానించవచ్చు. చరిత్రలో చాల ప్రభావవంతం చేసిన వారు క్రైస్తవ బోధనలని విడమరచి చెప్పినదానికంటే వీరు భిన్నంగా భాషించకపోవచ్చు. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ వంటి వ్యక్తులు క్రైస్తవులలో ఉత్తమ ఉదాహరణ అని చాలామంది క్రైస్తవుల నమ్మకం. ఇందులో పెద్ద సమస్య ఇమిడి ఉన్నది. మార్టిన్ లూథర్ కింగ్ జూలియర్ కు ఆదర్శంగా నిలిచింది క్రైస్తవమే అయితే జైనిజం అనేది గుర్తించాలి. మార్టిన్ లూథర్ కింగ్ జూలియర్ తాను మహాత్మాగాంధీ నుండి అహింసా విధానాన్ని స్వీకరించినట్లు చెప్పాడు. 1959లో భారతదేశం పర్యటించి గాంధీ శిష్యుల నుండి అహింసాయుత పోరాటానికి అనుసరించాల్సిన సూత్రాలను నేర్చుకున్నాడు. హిందూగా ఉన్న గాంధీకి అహింసా సిద్ధాంతం ఎక్కడ నుండి వచ్చింది? జైనుల నుండి వచ్చింది.
జీసస్ గనుక పొరుగువాడిని ప్రేమించు అంటూ దివ్య సూత్రాన్ని చెప్పాడని నీవనుకుంటే బైబుల్ కొత్త నిబంధన మళ్ళీ చదువు. జీసస్ మళ్ళీ తిరిగి వస్తే నీతి ఎలా ఉంటుందో ఒకసారి గమనించు?
‘ఏలన, దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. మిమ్ము కనిపెట్టువారికి కష్టములు కలిగించును. శ్రమనొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి కలిగించును. శక్తిమంతులగు దేవదూతలతో యేసు ప్రభువు దివి నుండి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇట్లు చేయును. దేవుని ఎరుగని వారిని శిక్షించుటకును, మన యేసు ప్రభువును గూర్చిన సువార్తకు విధేయులు కానివారిని దండించుటకును, అగ్ని జ్వాలలతో ఆయన దివి నుండి దిగివచ్చును. దేవుని సన్నిధికిని, ఆయన మహత్తర మహిమకును దూరస్థులై శాశ్వత వినాశమనెడి దండనమునకు వారు గురియగుదురు.’
--  2 తెసలోనియన్స్ 1:6-9
‘నాయందు నివసింపనివాడు తీగవలె పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు.’
-- జాన్ 15:6
ఒక రకంగా చూస్తే జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, అసిసీకి చెందిన సెంట్ ఫ్రాన్సిస్ చర్యలవంటివి జీసస్ లో కనిపిస్తాయి. మరో తీరులో జీసస్, మత చిత్రహింసల ప్రతి రూపంగా నిలిచాడు. బైబుల్ నీతి విషయంలో మార్గదర్శిగా నిలిచిందని నమ్మేవారు వింత భావాలతో ఉన్నారేమో అనిపిస్తుంది. బైబుల్ లోని నైతిక వివేచనను అంచనా వేసేముందు అందరికీ తృప్తికరంగా ఉండే రీతిలో నైతిక అంశాలను పరిశీలించడం మంచిది. బానిసత్వాన్ని గురించిన అంశం చూద్దాం. బానిసత్వం చాలా హీనమైనదని నాగరిక ప్రపంచమంతా నేడు అంటున్నది. ఈ విషయంలో అబ్రహాం దేవుడి నుండి సంక్రమించిన నీతి సూచనలు ఏమిటి? బైబుల్ ని సంప్రదించండి. సృష్టికర్త బానిసలని అట్టేపెట్టుకోమని మనకు చెప్పాడు.
‘నీకు బానిసలు కావలసి వచ్చినచో చుట్టుపట్ల నున్న అన్యజాతుల నుండి కొని తెచ్చుకొమ్ము.
మీ చెంత నివసించు పరదేశుల బిడ్డలను గూడ మీరు బానిసలుగా కొనవచ్చును. మీ దేశమున పుట్టిన ఇతర జాతుల సంతానము కూడా మీ సొత్తు కావచ్చును.
అట్టివారిని మీరు గతించిన తరువాత మీ పిల్లలు కూడా శాశ్వతమైన సొత్తుగా వాడుకోవచ్చును. అట్టి జనము మీకు బానిసలు కావచ్చును. కాని మీ తోడి యిస్రాయేలీయులను మాత్రము మీరు కఠినముగా చూడరాదు.’
-- లెవీయ కాండం 25..44-46
బైబుల్ ప్రకారం ప్రతివాడూ తన కుమార్తెలను లైంగికంగా అమ్ముకోవచ్చు. అందులో కొన్ని నాజూకులు చూపారనుకోండి :
‘ఒకడు తన కొమార్తెను బానిసగా విక్రయించిన, ఆమె మగ బానిస మాదిరిగా స్వేచ్ఛను పొందజాలదు.
ఆమె తన్ను పొందిన యజమానుని సంతోషపెట్టలేకపోయిన అతడు ఆమెను తిరిగి విక్రయించవచ్చును.
కాని ఆమెను విదేశీయులకు అమ్ము అధికారము అతనికి లేదు. అట్లు చేయుట అన్యాయము.
యజమానుడు ఆమెను తన కొమారుని కొరకు ఉద్దేశించినచో తన కొమార్తెపట్ల ఎట్లో అట్లే ఆమెపట్లను వ్యవహరించవలయును. ఎవ్వడైనను మారు పెండ్లమును చేసుకొనినచో మొదట ఆమె కూటికి, గుడ్డకు, దాంపత్య ధర్మమునకు లోటు లేకుండా చేయవలయును.
ఈ మూడింట అతడామెను మోసగించిన, ఆమె ఎట్టి సొమ్మును చెల్లింపకయే స్వేచ్ఛగా అతనిని వీడిపోవచ్చును’
--- నిర్గమ కాండం 21..7-11
బైబుల్ లో బానిసత్వాన్ని గురించి దేవుడు చెబుతూ వారి కళ్లను లేదా పళ్ళని హానిపరిచే ధోరణిలో కొట్టవద్దని మాత్రమే చెప్పాడు. (నిర్గమ కాండం 21) అమెరికాలో బానిసత్వాన్ని అంతం చేయడానికి అలాంటి నైతిక ధోరణి అవలంబించలేదు.
నూతన నిబంధనలలో జీసస్ బానిసత్వాన్ని అభ్యంతర పెట్టినట్లు ఎక్కడా చెప్పలేదు. సెయింట్ పాల్ చెబుతూ బానిసలు తమ యజమానులను బాగా సేవించాలని ముఖ్యంగా క్రైస్తవ యజమానులను బాగా చూసుకోవాలని అన్నాడు..
భూమిపై మీ యజమానులకు ఒడంబడి భయభక్తులతో, పిలుస్తూ ఆరాధించేటట్లు, సేవ చేసుకోవాలి.’
-- ఎఫీషియన్స్ 6..5
ఎవరు కాని దేవుని నామమును గూర్చియు, మత బోధనను గూర్చియు దూషింపకుండునట్లు బానిసలు తమ యజమానులపట్ల సకల గౌరవములను చూపవలెను.
యజమానులు విశ్వాసులైనచో, వారు తమ సోదరులేనని, బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగా లాభమును పొందువారు విశ్వాసులును, తమ ప్రియ సోదరులును కనుక వారిని మరింత అధికముగ సేవింపవలెను.
         మూలం                                     అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య