పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు? క్రైస్తవం ఇంత అమానుషమా?

ఆరవ భాగం
పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు?
దేవుడిమీద నమ్మకంవల్ల మానవ ప్రవర్తనలో ప్రభావం కనిపిస్తుందని అన్నప్పటికీ, దేవుణ్ణి నమ్మడానికి అదే కారణం అనలేం. దేవుడున్నాడని భావిస్తే దేవుణ్ణి నమ్మవచ్చు. నాస్తికవాదం నైతిక అరాచకాలకి దారితీస్తుందని అనుకున్నా, దానివలన క్రైస్తవ సిద్ధాంతం నిజంకాబోదు. అలాంటప్పుడు ఇస్లాం కూడా నిజం కావచ్చు. మతాలన్నీ ఫ్లాసిబో చక్కెర మాత్రలవలె పనిచేయవచ్చు. విశ్వాన్ని చిత్రించడంలో మతాలన్నీ తప్పు చేస్తున్నా, అవి ఉపయోగపడనూ వచ్చు. సాక్ష్యాధారాలనుబట్టి మతాలన్నీ తప్పుడువే కాక ప్రమాదకరం కూడా.
నమ్మకాలు మానవ నీతికి దారితీస్తున్నాయని అన్నప్పుడు మత ఉదార వాదులు, మత మితవాదులు చెప్పే ధోరణి అనుసరిస్తున్నారన్నమాట. ప్రమాణ గ్రంథం చెప్పే అద్భుతాలను బట్టి, బైబుల్ దోషజాలను బట్టి దేవుని నమ్ముతున్నామని అనకుండా, ఉదారవాదులు మితవాదులు సత్ఫలితాలను బట్టి నమ్ముతున్నామంటారు. అలాంటి నమ్మకస్తులు తమకు దేవుడు అర్థాన్ని కల్పించాడని అందుకే నమ్ముతున్నామంటారు. సునామీ 2004లో క్రిస్మస్ రోజున లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటే దేవుడి ఆగ్రహానికి అదే సాక్ష్యమని మితవాద క్రైస్తవులు భావించారు. గర్భస్రావం, విగ్రహారాధన, స్వలింగ సంపర్కాలలో దోషాలను హెచ్చరిస్తూ దేవుడు సంకేతాలను పంపిస్తున్నాడని అంటారు. ఇలాంటి భాష్యాలు జుగుప్సాకరమైనవి. కానీ కొన్ని అంచనాలను గమనిస్తే వీటిలో కొద్దిగా హేతుబద్ధత కనిపిస్తుంది. ఉదారవాదులు, మితవాదులు దైవాన్ని గురించి ఇలాంటి నిర్ణయాలు ఏవీ రాబట్టరు. వారికి దేవుడు సంపూర్ణంగా కేవలం ఓదార్పు ఇచ్చేవాడు. దారుణమైన పాపానికి ఇలాంటి ధోరణులు సరిపోతాయి. ఆసియాలో జరిగిన సునామీపట్ల ఉదారవాదులు మితవాదులు పరస్పరం దూషించుకున్నారు. ఆ భారీ తరంగాలను తన శక్తితో దేవుడు మీదకు తెచ్చాడని వారు అనలేదు. అలాంటి తరంగాల ప్రజ్వలనను చూచి మానవుడు ఎలా స్పందించాడని వారు ఆలోచించారు. కళేబరాలు కొట్టుకు వస్తుంటే అందులో మానవుడు కారుణ్యము బయటపడిందా? లేక దైవశక్తి వెల్లడయిందా? లక్షమంది పిల్లలు తల్లి ఒడికి దూరమై నీటికి ఆహుతైపోతే ఉదార మతవాదులు కళ్ళు తెరిచి చూడవలసి ఉంది. నైతికంగా నటించడం మానేయవలసి ఉంది. మత జ్ఞానం మేథస్సు ప్రదర్శించేటప్పుడు ఒక అంశాన్ని గమనించాలి. దేవుడు ఉంటే, మానవుడి వ్యవహారాలలో ఆసక్తి కనబరిస్తే దైవేచ్ఛను విడమర్చి చూడవచ్చు. చూడలేనిది ఏమంటే  ఈ దారుణ సంఘటనల వెనుక దైవం నైతిక వివేచన కనబరిచిందని అనడమే.
