జ్యోతిష్యం మూధనమ్మకమా ,శాస్త్రీయమా?


జ్యోతిష్యం మూధనమ్మకమా ,శాస్త్రీయమా?


పంచ పాండవులు మంచపు కోళ్ళవలె ముగ్గురే అంటూ రెండు చూపుతూ ఒక టి వేయబోయి సున్న పెట్టాడట !!
జ్యోతిష్యంలో భారతీయ జ్యోతిష్యం వేరు.అమెరికాలో చదువుకున్న తెలుగువారిలో కొందరితో సహా దీన్ని నమ్మడం, పాటించడమ గమనార్హం .
భారతీయ జ్యోతిస్య్హం ప్రకారం నవగ్రహాలపై అంతా ఆధారపడుతుంది .కాని నవ గ్రహాలలో రెండు -రాహువు, కేతువు - వునికిలోనే లేవు. లేని గ్రహాల ప్రభావం ఎలా వుంటుంది?  
చంద్రుడు గ్రహం కాదు . భూమికి ఉపగ్రహం .
మిగిలిన వాటిలో  సూర్యుడు గ్రహం కాదు. నక్షత్రం.గ్రహానికీ స్వయం ప్రకాశం లేదు.ఒక్క సూర్యుడు మాత్రమే మనకు వెలుగు  ఇస్తాడు. గ్రహాల నుండి మనుషులపై ఎలాంటి ప్రభావమూ లేదు. 
సూర్యుడినుండి ప్రతి క్షణమూ లక్షలాది కిరణాలు మనమీద ప్రసరిస్తాయి. అందులో పుట్టుక సందర్భంగా ఏకిరణ ప్రభావం ఎలా కొలుస్తారు? దాఖలాలు లేవు. 
అలాగే తారలనుండి ప్రసరించే కిరణాలు మనమీద ప్రభావితం చూపుతున్నయనడానికి ఇంతవరకూ మన జ్యోతిష్యులకు ఒక్క ప్రమాణమూ లేదు. వీరికి వున్న ఆధారమల్ల, ప్రాచీన గ్రంధాల ఆధారమే. అవి శాస్త్రీయంగా రుజువు అయినవి కావు. 
జ్యోతిష్యం శాస్త్రియం అని రుజువు పరిస్తే $ 1 మిలియన్ ఇస్తానని జేంస్ రాండి చేశిన చాలెంగ్ ఇప్పటికీ అమలులో వున్నది. వెభ్ సైట్ లో చూడంది. 
జ్యోతొష్జ్యం కేవల గుడ్డి నమ్మకం. 
అయితే కొన్ని తేడాలతో ఇలాంటి జ్యోథి ష్య  అంధ విశ్వాసం అమెరికాలో వ్యాపించి వున్నది. రాండి సవాల్ వారూ ఎదురు కొనలేకపోయారు.  
Innaiah Narisetti

తెలుగు పత్రికా రంగ వైతాళికులు,కీర్తిశేషులు, ప్రముఖులు

మన పాత్రికేయ వెలుగులు


హైదరాబాద్ లో వయోధిక పాత్రికేయ సంఘం వారు 2011లో 370 జర్నలిస్ట్ ల సమాచార గ్రంధం వెలువరించారు.కె.లక్ష్మణరావు సమన్వయ కర్తగా, గి.ఎస్.వరదాచారి, దాసు కేసవరావు, ట్.ఉడయవర్లు, సంపాదకులుగా క్రిషి చేశారు.

వైతాళికులు భాగంలో భాగంలో 23 పుటలు వీరేశలింగం మొదలు జి.ఎస్. భార్గవ వరకు సంక్షిప్త వివరాలు అందించారు.

కీర్తి శెషులు అధ్యాయంలో 27 నుండి 74 పేజీలు విలువైన వ్యక్తుల విషయం వున్నది.

77 నుండి 136 పుటలలో విలువైన సమాచారం, చిత్రపటాలు వున్నవి. 137 నుండి 145 వరకు కేవలం ఫోటోలు, పేర్లు మాత్రమే ప్రచురించారు.

