భావ విప్లవకారుడు కానా

భావ విప్లవకారుడు కానా ఒక పక్క భారతదేశ స్వాతంత్ర్యము కోసం పోరాడుతూ, నైజాం విముక్తికై నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటు కూడా నాస్తిక భావాలను, ఉద్యమ ప్రచారాన్ని మరువని వ్యక్తి కానా. ‘కానా’ పూర్తి పేరు కాళే నాగేశ్వరరావు ఆయన తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, ముమ్మడివరం గ్రామాల మధ్య ఉన్న కోనసీమ ప్రాంతంలోని అనాతవరంలో 20 ఫిబ్రవరి 1920న ప్రకాశం, సింహాచలం అనే దంపతులకు జన్మించారు. ఆయన వారికి ఒకే సంతానం. ఆయన ముత్తాత రామానందం. తాత వెంకటానందం. తండ్రి అందరూ హేతువాద భావజాలం కలిగి బౌద్ధ ధర్మం మీద విశ్వాసాన్ని కనబరిచేవారు. కావున వారు పూజలు పునస్కారాలు చేయకుండా, ఏ దేవాలయాలకు వెళ్ళకుండా. దేవుని ప్రసక్తి జీవితంలో రాకుండానే జీవించారు. దానితో ఇతరులకు, వీరికి మధ్య భేదాభిప్రాయాలుండేవి. కుటుంబ పరిస్థితుల వలన ఆయన తండ్రి కుటుంబముతో కాకినాడ వచ్చారు. ఆయన తండ్రియైన ప్రకాశంగారు గాంధీపట్ల విశ్వాసం కలిగి ఉండడమే గాకుండా. తమ కుమారునికి చిన్ననాటి నుండే దేశభక్తిని అలవరచారు. ప్రకాశంగారు గూడూరు లాఠీఛార్జీలో పోలీసు దెబ్బలకు గురై మరణించారు. ఆయన కాకినాడలో మధిర సూర్యానారాయణమూర్తి గారనే బ్రహ్మసమాజ ప్రచారకుడొకరు పరిచయమయ్యారు. అతని దగ్గర మర్క్సిస్టు భావాలను తెలుసుకున్నారు. అయినా, ఆయనకు మహాత్మగాంధీ అంటే ఎనలేని గౌరవం. ఆయనలో కాంగ్రెసు ద్వారా దేశాభిమానం పెరిగింది. ఆయనతోపాటు గోరా తమ్ముడైన సాంబశివరావు. పెనుమర్తి పార్థసారధి మున్నగు మిత్రులతో రాజకీయ చర్చలలో చురుకుగా పాల్గొనేవారు. ఆనాడు కాకినాడ వాస్తవ్యులు సి.వి.కె.రావుగారు కాకినాడలో కమ్యూనిస్టు పార్టీ కింద వివిధ ప్రజాసంఘాలను ఏర్పాటు చేసారు. కానాగారు వాటిలో పాల్గొన్నారు. ఒకసారి అన్న సంఘాలు కలిసి కాకినాడలో మునిసిపాలిటిలోని పనివాళ్ళలో జరుగుతున్న అన్యాయాలపై జనరల్ స్ట్రై ఆర్గనైజ్ చేయుటకు నిశ్చయించుకున్నాయి. కాని, ప్రభుత్వము దిగి రాకపోవడంతో సమ్మెను ప్రారంభించారు. వారం రోజులకు కాకినాడలో మలమూత్రాలు ఎత్తేవాళ్ళు. డవలు నడిపేవా పరు. మిల్లులలో పనిచేసే కార్మికులు లేకపోవడంతో ప్రజాజీవనం దాదాపుస్తంభించి పోయినట్లయింది. దానితో ఇతర నాయకులతోపాటు కానాగారిని జైలులో పెట్టారు. ఆయనకు ఆ జైలు జీవితం ఎన్నో విషయాలను తర్కించుకోవడానికి ఉపయోగపడింది. ఆయన 1940లో కృష్ణా జిల్లా ముదునూరులో గోరాగారు ప్రారంభించిన నాస్తిక కేంద్రంలో ఉంటు ఒక సంవత్సరము హరిజనవాడలో రాత్రి పాఠశాలను నిర్వహించారు. ఆయన గోరాగారిని అనుసరిస్తు అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన విజయవాడలోని లంకలో ఉండే మహిళలకు రాజకీయ పాఠశాలను నిర్వహించారు. అందులో ఆయన రాజకీయ పాఠాలతోపాటు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, నాస్తికత్వానికి అనుకూలంగా చెబుతుండేవారు. ఆయన భారత స్వాతంత్రోద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన 1943లో 10 మాసాల జైలు శిక్ష అనుభవించారు. ఆయన కాంగ్రెసు పార్టీ ఆదేశానుసారం నిజాం రాజ్యంలో ప్రాణాలను సహితం లెక్కచేయక అనేక ప్రాంతాలను పర్యటించి భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం తీరు తెన్నులు గురించి నివేదికను తయారుచేసి గాంధీ ఆశ్రమానికి వెళ్ళి గాంధీగారికి సమర్పించి మెప్పు పొందారు. ఈ పర్యటనలో ప్రముఖ కమ్యూనిస్టు సాయుధయోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరి హనుమంతరావు. భీమిరెడ్డి నరసింహారెడ్డి. దేవులపల్లి వెంకటేశ్వరరావు మున్నగువారిని మరియు ఇతర కాంగ్రెసు నాయకులను కలిసారు. తిండికి ఎన్నోఇబ్బందులు కలిగినా లెక్క చేయక కార్యనిర్వహణ పూర్తిచేసారు. ఆయన 1945 నుండి 1947 వరకు గాంధీ సేవాగ్రాం ఆశ్రమంలో ఉన్నారు. 1947 ఆగస్టు 15న భారత దేశమునకు స్వాతంత్ర్యము రాగా అనేక సంస్థానాలు భారతం యూనియన్ లో విలీనమయ్యాయి. కాని, నిజాం నవాబు మాత్రం విలీనమవ్వడానికి నిరాకరించాడు. దానితో నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు. కాంగ్రెసువారు ఉద్యమాలను నడిపారు. హైదరాబాదు స్టేటు ప్రముఖ కాంగ్రెసు నాయకుడైన కొదాటి నారాయణరావు తను స్థాపించిన క్యాంపును నడుపుటకు గోరాగారి అనుమతితో కానాగారిని మునగాల పరిగణాలోని రేపాలకు తీసుకొచ్చారు. దానిలో పేరుక సత్యాగ్రహమేగాని కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఆయుధాలు పట్టారు. ఉద్యమంలో భాగంగా నల్లగొండ జిల్లా మోతే గ్రామంలో నిజాం మిలటరీ, రజాకార్లు ప్రభుత్వాధికారులకు ఆశ్రమంగా ఉన్న భవనాన్ని రాత్రివేళ ఆయన తన దళంతో కలిసి కూలుస్తుండగా అనుకోకుండా గడ్డపార మొన ఆయన పొత్తి కడుపులో గుచ్చుకోవడంతో గాయంతో కొంతకాలం బాధపడ్డారు. నిజాం రాజ్యం భారత్ లో విలీనమైన తరువాత, ఉద్యమంలో ధ్వంసం అయిన గ్రామాలను పునరుద్ధరించడాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే, జమ్ము కాశ్మీరులో అట్టి సమస్యను పరిష్కరించిన తీరును తెలుసుకొని రావడానికి ఆయనను జమ్ము కాశ్మీరుకు పంపారు. ఆయన కాశ్మీరుకు వెళ్ళి కాందిశీకుల సమస్యపై నివేదికను తయారుచేసి వచ్చి ఏ.