చాలామంది క్రైస్తవులవలె, సాధారణ వ్యక్తులు దైవం రీతులను   కాదనలేరు అని వ్యాఖ్యానిస్తారు. దేవుడు ఆదికాండంలో జలప్రళయం తెచ్చి మానవాళిని ముంచేయడం తప్పు అని అనజాలరు అంటారు. మన పరిమితి దృష్టిలో అది అలాగే కనిపిస్తుంది. కాని జీసస్ దేవుని కుమారుడని, స్వర్ణ పాలన నైతిక వివేచనకు పరాకాష్ట అని, బైబిలులో అసత్యాలు లేవని నిర్ధారణగా చెబుతాడు. బైబుల్ వివేచనను ఘంటాపథంగా చెప్పడానికి మానవుని తన నైతిక ప్రేరణను ఆధారం చేసుకుంటున్నాడు. మరుక్షణమే అలాంటి నైతిక ప్రేరణ సరైన మార్గదర్శి కాదంటున్నారు. బైబుల్ లో చెప్పిన వాటిపై ఆధారపడాలంటున్నారు. నైతిక ప్రేరణలకు బైబులే హామీ అంటున్నారు, ఒకవైపున ఇలాంటి ప్రేరణలు ప్రాథమిక స్థాయిలో ఉండగా, హేతు వివేచనలో గిరిగీసుకుని చుట్టూ తిరుగుతున్నారు.
మంచి గ్రంథంలో ఏది ఉత్తమమో మనమే నిర్ణయిస్తాము. స్వర్ణ నియమాలను చదివి అదే అత్యుత్తమ, నైతిక ప్రేరణగా తీర్పు చెబుతాము. నీతి విషయమై దేవుని బోధనలు ప్రస్తావనకొస్తాయి. పెళ్ళినాడు పెళ్ళి పెళ్ళి కుమార్తె కన్యకాదని కనుగొంటే ఆమెను తండ్రి ఇంటి ముఖ ద్వారం వద్ద రాళ్ళతో కొట్టి చంపాలి. (ద్వితీయోపదేశ కాండం 22..11-21) మనం నాగరికులమైతే ఇది మన ఉన్మత్త చర్యకు పరాకాష్ఠ అని దానిని నిరాకరించాలి. మన నైతిక నిర్ణయాలను వినియోగించాలి. అక్కడ బైబుల్ దైవ వాక్యంగా నమ్మడం మనకేవిధంగానూ తోడ్పడదు.
ఇక్కడ నిర్ణయం చాలా సులభం 21వ శతాబ్దంలో నీతిని గురించి, మానవ సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి. అందులో శాస్త్రీయ దృక్పథం తాత్విక వాదనలు 2000 సంవత్సరాల నుండి వస్తున్న వాటిని అంచనా వేయాలి. లేదా బైబుల్ లో మొదటి శతాబ్దంలో ఉన్న మాటల్ని అట్టిపెట్టుకోవాలి. ఎవరైనా బైబుల్ పంథాను ఎందుకు స్వీకరించాలి?

మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య






.

నాస్తికులు పాపాత్ములా?ఐదవ భాగం-క్రైస్తవం ఇంత అమానుషమా

ఐదవ భాగం
నాస్తికులు పాపాత్ములా?