అమెరికాలో వున్న 5 గురు ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ ల వివరాలు ఫోటోలతోసహా విడిగా వెల్లదించారు.

వివిధ పత్రికల వివేష సంచికల అట్ట ఆకర్షణీయమేగాక, చరిత్రను చాటుతున్నది.

తెలుగు పత్రికా రంగ వైతాళికులు,కీర్తిశేషులు, ప్రముఖులు



400 రూపాయల్వెల పెట్టారు. డాలర్ ధర ఇవ్వలేదు.

ప్రతులకు : ప్లాట్ 24, జర్నలిస్ట్ కాలని, రోడ్ 3, బంజార హిల్ల్స్, హైదరాబాద్ 500034, ఇండియా.పుస్తకం రిఫరెన్స్ గా ఉపకరిస్తుంది.తరువాతి ప్రచురణలో తప్పులు సవరించి,మేలు ప్రతిని అందిస్తామన్నారు. 1/4 డెమి సైజ్ లో వున్నది. మంచి పేపర్పై ప్రచురించారు. చక్కని ప్రయత్నం, క్రిషి



నరిసెట్టి ఇన్నయ్య

రండి! కొత్త దేవుళ్ళను సృష్టిద్దాం..






ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అంతకుమించి దేవుళ్ళున్నారు. గతం నుండి గమనిస్తే ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు దేవుళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు. దేవుళ్ళ చరిత్ర చూస్తే పాత వాళ్ళు కొందరు గతించడం, కొత్తవాళ్ళు చిగురించడం స్పష్టం. ప్రాంతాల వారీగా, దేశాల వారీగా దేవుళ్ళున్నారు. ఎక్కడికక్కడ జనం అలవాట్లు, ఆచారాలు, చివరకు వేషభాషలు కూడా దేవుళ్ళకు వచ్చాయి.



బాగా జన బాహుళ్యంలో వ్యాపించిన దేవుళ్ళు కొందరే వున్నారు. యూదుల దేవుడు ప్రాచీన హేబ్రూ భాష మాత్రమే తెలిసినవాడు. క్రైస్తవుల దేవుడు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాడు. యూరోప్ వాసుల వాణిజ్య వ్యాపార విస్తృతితోబాటు, దేవుణ్ణి వెంట బెట్టుకెళ్ళి ప్రచారం చేసి పెట్టారు. ముస్లింల దేవుడు 7వ శతాబ్ది నుండి ఆరంభించి, ఉధృతంగా విస్తరించాడు.



బౌద్ధం బాగా ప్రాచీనమైనా చాలాకాలం ఇండియాకు, ఆసియా ఖండానికి పరిమితమై సరిపెట్టారు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాలకు బౌద్ధం కొంత విస్తరించకపోలేదు.



హిందువుల దేవుళ్ళు ఇండియాకు మాత్రమే సరిపెట్టుకున్నారు. వీరి సంఖ్య అపరిమితంగా వుంది. అందులో ప్రధానమైనవారు ముగ్గురే కాగా, చిలవలపలవలుగా మిగిలినవారు తలెత్తారు.



దక్షిణ అమెరికాలో, చైనాలో, ఆఫ్రికాలో దేవుళ్ళు వేరే లేకపోలేదు. మొత్తం మీద దేవుళ్ళు చరిత్ర, పరిణామం విజ్ఞాన సర్వస్వసంపుటాలకు మించిపోయింది. దానికి యింకా ఫుల్ స్టాప్ పెట్టలేదు.



ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని మతాలున్నా, ఎన్ని రూపాలు కనబడినా అసలు దేవుడు ఒక్కడే అనేవారున్నారు.



విశ్వవ్యాప్తంగా ఒకే శక్తి వున్నదని అది అతీతమైనదని నమ్మేవారు కనిపిస్తారు.



దేవుడు సర్వాంతర్యామి అని, సర్వజ్ఞుడు అని, సర్వ శక్తివంతుడు అని వర్ణించిన వారూ వున్నారు.