ఐ.సి.సి.కి, హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసుకు సమర్పించారు. ఆయన కాశ్మీరులో భగత్ సింగ్ తమ్ముడైన కుల్బీర్ సింగ్ ను కలవడమేగాక. ఆయన సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఆయన రెండు రాజ్యాల స్వతంత్ర పోరాటాలలో పాల్గొన్న యోధుడు. అలా పాల్గొన్నవారు బహు అరుదు. ఆయన గ్రామ అభివృద్ధి అధికారిగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరంలో 1953 నుండి 1955 వరకు చేసి, ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి, నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వచ్చారు. ఆయన అక్కడ తన నివాసాన్ని నాస్తిక కేంద్రంగా చేసి నడిపారు. చాలామందిని నాస్తికులుగా మార్చారు. ఆయన ఎన్నో కులాంతర మరియు ఆదర్శ వివాహాలను జరిపారు. నిప్పుల మీద నడిచి అందులో మహిమలంటూ లేవని నిరూపించారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి, దానిలో ఆవుమాంసం. పంది మాంసం తాను తిని. ఇతరులను తినిపించారు. ఆయన దళితులు సామాజిక బావుల నీటిని తాగేందుకు హక్కుల కోసం పోరాడారు. ఆయన నాస్తికోద్యమంలో భాగంగా గోరా గారితో కలిసి ముమ్మడివరంలో బాలయోగిగా తయారై, దేవుడిగా ప్రయారం చేసుకుంటూ పూజలు అందుకుంటున్న యువకుని గుట్టు రట్టు చేయడానికి పూనుకుని దెబ్బలకు కూడా గురయ్యారు. ఆయన మద్యపాన నిషేధం కోసం హైదరాబాదులోని నాంపల్లి, ఆబిడ్స్, లకిడీకాపూలం ప్రాంతాలలో రోడ్డుపైనే మీటింగులను నిర్వహించారు. నిరాడంబర జీవనం గడపాలంటు ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరియు ఇతర మంత్రులను నిలదీసారు. ఆయన ఐ.ఎన్.సి.ఎన్. ఆహ్వానంపై రష్యామైత్రి పర్యటన కూడా చేసారు. ఆయన మరికొందరితో కలిసి సూర్యాపేటలో డిగ్రీ కాలేజి. పాలశీతలీకరణ కేంద్రం మరియు సరియైన బస్టాండు కొరకు పాటుపటి సాధించారు. ఇంతకు ఆయన హైస్కూలు చదివే రోజులలోనే గోరాగారి పేరు విని. ఆయన సిద్ధాంతాలు నచ్చి, ప్రభావితుడై, తన పేరును గోరాగారి వలె ‘కానా’ (కాళె నాగేశ్వరరావు) అని మార్చుకుని, తాను నాస్తికుడినని గర్వంగా చెప్పుకునేవారు. ఆయన జూన్ 1953లో చినగంధం సూర్యకాంతం, రాఘవరావుల కూతురైన సుగుణను రిజిష్టరు వివాహం చేసుకున్నారు. ఆమె హిందీపండిట్ గా సూర్యాపేటలో పనిచేసి 1996లో పదవీ విరమణ చేసారు. ఆమె వివాహానికి పూర్వం ఆస్తికురాలైన ఆ తరువాత ఆమె తన భర్త ఆలోచనా విధానాలను అవగాహన చేసుకొని ఆమె నేటికీ బొట్టూ గాజులు లేకుండా నాస్తికురాలిగా జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు. సంతోష్, సహకార్, సజీవ్. వీరు కూడా తండ్రివలె నాస్తికులు. కట్నకానుకలు లేకుండా ఆదర్శ వివాహాలు చేసుకున్నారు. ప్రస్తుతం వారు హైదరాబాదులోని ఉప్పల్ లో ఉంటున్నారు. ఆయన అనారోగ్య కారణంతో తేదీ 3 జూలై, 2014న తన 94వ యేట హైదరాబాదులో మరణించారు. సత్య-అహింసల యందు, కారల్ మార్క్సు చెప్పిన దోపిడి వ్యవస్థ నిర్మూలన యందు, గోరాగారి నిర్మాణాత్మకమై నాస్తికత్వమునందు ఆచరణలో జీవించే ఆయన తన జీవితాంతం నాస్తికత్వాన్ని ఆచరించడంలోగాని, ప్రచారం చేయడంలోగాని వెనుకాడలేదు. ఆయన బాటలోనే ఆయన కుటుంబ సభ్యులు పయనిస్తున్నారు. అలాంటి కానాగారు నాస్తిక ఉద్యమాలను నడుపుతున్న వారికేగాక సామాజిక ఉద్యమాలను నడుపుతున్న వారికి కూడా స్ఫూర్తిదాతలు. - తుమ్మా భాస్కర్ ( 23-12-12న కానాగారూ సరిగ్గా కదలలేని పరిస్థితిలో కూడా హైదరాబాదులోని హ్యూమనిస్టు భవనమునకు వచ్చి, ఈ వ్యాస రచయిత వ్రాసిన స్ఫూర్తిదాతలు అనే పుస్త 23-12-12న కానాగారూ సరిగ్గా కదలలేని పరిస్థితిలో కూడా హైదరాబాదులోని హ్యూమనిస్టు భవనమునకు వచ్చి, ఈ వ్యాస రచయిత వ్రాసిన స్ఫూర్తిదాతలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, మానవాదంపై చక్కని ఉపన్యాసమిచ్చారు. ఆయనకు జ్ఞాపికగా రచయిత కుటుంబ సభ్యులు బుద్ధుని ప్రతిమను బహూకరించడం జరిగింది.)