నీతికి మత విశ్వాసం ఒక్కటే ఆధారం అయితే, నమ్మేవారికంటే నాస్తికులు నీతిలో తక్కువ వారన్నమాట. వాస్తవానికి నీతి లేని వారన్నమాట. అవునా? అమెరికాలో నాస్తిక సంఘాలవారు నేరాలలో భాగం పంచుకుంటున్నారా? సైన్స్ జాతీయ అకాడమీ సభ్యులలో 93 శాతం దేవుడనే భావాన్ని నిరాకరిస్తుండగా వారంతా అబద్ధాలాడుతూ మోసం చేస్తూ దొంగతనాలు చేస్తున్నారా? సాధారణ జనాభాలా వీళ్ళంతా సత్ప్రవర్తన కలిగిన వారేనని గట్టిగా చెప్పవచ్చు. అయినా అమెరికాలో నాస్తికులను అల్ప సంఖ్యాకులుగా చిన్న చూపు చూస్తున్నారు. నాస్తికుడిగా ఉండటం దేశంలో పెద్ద పదవులకు పోటీ చేసే దానికి పెద్ద ఆటంకం అయిపోయింది. అటువంటి ఆటంకాలు నల్లవారికి, ముస్లింలకు, స్వలింగ సంపర్కులకు కూడా లేవు. ఇటీవల ఒక డేనిష్ వార్తాపత్రిక మహమ్మద్ ప్రవక్తను అపహాస్యం చేస్తూ 12 కార్టూన్లు వేయగా ముస్లిం ప్రపంచం వేలాదిగా యూరోపులో రాయబార కార్యాలయాలను తగలబెట్టి, బెదిరించి, కొందరిని చంపి, మరికొందరిని ఎత్తుకుపోయారు. అలాంటిది నాస్తికుల పేరిట ఎప్పుడు కొట్లాటలు జరిగాయో చెప్పమనండి. ప్రపంచంలో ఎక్కడయినా ఏ వార్తాపత్రికయినా నాస్తికత్వాన్ని గురించి వ్యంగ్య చిత్రాలు వేయడానికి సందేహిస్తారా? అలాంటి సంపాదకులను ఎత్తుకు పోతారని, చంపేస్తారని భయం ఉన్నదా?
అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, మావో సేటుంగ్, పోల్ పాట్, రెండవ కిం సుంగ్ వంటి దుర్మార్గులు నాస్తికత్వం నుండి వచ్చారని అంటారు. వారిలో కొందరు మతానికి వ్యతిరేకులైనా, వారేమీ హేతువాదులు కాదు.
(హిట్లర్ నాస్తిక వాదాన్ని చాలా అతిశయోక్తులతో చిత్రించారు :
క్రైస్తవుడుగా నేను దేవుణ్ణి చూస్తూ రక్షకుడుగా నన్ను కాపాడమని కోరతాను, ఏకాంతంగా ఉన్న నన్ను భగవంతుడు యూదులపై పోరాడమని ఆదేశించాడు. క్రైస్తవుడిగా నేను యూదులను గుర్తించి భగవంతుడు ఇచ్చిన శక్తిని వినియోగించుకుంటాను. యూదులపై పోరాటానికి భగవంతుడు అపార శక్తివంతుడు. క్రైస్తవుడుగా నాకు నా ప్రజలను సేవించాల్సిన కర్తవ్యం ఉన్నది.)
