మానవవాదం

మూఢాచారాలు, పిల్లలపై మన విశ్వాసాలు రుద్దటం , అశాస్త్రీయ వైద్య విధానాలు, బాబాలు, యోగా వగైరాలపై పలు వ్యాసాలు గతంలో నా ప్రపంచంలో నేను ప్రచురించాను. వాటిలోని భావాలకు మీలో కొందరు ఏకీభవించపోకపోయినప్పటికీ ఆ విషయాలపై ఆ వ్యాసాలు మీలో కొత్త కోణంలో ఆలోచింపచేయటానికి దోహదపడ్దాయని తలుస్తాను. ఆ వ్యాసాలు వెలువరించిన సమయంలో నేను పలు పుస్తక ప్రచురణలు, టీ.వి.కార్యక్రమాలలో నిమగ్నమయుంటంవలన మీ ఉత్తరాలకు సత్వరంగా స్పందించలేకపోయాను. అందుకు మన్నించకోరుతాను. ఇహపై మీ అందరి ఉత్తరాలకు జవాబివ్వకపోయినా అన్ని ఉత్తరాలు నేను చదువుతానని మీకు మాటిస్తున్నా. ముఖ్యమైన ఉత్తరాలకు నా స్పందన కూడా ఈ కొత్త బ్లాగులో మీరు చూడగలరు. రండి శాస్త్రీయ పద్ధతిలో ఆలోచిద్దాం. కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుదాం.

మీ,
ఇన్నయ్య

4 comments:

RK said...

నిజంగా శాస్త్రీయ పద్ధతిలో మీరు చర్చిస్తానని అంటే అంతకంటే ఇంకేం కావాలి. చూద్దాం శాస్త్రీయత. పదండి ముందుకు, తోసుకు...

Praveen Sarma said...

స్వాగతం ఇన్నయ్య గారు. మీ బ్లాగ్ ని ప్లానెట్ లో చేర్చాను http://teluguwebmedia.net/planet/Literatureలో ఇండెక్స్ చేశాను.

Praveen Sarma said...

ఇప్పటి వరకు ఒక పోస్ట్ మాత్రమే వ్రాసారు. కొత్త పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.

Nrahamthulla said...

దురాచారాలన్నీ మానవత్వాన్ని మంటగలిపేవి.దురాచారం అంటే చెడ్డ ఆచారం. చెరుపు చెసేది. హానిచేసేది. ఐఖ్యతను చెడగొట్టేది. ఉదాహరణలు:
* కులం
* వెలి, వెలివేయటం
* సతీసహగమనం
* అంటరానితనం
* బాణామతి, చేతబడి, క్షుద్రవిద్య
* బాల్యవివాహాలు
* దేవదాసి, మాతంగి
* వరకట్నం
* కన్యాశుల్కం
* బలి
* నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో అనారోగ్యం వల్ల మృతిచెందిన ఎనిమిది నెలల గర్భిణిని అడవిలో చెట్టుకు వేలాడదీశారు.రెండు ప్రాణాలతో చనిపోయిన శవాన్ని పూడ్చిపెడితే ఆ గ్రామంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో కరవు కాటకాలు వచ్చి, పంటలు పండక అరిష్టం కలుగుతుందట.

Post a Comment