తెలుగు వికాసం-సి.పి.బ్రౌన్ పై ప్రొఫెసర్ పీటర్వెల్లడించిన విశేషాలు

తెలుగు వికాసం
సి.పి.బ్రౌన్ పై ప్రొఫెసర్ పీటర్ అనేక విశేషాలు బయటపెట్టారు.దీనిని డిల్లిలో ఇటీవల ప్రచురించారు .పీటర్ వర్జీనియా టెక్ లో(అమెరిక) పని చేస్తున్నారు.

సి.పి.బ్రౌన్ (ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్)  - దక్షిణాదిలో 19వ శతాబ్దిలో స్థిరపడిన సాంస్కృతిక విధానం.
రచయిత - పీటర్ ఎల్. షిమట్ నర్

1వ అధ్యాయం
సి.పి.బ్రౌన్, ప్రాచ్య విధానం - పరిచయం
దక్షిణభారతావనిలో ఆధునిక ప్రాంతీయ సాంస్కృతిక విధానం తలెత్తిన తీరు, చారిత్రకాభివృద్ధి పరిశీలన ఈ అధ్యయనంలో ఉద్దేశించాము. 19వ శతాబ్దంలోని ఒక యూరోప్ పండితుడు సంస్కృతికి సమకూర్చిన నిర్వచనం, నిర్వహించిన పాత్ర పరిశీలించటమే ప్రధానోద్దేశ్యం. ఇది కేవలం ఒక ప్రాచ్య పండితుని పాత్రను శ్లాఘించటానికే పరిమితం కాలేదు. అలాగని తిరోగమన ధోరణి ప్రోత్సహించటమూ కాదు. సాంస్కృతిక విధానం ఎలా పెంపొందిందో అధ్యయనం చేసి తులనాత్మకంగా అందించడమే  ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం.
ఆధునిక తెలుగుదనానికి చారిత్రక పూర్వాపరాలు
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో ఆధునిక తెలుగు రీతులు స్పష్టమయ్యాయి. స్వతంత్ర భారతంలో భాషాపరంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీని సరిహద్దులు భాషాపరంగానే రూపొందాయి. లోగడ మద్రాసు రాష్ట్రంలోనున్న తెలుగు ప్రాంతం 1953లో ఆంధ్రగా ఏర్పడింది. దీనికి హైదరాబాదులోని తెలంగాణా ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. దక్షిణాదిలో తెలుగు మాట్లాడేవారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ గా అవతరించారు (తెలుగు భాష మాట్లాడేవారిని ఆంధ్రులు, తెలుగువారు అన్నారు. ఈ రెండూ ఇంచుమించు ఒకే అర్థంలో ఈ పుస్తకంలో ప్రయోగించాం. నేడు ఆంధ్రప్రదేశ్ గా పిలుస్తున్న ప్రాంతంలో ప్రధాన భాష తెలుగు.). రాష్ట్రంలోని 66.5 మిలియను ప్రజల వాడుక భాష తెలుగు. (ఆంధ్రప్రదేశ్ - బ్రిటానికా ఆన్ లైన్, 1998 జనవరి 5 నుండి ఇది వాడుకలోకి వచ్చింది.)
19వ శతాబ్ది చివర్లో తెలుగువారు ప్రారంభించిన సాంఘిక, రాజకీయ ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. (కె.వి.నారాయణరావు రాసిన ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్; జాన్ జి. లియోనార్డ్ రాసిన పోలిటిక్స్ అండ్ సోషల్ ఛేంజ్ ఇన్ సౌత్ ఇండియా. ఎ స్టడీ ఆఫ్ ది ఆంధ్ర మూవ్ మెంట్ - జర్నల్ ఆఫ్ కామన్ వెల్త్ పొలిటికల్ స్టడీస్, 1967, ఐదవ సంపుటి; పి. రంగనాథరావు, హిస్టరీ ఆఫ్ మోరల్ ఆంధ్ర, 1983, న్యూఢిల్లీ).
ఈ అధ్యయనంలో తెలుగు సంస్కృతి విషయమై జరిగిన ఉద్యమాలు పరిశీలించగా ప్రాచీన కాలం నుండి ఈ ధోరణి కొనసాగుతున్నదని భావించారు. ఈ తెలుగుదనం అనేది అనాదిగ వస్తున్న వాస్తవమని ఆంధ్ర సంస్కృతుల గురించి రాసినవారంతా తలపోశారు. (ఖండవల్లి లక్ష్మీరంజనం, ఖండవల్లి బాలేందుశేఖరం; ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, 1965 బాలసరస్వతీ బుక్ డిపో).
తెలుగు సంస్కృతికి సుదీర్ఘమయిన చరిత్ర ఉన్నదనడంలో సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి దారితీసిన అంశాలన్నీ 19వ శతాబ్దంలో రూపొందాయి. ఇవి రాజకీయేతరంగా జరిగిన విషయాలు.  ఎడ్వర్డ్ స్పైసర్ ప్రకారం సాంస్కృతిక ధోరణిలో తలెత్తిన గుర్తింపు సమస్యగా దీనిని భావించవచ్చు. ఇది శతాబ్దాలుగా వస్తున్న అంశం. (ఎడ్వర్డ్ స్పైసర్, పర్సిస్టెంట్ కల్చరర్ సిస్టమ్స్ - సైన్స్ 174 - 1971 నవంబర్ 19). గత శతాబ్దాలలో తెలుగు వారిని గురించి, సాంస్కృతిక రీతులను గురించి పేర్కొన్న అంశాలకు భిన్నంగా ఆధునిక తెలుగు రీతులు ఉన్నాయని గమనించవచ్చు.  
