పానుగంటి లక్ష్మినరసిం హారావు విమర్శనా పటిమ
తెలుగు సాహిత్యంలో హాస్యం ,విమర్శ, నాటకాలు,నచ్చినవారికి పానుగంటి సుపరిచితులు .సాక్షి రచనలొ వాక్యాలు వుదహరించేవారున్నారు .కోకిల మొదలు సారంగధర చరిత్ర వరకు మెచ్చిన వారున్నారు. సాక్షి ప్రియులకు ఆయన గ్రాంధికము అడ్డురాదు .
కాని పానుగంటి వారి విమర్సలో తలమానికము , గ్రాంధిక వాదాన్ని వెనకేసుక వచ్చిన రచన విమర్శాదర్శ విమర్శాదర్శం అని అధిక సంఖ్యాక పాఠకులకు తెలియదు. ఆయన గ్రాంధిక వాదాన్ని కాసేపు పక్కన పెడితే హాస్యం, విమర్స ,వ్యంగ్యం ,ఎదుటివారి వారి వాదాన్ని చిత్తు చేయడంలో పానుగంటి ప్రతిభ అద్భుతంగా ఇందులో గమనించవచ్చు .విమర్శాదర్శ విమర్శాదర్శనం అంత సులభంగా లభించడం లేదు .
మొదట గుంటూర్ ఎ.సి. కళాశాలలొ మా గురువు ఎలవర్తి రోశయ్య ఆ రచనను పరిచయం చేసినప్పుడు చదివి చకితుడనయ్యాను .నేను గ్రాంధి క వాదిని కాదు .కాని ఆరచన లోని ఒరవడి ,పదును ,వాదనా పటిమ చాలా గొప్పది . లభిస్తే చదవండి.
Innaiah Narisetti
No comments:
Post a Comment