బహిరంగంగా ఈ నాయకులు చేసే ప్రకటనలు భావపూరితమైనవి. జాతి, ఆర్థిక విధానం, జాతీయత, చరిత్ర గమనం, మేధావుల వల్ల నైతిక ప్రమాదాలు అనే అంశాలపై వీరి ప్రకటనలు భ్రమల్ని కలిగిస్తాయి. నిరంకుశులైన ఈ నాయకులు మతాన్ని నిరాకరించే బదులు, జీవితాలను విధ్వంసం చేసే ధోరణులు అవలంబిస్తారు. చాలామంది ఒక రకమైన మతపరంగా వ్యక్తిత్వ ఆరాధనను తమచుట్టూ పెంపొందించుకుంటారు. అది అట్టిపెట్టుకోవడానికి ప్రచారసాధనాలు వాడుకుంటారు. ప్రచారానికి,  చిత్తశుద్ధితో సమాచారన్ని అందించడానికి తేడా ఉన్నది. ఉదార ప్రజాస్వామ్యంలో సాధారణంగా మనం సమాచారాన్ని అందించాలని కోరుకుంటాం. నిరంకుశులు సామూహికంగా జనాన్ని తుడిచిపెట్టే విధానాలను క్రమబద్ధంగా పాటిస్తారు. తమ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఆ స్థితికి వారే అగ్రనాయకత్వం వహిస్తారు. వారు హేతుబద్ధంగా ఉండకపోగా వెర్రిమొర్రి భావనలతో పాలిస్తారు. రెండవ కిం సుంగ్ తన నివాసంలో పడకలు సముద్రమట్టానికి 500 మీటర్ల పైకి ఉండాలన్నాడు. కప్పుకునే దుప్పట్లు సుతిమెత్తగా ఉండాలన్నాడు. అంతటి మెత్తని పదార్థం పిచుకల ముక్కు వెనుక భాగానికి ఉంటుంది. కనుక అతడు పడకల కోసం 7 లక్షల పిచుకలను చంపేసి ఆ పదార్థం స్వీకరించాడు. రెండవ కిం సుంగ్ ఉత్తర కొరియాలో ఎంత హేతుబద్ధమైన వ్యక్తో దీనిని బట్టి తెలుసుకోవచ్చు.
యూదులపై జరిగిన దారుణ హత్యాకాండ చూద్దాం. మధ్యకాలపు క్రైస్తవుల నుండి యూదుల వ్యతిరేకత పుణికి పుచ్చుకున్న నాజీ మరణ కూపాలు పేర్కొనవచ్చు. శతాబ్దాలుగా యూరోపులో క్రైస్తవులు ప్రతి సామాజిక దోషానికి యూదులే కారణం అంటూ వారు ఉండటమే విశ్వాసానికి ప్రతీఘాతం అన్నాడు. జర్మనీలో యూదులపట్ల ద్వేషం సెక్యులర్ ధోరణిలో వ్యాపించింది. ఇందుకు మూలం మతమే. యూరోపులో యూదులను మతపరంగా భూతాలుగా పరిగణించి చిత్రించారు. 1914లో యూదులను ఘోరమైన జాతిగా వాటికన్ ముద్రవేసింది. (యూదులు మత క్రతువులలో రక్తం వాడే నిమిత్తం యూదులు కాని వారిని చంపుతారని తప్పుడు ప్రచారం చేశారు. ముస్లిం ప్రంపంచంలో ఇప్పటికీ ఈ నమ్మకం వ్యాప్తిలో ఉంది.) కాథలిక్, ప్రొటస్టెంట్ మతాలవారు నాజీలు చేసిన భారీ సామూహిక హత్యలపట్ల ఉదాశీనత వహించడం అవమానకరం.
జర్మనీలో, సోవియట్ గులాగ్స్ లో, కంబోడియా పొలాలలో జరిగిన హత్యలు హేతుబద్ధంగా ఉండేవారు చేసే పనులు కాదు. రాజకీయంగా, జాతి మూర్ఖత్వంతో ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఈ సంఘటనలో తెలియజేస్తారు. మీవంటి క్రైస్తవులు విశ్వాసాన్ని హేతుబద్ధంగా నిరాకరిస్తే, గుడ్డిగా నాస్తికత్వాన్ని స్వీకరించినట్లు ఉందనుకోవడం దారుణమైన భావన, మతం, నాజీయిజం, స్టాలిన్ వాదం, నియంతృత్వ మిథ్య అన్నీ పిడివాదంలో నుండి జనించినవే. మానవ చరిత్రలో ఏ సమాజంలో కూడా ప్రజలు సాక్ష్యాధారాలు చూపుతూ విశ్వాసాలను నమ్మకాలను పెంపొందించుకున్న ఉదాహరణ కనపడదు.
