పుస్తక పరిచయం: అబద్ధాల వేట – నిజాల బాట

https://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/

నరిసెట్టి ఇన్నయ్య రచించిన వ్యాస సంకలనం అబద్ధాల వేట – నిజాలబాట 2005లో ప్రచురణయ్యింది. దానికి కొత్తగా డార్విన్, ప్రేమానంద్, రత్నసభాపతి, లచ్చన్న మీద వివరణాత్మక వ్యాసాలు చేర్చి, ఇప్పుడు ఇ-పుస్తకంగా వెలువడింది. ఈ పుస్తకం గురించి వెనిగెళ్ళ వెంకటరత్నం గారి పుస్తక సమీక్ష.
ఇన్నయ్య చిన్న వ్యాసం రాసినా, పెద్ద వ్యాసం రాసినా దాన్ని తన కోణంలో విశ్లేషించి, చీల్చి చెండాడుతాడు. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళయినా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగటం, గట్టిగా బల్లగుద్ది చెప్పటం ఇన్నయ్య ప్రత్యేకత. ఈయన కొరడా దెబ్బలు తగిన వాళ్ళలో వివేకానంద, ప్రకాశం పంతులు, మహాత్మాగాంధీ లాంటి ప్రముఖులున్నారు. ఈ సంపుటిలో చాలా లోతుగా బాబాలు, ‘అంబేద్కర్ ను అంతం చేస్తున్నారు – ఆపగలరా’ ‘ఎమ్. ఎన్. రాయ్ ఇలా చేశాడా’, ‘హిందూ నెపోలియన్ వివేకానంద’, ‘ఏది సత్యం’ గాంధీగారు వ్యాసాలతో పాటు ఎ.జి.కె., జర్నలిస్టు చింతామణి, డి.ఆంజనేయులు, గోరాశాస్త్రిలాంటి వాళ్ళ జీవిత చిత్రణలు ఉన్నాయి. ఇంకా కొన్ని సైన్సు సంగతులు, యోగా, హోమియోపతి, జ్యోతిష్యం గురించి ఉన్నాయి. సైంటిఫిక్ దృక్పథాన్ని ప్రేమించే వాళ్లంతా ఈ వ్యాసాలు తప్పక చదవాలి. చివరకు వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో ఎందుకు పాడరని అందులోని శృంగారాన్ని ఎత్తి చూపారు. అంటే దేవుణ్ణి సైతం వదలలేదన్నమాట. నేను ఏర్పరచుకున్న పేజీల నిడివి దృష్ట్యా కొన్ని వ్యాసాలలో ముఖ్యమైన విషయాలు విశదీకరిస్తాను. ప్రతీ వ్యాసంలో కొత్తదనంతో కూడిన భోగట్టా వుంటుంది. ఎవరి అభిరుచులను బట్టి వాళ్ళు ఆ వ్యాసాలు ఆస్వాదించవచ్చు. ఈ పుస్తకంలోని వ్యాసాలు పాఠకులకు నచ్చుతాయనే నమ్మకం నాకుంది. మనకు తెలియకుండా నిత్య జీవితంలో మూఢనమ్మకాల వైపు మొగ్గుతున్నాం. అది కాస్త తగ్గినా మనలో మార్పు కనబడుతుంది

No comments:

Post a Comment