ఇన్నయ్య పంతులు గారూ వందనములు అని అమెరికా ప్రొఫెసర్ అంటే ఆశ్చర్యం వేయదూ?
విస్ కాన్సిన్ యూనివర్సిటీలో 50 ఏళ్లుగా పొలిటికల్ సైన్స్ చెబుతున్న రాబర్త్ బాబ్ ఫ్రికంబర్గ్ ను ఇటీవల మాడిసన్ లో కలిసినప్పుడు అనుభవం అది.
బంగోరే మీకు తెలుసా , ఆయన నాకు సన్నిహిత మిత్రుడు .మిస్తీ రియస్ గా చనిపోవడం చాలా బాధ అనిపించింది అని, తనకు తెలిసిన వారి పేర్లు చెబుతూ పోయారు.
రాబర్త్ ఊటీలో 1930 లో పుట్టారు .తల్లి తంద్రి స్వీడిష్ మిషనరీస్ .తనకు 12 ఏళ్ళు వరకూ గుంటూర్, నల్గొండ లో తిరిగినందు వలన తెలుగు బాగా పట్టుపదిందన్నారు .కాని 80 వ పడిలో మరచి పోతున్నానని ,పేర్లు గుర్తుకు రావడం లేదన్నారు.
తెనాలి రాడికల్స్ ఆవుల గోపాల క్రుష్న మూర్థి ,ఆలపాటి రవీంద్రనాథ్ తెలుసుననీ, ఆచార్య రంగా, ఆర్ వి ఆర్ చంద్రసేఖరరరావు, పి.వి.నరసిమ్హారావు, పి.వి.జి.రాజు, జలగం వెంగళరావు, భద్రిరాజు క్రుష్న మూర్థి , చేకూరి రామారావు , వకుళాభరనం రాజగోపాల్, ఎం పి పాయ్, వి.కె. బావా బాగా పరిచయమన్నారు.
రాబర్త్ 12వ ఏటా అమెకా వచి చదివి ప్రొఫెస్సర్ గా స్తిరపడ్డారు.
విస్కాన్సిన్లో తెలుగు ప్రవెస పెట్టదానికి,వెలిచేలు నారాయనరావును తీసుకరావడానికి ఈయనే కారణమని తెలుసుకొని సంతోషించాను.
రాబర్ట తొలి రచన గుంటూరు జిల్లా 1965 లో ఆక్స్ ఫర్డ్ వారు వెలువరించారు .
బ్రితిష్ పాలన, ముస్లింల ప్రభావము, కరణాల పట్టు ,వాసిరెడ్డి వెంకతాద్రి నాయుడు వంటివారి సంసంస్థానాల తీరు లోతుగా పరిషొధన చేసి రాసారు .
అప్పటినుండి వరుసగా తెలుగు వారి పాలన, డిల్లి పాలన పై అనేక రచానలు వెలువరించారు.
మా సంభాషణలో మధ్య తెలుగు పదాలు వాదుతూ పోయారు.
1975 లో హైదరాబాద్ లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు సభలకు కలక్తర్ గ్విన్ తో పాటు పాల్గొన్నారు .
భారత దేశంలో క్రైస్తవులు ఎలా తొలుత ప్రవేశించారు, పిమ్మట మత మార్పిడులు ఎలా జరిగాయి, 600 పుటలలో విపులంగా రాయగా ఇటీవల ఆక్స్ఫర్డ్ వారు ప్రచురించారు .
చివరలో ఇరువరం మాడిసన్లో స్వాగత్ హోటల్ లో భోజనము చేశాము. మాతో పాటు వున్న చెరుకూరి రవి ఫోటోలు టీసారు. ణేను తీసుకెళ్ళిన గుంటూర్ జిల్ల రచన చాసి ఆనందించి ఆటొగ్రాఫ్ చేసి ఇచారు.
ఇక వెళ్ళి రండి అంటూ కరచాలనము చేస్ ఇ సాగనంపారు.
No comments:
Post a Comment