మతాన్ని అంతం చేయడం అనుభవమైన లక్ష్యంగా భావిస్తారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో  ఈ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. నార్వే, ఐస్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జపాన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఇంగ్లండ్ దేశాలు ఏమంతగా మతాన్ని పాటించడం లేదు. 2005లో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధిని బట్టి  దేశాలు జీవనప్రమాణాన్ని, వయోజన విద్యను, తలసరి ఆదాయాన్ని, విద్యాస్థాయిని, స్త్రీ పురుష సమానత్వాన్ని, ఆరోగ్యాన్ని సాధించుకుంటూండగా బాల్య మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పశ్చిమ యూరోప్ లో నేరాలు చాలావరకు ప్రవాసం వచ్చిన వారివలన సంభవిస్తున్నాయి. ఫ్రాన్స్ లో జైళ్ళలో ఉన్నవారు 70 శాతం ముస్లింలే. పశ్చిమ యూరోప్ లో ఉన్న ముస్లింలు నాస్తికులు కారు. మానవాభివృద్ధి సూచికలో 50 దేశాల నుండి వచ్చిన లెక్కల ప్రకారం వారంతా మత నమ్మకస్తులే.
అమెరికా సంపన్న ప్రజాస్వామిక దేశమైనా మతాన్ని అంటిపెట్టుకున్నది. అందులో గర్భస్రావాలు, యువతులలో గర్భధారణలు, లైంగికంగా వస్తున్న జబ్బులు, చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో మత ఉదారవాదం ఎక్కువగా ఉన్న దక్షిణాది మధ్య రాష్ట్రాలు పై లక్షణాలను స్పష్టంగా కనబరుస్తున్నాయి. అమెరికాలో ఉత్తర తూర్పు ప్రాంతాలలో సెక్యులర్ ధోరణులతో యూరోప్ ప్రమాణాలను చేరుకుంటున్నారు. అమెరికాలో పార్టీ అనుబంధాన్ని బట్టి మతాన్ని అంచనావేయలేం. అమెరికాలో మితవాద క్రైస్తవ రాజకీయ ప్రభావం వున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు. కానీ అలా చూడం. తీవ్ర నేరాలు జరుగుతున్న నగరాలను గమనిద్దాం. ఇందులో 25 నగరాలు పరిశీలిస్తే ఎక్కువ నేరాలు రెడ్ స్టేట్స్ లోను, తక్కువ నేరాలు బ్లూ స్టేట్స్ లో ఉన్నాయి. అతి ప్రమాదకరమైన నగరాలుగా పరిగణించిన వాటిలో 76 శాతం రెడ్ స్టేట్స్ లోను, 24 శాతం బ్లూస్టేట్స్ లోనూ ఉన్నాయి. ఆమాటకొస్తే అమెరికాలో అతి ప్రమాదకరమైన ఐదు నగరాలలో మూడు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇళ్ల దోపిడీ ఎక్కువగా జరిగే పన్నెండు రాష్ట్రాలు క్రైస్తవానికి చెందిన రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 24 దొంగతనాలకు పేరుమోయగా అవి రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. హత్యలకు మారుపేరయిన 28 రాష్ట్రాలలో 17 క్రైస్తవ రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి.
అయితే ఇలాంటి పరస్పర సంబంధం సమాచారం కార్యకారణతను వివరించదు. దేవుళ్ళ నమ్మకం వలన సమాజం నిర్వీర్యం కావచ్చు. సమాజంలో చైతన్యత లేకపోవడం దేవుడి పట్ల నమ్మకానికి దారితీయవచ్చు.  ఈ రెండు ఇతరత్రా తప్పుడు భావనల వలన జనించవచ్చు. ఈ కార్యకారణ సంబంధాన్ని అలా ఉంచి గణాంక వివరాలు చూస్తే సభ్య సమాజం కోరుకునే వాటికి పొందికగా నాస్తికత్వం ఉన్నది. దేవుడి మీద నమ్మకం వలన సమాజం ఆరోగ్యకరంగా రూపొందుతున్నట్లు దాఖలాలు లేవు.
