`సప్తపర్ణి` -అక్క చెల్లెళ్ళ కవితా పటిమ

సప్త పర్ణి 
భావలహరి



ఇది ఏ డుగురు సోదరీ మణులు రాసిన స్వీయ కవితల సంపుటి.
అన్నపూర్ణ, రమా సుందరి, ఉమాదేవి, నాగలక్ష్మి, ప్రభావతి, గాయత్రి, గీతాభవాని రాసి 2012 ఆగస్ట్ లొ వెలువరించారు .

ఈ సప్తపర్ణిలో రెండు ప్రత్యేకతలున్నాయి. ఏ డుగురు అక్కచెల్లెళ్ళు కవిత లల్లగలగడం .రెండు-వారి కవితలు ఒకే సంకలనంగా తీసుకరావడం. 
సప్తపర్ణిని పరిచయం చేయడంలో నాకు నచ్చిన కవితలు చూపి మెచ్చుకోవడమే ప్రధానం. విమర్శ భాగాన్ని శ్రి మైనంపాటి భాస్కర్ తన ముందు, వెనుక మాటలో సద్విమర్శగా చేశారు. 
ఇక వివరాలు:
అన్నపూర్ణ (పెద్దక్క) తన ముందు మాటలో తమందరికీ సాహిత్యంలో అభిరుచి తమ తండ్రి సుబ్బారావు (రాజు) గారి ద్వారా కలిగితే , కవితలు రాయడానికి తమ తల్లి సుబ్బులక్ష్మి (అమ్మాజీ) గారి ప్రోత్సాహం తోద్పడిందన్నారు .
తల్లి వారిని సప్తస్వరాలుగా భావించి వారిలో సంగీతం ,సాహిత్యం పట్ల ప్రేమను పెంచారన్నారు .
         అన్నపూర్ణ తమ 53 కవితలను మనకందించారు .జాతస్య మరణం ధ్రువం లో తండ్రి అకాల మరణం మిగిల్చిన తీరని లోటును వ్యధాభరితంగా చెప్పారు .
`రాక్షస ఉగాదికి రమ్యాకాంక్ష ` లో స్వార్థపరులైన రాజకీయనాయకుల గురించి రాస్తూ ,వారికి ఓ టు వేసి గెలిపించి  తాము ఓ డిపోయిన సామాన్య మానవులను సమ్రక్షించమంటున్నారు ఇలా :
                       రాబందులకూ, గుంటనక్కలకూ
                       నువు రాక్షసివని 
                       అందుక్కే ఆకంక్షిస్తున్నాను నీ రాజ్యం 
                       రామ రాజ్యం కావాలని
సవాలు లో ఆమె ప్రశ్నలు :
                        `సగటుమనిషి జీవితం ఎంత పెట్టి గుణిస్తే 
                         పూర్తి జీవితం అవుతుంది ?
                         ఎందరు సూర్యులు ఎన్ని సార్లు ఉదయిస్తే 
                         చీకటి బ్రతుకులు తెల్లవారతాయి? 
న్యాయన్యాయాలు , అలిఖితం, చాయచాయ, సహజీవన సౌభాగ్యం, సమాజానికి సంజీవి , నత్తల్లారా బయటకు రండి, మొదలైనవెన్నో కవితలు చదివి ఆనందించదగ్గవి .

రమాసుందరి 
తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన సాహిత్య పరిమళం అక్క అన్నపూర్ణ ద్వారా జీవితమంతా గుభళిస్తుందంటున్నారు. పద్య సాహిత్యం అంటే మక్కువ, చందోబద్దంగా కవిత్వం రాయాలన్న తపన -రెండూ జోడై తనతో రాయించాయంటున్నారు .తోచీ తోచక కొన్ని, ఉత్చాహంతో కొన్ని ,ఉక్రోషం తో మరికొన్ని రాశినవి మొత్తం 36 కవితలు మనల్ని చదవమంటున్నారు .యువకవులు- నవకవులు, ఆశీస్సులు (చెల్లి ప్రభావతికి),తుంటరి అక్క  చందమామ ఒంటరి అని రాస్తే , తాను తుంటరి అని రాశారు ). అదర్శంలో -
         నాముందువాళ్ళు నాకోసం పరచిన బాట 
         భావితరాలకు బంగారు బాటగా చేస్తా 
         నా జీవితం నాది కాదు పదిమందిదీ 
         నా సుఖం నాది కాదు నావారందరిదీ 
అంటూ నిస్వార్థతను వ్యక్తం చేశారు. 
పట్టుకొమ్మలో -
          నల్లధనం వద్దట,నల్లధనమైనా ముద్దట 
          లావయితే  వద్దట,  మాలావైన సంపాదన కావాలట 
          ఫట్టులాంటి చిత్తమున్న చిన్నదాని ఎన్నిక 
          ఎప్పటికైనా మాదేనా? అని ఆవెదన వ్యక్తం చేశారు. 
సన్మాన సం రంభంలో -ఈ నాటి సన్మాన సభల తంతు , తీరూ , తెన్నూ అద్దం పట్టినట్లు చూపారు . ఆమె కవితలన్ని చదవదగినవే .

