పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు? క్రైస్తవం ఇంత అమానుషమా?

ఆరవ భాగం
పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు?
దేవుడిమీద నమ్మకంవల్ల మానవ ప్రవర్తనలో ప్రభావం కనిపిస్తుందని అన్నప్పటికీ, దేవుణ్ణి నమ్మడానికి అదే కారణం అనలేం. దేవుడున్నాడని భావిస్తే దేవుణ్ణి నమ్మవచ్చు. నాస్తికవాదం నైతిక అరాచకాలకి దారితీస్తుందని అనుకున్నా, దానివలన క్రైస్తవ సిద్ధాంతం నిజంకాబోదు. అలాంటప్పుడు ఇస్లాం కూడా నిజం కావచ్చు. మతాలన్నీ ఫ్లాసిబో చక్కెర మాత్రలవలె పనిచేయవచ్చు. విశ్వాన్ని చిత్రించడంలో మతాలన్నీ తప్పు చేస్తున్నా, అవి ఉపయోగపడనూ వచ్చు. సాక్ష్యాధారాలనుబట్టి మతాలన్నీ తప్పుడువే కాక ప్రమాదకరం కూడా.
నమ్మకాలు మానవ నీతికి దారితీస్తున్నాయని అన్నప్పుడు మత ఉదార వాదులు, మత మితవాదులు చెప్పే ధోరణి అనుసరిస్తున్నారన్నమాట. ప్రమాణ గ్రంథం చెప్పే అద్భుతాలను బట్టి, బైబుల్ దోషజాలను బట్టి దేవుని నమ్ముతున్నామని అనకుండా, ఉదారవాదులు మితవాదులు సత్ఫలితాలను బట్టి నమ్ముతున్నామంటారు. అలాంటి నమ్మకస్తులు తమకు దేవుడు అర్థాన్ని కల్పించాడని అందుకే నమ్ముతున్నామంటారు. సునామీ 2004లో క్రిస్మస్ రోజున లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటే దేవుడి ఆగ్రహానికి అదే సాక్ష్యమని మితవాద క్రైస్తవులు భావించారు. గర్భస్రావం, విగ్రహారాధన, స్వలింగ సంపర్కాలలో దోషాలను హెచ్చరిస్తూ దేవుడు సంకేతాలను పంపిస్తున్నాడని అంటారు. ఇలాంటి భాష్యాలు జుగుప్సాకరమైనవి. కానీ కొన్ని అంచనాలను గమనిస్తే వీటిలో కొద్దిగా హేతుబద్ధత కనిపిస్తుంది. ఉదారవాదులు, మితవాదులు దైవాన్ని గురించి ఇలాంటి నిర్ణయాలు ఏవీ రాబట్టరు. వారికి దేవుడు సంపూర్ణంగా కేవలం ఓదార్పు ఇచ్చేవాడు. దారుణమైన పాపానికి ఇలాంటి ధోరణులు సరిపోతాయి. ఆసియాలో జరిగిన సునామీపట్ల ఉదారవాదులు మితవాదులు పరస్పరం దూషించుకున్నారు. ఆ భారీ తరంగాలను తన శక్తితో దేవుడు మీదకు తెచ్చాడని వారు అనలేదు. అలాంటి తరంగాల ప్రజ్వలనను చూచి మానవుడు ఎలా స్పందించాడని వారు ఆలోచించారు. కళేబరాలు కొట్టుకు వస్తుంటే అందులో మానవుడు కారుణ్యము బయటపడిందా? లేక దైవశక్తి వెల్లడయిందా? లక్షమంది పిల్లలు తల్లి ఒడికి దూరమై నీటికి ఆహుతైపోతే ఉదార మతవాదులు కళ్ళు తెరిచి చూడవలసి ఉంది. నైతికంగా నటించడం మానేయవలసి ఉంది. మత జ్ఞానం మేథస్సు ప్రదర్శించేటప్పుడు ఒక అంశాన్ని గమనించాలి. దేవుడు ఉంటే, మానవుడి వ్యవహారాలలో ఆసక్తి కనబరిస్తే దైవేచ్ఛను విడమర్చి చూడవచ్చు. చూడలేనిది ఏమంటే  ఈ దారుణ సంఘటనల వెనుక దైవం నైతిక వివేచన కనబరిచిందని అనడమే.
చాలామంది క్రైస్తవులవలె, సాధారణ వ్యక్తులు దైవం రీతులను   కాదనలేరు అని వ్యాఖ్యానిస్తారు. దేవుడు ఆదికాండంలో జలప్రళయం తెచ్చి మానవాళిని ముంచేయడం తప్పు అని అనజాలరు అంటారు. మన పరిమితి దృష్టిలో అది అలాగే కనిపిస్తుంది. కాని జీసస్ దేవుని కుమారుడని, స్వర్ణ పాలన నైతిక వివేచనకు పరాకాష్ట అని, బైబిలులో అసత్యాలు లేవని నిర్ధారణగా చెబుతాడు. బైబుల్ వివేచనను ఘంటాపథంగా చెప్పడానికి మానవుని తన నైతిక ప్రేరణను ఆధారం చేసుకుంటున్నాడు. మరుక్షణమే అలాంటి నైతిక ప్రేరణ సరైన మార్గదర్శి కాదంటున్నారు. బైబుల్ లో చెప్పిన వాటిపై ఆధారపడాలంటున్నారు. నైతిక ప్రేరణలకు బైబులే హామీ అంటున్నారు, ఒకవైపున ఇలాంటి ప్రేరణలు ప్రాథమిక స్థాయిలో ఉండగా, హేతు వివేచనలో గిరిగీసుకుని చుట్టూ తిరుగుతున్నారు.
మంచి గ్రంథంలో ఏది ఉత్తమమో మనమే నిర్ణయిస్తాము. స్వర్ణ నియమాలను చదివి అదే అత్యుత్తమ, నైతిక ప్రేరణగా తీర్పు చెబుతాము. నీతి విషయమై దేవుని బోధనలు ప్రస్తావనకొస్తాయి. పెళ్ళినాడు పెళ్ళి పెళ్ళి కుమార్తె కన్యకాదని కనుగొంటే ఆమెను తండ్రి ఇంటి ముఖ ద్వారం వద్ద రాళ్ళతో కొట్టి చంపాలి. (ద్వితీయోపదేశ కాండం 22..11-21) మనం నాగరికులమైతే ఇది మన ఉన్మత్త చర్యకు పరాకాష్ఠ అని దానిని నిరాకరించాలి. మన నైతిక నిర్ణయాలను వినియోగించాలి. అక్కడ బైబుల్ దైవ వాక్యంగా నమ్మడం మనకేవిధంగానూ తోడ్పడదు.
ఇక్కడ నిర్ణయం చాలా సులభం 21వ శతాబ్దంలో నీతిని గురించి, మానవ సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి. అందులో శాస్త్రీయ దృక్పథం తాత్విక వాదనలు 2000 సంవత్సరాల నుండి వస్తున్న వాటిని అంచనా వేయాలి. లేదా బైబుల్ లో మొదటి శతాబ్దంలో ఉన్న మాటల్ని అట్టిపెట్టుకోవాలి. ఎవరైనా బైబుల్ పంథాను ఎందుకు స్వీకరించాలి?

మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య


.

No comments:

Post a Comment