నాస్తికత  ఎక్కువగా ఉన్న దేశాలలో దాతృత్వం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చెందవలసిన దేశాలకు సహాయం చేసే తీరు బాగా కనిపిస్తున్నాయి. క్రైస్తవ ఉదారవాదం, క్రైస్తవ విలువలు పరస్పరం సంబంధం కలిగి ఉండడం అబద్ధమని అక్కడ సాంఘిక అసమానతలు ఎక్కువ ఉన్నాయని స్పష్టపడుతున్నారు. కొన్ని సంస్థలలో ప్రధాన అధికారికి సాధారణ ఉద్యోగులకు మధ్య వేతనాల నిష్పత్తి గమనించవచ్చు. గతంలో ఇది 24:1, ఫ్రాన్స్ లో 15:1, స్వీడన్ 13:1, అమెరికాలో 475:1, అలాంటి అమెరికాలో తుది తీర్పునాడు దేవుడి ముందుకు అందరినీ హాజరు పెట్టాలని జనం నమ్ముతారు. అంటే ఒంటె సూది బెజ్జంలో నుండి సులభంగా దాటిపోతుందన్నమాట. (బైబుల్ కథనం అలా ఉంది).

మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య



.

క్రైస్తవం ఇంత అమానుషమా?నాలుగవ భాగం

Sam Harris (right)

దేవునికోసం మంచి చెయ్యడం
దేవుడి పేరుతో ప్రజలు చేసిన మంచి పనుల మాటేమిటి? మానవుల బాధలు నివారించడానికి చాలా మంది విశ్వాసపాత్రులు వీరోచిత త్యాగాలు చేసినమాట వాస్తవం. ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటో తగిన సాక్ష్యాధారాలు లేకుండా నమ్మడం అవసరమా?  దయచూపడం అనేది మత మూర్ఖత్వంపై ఆధారపడి ఉంటే యుద్ధ భీభత్స ప్రాంతాలలో సెక్యులర్ డాక్టర్లు చేస్తున్న పనిని ఎలా అర్ధం చేసుకోవాలి. చాలామంది డాక్టర్లు మానవ బాధలను నివృత్తి చేయడానికి దేవుని ఆలోచనలతో నిమిత్తం లేకుండానే కృషి చేస్తుంటారు. క్రైస్తవ మిషనరీలు బాధా నివృత్తికి పని చేస్తున్నప్పటికీ వారు ప్రమాదకరమైన, చీలికలు తెచ్చిపెట్టే గాధల ప్రచారానికి పూనుకుంటున్నారు. అవసరాలున్న ప్రజల్ని మతం మార్పిడి చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మిషనరీలు చాలా డబ్బు ఖర్చు పెడుతూ చాలా కాలాన్ని వృధా చేస్తున్నారు. వారు కుటుంబ నియంత్రణ గురించి, లైంగికంగా అంటుకుంటున్న వ్యాధుల గురించి, తప్పుడు సమాచారాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. సరైన సమాచారాన్ని దాచి పెడుతున్నారు. మిషనరీలు చిక్కుల నెదుర్కొంటూ గొప్ప పనులు చేస్తున్నా వారి మూర్ఖ విశ్వాసాలవల్ల అజ్ఞానం ప్రబలుతున్నది. ఇందుకు భిన్నంగా సెక్యులర్ సంస్థలు, సరిహద్దులు పాటించని డాక్టర్లు జీసస్  కన్యకు పుట్టాడంటూ కాలం వృధా చేయరు. ఆఫ్రికా ఎడారులలో 40 లక్షల ప్రజలు ఏటా ఎయిడ్స్ వ్యాధితో చనిపోతున్నారు. అయినా సరే కండోములు వాడటం పాపమని వారు చెబుతున్నారు. క్రైస్తవ మిషనరీలు పల్లె ప్రజలకు కండోములు గురించి ఎలాంటి సమాచారం లేని చోట అవి వాడితే పాపం అంటూ చెబుతుంటారు. సామూహికంగా జనాన్ని చంపే పవిత్ర కార్యం ఇది. (వాటికన్ కండోములను వ్యతిరేకిస్తున్నది. పెళ్ళయినవారి మధ్య హెచ్.