ఉమాదేవి 

తన కవితలకు అన్నపూర్ణక్క స్పూర్తి అన్నారు. తన అక్క చెల్లెళ్ళు ఇంద్రధనస్సులో  సప్త వర్ణాల్లా
అందరూ రాసిన ఈ కకవితా ఖండిక  తాము ఆనందం కోసం రాశినవి, మరి కొంతమందిని ఆనందపరిచే విధంగా పుస్తకరూపం దాల్చడం చాలా ఆనందం అంటున్నారు .
మొదటి కవిత `పర్యవసానం` లో 
                    చెడును మంచితో వంచించాలని   
                    మాటలో కరుకుదనం కట్టిపెట్టి 
                    మ్రు దుత్వాన్ని  పెంపొందించుకోవాలని 
                    మరెన్నో అనుకొంటునా నేను 
అని తాను అశ పడుతుంటే  లోకం తనని స్వార్థమంటున్నదంటారు .
స్వస్వరూపంలో 
                  నేను మానవుడిని 
                  ఆద్యంతాలమధ్య  ఆదర్శ పాలన కోసం 
                  అందులోని ఆనందం కోసం  
                  అలమటించే అతి సామాన్య మానవుడిని
అంటూ  సామాన్యుడి కోరికను వ్యక్తం చేశారు. బంగారు బుజ్జిగాడా మీరేమంటారో, చిరుదీపం మొదలైన కవితలన్నీ చదివి ఆనందించవచ్చు . 

నాగలక్ష్మి 

సాహితీ సమాఖ్యల మీటింగులకెళ్ళడం, అక్కల ప్రభావం ,బి.ఎ.లో స్పెషల్ తెలుగు  చదవడం -అన్నీ ఆమెతో కవితలు రాయించాయి . తనలోనూ కవితా స్పూర్తి వున్నందుకు ఆనందిస్తామంటున్నారు . ఇందులో ఏ డు కవితలు పొందు పరిచారు . 

ఉగాదిలో :

ఏ డాదికో బారసాల చేసుకుంటూ 
తెలుగు జీవితంలో నవ నవోన్మెషంతో 
నూతన చైతన్యాన్నందిస్తున్న  నీకు ఇదే 
స్వాగతాంజలి 
అంటూ ఉగాదిని ఆహ్వానించారు .
కలల పూదోటలో  తానూ ఒక పూ వునవగలిగితే  ఎంత బాగుంటుందో అని ఊహా జగత్తులో విహరించారు . 
తెలుగు లో 
తేట తెలుగు తెల్లన 
అమ్మ మనస్సు చల్లన 
తెలుగు కూడ అమ్మ అని 
తెలుసుకొని మసలరా 

అంటూ తన మాత్రు భాషాభి మానాన్ని ముద్దుగా తెలిపారు. ఇంకా -
కాలచక్రం , అభినందనలు ,నీనీలి ఆకాశం
వంటి కవితలలో తన పటిమ చాటారు నాగలక్ష్మి .

ప్రభావతి 
రాయడం కన్నా చిత్రలెఖనం మీద మక్కువ ఉంటాన ద్రుష్తి అటు సారించానంటున్నారు .తన భావాలకు అక్షర రూపాలే తన ఈ కవితలన్నారు .జ్ఞాపకాల ఝరితో  ప్రారంభించి -రాగ రాగిణి తో  కలిపి పది కవితలు మనముందుంచారు .
ప్లాస్టిక్ పూలలో ఇలా వర్ణించారు .
                            మితి మీరిన చైతన్యంలో  
                            జడ మనస్సుడైన ప్రతీకలు 
                            తెలిసిందిలే , నిరీక్షణా , నీ కోసం జీవన రాగాలు 
అంటూ చక్కని కవితలందించారు .

