ఆవుల గోపాల క్రిష్న మూర్తి అమెరికా ప్రభుత్వ పిలుపుపై 1963 లో 3 మాసాల పాటు పర్యటించి తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి మూల్పూర్ లో ఆనందం తో బుగ్గలు నిమిరిన ఫోటో లభించింది .పక్కనే వెనిగళ్ళ వెంకట వెంకటసుబ్బయ్య వున్నారు .ఆవుల గోపాల క్రిష్న మూర్తి నోటి ఎంట వస్టే మామూలు పదం కూడా మధురంగా మారుతుంది అనేవారాయన.
అమెరికా పర్యటన రికార్డ్ కోసం ప్రయత్నం చేసినా విఫలమయ్యాము
.సైన్స్ అండ్ హూమన్ వాల్యూస్ Science and Human Values Institute
Posted by
innaiah
on Sunday, December 5, 2010
మానవ విలువలకై సైన్స్
85 వ పడిలౌ ప్రొఫెసర్ పాల్ కర్జ్ కొత్త సంస్థ ప్రారంభించారు .సైన్స్ అండ్ హూమన్ వాల్యూస్ అని పిలిచారు. ప్రధమ సమావేశం దిసెంబర్ 3,4 (2010) న వాషింగ్తన్లో జరగగా నేను పాల్గొన్నాను .సుదీర్ఘ చర్చల అనంతరం 2011మేలో ఫ్లారిడా రాష్త్రంలోని టాంపాలో జరపాలని నిర్నయించారు .పిల్లలకు నైతిక విద్య చెప్పడం ఎలా అనేది విషయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులను పిలవాలని ప్రయత్నం .కొథ సంస్థకు అధ్యఖలుగా ఇటీవల నాసా నుండి రిటైర్ అయిన దా. స్తూవర్ట్ జోర్డన్ , స్రీమతి టోని పెర్ట్ నిర్వాహకురాలుగా ,నేథన్ బప్ ప్రచారకులుగా వున్నారు. భారత దేసంలో మానవవాద సంస్థలన్నీ ఈ కొథ సంస్థకు అనుబంధం కావాలని అంగీకరించాయి .
పాల్ కర్జ్, టోని పెర్ట్, జోర్డన్, ఇన్నయ్య , చిత్రాలు చూడండి.
Prof Paul Kurtz and Dr Innaiah
Dr Stuart Jordan, retired from NASA as astronomer and Dr N.Innaiah in Washington DC on Dec 3, 2010
Ms Toni Pelt , chief organiser of Institute and Dr N.Innaiah
Dr Sam Ilangovan reprenting Periyar association Madras (from Pennsylvania) and Ms Toni Pelt

Sushil Mukherji
Posted by
innaiah
on Saturday, December 4, 2010
సుశీల్ ముఖర్జీ Met Sushil Mukherjea in Kolkata at his residence
కలకత్తాలో ఉన్న మినర్వా అసోసియేట్స్ ప్రచురణ సంస్థ వ్యవస్థాపకుడు సుశీల్ ముఖర్జీ. ఆయన జయప్రకాష్ నారాయణ్, నిరంజన్ , వి.ఆర్.నార్ల వంటి ప్రముఖుల రచనలను ముద్రించేవారు. ఆయన కలకత్తా బుక్ ఫెయిర్.కి సంస్థాపక అధ్యక్షుడు. సుశీల్ ముఖర్జీ ఎమ్.ఎన్.రాయ్ ఆలోచనా స్రవంతికి విశ్వసనీయమైన అనుచరుడు.
1970 ప్రారంభంలో నాకు వారితో పరిచయం కలిగింది. వెంటనే నేను ఆయనను హైదరాబాదుకు రమ్మని ఆహ్వానించాను. నేను ఆయనను శ్రీనార్ల వెంకటేశ్వరరావుగారికి (ఆంధ్రజ్యోతి వ్యవస్థాపక సంపాదకులు) పరిచయం చేశాను. నార్ల వారి ఇంట్లో మేము అనేకసార్లు కలుసుకున్నాము. సుశీల్ నార్లవారి వ్యక్తిత్వానికి, ఆలోచనా సరళికి ఎంత ముగ్ధులయ్యారంటే నార్లవారి పుస్తకం గాడ్స్ గోబ్లిన్స్ అండ్ మెన్ అనే పుస్తకాన్ని వెంటనే ప్రచురించడానికి సంకల్పించారు.
నార్లవారు కొన్ని సందర్భాల్లో వెలిబుచ్చిన హేతువాద ఆలోచనలూ, కొన్ని సూక్తులతో రూపొందించిన పుస్తకం అది. అది బాగా అమ్ముడు పోయి పాఠకులలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన నా పుస్తకం కూడా ప్రచురిస్తానని సుశీల్ అన్నారు. కానీ నేను అప్పటికే వేరే ప్రచురణకర్తల ద్వారా పుస్తకాన్ని వెలువరించాను. అప్పటి నుండి మేము పరస్పరం ఉత్తర ప్రత్యుత్తరాలతో కలుస్తూనే ఉన్నాం.
నిరంజన్.ధర్ వ్రాసిన వేదాంత అండ్ బెంగాల్ రినైసాన్స్ అనే పుస్తకం సుశీల్ ప్రచురణలన్నింటిలో అత్యంత వివాదాస్పద రచనగా పేరుపొంది సంప్రదాయ హిందూ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. నేను ఆ పుస్తకాన్ని వివేకానందుడికి సంబంధించిన ఉచిత సమాచారం కోసం ఉపయోగించాను. ఉదయం దినపత్రికలో ప్రచురించబడ్డ నా రచనలు కూడా వ్యతిరేకతను వివాదాల్ని మూటగట్టుకున్నాయి.
సుశీల్ జయప్రకాశ్ నారాయణ్ రచించిన వికేంద్రీకృత సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు.
హైదరాబాద్.లో నేను సుశీల్.కి అనేకమంది హేతువాద, మానవవాద మిత్రుల్ని పరిచయం చేశాను.
బుక్.లింక్స్ అధినేత సుశీల్.గారి పరిచయానికి ఎంతో సంతోషించి ఆయనతో ఎడతెగని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
చాలాకాలం తర్వాత నేను కలకత్తా వెళ్ళి సుశీల్.గారిని వారియింట్లో కలుసుకున్నాను. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నరు. చక్రాల కుర్చీకి అంకితమై ఉన్నారు. సుశీల్ పొగత్రాగేవారు. చక్కని సంభాషణా చతురుడు.
ఆయన మాకు ఆతిథ్యమిచ్చి తాను కొత్త యింటికి మారుతున్నట్లు చెప్పారు. అప్పుడు ఇసనాక మురళీధర్ నాతో ఉన్నారు. ఆయన మాకు కొన్ని ఫోటోలు తీశారు. సుశీల్ నేను కలవటం అదే చివరిసారి. ఆయన 2007లో మరణించారు.