ఐ.వి. వ్యాధి వ్యాపించకుండా కండోములు వాడటానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఈ విధానాన్ని మళ్ళీ పరిశీలిస్తున్నట్లు పోప్ ఆలోచన గురించి వదంతులున్నాయి. ఈ సమస్యను శాస్త్రీయంగా, సాంకేతికంగా, నైతికంగా అధ్యయనం చేస్తున్నట్లు వాటికన్ రేడియో ప్రకటించింది. మతపరమైన సలహా సంఘ అధ్యక్షులు కార్డినల్ జేవియర్ లొజానో బారగన్ అటువంటి ప్రకటన చేశాడు. మూఢ విశ్వాసాలను నిలబడవు అనడానికి క్రైస్తవమతంలో వస్తున్న మార్పు సూచన కావచ్చు. విశ్వాసంలో వివేచన ఉన్నదనడానికి ఆధారాలు లేవు.) ప్రజలు బాధపడుతుంటే వారికి సహాయపడడం మంచిదా లేదా అలా సహాయ పడితే సృష్టికర్త బహూకరిస్తాడని భావించడం మంచిదా?
మత మూఢ విశ్వాసం వలన నైతిక భావనలు ఎలా దెబ్బతింటాయో, ఈ విషయంలో ఇతరులకు సహాయపడే నిమిత్తం మంచి వ్యక్తి కూడా ఏవిధంగా దారి తప్పుతాడో, మదర్ తెరీసా నిర్దుష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. క్రిస్టొఫర్ హిచిన్స్ ఆవిడ స్వభావాన్ని అరమరికలు లేకుండా ఇలా చెప్పాడు :
మదర్ తెరీసా పేదల స్నేహితురాలు కాదు. ఆమె పేదరికానికి మిత్రురాలు. బాధలు పడడం దేవుడి వరం అని ఆమె చెప్పింది. పేదరికాన్ని పోగొట్టడానికి స్త్రీలను శక్తివంతం చేయడం, తప్పనిసరిగా పిల్లల్ని కనడం నుండి విమోచన చేయడం అనేవాటిని ఆమె జీవితాంతం వ్యతిరేకించింది.’
హిచిన్స్ చెప్పేదాంతో నేను చాలా వరకు అంగీకరిస్తున్నాను. మదర్ తెరీసా దయ చూపడంలో గొప్ప శక్తివంతురాలు. తోటివారు బాధపడుతుంటే ఆమె చలించిపోయి ఆ బాధను గురించి పట్టించుకునేటట్లు చేసింది. ఆమె దయ అంతా కూడా మత మూఢవిశ్వాసాలలో చిక్కుకు పోయింది. నోబెల్ ప్రైజ్ బహుమానాన్ని ఆమోదిస్తూ ఆమె చెప్పిన మాటలివి :
శాంతిని నాశనం చేసేది గర్భస్రావం. చాలామంది భారతదేశంలో, ఆఫ్రికాలో పిల్లలు చనిపోతున్నారని, తగిన ఆహారం లేక ఆకలి బాధతో అస్తమిస్తున్నారని అనుకుంటున్నారు. కాని లక్షలాది మంది చనిపోవడానికి తల్లులు ప్రసవించే ధోరణే కారణం. శాంతిని నశింపచేసే విషయం అది. తల్లి తన బిడ్డను చంపుకుంటే – నిన్ను నేను, నన్ను నీవు చంపడానికి తేడా ఏముంది?’