తొలిదశలో తెలుగు గుర్తింపు 1వ శతాబ్దంలో కనిపించింది. అప్పట్లోనే భారతదేశంలో ఇతర ప్రాంతీయ సంస్కృతులు కూడా తొంగిచూచాయి. (ఆర్. ఎస్. శర్మ మార్క్సిస్ట్ దృక్పథంలో రాసిన - భారత చరిత్రలో ప్రాచీనత నుండి ఆధునికత వరకు జరిగిన పరిణామం గమనించవచ్చు.  ఇండియన్ హిస్టారికల్ రివ్వూ, 1974, సంపుటి 1, సంచిక 1. యాండ్రీ వింక్ - ది మేకింగ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ వరల్డ్, సంపుటి 1, 1991, పేజి 219-31). తెలుగులో ప్రాచీన శాసనాలు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి మొదలయ్యాయి. నేటి రాయలసీమలో అవి ఎక్కువగా కనిపించాయి. (రాయలసీమ అనేది విజయనగర రాజులు పాలించిన ప్రాంతానికి పెట్టిన పేరు.) తెలుగువారి చైతన్యతకు కొత్తగా తలెత్తిన సైనిక పాలకులకు, ముఠానాయకులకు సూచనగా తొలి తెలుగు శాసనాలు ఉన్నాయి.  పల్లవులు, చాళుక్యులకు భిన్నంగా సమైక్యతతో వ్యవహరించిన ధోరణులు ఈ శాసనాలలో కనిపించాయి. ఐదు శతాబ్దాలపాటు తెలుగులోని చైతన్యత ప్రబలిందని నాగరాజు పేర్కొన్నారు. ఈ ఫలితంగా సంస్కృతం బదులు తెలుగు ఉద్యమం నిలదొక్కుకున్నది. ఇదే తెలుగువారి సమైక్యతకు కూడా దారి చూపింది. (ఎస్. నాగరాజు, ఎమర్జెన్సీ ఆఫ్ రీజినల్ ఐడెంటిటీ అండ్ బిగినింగ్స్ ఆఫ్ వర్నాక్యులర్ లిటరేచర్ - సోషల్ సైంటిస్ట్, సంపుటి 23, సంచిక 10-12). 1995 అక్టోబర్-నవంబర్). 11వ శతాబ్దంలో తెలుగు సాహిత్యం స్పష్టతను రూపొందించుకున్నది (నన్నయ రాసిన ఆదిపర్వం - మహాభారతం ఇందుకు నిదర్శనం). అయితే తెలుగువారందరికీ ప్రాతినిధ్యం వహించేటట్లుగా చైతన్యత రాలేదు.
ఇటీవల వరకు రాజకీయ, సాంఘిక ధోరణులు తెలుగు భాషాపరంగా తలెత్తలేదు. తెలుగువారు ఉన్న గత పాలకులను, తెలుగు ప్రాంతాలను ప్రస్తావిస్తుంటారు. ఇందులో తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఉన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ గా పేర్కొంటున్న ప్రాంతాలలోనే వివిధ భాగాలున్నాయి.  మధ్య కాలంలో పాలకులవలె వీరు కూడా తమ వివిధ నిబంధనలు, ఆచార వ్యవహారాలు రూపొందించుకుని పాలించారు.  (లాయడ్ రుడాల్ఫ్, సూజన్ హోబర్ రుడాల్ఫ్ - ది సబ్ కాంటినెంటల్ ఎంపైర్ అండ్ రీజినల్ కింగ్ డమ్  ఇండియన్ స్టేట్ ఫార్మేషన్ - రీజియన్ అండ్ నేషన్ ఇన్ ఇండియా - పాల్ వాలేస్ - ఎడిటెడ్, 1985, ఆక్స్ ఫర్డ్). విజయనగర రాజులు ఇలాంటి పాలనకు ప్రత్యేకంగా చరిత్ర కలిగినవారు. వారు తెలుగు, కన్నడ భాషలు పోషించారు. ఇతర భాషలలో కూడా అనువదించారు. సంస్కృతాన్ని ఆదరించి భారతీయ పాలకులుగా విస్తృతి పొందారు. (వెల్చేరు నారాయణరావు - సోషల్ సైంటిస్ట్, సంపుటి 23, సంచిక 10-12, 1995). ఈ విధంగా గమనిస్తే నేడు ఆంధ్రప్రదేశ్ గా పేర్కొంటున్న ప్రాంతాల్ని నాడు కేవలం తెలుగు మాట్లాడే ప్రాంతాలుగానే గుర్తించటం జరగలేదు.
ఆధునిక శకానికి ముందు నిర్దుష్టమైన భౌగోళిక ప్రయోజనాలకు తెలుగు భాష పరిమితమైందని చెప్పలేం. కృష్ణా గోదావరీ డెల్టాల మధ్య ఉన్న ప్రాంతాలలో తెలుగు వారు నివసిస్తూ వచ్చారు. అయితే మిగిలిన దక్షిణాది ప్రాంతాలలో కూడా తెలుగువారు చెదురుమదురుగా ఉన్నారు. వారి ఇరుగుపొరుగున ఇతర భాషలు మాట్లాడేవారూ ఉన్నారు. కావేరీ డెల్టా ప్రాంతములో తమిళ మాతృభాష కలవారు ఎక్కువగా కనిపించారు. అక్కడ తెలుగు వారు కొందరు స్థిరపడినారు. దక్షిణ - తూర్పు ప్రాంతాలలో ఉన్న తెలుగువారిని ఉద్దేశించి వారంతా తెలుగు జాతివారని సి.పి.బ్రౌన్, 19వ శతాబ్దిలో ఇతర పరిశోధకులు భావించారు. (బ్రౌన్ ఇలా రాశారు ‘తెలుగు మాట్లాడేవారు రాజమండ్రి కేంద్రంగా మదరాసు వరకు విస్తరించిన ప్రాంతాలలో స్థిరపడ్డారు.’ మదరాసు జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్, 10వ సంపుటి, జూలై 1839, పేజి. 43).
