సంచారి పరిచయం
ఛాందస ముస్లిం ల సమాజంలో , కుటుంబం లో అనుభవించిన కష్టాలు, జీవితంలో ఎదుర్కొన్న ఢక్కాముక్కీలను అయాన్ హర్షి అలి అతి చాకచక్యం గా ప్రపంచం ముందు వుంచిన గ్రంధమిది.అమెరికా ముస్లిం మహిళలు సైతం తప్పించుకోలేని, మత సంకెళ్ళను తెంచుకోమని రాసింది. అరబ్ దేశాలలో క్రైస్తవ దేవాలయాలు కట్టనివ్వాలని, అమెరికాలో మసీదులకు అనుమతి కోరే వారు అక్కడ ఎందుకు ఒప్పుకోరని నిలదీసింది. సంచారి సంచలనం కలిగించడమే గాక,ఆలోచన రేకెట్టించింది. మత గ్రహణం వీడింది, మతచెరలో కన్య తరువాత వచ్చిన ఈ పుస్తకం రాజుగారికి దేవతా వస్త్రాల వలె వున్న నిజాలను బట్ట బయలు చేసింది. ఈ పుస్తకం అయాన్ ఆలోచనా స్రవంతిని జనంలోకి తీసుకెళ్తుంది.
రచయిత్రి గురించి
అయాన్ హిర్సీ అలి సోమాలియాలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టింది. ముస్లింగానే పెరిగింది. ఆఫ్రికాలో, సౌదీ అరేబియాలో ఆమె అనేక సంవత్సరాలు గడిపింది. 1992లో తనకిష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకుని నెదర్లాండ్స్ చేరింది. డచ్ భాష నేర్చుకుని శిబిరాలలో, అబార్షన్ క్లీనిక్కుల్లో దుబాసీగా పనిచేసింది. రాజనీతి శాస్త్రంలో పట్టభద్రురాలయి లేబర్ పార్టీలో పనిచేసింది. సెప్టెంబరు 11, అమెరికాలో ఉగ్రవాదుల ఘాతుకం తరువాత ఇస్లాంను విడనాడింది. డచ్ పార్లమెంటు మెంబరుగా యూరప్ లోని ముస్లిం స్త్రీల హక్కుల కొరకు, ఇస్లాంలో వికాసం రావాలని, స్త్రీల భద్రత గురించి పోరాడింది. వాషింగ్టన్ డి.సి,లో ఎయిఐలో పనిచేయటానికి అమెరికా వెళ్ళింది. ఆమె అయాన్ హిర్సీ అలీ ఫౌండేషన్ (సంస్థ) ఏర్పరచింది. ఆ సంస్థ ద్వారా స్త్రీలకు విద్య గరపటం, వారిపట్ల జరిగే హింసాత్మక నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం, ఆడపిల్లల సున్తీని ఆపటం, బలవంతపు పెళ్ళిళ్ళు కాకుండా చూడటం, ప్రతిష్ఠ పేరుతో అమ్మాయిలను చంపటం (ఆనర్ కిల్లింగ్) వంటి వికృత పద్ధతులను వ్యతిరేకించటం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ఆమె రాసిన ‘ఇన్ ఫిడల్’ యూరప్.లో బహుళ ప్రచారం పొంది, ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులు తెచ్చి పెట్టింది. 2005 సంవత్సరంలో ఆమెను టైమ్ మేగజైన్ వందమంది ప్రతిభావంతులలో ఒకరుగా పేర్కొన్నది. 2005 పేరుగాంచిన హీరోల్లో ఒకరుగా టైటిల్ పొందింది. అదే సంవత్సరంలో రీడర్స్ డైజెస్ట్ ఆమెను ‘యూరోపియన్ ఆఫ్ ది ఇయర్.’గా ప్రకటించింది. నార్వే మానవహక్కుల సర్వీసెస్ వారి ‘బెల్ వెదర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’ ఆమెకు దక్కింది. డేనిష్ ఫ్రీడం ప్రైజ్, స్వీడిష్ డెమోక్రసీ ప్రైజ్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ‘అన్సంగ్ హీరోస్ అవార్డు’ ఆమె సొంతమయ్యాయి.
సంచారి ఈ పుస్తకం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకోండి.

Sanchari Telugu e-... |
Hosted by eSnips |