మణి బెన్ కారా –
1974లో మణిబెన్ హైదరాబాద్ వచ్చే నాటికి బాగా వృద్ధాప్యం కనిపించింది. అప్పటికే ఆమె మానవ వాద, కార్మిక రంగాలలో ఆరి తేరిన కార్యకర్త, నాయకురాలు. దేశంలోనూ, ప్రపంచంలోనూ పర్యటన చేసి స్త్రీల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన మణిబెన్ 1905లో బొంబాయిలో పుట్టారు. ఆమె మధ్యతరగతి కుటుంబీకురాలు కావటంతో గామడెన్ లోని సెయింట్ కొలబా హైస్కూల్లో చదివింది. ఆ తరువాత ఇంగ్లాండులో సాంఘిక కార్యక్రమాల శిక్షణ అధ్యయనం చేయటానికి బర్మింగ్ హామ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తరువాత కార్మిక రంగంలో దిగిపోయి. నిర్విరామ శ్రమ చేసి, రేవు కార్మికులు, గుడిసెలలో మగ్గుతున్న పేద ప్రజలు, హక్కులు లేకుండా బతుకుతున్న స్త్రీలను పట్టించుకోవటం ప్రారంభించారు. ఆ కృషిలో భాగంగా వివిధ కార్మిక సంఘాలలో బాధ్యతలు స్వీకరించి అఖిలభారత ట్రేడ్ యూనియన్ నాయకురాలిగా ఆవిర్భవించారు. ఆ విధంగా ఆమెకు వి.బి. కర్నిక్, ఎన్.ఎం. జోషి వంటి వారు ఎదురయ్యారు. వారి సహకారంతో కార్మిక రంగంలో ఎనలేని సేవలు చేశారు. గుర్తింపు పొందారు.
బొంబాయిలో ఒక ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి కొంత కాలం నడిపారు. 1930లో ఆమెకు విదేశాల నుండి అప్పుడే తిరిగి వచ్చిన ఎం.ఎన్.రాయ్.తో పరిచయమయింది. అది సన్నిహితమై చివరకు రాయ్ నెలకొల్పిన రాడికల్ డెమెక్రటిక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించేటట్లు చేసింది. ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో ఆమె నిమగ్నురాలైంది. ఈ లోగా జాతీయ రాజకీయాలలో మునిగితేలింది. 1931లో స్విజర్ లాండ్ నుండి ఓడలో వచ్చి బొంబాయిలో దిగిన లూసి గెస్లర్.ను కలిసింది. ఆమె వెంట బ్రిటిష్ గూఢచారులు పడగా మణిబెన్ కాపాడి ఎం.ఎన్. రాయ్ దగ్గరకు రహస్యంగా తీసుకు వెళ్ళింది. కానీ త్వరలోనే పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం లూసీని మళ్ళీ విదేశాలకు పంపించేశారు.
పోరాటాల సందర్భంగా 1932లో మణిబెన్ అరెస్ట్ అయింది. ఎం.ఎన్. రాయ్.కు అండగా నిలిచింది. కేంద్ర శాసన సభకు సభ్యురాలిగా ఎన్నికై కొన్నాళ్ళు పనిచేసింది. అనేక మురికివాడలలో సాహసించి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె కృషికి తొడుగా ఇందుమతి ఫరేక్ నిలిచారు. ప్రభుత్వం నియమించిన వివిధ స్త్రీ సంక్షేమ సంఘాలలో మణిబెన్ కృషి చేశారు.
ఆమె మా ఆహ్వానంపై హైదరాబాద్ పర్యటించారు. అలా వచ్చినప్పుడు నగరం చూడటమే కాక, నాటి ప్రముఖ మానవ వాద నాయకులు, న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు ఇంటికి నేనూ, కోమల కలసి వెళ్ళాము. అప్పుడు సాంబశివరావు హైదరాబాద్.లోని మలక్ పేటలో ఉండేవారు. ఆయన కుమార్తె మంజులత అప్పుడే ఒక కుమారుడుని ప్రసవించింది. మణిబెన్ ఆ పసివాడికి ఒక జ్ఞాపిక బహూకరించింది. అలా ఇవ్వడం మంచి సంప్రదాయమని మాతో చెప్పింది. హైదరాబాద్ పాతబస్తీలో అనేక వస్తువులపై ఆమె ఆసక్తి కనపరచింది. స్త్రీల సంఘాలలో తన కృషి, అనుభవాలు ఎన్నో వివరించింది. ఎమ్.ఎన్.రాయ్ తో సుదీర్ఘ పరిచయాలు, అనుభవాలు ఎంతో ఓపికగా చెప్పారు.