మధ్య శతాబ్దాలలో తెలుగు మాట్లాడేవారిలో తెలుగేతరులు కూడా వుండడం కారణంగా, ఇతమిత్థంగా తెలుగు వారి ప్రాంతాలను గిరిగీసి చూపడానికి వీలులేకపోయింది.  తెలుగు సైనికులు - వ్యవసాయదారులు దక్షిణాదిలో వివిధ ప్రాంతాలకు విస్తరించారు. విజయనగర సామ్రాజ్యం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు 15, 16 శతాబ్దాలలో ఉన్న పరిస్థితి అది. ఒక వైపున తెలుగు పాలకులు స్థానిక సంప్రదాయాలను పాటిస్తూనే తమ సొంత సంప్రదాయాలను కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తెలుగు కవితలను బాగా పోషించారు. ఫలితంగా తెలుగు కవితలను స్థానికులు బాగా ఆదరించారు. కొందరు ఆరితేరిన తెలుగు రచయితలుగా పరిణమించారు. దక్షిణాదిలో కర్ణాటక వారి ఆదరణకు తెలుగు కూడా నోచుకోలేదు. సుప్రసిద్ధ గాయకులుగా తలెత్తారు.  తమిళ గాయకుడు త్యాగరాజు తెలుగులో అనేక భక్తిగీతాలు రచించారు. అలాగే మరికొందరు తమ మాతృభాష కాకపోయినప్పటికీ, తెలుగులో ఎంతో సాహిత్యం సృష్టించారు. (మధ్యయుగాలలో సోమనాథుడు, శ్రీనాథుడు, భీమకవి, అటు కన్నడలోనూ, ఇటు తెలుగులోనూ కవితలు రాశారు - సెలిగ్ హేరిసన్ - ఇండియా ది మోస్ట్ డేంజరస్ డికేడ్స్ - 1960, పేజి 34).
19వ శతాబ్దంలో తెలుగువారు కొందరు తమ తోటివారి భాషలను నేర్చి వారికి దీటుగా ఉపయోగించారు. క్విట్ ఇండియా కంపెనీ వారు దక్షిణాదిలో పాలించిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.  అయితే ఈ పాలన స్థానిక, సామాజిక పద్ధతులను పూర్తిగా మార్చివేయలేదు. ప్రభుత్వపరంగా ఒకే రీతిన పాలనను వ్యాపింపచేశారు. ఇది తెలుగు వారి ప్రాంతంలో ఎక్కువగా జరిగింది. (పాలనా ప్రాంతం ఈస్టిండియా కంపెనీలో ఉన్న ప్రాంతం. బెంగాల్, మదరాస్, బాంబే ప్రాంతాలు రెసిడెన్సీ అనేవారు. దీనికి కలకత్తా రాజధాని).  ఉత్తర సర్కారులుగా పేర్కొన్న కోస్తా జిల్లాలు గుంటూరు నుండి గంజాం వరకూ ఉండగా, దత్తమండలంలో  1800లలో దీనికి జత గూడాయి. దత్తమండలంలో తెలుగువారు ప్రధానంగా నివసించగా, ఆ ప్రాంతాలను రాయలసీమ అన్నారు. రోడ్లు బాగా వేయటం వలన ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి. 1844లో స్థానిక సుంకాలు తొలగించడంతో రాకపోకలు ఎక్కువయ్యాయి. 1846 నాటికి పోస్టల్ పద్ధతి చక్కగా అమలులోకి వచ్చింది. ఆధునీకరణకు ఇవన్నీ బాగా తోడ్పడ్డాయి. (కారల్ డాచ్ రాసిన నేషనలిజం అండ్ సోషల్ కమ్యూనికేషన్ - ఏన్ ఇంక్వయిరీ ఇన్ టు ది ఫౌండేషన్ ఆఫ్ నేషనాలిటీ - కేంబ్రిడ్జ్, 1957, ఛాప్టర్ 4).
దక్షిణాదిలో కంపెనీ పాలన స్థిరపడుతుండగా, దక్షిణాది భాషల పట్ల ఆసక్తి పెరిగింది. సాంస్కృతిక రీతులు ఆకట్టుకున్నాయి.  (బెనడిట్ యాండర్సన్ : ఇమాజిన్డ్ కమ్యూనిటీస్ - రిఫ్లెక్షన్ ఆన్ ది ఆరిజన్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నేషనలిజం -  1991, వెర్సో). 18,19 శతాబ్దాలలో బెంగాల్ అధ్యయనం చేసినవారు ఈ విషయాలను బాగా గ్రంథస్తం చేశారు. యూరోప్ లోని భాషా పండితులు ప్రాచ్య, ఏసియా విషయాలను లోతుపాతులతో అధ్యయనం చేశారు. బెంగాల్ మేథావులపట్ల దృష్టి సారించి ఈ అధ్యయనం జరిగింది.       (డేవిడ్ కాఫ్ - బ్రిటిష్ ఓరియంటలిజం అండ్ బెంగాల్ రినైజాన్స్ - ది డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ మోడరనైజేషన్ - 1773-1835 - బర్కిలి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1929 : ఒ.పి. కెజారివాల్ - ది ఏషియన్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అండ్ డిస్కరి ఆఫ్ ఇండియాస్ పాస్ట్, 1784-1838- ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఢిల్లీ - ప్రాచ్యం బదులు కొందరు ఓరియంటల్ అని వాడుతున్నారు.). తెలుగు సాహిత్యం, భాష, చరిత్ర, సంస్కృతిపై 19వ శతాబ్దంలో అనేక యూరోప్ పండితులు ఎంతో సాహిత్యం సృష్టించినప్పటికీ తెలుగు వారి విశేషాన్ని గమనించటానికి ఈ సాహిత్యం పరిగణనలోకి అంతగా తీసుకోలేదు. అయితే యూరోప్ లో జరిగిన ఇండాలజీ అధ్యయనం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పెంపొందించడానికి తోడ్పడిన తీరును గ్రహించటం ఈ పరిశీలనలో ముఖ్యమైనది.
