Guntur district-full text-ఆనాటి గుంటూరు జిల్లా-రాబర్ట్ ఫ్రికన్ బర్గ్

http://www.scribd.com/doc/110780376/Guntur-District-Telugu
Read the full text at the link.Translated by Innaiah Narisetti

మిసిమి వ్యాసాలను ఆవిష్కరించారు- వీక్షణం వారి అధ్యర్యాన


చిత్రంలో ఎడమనుంచి కుడివైపు: ఇన్నయ్య, గీతా మాధవి,వేమూరి వెంకటేశ్వరరావు,శివచరణ్ గుండా మరియు కిరణ్ ప్రభ 



 ఉత్తర అమెరికా లోని సిలికాన్ లోయ తెలుగు రచయితల, పాఠకుల వేదిక ఐన  వీక్షణం వారి అధ్యర్యాన పాత్రికేయుడు నరిసెట్టి ఇన్నయ్య వ్రాసిన మిసిమి వ్యాసాల పుస్తకాన్ని అక్టొబర్ 14 న ఆవిష్కరించారు. మల్లాది రఘు సమావేశానికి ఆహ్వానం పలుకగా కార్యక్రమాన్ని గుండా శివచరణ్ నిర్వహించారు. వేమూరి వెంకటేశ్వరరావు  మిసిమి వ్యాసాలను ఆవిష్కరించారు.   కౌముది మాసపత్రిక సంపాదకుడు కిరణ్ ప్రభ సంక్షిప్తంగా పుస్తక విశేషాలను వివరించారు. 20 సంవత్సరాలుగా మిసిమి మాసపత్రికలో వివిధ అంశాలను సులభ శైలిలో  ఇన్నయ్య అందించారని, శాస్త్రీయ ధోరణిలో   వ్యాసాల రచన జరిగిందని కిరణ్ ప్రభ అన్నారు. ఇన్నేళ్ళుగా మానవవాదిగా నిలబడగలగటం,  విషయాలను శాస్త్రీయంగా పరిశీలించటం ప్రముఖంగా ప్రస్తావించారు. నరిసెట్టి ఇన్నయ్య  మాట్లాడుతూ  తాను మానవవాదిగా నిలబడగలగటానికి, శాస్త్రీయ ధోరణితో,  వివిధ అంశాలను పరిశీలించటానికి, తోడ్పడిన నేపధ్యాన్ని వివరించారు. తరువాత సభికుల ప్రశ్నలకు ఇన్నయ్య సమాధానం చెప్పారు.    డా|గీతామాధవి వీక్షణం తరఫున  ధన్యవాదాలు తెలిపారు.    

కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కౌముది సహసంపాదకురాలు శ్రీమతి కాంతి,  తెలుగు బ్లాగరులు  సి.బి.రావు, నిషీగంధ,   కధకుడు తాటిపాముల మృత్యుంజయుడు,  కవి వంశీకృష్ణ ప్రఖ్య ,చిమటా శ్రీనివాసరావు, శ్రీమతి రమణ  ప్రభృతులు ఉన్నారు.