భారతీయ జ్యొతిష్యం లొ

భారతీయ జ్యొతిష్యం లొ గ్రహాలకు తారలకు తేడా తెలియదు.ఉనికిలో లేని రాహు, కేతు గ్రహాలని నమ్మమంతున్నారు. చంద్రుడు భూమికి ఉపగ్రహమని మరచి గ్రహాలలో చేర్చారు.వారు చెప్పే రాసులకు ఆధారాలు లేవు.శాస్త్రీయ పరిసీలనకు నిలిచే అంశం ఒక్కటీ లేదు. అయినా ప్రభుత్వాలు గుడ్డిగా వెనకేసుకొస్తున్నయి. అధికారంలో వున్నవారు మూఢ నమ్మకస్తులైతే జ్యోథిష్యుల వ్యాపారం జోరుగా సాగుతుంది. జ్యోతిష్యులకు బాధ్యత లేదు. వారి ఆదాయం పై పన్ను లేదు. అంచనాలు తప్పితే శిక్షలూ లేవు. జ్యోతిష్యం బోధించే తప్పుడు వెనువెంటనే ఖగోళం చెబితే నిజానిజాలు తెలుస్తాయి. జ్యోతిష్యం సాస్త్రీయమని రుజువు చేస్తే 5 కోత్ల రూపాయలు ఇస్తామని రాండి ఫౌండషన్ ప్రకటించింది. టి.వి 9 చానల్ జ్యోతిష్యాన్ని నిత్యమూ ఎండగడుతున్నది.see randi.org for details on challenge to astrology with 1million dollars

1 comment:

శ్యామలీయం said...

>భారతీయ జ్యొతిష్యం లొ గ్రహాలకు తారలకు తేడా తెలియదు.
అలాగని మీరంటే సరిపోదు. మీకు జ్యోతిషం గురించి ఏమీ తెలియదు మరి.

>ఉనికిలో లేని రాహు, కేతు గ్రహాలని నమ్మమంతున్నారు.
రాహు కేతువులు ఉనికిలో ఉన్నవే. అవి సూర్యచంద్రుల కక్ష్యలు ఖండించుకొనే రేఖాగణిత బిందువులు.

>చంద్రుడు భూమికి ఉపగ్రహమని మరచి గ్రహాలలో చేర్చారు.
ఇక్కడ 'గ్రహం' అన్న మాట వేరే అర్థంలో వాడబడింది. ఇదొక సాంకేతికపదం ఈ శాస్త్రంలో, celestial entity అన్న అర్థంలో.

>వారు చెప్పే రాసులకు ఆధారాలు లేవు.
ఈ రాసులనేవి కేవలం గణితవిభాగాలు. ఆధారాలేమిటీ? ఇవేమన్నా వస్తువులని ఎవరన్నా చెప్పారా మీకు?

>శాస్త్రీయ పరిసీలనకు నిలిచే అంశం ఒక్కటీ లేదు.
పరిశీలన అనాలి. సరే, మీకు జ్యోతిషం గురించి ఓనమాలు కూడా రావని తెలుస్తోంది. మీరేం పరిశీలన చేయగలరు?! తెలియని విషయాలమీద దురుసుగా మాట్లాడటం కూడా మీ దృష్టిలో ఒక శాస్త్రీయదృక్పథంలో భాగమా?

>అయినా ప్రభుత్వాలు గుడ్డిగా వెనకేసుకొస్తున్నయి.
జ్యోతిష సంస్థలను ప్రభుత్వ నిర్ణయాలకోసం సంప్రదిస్తున్నారా?

>అధికారంలో వున్నవారు మూఢ నమ్మకస్తులైతే జ్యోథిష్యుల వ్యాపారం జోరుగా సాగుతుంది.
జ్యోతిషవృత్తి చేసుకొనే వారిలో ఎంతశాతం మంది కోట్లకు పడగలెత్తారు? ఇతరవ్యాపారాలతో పోలిస్తే వీరి స్థానం ఎక్కడ?

>జ్యోతిష్యులకు బాధ్యత లేదు. వారి ఆదాయం పై పన్ను లేదు. అంచనాలు తప్పితే శిక్షలూ లేవు.
మీ డాక్టరుగారు చెప్పిన మందు పనిచేయకపోతే మీరాయన్నీ జైలుకు పంపుతారా? పన్నులు కట్టేంత ఆదాయం సంపాదించేస్తున్న జ్యోతిష్యవ్యాపారం జరుగుతోందా? ఎంతశాతం మంది పన్నుల స్థాయిలో ఉన్నారు?

>జ్యోతిష్యం బోధించే తప్పుడు వెనువెంటనే ఖగోళం చెబితే నిజానిజాలు తెలుస్తాయి.
వాక్యదోషాలు బోలెడు. జ్యోతిషగణితం వెనుక ఉండేది ఖగోళశాస్త్రమే. మీ కేమీ తెలియదని అర్థం అవుతోంది.

>జ్యోతిష్యం సాస్త్రీయమని రుజువు చేస్తే 5 కోత్ల రూపాయలు ఇస్తామని రాండి ఫౌండషన్ ప్రకటించింది.
మీతోనో మరొకరికరితోనో‌ కుస్తీ పోటీల్లో దిగే అగత్యం జ్యోతిషానికి ఏముంది? మీరు అర్థవంతంగా వాదిస్తే జనాదరణ దొరుకుతుంది. అంతే గాని ఇలాంటి చిలిపి చేష్టలు దండగమారి ఆలోచనలు.

>టి.వి 9 చానల్ జ్యోతిష్యాన్ని నిత్యమూ ఎండగడుతున్నది.
సంతోషం. మీ అవకతవకవాదాలను ఎండగట్టటానికి ఏ ఛానెళ్ళ అవసరమూ లేదు. అది జనం తమ నిరాదరణద్వారా తెలియజేస్తూనే ఉన్నారు.

ఎందుకొచ్చిన మాటలు మీవి? ఇలా దుష్ప్రచారం చేసే బదులు శాస్త్రీయపరిశోధనపైన దృష్టిపెట్టండి. తెలిసీతెలియని మాటలవలన కార్యం లేదు.

Post a Comment