సి.పి.బ్రౌన్ - ప్రాచ్య విధానం
19వ శతాబ్దంలో తెలుగు సాహిత్య నిపుణులలో పేర్కొనదగిన యూరోప్ పండితునిగా ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అగ్రశ్రేణిలోకి వస్తారు. ముందు బ్రౌన్ తెలుగు వారికి సుపరిచితుడు. అతని జీవితం, కృషి  తెలుగు పండితులు అధ్యయనం చేశారు.  అయితే ఇదంతా తెలుగులోనే ఎక్కువగా ఉన్నది. (తెలుగు ప్రాచ్య గ్రంథాలలో బ్రౌన్ పాఠాలు రాసిన చోట ఈ విషయాలు గమనించవచ్చు, 4వ తరగతి పాఠ్యగ్రంథాలలో ఇది కనిపిస్తుంది. 1972, పేజి. 81-83, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ. లోగడ సి.పి.బ్రౌన్ పై వచ్చిన జీవితచరిత్రలు, అధ్యయనాలు - పీటర్ - ఛార్లెస్ సి.పి.బ్రౌన్, 1798-1884: ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల, పండితుల, సంప్రదాయం - పిహెచ్.డి. సిద్ధాంతం, విస్కాన్సిన్ యూనివర్సిటీ, మాడిసన్ - 1991, తేది - 17-23: ఇంగ్లీషులో బ్రౌన్ పై వచ్చిన విపులమైన తొలి జీవితచరిత్ర ఇది.) బ్రౌనుపై లోగడ జరిగిన పరిశీలనలను సమన్వయీకరించడమే కాక లోపాలను పూరిస్తూ బ్రౌన్ పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక తెలుగు సాహిత్యం ఆవిర్భవించిన రీతులను పరిశీలించడం కూడా ఒక ప్రధానాంశం.
లోగడ బ్రౌను పై జరిగిన అధ్యయనాలకు భిన్నంగా ఈ పరిశోధన సాగింది. ఇంగ్లండులో లభించిన మూలాధారాలను స్వీకరించడం ఒక ముఖ్యాంశం. ఇది అనేకమంది తెలుగు పండితులకు లోగడ సాధ్యపడలేదు. బ్రౌనుపై అనేక కొత్త కోణాలు ఈ పరిశోధనలో లభించాయి. ముఖ్యంగా అతని మత జీవితం అందులో పేర్కొనదగినది. అతని పాండిత్యంపై మత ప్రభావం ఎంతవరకు ఉన్నదో పరిశీలించడానికి ఆధారాలు లభించాయి. బ్రౌన్ పాండిత్యాన్ని సందర్భోచితంగా వరుస క్రమంలో అందించడానికి వీలుపడలేదు. అంతేకాక బ్రౌన్ అంచనా కూడా క్రమపద్ధతిలో విశేషించడానికి వీలు కలిగింది. లోగడ అంచనాలు బ్రౌనును ఆకాశానికి ఎత్తి పొగడటం గమనించవచ్చు. బ్రౌను లేకుంటే తెలుగు సాహిత్యం భాష వికసించేవి కావని అంచనా వేశారు. ఇక్కడ అధ్యయనంలో బ్రౌనుపట్ల నిశిత పరిశీలన చేసిన యూరోపియన్లు, తెలుగు వారు పరిగణనలోకి వచ్చారు. వారికి బ్రౌనుకు సాగిన పరస్పర చర్చలు, పరిశీలనలు కూడా స్వీకరించడం , ఈ పద్ధతిలోనే ఆధునిక తెలుగు గుర్తింపును స్పష్టంగా తెలుసుకోవచ్చు.
స్థూలంగా చెప్పాలంటే 19వ శతాబ్దంలోని యూరోప్ - భారత అధ్యయనం, భారత సమాజంపై దాని ప్రభావం లోతుగా పరిశీలించడం సాధ్యపడింది. ఈ విషయంలో అధ్యయనం చేసినవారు బ్రిటిష్ ప్రాచ్య పండితుల రచనలు పరిశీలించి, బెంగాలులో 18, 19 శతాబ్దాలలో ప్రాచ్య అధ్యనాలు  ఎలా సాగాయో పరిగణనలోకి తీసుకున్నారు.  ఈ పరిశీలనల ప్రకారం మిగిలిన భారతదేశం బెంగాల్ ను అనుసరించినట్లు పేర్కొన్నారు. ఈస్టిండియా కంపెనీ దృష్టిలో ఆర్ధికంగా రాజకీయంగా బెంగాల్ వహించిన కీలక పాత్ర వల్ల ఆ ప్రభావం మిగిలిన దేశంపై పడిన మాట వాస్తవం. కంపెనీ పాలనలోకి వచ్చిన మొదటి పెద్ద ప్రాంతం కూడా బెంగాలు కావటం వల్ల, చాలాకాలం ఆ ప్రాధాన్యత కొనసాగడం వలన ఈ విషయాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలి. బెంగాల్ నాడు భారత ప్రభుత్వ కేంద్రంగా ఉన్నమాట వాస్తవం. కలకత్తా ప్రెసిడెన్సీగా వుండేది. అయినప్పటికీ బెంగాల్ పేర్కొన్న భారత అధ్యయనం మిగిలిన ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణాదిలో ప్రభావం చూపెట్టలేదు.