పరిణామం ఇలా పని చేస్తుంది !

పరిణామం ఇలా పని చేస్తుంది ! మన బడిలో,పిల్లలకు సులభంగా చెప్పవలసిన అవసరం వున్నది. ఉపాధ్యాయులు శ్రద్ధగా అవగాహన గావించుకొని విద్యార్థులకు విడమరిచి అందించాలి .దానికి అనుగుణంగా రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ అధునాతనంగా తోద్పడుతున్నది .లింక్ గమనించండి http://richarddawkins.net/2014/07/evolution-of-lifes-operating-system-revealed-in-detail/

నా రచనలు, అనువాదాలు కొన్ని ఇ బుక్ గా చదవడానికి పారదర్సి బ్లాగ్ లింక్

http://paradarsi.wordpress.com/

వెనిగళ్ళ కోమల జీవితానుభవాలు- జీవితమే నవీనం పై కౌముది వెభ్ సంచిక జూలై లో

చదవండి

వాహిని వారపత్రిక పై వ్యాసం--కౌముది జూలై వెబ్ సంచికలో

http://www.koumudi.net/Monthly/2014/july/index.html July issue కౌముది జూలై వెబ్ సంచికలో వాహిని వారపత్రిక పై వ్యాసం చదివి అభిప్రాయాలు రాయండి