మా చేబ్రోల్ సూర్యదేవర నరసయ్య హైస్కూల్గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో 1940 -50 మద్య సంగతి.పాతరెడ్డిపాలెం కొత్తరెడ్డిపాలెం చేబ్రోలు మూడు గ్రామాలూ మేజర్ పంచాయతిగా వున్నా రోజులవి. నరసయ్యకు సంతానం లేదు .సొంతగా స్కూల్ పెట్టారు .చుట్టుపట్ల గ్రామాలకు ఒక్కటే బడి. మల్లంపాటి మధుసుదనప్రసాద్ హెడ్మాస్టర్ .ఆయనకు సంతానము లేదు. గ్రామర్ అంటే మక్కువ.సమాధానము సరిగా చెప్పకపోతే పేము బెత్తం తో బాదేసే వారు. ముసలయ్య అనే అతను బెత్తం పట్టుకొని రెడీగా ఉండేవాడు .ప్రసాద్ గారు పాటశాల కోసం చుట్టుపట్ల గ్రామాలు తిరిగి డబ్బు వసూలు చేసి భావన నిర్మాణానికి కృషి చేశారు .ఆటలు బాగా ఆడేవారు .పింగ్ పాంగ్ టేబుల్ ఆట ఆడేవారు . నాటకాలలో కృష్ణ పాత్ర వేస్తూ మీసాలు తీసేయడానికి నిరాకరించారు .కృష్ణకు మీసాలు లేవనడానికి ఆధారాలు ఏమిటి అని అడిగారు .
ఇంకా శేషగిరిరావు ,మురహరి, ఆంజనేయులు ,రాజగోపాలరావు ,వెంకటరత్నం మొదలైన ఉపాద్యాయులు వుండేవారు .మేక సూర్యనారాయణ క్రాఫ్ట్ పంతులు .దేవాభక్తుని నారాయణరావు సైన్స్ బాగా చెప్పేవారు .ఆయన కమ్మ్యునిస్ట్ .అమెరికాలో కూతురు దగ్గర చివరి రోజులలో వున్నారు .--
*Innaiah Narisetti*

No comments:

Post a Comment