బెంగాల్ కు దక్షిణాదికి భారత అధ్యయనంలో స్పష్టమైన తేడా ఉన్నది. ఈ విషయమై అధ్యయనం చేసినవారు, వారిని పోషించివారు భిన్నంగా వుండటనే దీనికి కారణం. బెంగాల్ లో 18, 19 శతాబ్దాలలో చాలామంది భారత అధ్యయనం అధ్యనం చేశారు. వారికి ఈస్టిండియా కంపెనీ నుండి బాగా మద్దత్తు లభించింది. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా వుండగా అధికార పోషణ బాగా జరిగింది. అలా మద్దత్తు పొందినవారిలో కంపెనీ అధికారులు విలియం జోన్స్, హెన్రీ కోల్ బ్రూక్ పేర్కొనదగినవారు.
ఇందుకు భిన్నంగా మదరాసు ప్రభుత్వం భారత అధ్యయనం పండితులకు అంతక ఆర్ధిక మద్దత్తు ఇవ్వలేదు. దక్షిణాదిలో చాలామంది యూరోప్ కంపెనీ అధికారులు పరిశోధనకు పూనుకున్నా అది కేవలం సొంత ఖర్చులతోనే జరిగింది. ఇందులో కోలిన్ మెకంజీ పేర్కొనదగినవారు. అతను 40 సంవత్సరాలపాటు సిలోన్, జావా, ఇండియాలలో తొలి సర్వేయర్ జనరల్ గా అనేక రాతప్రతులు, నాణాలు, ప్రాచీన అంశాలు, సమాచారాలు, భూములకు సంబంధించిన విషయాలు సేకరించారు. నేడు అవి ఇంగ్లండులోను, ఇండియాలోనూ వివిధ గ్రంథాలయాలలో ఉన్నాయి. ఈ సేకరణ పరిశోధకులకు బాగా తోడ్పడింది. దక్షిణాది గతాన్ని అవగాహన చేసుకోవడానికి వీటి ప్రయోజనం ఇంతా అంతా కాదు. (మెకంజీ జీవితం, అతను సేకరించినవి విపులీకరించడం జరిగింది : హెచ్. హెచ్. విల్సన్ - మెకంజీ కలక్షన్ - పూర్తి కేటలాగ్ - ది కలకత్తా ఏషియాటిక్ ప్రెస్, 1825 : బి. ఎఫ్. కారీ మైకెల్ - పీఠిక - రచయిత విలియం టేలర్ : ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్స్, ఇన్ ది లైబ్రరీ ఆఫ్ ది కాలేజ్, ఫోర్ట్ సెయింట్ జార్జ్, సంపుటి 1, మదరాసు, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గజెట్ ప్రెస్, 1887. ఇటీవల మెకంజీ సంపుటాలను విమర్శకు గురిచేసిన వారు బెర్నార్డ్ ఎస్. కోన్ - కలోనియలిజం అండ్ ఇట్స్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్. బ్రిటిష్ ఇన్ ఇండియా: ప్రిన్స్ స్టన్ యూనివర్సిటీ ప్రెస్ - 1296, తేది - 80-88: నికొలస్ డిక్స్ : కలోనియల్ హిస్టరీస్ అండ్ నేటివ్ ఇన్ఫార్మెన్స్ బయోగ్రఫీ ఆఫ్ యాన్ ఆర్కైవ్, ది ఓరియంటలిజమ్ అండ్ పాస్ట్ కలోనియల్ ప్రెడికమెంట్ : పర్ స్పెక్టివ్ ఇన్ సౌత్ ఏసియా : కారల్ ఎ. బ్రెకన్ రిడ్జ్, పీటర్ వేన్ వ్యూర్ - ఫిలడెల్ఫియా, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రెస్, 1995, పేజి 279-313) 1812లో మదరాసులో ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజ్ స్థాపించినప్పుడు మదరాసు ప్రభుత్వం కొంత మద్దత్తునిచ్చింది. బెంగాలులో లభించిన మద్దత్తుతో పోలిస్తే ఇదేమంత చెప్పుకోదగినది కాదు.
బెంగాల్, దక్షిణాది భారత అధ్యయనపరుల వృత్తి కూడా భిన్నంగా వున్నది. బెంగాల్ లో అధ్యయనపరులు కంపెనీలో పనిచేసేవారు. దక్షిణాదిలో వారు మతపరంగా పనిచేశారు. దక్షిణాదిలో ఇటాలియన్ జెసూట్ రాబర్ట్ నొబిలి (1577-1656), సి.జె. బెచ్చి (1680-1747) తో మొదలుకొని 19వ శతాబ్దంవరకూ అనేకమంది మిషనరీలు పనిచేశారు. దక్షిణాది భాషలు, సంస్కృతులు అధ్యయనం చేయడంలో కేథలిక్, ప్రొటెస్టెంట్ మతస్థులు ఎక్కువగా కృషిచేశారు. భాషాపరంగా వీరి కృషి ఎక్కువగా కనిపించింది. దక్షిణాదిలో వివిధ భాషల నుంచి అధ్యయనం చేయడంలో రాబర్ట్ కాల్డ్ వెల్ వంటివారి కృషి స్పష్టంగా కనిపించింది. (రాబర్ట్ కాల్డ్ వెల్ : ఏ కాంప్రెహెన్సివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజస్, లండన్, 1856).  
