Innaiah with Sib Narayan Ray
ఎక్స్.ప్లోరేషన్స్ అనే శీర్షికన శిబ్ నారాయణ రాసిన వ్యాసాలు 1958 ప్రాంతాలలో చూచాను. అనువాదం చేయబోతే అంత బాగా నడవలేదు. వదిలేశాను. అప్పట్లో శిబ్ రే ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టడీస్ శాఖాధిపతిగా మెల్బోర్న్ .లో పనిచేశారు. ఆయన తిరిగి ఇండియా వచ్చిన తరువాత రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక సంపాదక వర్గంలో వున్నారు. నేను ఎప్పుడైనా అడపదడపా వ్యాసాలు రాసేవాడిని. ఒకసారి ఆవుల గోపాల కృష్ణ మూర్తి ప్రసంగ పాఠం పంపాను. చీరాలలో 1958లో రావిపూడి వెంకటాద్రి మాట్లాడిన సందర్భంగా కొంత చర్చ జరిగింది. అది రవీంద్రనాథ్ ఠాగోర్ పై నిశిత పరిశీలన సారాంశం. అది వేయడానికి శిబ్.రే అభ్యంతర పెట్టారు. నేను పట్టుబట్టాను. రాడికల్ హ్యూమనిస్ట్.లో విమర్శను ఆహ్వానించక పోవడం ఆశ్చర్యం అన్నాను. తరువాత వి.బి.కార్నిక్ నుండి ఉత్తరం వచ్చింది. ఈసారికి వదిలేయమని. అయినా పట్టు సడలించక పోవడంతో వాళ్ళు ఆవుల గోపాలకృష్ణమూర్తికి విషయం రాశారు. ఆయన చెప్పగా అంతటితో విరమించాను. తాను చెప్పింది, నేను రిపోర్టు చేసింది సరైనదే అయినా, శిబ్ రే కోరికపై వూరుకుంటున్నామన్నాం.తరువాత ఎప్పుడో శిబ్.రేను కలసి అడిగితే, ఏదో కుంటిసాకు చెప్పారు. బెంగాల్ సెంటిమెంట్, ఠాగోర్ పై ప్రేమ కనిపించింది.ఠాగోర్ కవితలలో, రచనలలో కనిపించిన ఆధ్యాత్మిక పులుముడు వాదాన్ని ఎజికె తీవ్రంగా విమర్శించారు. ఠాగోర్ కంటె శరత్ రాసిన శేషప్రశ్న, అందులో కమల పాత్ర గొప్పదని ఎజికె అన్నారు. లోగడ ఎం.ఎన్. రాయ్ అదే విషయాన్ని రాశారు. శిబ్ రేకు ఆ విషయం మింగుడుపడక, మా రిపోర్టును ప్రచురించలేదు.
ఆ తరువాత బొంబాయి కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ లలో శిబ్.రేతో అనేక పర్యాయాలు కలసి వున్నాం. హైదరాబాద్ లో ఆయన్ను ఆలపాటి రవీంద్రనాథ్.కు, వి.ఆర్.నార్లకు పరిచయం చేశాను. సాలార్ జంగ్ మ్యూజియంకు తీసుకెళ్ళగా ఒక రోజంతా చూస్తూ, సుదీర్ఘ నోట్స్ రాసుకున్నారు. మరోపర్యాయం తెలుగు యూనివర్సిటీలో, ఇంకోసారి ఆలయన్స్ ఫ్రాన్సిస్ హాలులో రాడికల్ హ్యూమనిస్ట్ సమావేశాలకు శిబ్ రేను పిలిపించాం.
ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర శిబ్.రే రాడికల్ హ్యూమనిస్టులో వరుసగా ప్రచురించారు. అది ఇంగ్లీషులో పుస్తకంగా రాకముందే నేను తెలుగు చేయగా తెలుగు యూనివర్సిటీ పచురించింది. శిబ్ రే ఆనందంతో ఎందరికో యీ విషయం చెప్పారు. అప్పుడు పుస్తక ఆవిష్కరణ సభకు రాగా తార్కుండే, ఇందుమతి కూడా వచ్చారు.బొంబాయి కళాశాలలో శిబ్.రే పనిచేస్తున్నప్పుడు, ఎ.బి.షా.తో కలసి హ్యూమనిస్ట్, సెక్యులరిస్ట్ వుద్యమాలకై బాగా కృషి చేశారు. ఎ.బి.షా నిర్వహించిన సెమినార్ల ఫలితంగా, గాంధీ, నెహ్రూలపై మంచి రచనలు వచ్చాయి. శిబ్.రే గాంధీపై రచనల్ని పరిష్కరించి ప్రచురించారు. నచికేత ప్రచురణవారు వాటిని వెలువరించారు. క్వెస్ట్ పత్రికకు ప్రామాణిక వ్యాసాలు రాశారు.జిజ్ఞాస అనే త్రైమాసిక బెంగాలీ పత్రిక కలకత్తా నుండి జీవితమంతా నడిపారు శిబ్.రే. ఉబ్బస వ్యాధితో సతమతమౌతూనే రోజూ కలకత్తా ట్రాంలలో, బస్సులలో రినైజాన్స్ ఆఫీసుకు వచ్చేవారు. శాంతినికేతన్.లో వారికి ఇల్లు ఉండేది. 2008లో అక్కడే చనిపోయారు.
ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు. రాయ్ తిరిగిన దేశాలలో కొన్నింటికి వెళ్ళి మరికొన్ని చోట్లనుండి విషయ సేకరణ చేసి, సమగ్రంగా రచన చేశారు.ఎం.ఎన్.రాయ్ రచనలన్నీ క్రోడీకరించారు. అందులో 4 సంపుటాలు ఆక్స్.ఫర్డ్ వారు ప్రచురించగా ప్రపంచ వ్యాప్తి చెందాయి. ఇంకా రెండు సంపుటాలు రావలసి వుంది.రాయ్ పై డాక్యుమెంటరీలకు ప్రయత్నించారు.రాడికల్ డెమోక్రటిక్ సిద్ధాంతాలుగా 22 సూత్రాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. 1948లో ఆయన ఉపన్యాసాలు విన్నట్లు ఆవుల గోపాల కృష్ణమూర్తి చెప్పారు. ఎమ్.ఎన్. రాయ్, శిబ్.రేలు కలసి ఇన్.మేన్స్ ఓన్ ఇమేజ్ అనే సిద్ధాంత గ్రంథంలో 22 సూత్రాల విపులీకరణ చేశారు. ఉత్తరోత్తరా వాటిలో చాలా మార్పులు అవసరమని ఎబిషా అనగా శిబ్.రే అంగీకరించారు.
ఎం.ఎన్.రాయ్ చరిత్రను శాస్త్రీయంగా పరిశోధనాత్మకంగా రాయాలన్నాడు. కాని తన జీవిత చరిత్రలో కీలక వహించిన మొదటి భార్య ఎవిలిన్ ప్రస్తావనే తేలేదు.ఆ విషయం నేను రాశాను. అయితే దానికి ఏవో కారణాలున్నాయంటూ శిబ్ రే సమర్థించబోయారు. మేం ఆవిషయంలో విభేదించాం.ఎం.ఎన్.రాయ్ పై కొంత పరిశోధన చేసి రాసిన సమరేన్ రాయ్ అంటే శిబ్.రేకి పడేది కాదు. శిబ్.రేకు రాగద్వేషాలు గట్టిగానే వుండేవి.

తస్లీమా నస్రీన్ రచనల్ని బాగా ప్రోత్సహించి ఆమెకు అండగా కలకత్తాలో శిబ్ రే నిలిచాడు. శిబ్ రే అంటే తస్లీమా చాలా యిష్టపడేది. పెద్ద దిక్కుగా భావించాం. హ్యూమనిస్టు ఉద్యమాన్ని శిబ్.రే ప్రోత్సహించినా తానుగా ఎలాంటి బాధ్యతలు చేబట్టలేదు. తార్కుండే ఉద్యమ కృషికి ప్రోత్సాహం పలికేవాడు. ఆయన చివరి రోజులలో శాంతినికేతన్ సభలలో మేము కలసి వుండగలిగాం. రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమ చరిత్రను రాయ్ జీవితంతో మిళితం చేసి రాసే ప్రయత్నంలో, శిబ్.రే చాలా విషయ సేకరణ చేశారు. ఆంధ్రకు సంబంధించి కొంతమేరకు నేను విషయాన్ని అందించగలిగాను. జర్మనీలో, రష్యాలో, మెక్సికోలో, చైనాలో, ఇతరులకు అందుబాటులో లేని అనేక అంశాలను వెలికి తెచ్చారు. జీవితమంతా రాయిస్ట్ చరిత్రకారుడిగా నిలిచారు. సాహిత్య రంగంలో ఆయన అనేక ప్రామాణిక వ్యాసాలను క్వస్ట్, న్యూ క్వస్ట్, రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికల్లో రాశారు. సెమినార్ లలో మంచి వక్త కూడా.
No comments:
Post a Comment