రాణీ గాయత్రి 

జీవితంలో చమక్కులీ కవితలన్నారీమె .  చురుక్కులూ ,కొంటె వ్యాఖ్యానాలు  ,కొద్దిగా చివుక్కు మనిపించే భావాలు  వున్నాయన్నారు. ఆస్వాదించి, ఆశీర్వదించమంటున్నారు .

అమ్మ కవిత లో
అమ్మ నన్ను వదలి
అల్లంత దూరాన చల్లగా నవ్వెను 
అమ్మ ప్రేమను నేను 
అందరకూ పంచాను 
అంటూ మనసుకు చల్లదనం పంచారు. 
`మా అక్కలు` లో 
మా అక్కలు అనురాగపు మొక్కలు 
ఊహ కందని అమ్మా నాన్నల స్తానంలో నిలిచిన పెద్ద దిక్కులు
మా చెక్కిళ్ళ్లపై విరబూసిన పూవుల సుగంధాలు 
    అంటూ రాసి అక్కలకు క్రుతగ్న తలు తెలిపారు. 
సంక్రాంతి, బాల శివుదు, శివ తత్వం 
ఇందులో కూర్చారు . 

గీతా భవాని 

రాయడం ఎప్పుడు మొదలు పెట్టానో గుర్తు లేదంటూనే 13 కవితలు పైగా రాసి  మనల్ని చదవమంటున్నారు. 
దాహం, వాన, తీయని నిజం, బాల్యం, ఆకలి, చిన్నచిన్న గా ముద్దు ముద్దుగా ఇక్కడ దర్శనమిచ్చాయి .
రాచపీడలో ఇలా వేడుకున్నారు . 
వారసత్వపు రాజకీయాల బారినుండి 
దేవుడా రక్షించు ఈ దేశాన్ని 
కోర్కెల కర్కశ హస్తాలనుండి 
సన్యాసి ముఠాల సర్కస్లనుండి 
రక్షించు రాజకీయ రాక్షసులనుండి .

`మా స్నేహం` చక్కని కవిత. 

అక్క చెల్లెళ్ళందరూ అమ్మ ,.   రాగ రాగిణి రాశారు తమ తమ కవితా పటిమ ప్రతిభ ఫలించేలా. 
అన్నపూర్న గారి `సహ జీవన సౌభాగ్యం`(72 పుట) ప్రభావతి గారి నాకోరిక( 175 పేజి) ఒకటె- పేరు తేడాగా ఉన్నా.ప్రభావతి కవిత  `నిరీక్షణ`( 171 పేజ్)  ,`నీ కోసం`(పేజ్ 172)  రెండూ ఒకటే . రెండవ ముద్రణలో సవరిందుకోవచ్చు. 
      కవితా ప్రియులందరూ `సప్తపర్ణి` చదవదగ్గది. నవ కవులకూ, యువకవులకూ స్పూర్థి దాయకం ఇది. అక్కచెల్లెళ్ళు మరెన్నో కవితలల్లాలని ఆశిద్దాము .


2012 లో వెలువడిన ఈ గ్రంధం వెల పెట్టలేదు .లభించే చోటు తెలిపితే బాగుంటుంది.
 పరిచయం : కోమల వెనిగళ్ళ 
అమెరికాలో మేరీ లాండ్ లో వుంటున్నారు . 
యంగ్ చాంగ్ , అయన్ హర్షి అలి, తస్లిమ నశ్రిన్ ,ఎం.ఎన్.రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రచురించారు . హైదరాబాద్ ఓపెన్ యూని వర్శిటి లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా రెటైర్ అయ్యారు.  

3 comments:

cbrao said...

సమీక్ష బాగుంది. పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి కలిగించింది. అయితే " నల్లధనం వద్దట,నల్లధనమైనా ముద్దట" లోని కవి హృదయమేమిటో? " నల్లధనమా లేక నల్లదనమా? ఫట్టులాంటి చిత్తమున్న చిన్నదాని ఎన్నిక ఎప్పటికైనా మాదేనా? " అనే ఈ కవితలో ఫట్టు పద ప్రయోగం వింతగా ఉంది. ఏవి ముద్రసారాక్షసాలో, ఏది కవి హృదయమో?

ఏడుగురు అక్కచెల్లెళ్ళు కవిత లల్లగలగడం , వాటిని కవితా సంకలనంగా ప్రచురించటం అపూర్వం. ఈ కవితలతో సప్తపర్ణి ఇంద్రధనస్సుగా ఆవిష్కరింపబడ్డది. ఈ సప్తవర్ణాల పుస్తకానికై ఎవరిని సంప్రదించాలో తెలియచేయండి.







innaiah said...