ఆ విధంగా గమనిస్తే బెంగాల్, దక్షిణాదిలో జరిగిన భారతీయ అధ్యయనంలో, లక్ష్యాలు, ప్రభావాలు భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. తొలిదశలో కంపెనీవారు దేశీయ సంస్థలను, పాలనారీతులను కలుపుకపోవడానికి ప్రయత్నించారు. వారన్ హేస్టింగ్స్ కింద జరిగిన పాలనలో  సంస్కృతం, పర్షియన్, అరబిక్, రచనలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నారు.  ఈ పండితుల కృషిని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. యూరోపియన్లు పునర్వికాస వ్యవస్థలను రూపొందించడంలో గ్రీక్, రోమ్ పద్ధతులను మిళితం చేసినట్లు స్పష్టపడింది. ఇదే పద్ధతి ఇండియాలో బెంగాల్ మేథావులు అనుసరించి, యూరోప్ నుండి ప్రేరణ స్వీకరించి, అనుసరించినట్లు డేవిడ్ కాఫ్ స్పష్టపరిచారు. (కాఫ్ - బ్రిటిష్ ఓరియంటలిజం అండ్ ది బెంగాల్ రినైజాన్స్, 2వ అధ్యాయం) కానీ, 19వ శతాబ్దంలో ఈ ఉద్వేగ ధోరణిపై విమర్శ వచ్చింది. ఇందులో జేమ్స్ విల్ ముఖ్యపాత్ర వహించారు. ఆయన రాసిన బ్రిటిష్ ఇండియా చరిత్ర ప్రముఖంగా పేర్కొనదగినది (1917). యాంగ్లికన్, ఎవాంజిలికల్ శాఖలకు ఈ ధోరణిలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్నది. ఆనాడు  భారతీయ అధ్యయనాలు ప్రధానంగా బెంగాల్ ప్రభావంలోనే ఉన్నాయి. ఉత్తరోత్తరా యూరోప్ విశ్వవిద్యాలయాల ప్రభావం కూడా ఉన్నది. వాటినే ప్రమాణ గ్రంథాలుగా స్వీకరించారు. భారతీయ జాతీయ దృక్పథాన్ని రూపురేఖలు దిద్దటంలో ఈ అధ్యయనాలే కీలకపాత్ర వహించాయి. (గ్యాన్ ప్రకాష్, కంపారిటివ్ స్టడీస్ ఇన్ సొసైటీ అండ్ హిస్టరీ, 32వ సంపుటి, 2వ సంచిక, ఏప్రిల్ 1990, పేజి - 388)
19వ శతాబ్దంలో దక్షిణాదిలో వెలువడ్డ భారతీయ అధ్యయనాలలో భిన్న ధోరణులు అవలంబించారు. దక్షిణాది గతాన్ని, సంస్కృత గ్రంథాలను ఆధారం చేసుకొని భారతీయ అధ్యయనం సాగింది. కోలిన్ మెకంజీ చేసిన కృషిలో 18వ శతాబ్దపు ఇంగ్లీష్, స్కాటిష్ ప్రభావం, జిజ్ఞాస వెల్లడైంది. మెకంజీ దక్షిణాదిలో వేరే తరహా వ్యక్తి. అక్కడి భారతీయ అధ్యయనాలన్నీ స్థానికంగా ఉన్న భాషలను, సంస్కృతులను ఆధారం చేసుకొని సాగాయి. బెంగాల్ లో ఇలాంటి ధోరణి కొంతవరకు అనుసరించకపోలేదు. ఇందుకు నాథెనల్ హాలెడ్ రాసిిన బెంగాల్ భాషా వ్యాకరణం పేర్కొనవచ్చు (1778).
బెంగాల్ లో భారతీయ అధ్యయనాలు చేసిన స్థానిక భాషా శాస్త్రజ్ఞులు, సంస్కృతంలో పండితులు సాగించిన ధోరణి అనుసరించలేదు. రోజన్ రోషర్ ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ స్పష్టపరిచారు. (రోజన్ రోషర్, ఓరియంటలిజం, పొయట్రీ అండ్ మిలీనియం - ది చెకర్డ్ లైఫ్ ఆఫ్ నేదనల్ బ్రాసి హాలెడ్ - 1751-1830, కొలంబియా : సౌత్ ఏషియా బుక్స్, 1983, పేజి 242) దక్షిణాదిలో ఇలా జరగలేదు. ఇందుకు కారణం మిషనరీలు చేబట్టిన భారతీయ అధ్యయనం భిన్న ధోరణిని అనుసరించటమే. క్రైస్తవ మత గ్రంథాలు అనువదించడంలో, భాష్యం చెప్పడంలో, ప్రచారం చేయడంలో ఈ విషయం స్పష్టంగా చూడవచ్చు. ఇందులో ప్రాంతీయ భాషల ప్రభావం కనిపించింది. అయితే ఈ పండితులు సంస్కృతాన్ని కూడా అధ్యయనం చేయకపోలేదు. ఇందుకు మదరాసు ప్రభుత్వం అనుసరించిన ఆచరణాత్మకమైన ధోరణే కారణం. నియమ నిబంధనలు రూపొందించడంలో, పాలించడంలో బెంగాల్ ప్రభుత్వం ప్రాచీన గ్రంథాలను స్వీకరించగా ఇందుకు భిన్నంగా మద్రాసు ప్రభుత్వం స్థానిక భాషల మెరుగుదలను దృష్టిలో పెట్టుకున్నారు. ఫలితంగా మదరాసు ప్రభుత్వం దక్షిణాది భాషా ధోరణులను బాగా ప్రోత్సహించింది. ఈ కారణంగానే అనేకమంది పండితులు సి.పి.బ్రౌన్ వంటివారు ఆచరణాత్మకమగు ధోరణి అవలంబించారు.