1979లో ఆమె చనిపోయారు. చివరి వరకు మానవ వాద ఉద్యమ నాయకురాలిగా ఆమె చేసిన కృషి గణనీయమైనది. వి.బి. కర్నిక్ ఆమె జీవిత చరిత్రను సంక్షిప్తంగా ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ మహా సభలలో ప్రతినిధిగా మణిబెన్ పాల్గొని తన వ్యక్తిత్వాన్ని చూపారు
S.Ramanathan Veteran in Rationalist movement
Posted by
innaiah
on Saturday, November 6, 2010
రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు
మద్రాసులో హేతువాద వుద్యమం ఆరంభించి భారతస్థాయికి తీసుకెళ్లారు. రాజాజీ మంత్రివర్గంలో 1938లో వున్నారు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక నిర్వహించారు. మంచి హేతువాద లైబ్రరీ సమకూర్చారు. దేశమంతటా పర్యటించి ఉద్యమానికి ప్రోత్సాహం యిచ్చారు.
హైదరాబాద్.కు ఆహ్వానించాం. అప్పటికే బాగా వృద్ధులైపోయారు. 1976 నాటి మాట. వై.ఎమ్.ఐ.ఎస్. హాలులో అతి నెమ్మదిగా ప్రసంగించారు. అబ్బూరి, ఎ. ఎల్. నరసింహారావు వున్నారు.మద్రాసులో ఆయన యింట్లోకి వెళ్ళాం. చనిపోయిన తరువాత ఆయన భార్య ఆసక్తి చూపనందుకు లైబ్రరీని, పత్రికను తరలించారు. సూర్యనారాయణ, జయ గోపాల్ స్వీకరించారు. జయగోపాల్ అమెరికా వెళ్ళి పెళ్ళి చేసుకొని అట్లాంటాలో వెబ్.సైట్ నడిపారు. 2000 ప్రాంతాలలో చనిపోయారు. సూర్యనారాయణ కేరళ వెళ్ళిపోయారు. పత్రికను హైద్రాబాద్ తెచ్చి నడిపినప్పుడు జయగోపాల్ రాశారు. ఆవుల సాంబశివరావు సంపాదకుడుగా ఎన్.కె.ఆచార్య, జాస్తి జవహర్ లాల్, నేను పత్రిక నిర్వహణకు పూనుకున్నాము. ఇది 1970 తరువాతి మాట. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సూర్యనారాయణ పత్రికను మద్రాసు తీసుకువెళ్ళారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు నడవలేదు.
రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు. రష్యా కూడా పర్యటించారు. ఎంతో శ్రమకు ఓర్చి ఉద్యమాన్ని నడిపారు. ఆయనతో సన్నిహిత సంబంధం ఉండటం గర్వకారణం.

బసవ ప్రేమానంద్ మాజిక్ ద్వారా
Posted by
innaiah
on Wednesday, November 3, 2010
బసవ ప్రేమానంద్ భారత దేశంలోనే గాక ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించారు.
దేశంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.
మాజిక్ ద్వారా జరుగుతున్న బాబాల, మాతల మోసాలను గుట్టు విప్పారు.
కోయంబత్తూర్ సమీపంలో పోడనూర్.లో తన భవనంలో సైన్స్ ప్రదర్శన ఏర్పరచారు.
ఆయన వయస్సు 80. కొన్నాళ్ళుగా కేన్సర్.తొ వుంటూ, ఇప్పుడు చివరిదశకు చేరారు.
ముందు తరాల వారికి ఆదర్శంగా విల్లు రాసి, తాను చనిపోగానే తన దేహాన్ని మెడికల్ కాలేజ్.కు ఇవ్వమన్నారు .
సత్యసాయి బాబా మొదలు అనేక మంది మోసాలను, అరాచకాలను బయటపెట్టారు .
సాయిబాబా ఆశ్రమంలో హత్యలు పేరిట డాక్యుమెంటరితో గ్రంథం వెలువరించారు .
వివిధ మాజిక్ విషయాలు శాస్త్రీయంగా వివరిస్తూ, అవి ఎలా చెస్తారు అని సోదాహరణగా చూపుతూ మరొక గ్రంథం రాశారు.
ఇండియన్ స్కెప్టిక్ అనే మాసపత్రిక నడిపి, ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలను అందించారు.
డాక్టర్ పి ఎం భార్గవ సైన్స్ ప్రదర్శన పెడితే మత పార్టీలు దానిని నాశనం చేసే ప్రయత్నం తలపెట్టగా, ప్రేమానంద్ ఆదుకొని తన చోట దానిని ధైర్యంగా పెట్టారు . అంత గొప్ప వ్యక్తి. త్వరలో లోగడ అబ్రహాం కోవూర్ వలె ప్రేమానంద్ కూడా మానవ హేతువాద ఉద్యమాలలో సేవ చేసారు. ఆయన ఇప్పుడు మనకు అందించిన సాహిత్యం గొప్ప సంపద.