దేవుళ్ళను గురించి రాసినా, మాట్లాడినా, సినిమాలు తీసినా, అదంతా మానవ ప్రక్రియమాత్రమే.



పరిమితమైన మానవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడి గురించి ఎలా మాట్లాడగలడు? అలా మాట్లాడేవారికి దైవంతోబాటు అన్ని లక్షణాలు వుండి వుండాలి. లేవు గనక వూహిస్తున్నారు.



ఇంతకూ యీ దైవ భావన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది?



మానవుల శక్తి పరిమితం. తెలియని అంశాలు అపరిమితం, క్రమేణా తెలుసుకుంటూ సాగిపోతున్నారు. ఈలోగా తెలియని వాటికి కారణాలు వెతకడం సహజం. కారణాలు తెలియనప్పుడు, అంతవరకూ, ఆగకుండా, దైవభావం తెచ్చిపెట్టారు. మనుషులకు తెలియనివాటికి, కారణం దైవం అని నమ్మారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు, ఎండలు, భూకంపాలు, తుఫాన్ లు, గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షం, భూగర్భం, సముద్రాలు యిత్యాది అన్నీ దైవ సృష్టి అని నమ్మారు. అంటే కార్యకారణ వాదం గట్టిగా అంగీకరించారన్నమాట. ప్రతి దానికీ కారణం వుండాలి. మనకు తెలియనప్పుడు అదే దైవం అన్నారు. తర్కం బాగున్నది. ఆ మాటమీదే నిలిస్తే, ప్రతిదానికీ కారణం వుండాలి అంటే, సరే బాగుంది.



అయితే, వీటన్నిటికి కారణమైన దేవుడికి కారణం ఏమిటి? ఆ మాట అడగొద్దు అన్నారు. అది తప్పు అన్నారు. శిక్షించారు. నరకానికి పోతావన్నారు. ఇంకా ఏమో అన్నారు. అక్కడ కార్యకారణ వాదం విఫలమైంది.



అన్నిటికీ కారణం దేవుడే అయితే, స్వయంగా సృష్టించే శక్తి అయితే, ఆ మాట ప్రకృతికి ఎందుకు అంటగట్ట కూడదు?



కొత్త దేవుళ్ళు



దేవుళ్ళ చరిత్ర చూస్తే అందరూ పరిణమించిన వారే. కొందరు శక్తివంతంగా తయారైతే, మరికొందరు పేలవంగా తేలిపోయారు. ఎహోవా, జీసెస్, అల్లా, బుద్ధుడు, బ్రహ్మ, విష్ణు, శివ యిలా ఎవరిపేరు విన్నా అదే కథ. ప్రజల్నిబట్టి వారి భాషలోనే పవిత్ర గ్రంథాలు, దేవుళ్ళు అందించారు. చదువు రాకపోయినా గ్రంథాలు రాయడం దైవ శక్తికి నిదర్శనంగా మానవులు చూపారు!



అట్లా వుండగా, ప్రతి శతాబ్దిలో కొత్త దేవుళ్ళను సృష్టించారు. ఇంకా పుట్టిస్తూనే వున్నారు. ఇండియాలో షిర్డీసాయి, అయ్యప్ప, వెంకటేశ్వరుడు, ఇంకా మాతలు, బాబాలు అందరూ స్థానిక దేవుళ్లే.



క్రైస్తవులలో కేథలిక్కులతో ఆరంభించి, క్రమేణా చీలి, ప్రొటస్టెంట్.లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, మర్మోన్లు, సైంటాలజిస్టులు, కొన్నివందల శాఖలు చేరాయి. ముస్లింలలో సున్నీలు, ప్రథాన శాఖగా ఉన్న తరువాత షియాలు, ఖుర్ద్ లు, ఇంకా అనేక చిన్న ప్రాంతీయ శాఖలు వున్నాయి. బౌద్ధులలో హీనయాన, మహాయానం ముఖ్యం కాగా, చిన్న శాఖలు వుండనే వున్నాయి.



చీలిన శాఖలు శివమెత్తి అనేక సందర్భాలలో దేవుడి పేర కొట్టుకున్నారు. చంపుకున్నారు. ఇంకా అది సాగుతూనే వున్నది.