ఈ మాటలు తప్పుద్రోవన పట్టిందని చెప్పక తప్పదు. నీతికి సంబంధించిన విషయంగానూ ఇందులో చెప్పుకోదగింది లేదు. భూమి మీద జరుగుతున్న ఎన్నో బాధల్ని కష్టాల్ని పక్కన పెట్టి, తల్లి తొలిదశలోని పిండాన్ని అంతం చేయడం ఆమె దయకు గురి అవుతున్నది. గర్భస్రావం వాస్తవ విషయం. ఇది తగ్గించటానికి కండోములు వాడటం చక్కని మార్గం. గర్భస్రావం అంతం అవుతున్న పిండాలు ఏ స్థాయిలో బాధపడుతున్నాయో తెలుసుకుంటే మంచిది. యుద్ధంలో, కరువులో, రాజకీయ చిత్రహింసలలో మానసిక రుగ్మతలతో బాధపడే కోట్లాదిమంది ప్రజల గురించి పట్టించుకోవడం అవసరం. లక్షలాది మంది ఊహించడానికి  వీలులేనంతగా భౌతిక, మానసిక చిత్రహింసలకు గురవుతున్నారు. అలాంటిచోట దేవుడిదయ కానరాదు. పైగా మానవుల పట్ల దయచూపుతున్నామనేవారు పాపాన్ని, ముక్తిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మానవ బాధల్ని పట్టించుకోదలిస్తే అందులో గర్భస్రావం అనేది ఏమంతగా చింతించాల్సిన అంశం కాదు.
అమెరికాలో గర్భస్రావ సమస్య చాలామందిని విడదీస్తున్నది. క్రైస్తవ మతం ఎల్ సాల్వడార్ అనే దేశంలో  ఈ సమస్యపట్ల అవలంబించిన నైతిక దృష్టి దారుణంగా బయటపడింది. అక్కడ గర్భస్రావం ఏ పరిస్థితులలోనైనా చట్ట విరుద్ధమే. చెరచటం, చిన్నపిల్లలతో లైంగిక సంబంధం కూడా మినహాయింపులకు గురి కాలేదు. గర్భస్రావం జరిగినట్లు ఏ ఆసుపత్రిలోనైనా తెలిస్తే ఆ స్త్రీని నేరస్థురాలిగా చిత్రహింసలు చేస్తున్నారు. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తున్నారు. గర్భం తొలగించుకున్నందుకు 30 ఏళ్ల నుండి అనుభవిస్తున్నవారున్నారు. కండోములు వాడటం దైవం పట్ల పాపం చేసినట్లేనని చెబుతున్న దేశంలో పరిస్థితి ఇది. మదర్ తెరీసా ప్రపంచంలో బాధలను గురించి చెబుతున్న విషయాలను అంగీకరిస్తే ఎల్ సాల్వడార్ ఆర్చిబిషప్ గర్భస్రావ వ్యతిరేక ప్రచారం చేశాడు. 1999లో మెక్సికో సిటీని సందర్శించిన రెండవ పోప్ జాన్ పాల్ అటువంటి చర్యను సమర్థించాడు. క్రైస్తవ మతం మరణ సంస్కృతికి విరుద్ధంగా జీవిత అనుకూలతను చాటాలన్నాడు.
క్రైస్తవ మతం గర్భస్రావాన్ని గురించి జీవశాస్త్రం చెబుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకోదు. మానవుడి బాధల గురించి కూడా వాస్తవ విషయాలను స్వీకరించదు.
గర్భస్రావాన్ని గురించి క్రైస్తవ మతం జీవశాస్త్రం చెప్పే అంశాలను పట్టించుకోవడంలేదు. గర్భస్రావంలో 80 శాతం వాటంతట అవే జరుగుతున్నాయి. గర్భం దాల్చిన స్త్రీకి తెలియకుండా కూడా ఇవి జరుగుతున్నాయి. గర్భధారణ 20 శాతం నిలబడక పోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడు గనక ఉంటే అందరికంటే ఎక్కువగా గర్భస్రావాలను చేయిస్తున్నది అతడే అనవచ్చు.


మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య



.