అటు బెంగాల్ లోనూ ఇటు దక్షిణాదిలోనూ అనుసరించిన భిన్న ధోరణులు భారతీయ అధ్యయనంలో విభిన్న రీతులుగా వెలువడ్డాయి. బెంగాల్ లో యూరోప్ అధ్యయన రీతులు కనిపించగా దక్షిణాదిలో స్థానిక భాషల సంస్కృతుల ప్రభావం స్పష్టపడింది. ఇదంతా 19వ శతాబ్దంలో పునర్వికాసానికి దారితీసింది. (బంగోరె - లిటరరీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సి.పి.బ్రౌన్ పరిచయం : బి.ఎన్. రెడ్డి, బంగోరె ఎడిట్ చేసిన గ్రంథం.             శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, 1978, పేజి-70) దక్షిణాదిలో పాల్గొన్న పండితులను పరిశీలిస్తే విభిన్న విషయాలు స్పష్టపడతాయి.
బెంగాల్ కు భిన్నంగా తమిళ భాషా అధ్యయనంలో యూరోప్ పండితుల ధోరణులు చూడవచ్చు. తమిళులపై ప్రభావం చూపెట్టిన వారిలో కేవలం బ్రాహ్మణులే కాక బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. ఇది బెంగాల్ స్థితికి భిన్నంగా ఉన్నది. 18వ శతాబ్దపు తొలి దశలో మొదలుకొని, సి.జె. బెచ్చి వంటి జెసూట్ చేసిన కృషి, జర్మనీ ప్రొటస్టెంటులు తోడ్పడిన రీతులు దక్షిణాదిలో కనిపించాయి. యూరోప్ పండితులు పరిశీలించిన ప్రకారం తమిళ భాషలో, సంస్కృతిలో ఆర్యేతర, బ్రాహ్మణేతర లక్షణాలు తమిళ భాషలోనూ, సంస్కృతిలోను గమనించారు. తమిళ బ్రాహ్మణ సంస్కృతిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్న పండితుడు రాబర్ట్ డి. నొబిలి వంటి వారి కృషి అంతగా ప్రభావాన్ని చూపెట్టలేదు. యూరోప్ పాండితీ ప్రభావం ఏ మేరకు బ్రాహ్మణేతర ఉద్యమాన్ని, తమిళ వేర్పాటు ధోరణిని ప్రభావితం చేసిందో యూజిన్ ఐరిషిక్ రాశాడు. (యూజిన్ ఐరిషిప్: పాలిటిక్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఇన్ సౌత్ ఇండియా : ది నాన్ బ్రామిన్ మూవ్ మెంట్ అండ్ ఫామిలీ సెపరేటిజమ్ : యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, బర్కిలీ - 1969, పేజి - 275-310) తమిళ సంస్కృతిలో భిన్న ధోరణి చూపటంలో యూరోప్ పండితులు ప్రధానంగా బ్రాహ్మణేతర, ఆర్యేతర తమిళ సంస్కృతిని నొక్కి చెప్పారు. అలా చెప్పటంలో ఆ ధోరణులను తిరగదోడాలనే ప్రయత్నం మాత్రం పోలేదు. వాటి అవసరం కూడా ఉండాలని భావించలేదు.
తెలుగు భాష, సంస్కృతిలో పునర్వికాసం రావడానికి యూరోప్ పండితులు కృషి చేశారని అనలేము.  తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాలు కొంతవరకు రహస్యంగా అట్టిపెట్టినప్పటికి, ఇది చాలా లోతుపాతులతో శతాబ్దాలుగా ఆచరణలోకి వచ్చాయి. 19వ శతాబ్దంలో వాటిని తిరగదోడాల్సిన అవసరం లేదు. సి.పి.బ్రౌన్ కృషిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టపడుతుంది. ఇందులో తిరగదోడే ప్రయత్నం కంటే తెలుగు సాహిత్య సంస్కృతీ సంప్రదాయాలు మార్చడానికి దోహదపడ్డాయని అనవచ్చు. తెలుగు భాషా సంస్కృతికి విశాలమైన నిర్వచనం గుర్తింపుల కల్పించే ప్రయత్నం జరిగింది. స్థానిక తెలుగు వారు కూడా ఈ ప్రయత్నాలు సేకరించడం గమనార్హం. వారి వైఖరినే నిర్దిష్ట రూపుపేఖలు దిద్దటానికి, సి.పి.బ్రౌన్ వంటివారి పాడిత్యం ప్రభావిం చెయ్యడానికి చేయూతనిచ్చింది. అదే తెలుగుదనం ఆధునికత రూపురేఖలు దిద్దుకోవడానికి ఉపయోగపడింది.