1 of 118




.
‘పట్టు – కొమ్మ’ అనే ఈ కవిత నేను 1990-91 ప్రాంతాలలో రాయడం జరిగింది. ఒక పెళ్ళికూతురికి చీరె కొనడానికి 10 మందిమి ఒక పెద్ద షోరూంకి వెళ్ళినపుడు నాలో మెదిలిన ఊహలే ఈ కవితకి ప్రేరణ. ఎన్నో చీరెలు తీయించి, ప్రతీ దానికీ వంక పెట్టి ఒక్కటి ఎంచుకోవడం గగనం అయింది. అప్పుడు ఆడపిల్లని పెళ్ళి చూపుల్లో చూసే విధానం, శల్యపరీక్షలు, అడిగే యక్ష ప్రశ్నలు – పట్టు చీరెని ఎంచుకున్నట్లే అన్పించింది. “నల్లదనం వద్దట – నల్లధనమైనా ముద్దట” అంటే అమ్మాయి నల్లగా వున్నా, లావుగా వున్నా వద్దు. కానీ బ్లాక్ మనీ వుంటే కావాలి. సంపాదన ఎంతలావుంటే ... అంటే ఎంత ఎక్కువ వుంటే అంత మంచిది! అనేది భావం!
“పట్టులాంటి చిత్తమున్న చిన్నదాని ఎన్నిక ఎప్పటికైనా మారేనా?” అనడంలో ఔచిత్యం ఏమిటంటే... ఆడపిల్లలు ఎవరికైనా పట్టులాంటి, మెత్తని, మృదువైన హృదయమే వుంటుందని నా భావన! అలాంటి అమ్మాయిలను (ఇలా) ఎంచుకోవడం ఎప్పటికైనా మారుతుందా? అని ఆవేదన వెలిబుచ్చాను.
అయితే ఈ మధ్యే ఈ ట్రెండ్ మారిందనీ ఇప్పుడుఅమ్మాయిలదే పై చేయిగా వుందనీ ఈ కవితా కాలానికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందనీ కొందరు స్నేహితులు చెప్పారు. నా అభిప్రాయం విశదంగా చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.
- రమాసుందరి

dnagalakshmi138@gmail.com said...

జగమెరిగిన రచయిత్రి, సాహిత్యాభిమాని, సహృదయులు శ్రీమతి కోమలగార్కి మా అందరి తరఫున వందనాలు!
మీ ద్వారా మా ‘సప్తపర్ణి’ ప్రపంచానికి పరిచయం కావడం మాకు చాలా సంతోషంగాను, కించిత్తు గర్వంగానూ ఉంది.
మా పెద్దక్క తన ముందు మాటలో రాసినట్లు భావ సంపదలోనూ, భాషా ప్రయోగాలలోనూ మేమందరం సంపన్నులమే. నిజానికి ప్రతి కవితకీ ఓ నేపథ్యం ఉంది. మీరు మా పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఉదహరించిన కవితలూ, వ్యక్తపరచిన భావాలూ సప్తపర్ణి పట్ల వీక్షకులకు కుతూహలాన్ని రేకెత్తించే విధంగా ఉన్నాయి. ప్రథమ ప్రయత్నంలో దొర్లిన పొరపాట్లని ఉటంకిస్తూనే అవి మలి ముద్రణలో సవరించుకోవచ్చనే సూచన కూడా చేశారు. (మలిముద్రణలో మా పొరపాట్లను సరిదిద్దుకోగలము) తద్వారా మా పుస్తకం పఠితల ఆదరణకి నోచుకుంటుందనీ, మలిముద్రణ దాకా వెడుతుందనీ ఆ ఆశని మాకు కలిగించి మంచి స్ఫూర్తినిచ్చారు. మీరిచ్చిన ప్రోత్సాహానికి మేమెంతో కృతజ్ఞులము. బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు కావాలని పెద్దలంటారు కదా! అటువంటి ఆసరా మీ నుంచి పొందిన మేము చాలా అదృష్టవంతులం. ఈ ప్రోత్సాహాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఇంకా రచనలు చేయగలమని నేను ఆశిస్తున్నాను. మా సిస్టర్స్ అందరి తరఫున మీకు మరోసారి మా కృతజ్ఞతాభివందనాలు.
- రమాసుందరి

Post a Comment