దేవుడి జీవితం ప్రభావం



మనుషులే దేవుళ్ళను పుట్టించారు. క్రమేణా ఆ దేవుళ్ళకు బానిసలయ్యారు. తామే దేవుళ్ళను పుట్టించామని మరిచిపోయారు.



నేడు ప్రపంచ వ్యాప్తంగా దేవుడిని నమ్ముతున్నవారు యించుమించు అత్యధిక సంఖ్యలో వున్నారు. ఇది 90 శాతం వరకూ లేకపోలేదు. ఇందులో తారతమ్యాలున్నాయి. వ్యక్తిగతంగా దేవుడుంటాడని కొందరనుకుంటారు. శక్తిగానే మిగిలాడని కొందరు నమ్ముతారు. వివిధ అవతారాలను విశ్వసించేవారూ వున్నారు. దేవుడికి పెళ్ళి చేయడం, సంతానం కలగడం, కొందరికి బహుభార్యాత్వం యివన్నీ మనుషులు అంటగట్టినవే.



దేవుడిని నమ్మించడానికి ఎత్తుగడలు పాటించారు. అందులో ముఖ్యాంశం “పవిత్ర గ్రంథాలు” మనుషులు రాసినా, వాటిని గౌరవించి, ఆరాధించి, పాటించాలంటే, పవిత్రం అని ముద్ర వేయాలి. అదే చేశారు. ఇంచుమించు అన్ని మతాలకు పవిత్ర గ్రంథాలున్నాయి. కొండ గుహల్లో చదువురాని వ్యక్తులకు దేవుడు వీటిని అందించిన కథలున్నాయి. వేదాలను అపౌరుషేయాలన్నారు. మూలగ్రంథాల సృష్టి ఆధునిక కాలాలవరకూ, సాగింది. క్రైస్తవులలో మోర్మోన్.లు, సైంటాలజీ శాఖలు ఆ పని చేశాయి. మూలగ్రంథాలన్నీ మనుషులు సృష్టించడంతో వుండవలసిన దోషాలు, పరస్పర విరుద్ధ విషయాలు, సెక్స్, కిరాతకాలు, నీతి సూత్రాలు అన్నీ వున్నాయి. మత గ్రంథాలను సైంటిఫిక్ గా సమర్థించే ప్రయత్నాలు సాగాయి. కాని ఫలించలేదు.



దేవుడి చుట్టూ, స్వర్గం, నరకం, కర్మ, పాపం, పుణ్యం, పునర్జన్మ, ప్రార్థనలు, యోగ, మొదలైనవన్నీ ఆకర్షణలుగా అల్లారు పురోహిత వర్గం. దేవుడికి మనుషులకు మధ్య దళారులుగా నిరంతర వ్యాపారం చేస్తున్నారు.



దేవుడున్నాడా? లేడా? అనేది నమ్మకస్తుల సమస్య. రుజువు చేయవలసింది నమ్మకస్తులే. వున్నాడని గట్టిగా నమ్మి ఇతరులకు బోధ చేస్తున్నారు. వారే రుజువు చేయాలి. అలా చేయనంత వరకూ వారు చెప్పేది నిజం కాదని అనడంలో తప్పులేదు. సైంటిఫిక్.గా దేవుడున్నాడని రుజువు చేస్తామంటున్నవారు ఎక్కడా సఫలం కాలేదు. సైంటిఫిక్ మెథడ్ తనను తాను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ సాగుతుంటుంది. దోషాలను ఒప్పుకుంటుంది. అంతా తెలిసింది అని ఎప్పుడూ అనదు. తెలుసుకోవడం అనంతంగా, నిరంతరంగా సాగే ప్రక్రియ. దానికి పవిత్ర గ్రంథాలుండవు. పెత్తందారీతనం వుండదు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఐన్ స్టయిన్.తో సహా రుజువుకు నిలవాల్సిందే. అది మతానికి అన్వయిస్తే ఏ దేవుడూ నిలవడు!!

INNAIAH NARISETTI