దక్షిణ ఆసియా పై భారత అధ్యయన ప్రభావం విశిష్టంగా ఉన్నప్పటికీ, ప్రాచ్య విధానంపై జరుగుతున్న విస్తృత చర్చను విస్మరించటానికి వీలులేదు. ప్రాచ్య విషయాలను పరిశీలించేదే ప్రాచ్యవిధానం. (మెరియమ్ వెబస్టర్ డిక్షనరీ, 10వ ప్రచురణ, 1995లో ఓరియంటలిజం) సర్వసాధారణంగా ఈ విషయాలను అధ్యయనం చేస్తున్నది పాశ్చాత్యులే. వారికి ప్రాచ్య పండితులు అనే ముద్రపడింది. లోగడ ఈ ప్రాచ్య పండితులను  శ్లాఘిస్తూ, తమ అధ్యయనంతో విదేశీ సంస్కృతులు అవగాహన చేసుకోవడానికి తోడ్పడిన తీరును మెచ్చుకునేవారు. 1978లో ఎడ్వర్డ్ సైద్ రాసిన పుస్తకం చాలామందిని చర్చకు పురికొల్పింది. ప్రాచ్య విధానం అనేది నిశిత పరిశీలనకు గురయ్యింది.
సైద్ రాసిన ప్రాచ్య విధానం లో పాశ్చాత్యులకు లొంగిపోయిన ప్రాచ్య పద్ధతులను దుయ్యబట్టారు. (ఓరియంటలిజంకు సైద్ రాసిన వాదనల పరిచయం, 1978, వింటేజ్ బుక్స్, న్యూయార్క్, 1994, తేది - 1-28). ఈ గ్రంథంలో మధ్యప్రాచ్యపు పాశ్చాత్యుల పరిచయం ఆధారంగా సైద్ తన విమర్శలను పేర్కొన్నాడు. ఆ విమర్శలకు ప్రాధాన్యత, గుర్తింపు వచ్చింది. (సైద్ ముగింపు 1994, పేజి- 339). సైద్ తన గ్రంథంలో దక్షిణ ఆసియాను చేసిన విమర్శలను స్వీకరించాడు. (డేవిడ్ కాఫ్ - జర్నల్ ఆఫ్ యాషియన్ స్టడీస్, సంపుటి 39, సంచిక 3, మే 1980, పేజి-495-506). సైద్ భావాలను పరీక్షకు గురిచేసి, విస్తరించి, మెరుగులు దిద్దటం క్రమేణా జరుగుతూ వచ్చింది. ప్రాచ్య అధ్యయనం చేసిన వారు వలస రీతులలో ఎలా మెలిగారో బాగా అధ్యయనం చేశారు. (కారల్ ఎ బ్రక్ రిడ్జ్, పీటర్ వెన్ డీర్ : ఓరియంటలిజం - పోస్ట్ కలోనియల్ ప్రెడికమెంట్, 1993, పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రెస్).
ఈ భావాలకు భిన్నంగా ప్రాచ్య అధ్యయనం కొనసాగిన తీరును ప్రస్తుత గ్రంథంలో గమనించవచ్చు. సైద్ విమర్శ దృష్ట్యా సి.పి.బ్రౌన్ పరిశీలించిన సంగతులు, అర్హతకు మించి అతనికి ప్రాధాన్యతను సంతరించారు. (కోల్ - కలోనియలిజం - ఫామ్స్ ఆఫ్ నాలెడ్జ్, తేదీ 51-58; పి. సుధీర్, కలోనియలిజం అండ్ ఒకేబ్యులరీస్ ఆఫ్ డామినెన్స్, కలకత్తా, సిగల్ బుక్స్, 1993, పేజి. 340-4 ). బ్రౌన్ అనుసరించిన విరుద్ధ ధోరణులను తమ అధ్యయనాలలో పండితులు పట్టించుకోలేదు. ప్రాచ్య పరిశోధకులలో బ్రౌన్ ఒక మినహాయింపుగా స్వీకరించిన పద్ధతులు కూడా గమనించవచ్చు. మరికొన్ని అధ్యయనాల ప్రకారం ప్రాచ్య పండితులు సంక్లిష్ట విధానాలతో, ఇష్టమొచ్చిన రీతులలో రాసారు. వారి ధోరణులు ఒక మూసలో పోయడానికి వీలులేదు. (రోషర్, ఓరియంటలిజం, పొయట్రీ అండ్ మిలీనియం). బ్రౌన్ అధ్యయనం నిర్లక్ష్యానికి గురయిన వారిని పట్టించుకున్న రీతులు స్పష్టంగా కనిపిస్తాయి. మారుతున్న పద్ధతులను, అశ్రద్ధకు గురయిన ప్రజలను ప్రతిబింబించిన బ్రౌన్ రచనలు గమనార్హం.  బ్రౌన్ అనుసరించిన ప్రాచ్య విధానం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ఆధునిక తెలుగు రీతులు గమనిస్తూ పోవాలి.
పై రీతులను సమగ్ర దృష్టితో తులనాత్మకంగా అవగాహన చేసుకోవడానికి మధ్యే మార్గం అనుసరించాలి. భారత అధ్యయనపరులు పాటించిన రీతులుగానీ, తిరోగమన పద్ధతులు గానీ, ఇందుకు ఉపకరించవు. ప్రాచ్య విధానంలో భారత అధ్యయనాన్ని ఏకపక్షంగా చూడడానికి వీలులేదు. యూరోప్ రాజులు, భారతీయులు చేసిన పరిశీలన అంతా స్వీకరించి, ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అధ్యయనం సాగింది. ప్రాచ్య విధానంలో అనుసరించిన పద్ధతులలో ఆధునిక, సాంస్కృతిక రీతులు తలెత్తిన తీరు స్పష్టంగా ఉన్నది.
Telugu: Innaiah Narisetti
  No comments:

Post a Comment