మూఢాచారాలు, పిల్లలపై మన విశ్వాసాలు రుద్దటం , అశాస్త్రీయ వైద్య విధానాలు, బాబాలు, యోగా వగైరాలపై పలు వ్యాసాలు గతంలో నా ప్రపంచంలో నేను ప్రచురించాను. వాటిలోని భావాలకు మీలో కొందరు ఏకీభవించపోకపోయినప్పటికీ ఆ విషయాలపై ఆ వ్యాసాలు మీలో కొత్త కోణంలో ఆలోచింపచేయటానికి దోహదపడ్దాయని తలుస్తాను. ఆ వ్యాసాలు వెలువరించిన సమయంలో నేను పలు పుస్తక ప్రచురణలు, టీ.వి.కార్యక్రమాలలో నిమగ్నమయుంటంవలన మీ ఉత్తరాలకు సత్వరంగా స్పందించలేకపోయాను. అందుకు మన్నించకోరుతాను. ఇహపై మీ అందరి ఉత్తరాలకు జవాబివ్వకపోయినా అన్ని ఉత్తరాలు నేను చదువుతానని మీకు మాటిస్తున్నా. ముఖ్యమైన ఉత్తరాలకు నా స్పందన కూడా ఈ కొత్త బ్లాగులో మీరు చూడగలరు. రండి శాస్త్రీయ పద్ధతిలో ఆలోచిద్దాం. కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుదాం.
మీ,
ఇన్నయ్య